కరీంనగర్ అర్బన్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభానికి ముందే పగుళ్లు బారింది. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా పనులు సా..గుతూనే ఉన్నాయి. అప్పటి కలెక్టర్ కర్ణన్ నుంచి ఇప్పటి కలెక్టర్ చిత్రా మిశ్రా వరకు నిర్మాణం పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించడం పరిపాటిగా సాగుతోంది. ఈ క్రమంలో నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జీ ప్లస్ 2లో నిర్మించగా భవనంపై ఫ్లోరింగ్‌లో చాలా చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. సెకండ్ కోటింగ్ రంగు వేయడం పూర్తవగా పై ప్రాంతంలో అసలు ప్రైమరీ, ఫైనల్ కలర్ వేయకుండానే వదిలేశారు. ఈ నెలలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయగా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 27న సీఎం ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం కాగా ఆ లోపు పనులు పూర్తవడం అనుమానమే. హడావుడి పనుల క్రమంలో నాణ్యతను విస్మరించే అవకాశాలు లేకపోలేదు.
బిల్డింగ్‌పై పగుళ్లు, కలర్ వేయకుండా వదిలిన ప్రాంతం


