నాణ్యమైన విత్తనాలు కొనండి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనాలు కొనండి

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

సర్కార్‌ బడికి పంపిస్తే ఇంటిపన్ను మాఫీ ఏఐ, డిజిటల్‌ లర్నింగ్‌పై శిక్షణ ఏబీవీపీ బంద్‌ విజయవంతం పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి(కరీంనగర్‌): రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి అధిక దిగుబడులు పొందాలని డీఏవో జె.భాగ్యలక్ష్మి సూచించారు. కొత్తపల్లి రైతు వేదికలో మంగళవారం కార్పొరేటర్లు వేముల కవిత, వాసాల రమేశ్‌తో కలిసి విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు మేళా కొనసాగనుందని తెలిపారు. డీడీఏ కె.దామోదర్‌, ఏడీఏ ఓ.ఉష, ఏవోలు అనూష, బి.తిరుమలేశ్వర్‌, ఎంఏవో సంతోష్‌కుమార్‌, ఇఫ్‌కో సంస్థ జిల్లా మేనేజర్‌ బి.బాలాజీ పాల్గొన్నారు.

శంకరపట్నం: గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పిల్లలను పంపిస్తే ఇంటిపన్ను మాఫీ చేస్తామని సర్పంచ్‌ లావణ్య ప్రకటించారు. చింతలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదుశాతం పెంచడమే లక్ష్యంగా తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఇంటిపన్ను మాఫీ చేస్తామని మంగళవారం పాలకవర్గం తీర్మాణించింది. తమ పిల్లలను సర్కారుబడికి పంపించే తల్లిదండ్రుల ఇంటిపన్నును సొంత డబ్బుతో ఐదేళ్లు చెల్లిస్తానని సర్పంచ్‌ హామీ పత్రాన్ని హెచ్‌ఎంకు అందజేశారు.

కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అన్న అక్క మెంటర్‌షిప్‌’ టీచింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం నగరంలోని ఎస్సారార్‌ ప్రభు త్వ అటనామస్‌ కళాశాలలో నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్‌ రామకృష్ణ ప్రారంభించారు. మొదటి రోజు బీకాం విద్యార్థులకు ‘ఏఐ, డిజిటల్‌ లర్నింగ్‌’ పై శిక్షణ ఇచ్చా రు. శిక్షకులుగా కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ విభాగ అధ్యాపకుడు జడల రమే శ్‌, ప్రేమ్‌చంద్‌, చౌదరి, వేములవాడ శ్రీనివాస్‌, మహేందర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌, కోడింగ్‌, పైతాన్‌ లాంగ్వేజ్‌, డిజిటల్‌ లర్నింగ్‌, కంప్యూటేషనల్‌ థింకింగ్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, టెక్నాలజీని సురక్షితంగా వినియోగించడంపై శిక్షణ ఇచ్చారు.

కరీంనగర్‌టౌన్‌: ఏబీవీపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లా కన్వీనర్‌ పూసల విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బంద్‌ చేయించారు. ప్రభుత్వం పాఠశాల విద్యపై దృష్టి సారించి, సమస్యల పరిష్కారంలో చొరవచూపాలని సూచించారు. స్టేట్‌ హాస్టల్స్‌ కో–కన్వీనర్‌ బామాండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముసరి మురళి, విగ్నేష్‌, వంశీ, విష్ణు పాల్గొన్నారు.

ముగిసిన నిందితుల కస్టడీ

కరీంనగర్‌క్రైం: పీఎంజే జువెల్లరీ చోరీ కేసులో నిందితుల ఆరు రోజుల కస్టడీ మంగళవారంతో ముగిసింది. ప్రధాన నిందితుడు సుబోధ్‌ సింగ్‌ను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి, మిగిలినవారిని కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. దోపిడీ అనంతరం బంగారాన్ని వివిధ చోట్లకు తరలించిన మరో ఇద్దరు నిందితులను గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే వీరిని కరీంనగర్‌కు తీసుకురానున్నట్లు తెలిసింది.

కొత్తపల్లి: బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ వాటర్‌వర్క్స్‌, ఐబీ ఫీడర్ల పరిధిలోని సర్కస్‌ మైదానం, పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌, ఐబీచౌరస్తా, సీఎస్‌ఐ హాస్పిటల్‌, రెడ్డిగారి వంటిల్లు, టీటీడీ కల్యాణ మంటపం, గాయత్రీ టిఫిన్‌సెంటర్‌ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.బ్యాంక్‌కాలనీ ఫీడర్‌ పరిధిలోని తేజ స్కూల్‌, విద్యాధరి స్కూల్‌, రెడ్డి ఫంక్షన్‌హాల్‌, బూత్‌బంగ్లా, గుండు హనుమాన్‌ ఆలయం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–1 ఏడీఈ పి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement