రిజిస్ట్రేషన్‌శాఖలో అధికారుల బదిలీలు | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌శాఖలో అధికారుల బదిలీలు

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

రిజిస్ట్రేషన్‌శాఖలో అధికారుల బదిలీలు

కరీంనగర్‌క్రైం: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌– స్టాంపులశాఖలో పరిపాలనా కారణాలతో చేపట్టిన బదిలీల్లో భాగంగా కరీంనగర్‌లో జిల్లా రిజిస్ట్రార్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా రిజిస్ట్రార్‌ (మార్కెట్‌ వ్యాల్యూ అండ్‌ ఆడిట్‌ఎంవీ)గా పనిచేస్తున్న జి.స్థితప్రజ్ఞను అదే హోదాలో కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించింది. ప్రస్తుతం సంగారెడ్డి– మెదక్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా ఉన్నవల్లి సుబ్బలక్ష్మికి వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ (ఎంవీ అండ్‌ ఏ) బాధ్యతలను అదనపునంగా అప్పగించింది. కరీంనగర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ)గా విధులు నిర్వహిస్తున్న బి.ప్రవీణ్‌ కుమార్‌ను మేడ్చల్‌–మల్కాజిగిరి డీఐజీగా బదిలీ చేస్తూ, వరంగల్‌ డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. రంగారెడ్డి డీఐజీగా ఉన్న ఎస్‌.డి.ట్వింకిల్‌ జాన్‌ను నిజామాబాద్‌ డీఐజీగా బదిలీ చేయడంతో పాటు కరీంనగర్‌ డీఐజీ బాధ్యతలను అదనపు బాధ్యతలుగా (ఎఫ్‌ఏసీ) నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత అధికారులను వెంటనే రిలీవ్‌ చేసి, కొత్త బాధ్యతల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement