నీట్‌కు 2,661 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

నీట్‌కు 2,661 మంది హాజరు

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

● 340 మంది గైర్హాజరు ● ప్రశాంతంగా ముగిసిన పరీక్ష ● కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌టౌన్‌: జిల్లాలో ఆదివారం నీట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలి పారు. పరీక్ష నిర్వహణను కలెక్టర్‌, సీపీ గౌస్‌ ఆలం సంయుక్తంగా పర్యవేక్షించారు. కరీంనగర్‌లోని ఎస్‌ ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, కేంద్రీయ విద్యాలయం కేంద్రాలను సందర్శించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

2,661 మంది హాజరు

జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షకేంద్రాల్లో 3,001 మంది అభ్యర్థులకు 2,661 మంది హాజరయ్యారు. 340 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో 744 మందికి 662మంది హాజరుకాగా, 82మంది గైర్హాజరయ్యారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో 720 మందికి 651మంది హాజరయ్యారు. 69మంది గైర్హాజరయ్యారు. అలుగునూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌లో 408 మందికి 359 మంది హాజరయ్యారు. 49 మంది గైర్హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయంలో 361 మందికి 316మంది హాజరయ్యారు. 45 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో 312 మందికి 278 మంది హాజరుకాగా, 34 మంది గైర్హాజరయ్యారు. మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలుర కళాశాలలో 288 మందికి గాను 251మంది హాజరుకాగా, 37 మంది గైర్హాజరయ్యారు. చింతకుంటలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో 168 మందికి 144మంది హాజరుకాగా, 24 మంది గైర్హాజరయ్యారు.

అభ్యర్థికి పోలీస్‌ సాయం

కరీంనగర్‌ క్రైం: నీట్‌ పరీక్ష రాసేందుకు ఓ యువతి కరీంనగర్‌ వచ్చింది. సమయం గడిచిపోతుండడంతో ఆందోళనతో ఉంది. గమనించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కుమార్‌ తన బైక్‌పై యువతిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద చేర్చాడు. కానిస్టేబుల్‌ను సీపీ అభినందించారు.

నగరంలోని మహిళా కళాశాల వద్ద పరీక్షకు హాజరైన విద్యార్థులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement