విద్యుత్‌ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): యాదాద్రి పవర్‌ ప్లాంట్‌(వైటీపీఎస్‌)లోని కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ (సీహెచ్‌పీ), యాష్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ (ఏహెచ్‌పీ)లను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టీజీ జెన్‌కో చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ మంగళవారం భోజన విరామ సమయంలో విద్యుత్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కరీంనగర్‌లోని విద్యుత్‌ భవన్‌ ఆవరణలో నిరసన చేపపట్టారు. టీజీపీపీజేఏసీ, టీజీఎన్‌పీడీసీఎల్‌ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ జెన్కో మేనేజ్‌మెంట్‌ టెండర్లు పిలవడం జరిగిందని, విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం చేస్తే సుమారు 1,900 మంది ఉపాధి అవకాశలు కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు రంగు వెంకటనారాయణ, గాదం రఘు, రాజు, రమేష్‌, మహేందర్‌, సంపత్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, పవన్‌ కుమార్‌, రజనీకాంత్‌, మధు, రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement