మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

● రవాణాశాఖ మంత్రి పొన్నం రాష్ట్ర ప్రభుత్వం విఫలం

● రవాణాశాఖ మంత్రి పొన్నం

హుజూరాబాద్‌/చిగురుమామిడి/శంకరపట్నం: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రవా ణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నా రు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్సుల సమయపాలన, పరిశుభ్రత, తాగునీరు, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రొంటాల సుహాసిని, కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్‌ గౌడ్‌, తిరుపతి, శంకర్‌ పాల్గొన్నారు.

ఫోర్‌లైన్‌ బాధితులకు న్యాయం చేయాలి

చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఫోర్‌లైన్‌ నిర్మాణంలో ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఆదివారం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్నవారికి పరిహారం ఇప్పించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సర్పంచ్‌ జంగ శిరీష, హుస్నాబాద్‌ వ్యవసాయమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి, చిగురుమామిడి సింగిల్‌విండో చైర్మన్‌ జంగ వెంకటరమణారెడ్డి, ఉపసర్పంచ్‌ మెడబోయిన రాజు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరాఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి పొన్నం ప్రభా కర్‌ అన్నారు. కేశవపట్నం మీదుగా వెళ్తూ, కాన్వాయ్‌ ఆపి స్థానికులతో మాట్లాడారు. మొలంగూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద రిక్వెస్ట్‌స్టాప్‌ ఏర్పాటు చేసినా బస్సులు ఆగడం లేదని మంత్రికి స్థానికులు వివరించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక రావడం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్యుల ఇష్టారాజ్యం

కరీంనగర్‌: కరీంనగర్‌లో ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్యుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వెల్‌నెస్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య సేవల కోసం వచ్చారు. ఓపీ సమయం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత డాక్టర్‌ గది తలుపు తెరవకుండా రోగులను వేచి ఉండేలా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డాక్టర్‌ను పలు మార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి చూసినా వైద్యులు అందుబాటులోకి రాకపోవడం, రోగుల సమస్యలను పట్టించుకోకపోవడంతో, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం విచారకరమని పేర్కొన్నారు. సెంటర్‌లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు డిమాండ్‌ చేస్తున్నారు.

టీజీ ఏప్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకోసం ఈనెల 19వ తేదీ 28 వరకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులకు కరీంనగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 22వ తేదీ నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ప్రిన్సిపాల్‌ డి.శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కరీంనగర్‌: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 15 రోజులు గడిచినా రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్‌ ఇండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. రైతులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రైతులకు రుణమాఫీ పూర్తి చేయడంలోనూ, కొత్త పంట రుణాలు మంజూరు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement