స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపిక ● నెహ్రూనగర్‌ మూతబడి నుంచి ఉత్తమంగా.. ● ఒద్యారం స్కూల్‌ హరితమయం ● బీర్‌పూర్‌లో ఉత్తమ బోధన ● స్వచ్ఛ పురస్కారాలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపిక ● నెహ్రూనగర్‌ మూతబడి నుంచి ఉత్తమంగా.. ● ఒద్యారం స్కూల్‌ హరితమయం ● బీర్‌పూర్‌లో ఉత్తమ బోధన ● స్వచ్ఛ పురస్కారాలకు ఎంపిక

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపిక ● నెహ్రూనగర్‌ మూతబడి నుంచి ఉత్తమంగా.. ● ఒద్యారం స్కూల్‌ హరితమయం ● బీర్‌పూర్‌లో ఉత్తమ బోధన ● స్వచ్ఛ పురస్కారాలకు ఎంపిక

బీర్‌పూర్‌.. మెరుగైన బోధన

జగిత్యాలరూరల్‌: మెరుగైన విద్యాబోధనతోపాటు వసతులు, విద్యార్థుల క్రమశిక్షణలో ఉత్తమంగా జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హరిత విద్యాలయం పురస్కారానికి ఎంపికై ంది. పాఠశాలలో 350 మంది విద్యార్థులు చదువుతుండగా, గత మూడేళ్లుగా పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధిస్తున్నారు. హరిత విద్యాలయంగా ఎంపికవడంతో పాఠశాలలో మెరుగైన వసతుల కల్పించే అవకాశం దక్కింది. ఈ పథకం కింద ఎక్స్‌పోజర్‌ విజిట్‌ ఫ్రీ స్టడీటూర్‌తోపాటు సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్‌లో ఉత్తమ మార్కులు సాధించేందుకు బోధన వసతులు కల్పించనున్నారు.

ప్రత్యేక బోధనతో ఉత్తమ ఫలితాలు

బీర్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మెరుగైన విద్యాబోధన దక్కుతుంది. పదో తరగతిలో 573 మార్కులు సాధించాను. ప్రస్తుతం ఇంటర్‌లో ఎంపీసీలో చేరాను.

– కలకోట నిహారిక, విద్యార్థి, ఎంపీసీ

మెరుగైన బోధనతోనే..

బీర్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతోపాటు మౌలిక వసతులు, మెరుగైన విద్యాబోధన అందుతుంది. రానున్న రోజుల్లో విద్యార్థులకు ప్రత్యేక నిధుల ద్వారా మెరుగైన వసతులు కల్పిస్తాం.

– సంజనభట్ల నర్సింహమూర్తి, హెచ్‌ఎం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement