వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం

Jun 20 2026 11:07 AM | Updated on Jun 20 2026 11:07 AM

వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం

కరీంనగర్‌కల్చరల్‌: నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో శుక్రవారం 16వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి పర్యవేక్షణలో జరిగిన వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు, అనంతనాగేంద్ర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వస్తిపుణ్యాహవాచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన, సర్వతోభద్ర మండల పూజలను భక్తిశ్రద్ధలతో జరిపారు. లక్ష్మీగణపతి, రుద్ర సహిత చండీ హోమాలను నిర్వహించారు. విద్యారణ్య భారతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement