కరీంనగర్‌క్రైం: యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చదువుల ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా క్రీడలు, శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలో భారీ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గీతాభవన్ చౌరస్తా మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం, అవగాహన గీతాలు ఆకట్టుకున్నాయి. అస్త్ర కన్వెన్షన్ హాలులో జరిగిన అవగా హన సదస్సులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించి.. డ్రగ్స్ దుష్పరి ణామాలపై ప్రత్యేక షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల దుర్వి నియోగం సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిగా మారిందన్నారు. వ్యాసరచన, చిత్రలేఖన పో టీల విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీ నివాస్‌రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి సరస్వతి, డీసీపీవో పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ రఫీక్‌ఖాన్, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


