లెక్కల్లో లెజెండ్స్‌ | - | Sakshi
Sakshi News home page

లెక్కల్లో లెజెండ్స్‌

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

ప్రతీ ఆర్థిక రంగంలో సీఏల పాత్ర కీలకం

ఉత్తర తెలంగాణలో ఐసీఏఐ కరీంనగర్‌ బ్రాంచ్‌ సేవలు విస్తరణ

1,796 మంది సభ్యులు, విద్యార్థులు

నేడు చార్టర్డ్‌ అకౌంటెంట్ల దినోత్సవం

కరీంనగర్‌టౌన్‌: దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తూ, వ్యాపార సంస్థలకు దిశానిర్దేశం చేస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించే వృత్తిగా చార్టర్డ్‌ అకౌంటెన్సీ నిలిచింది. డిజిటల్‌ చెల్లింపులు, ఈ– గవర్నెన్స్‌, ఆన్‌లైన్‌ పన్ను, ఈ–ఇన్వాయిసింగ్‌, డిజిటల్‌ ఆడిటింగ్‌, ఫిన్‌టెక్‌ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల బాధ్యత మరింత పెరి గింది. మనీలాండరింగ్‌ నియంత్రణ, ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో సీఏల సేవలు కీలకంగా మారాయి. 1949 జూలై 1న పార్లమెంట్‌ చట్టం ద్వారా దేశంలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల అత్యున్నత సంస్థగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ఏర్పడింది. ఏటా జూలై 1న చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఉత్తర తెలంగాణలో ఐసీఏఐ కరీంనగర్‌ బ్రాంచ్‌

2012 జనవరి 29న 103మంది సభ్యులతో ప్రారంభమైన ఐసీఏఐ కరీంనగర్‌ బ్రాంచ్‌ ప్రస్తుతం 596 మంది సభ్యులు, 1,200 మందికి పైగా విద్యార్థులతో ఉత్తర తెలంగాణలో ప్రముఖ వృత్తిపరమైన సంస్థగా ఎదిగింది. గతంలో సీఏ పరీక్షల కోసం హైదరాబాద్‌, విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కరీంనగర్‌లోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు కావడంతో వేలాది మందికి ప్రయోజనం చేకూరుతోంది. విద్యా ర్థులకు ప్రత్యేక లైబ్రరీ, మాక్‌ టెస్టులు, స్టడీ సర్కిళ్లు, సెమినార్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2025లో బ్రాంచ్‌కు 4,000 చదరపు గజాల స్థలంలో శాశ్వత భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణకు వేదికగగా మారనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement