సైదాపూర్: మండలంలోని పెరుకపల్లి గ్రామానికి చెందిన అర్కల అనిల్(27) గురువారం నుంచి కనిపించడంలేదని బంధువులు ఫిర్యాదు చేసినట్లు సైదాపూర్ ఎస్సై స్వాతి ఆదివారం తెలిపారు. అనిల్‌కు గొల్లగూడెంకు చెందిన యువతితో గతేడాది వివాహం జరిగింది. మనస్పర్థలతో రెండు నెలల క్రితం విడాకులు పొందారు. గురువారం ఇంటి నుంచి సైదాపూర్‌కు వచ్చి కూరగాయల మార్కెట్‌లో బైక్ పెట్టాడు. తన తమ్ముడు రాకేష్‌కు సెల్ ఫోన్ బండి టూల్ బాక్స్‌లో, తాళం ట్యాంక్ కవర్‌లో పెట్టానని సందేశం పెట్టాడు. తర్వాత ఫోన్ కాంటాక్టులు డిలీట్ చేశాడు. శుక్రవారం బంధువులు అనిల్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


