బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

సర్వేతోనే భూధార్‌

మోకా తేల్చితేనే రైతుకు ప్రయోజనం

ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలు ఎంపిక

ఆయా ప్రాంతాల్లో నేటి నుంచి వ్యవసాయ భూముల రీసర్వే

వీలైనంత త్వరగా కార్యరంగంలోకి సర్వేయర్లు

ఇప్పటికే పలు చోట్ల గ్రామసభల నిర్వహణ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

భూ చిక్కు ముళ్లు విప్పేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేస్తోంది. ప్రతీ గ్రామంలో హద్దుల వివాదాలు గరిష్టసంఖ్యలో ఉండగా ప్రభుత్వం సమగ్ర భూ రీ సర్వేకు చర్యలు చేపడుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి డిజిటల్‌ సర్వే ప్రారంభం కానుంది. నిజాం కాలంలో చేపట్టిన భూసర్వే, నక్షా(మ్యాప్‌), నాటి రికార్డులే ఆధారంగా రెవెన్యూ కార్యకలాపాలు సాగుతున్నాయి. భూ కమతాలు పెరగటం, విస్తీర్ణాలు విభజనకు నోచుకోవటంతో హద్దులు మారిపోతున్నాయి. గ్రామాల్లో భూముల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి పరిష్కారానికి సర్వే చేయక తప్పదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించింది.

రోవర్‌ పరికరాలపై శిక్షణ

పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలిసారి రెవెన్యూ రికార్డు అందుబాటులో లేని కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లిలో రీసర్వే జరిపి దస్త్రాలు తయారు చేస్తున్నారు. తాజాగా జిల్లాకు ఐదు నుంచి ఏడు మండలాలు ఎంపిక చేయగా, మండలానికో గ్రామంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా సర్వేయర్లకు కరీంనగర్‌ కలెక్టరేట్‌లో రోవర్‌ పరికరాలపై శిక్షణ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేసి నక్షాను రూపొందించనున్నారు. ఒక్కోగ్రామంలో 1500 నుంచి 2500 ఎకరాలకు పైగా సాగుభూములున్నాయి. ఎంజాయ్మెంట్‌ సర్వే నిర్వహించి కొత్తగా రికార్డులు తయారు చేయనుండగా సర్వే నంబర్‌వారీగా నక్షా రూపొందిస్తుంది. వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది. అనంతరం భూధార్‌ నంబర్లను రైతులకు అందిస్తుంది.

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు బాధ్యతలు

ఉమ్మడి జిల్లాలో వందలాది మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలో పాల్గొనగా వీరితోనే ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేపట్టనున్నారు. అధునాతన రోవర్‌ పరికరాలను ఉపయోగించి పక్షం రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నారు. భూ విస్తీర్ణాన్ని నెల రోజుల్లో సర్వే చేసేందుకు రూ.40వేలు, 2వేల ఎకరాలు మించితే రూ.60వేలను సంబంధిత లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు సర్కారు చెల్లించనుంది.

ముఖ్యమంత్రి సదస్సు వీక్షణ

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సును కొత్తపల్లి రైతు వేదికలో కలెక్టర్‌ చిత్రామిశ్రా, కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సన్న, డీఏవో భాగ్యలక్ష్మి, కా ర్పొరేటర్లు వాసాల రమేశ్‌, వేముల కవిత, రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సీఎం ప్రసంగాన్ని విన్నారు. వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. –కొత్తపల్లి

ఎడ్లబండి మూలన

యాంత్రీకరణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకముందు వ్యవసాయ ఉత్పత్తులు తరలించడంలో రైతులు ఎడ్లబండ్లను విరివిగా వినియోగించేవారు. ఇంట్లో ఏ శుభకార్య మైనా, ఏ ఆపద వచ్చినా ఎడ్లబండ్లే దిక్కుగా మారేవి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మార్కెట్లోకి రావడంతో ఎడ్లబండ్ల వినియోగం తగ్గిపోయి మూలనపడుతున్నాయి. వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఓ రైతు ఇంటి ఎదుట నిరుపయోగంగా ఎడ్లబండి కనిపించింది. –వీణవంక

భూ భారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూధార్‌ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతి రైతు రికార్డులు పరిశీలించి.. సరిగ్గా ఉన్నాయని భావిస్తే టెంపరరీ భూధార్‌ నంబరు ఇవ్వనుండగా ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్‌ గీయనున్నారు. సర్వేయర్‌ అప్రూవ్‌ చేస్తే తహసీల్దార్‌ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దులు గల భూమిగా గుర్తింపు పొందుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్‌ భూధార్‌ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్‌–2025 స్పష్టం చేస్తుంది. ఈ రెవెన్యూ రికార్డుల వెరిఫికేషన్‌ జీపీవోలు, రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్లతోనే పూర్తవుతుంది.

మోకాపై ఉన్న భూమినే కొలవనున్నారు. ఒక రైతుకు 2ఎకరాల భూమి ఉంటే ఎంత భూమి ఉందనేది కొలుస్తారే తప్పా రికార్డులో ఉన్న 2ఎకరాల భూమిని చూపించరు. రైతు అనుభవిస్తున్న భూమిని మాత్రమే కొలవనుండగా దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రస్తుతానికి ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేస్తామని, తదుపరి ప్రభుత్వ ఆదేశాల క్రమంలో హద్దులు నిర్ణయిస్తామని కరీంనగర్‌ జిల్లా సర్వే లాండ్‌ ఏడీ కిషన్‌రావు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement