ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ అర్బన్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌, గతంలో వేములవాడ ఎస్‌హెచ్‌వోగా పనిచేసిన గుండెటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. లంచం తీసుకున్న కేసులో మార్చి 18న రాము, అతడి స్నేహితుడు జక్కని వేణును అరెస్టు చేశారు. వేణు ద్వారా లంచం డబ్బులు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు తన ఆదాయ వనరులకు మించి చట్టవిరుద్ధంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా భవానీనగర్‌లోని అతడి అద్దె నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.20.67 లక్షల నగదు, ఎస్‌బీఐ ఖాతాలో రూ.29.88 లక్షలు, అతడి తండ్రి యూబీఐ ఖాతాలో రూ.16.77 లక్షల బ్యాంకు నిల్వలు, రూ.11.97 లక్షల విలువైన ఇతర వస్తువులు, కరీంనగర్‌లో ఖాళీ స్థలం, సిరిసిల్లలో వాణిజ్య స్థలం సహా మొత్తం పత్రాల విలువ రూ.87.44 లక్షల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. సోదాలు కొనసాగుతున్నాయని, కేసుపై తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు

నగదు, బ్యాంకు డిపాజిట్లు, స్థలాలు వెలుగులోకి..

మార్చిలో లంచం తీసుకున్న కేసులో ఎకై ్సజ్‌ సీఐ, అతడి స్నేహితుడిపై కేసు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement