హలో.. సర్‌ | - | Sakshi
Sakshi News home page

హలో.. సర్‌

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా

పక్కాగా ఓటరు జాబితా

సిబ్బంది ఇలా

నేటి నుంచి బీఎల్‌వోల ఇంటింటి సందర్శన

తాళమేసి ఉంటే మూడుసార్లు వెళ్లాల్సిందే

తేలనున్న అర్హులైన ఓటర్ల లెక్క

ఓటర్లకు కాల్‌ బుకింగ్‌ సౌకర్యం

పురుషులు

కరీంనగర్‌ అర్బన్‌: బోగస్‌ ఓట్ల తొలగింపు, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు లక్ష్యంగా సర్‌ అడుగులేస్తోంది. ఇప్పటికే మ్యాపింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తవగా ఇక బీఎల్‌వోలు ఇంటింటి సందర్శన చేపట్టనున్నారు. గురువారం నుంచి సదరు ప్రక్రియ ప్రారంభమై జూలై 24వరకు కొనసాగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో రాజకీయ పార్టీలూ భాగస్వామ్యమయ్యాయి. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే బీఎల్వోలకు శిక్షణనిచ్చి సంబంధిత సామగ్రిని అందజేశారు. తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. మృతిచెందిన వారి పేర్లతో పాటు రెండు, మూడు ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించడానికి కేంద్రం ’సర్‌’ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. బీఎల్వోలు ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రస్తుత ఓటర్ల వివరాలను 2002 జాబితాతో మ్యాపింగ్‌ చేపట్టారు. 89శాతం పూర్తిచేయగా, కొంతమందికి అవగాహన కొరవడటం, 2002లో ఓటు లేకపోవడం, జాబితాలో తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ వివరాలు గుర్తించకపోవడంతో మ్యాపింగ్‌ జరగలేదు.

సర్వేలో ఏం చేస్తారంటే

బీఎల్‌వోలకు అవసరమైన ఫారాలతో పాటు 17వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు. వారు ఇంటింటి సందర్శనలో ప్రతి ఓటరుకు రెండు ఫారాలు అందిస్తారు. వాటిని పూర్తి చేసి బీఎల్వోలకు అందించాలి. ఎన్యూమరేషన్‌ పత్రాల్లో కొత్త జాబితా ప్రకారం ఓటర్ల పేరు, క్రమసంఖ్య, పార్ట్‌ సంఖ్య, పాత ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ ఉంటాయి. దానిపై ఓటరు జాబితాలోని వివరాలు రాయాలి. కొత్త ఫొటో అతికించి, ఫోన్‌ నంబరు, ఎపిక్‌ నంబరును పూరించి, సంతకం చేసి ఒకటి బీఎల్వోకు అందించాలి. మరోటి తమ వద్ద ఉంచుకోవాలి. పాత జాబితాలో వివరాలు లేకున్నా, సరిపోలకున్నా, తప్పులున్నా.. ఎన్యుమరేట్‌ పత్రంతో జతపర్చాలి. బీఎల్‌వో ఓటరు ఇంటికి వెళ్లినపుడు తాళం వేసి ఉంటే నెల రోజుల్లో మూడుసార్లు విధిగా వెళ్లాల్సి ఉంటుంది. కాగా ప్రతి పది మంది బీఎల్వోల పనితీరు పర్యవేక్షణకు ఓ సూపర్‌వైజర్‌ను నియమించగా వారిపై ఆయా తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1,200 నుంచి 1,500 వరకు ఓటర్లుండగా సర్‌ పూర్తయ్యాక కేంద్రాలను హేతుబద్ధీకరిస్తారు.

2002 జాబితాతో పరిశీలన

సర్వేలో ప్రధానంగా ఓటరు పేరు 2002 జాబితాలో ఉందో లేదో పరిశీలిస్తారు. పేరు లేకున్నా, ఉండి ప్రస్తుత జాబితాలో లేకుంటే కారణం తెలుసుకుంటారు. అప్పటివరకు జన్మించని వారిని గుర్తించి ప్రస్తుత జాబితాలో చేరుస్తారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు తల్లిదండ్రుల వివరాల ఆధారంగా మ్యాపింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు పొందినవారూ తల్లిదండ్రుల వివరాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్‌వోలు అందించిన ఫారాలు తీసుకోకున్నా, వివరాలు తెలుపకున్నా ఓటరుగా అనర్హులవుతారు. వలస వెళ్లినవారు ఈ నెల రోజుల్లో విధిగా స్వగ్రామాలకు వచ్చి వివరాలు అందించాల్సి ఉంటుంది.

ఓటర్లకు కాల్‌ బుకింగ్‌ సౌకర్యం

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుండగా కాల్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించింది. బీఎల్‌వోలు ఓటరును సంప్రదించకుంటే.. నేరుగా వారినే ఇంటికి పిలిపించే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. కాల్‌ బుకింగ్‌ సౌకర్యం వినియోగించుకునేందుకు ఓటర్లు ప్లేస్టోర్‌ నుంచి ’ఈసీఐఎన్‌ఇటి’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కాల్‌ బుక్‌ చేసుకున్న 48 గంటల్లోపు బీఎల్‌వోలు సదరు ఓటరును సంప్రదిస్తారు. రోజుకు ఎన్ని కాల్స్‌ బుక్‌ అయ్యాయి..? ఏ సేవలపై ఓటర్లు వివరాలు అడిగారు..? చూపిన పరిష్కారం ఏమిటీ..? తదితర వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా, డివిజనల్‌ స్థాయి ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తారు.

సీ్త్రలు

కరీంనగర్‌ 45

హుజూరాబాద్‌ 7

మానకొండూరు 1

చొప్పదండి 8

మొత్తం 61

థర్డ్‌జెండర్‌

మొత్తం

ఓటరు జాబితాను పక్కాగా రూపొందించే ప్రక్రియలో భాగమే సర్‌. బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి పత్రాలు జారీ చేయాల్సిందే. విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. పకడ్బందీ వివరాల క్రమంలో అక్టోబర్‌ 1న ఓటరు తుది జాబితా ప్రకటిస్తాం.

– చిత్రామిశ్రా, కలెక్టర్‌

ఏఈఆర్‌లు 16 సూపర్‌వైజర్లు 133 బీఎల్వోలు 1,334

కరీంనగర్‌ 1,83,480

హుజూరాబాద్‌ 1,22,678

మానకొండూరు 1,10,301

చొప్పదండి 1,13,878

మొత్తం 5,30,337

కరీంనగర్‌ 1,84,641

హుజూరాబాద్‌1,29,666

మానకొండూరు 1,16,083

చొప్పదండి 1,21,963

మొత్తం 5,52,353

కరీంనగర్‌ 3,68,166

హుజూరాబాద్‌ 2,52,351

మానకొండూరు 2,26,385

చొప్పదండి 2,35,849

మొత్తం 10,82,751

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement