యోగాతో ఆరోగ్యపరంగా చాలా లాభా లున్నాయి. ప్రతిరోజు ఉదయం కేఈ ఎస్ గార్డెన్‌లో నిర్వహించే యోగా తరగతులకు తప్పనిసరిగా హాజరౌవుతా. వివిధ ఆసనాలు మేయడం, ధ్యానం చేయడంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
– తాటి ప్రభావతి, కార్పొరేటర్
ఆరోగ్యం.. ప్రశాంతత
ఆరోగ్యవంత జీవనానికి యోగా తోడ్పడుతుంది. నిత్యం వంట పని, ఇంటి పనులు, పిల్లలతో సతమతమవడంతో ఎన్నో చికాకులు. రోజు ఉదయం ప్రశాంత వాతావరణంలో యోగా, ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
– తొడుపునూరి వాణి, వాసవీనగర్, కరీంనగర్
ఒత్తిడి మాయం
నిత్యం ఎన్నో సమస్యలు, బీజీ లైఫ్‌తో జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుంది. యోగా, ధ్యానంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరంగా శారీరానికి తగిన వ్యాయయం జరిగి జబ్బులకు చాలావరకు దూరంగా ఉండొచ్చు. – ఆదిమూలం రజిత,
రాఘువేంద్రనగర్, కరీంనగర్


