సిరిసిల్లటౌన్: బజారుకెళ్లి ఇంటికి తిరిగొస్తున్న వృద్ధుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పట్టణంలోని వెంకంపేటకు చెందిన ఆడెపు ఆంజనేయులు(68) గురువారం రాత్రి పాతబస్టాండుకు వచ్చి మందుల షాపులోకి వెళ్లి కొనుక్కొని రోడ్డుపైకి వచ్చాడు. సిగ్నల్ పడుతోందని కారును డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు. దీంతో ఎదురుగా వస్తున్న ఆంజనేయులును కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న వృద్ధుడిని స్థానికులు జిల్లాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వాహనంతోపాటు పారిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆంజనేయులు తలకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఇద్దరు కొడకులు ఉన్నారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.


