కరీంనగర్: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో మంగళవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పార్టీ నేతలను సమష్టిగా పార్టీ అభివృద్ధికి కష్టపడుతున్నారని అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. సమావేశ విరామ సమయంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని బండి సంజయ్ జా తీయ అధ్యక్షుడు నితిన్ నభీన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ వారిని శాలువాలతో సన్మానించి అభినందించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో శ్రమించాలని సూచించారు.


