‘రాజుల సొమ్ము రాళ్ల పాలేనంటూ’ చాటుతున్నారీ అధికారులు. అధికారుల ప్రయాణాల కోసం ప్రభుత్వం వాహనాలు కేటాయించగా కొత్త వాహనాల మోజులో పడిన అధికారులు పాత కారును ఇలా ముళ్లపొదల్లో పడేశారు. ఇదెక్కడో కాదు సాక్షాత్తు కలెక్టరేట్ సముదాయంలో హెలిప్యాడ్ నిర్మించే ప్రాంతంలో నిర్లక్ష్యంగా వదిలేశారు. సదరు సఫారీ వాహనాన్ని వేలం వేసినా డబ్బులు వచ్చేవి లేదా చిన్నపాటి మరమ్మతు చేసినా వినియోగించే పరిస్థితి. కానీ, కనిపించకుండా ఓ మూలన పడేశారు. దీంతో కారు టైర్లు, ఇతర పరికరాలు చోరీకి గురవుతున్నాయి. లక్షలు వెచ్చించి ప్రభుత్వం వాహనం సమకూర్చితే లక్షణంగా వదిలేయడం విడ్డూరం.
– కరీంనగర్ అర్బన్


