కరీంనగర్‌కల్చరల్: అద్భుతమైన చరిత్రకు, అభ్యుదయ పోరాటాలకు నిలయమైన కరీంనగర్ నేల నుంచి విశ్వకర్మల వృత్తి పనిముట్లను అక్షరబద్ధం చేస్తూ చారిత్రక కావ్యంగా పెద్ద బాడిసె కవితా సంపుటిని అందించడం అభినందనీయమని గంటా మనోహర్‌రెడ్డి అన్నారు. భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్ ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఫిలిం భవన్‌లో మియాపురం శ్రీనివాస్ రచించిన పెద్ద బాడిసె కవితా సంపుటిని ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూకట్ల తిరుపతి, ఆంగ్ల కవి గందె పరశురాంరావు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అనేక వస్తువులను కవితా రూపంలో చక్కగా వివరించారని తెలిపారు. పెద్దిరాజు సత్యనారాయణ రాజు ఆహ్వానం పలికిన ఈ కార్యక్రమంలో అన్నాడి గజేందర్‌రెడ్డి, కాళిదాసు, కసిరెడ్డి జలంధర్‌రెడ్డి, తడిగొప్పుల కుమారస్వామి, చిమ్మని చంద్రశేఖర్, జి.హన్మయాచారి, కొండ దినేశ్, జి.రాజమల్లయ్య, సందెవేని నరేంద్ర, కట్ట శ్యామ్‌సుందర్, రాపర్తి వెంకటేశ్వర్లు, గూడెపు కుమార్ తదితరులు పాల్గొన్నారు.


