మంథని: రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, ప్రజావంచన పాలన అని, 2014కు ముందు రైతులు ఎలా దగా పడ్డారో ఇప్పుడు మళ్లీ అదేపరిస్థితి నెలకొందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘవీర్‌సింగ్, నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి వీర్ల వెంకటేశ్వర్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఆనాడు కేసీఆర్ రైతుబంధు పేరిటి ఎకరాకు రూ.పది వేలు ఇస్తే.. తాము రూ.పదిహేను వేలు ఇస్తామంటూ రైతులను మోసం చేశారన్నారు. ప్రస్తుతం రైతుబంధును బంద్ చేసి శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు
ప్రభుత్వం చేపట్టిన సర్‌పై అప్రమత్తంగా ఉండాలని, దీనిపై పూర్తిగా ప్రజల్లో అవగాహన లేదన్నారు. కేవలం మార్పులు చేర్పులు మాత్రమే అనుకుంటున్నారని, కానీ జూన్ 25 నుంచి జూలై 24వరకు ఎన్యూమెటర్ ఇంటింటికి వస్తారని, ఈ క్రమంలో గతంలో ఓటు కలిగి ఉన్నా ఫాం నిర్దేసిత సమయంలో సమర్పిస్తేనే ఓటు నమోదు ఆరంభం వుతుందన్నారు. ఫాం నింపివ్వకుంటే ఓటును తొలగించే అవకాశం ఉంటుందని, దీనిపై కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రెండున్నర సంవత్సరాల కాలాన్ని దృష్ట్టిలో ఉంచుకుని పార్టీ పరంగా గట్టిగా కృషి చేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం చేశారు. మంత్రి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులతో భయానక వాతావరణం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్‌గా ఉన్న శ్రీధర్‌బాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాదరణ పొందిన పుట్ట మధుపై రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోచిస్తూ బద్నాం చేశారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుద్దిళ్ల శ్రీధర్ పైసలతో గెలుస్తాడని, కానీ ఎప్పుడూ డబ్బులే గెలువవని తెలిపారు. అనేకమంది మహామహులు డబ్బులుండి కూడా ఓటమిని చవిచూశారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గుర్తు చేశారు.


