‘టు లెట్‌’ బోర్డులు ! | - | Sakshi
Sakshi News home page

‘టు లెట్‌’ బోర్డులు !

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

పెరిగిన ఆన్‌లైన్‌ కొనుగోళ్లు

ఇటీవల ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు చేరడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. ఐదారేళ్ల క్రితం ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే రెడీమేడ్‌ డ్రెస్సులు, మొబైల్‌ఫోన్లు, ఫుడ్‌ ఆర్డర్ల వరకే ఉండేది. కానీ నేడు అన్ని నిత్యావసరాలకు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో డిస్కౌంట్లు, వోచర్స్‌ పేరిట ఆకర్షిస్తున్నారు. దీంతో ఇంట్లో ఉపయోగపడే గుండుపిన్ను నుంచి పప్పులు, ఉప్పులు, నూనెల వరకు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెడుతున్నారు.

అద్దెల భారం

ఇటీవల మండల కేంద్రాల్లోనూ దుకాణాల అద్దెల భారం పెరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక షట్టర్‌ అద్దె నెలకు రూ.6వేల నుంచి రూ.10వేలు, పాతబస్టాండ్‌లో అద్దెలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. రాచర్లగొల్లపల్లిలో రూ.10 వేల వరకు ఉన్నాయి. ముస్తాబాద్‌లో రూ.8వేల నుంచి రూ.10వేలు, గంభీరావుపేటలో రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ఉంటున్నాయి. జిల్లా కేంద్రం సిరిసిల్లలో అయితే మరీ ఎక్కువగా అద్దెలు ఉన్నాయి. మెయిన్‌ రోడ్డును ఆనుకొని ఉన్న చిన్నపాటి షటర్‌కు కూడా రూ.15 వేలు ఆపైనే అద్దెలు ఉన్నాయి.

ఖాళీగా షట్టర్లు

వ్యాపారులు అద్దెలు చెల్లించలేక పలు షట్టర్లు ఖాళీగా ఉంటున్నాయి. రాచర్లగొల్లపల్లిలో 15 వరకు షట్టర్లు ఖాళీగా ఉండగా, ఎల్లారెడ్డిపేటలో 10 ఖాళీగా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అయితే వందల కొద్దీ షట్టర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈనెలలో కనిపించిన దుకాణం వచ్చే నెల వరకు ఉండడం లేదు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ నుంచి కొత్తచెరువు వరకు 50 వరకు షట్లర్లకు ‘టు లెట్‌’ బోర్డులు కనిపిస్తున్నాయి. వేములవాడలోనూ రోడ్డు విస్తరణ పనులతో భక్తులు నిలుస్తుండకపోవడంతో ప్రధాన రహదారి వెంట చాలా దుకాణాలు మూతబడ్డాయి.

ఎల్లారెడ్డిపేటలో నెల రోజులుగా

మూతబడ్డ బిర్యానీ సెంటర్‌

గంభీరావుపేటలో

ఆరు నెలలుగా మూతపడ్డ షట్టర్‌

మడిగెలు మాయం

అంతటా ‘టు లెట్‌’ బోర్డులు !

దందా లేక వ్యాపారుల పరేషాన్‌

అద్దె కూడా చెల్లించలేని వైనం

ఆన్‌లైన్‌ షాపింగ్‌తో స్థానిక వ్యాపారులకు ముప్పు

ఇప్పటికే పలు మార్కెట్లు మాయం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆన్‌లైన్‌ షాపింగ్‌.. గల్లీకో దుకాణం వెలుస్తుండడంతో సూపర్‌ మార్కెట్లు.. పెద్ద దుకాణాలు మాయమవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం రోజుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వ్యాపారం జరిగిన సూపర్‌మార్కెట్‌లలో నేడు రూ.10వేల నుంచి రూ.20వేల లోపే విక్రయాలు జరుగుతున్నాయి. ఇంత భారీ మార్పుతో ఇప్పటికే జిల్లాలో ముప్‌పై వరకు సూపర్‌ మార్కెట్లు, ఇరువై వరకు ఫుడ్‌ బిజినెస్‌ వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. అయితే కొత్తగా కూడా మరిన్ని మార్టులు వెలిశాయి. కానీ ఆ మార్టుల్లోనూ గిరాకీ అంతంతే ఉంది. మండల కేంద్రాల్లో అయితే పలువురు వ్యాపారులు అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దుకాణాలు మూసివేస్తున్నారు. జిల్లాలో ప్రధాన రహదారి వెంట షట్టర్లకు ‘టు లెట్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఇబ్బందులు పడుతున్నం

నేను ముప్‌పై ఏళ్లుగా పూలు, పండ్ల వ్యాపారం చేస్తున్న. మొన్నటి వరకు గిరాకీ బాగా ఉండేది. కానీ కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా నడవడం లేదు. దీంతో పండ్ల విక్రయాలు బంద్‌చేసిన. ఇప్పుడు పూలు మాత్రమే అమ్ముతున్న. అది కూడా అంతంతే గిరాకీ ఉంది. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది.

– అక్బర్‌, పూలు, పండ్ల వ్యాపారీ, గొల్లపల్లి

రెంట్‌ ఎక్కువై మూసివేసినం

మాకు గతంలో ముస్తాబాద్‌లో మెడికల్‌ షాపు ఉండేది. మొదట్లో బాగానే నడిచేది. కానీ తర్వాత సరిగ్గా నడవ లేదు. అద్దె కూడా ఎక్కువగా ఉండడంతో చెల్లించలేక దుకాణం తీసివేసినం. నేను ఇప్పుడు వేరే చోట పనిచేస్తున్న. – దేవేందర్‌, ముస్తాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement