మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

‘సర్‌’ ఫారం నింపారా?

సైదాపూర్‌/చిగురుమామిడి: ఓటర్‌ సవరణను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. సోమవారం సైదాపూర్‌ మండలం ఎలబోతారంలో ఓటర్‌ సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఫారాలు నింపుతున్నారా ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటర్‌ సవరణ కొత్త కాదని, 2002లోనూ అప్పటి ప్రభుత్వం చేయించిందన్నారు. ఓటర్లు తమ ఓటు తప్పిపోకుండా చూసుకోవాలన్నారు. అనంతరం గొడిశాలలో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం ఒగులాపూర్‌లో రూ.10లక్షలతో నిర్మించిన వీవో సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. చిగురుమామిడిలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించే వీవో భవనానికి శంకుస్థాపన చేశారు. పెద్దమ్మతల్లి విగ్రహాప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. బొమ్మనపల్లిలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. సైదాపూర్‌ మండల పార్టీ అధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ దొంత సుధాకర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త తిరుపతిరెడ్డి, హుస్నాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement