మెరిసిన ఒద్యారం బడి | - | Sakshi
Sakshi News home page

మెరిసిన ఒద్యారం బడి

Jun 25 2026 1:24 AM | Updated on Jun 25 2026 1:24 AM

గంగాధర(చొప్పదండి): కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికై ంది. పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత, పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయం రేటింగ్‌(ఎస్‌హెచ్‌వీఆర్‌)ను ఆరు ప్రధాన కొలమానాలకు సంబంధించిన 60 సూచికల ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్టార్లు కేటాయించారు.విద్యార్థులు 300 రకాల చెట్లను నాటి సంరక్షిస్తున్నారు. పాఠశాల ఆవరణలో సేంద్రియ విధానంలో కూరగాయల సాగుచేస్తున్నారు. ప్లాస్టిక్‌ నిషేధంతోపాటు, మెరుగైన మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, వంటగది, డైనింగ్‌హాల్‌, బాలికలకు రెస్ట్‌రూం, బోధనకు డిజిటల్‌బోర్డు, కంప్యూటర్‌ ల్యాబ్‌ సౌకర్యాలు కల్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement