కరీంనగర్‌లో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రజలు, యోగాసనాలు వేస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్‌స్పోర్ట్స్/కరీంనగర్‌క్రైం: అంతర్జాతీయ యోగాడేను ఆదివారం వేడుకగా నిర్వహించారు. ఉదయాన్నే ఆయా ప్రాంతాల్లో యోగా గురువుల సమక్షంలో ఆసనాలు వేశారు. పలువురు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి రోజు దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్‌లో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయుష్‌శాఖ వరంగల్ రీజినల్ ప్రాంతీయ అధికారి ప్రమీలాదేవి, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, మేయర్ కొలగాని శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన జడ్జి ఎస్.శివకుమార్, జడ్జిలు సంతోష్ కుమార్, నీరజ, పావని, చిరాగ్ మెహతా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ పాల్గొన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రాంతీయ క్రీడా పాఠశాలలో యోగా డే నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టేడియంలో యోగా వాక్‌ను జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ప్రారంభించారు.


