బీర్‌పూర్‌ పీఏసీఎస్‌లో తొలి ‘స్మార్ట్‌ విలేజ్‌ సెంటర్‌’ | - | Sakshi
Sakshi News home page

బీర్‌పూర్‌ పీఏసీఎస్‌లో తొలి ‘స్మార్ట్‌ విలేజ్‌ సెంటర్‌’

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

దేశంలోనే మొదటి రూటాజ్‌

కేంద్రం ఏర్పాటు

వర్చువల్‌గా ప్రారంభించిన

నాబార్డ్‌ చైర్మన్‌ అజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: బీర్‌పూర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో దేశంలోనే తొలి రూటాజ్‌ స్మార్ట్‌ విలేజ్‌ సెంటర్‌ ఏర్పాటైంది. నాబార్డ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సంస్థ చైర్మన్‌ అజయ్‌కుమార్‌ వర్చువల్‌గా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. సాంకేతిక ఆధారిత గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం, సహకార వ్యవస్థను బలోపేతం చేయడం దిశగా ఈ రూటాజ్‌ విలేజ్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ ప్రధాన శాసీ్త్రయ సలహాదారు గోవర్దన్‌ సింగ్‌ రావత్‌, నాబార్డ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డీజీఎం సాయి శ్రీనివాస్‌, డీడీఎం దిలీప్‌చంద్ర, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్‌, డీఏవో భాస్కర్‌, ఎల్‌డీఎం రాజ్‌కుమార్‌, కేడీసీసీ బ్యాంక్‌ జీఎం శ్రీధర్‌, చైర్మన్‌ రాంచందర్‌రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

రూ.33.50 లక్షల సాయం

రూటాజ్‌ స్మార్ట్‌ విలేజ్‌ సెంటర్‌ కోసం నాబార్డ్‌ వికాస్‌ నిధి కింద రూ.33.50 లక్షలతో మూడేళ్ల కాలపరిమితితో ప్రారంభించింది. ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లోని కార్నెల్‌ సాత్‌గురు ఫౌండేషన్‌ సాంకేతిక సహకారంతో అమలు చేస్తారు. 18 వేల జనాభా కలిగిన 7 గ్రామాలను కవర్‌ చేస్తుంది. గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానం విస్తరించి.. స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఆధునిక, సాంకేతిక పరికరాలను సమకూర్చడం ప్రాజెక్టు లక్ష్యం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement