మొత్తం అర్జీలు: 192,
అత్యధికంగా హౌజింగ్: 71
కరీంనగర్ కార్పొరేషన్: 65
ఎన్‌పీడీసీఎల్: 06, వారధి సొసైటీ: 04
కరీంనగర్ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి ప్రజలు బారులు తీరారు. తమ పరిస్థితిని కలెక్టర్ చిత్రా మిశ్రాకు వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే, సార్లు లేకుండా ఎలా చదువుకోవాలని విద్యార్థులు ప్రజావాణి బాట పట్టారు. ఒక్కో సారు రిటైరవుతుండగా టీచర్ పోస్టులు ఖాళీగా మిగులుతున్నాయని, భర్తీ చేయడం లేదని దివ్యాంగులు వాపోయారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిళ, జలకుమారి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లకు సంబంధించి మొత్తం 192 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్బంగా పలువురు తమ సమస్యలను ‘సాక్షి’కి వివరించారు. వారి మాటల్లోనే..


