భారతీయ సంస్కృతిలో భాగంగా ఇమిడిపోయిన యోగా ప్రక్రియ ప్రపంచాన్ని
ఆకర్షించింది. రుషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, పతంజలి వంటి సాధువులు మనకు అందించిన వరం. యోగా, యోగాసనాల ప్రక్రియకు గురువు అవసరం. యోగా సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. శరీర కదలిక యోగా అయితే.. ధ్యానం మనసుకు సరైన వ్యాయామమవుతుంది. ధ్యానం ద్వారా నిశ్చలత్వం ఏర్పడి ఏకాగ్రత పెరుగుతుంది. ఇంద్రియాలను వశపరుచుకొని చిత్తాన్ని ఈశ్వరుడి మీద పెట్టడమే యోగా. యోగా అంటే సాధన అని అర్థం.
●
విద్యానగర్(కరీంనగర్): యోగాలో ఎన్నో ఆసనాలున్నాయి. మరెన్నో సాధనలున్నాయి. వీటన్నింటిని చేసేటప్పుడు పాటించే ఏకై క సూత్రం శ్వాస క్రియలు సరిగ్గా చూడడం. దీనివల్ల శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరమవుతాయి. దీంతోపాటు శరీ రంలో హార్మోన్స్ విడుదలై శరీరంతోపాటు మనసు కూడా ప్రశాంతంగా మారి మానసిక సమస్యలతోపాటు కంటి, ఆరోగ్య సమస్యలు తగ్గి కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి యోగా దివ్య ఔషధంగా పని చేస్తుంది.
శారీరక, మానసిక సమస్యలు దూరం
మన శరీరరంలో అనేక సమస్యలకు ఒత్తిడే ప్రధాన కారణం. యోగాతో ఒత్తిడి చాలావరకు దూరమౌతుంది. నిద్రలేమి, మానసిక, గుండె, బీపీ సమస్యలు, నడుము నొప్పి, స్పాండిలైటిస్, మెడనొప్పులు వంటివి యోగాతో దూరమవుతాయి.
21న..
ప్రతీ సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజున ఉత్తరార్థ గోళంలో అ త్యధిక పగటి సమయం ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉండడంతో ఈ రోజున యోగా దినోత్సవంగా జరుపుకోవడం 2015 జూన్ 21 నుంచి ప్రారంభమైంది.
రేపు అంతర్జాతీయ
యోగా దినోత్సవం


