కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ ఉజ్వల పార్కు ఫీడర్ పరిధిలో టౌన్ 2, ఏడీఈలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గణేశ్‌నగర్, కమాన్ మెయిన్‌రోడ్, విశాల్‌మార్ట్, ఎస్‌బీఐ బ్యాంక్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని వేంకటేశ్వరఆలయం కమాన్, బీరప్పగుడి కమాన్, కొత్తయాస్వాడ, విద్యానగర్, సాలంపుర ప్రాంతాలు, ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ వాటర్ వర్క్స్, ఐబీ ఫీడర్ పరిధిలో సర్కస్ మైదానం, పద్మనాయక ఫంక్షన్ హాల్, ఐబీ చౌరస్తా, సీఎస్‌ఐ హాస్పిటల్, టీటీడీ కళ్యాణ మంటపం, గాయత్రీ టిఫిన్ సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.


