కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కుక్కల బెడద తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. 54వ డివిజన్ అశోక్‌నగర్‌లో మాంసం విక్రయాలు జరుగుతుండడం, ఆ వ్యర్థాలను అక్కడే పడవేయడంతో కుక్కల బెడద పెరిగింది. కుక్కల బెడదను నివారించాలని కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి బుధవారం కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌కి ఫిర్యాదు చేశారు.
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో వర్షాలు కురిసి, సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ గ్రామ దేవతలకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో మహిళలు బిందెలతో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు, కుంకుమ చల్లి, టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఉప సర్పంచ్ కానవేని జితేందర్, వార్డు సభ్యులు సదగోని ఇందిరా పాల్గొన్నారు.


