డబుల్‌ బెడ్రూంలు ఇస్తారా.. ఆక్రమించుకోమంటారా..? | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూంలు ఇస్తారా.. ఆక్రమించుకోమంటారా..?

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

కరీంనగర్‌టౌన్‌: గత ప్రభుత్వ హయాంలో నిర్మించి న డబుల్‌ బెడ్రూం ఇళ్లను పేదలకు ఇస్తారా.. లేక సీ పీఐ ఆధ్వర్యంలో ఆక్రమించుకోమంటారా.. అని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, నగరంలో ఎంతోమంది నిరుపేదలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ కిరా యి కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పే ర్కొన్నారు. చింతకుంట ప్రాంతంలో సుమారు 600 ఇళ్లు నిర్మించి పదేళ్లు కావస్తున్నా అర్హులకు కే టాయించకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వాటిని పంపిణీ చేయలేదని, తక్షణమే అర్హులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, న్యాలపట్ల రా జు, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, బుచ్చన్నయాదవ్‌, అంజలి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement