breaking news
	
		
	
  india vs australia
- 
      
                   
                                                       శివమ్ దూబే వరల్డ్ రికార్డుకు బ్రేక్..టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వరల్డ్ రికార్డుకు ఎండ్ కార్డ్ పడింది. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టులో భాగమైన ఆటగాడిగా దూబే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దూబే వరుసగా భారత్ జట్టు తరపున 37 టీ20 విజయాలను అందుకున్నాడు.అతడిని అందరూ టీమిండియా లక్కీ ఛార్మ్‌గా పరిగణిస్తారు. దూబే జట్టులో ఉంటే భారత్‌కు తిరుగుండదని అంతా భావిస్తారు. కానీ శుక్రవారం మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంతో అతడి ఆజేయ విన్నింగ్ రికార్డుకు తెరపడింది. 2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో దూబే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దూబే.. భారత తరపున 4 వన్డేలు, 43 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతడు చివరగా 2019 డిసెంబర్లో త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాడు.ఆ తర్వాత ఈ ముంబైకర్ వరుసగా 37 టీ20ల్లో విజయాలను అందుకున్నాడు. తాజా ఓటమితో అతడి రికార్డుకు బ్రేక్ పడింది. దూబే గత రెండేళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024, ఆసియాకప్-2025 ట్రోఫీలను భారత్ సొంతం చేసుకోవడంలో దూబేది కీలక పాత్ర. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో జస్ప్రీత్ బుమ్రా 24 వరుస టీ20 విజయాల రికార్డు కూడా ముగిసింది.అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లుశివమ్ దూబే - 37 మ్యాచ్‌లు (2019-2025)పాస్కల్ మురుంగి - 27 మ్యాచ్‌లు (2022-2024*)జస్ప్రీత్ బుమ్రా - 24 మ్యాచ్‌లు (2021-2025)మణీష్ పాండే - 20 మ్యాచ్‌లు (2018-2020*)మహ్మద్ షెహ్జాద్ - 19 మ్యాచ్‌లు (2016-2021)చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్
- 
      
                   
                                                       మా ఓటమికి కారణమదే: సూర్య కుమార్మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో మెన్ ఇన్ బ్లూ పతనాన్ని శాసించగా.. ఎల్లీస్, బార్ట్లెట్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.ఇక మెల్బోర్న్ టీ20 ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని సూర్య చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ హాజిల్‌వుడ్‌పై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."జోష్ హాజిల్‌వుడ్ ఆసాధరణ బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. పవర్‌ప్లేలో అతడు బౌలింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయాము. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టం. కచ్చితంగా జోష్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే.మొదటి మ్యాచ్ రద్దు అయినప్పటికి మేము బాగానే బ్యాటింగ్ చేశాము. ఈ మ్యాచ్‌లో కూడా అదే మైండ్ సెట్‌తో ఆడాలి అనుకున్నాము. తొలుత బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్ధి ముందు భారీ టార్గెట్ ఉంచాలనుకున్నాము. కానీ మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడం విఫలమయ్యాము. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అతడు గత కొంత కాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నాడు. అతడు తన బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాడు. రాబోయే మ్యాచ్‌లలో కూడా అతడు ఇదే జోరును కొనసాగించాలని ఆశిస్తున్నాను" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: రీఎంట్రీలో రిషభ్ పంత్ ఫెయిల్.. భారత్ ఆలౌట్.. .. స్కోరెంతంటే?
- 
      
                   
                                                       ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చిత్తుఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మరో ఓటమి ఎదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్ జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా భారత్ నిర్ధేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు 6 వికెట్లు కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలోనే ఊదిపడేశారు. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్ష్.. 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన ఎనిమిదివ ఓవర్లో మార్ష్ ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.అతడితో పాటు ట్రావిస్ హెడ్(15 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.అభిషేక్ ఒంటరి పోరాటం..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) రాణించాడు.ఆసీస్ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం హోబర్ట్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs SA: రీఎంట్రీలో రిషభ్ పంత్ ఫెయిల్.. భారత్ ఆలౌట్.. .. స్కోరెంతంటే?
- 
      
                   
                                                       గంభీర్ ప్రయోగం సక్సెస్.. టీమిండియా పరువు కాపాడిన హర్షిత్టీమిండియా ఆల్‌రౌండర్ హర్షిత్ రానా మరోసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్లో రాణాను టీమ్ మెనెజ్‌మెంట్ ప్రమోట్ చేసింది.శివమ్ దూబే కంటే ముందు రాణా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాణా కీలకమైన పరుగులు సాధించాడు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రాణా.. అభిషేక్ శర్మతో కలిసి ఆదుకున్నాడు. తొలుత కాస్త ఇబ్బంది పడినప్పటికి క్రీజులో కదుర్కొన్నాక మాత్రం ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మార్కస్ స్టోయినిష్ బౌలింగ్‌లో రాణా బాదిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్ అని చెప్పుకోవాలి. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న హర్షిత్.. 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడు బ్యాటింగ్ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గంభీర్ నమ్మకం నిజమే అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయడం పట్ల తీవ్ర విమర్శల వర్షం కురిసింది.గంభీర్ సపోర్ట్ అతడికి ఉందని, అందుకే వన్డే, టీ20లు రెండింటికి సెలక్ట్ చేశారని మాజీలు సైతం మండిపడ్డారు. అయితే వాళ్లందరికి గంభీర్ గట్టి కౌంటరిచ్చాడు. రాణాను మెరిట్ ఆధారంగా సెలక్ట్ చేశామని, అతడికి ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయని గౌతీ మద్దతుగా నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా రాణా బంతితో బ్యాట్‌తో కూడా మెరిశాడు. ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ సత్తాచాటాడు.అభిషేక్ సూపర్ ఇన్నింగ్స్..ఇక ఈ మెల్బోర్న్ టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి అభిషేక్ మాత్రం తన విరోచిత పోరాటాన్ని కొనసాగించాడు. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్‌తో పాటు కూడా రాణా కూడా కీలక నాక్ ఆడడంతో ఆ మాత్రం స్కోర్ అయినా భారత్ సాధించగల్గింది. వీరిద్దరూ మినిహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్,నాథన్ ఎల్లీస్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs AUS: సంజూకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్.. కట్ చేస్తే! 4 బంతులకేShort ball? No problem! #HarshitRana clears it for a six! 🚀Brings up a solid fifty stand fearless, fiery, and full Skyball mode on! 🔥#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/sOGZ6m3u5y— Star Sports (@StarSportsIndia) October 31, 2025
- 
      
                   
                                                       సంజూకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్.. కట్ చేస్తే! 4 బంతులకేటీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించడం మొదలు పెట్టారు.అయితే అప్పుడు శుభ్‌మన్ గిల్ టీ20 జట్టుకు దూరంగా ఉండడంతో శాంసన్‌ను ఓపెనర్‌గా అవకాశముంది. కానీ గిల్ తిరిగి టీ20 సెటాప్లోకి రావడంతో ఆసియాకప్-2025 నుంచి సంజూ బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయింది. ఈ ఏడాది జరిగిన ఆసియాకప్‌లో భారత ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగగా.. శాంసన్‌ను మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు పంపారు.కొన్ని మ్యాచ్‌లలో నంబర్ 6, మరి కొన్ని మ్యాచ్‌లలో ఐదో స్ధానంలో ఈ కేరళ బ్యాటర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో టీమ్ మెనెజ్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సంజూ లాంటి అద్భుతమైన బ్యాటర్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంలేదని చాలా మంది మాజీలు మండిపడ్డారు.సంజూకు ప్రమోషన్..ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో సంజూ శాంసన్‌కు హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రమోషన్ ఇచ్చాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ త్వరగా ఔట్ కోవడంతో శాంసన్‌ను నంబర్ 3లో బ్యాటింగ్‌కు పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించుకుంది.కానీ సంజూ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికపోయాడు. దీంతో సోషల్ మీడియాలో సంజూను ట్రోలు చేస్తున్నారు.టాపార్డర్‌లో అవకాశమిస్తే ఇలా ఆడుతావా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొంత మంది శాంసన్‌ను మద్దతుగా నిలుస్తున్నారు. వేర్వేరు స్ధానాల్లో అతడిని బ్యాటింగ్‌కు పంపితే ఎలా, అతడికంటూ ఒక పొజిషన్ ఫిక్స్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.చదవండి: కేకేఆర్‌లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI— cricket.com.au (@cricketcomau) October 31, 2025
- 
      
                   
                                                       IND vs AUS: రెండో టీ20లో భారత్ ఓటమిAustralia vs India, 2nd T20I Melbourne Updates And Highlights: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఆసీస్ చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్( 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68) టాప్ స్కోరర్‌గా నిలవగా .. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.బుమ్ బుమ్ బుమ్రా..ఆస్ట్రేలియా ఆఖరిలో రెండు వికెట్లు కోల్పోయింది. తమ విజయానికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో బుమ్రా వరుస బంతుల్లో ఓవెన్, షార్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్8.4: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగిన టిమ్ డేవిడ్ (2 బంతుల్లో 1). ఆసీస్ స్కోరు: 90-3(8.4). ఇంగ్లిస్ 5 పరుగులతో ఉన్నాడు. విజయానికి 68 బంతుల్లో 36 పరుగుల దూరంలో ఆసీస్. ఏడు వికెట్ల దూరంలో టీమిండియా.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మార్ష్ (26 బంతుల్లో 46) అవుట్. ఆసీస్ స్కోరు: 87-2(8). విజయానికి 72 బంతుల్లో 39 పరుగులు అవసరం. ఇంగ్లిస్ 3 పరుగులతో ఉన్నాడు. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్4.3: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి హెడ్ (15 బంతుల్లో 28) అవుట్. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోగా.. మార్ష్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 51-1(4.3). విజయానికి 93 బంతుల్లో 75 పరుగులు అవసరం.నాలుగు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 49-0(4)ట్రావిస్ హెడ్ 27, మార్ష్ 12 పరుగులతో క్రీజులోకి ఉన్నారు.పదో వికెట్‌గా బుమ్రాఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68) రాణించగా.. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) అతడికి సహకారం అందించాడు. దీంతో భారత జట్టు కాస్త పరువు నిలుపుకోగలిగింది. 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కస్ స్టొయినిస్‌కు ఒక వికెట్ దక్కింది. భారత బ్యాటర్లలో గిల్ (5), సంజూ శాంసన్ (1), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ పటేల్ (7), శివం దూబే (4), కుల్దీప్ యాదవ్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. బుమ్రా రనౌట్ కావడంతో భారత్ పదో వికెట్ కోల్పోయింది.తొమ్మిదో వికెట్ డౌన్18.3: హాఫ్ సెంచరీ వీరుడు అభిషేక్ శర్మ (68)రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అభిషేక్ LBW అయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 125-9(18.3) ఫోర్, సిక్సర్‌తో చెలరేగిన అభిషేక్18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 18వ ఓవర్లో అభిషేక్ ఫోర్, సిక్సర్ బాదాడు. అభిషేక్ 34 బంతుల్లో 68 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఎనిమిదో వికెట్ డౌన్కుల్దీప్ యాదవ్ (0) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టొయినిస్ బౌలింగ్‌లో అబాట్ (సబ్‌స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోరు: 110-8(17). అభిషేక్ శర్మ 53 పరుగులతో ఉండగా.. వరుణ్ చక్రవర్తి క్రీజులోకి వచ్చాడు.శివం దూబే అవుట్బార్ట్లెట్ బౌలింగ్‌లో శివం దూబే (4)ఇచ్చిన క్యాచ్‌ను జోష్ ఇంగ్లిస్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోరు: 109-7(15.4). కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్15.2:బార్ట్లెట్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా హర్షిత్ రాణా వెనుదిరిగాడు. రాణా 33 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 పరుగులు రాబట్టాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 105-5హర్షిత్ రాణా 31 బంతుల్లో 35, అభిషేక్ 27 బంతుల్లో 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ..టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వరుస క్రమంలో వికెట్లుకోల్పోయినప్పటికి అభిషేక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.టీమిండియా ఐదో వికెట్ డౌన్..అక్షర్ పటేల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి హర్షిత్ రాణా వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(37),రాణా(4) ఉన్నారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 40-4.అక్షర్ 3, అభిషేక్ శర్మ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్4.5: తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెండు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వెనుదిరగగా.. అతడి స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. టీమిండియా స్కోరు: 32-4(4.5). అభిషేక్ 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ డౌన్4.3: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య వెనుదిరిగాడు. అంతకు ముందే క్యాచ్ డ్రాప్ రూపంలో తనకు వచ్చిన లైఫ్‌ను సూర్య సద్వినియోగం చేసుకోలేక ఒక్క పరుగే చేసి నిష్క్రమించాడు. సూర్య స్థానంలో తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. అభిషేక్ 24 పరుగులతో ఉన్నాడు. టీమిండియా స్కోరు: 32-3(4.4)రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా3.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన సంజూ శాంసన్(2). ఓపెనర్‌గా, మిడిలార్డర్లో ఆడించిన సంజూను వన్‌డౌన్‌లో పంపిస్తూ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. భారత్ స్కోరు: 23-2(3.3). అభిషేక్ 16 పరుగులతో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI— cricket.com.au (@cricketcomau) October 31, 2025 తొలి వికెట్ కోల్పోయిన భారత్2.4: హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. పది బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. సంజూ శాంసన్ వన్‌డౌన్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 22-1(2.5). అభిషేక్ 15, సంజూ రెండు పరుగులతో ఉన్నారు.రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0అభిషేక్ శర్మ నాలుగు బంతుల్లో 14, శుబ్‌మన్ గిల్ 8 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్‌ను హాజిల్‌వుడ్ కట్టుదిట్టంగా వేయడంతో టీమిండియాకు ఒక్క పరుగే వచ్చింది. తొలి బంతికే గిల్‌ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా.. రివ్యూలో అనుకూల ఫలితం వచ్చింది. దీంతో టీమిండియా రివ్యూ నిలుపుకోగలిగింది.టాస్ గెలిచిన ఆసీస్టీమిండియాతో రెండో టీ20లో ఆస్ట్రేలియా (IND vs AUS) టాస్ గెలిచింది. మెల్బోర్న్ వేదికగా తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh).. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా మార్ష్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టాస్ గెలవడం ఇది పందొమ్మిదోసారి. ప్రతిసారీ అతడు లక్ష్య ఛేదననే ఎంచుకోవడం విశేషం.ఒక మార్పుతో బరిలోకిటాస్ సందర్భంగా మార్ష్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయించుకున్నాం. వికెట్ బాగుంది. 40 ఓవర్లపాటు పిచ్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం. మా తుదిజట్టులో ఒక మార్పు చేశాము. జోష్ ఫిలిప్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చాడు’’ అని తెలిపాడు.అదే జట్టుతో భారత్ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. తొలి టీ20కి ఎంచుకున్న జట్టుతోనే తాము మెల్బోర్న్లో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో 2-1తో ఆసీస్ గెలుపొందగా.. టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటాలని భారత్ పట్టుదలగా ఉంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కాన్బెర్రాలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అయితే, వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20 తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.
- 
      
                   
                                                       ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవీ ముంబైలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో పటిష్ట ఆస్ట్రేలియా (IND vs AUS)పై చారిత్రాత్మక విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందిస్తూ.. జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేసింది.ఇదొక అద్బుతమైన భావనఆసీస్పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా గర్వంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. చాలా ఏళ్లుగా మేము ఎంతో కష్టపడి ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇదొక అద్బుతమైన భావన.ఈ టోర్నమెంట్ ఆరంభంలోనే మేము కొన్ని తప్పులు చేశాం. వాటిని సరిదిద్దుకుని ఈరోజు గెలిచి నిలిచాం. ఆఖరి వరకు మ్యాచ్ తీసుకురాకుండా.. ఇంకాస్త ముందుగానే మ్యాచ్ ముగిస్తే బాగుండనిపించింది. కానీ అలా తొందరపాటు చర్యలకు పాల్పడితే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితాన్ని మాకు అనుకూలంగా మార్చుకున్నాం’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ సంతృప్తి వ్యక్తం చేసింది.జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయిఇక సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు కోసం తాపత్రయపడే ప్లేయర్లలో జెమీమా ముందుంటుంది. బాధ్యత తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడదు. ఈరోజు తను అత్యంత ప్రత్యేకమైన నాక్ ఆడింది.పిచ్‌పై మేమిద్దరం ఆటను ఆస్వాదించాము. కలిసి బ్యాటింగ్ చేస్తున్నపుడల్లా ఒకరికొకరం మద్దతుగా ఉంటూ.. సమీకరణల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఈరోజు కూడా జెమీమా అన్నీ లెక్కలు వేసుకుంటూ నన్ను అప్రమత్తం చేస్తూనే ఉంది.‘ఐదు పరుగులు వచ్చాయి.. ఇంకో రెండే బంతులు మిగిలి ఉన్నాయి’ అంటూ ఇలా ప్రతీది కచ్చితంగా గుర్తుపెట్టుకుని నాతో చెబుతూ ఉంది. ఆట, జట్టు పట్ల తనకు ఉన్న అంకిత భావానికి ఇది నిదర్శనం.తనతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. జెమీమా ఆలోచనా తీరు, అద్భుత ఆట తీరును చూసి నేను ఆశ్చర్యపోయా. నన్ను కూడా ముందుకు నడిపించాలనే సంకల్పంతో తను ఇన్పుట్స్ ఇచ్చిన తీరు అద్భుతం. ఈ విజయంలో క్రెడిట్ తనకే ఇచ్చి తీరాలి’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రశంసల జల్లు కురిపించింది.కీలక పోరులో గెలిచి ఫైనల్కుకాగా నవీ ముంబైలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా... భారత్ 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకం (127)తో సత్తా చాటగా.. హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ (88 బంతుల్లో 89) ఆడింది. వీరి ద్దరు కలిసి 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫైనల్లో టీమిండియా నవీ ముంబై వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.చదవండి: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమాOh, captain, our captain! 🥹🫡🇮🇳#HarmanpreetKaur's heartfelt speech post the semi-finals triumph against Australia! 👏🏻WATCH CWC 25 FINAL 👉 #SAvIND | SUN, NOV 2, 2 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/TDgCwiYmk8— Star Sports (@StarSportsIndia) October 30, 2025
- 
      
                   
                                                       ఏడ్చేసిన హర్మన్‌ప్రీత్.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియోఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్.. అమన్‌జోత్ కౌర్ (Amanjot Kaur) ఫోర్ బాది భారత్ విజయాన్ని ఖరారు చేయగానే సంబరాలు అంబరాన్నంటాయి.. పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్ వన్డే వరల్డ్‌కప్-2025 (WC 2025) ఫైనల్‌కు చేరగానే.. నవీ ముంబై జయహో భారత్ నినాదాలతో హోరెత్తిపోయింది.. జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంఅమన్జోత్ సంతోషంలో మునిగిపోతే.. సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంతో నేలతల్లిని ముద్దాడింది.. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది.. భారత ప్లేయర్లంతా మైదానంలోకి దూసుకువచ్చి జెమీమాతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.చిన్నపిల్లలా ఏడుస్తూఇక కీలక మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డగౌట్లో కోచ్‌లు, ఆటగాళ్లను హత్తుకుంటూ హర్మన్ కన్నీటి పర్యంతమైంది.. భావోద్వేగాలను నియంత్రించుకోలేక చిన్నపిల్లలా ఏడుస్తూ సొంతగడ్డపై సాధించిన చారిత్రాత్మక విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు చూసిన యావత్ భారతావని ఉద్వేగానికి లోనవుతూనే జయజయధ్వానాలు చేస్తోంది.. ‘న భూతో న భవిష్యతి’ అన్న చందంగా చాంపియన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళా జట్టును అభినందనలతో ముంచెత్తుతోంది.📽️ Raw reactions after an ecstatic win 🥹The #WomenInBlue celebrate a monumental victory and a record-breaking chase in Navi Mumbai 🥳Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS pic.twitter.com/MSV9AMX4K1— BCCI Women (@BCCIWomen) October 31, 2025ఆసీస్‌ను ఓడించిఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ మూడోసారి ఫైనల్‌కు చేరింది. నవీ ముంబై వేదికగా తాజా ఎడిషన్ రెండో సెమీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో కెప్టెన్, డేంజరస్ ఓపెనర్ అలీసా హేలీ (5)ను క్రాంతి గౌడ్ శుభారంభం అందించినా.. ఫోబీ లిచ్‌ఫీల్డ్, ఎలిస్ పెర్రీ భారత శిబిరానికి ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు మిగల్చలేదు. లిచ్‌ఫీల్డ్ శతక్కొట్టగా (119), పెర్రీ 77 పరుగులతో రాణించింది.ఆరో నంబర్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ (45 బంతుల్లో 63) కూడా అర్ధ శతకంతో రాణించింది. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో ఆసీస్ 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లు షఫాలీ వర్మ (10), స్మృతి మంధాన (24) నిరాశపరిచారు.ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా అజేయ శతకం (127)తో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెకు తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89) దంచికొట్టగా.. దీప్తి శర్మ (17 బంతుల్లో 24), రిచా ఘోష్ (16 బంతుల్లో 26) వేగంగా ఆడి విజయ సమీకరణాన్ని సులువు చేశారు.ఆఖర్లో అమన్‌జోత్ (8 బంతుల్లో 15) కూడా మెరుపులు మెరిపించింది. ఫలితంగా 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 341 పరుగులు చేసిన భారత్.. ఆసీస్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ విజయంతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇందుకు నవీ ముంబై వేదిక.చదవండి: Jemimah Rodrigues Emotional Video: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదుTHIS IS WHAT IT MEANS! 💙🥹👉 3rd CWC final for India👉 Highest-ever run chase in WODIs👉 Ended Australia's 15-match winning streak in CWC#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/8laT3Mq25P— Star Sports (@StarSportsIndia) October 30, 2025
- 
      
                   
                                                       రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమా కన్నీటి పర్యంతంనాలుగేళ్ల వయసులోనే ఆమె బ్యాట్ పట్టింది.. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది..కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటర్.. జట్టుకు అవసరమైన వేళ తన స్పిన్ మాయాజాలంతోనూ మెరవగలదు.. అంతర్జాతీయ స్థాయిలో జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ ఆమె ముందే ఉంటుంది..కానీ ఊహించని రీతిలో కొన్నాళ్ల క్రితం ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. కారణం ఎవరైనా.. ఆరోపణలు ఏవైనా కానీ.. జింఖానా క్లబ్లో ఆమెకున్న సభ్యత్వాన్ని రద్దు చేశారు.. ఆమె తండ్రి మతపరమైన సమావేశాలు పెట్టి ఆటగాళ్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను పక్కనపెట్టారు..దీంతో ఆమె డిప్రెషన్లో కూరుకుపోయింది.. క్రికెట్‌నే వదిలేద్దామా అన్నంతగా కుంగిపోయింది.. ఆ సమయంలో స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు.. థెరపీ తీసుకుని ముందుగా మైదానంలో బ్యాట్‌తో మళ్లీ మెరుపులు మెరిపించాలంటూ ప్రోత్సహించారు..ఆమె కోలుకుంది.. దేశం కోసం ఆడాలనే దృఢ సంకల్పానికి ఇలాంటి ఆరోపణల తాలుకు ప్రభావం అడ్డుకాకూడదని తనను తాను సముదాయించుకుంది.. మాతృభూమి కోసం అవాంతరాలను అధిగమించి ఈరోజు దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.. ఆమే జెమీమా రోడ్రిగ్స్.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో వీరోచిత పోరాటంతో భారత్‌ను గెలిపించింది. భారీ లక్ష్యం, ముఖాముఖి రికార్డులు ఒత్తిడికి గురిచేస్తున్నా సొంత మైదానం (నవీ ముంబై)లో ప్రేక్షకుల మద్దతుతో ఆకాశమే హద్దుగా చెలరేగి.. తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.అజేయ శతకంతోఅనుకోని విధంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ రావాల్సి వచ్చినా.. ఆత్మవిశ్వాసంతో క్రీజులో కుదురుకుని అజేయ శతకం బాదింది. 134 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత్‌కు ఫైనల్ బెర్తును ఖరారు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.ఈ క్రమంలో పాతికేళ్ల జెమీమా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. గత కొన్ని నెలలుగా ఆమె అనుభవించిన మానసిక క్షోభ ఇందుకు కారణం. మ్యాచ్ గెలవగానే తండ్రిని హత్తుకుని ఆమె ఏడ్చిన తీరు ఆమె వేదనకు అద్దం పట్టింది.Pure moments of joy! 💙 Tears, smiles, and family hugs. Jemimah’s match-winning knock says it all! 😭💪WATCH CWC 25 FINAL 👉 #SAvIND | SUN, NOV 2, 2 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/ENDkBF5vk2— Star Sports (@StarSportsIndia) October 30, 2025 ప్రతీరోజు ఏడ్చానుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం జెమీమా మాట్లాడుతూ.. ‘‘జీసస్కు నా కృతజ్ఞతలు. ఆయన సహకారం లేకపోతే నా ఒక్కదాని వల్ల కాకపోయేది. పట్టుదలగా నిలబడితే చాలు దేవుడే నా తరఫున పోరాడతాడనే బైబిల్లోని ఒక వాక్యాన్ని మ్యాచ్ చివరి క్షణాల్లో మళ్లీ మళ్లీ చదువుకున్నాను. నా సొంతంగా నేను ఏమీ చేయలేదు కాబట్టి గెలిపించాననే మాట చెప్పను. ఈ టోర్నీ ఆసాంతం మానసికంగా చాలా వేదనకు గురయ్యాను. దాదాపు ప్రతీరోజు ఏడ్చాను. కానీ దేవుడే అంతా చూసుకున్నాడు.నాసెంచరీకి ప్రాధాన్యత లేదుమూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాననే విషయం మ్యాచ్‌కు ముందు తెలీదు. నాసెంచరీకి ప్రాధాన్యత లేదు. జట్టు గెలవడమే ముఖ్యం. నేను క్రీజ్‌లో ఇబ్బంది పడుతుండగా సహచరులు అండగా నిలిచారు. అభిమానుల ప్రోత్సాహం బాధను దూరం చేసింది. అందుకే విజయం సాధించగానే భావోద్వేగాలను నియంత్రించుకోలేక బాగా ఏడ్చేశాను’’ అని ఉద్వేగానికి లోనైంది. ఈ నేపథ్యంలో భారత ట్టు అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ‘‘ఏడవద్దు జెమీమా.. సగర్వంగా తలెత్తుకో చాంపియన్’’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.#JemimahRodrigues, take a bow! 🙌#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/2Ov9ixC7Ai— Star Sports (@StarSportsIndia) October 30, 2025చదవండి: IND Beat AUS In Semis: ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన భారత్
- 
      
                   
                                                       World Cup 2025: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన భారత్సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ ఆట తీరుతో రాణించి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens ODI World Cup 2025) ఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్, దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా (Ind Beat Aus In Semis)ను ఓడించి.. ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.జెమీమా అజేయ శతకం.. హర్మన్ అదరహోఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127) అజేయ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (88 బంతుల్లో 89)తో మెరిసింది. ఆసీస్‌పై గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవడంతో పాటు భారత జట్టు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.ప్రతీకారం తీర్చుకుని1. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. వన్డే వరల్డ్‌కప్-2025 లీగ్ దశలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ విధించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా.. ఇపుడు అదే జట్టుపై టీమిండియా 339 పరుగుల టార్గెట్ పూర్తి చేసి బదులు తీర్చుకుంది.ప్రపంచంలోనే తొలి జట్టుగా2. వన్డే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో పురుషులు, మహిళల క్రికెట్లో 300కు పైగా స్కోరును ఛేదించడం ఇదే తొలిసారి.అత్యధిక అగ్రిగేట్3. ఈ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా సంయుక్తంగా 679 పరుగులు సాధించాయి. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక అగ్రిగేట్ సాధించిన జట్లుగా నిలిచాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్- సౌతాఫ్రికా పేరిట ఉండేది. బ్రిస్టల్‌లో 2017లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఈ జట్లు 678 పరుగులు స్కోరు చేశాయి.పిన్న వయసులోనేఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబీ లిచ్‌ఫీల్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 22 ఏళ్ల వయసులో లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించింది.చదవండి: ఆసీస్‌ను భారత్ చిత్తు చేసిందిలా.. దక్షిణాఫ్రికాతో ఫైనల్THIS IS WHAT IT MEANS! 💙🥹👉 3rd CWC final for India👉 Highest-ever run chase in WODIs👉 Ended Australia's 15-match winning streak in CWC#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/8laT3Mq25P— Star Sports (@StarSportsIndia) October 30, 2025
- 
      
                   
                                                       జెమీమా తుఝే సలామ్అద్భుతం అనే మాట చాలా చిన్నదిగా అనిపిస్తోంది... ఈ అసాధారణ ప్రదర్శనను వర్ణించాలంటే అది సరిపోదు... ఎదురుగా ఉన్నది ఎదురు లేకుండా సాగుతున్న ప్రత్యర్థి... డిఫెండింగ్ చాంపియన్... ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్‌ను గెలుచుకునే తత్వం... మన ముందు ఏకంగా 339 పరుగుల లక్ష్యం...మహిళల వన్డే చరిత్రలో ఏ జట్టూ ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు... షఫాలీ విఫలం కాగా, టాప్ బ్యాటర్ స్మృతి ఆరంభంలోనే వెనుదిరిగింది... కానీ జెమీమా, హర్మన్ గట్టిగా నిలబడ్డారు... ఒత్తిడిని దరి చేరనీయకుండా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్లారు... కీలక సమయాల్లో ఆసీస్ మళ్లీ పైచేయి సాధిస్తూ సవాల్ విసురుతోంది... గతంలో ఎన్నో సార్లు ఇలాంటి సందర్భాల్లో కుప్పకూలిన జ్ఞాపకాలు... గెలుపునకు చేరువవుతున్నట్లే కనిపించింది... కానీ ఒక్కో వికెట్ పడుతుండటంతో ఉత్కంఠ... కానీ చివరకు అమన్‌జోత్ షాట్‌తో టీమ్‌లో సంబరాలు... పైకి కఠినంగా కనిపించే కెప్టెన్ కూడా కన్నీళ్లపర్యంతం... అంతటా ఆనందం, ఆనందబాష్పాలు...ఏడేళ్ల వన్డే కెరీర్... తొలి వన్డే ప్రపంచ కప్... టోర్నీకి ముందు చక్కటి ఫామ్... కెరీర్లో రెండు సెంచరీలు ఈ ఏడాదే వచ్చాయి... అయితే వరల్డ్ కప్‌లో వరుస వైఫల్యాలు... తొలి 3 మ్యాచ్‌లలో 2 డకౌట్లు... మీడియాతో మాట్లాడినంత సేపు కూడా క్రీజ్‌లో నిలవడం లేదని వ్యాఖ్యలు... ఆటకంటే పాటలు, డ్యాన్స్‌లపైనే దృష్టి అనే విమర్శలు... ఒక మ్యాచ్‌లో ఆడించకుండా పక్కన పెట్టేశారు కూడా... కానీ జెమీమా రోడ్రిగ్స్ తన జీవితంలో అత్యంత విలువైన ఆటను అసలు వేదికపై ఆడింది. తీవ్ర ఒత్తిడి ఉండే నాకౌట్ మ్యాచ్‌లో రెండో ఓవర్లోనే క్రీజ్‌లోకి... గతంలో కీలక సమయాల్లో మ్యాచ్‌ను కోల్పోయిన గుర్తులు... కానీ ఆమె ‘జెమ్’లాంటి ప్రదర్శనతో తన విలువను చూపించింది. శతకాన్ని దాటి అలసటతో బాధపడుతున్నా చివరి వరకు పోరాడింది.. మరచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో చరిత్రలో తన పేరు లిఖించుకుంది. నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. అసాధారణ ప్రదర్శనతో ఆ్రస్టేలియాపై ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఆఖరి పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (93 బంతుల్లో 119; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...ఎలైస్ పెరీ (88 బంతుల్లో 77; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లీ గార్డ్నర్ (45 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 341 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127 నాటౌట్; 14 ఫోర్లు) అద్భుత శతకానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 89; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచింది. వీరిద్దరు 156 బంతుల్లోనే 167 పరుగులు జోడించారు. భారత్ జోరు... టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన షఫాలీ వర్మ (5 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్మృతి మంధాన (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా హీలీ చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగింది. కానీ ఈ దశలో జత కలిసిన జెమీమా, హర్మన్ అసాధారణ పట్టుదల కనబర్చారు. 57 బంతుల్లో జెమీమా, 65 బంతుల్లో హర్మన్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారీ భాగ స్వామ్యం తర్వాత ఎట్టకేలకు హర్మన్‌ను అవుట్ చేయడంలో ఆసీస్ సఫలమైంది. అయితే జెమీమా మాత్రం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. 115 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న ఆమె... దీప్తి శర్మ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు), రిచా (16 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అమన్‌జోత్ (8 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో జట్టును విజయం దిశగా నడిపించింది. 339 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇదే ప్రపంచకప్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా ఛేదించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆసీస్ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.‘కప్’ వదిలేసిన హీలీ... జెమీమా అద్భుత ఇన్నింగ్స్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. 61 పరుగుల వద్ద ఆమె ఇచి్చన కష్టసాధ్యమైన క్యాచ్‌ను వదిలేసిన హీలీ, ఆ తర్వాత 82 వద్ద జీవితంలో మర్చిపోలేని తప్పు చేసింది. జెమీమా స్వీప్ చేయగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఈ అతి సునాయాస క్యాచ్‌ను హీలీ జారవిడిచింది. 41 బంతుల్లో భారత్ 55 పరుగులు చేయాల్సిన స్థితిలో తాలియా (జెమీమా స్కోరు 106) మరో సునాయాస క్యాచ్ వదిలేసింది. ఈ దశలో జెమీమా అవుటైనా...పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదేమో! స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (బి) క్రాంతి 5; లిచ్‌ఫీల్డ్ (బి) అమన్‌జోత్ 119; పెరీ (బి) రాధ 77; మూనీ (సి) జెమీమా (బి) శ్రీచరణి 24; సదర్లాండ్ (సి అండ్ బి) శ్రీచరణి 3; గార్డ్నర్ (రనౌట్) 63; తాలియా మెక్‌గ్రాత్ (రనౌట్) 12; కిమ్ గార్త్ (రనౌట్) 17; అలానా కింగ్ (సి) రిచా (బి) దీప్తి 4; మోలినో (బి) దీప్తి 0; షుట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 338. వికెట్ల పతనం: 1–25, 2–180, 3–220, 4–228, 5–243, 6–265, 7–331, 8–336, 9–336, 10–338. బౌలింగ్: రేణుక 8–0–39–0, క్రాంతి 6–0–58–1, శ్రీచరణి 10–0–49–2, దీప్తి 9.5–0–73–2, అమన్‌జోత్ 8–0–51–1, రాధ 8–0–66–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) గార్త్ 10; స్మృతి (సి) హీలీ (బి) గార్త్ 24; జెమీమా (నాటౌట్) 127; హర్మన్ (సి) గార్డ్నర్ (బి) సదర్లాండ్ 89; దీప్తి (రనౌట్) 24; రిచా (సి) గార్త్ (బి) సదర్లాండ్ 26; అమన్‌జోత్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (48.3 ఓవర్లలో 5 వికెట్లకు) 341. వికెట్ల పతనం: 1–13, 2–59, 3–226, 4–264, 5–310. బౌలింగ్: షుట్ 6–0–40–0, గార్త్ 7–0–46–2, గార్డ్నర్ 8–0–55–0, మోలినో 6.3–0–44–0, సదర్లాండ్ 10–0–69–2, అలానా 9–0–58–0, తాలియా 2–0–19–0.
- 
      
                   
                                                       భారత బౌలర్లను ఉతికారేసిన 22 ఏళ్ల ఆసీస్ బ్యాటర్మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఈ కీలక పోరులో 22 ఏళ్ల లిచ్‌ఫీల్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లను ఉతికారేసింది.దీప్తీ శర్మ వంటి స్టార్ స్పిన్నర్‌ను సైతం లిచ్‌ఫీల్డ్ విడిచిపెట్టలేదు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లతో ఈ ఆసీస్ యువ సంచలనం అలరించింది. ఆమె పెర్రీతో కలిసి రెండో వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లిచ్‌ఫీల్డ్.. కేవలం 77 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్‌ను అందుకుంది.ఆమెకు ఇదే తొలి వరల్డ్ కప్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 93 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119 పరుగులు చేసింది. దీంతో మహిళల వన్డే వరల్డ్‌కప్ నాకౌట్స్‌లో సెంచరీ చేసిన మూడో ఆసీస్ ప్లేయర్‌గా లిచ్‌ఫీల్డ్ నిలిచింది. ఆమె కంటే ముందు హీలీ, కరెన్ రోల్టన్ ఈ ఫీట్ సాధించారు.అదే విధంగా మహిళల వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా లిచ్‌ఫీల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట ఉండేది. 2017 ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై హర్మన్ 90 బంతుల్లో సెంచరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టిన లిచ్‌ఫీల్డ్.. హర్మన్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.WHAT A SHOT BY 22 YEAR OLD PHOEBE LITCHFIELD AGAINST DEEPTI SHARMA.🔥- Phoebe Litchfield & Ellyse Perry dominating Indian bowlers Kranti Gaud, Radha, Amanjot Kaur.🥶pic.twitter.com/WpHTXWA0AC— MANU. (@IMManu_18) October 30, 2025
- 
      
                   
                                                       జెమీమా వీరోచిత పోరాటం.. ఫైనల్లో భారత్ఉత్కంఠపోరులో భారత్ గెలుపు..మహిళల వన్డే ప్రపంచకప్-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో చేధించింది. దీంతో ముచ్చటగా మూడో సారి మన అమ్మాయిల జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత విజయంలో జెమీమా రోడ్రిగ్స్‌ది కీలక పాత్ర. భారీ లక్ష్య చేధనలో రోడ్రిగ్స్ విరోచిత శతకంతో చెలరేగింది. 134 బంతులు ఎదుర్కొన్న రోడ్రిగ్స్.. 14 ఫోర్ల సాయంతో 127 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.ఐదవ వికెట్ డౌన్..రిచా ఘోష్ రూపంలో భారత్ ఐదవ వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రిచా. క్యాచ్ అవుట్ అయింది. రోడ్రిగ్స్ సెంచరీ..ఆసీస్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో రోడ్రిగ్స్ అద్బుతమైన సెంచరీతో మెరిసింది. 43 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. క్రీజులో రోడ్రిగ్స్(106), రిచా ఘోష్(8) ఉన్నారు. భారత్ విజయానికి 42 బంతుల్లో 55 పరుగులు కావాలి.నాలుగో వికెట్ డౌన్..దీప్తీ శర్మ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన దీప్తీ.. రనౌట్ రూపంలో వెనుదిరిగింది. బారత విజయానికి 54 బంతుల్లో 75 పరుగులు కావాలి. క్రీజులో రోడ్రిగ్స్(96) ఉంది.భారత్ మూడో వికెట్ డౌన్..226 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. సదర్లాండ్ బౌలింగ్‌లో ఔటైంది. దీంతో 167 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 38 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. భారత విజయానికి 72 బంతుల్లో 98 పరుగులు కావాలి. క్రీజులో రోడ్రిగ్స్(90), దీప్తీ(10) ఉన్నారు.రసవత్తరంగా భారత్-ఆసీస్ సెమీఫైనల్భారత్-ఆస్ట్రేలియా మధ్య సెకెండ్ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. 339 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా అద్బుతంగా పోరాడుతోంది. 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. రోడ్రిగ్స్, హర్మన్ కలిసి మూడో వికెట్‌కు 167 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత విజయానికి ఇంకా 113 పరుగులు కావాలి. జేమిమా రోడ్రిగ్స్(85), హర్మన్ ప్రీత్ కౌర్(89) ఉన్నారు.హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీఆసీస్తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడుతోంది. 65 బంతుల్లో తన ఆర్ధ శతకాన్ని హర్మన్ పూర్తి చేసుకుంది. 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రోడ్రిగ్స్, హర్మన్ కలిసి మూడో వికెట్‌కు 130 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత విజయానికి ఇంకా 120 బంతుల్లో 150 పరుగులు కావాలి.రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ..టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు జేమిమా రోడ్రిగ్స్(54), హర్మన్(25) ప్రీత్ కౌర్ నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్ 58 బంతుల్లో తన ఆర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల కోల్పోయి 124 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 215 పరుగులు కావాలి.టీమిండియా రెండో వికెట్ డౌన్..స్మృతి మంధాన రూపంలో టీమిండియా రెండు వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మంధాన.. కిమ్ గార్త్ బౌలింగ్‌లో ఔటైంది. 10 ఓవర్లకు భారత్ స్కోర్:66-2, క్రీజులో రోడ్రిగ్స్(24), హర్మన్‌ప్రీత్ కౌర్(2) ఉన్నారు.టీమిండియాకు భారీ షాక్..339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోని గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ.. గార్త్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. 6 ఓవర్లు ఆసీస్ స్కోర్: 38/1. క్రీజులో మంధాన(14), రోడ్రిగ్స్(8) ఉన్నారు.భారత బౌలర్లు విఫలం.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ముంబై వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్(17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119) శతక్కొట్టగా.. ఎల్లీస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), గార్డెనర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తీ శర్మ తలా రెండు వికెట్లు సాధించగా.. రాధా యాదవ్, అమన్‌జ్యోత్ కౌర్, క్రాంతి గౌడ్ తలా వికెట్ పడగొట్టారు.కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు..భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. వరుస క్రమంలో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత చరణి బౌలింగ్‌లో సదర్లాండ్(3) ఔట్ కాగా.. ఆ తర్వాత రాధా యాదవ్ బౌలింగ్‌లో పెర్రీ(77) క్లీన్ బౌల్డ్ అయ్యింది. 41 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 260/5ఆసీస్ మూడో వికెట్ డౌన్..220 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన బెత్ మూనీ.. శ్రీచరణి బౌలింగ్‌లో ఔటైంది. 35 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 225-3ఆసీస్ రెండో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా ఎట్టకేలకు రెండో వికెట్ కోల్పోయింది. 119 పరుగులు చేసిన లిచ్‌ఫీల్డ్.. అమన్ జ్యోత్ కౌర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 155 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 27.2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 180-2లిచ్‌ఫీల్డ్ సెంచరీ..భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో ఆసీస్ యువ సంచలనం లిచ్‌ఫీల్డ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. కేవలం77 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను ఆమె అందుకుంది. 24 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో లిచ్‌ఫీల్డ్‌తో పాటు పెర్రీ(40) ఉన్నారు.18 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు: 115-1పెర్రీ 36, లిచ్‌ఫీల్డ్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.10 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 72/110 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజులో లిచ్‌ఫీల్డ్(46), పెర్రీ(18) ఉన్నారు.ఆసీస్ తొలి వికెట్ డౌన్..25 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కెప్టెన్ అలీసా హీలీ.. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అయితే ఆమె ఔటైన వెంటనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు.దూకుడుగా ఆడుతున్న ఆసీస్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో లిచ్‌ఫీల్డ్(17), హీలీ(4) ఉన్నారు. రేణుకా బౌలింగ్‌లో హీలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కెప్టెన్ హర్మన్ జారవిడిచింది.ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 సెకెండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అలీస్సా హీలీ తిరిగి జట్టులోకి వచ్చింది.భారత్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అదేవిధంగా భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. రిచా ఘోష్, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారు. స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.తుదిజట్లు భారత్షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.ఆస్ట్రేలియాఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్.
- 
      
                   
                                                       WC 2025 Ind vs Aus: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా చెత్త రికార్డుఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 రెండో సెమీ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా (WC Ind vs Aus) తలపడుతున్నాయి. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన ఆసీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్ సేనను బౌలింగ్‌కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ అలిసా హేలీ మాట్లాడుతూ.. తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. కీలక మ్యాచ్‌లో తాము ఒక మార్పు చేశామని.. జార్జియా వారేహమ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ జట్టులోకి వచ్చినట్లు వెల్లడించింది.మరోవైపు.. భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.. ఫియర్‌లెస్‌గా ఆడతామని తెలిపింది. గాయం వల్ల దురదృష్టవశాత్తూ ప్రతికా రావల్ దూరమైందన్న హర్మన్.. హర్లిన్ డియోల్, ఉమా ఛెత్రిలకు విశ్రాంతినిచ్చామని.. రిచా ఘోష్, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారని పేర్కొంది.టీమిండియా చెత్త రికార్డుమహిళల వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా భారత్ నిలిచింది. గత పది వన్డేల్లో హర్మన్ ఒకే ఒక్కసారి టాస్ గెలవడం గమనార్హం.మహిళల వరల్డ్‌కప్ టోర్నీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధికసార్లు టాస్ ఓడిన జట్లు👉ఇంగ్లండ్- 1982లో 13 మ్యాచ్‌లలో 9 సార్లు ఓటమి👉భారత్- 1982లో 12 మ్యాచ్‌లలో 8 సార్లు ఓటమి👉శ్రీలంక- 2000లో ఏడింట ఏడుసార్లు ఓటమి👉సౌతాఫ్రికా- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి👉భారత్- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి.తుదిజట్లు భారత్షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.ఆస్ట్రేలియాఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్.చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్
- 
      
                   
                                                       ‘కుదిరితే పదకొండో స్థానంలో కూడా ఆడిస్తారు’టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ఓపెనర్‌గా వచ్చి అదరగొట్టాడు సంజూ శాంసన్ (Sanju Samson). పదమూడు ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 183కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు కూడా ఉండటం గమనార్హం.గిల్ రాకతో గందరగోళంఅయితే, ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడంతో సంజూకు కష్టాలు మొదలయ్యాయి. భవిష్య కెప్టెన్ గిల్ ఓపెనర్‌గా వచ్చేందుకు సంజూపై వేటు వేసింది యాజమాన్యం. ఇక ఆ టోర్నీలో సంజూకంటూ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం లేకుండా పోయింది.ఆసియా కప్ టోర్నీలో మూడుసార్లు ఐదో స్థానంలో.. ఓసారి ఆరో స్థానంలో సంజూను బ్యాటింగ్‌కు పంపారు. ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనైతే ఎనిమిదో స్థానం వరకు అతడికి పిలుపేరాలేదు. వికెట్ కీపర్‌గా మాత్రమే టోర్నీ ఆసాంతం అతడి సేవలు వాడుకున్నారు.తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టీ20లో శుబ్‌మన్ గిల్- అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంజూ శాంసన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.దురదృష్టవంతుడైన ఆటగాడుయూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘జట్టులో ప్రస్తుతం అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడు సంజూ శాంసన్. ఓపెనర్‌గా సెంచరీ చేసిన ఘనత అతడిది. కానీ ఇప్పుడు 3-8 వరకు ఏ స్థానంలోనైనా మేనేజ్మెంట్ అతడిని పంపేందుకు వెనుకాడటం లేదు.కుదిరితే పదకొండో స్థానంలో కూడా ఆడిస్తారుఒకవేళ అవకాశం గనుక ఉంటే.. పదకొండో స్థానంలో కూడా సంజూను బ్యాటింగ్ చేయమంటారు. ఇలా చేయడం వల్ల ఆటగాడి మనసు గాయపడుతుంది. టాపార్డర్‌లో రాణించినా డిమోట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. అయినా.. ఇప్పుడు అతడికి ఇంతకంటే గొప్ప ఆప్షన్ మరొకటి లేదు.వికెట్ కీపర్గానైనా అవకాశంమౌనంగా అన్నీ భరిస్తూనే యాజమాన్యం చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆసియాకప్ టోర్నీలో ఐదో స్థానంలో వచ్చి అతడు మెరుగ్గా రాణించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో అతడు మొదటి ప్రాధాన్య వికెట్ కీపర్‌గా ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ఐదో నంబర్లో సంజూ మరింత మెరుగ్గా రాణిస్తే జట్టులో అతడి స్థానానికి ఢోకా ఉండదు. కాగా ఆసియా కప్‌లో సంజూ ఏడు మ్యాచ్‌లలో కలిపి 125 కంటే తక్కువ స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. అయితే, పాకిస్తాన్‌తో ఫైనల్లో 21 బంతుల్లో 24 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే ఆసీస్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం కారణంగా రద్దై పోయింది.చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్
- 
      
                   
                                                       అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ నాకౌట్ సమరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను వరుణుడు పరీక్షించబోతున్నాడు.ఈ మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. AccuWeather నివేదిక ప్రకారం, DY పాటిల్ స్టేడియం పరిసరాల్లో ఇవాళ ఉదయం ఆకాశం 93 శాతం మేఘావృతంగా ఉంటుంది. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగవుతాయన్న అంచనా ఉన్నా, నవీ ముంబైలో వాతావరణ పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఈనెల 28న ఇక్కడ జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను కూడా వర్షం ముంచేస్తుందేమోనని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మ్యాచ్ పూర్తిగా రద్దైతే..?ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనా రిజర్వ్ డే (అక్టోబర్ 31) ఉంది. ఇవాళ కొంత మ్యాచ్ జరిగి ఆగిపోయినా, ఇదే స్థితి నుంచి రిజ్వర్ డేలో కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం టీమిండియా కొంప కొల్లేరవుతుంది. గ్రూప్ దశలో భారత్ కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం చేత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. గ్రూప్ దశలో ఆసీస్ 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, నిన్న (అక్టోబర్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) చెలరేగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి
- 
      
                   
                                                       అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh). ఈ లెఫ్టార్మ్ సీమర్ ఇప్పటి వరకు ఆడిన 65 మ్యాచ్‌లలో కలిపి 101 వికెట్లు తీశాడు. అంతేకాదు టీమిండియా తరఫున పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా వంద వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్‌గానూ నిలిచాడు.ఇంతటి ప్రతిభ గల అర్ష్‌దీప్ సింగ్‌ను ఆస్ట్రేలియాతో తొలి టీ20 (IND vs AUS T20)లో పక్కనపెట్టారు. ఆసీస్ టూర్లో తొలి రెండు వన్డేల్లో ఈ పేసర్‌ను ఆడించిన యాజమాన్యం.. మూడో వన్డే నుంచి తప్పించింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాకతో.. అర్ష్‌దీప్‌పై వేటు వేసి హర్షిత్ రాణా (Harshit Rana)కు పెద్దపీట వేసింది. అందుకు తగ్గట్లుగానే నాలుగు వికెట్లు తీసి హర్షిత్ టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.హర్షిత్ కోసం అతడిని పక్కనపెట్టారు!అయితే, టీ20 ఫార్మాట్లో అర్ష్‌దీప్ సింగ్‌కు మంచి రికార్డు ఉన్నా.. మరోసారి హర్షిత్ కోసం అతడిని పక్కనపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ కోసం అర్ష్‌ను బలిచేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘అర్ష్‌దీప్ సింగ్’’ అంటూ ఒక్క మాటతో మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. మరోవైపు.. దేశీ స్టార్ ప్రియాంక్ పాంచల్ కాస్త తీవ్ర స్థాయిలోనే మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.ఎంత వరకు సమంజసం?‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. అలాంటిది విదేశీ పర్యటనలో తమ అత్యధిక వికెట్ల వీరుడిని పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం? అర్ష్‌దీప్ సింగ్ పట్ల ఇంకాస్త మంచిగా వ్యవహరించండి. అతడు అందుకు అర్హుడు’’ అని ప్రియాంక్ పాంచల్ విమర్శించాడు.అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?ఇక శ్రీవత్స్ గోస్వామి కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టులోకి తీసుకోవడాన్ని విమర్శించాడు. ఇందుకు గల కారణమేమిటో తనకైతే అంతుపట్టడం లేదన్నాడు. అలాగే రింకూ సింగ్‌ను కూడా జట్టు నుంచి అకారణంగా తప్పించడం ఏమిటోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 వర్షార్పణమైంది. చాన్నాళ్లుగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ చక్కటి షాట్లతో అలరించినా... భారీ వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగలేదు. వర్షార్పణంఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్... 9.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగుల వద్ద నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఆసియా కప్‌లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక 9.4 ఓవర్ల వద్ద ఆటకు అంతరాయం కలిగించిన వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఆసీస్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి
- 
      
                   
                                                       Shreyas Iyer: గాయం తర్వాత తొలి స్పందన.. పోస్ట్ వైరల్భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు. తాను కోలుకుంటున్నానని.. ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలిపాడు. అదే విధంగా.. తన క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. కష్టకాలంలో అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, అభిమానులకు రుణపడి ఉంటానన్నాడు.ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా శ్రేయస్ అయ్యర్ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్‌లో మాత్రం అర్ధ శతకం (61)తో ఆకట్టుకున్నాడు.నొప్పితో విలవిల్లాడుతూఈ క్రమంలో సిడ్నీలో ఆఖరిదైన మూడో వన్డే (IND vs AUS 3rd ODI)లోనూ సత్తా చాటాలని భావించిన శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా ఫీల్డింగ్ చేస్తుండగా.. అలెక్స్ క్యారీ (Alex Carey) ఇచ్చిన క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు.నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కూలిపోగా.. ఫిజియో వచ్చి అయ్యర్‌ను తీసుకువెళ్లాడు. తొలుత గాయం చిన్నదనే భావించినా డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లిన తర్వాత అయ్యర్ స్పృహ తప్పి పడిపోయినట్లు తెలిసింది. వెంటనే ఫిజియో, డాక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడిని సిడ్నీ ఆస్పత్రికి తరలించారు.Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025అంతర్గత రక్తస్రావంఈ క్రమంలో పక్కటెముకల గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి అతడికి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కారణంగా అదృష్టవశాత్తూ అయ్యర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. త్వరలోనే అతడు డిశ్చార్జ్ కూడా కానున్నట్లు సమాచారం.గాయం తర్వాత తొలి స్పందన.. పోస్ట్ వైరల్ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ తొలిసారిగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చాడు. ఈ మేరకు.. ‘‘కోలుకునే దశలో ఉన్నాను. రోజురోజుకీ పరిస్థితి మెరుగుపడుతోంది. నా కోసం ప్రార్థిస్తూ.. నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.కష్టకాలంలో నాకు దక్కిన ఈ మద్దతు ఎప్పటికీ మర్చిపోలేనిది. నా కోసం ప్రార్థించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని అయ్యర్ ప్రకటన విడుదల చేశాడు. ఆటకు దూరంకాగా ముంబైకి చెందిన 30 ఏళ్ల శ్రేయస్ అయ్యర్.. వెన్నునొప్పి సమస్య కారణంగా ఇటీవలే టెస్టులకు సుదీర్ఘ విరామం ప్రకటించాడు. టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోతున్న అయ్యర్.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.తాజా గాయం వల్ల దాదాపు రెండు నుంచి మూడు నెలలపాటు అతడు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా వన్డేల్లో ఆతిథ్య ఆసీస్‌ను టీమిండియాను 2-1తో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిపోయింది. చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు
- 
      
                   
                                                       కంగారు పడతారా? కంగారు పెట్టిస్తారా?మహిళల వన్డే ప్రపంచకప్-2025లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా గురువారం ముంబై వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మూడో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని హర్మన్ సేన భావిస్తోంది. 2017 ప్రపంచకప్ సెమీఫైనల్ నాటి ఫలితాన్నే రిపీట్ చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.మరోవైపు ఆసీస్ అమ్మాయిలు మాత్రం రికార్డు స్దాయిలో పదో సారి ఫైనల్‌కు చేరాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటికే లీగ్ దశలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత్ బ్యాటింగ్‌లో సత్తాచాటినప్పటికి బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది.భారత్‌కు బిగ్ షాక్.. ఆసీస్‌కు జోష్సెమీఫైనల్కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగింది. దీంతో ఆమె స్దానంలో విధ్వంసకర బ్యాటర్ షెఫాలీ వర్మ తిరిగి జట్టులోకి వచ్చింది. ఛాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన షెఫాలీ ఎలా రాణిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ అలీసా హీలీ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించింది. దీంతో భారత్‌తో జరగనున్న సెమీఫైనల్లో ఆమె ఆడడం దాదాపు ఖాయమైంది. హీలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. లీగ్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె భారీ శతకం(142)తో చెలరేగింది.బలంగా ఆసీస్ బ్యాటింగ్ లైనప్భారత్తో పోలిస్తే ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్లో పరుగులు సాధించే సత్తా ఉన్న ప్లేయర్లు ఆసీస్ జట్టులో ఉన్నారు. అలీసా హీలీ, బెత్ మూనీ, మెక్‌గ్రాత్, గార్డెనర్, పెర్రీ వంటి స్టార్ ప్లేయర్లు చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా కంగారులు బలంగా ఉన్నారు. మెగాన్ షూట్, అలానా కింగ్, గార్డెనర్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఆసీస్ వద్ద ఉన్నారు.స్మృతి చెలరేగుతుందా?ఇక ఆసీస్‌తో సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానపైనే ఉన్నాయి. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న మంధాన కీలకమైన సెమీస్‌లో ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీ ఆరంభంలో తడబడిన మంధాన.. ఆ తర్వాత మాత్రం సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన మంధాన, 60.8 సగటుతో 365 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, రెండు ఆర్ధ శతకాలు ఉన్నాయి. ఆసీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 80 పరుగులతో సత్తాచాటింది. ఇప్పుడు నాకౌట్ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మంధానకు ఆసీస్ స్టార్ పేసర్ మెగాన్ షూట్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. కొత్త బంతితో బౌలింగ్ చేసే షూట్.. మంధానాను ఇప్పటివరకు వన్డేల్లో 4 సార్లు అవుట్ చేసింది. మంధానతో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ బ్యాట్ ఝుళిపిస్తే భారత్‌కు తిరిగుండదు. మిడిలార్డర్లో రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్, రిచా ఘోష్‌లు తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే. అప్పుడే ఆసీస్ వంటి పటిష్టమైన జట్టును మన అమ్మాయిలు ఆపగలరు. బౌలింగ్‌లో భారత్‌కు రేణుకా సింగ్, దీప్తీ శర్మ, రాధా యాదవ్ కీలకం కానున్నారు. ఆసీపై స్పిన్నర్ రాధా యాదవ్‌కు మంచి రికార్డు ఉంది.ఆసీస్‌దే పైచేయి..భారత్-ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు సార్లు వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఆసీస్ రెండింట విజయం సాధించగా.. భారత్ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందింది. 2017 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మహిళలపై భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 171 పరుగుల చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడింది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు
- 
      
                   
                                                       సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డుటీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు హోదా ఉన్న జట్ల తరఫున అత్యంత వేగంగా 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. ముంబైకి చెందిన 35 ఏళ్ల సూర్యకుమార్ ఆలస్యంగానే టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు.ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా భారత్ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటలేక చతికిల పడ్డ సూర్య.. తనకు కలిసి వచ్చిన టీ20 క్రికెట్లో మాత్రం వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు.వరుస విజయాలుఈ క్రమంలో గతేడాది ఏకంగా టీమిండియా టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన సూర్య.. వరుస విజయాలు సాధించాడు. ఇటీవలే ఆసియా టీ20 కప్-2025లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. కానీ బ్యాటర్‌గా మాత్రం విఫలం కావడం విమర్శలకు దారితీసింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న సూర్య.. తొలి టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. కాన్బెర్రా వేదికగా టాస్ గెలిచిన ఆసీస్.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.వర్షం వల్ల మ్యాచ్ రద్దుఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19) వేగంగా ఆడే ప్రయత్నంలోనే.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో కలిసి దంచికొట్టాడు. అయితే, వర్షం వల్ల ఈ మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.అప్పటికి.. 9.4 ఓవర్ల ఆట సాగగా.. వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది టీమిండియా. గిల్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేయగా.. సూర్యకుమార్ 24 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. Fearless batting on display! 💥We’re in for a @surya_14kumar special!Match Update ➡️ Rain Delay. Revised start time awaited!#AUSvIND 👉 1st T20I | LIVE NOW 👉 https://t.co/nKdrjgZhGQ pic.twitter.com/87NwgUurcT— Star Sports (@StarSportsIndia) October 29, 2025205 సిక్సర్లతో టాప్‌లో రోహిత్ ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సూర్య అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 150 సిక్సర్ల క్లబ్లో చేరాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ 205 సిక్సర్లతో టాప్‌లో ఉండగా.. సూర్య ఐదో స్థానంలో నిలిచాడు.అయితే, అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లోనే అంటే.. 86వ ఇన్నింగ్స్‌లోనే 150 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు సూర్య. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ల (టెస్టు హోదా) జట్ల తరఫున ఫాస్టెస్ట్ 150 సిక్సెస్ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇక అసోసియేట్ దేశమైన యూఏఈ తరఫున ముహమ్మద్ వసీం 66 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 క్రికెటర్లు🏏 రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్‌లలో 205 సిక్సర్లు🏏ముహమ్మద్ వసీం (యూఏఈ)- 91 మ్యాచ్‌లలో 187 సిక్సర్లు🏏మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 122 మ్యాచ్‌లలో 173 సిక్సర్లు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్‌లలో 172 సిక్సర్లు🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 91 మ్యాచ్‌లలో 150 సిక్సర్లు*.చదవండి: PKL 2025: అతడొక అద్భుతం.. తెలుగు టైటాన్స్‌కు దొరికిన ఆణిముత్యం
- 
      
                   
                                                       భారత్- ఆస్ట్రేలియా తొలి టీ20 వర్షార్పణంకాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ అహ్హనించాడు. అయితే భారత ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ ముగిసిన వెంటనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆటను ప్రారంభించారు. అయితే మ్యాచ్‌ను మాత్రం 18 ఓవర్లకు కుదించారు. తిరిగి క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్యాటర్లు మంచి జోరు మీద ఉన్న సమయంలో వర్షం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. భారత్ స్కోర్ 97/1(9.4 ఓవర్లు) వద్ద ఆటను నిలిపివేశారు.అయితే ఈసారి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితం తేలని ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(39 నాటౌట్), శుభ్‌మన్ గిల్(37 నాటౌట్), అభిషేక్ శర్మ 19 పరుగులు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మెల్బోర్న్ వేదికగా శుక్రవారం జరగనుంది.తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్
- 
      
                   
                                                       ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు భారీ షాక్ తగిలింది. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. అడిలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో నితీష్‌కు ఎడమ తొడ కండరాల (క్వాడ్రిసెప్స్) గాయం అయింది.దీంతో అతను సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు దూరంగా ఉన్నాడు. అయితే టీ20 సిరీస్ సమయానికి ఈ ఆంధ్ర క్రికెటర్ కోలుకుంటాడని అంతా భావించారు. కానీ క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకునే క్రమంలో అతడికి మెడకు (స్పాసమ్స్) సమస్య కూడా తలెత్తింది. దీంతో అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి వారం రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో కూడా ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే గాయం కారణంగా నితీశ్ స్వదేశానికి వచ్చేశాడు.కాగా కాన్బెర్రా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్ నితీశ్ గైర్హజరీలో శివమ్ దూబే, హర్షిత్ రాణా వంటి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలి టీ20కు వర్షం పదే పదే అంతరాయం కలిగిస్తోంది. 9.4 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. భారత్ స్కోర్ 97-1గా ఉంది.తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.
- 
      
                   
                                                       శ్రేయస్ అయ్యర్ కోసం సూర్యకుమార్ తల్లి పూజలు.. వీడియో వైరల్టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. త్వరలోనే శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అమ్మ.. అయ్యర్ కోసం ప్రార్థిస్తోంది‘‘అమ్మ.. శ్రేయస్ అయ్యర్ కోసం ప్రార్థిస్తోంది’’ అంటూ దినాల్ ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. ఛట్ పూజకు వెళ్లిన సూర్య తల్లి స్వప్న యాదవ్.. ‘‘ప్రతి ఒక్కరు శ్రేయస్ అయ్యర్ కోసం ప్రార్థించండి. అతడు క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకోండి.అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుందిశ్రేయస్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి నా మనసు ఆందోళనకు గురైంది. అతడు త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని దయచేసి అంతా ప్రార్థన చేయండి’’ అని స్వప్న యాదవ్ తన చుట్టూ ఉన్న వాళ్లకు విజ్ఞప్తి చేశారు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది.. శ్రేయస్ పట్ల మీ ఆప్యాయత మమ్మల్ని కదిలించింది’’ అంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు.అంతర్గత రక్తస్రావంకాగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఆఖరిదైన మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ అందుకున్న శ్రేయస్.. ఆ వెంటనే నొప్పితో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు. పక్కటెముకలకు తీవ్రమైన గాయం కావడంతో హుటాహుటిన సిడ్నీ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షల్లో అంతర్గత రక్తస్రావం గుర్తించిన ఆస్ట్రేలియా డాక్టర్లు వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందజేయడంతో కోలుకున్నాడు.డాక్టర్ల పర్య వేక్షణలోనేశ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చి తదుపరి చికిత్సను కొనసాగిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘గాయం కచ్చితంగా ఎక్కడైందో గుర్తించి అంతర్గత రక్తస్రావాన్ని నిరోధించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ డాక్టర్ల పర్య వేక్షణలోనే ఉన్నాడు’ అని బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.పెద్ద గాయమే అయినామరోవైపు.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘దేవుడు అయ్యర్ పక్షాన వున్నాడు. అందుకే పెద్ద గాయమే అయినా వేగంగా కోలుకుంటున్నాడు. సిడ్నీ డాక్టర్లు, బోర్డు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. త్వరలోనే అతను పూర్తిగా కోలుకుంటాడు’ అని అన్నాడు. చదవండి: టీమిండియా ‘హెడ్‌కోచ్’తో ఆటగాళ్ల తెగదెంపులు.. వేటు వేసిన బీసీసీఐ!Suryakumar Yadav’s mother praying for Shreyas Iyer’s recovery during Chhath Puja. 🥺❤️pic.twitter.com/CkYD26lzHo— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2025
- 
      
                   
                                                       IND vs AUS 1st T20I: వర్షం వల్ల మ్యాచ్ రద్దుAustralia vs India, 1st T20I- Canberra: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. కాన్బెర్రాలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఐదు ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. కాసేపటి తర్వాత తిరిగి మొదలుపెట్టారు.అయితే, 9.4 ఓవర్ల మధ్య వర్షం మళ్లీ ఆటంకం కలిగించింది. ఆ తర్వాత వాన తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 9.4 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 37), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39) అజేయంగా నిలిచారు.మళ్లీ వర్షం.. ఆగిన ఆట9.4 ఓవర్ల వద్ద వర్షం మళ్లీ ఆటకు ఆటంకం కలిగింది. స్కోరు: 97-1. సూర్య 24 బంతుల్లో 39, గిల్ 20 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొమ్మిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 82-1.సూర్య 20 బంతుల్లో 37, సూర్య 20 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.తిరిగి ప్రారంభమైన ఆట.. ఆట తిరిగి ప్రారంభమైంది. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(25), సూర్యకుమార్ యాదవ్(12) ఉన్నారు.వర్షం వల్ల ఆటకు అంతరాయంఐదు ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 43-1. గిల్ 16, సూర్య 8 పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.5: నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. 14 బంతుల్లో 19 పరుగులు చేసి టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఓపెనింగ్ బ్యాటర్. టీమిండియా స్కోరు: 36-1(4). గిల్ 16 పరుగులతో ఉండగా.. సూర్యకుమార్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాకాన్బెర్రా వేదికగా టీమిండియాతో తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS 1st T20I) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ (Mitchell Marsh) మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. కాన్బెర్రాలో ప్రేక్షకుల మద్దతు కూడా మాకు కలిసి వస్తుంది. టీమిండియా మాదిరే మేము కూడా దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం.ఇరుజట్లు పటిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా వరల్డ్ నంబర్ వన్ జట్టుగా ఉంది. ఇలాంటి జట్టుతో పోటీ అంటే ఆసక్తికరమే. మా జట్టులో అవసరమైన మేర బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు’’ అని పేర్కొన్నాడు.ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనే భావించాము. వికెట్ బాగుంది. మనుకా ఓవల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరుగలేదని మా అనలిస్టుల ద్వారా విన్నాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కాస్త నెమ్మదించవచ్చు.అది ఎప్పుడూ తలనొప్పిగానే ఉంటుందిఅందుకే ముందుగానే బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. మూడు- నాలుగు రోజుల ముందే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేశాము. నిన్నటి మాదిరే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది.మా జట్టులో ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషిస్తాడు. బాధ్యతాయుతంగా ఆడతారు. అందుకే తుదిజట్టు ఎంపిక ఎప్పుడూ తలనొప్పిగా మారుతుంది. అయితే, ఆ విషయంలో మాకు సంతోషంగా ఉంది. ఇంతమంది మంచి ఆటగాళ్లు అందుబాటులో ఉండటం సానుకూలాంశం. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి.నితీశ్ రెడ్డి అవుట్ఈరోజు రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ రెడ్డి మిస్సవుతున్నారు’’ అని తెలిపాడు. కాగా గాయం కారణంగా నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాతో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెల్లడించింది. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నితీశ్ రెడ్డి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?SKYBALL incoming!Get ready for some fearless batting, full hitting as #TeamIndia have been put in to bat first in the 1st T20I!#AUSvIND 👉 1st T20I | LIVE NOW 👉 https://t.co/nKdrjgZhGQ pic.twitter.com/wpak5bA2lz— Star Sports (@StarSportsIndia) October 29, 2025
- 
      
                   
                                                       టీమిండియాకు బ్యాడ్ న్యూస్నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌కు (India vs Australia) ముందు టీమిండియాకు (Team India) బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా) దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ అలైస్సా హీలీ (Alyssa Healy) ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానుంది.ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. హీలీ ఫిట్నెస్ టెస్ట్‌ను క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆమె, పునరాగమనం సంకేతాలు ఇచ్చింది. సెమీస్‌లో హీలీ బరిలోకి దిగితే టీమిండియాను కష్టాలు తప్పవు.గాయపడక ముందు ఆమె అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. వరుసగా భారత్, బంగ్లాదేశ్‌పై సెంచరీలు (142, 113 నాటౌట్) చేసింది. ఇదే ఫామ్‌ను హీలీ సెమీస్‌లోనూ కొనసాగిస్తే.. టీమిండియా ప్రపంచకప్ సాధించాలన్న కల తలకిందులయ్యే ప్రమాదం ఉంది.ఈ టోర్నీలో హీలీ 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 98 సగటున 298 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై విజయాలు సాధించి, జైత్రయాత్రను కొనసాగిస్తుంది. భారత్ విషయానికొస్తే.. చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన భారత్.. టోర్నీ ప్రారంభంలో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌లపై విజయాలు సాధించి, ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ టోర్నీ నుంచి మరో రెండు సెమీస్ బెర్త్‌లు ఇంగ్లండ్, సౌతాఫ్రికాకు దక్కాయి. ఇరు జట్లు ఇవాళ (అక్టోబర్ 29) జరుగబోయే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: పాక్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా
- 
      
                   
                                                       ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా?ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గాయపడిన సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో.. శ్రేయస్ ఎడమ వైపు పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో స్ల్పీన్(ప్లీహాం)కి గాయమైంది.అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ వెల్లడించింది. అయ్యర్‌ను ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.అయితే ఆస్పత్రిలో ఈ చికిత్సకు శ్రేయస్ స్వయంగా ఖర్చు చేస్తున్నారా? లేక బీసీసీఐ భరిస్తుందా? అన్న సందేహం అందరిలో నెలకొంది. అధికారిక మ్యాచ్‌లు లేదా టూర్లలో గాయపడిన క్రికెటర్ల వైద్య ఖర్చులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)నే భరిస్తుంది.సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు బీసీసీఐ భరోసా..👉సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్న ఆటగాళ్లందరూ బీసీసీఐ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద పూర్తి కవరేజీని పొందుతారు. 👉విదేశాల్లో అత్యవసర చికిత్స, సర్జరీ, ఆసుపత్రి ఖర్చులు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లో పునరావాసం ఖర్చులు అన్ని బీసీసీఐనే భరిస్తుంది.👉ఆటగాడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ గాయం అయిన వెంటనే బీసీసీఐ మెడికల్ స్టాప్.. స్ధానిక వైద్యుల సహాయంతో వెంటనే చికిత్సను ప్రారంభిస్తారు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.👉గాయం కారణంగా ఒక ఆటగాడు మ్యాచ్‌లకు దూరమైనప్పుడు, మ్యాచ్ ఫీజును కూడా బీసీసీఐ పరిహారంగా చెల్లిస్తుంది.👉సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో భాగం కాని ఆటగాళ్లకు కూడా బీమా పాలసీలు ఉన్నాయి. కానీ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు లభించేంత ప్రయోజనాలను వారికి ఉండవు.చదవండి: Shreyas Iyer injury update: శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం..
- 
      
                   
                                                       టీమిండియాతో తొలి టీ20.. ఆసీస్ తుది జట్టులో డేంజరస్ ప్లేయర్లు!భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 కాన్బెర్రా బుధవారం(అక్టోబర్ 29) జరగనుంది. టీమిండియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని కంగారులు వ్యూహాలు రచిస్తున్నారు. భారత్ తమ తుది జట్టును ఖరారు చేయడానికి తర్జన భర్జన పడుతుంటే, ఆస్ట్రేలియా మాత్రం ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆసీస్ సెలక్టర్లు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను ప్రకటించారు. తొలి రెండు టీ20లకు దూరంగా ఉండనున్న స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.. ఆఖరి మూడు టీ20లకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా యాషెస్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు ఆఖరి మూడు టీ20లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.టీమిండియా కంటే బెటర్‌గా..గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత.. ఆస్ట్రేలియా పొట్టి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వరుస సిరీస్‌ల విజయాలతో ఆసీస్ రెండో స్ధానంలో కొనసాగుతోంది. ర్యాంకింగ్స్‌లో కంగారుల కంటే భారత్ ముందుంజలో ఉన్నప్పటికి.. ఇటీవల కాలంలో ఆటగాళ్ల ప్రదర్శన పరంగా కంగారులే మెరుగ్గా కన్పిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత ఆస్ట్రేలియా ఇప్పటివరకు 19 టీ20లు ఆడి కేవలం కేవలం రెండు మాత్రమే ఓడిపోయింది. ఆసీస్ బ్యాటింగ్ రన్‌రేట్ 10.07గా ఉండగా, భారత్ 9.69తో రెండో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆప్రోచ్ పూర్తిగా మారిపోయింది. మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు ఫియర్ లెస్ బ్యాటింగ్ విధానాన్ని ఎంచుకుంది. ఓపెనర్ల నుంచి ఎనిమిదో స్ధానం బ్యాటర్ వరకు హిట్టింగ్ చేసే సత్తా ఉంది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆరంభాలను ఇస్తుండగా.. మిడిలార్డర్లో జోష్ ఇంగ్లిష్, టిమి డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఆఖరిలో స్టోయినిష్, ఓవెన్ వంటి ఆల్‌రౌండర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో పేసర్ దుర్హనియస్ కూడా బ్యాట్‌తో సత్తాచాటుతున్నాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ ఛాన్నాళ్ల తర్వాత ఆసీస్ టీ20 జట్టులోకి వచ్చాడు. అతడు కూడా తన బ్యాట్‌కు పనిచెబితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక తొలి తొలి టీ20కు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా దూరమైనప్పటికి.. జోష్ హాజిల్‌వుడ్, ఈల్లీస్, బార్ట్లెట్ వంటి పేస్ పవర్ హౌస్ ఆసీస్ వద్ద ఉంది. భారత్‌తో తొలి టీ20కు ఆసీస్ తుది జట్టు(అంచనా)మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), జోష్ ఫిలిప్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, తన్వీర్ సంఘాచదవండి: Shreyas Iyer injury update: శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం..
- 
      
                   
                                                       శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం..టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అభిమానులకు శుభవార్త. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన(స్ల్పీన్ ఇంజూరీ) అయ్యర్.. శరవేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.అయ్యర్ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వారంలోపు అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని శ్రేయస్ తండ్రి సంతోష్ అయ్యర్ ధృవీకరించారు."శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. సిడ్నీలోని బెస్ట్ డాక్టర్లు అయ్యర్‌కు చికిత్స అందిస్తున్నారు. అతడు వారంలోపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. వీలైతే అంతకంటే ముందు తిరిగి ఇంటికి రావచ్చు.అతడు టీ20 జట్టులో బాగం కానుందున నేరుగా ఇంటికే రానున్నాడు. దీంతో సిడ్నీ వెళ్లాలనుకున్న మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. మేము అక్కడికి వెళ్లడం లేదని" సంతోష్ అయ్యర్ డెక్కన్ క్రానికల్‌తో పేర్కొన్నారు.అయ్యర్ ఎలా గాయపడ్డాడంటే?సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకులకు బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం చిన్నదే అని అంతా భావించారు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన అయ్యర్, కాసేపటికే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడి అస్పత్రికి తరలించి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.స్కాన్‌లో అతడి ప్లీహానికి (స్ప్లీన్) గాయమైనట్లు తేలింది. అంతేకాకుండా అంతర్గత రక్తస్రావం కూడా జరిగిందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అతడికి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన చెందిన అయ్యర్ తల్లిదండ్రులు సిడ్నీకి పయనమయ్యేందుకు సిద్దమయ్యారు.కానీ అతడు ఆరోగ్యం కుదుట పడటంతో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కాగా శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ కూడా శ్రేయస్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. తాను అయ్యర్ మాట్లాడని, బాగానే ఉన్నాడు అని సూర్య చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే నెలలలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయస్ దూరమయ్యే అవకాశముంది.చదవండి: ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
- 
      
                   
                                                       ఎడమచేతి వాటం క్రికెటర్లతో లాభాలేమిటి?టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌లకు సిద్ధమైంది. అక్టోబరు 29- నవంబరు 8 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టును పరిశీలిస్తే ఇందులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం గల ఆటగాళ్లు ఉన్నారు.మరి లెఫ్టాండర్ల వల్ల జట్టుకు అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? వీరిని ఎక్కువగా తుదిజట్టులోకి తీసుకోవడం వల్లే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం!బ్రియన్ లారా మారథాన్ ఇన్నింగ్స్ నుంచి ఆడం గిల్‌క్రిస్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్, సౌరవ్ గంగూలీ మెరుపులు .. ఎడమచేతి వాటం బ్యాటర్ల అద్భుత ప్రదర్శనలకు ఇవి నిదర్శనాలు.అడ్వాంటేజ్ ఏంటి?క్రికెట్లో కుడిచేతి వాటం బ్యాటర్లే ఎక్కువ. కాబట్టి బౌలర్లు కూడా అందుకు తగ్గట్లుగానే శిక్షణలో ఎక్కువగా రైట్ హ్యాండ్ బ్యాటర్లకే బౌల్ చేస్తూ ఉంటారు. కాబట్టి లెఫ్టాండర్లు బరిలో ఉన్నపుడు వారి లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ క్రీజులో లెఫ్ట్- రైట్ బ్యాటర్లు జోడీగా ఉన్నారంటే బౌలర్లకు వారిని విడదీయడం మరింత కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఇద్దరూ దంచికొడుతున్నారంటే.. బౌలర్ల రిథమ్ దెబ్బ తింటుంది. ఫీల్డింగ్‌లోనూ మార్పులు చేయడం బౌలింగ్ చేస్తున్న కెప్టెన్‌కు తలనొప్పిగా మారుతుంది. తరచూ ఫీల్డర్లను మార్చడం కూడా మైనస్‌గా మారుతుంది.డేటా ఏం చెబుతోంది?తమ రైట్ హ్యాండ్ కౌంటర్పార్ట్స్ కంటే లెఫ్టాండర్లు మూడు ఫార్మాట్లలోనూ రాణించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. టెస్టు క్రికెట్లో లెఫ్టాండర్లు విండీస్ లెజెండ్ బ్రియన్ లారా, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర వేల కొద్దీ పరుగులు రాబట్టారు. సంగక్కర టెస్టుల్లో 12,400 పరుగులు సాధిస్తే.. లారా 11,953 పరుగులు స్కోరు చేశాడు.ఇక వన్డేల్లో సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు కనబరిచారు. గంగూలీ 311 వన్డేల్లో 11363 పరుగులు స్కోరు చేస్తే.. 167 వన్డేలు ఆడి 6793 రన్స్ రాబట్టాడు.అదే విధంగా టీ20 ఫార్మాట్లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించగా.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ స్వరూపాన్ని మలుపు తిప్పగలరు!లెఫ్టాండ్ బ్యాటర్లు ఆఫ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. స్పిన్నర్ల బౌలింగ్‌లో వీరికి షాట్ సెలక్షన్ సులభంగా ఉంటుంది.పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనూ వీరి సంప్రదాయ విరుద్ధ బ్యాటింగ్ కారణంగా ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లను మార్పు చేసే క్రమంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక సమయాల్లో వ్యూహాలు మార్చుకోవాల్సి రావడం విజయావకాశాలను దెబ్బ తీస్తుంది.సైకలాజికల్ ఎడ్జ్కుడిచేతి వాటం బౌలర్లు లెఫ్టాండర్ బ్యాటర్లను ఎదుర్కొనేటపుడు సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రతిసారి లైన్ అండ్ లెంగ్త్ మార్చడం వారికి కఠినతరంగా మారుతుంది. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లను తరచూ మార్చాల్సి రావడం వల్ల బ్యాటర్లకు పరుగులు స్కోరు చేసే అవకాశాలు పెరుగుతాయి.లెజెండరీ లెఫ్టాండ్ బ్యాటర్లుబ్రియన్ లారా టెస్టుల్లో క్వాడ్రపుల్ (400*) సెంచరీ చేసి ఇప్పటికీ తన పేరిటే ఆ రికార్డును పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ వన్డే, టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. ఇక క్రిస్ గేల్, యువరాజ్ సింగ్‌ల గురించి త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా లెఫ్టాండ్ బ్యాటరే. ఇప్పటికే యూత్ వన్డే, యూత్ టెస్టులలో వైభవ్ ఇరగదీస్తున్నాడు.భారత ప్రస్తుత టీ20 జట్టులో ఎనిమిది మందిఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రస్తుత భారత టీ20 జట్టులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉన్నారు. టాపార్డర్‌లో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో తిలక్‌వర్మ అందుబాటులో ఉన్నారు. వీరిద్దరు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలరు. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబేతో పాటు నయా ఫినిషర్ రింకూ సింగ్ కూడా లెఫ్టాండరే. వీరితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా ఎడమచేతి వాటం గల ప్లేయర్లే. స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్, పేసర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్ లెఫ్టాండర్ల జాబితాలో ఉన్నారు.చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య
- 
      
                   
                                                       ఆసీస్‌తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే..?ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 29) తొలి టీ20 జరుగనుంది. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్‌నైనా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటివరకు ఆడిన 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు గెలుపొందింది. ఆసీస్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది. చివరిగా ఇరు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్‌ల్లో భారత్ ఏకంగా 5 సార్లు విజయాలు సాధించింది. 2024 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది.అంతకుముందు స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత యువ జట్టు ఇదే ఫామ్‌ను రేపటి నుంచి ప్రారంభం కాబోయే సిరీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తుంది. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉండటంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి.విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ విశేషంగా రాణిస్తున్నాడు. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ ఆకట్టుకుంటున్నాడు. సంజూ శాంసన్ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ నుంచి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నాయి. శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా సత్తా చాటుతున్నారు. వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ కొనసాగుతుంది. బుమ్రా, అర్షదీప్ సింగ్ రాణిస్తున్నారు. గంభీర సహకారంతో నెట్టుకొస్తున్న హర్షిత్ రాణా పర్వాలేదనిపిస్తున్నాడు. టీమిండియాను ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. స్కై బ్యాటింగ్‌లో రాణించి చాలాకాలమైంది. ఈ ఆసీస్ సిరీస్‌లో అయినా అతను సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా విఫలమవుతున్నా మేనేజ్మెంట్, కోచ్ స్కైకు అండగా ఉన్నారు. వ్యక్తిగంతా విఫలమవుతున్నా జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడన్న కారణం చేత అతనికి మద్దతు లభిస్తుంది. అయితే ఇది ఎంతో కాలం ఉండే అవకాశం లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో విఫలమైతే మాత్రం సెలెక్టర్లు ప్రత్యామ్నాం వైపు చూడవచ్చు.ఆస్ట్రేలియాతో తొలి టీ20లో భారత జట్టు (అంచనా)..అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
- 
      
                   
                                                       చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించాడు. భారత కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో తొలి విజయాన్ని విదేశాల్లో నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. భారత కెప్టెన్‌గా టీ20ల్లో తన తొలి విజయాన్ని (తాత్కాలిక కెప్టెన్‌గా) జింబాబ్వేలో నమోదు చేసిన గిల్.. టెస్ట్‌ల్లో తొలి విజయాన్ని ఇంగ్లండ్‌లో, వన్డేల్లో తొలి విజయాన్ని ఆస్ట్రేలియా గడ్డపై సాధించాడు.తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విజయం అనంతరం గిల్ ఖాతాలో ఈ అల్టిమేట్ రికార్డు చేరింది. ఈ మ్యాచ్ గెలవడంతో భారత్ క్లీన్ స్వీప్ పరాభవాన్ని కూడా తప్పించుకుంది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన ఆతిథ్య ఆసీస్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన శతకంతో భారత్‌ను గెలిపించాడు. అతనికి విరాట్ కోహ్లి సహకరించాడు.కోహ్లి సరసనఇదే సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తొలి వన్డేతో ఈ ఫార్మాట్లో కెప్టెన్సీ అరంగేట్రం చేసిన గిల్.. ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్ ఓడిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సరసన చేరాడు. గిల్ టీ20 కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడాడు. టెస్ట్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం ఎదుర్కొన్నాడు. తాజాగా వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భంగపడ్డాడు.మొత్తంగా గిల్‌కు భారత కెప్టెన్‌గా మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. తాత్కాలిక కెప్టెన్‌గా టీ20ల్లో తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. జింబాబ్వేతో జరిగిన ఆ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.టెస్ట్‌ల్లో భారత కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని, 5 మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్నాడు.తాజాగా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించినప్పటికీ.. గెలుపుతో ముగించి వైట్‌వాష్ పరాభవం నుంచి తప్పించుకున్నాడు.గిల్.. రేపటి నుంచి (అక్టోబర్ 29) సాధారణ ఆటగాడిగా ఆస్ట్రేలియాతో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మ్యాచ్ కాన్బెర్రా వేదికగా భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది.చదవండి: మరోసారి 'మరో ఛాన్స్' అంటున్న కరుణ్ నాయర్..!
- 
      
                   
                                                       స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్యభారత వన్డే క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి (Shreyas Iyer Health Update)పై టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ కీలక అప్డేట్ అందించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందంటూ అభిమానులకు శుభవార్త చెప్పాడు. వైద్యులు నిరంతరం శ్రేయస్‌ను కనిపెట్టుకుని ఉండి.. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారని సూర్య తెలిపాడు.కాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా (Harshit Rana) బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను సంచలన రీతిలో అందుకున్న ఈ ముంబై బ్యాటర్.. వెంటనే కిందపడిపోయాడు. పొట్ట పట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి అతడిని డ్రెసింగ్‌రూమ్‌కు తీసుకువెళ్లాడు.స్పృహ తప్పి పడిపోయాడుఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో వెంటనే సిడ్నీలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లగానే స్పృహ తప్పి పడిపోయాడు.ప్రాణాంతకమైన గాయమేఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఫిజియో, టీమ్ డాక్టర్ వెంటనే స్పందించి పరిస్థితి చేయి దాటకుండా చూసుకున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ప్రాణాంతకమైన గాయమే అది. శ్రేయస్ పట్టుదల గల ఆటగాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు’’ అని పేర్కొన్నాయి.ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు శ్రేయస్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘శ్రేయస్ గాయపడ్డాడని తెలిసిన వెంటనే నేను అతడికి కాల్ చేశాను.నేను అయ్యర్‌తో మాట్లాడుతున్నాఅయితే, అప్పుడు తన ఫోన్ తన దగ్గర లేదని తెలిసింది. వెంటనే ఫిజియో కమలేశ్ జైన్‌కు ఫోన్ చేశా. పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా. ఇక గత రెండురోజులుగా నేను అయ్యర్‌తో మాట్లాడుతున్నా. దీనర్థం.. అతడు బాగానే ఉన్నట్లు కదా!అవును.. శ్రేయస్ పరిస్థితి మెరుగుపడుతోంది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరికొన్న రోజుల పాటు అయ్యర్ వారి పర్యవేక్షణలోనే ఉండనున్నాడు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది’’ అంటూ శ్రేయస్ గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు సూర్య ఊరట కలిగించాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా వన్డే సిరీస్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో మార్ష్ బృందం.. గిల్ సేనను 2-1తో ఓడించి సిరీస్ గెలుచుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం (అక్టోబరు 29) నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. నవంబరు 8న ఐదో టీ20తో సిరీస్ ముగుస్తుంది.చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం
- 
      
                   
                                                       అదొక్కటే జీవితం కాదు.. గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..: రోహిత్ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు తన ఇష్ట్రపకారం తనకు నచ్చిన రీతిలో సన్నద్ధమయ్యాయని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. అదే ఇప్పుడు ఫలితాన్ని చూపించిందని హర్షం వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ సాధించడంతో పాటు రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ప్రొఫెషనల్ ఆటగాడిగా క్రికెట్ కెరీర్ కోసం సాధన చేయడం సహజమని... అయితే ఆట బయట కూడా మరో ప్రపంచం ఉందని భావించి ప్రాధాన్యతలు తెలుసుకోవాలని అతడు చెప్పాడు.క్రికెట్ ఒక్కటే జీవితం కాదు‘క్రికెటర్‌గా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక సిరీస్ కోసం 4–5 నెలల సన్నద్ధం అయ్యే అవకాశం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి ఈ సారి ఆ సమయాన్ని బాగా వాడుకున్నాను. నాకు నచ్చిన రీతిలో, నా ఇష్ట్రపకారం సాధన చేయాలని నిర్ణయించుకున్నా. అది బాగా పని చేసింది. మిగిలిన కెరీర్ కోసం ఏం చేయాలో అర్థమైంది కూడా.భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా భిన్నమైన పరిస్థితులు ఉన్నా చాలా సార్లు రావడంతో వాటిపై అవగాహన ఉంది. ఒక్కసారి లయ అందుకుంటే చాలని భావించా. నా కోసం ఎక్కువ సమయం కేటాయించా. జీవితంలో క్రికెట్ కాకుండా ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయని తెలుసుకున్నా’ అని రోహిత్ వెల్లడించాడు.కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యంఆస్ట్రేలియా గడ్డపై ఆడతాన్ని తాను చాలా ఇష్టపడతానని, ఇక్కడి అభిమానులు కూడా ఎంతో మద్దతునిస్తారని రోహిత్ పేర్కొన్నాడు వివరించాడు. ‘సిడ్నీ వన్డేలో నేను భారీ స్కోరు చేయడంతో పాటు జట్టును గెలిపించడం సంతృప్తినిచ్చింది. చాలా కాలం తర్వాత కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. మేం సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పి చాలా రోజులైంది. జట్టుకు ఇది ఉపయోగపడటం సంతోషకరం.గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..గిల్ తొందరగా అవుట్ కావడంతో శ్రేయస్ గాయం కారణంగా మాపై బాధ్యత పెరిగింది. నేను, విరాట్ ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం. ఇద్దరికీ అనుభవం ఉంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలం. అందుకే క్రీజ్‌లో ఎంతో మాట్లాడుకుంటూ ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాం. సిరీస్ గెలవకపోయినా అభిమానులు ఎంతో మద్దతునిచ్చారు. జట్టుతో సంబంధం లేకుండా మంచి ఆటను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు’ అని రోహిత్ వెల్లడించాడు.మూడో వన్డేలో గెలిచికాగా ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఆతిథ్య జట్టు తొలి రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా.. టీమిండియా నామమాత్రపు మూడో వన్డేలో గెలిచి పరువు నిలుపుకొంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 121, కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో గెలిపించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌కు ముందే రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తప్పించి.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను సారథిగా నియమించింది బీసీసీఐ. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్
- 
      
                   
                                                       World Cup 2025: ఆసీస్‌తో సెమీ ఫైనల్.. భారత జట్టులో కీలక మార్పుఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI WC)లో సెమీ ఫైనల్ చేరిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ (Pratika Rawal) గాయం వల్ల జట్టుకు దూరమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.ప్రతికా రావల్ స్థానంలో అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ జట్టులోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. ఇంతకీ ఎవరా ప్లేయర్ అంటే?!...కుడికాలి చీలమండకు గాయంసొంతగడ్డపై న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్ సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటి గెలుపొందాలని భావించింది. అయితే, నవీ ముంబై వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసి పోయింది.వాన వల్ల 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అయితే, ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రతికా రావల్ కుడికాలి చీలమండకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె మైదానం వీడింది. ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌కు రాలేదు.మంధానకు జోడీగా అమన్‌జోత్ కౌర్ ప్రతికా రావల్ స్థానంలో స్మృతి మంధాన (34 నాటౌట్)కు ఓపెనింగ్ జోడీగా అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) వచ్చింది. అయితే, వర్షం ఎక్కువ కావడంతో 8.4 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి హర్మన్ సేన వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.కాగా ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. గువాహటిలో అక్టోబరు 29న తొలి సెమీస్ మ్యాచ్ జరుగనుండగా.. ఇందులో ఇంగ్లండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. మరోవైపు.. భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ (అక్టోబరు 30) జరుగనుండగా.. ఇందుకు నవీ ముంబై వేదిక.లేడీ సెహ్వాగ్ వచ్చేసిందిఅయితే, పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో కీలక సెమీస్‌కు ముందు ఇన్ఫామ్ బ్యాటర్ ప్రతికా సేవలను భారత్ కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’గా పేరొందిన షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది.కాగా సెమీస్ మ్యాచ్‌లో జట్టు మార్పు నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈవెంట్ టెక్నికల్ కమిటీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఇక భారత జట్టు ఓపెనర్‌గా కొంతకాలం వెలుగొందిన షఫాలీ వర్మ.. తర్వాత ఫామ్‌లేమితో సతమతమైంది.527 పరుగులు సాధించి..అదే సమయంలో ప్రతికా రావల్ రావడం.. నిలకడగా ఆడటంతో జట్టులో షఫాలీ స్థానం గల్లంతైంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. కాగా షఫాలీ చివరగా 2024, అక్టోబరులో భారత్ తరఫున వన్డే ఆడింది.ఇక గతేడాది హర్యానా తరఫున దేశీ వన్డే క్రికెట్లో షఫాలీ మెరుగ్గా రాణించింది. 75.28 సగటుతో 527 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ప్రతికా రావల్.. 23 ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకుంది.తద్వారా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. మంధానతో కలిసి 23 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ వికెట్‌కు ప్రతికా ఏకంగా 1799 పరుగులు జతచేసి రికార్డు సృష్టించడం గమనార్హం. ఏదేమైనా చాంపియన్ జట్టు ఆసీస్‌తో పోరులో ప్రతికా లేని లోటు స్పష్టంగా తెలుస్తుందనడంలో సందేహం లేదు. కాగా సారథిగా షఫాలీ భారత్‌కు అండర్-19 ప్రపంచకప్-2023 అందించిన విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్
- 
      
                   
                                                       ఫెయిల్ అయితే ఏంటి?!.. నాకైతే అలాంటి భయాలు లేవు: గంభీర్టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1 (Ind Loss ODI Series To Aus)తో ఓడిపోయింది. ఫలితంగా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది.ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో మాత్రం అంత గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా టీమిండియాతో ఆడిన 32 మ్యాచ్‌లలో కంగారూ జట్టు కేవలం 11 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనం.బ్యాటింగ్ పరంగా విఫలంముఖాముఖి రికార్డు పరంగా భారత్ పటిష్ట స్థితిలోనే ఉన్నా సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేము. మరోవైపు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. బ్యాటింగ్ పరంగా విఫలం కావడం కలవరపెట్టే అంశం.గతేడాది జూలైలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్య.. 20 మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండే హాఫ్ సెంచరీలు బాదాడు. సగటు 18 కంటే తక్కువ. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇంకా కేవలం మూడు నెలల సమయమే ఉన్న వేళ సూర్య ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. 72 పరుగులేఇటీవల కెప్టెన్‌గా ఆసియా టీ20 కప్-2025 టైటిల్ గెలిచిన సూర్య.. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 72 పరుగులే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై విమర్శలు వస్తుండగా.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.ఎలాంటి భయాలు లేవుఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘సూర్య బ్యాటింగ్ ఫామ్ నన్ను ఏమాత్రం ఆందోళనకు గురిచేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి భయాలు లేవు. అల్ట్రా- అగ్రెసివ్‌గా ఆడాలని డ్రెసింగ్‌రూమ్‌లో నిర్ణయించుకున్నాం. దూకుడుగా ఆడటమే మాకు ఇష్టం.ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకున్నపుడు వైఫల్యాలను కూడా ఆమోదించగలగాలి. ఇలాంటి అప్రోచ్ కారణంగా ఒక్కోసారి విఫలమైనా సరే.. మేము దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని గంభీర్ తెలిపాడు.ఒక్కసారి లయ అందుకుంటేఇక టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు ఆసియా కప్ టోర్నీలో సూపర్ ఫామ్ కనబరిచాడు. ఏదేమైనా సూర్య ఒక్కసారి లయ అందుకుంటే బాధ్యత తన భుజం మీదు వేసుకోవడానికి ఏమాత్రం సందేహించడు.టీ20 క్రికెట్లో మేము వ్యక్తిగత పరుగుల కంటే కూడా మా క్రికెట్ బ్రాండ్‌పైనే ఎక్కువగా దృష్టి పెడతాం. దూకుడైన శైలితోనే ముందుకు సాగుతాం. బ్యాటర్లు తరచూ వ్యక్తిగతంగా విఫలమైనా.. జట్టు రాణిస్తే అది పెద్దగా లెక్కలోకి రాదు’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లోనూ తమ దూకుడు కొనసాగుతుందంటూ ఆస్ట్రేలియా జట్టుకు గౌతీ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా అక్టోబరు 29- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్
- 
      
                   
                                                       అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఆసీస్‌తో మూడో వన్డేలో దుమ్ములేపారు.168 పరుగులు భాగస్వామ్యంఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం (125 బంతుల్లో 121*)తో చెలరేగగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి 74 పరుగులతో చెలరేగి.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ వెటరన్ బ్యాటర్లు తమ వింటేజ్ ఇన్నింగ్స్‌ను గుర్తుచేస్తూ.. ఏకంగా 168 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.తప్పిన గండంమరోవైపు.. అంతకు ముందు కెప్టెన్, ఓపెనర్ గిల్ (24)తో కలిసి రోహిత్ 69 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. తద్వారా సిడ్నీ వన్డేలో గెలుపొంది ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది.మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి పరువు కాపాడుకుంది. మరోవైపు.. ఆఖరిదైన ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణా తన కెరీర్లో తొలిసారి నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసి.. ఆసీస్‌ను 236 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.రోహిత్- గిల్ సూపర్ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్‌కోచ్ గౌతం గంభీర్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘శుబ్‌మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది.ఆ తర్వాత రోహిత్-విరాట్ పార్ట్నర్షిప్ అత్యద్భుతం. ముఖ్యంగా రోహిత్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అతడి ఆట తీరు అమోఘం. మ్యాచ్‌ను ముగించిన తీరు ప్రశంసనీయం. రోహిత్‌తో పాటు విరాట్ పని పూర్తి చేశాడు’’ అని గంభీర్ కొనియాడాడు.అహంకారం వద్దుఅంతకుముందు.. ‘‘బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. హర్షిత్ అవుట్‌స్టాండింగ్ స్పెల్ వేశాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒద్దికగా.. ఒదిగి ఉండాలి. మరింత కష్టపడాలి. అహంకారం వద్దు’’ అని గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ రాణాకు సూచించాడు. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్ టూర్లో కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే గిల్ విఫలమయ్యాడు.మూడు వన్డేల్లో గిల్ చేసిన స్కోర్లు వరుసగా.. 10, 9, 24. ఇక కెప్టెన్‌గానూ సిరీస్‌ను ఆసీస్‌కు 1-2తో కోల్పోయాడు. మరోవైపు.. రోహిత్ శర్మ 8, 73, 121* పరుగులతో రాణించి మూడో వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)
- 
      
                   
                                                       Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్ ప్రస్తుతం ఇంటెన్సిక్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు.గాయం మూలంగా శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు సిడ్నీ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. టీమిండియా డాక్టర్ కూడా సిడ్నీలోనే ఉండి.. స్థానిక వైద్యులతో కలిసి ఎప్పటికప్పుడు శ్రేయస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.వేగంగా కోలుకుంటున్నాడు!ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. క్యాచ్ అందుకునే క్రమంలో అతడి పక్కటెముకల్లో (ఎడమ) గాయం అయిందని.. స్ల్పీన్ (ప్లీహం) ఇంజూరీ అయిందని తెలిపింది. ప్రస్తుతం శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!దీంతో, శ్రేయస్ అయ్యర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజా సమాచారం మాత్రం వారిని మరోసారి ఆందోళనలోకి నెట్టింది. ఈ టీమిండియా స్టార్ కుటుంబ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. శ్రేయస్ గాయం తీవ్రత దృష్ట్యా అతడి తల్లిదండ్రులు వెంటనే సిడ్నీకి పయనం కానున్నట్లు తెలిపాయి. ఇందుకోసం అర్జెంట్ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించాయి. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే వీసా మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు శ్రేయస్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి.అభిమానుల్లో సందేహాలుఈ నేపథ్యంలో మరోసారి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో శనివారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయగా.. 34వ ఓవర్లో హర్షిత్ రాణా బంతితో రంగంలోకి దిగాడు.అప్పటికి క్రీజులో ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ మిడాఫ్/ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ డైవ్ కొట్టి మరీ సంచలన క్యాచ్ అందుకున్నాడు.Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఐసీయూలో ఉంచి చికిత్సఈ క్రమంలో శ్రేయస్ గాయపడ్డాడు. ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు, ఫిజియో వచ్చి పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ కోసం సిడ్నీలోని ఆస్పత్రికి పంపగా అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఏడు రోజుల పాటు అయ్యర్‌ను ఐసీయూలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.కాగా చాన్నాళ్ల క్రితమే టీమిండియా టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు ఆసీస్ టూర్ సందర్భంగా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. కానీ ఈ గాయం కారణంగా అతడు చాన్నాళ్లపాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితుల తలెత్తాయి. ఇక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తద్వారా క్లీన్‌స్వీప్ గండం నుంచి గట్టెక్కింది.Update: Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు! చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ
- 
      
                   
                                                       పక్కటెముకల్లో రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయస్ అయ్యర్భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు రిబ్ కేజ్‌పై పడిపోయాడు. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్‌కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్‌ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. శ్రేయస్‌కు స్ప్లీన్‌లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్.. సిడ్నీ, భారత్‌లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్ శ్రేయస్‌తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.తాజాగా గాయం కారణంగా శ్రేయస్ త్వరలో (నవంబర్ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రేయస్ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చదవండి: భారత్‌తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు
- 
      
                   
                                                       భారత్‌తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పుటీమిండియాతో తొలి టీ20కి ముందు (India vs Australia) ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు జరిగింది. వారి స్టార్ స్పిన్నర్, టీ20 లీడింగ్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా (Adam Zampa) వ్యక్తిగత కారణాల చేత (రెండోసారి తండ్రి కాబోతున్నాడు) తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. జంపా స్థానాన్ని మరో స్పిన్నర్ తన్వీర్ సంఘా (Tanveer Sangha) భర్తీ చేయనున్నాడు. సంఘా రెండేళ్ల తర్వాత టీ20 ఆడనున్నాడు. అతని చివరి మ్యాచ్ భారత్‌తోనే ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి రింకూ సింగ్ వికెట్ తీశాడు. సంఘా ఆస్ట్రేలియా తరఫున 4 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. సంఘా జంపా స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడో లేదో చూడాలి. ఆసీస్‌కు ఇప్పటికే మాథ్యూ కుహ్నేమన్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉంది.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్బెర్రా వేదికగా ఈ నెల 29న తొలి టీ20 జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లకు ఓ జట్టు.. మూడో టీ20కి ఓ జట్టు.. చివరి రెండు మ్యాచ్‌లకు మరో జట్టును ప్రకటించారు.తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మాథ్యూ కుహ్నేమన్, తన్వీర్ సంఘా (ఆడమ్ జంపా స్థానంలో తొలి టీ20కు మాత్రమే)మూడో టీ20కి ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లీ బియర్డ్‌మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాచివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లీ బియర్డ్‌మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాభారత్ టీ20 జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాటీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ
- 
      
                   
                                                       IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్‌తో ఆడిన 32 మ్యాచ్‌ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది.ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్‌లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.తొలి పంజా మనదేభారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్‌పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్‌లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్బోర్న్లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్‌లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.గంభీర్ మరోసారి..!2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. యువీ విధ్వంసం2013 అక్టోబర్‌లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.చెలరేగిన కోహ్లి.. వైట్వాష్మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో వైట్‌వాష్ చేసింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.రాణించిన శిఖర్అనంతరం 2017 అక్టోబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్ (భారత్), 2018 నవంబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.తొలి పరాభవం2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.హ్యాట్రిక్ విక్టరీస్ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్‌లో), 2023 (భారత్‌లో) సిరీస్‌ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్‌లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్‌లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం2023లో జరిగిన సిరీస్‌లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్‌ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!
- 
      
                   
                                                       టీమిండియాకు బిగ్ షాక్మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్ 26) బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా ఇన్ ఫామ్ ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.ప్రస్తుతానికి ప్రతిక గాయంపై ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొలింది. ప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్మృతి మంధనతో సహా విధ్వంసకర శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రతిక మంధనతో కలిసి భారత్‌కు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.అలాంటి ప్రతిక ఆసీస్‌తో జరుగబోయే డూ ఆర్ డై సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైతే, టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.మ్యాచ్ రద్దునవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల స్వల్ప స్కోర్‌కు పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక తీవ్రంగా గాయపడింది.విలవిలాడిపోయిన ప్రతికమైదానం చిత్తడిగా ఉండటంతో రన్నింగ్ చేసే సమయంలో ప్రతిక కుడి కాలి మడమ మడతపడింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆతర్వాత ఆమె తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్‌జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.ఛేదనలో అమన్‌జోత్, మంధన 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.రికార్డుల ప్రతికప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో చేసిన సెంచరీ ఆమెకు ప్రపంచకప్ టోర్నీలో మొదటిది. ఈ మ్యాచ్‌లో ఆమె మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అలాగే మంధన తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.ప్రతిక దూరమైతే..?ప్రతిక ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోనుంది. ప్రతిక స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్‌లలో లేని ప్లేయర్‌ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిక పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది.టీమిండియాకు మరో సమస్యప్రతిక గాయానికి ముందే టీమిండియా మరో సమస్య ఉండింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ గాయపడింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. సెమీస్ మ్యాచ్‌కు రిచా అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. గాయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్‌లో పటిష్టమైన ఆసీస్‌ను ఏమేరకు నిలువరించగలదో చూడాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్
- 
      
                   
                                                       రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్వైట్బాల్ క్రికెట్లో టీమిండియా ముఖ చిత్రంగా నిలిచిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. మరోసారి తన మార్క్‌ను చూపించాడు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు.తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికి ఆ తర్వాత రెండు వన్డేల్లో సత్తాచాటాడు. అడిలైడ్‌లో 73 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. 38 ఏళ్ల వయసులోనూ అతని ఆట తీరు, షాట్ సెలెక్షన్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేశాయి.చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రోహిత్.. తన అద్బుత సెంచరీతో అభిమానులకు మరుపురాని ఇన్నింగ్స్‌ను అందించాడు. 237 పరగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఆసీస్ టూర్ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఉహగానాలకు తన సెంచరీతోనే హిట్‌మ్యాన్ తెరదించాడు. వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము అని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు. ఇక రోహిత్ భవిష్యత్తు ప్రణాళికలపై అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిట్‌మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడని లాడ్ కూడా స్పష్టం చేశారు."రోహిత్లో ఇంకా పరుగుల దాహం తీరలేదు. అతడు ఈ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్ చేసిన విధానం, భారత జట్టును గెలిపించిన తీరు నిజంగా అద్భుతం. రోహిత్ తను ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడి ఆ తర్వాత రిటైర్ అవుతాడని" లాడ్ పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ తన కెరీర్లో టీ20 వరల్డ్‌కప్, ఆసియాకప్, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకున్నప్పటికి.. వన్డే వరల్డ్‌కప్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రోహిత్ భాగంగా లేడు. ఆ తర్వాత 2015, 2019, 2023 ప్రపంచకప్‌లలోనూ అతడికి నిరాశే ఎదురైంది. దీంతో మరో రెండేళ్లలో జరిగే వరల్డ్‌కప్‌ను గెలుకుని తన కెరీర్‌కు ముగింపు పలకాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు.చదవండి: ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ..
- 
      
                   
                                                       రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాసిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతక్కొట్టాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లను హిట్‌మ్యాన్ ఉతికారేశాడు. మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లితో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు.రోహిత్ ఓవరాల్‌గా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కోహ్లి (74నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా టీమిండియా లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, సిరీస్‌గా నిలిచిన రోహిత్ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఇవే..👉సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన విదేశీ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 95 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్(92) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో 3 సిక్స్‌లు బాదిన రోహిత్.. గేల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతి పెద్ద వయష్కుడిగా రోహిత్ నిలిచాడు.38 ఏళ్ల 178 రోజులు వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(37 సంవత్సరాలు, 132 రోజులు) పేరిట ఉండేది.👉వన్డే చరిత్రలో లేటు వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు👉ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన విదేశీ బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి (5), కుమార సంగక్కర (5)లను హిట్‌మ్యాన్ అధిగమించాడు. 👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు.చదవండి: థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్
- 
      
                   
                                                       థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశారు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రో-కో ద్వయం.. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.ఈ సీనియర్ క్రికెటర్లు మరో రెండేళ్ల పాటు జట్టులో కొనసాగే అవకాశమున్నప్పటికి టీమిండియా మాత్రం ఇప్పటిలో వైట్ బాల్ సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లదు. మళ్లీ భారత జట్టు 2028లో ఆసీస్ టూర్‌కు వెళ్లే అవకాశముంది.అప్పటికి కోహ్లి-రోహిత్‌ల వయస్సు 40 ఏళ్లు దాటుతుందున్నందన భారత జట్టులో కొనసాగే ఛాన్స్ లేదు. దీంతో శనివారం సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేనే కోహ్లి-రోహిత్‌కు ఆసీస్ గడ్డపై ఆఖరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు.రోహిత్ శర్మ(121) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే క్రికెట్లో ఈ సీనియర్ జోడీకి 12వ 150 ప్లస్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియాలో జ్ఞాపకాలను రో-కో గుర్తు చేసుకున్నారు."నేను ఆస్ట్రేలియాలో ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాను. 2008 నుంచి ఇక్కడ ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు మాకు మరొక అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆడిన ప్రతీ క్షణాన్ని అస్వాధించాము. ఇక్కడ మాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు": రోహిత్"ఆస్ట్రేలియాలో ఆడేందుకు మేము ఎంతో ఇష్టపడతాము. ఈ గడ్డపై మా నుంచి ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. ఇక్కడ అభిమానులు మద్దతు నిజంగా ఒక అద్భుతం. అందరికీ చాలా థాంక్స్: విరాట్ కోహ్లిచదవండి: IND vs AUS: తీవ్ర గాయం! అస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన
- 
      
                   
                                                       తీవ్ర గాయం! ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటనఅడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి అయ్యర్ ఎడమ పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో అడడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఏ మాత్రం నొప్పి తగ్గలేదు.దీంతో అతడు మైదానాన్ని వీడి వెళ్లాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అయ్యర్ తిరిగి ఫీల్డ్‌లోకి రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టార్గెట్‌ను పూర్తి చేయడంతో శ్రేయస్‌కు బ్యాటింగ్‌కు ఛాన్స్ రాలేదు. ఒకవేళ అతడి వరకు బ్యాటింగ్‌కు వచ్చినా కూడా డ్రెస్సింగ్ రూమ్ పరిమితమయ్యేవాడు. తాజాగా శ్రేయస్ గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.అయ్యర్ గాయంపై బీసీసీఐ అప్డేట్"ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకకు గాయమైంది. అతడి గాయం తీవ్రత తెలుసుకోనేందుకు ఆస్ప్రత్రికి తరలించారు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అయ్యర్ గాయం తీవ్రమైనది కాకుడదని అభిమానులు కోరుకుంటున్నారు.అతడు భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇటీవలే వైస్ కెప్టెన్‌గా కూడా ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత మిడిలార్డర్లో అయ్యర్ ముఖ్యమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అడిలైడ్ వన్డేలో కూడా శ్రేయాస్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సమయానికి అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. వచ్చే నెల ఆఖరిలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఆఖరి వన్డే విషయానికి వస్తే.. ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో చేధించింది. భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) ఆర్ధ శతకంతో సత్తాచాటాడు.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
- 
      
                   
                                                       రోహిత్ ఉంటే చాలు చెలరేగిపోతా.. ఛేజింగ్ అంటే నాకు ఇష్టం: కోహ్లిసింహం ఒక అడుగు వెనక్కి వేస్తే పదడుగులు ముందుకు వేస్తుంది.. ఈ డైలాగ్ సరిగ్గా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సరిపోతుంది. దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లి.. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.అ తర్వాత రెండో మ్యాచ్‌లో కూడా మళ్లీ డకౌట్. దీంతో కోహ్లిపై సర్వాత్ర విమర్శల కురిసింది. కోహ్లి రిటైర్ అయపోతాడని, ఇక లండన్‌కు బ్యాగ్ సర్ధుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ కోహ్లి అభిమానులు మాత్రం తమ ఆరాధ్య క్రికెటర్‌గా బలంగా తిరిగొస్తాడని నమ్మారు.వారి నమ్మకాన్ని కోహ్లి నిలబెట్టాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ విశ్వరూపం చూపించాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 81 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో సచిన్, సంగక్కరల వరల్డ్ రికార్డులను కింగ్ బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2027కు తను సిద్దమనేని ఈ నాక్‌తో కోహ్లి చాటి చెప్పాడు. ఇక తన ఇన్నింగ్స్‌పై మ్యాచ్ అనంతరం కోహ్లి స్పందించాడు."అదృష్టవశాత్తూ డకౌట్ల నుంచి బయటపడగలిగాను. అంతర్జాతీయ క్రికెట్లో చాలా కాలం ఆడినా.. ప్రతీ మ్యాచ్ కూడా మనకు కఠిన సవాల్‌ను విసరుతోంది. కొన్నిసార్లు పూర్తిగా పరుగులు ఎలా సాధించాలో తెలియకపోయినట్లు అన్పిస్తోంది. ఈ జేంటల్మేన్ గేమ్ మనల్ని పరీక్షిస్తోంది. నా కెరీర్లో ఇటువంటి పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. ఈ కఠిన పరిస్థితులలే నాలోని ప్రతిభను వెలికితీశాయి. రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. రోహిత్ శర్మ క్రీజులో ఉంటే స్ట్రైక్స్ రొటేట్ చేయడం సులభమవుతుంది. అతడితో భాగస్వామ్యాన్ని అస్వాదించాను. ఛేజింగ్ ఎల్లప్పుడూ నాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తుంది. ఇద్దరం ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన జోడీగా మేము ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మ్యాచ్‌లలో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాము.2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే హోమ్ సిరీస్ నుంచి మా ఇద్దరి పార్టనర్ షిప్ మొదలైంది. ఆ మ్యాచ్‌లో దాదాపు 20 ఓవర్ల పాటు కలిసి బ్యాటింగ్ చేశాము. ఆస్ట్రేలియాలో మాకు లభించిన ఆదరణకు మేము రుణపడి ఉంటాము" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి-రోహిత్ ఇద్దరూ 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
- 
      
                   
                                                       శతక్కొట్టిన రోహిత్... కోహ్లి హాఫ్ సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (India Beat Australia) ఘన విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) అద్భుత ప్రదర్శనలతో రాణించి జట్టుకు విజయం అందించారు. రోహిత్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్, అడిలైడ్ వన్డేల్లో ఓడిన టీమిండియా.. సిడ్నీ వేదికగా శనివారం మూడో వన్డే ఆడింది. ఇందులో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 236 పరుగులకు ఆసీస్ ఆలౌట్ ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించగా.. మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23) ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేశారు.తొలి ఫోర్ వికెట్ హాల్అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా తన కెరీర్లో తొలి వన్డే హాఫ్ సెంచరీ (56)తో సత్తా చాటాడు. తద్వారా ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి.. తన కెరీర్లో తొలి ఫోర్ వికెట్ హాల్ నమోదు చేశాడు.CLUTCH! ⭐⭐⭐⭐#HarshitRana bags his maiden 4-wicket haul in international cricket as #TeamIndia bowl out Australia in Sydney 👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/JXFhwCDgzX— Star Sports (@StarSportsIndia) October 25, 2025మిగిలిన వారిలో పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్, విరాట్ ధనాధన్‌ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (26 బంతుల్లో 24) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ 105 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు.Hitman has RO-ared with all class in Sydney! 💯👉 His 33rd ODI century, 50th across formats👉 9 - Joint-most 100s in ODIs against AUS👉 6- Most 100s by a visiting batter in ODIs in AUS#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/r5AtoC6u1i— Star Sports (@StarSportsIndia) October 25, 2025 కాగా రోహిత్ వన్డే కెరీర్లో ఇది 33వ శతకం కావడం విశేషం. మరోవైపు.. పెర్త్, అడిలైడ్ వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. ఈసారి మాత్రం తనదైన ముద్ర వేయడంలో సఫలం అయ్యాడు. వన్డే కెరీర్లో 75వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. ఫోర్ బాది రోహిత్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.Hence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌👉 Virat Kohli's 75th ODI fifty👉 His 70th 50+ score in ODI run chases - most by any batter👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఇక ఈ మ్యాచ్‌లో సత్తా చాటిన రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. పెర్త్‌లో ఎనిమిది పరుగులే చేసిన రోహిత్.. అడిలైడ్‌లో మాత్రం 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా సెంచరీతో చెలరేగి మరోసారి తన విలువను చాటుకున్నాడు. ఏదేమైనా సిడ్నీ వన్డేతో తాము వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని రో- కో చెప్పారంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.చదవండి: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత స్థానం ‘కింగ్’దే! INDIA WINNNNNN! 🇮🇳The crowd came to witness something special in Sydney and Ro-Ko didn’t disappoint! 🫂If this was their last match in Australia, what a way to leave a legacy behind! 💙 pic.twitter.com/3MR2KxQBxh— Star Sports (@StarSportsIndia) October 25, 2025
- 
      
                   
                                                       అత్యధిక పరుగుల వీరుడు.. సచిన్ తర్వాత స్థానం కోహ్లిదే!అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat Kohli) తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా.. కుమార్ సంగక్కరను అధిగమించి కోహ్లి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఆటగాడిగానూ కోహ్లి నిలిచాడు.వరుసగా డకౌట్లుదాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ దిగ్గజ బ్యాటర్.. అడిలైడ్ వన్డేలోనూ ఇదే పునరావృతం చేశాడు. ఈ క్రమంలో భారీ అంచనాలు, ఒత్తిడి నడుమ సిడ్నీ వన్డే బరిలో దిగిన కోహ్లి వింటేజ్ కింగ్‌ను గుర్తు చేశాడు. నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా ఆ తర్వాత జోరు పెంచరీ అర్ధ శతకం సాధించాడు. వన్డే కెరీర్లో 75 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపుశతకధీరుడు ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సిడ్నీ వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకుంది.అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)- 452 ఇన్నింగ్స్‌లో 18426 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 293* ఇన్నింగ్స్‌లో 14235 పరుగులు🏏కుమార్ సంగక్కర (శ్రీలంక)- 380 ఇన్నింగ్స్‌లో 14234 పరుగులు🏏రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 365 ఇన్నింగ్స్‌లో 13704 పరుగులు🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 433 ఇన్నింగ్స్‌లో 13430 పరుగులుHence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌👉 Virat Kohli's 75th ODI fifty👉 His 70th 50+ score in ODI run chases - most by any batter👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025
- 
      
                   
                                                       సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ..టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగనమంలో సత్తాచాటుతున్నాడు. మొన్న అడిలైడ్‌లో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న హిట్‌మ్యాన్.. ఇప్పుడు సిడ్నీలో మాత్రం ఎటువంటి తప్పిదం చేయలేదు.ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్బుతమైన శతకంతో చెలరేగాడు. కేవలం 105 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్‌కు ఇది 33వ వన్డే సెంచరీ కావడం విశేషం. 237 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు. తొలుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్.. ఆ తర్వాత మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. రోహిత్ సెంచరీ మార్క్‌ను అందుకోగానే సిడ్నీ స్టేడియం దద్దరిల్లిపోయింది. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు విరాట్ కోహ్లి(74 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్‌ల ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో చేధించింది.చదవండి: #Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
- 
      
                   
                                                       మొన్న బ్యాటింగ్.. ఇప్పుడు బౌలింగ్! గంభీర్ నమ్మకం నిజమే?ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా ఇరగదీస్తున్నాడు. విమర్శకులకు తన అద్భుత ప్రదర్శనలతోనే సమాధానిమిస్తున్నాడు. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో హర్షిత్ సత్తాచాటాడు. 23 ఏళ్ల రాణా తన పేస్ బౌలింగ్‌తో కంగారులను కంగారెత్తించాడు.అతడి బౌలింగ్ దాటికి ఆసీస్ కేవలం 236 పరుగులకే పరిమితమైంది. మొత్తంగా 8.4 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ వంటి కీలక వికెట్లను ఈ ఢిల్లీ పేసర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో రాణాకు ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం.ఆసీస్ టూర్‌కు రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. గంభీర్ సపోర్ట్ వల్లే అతడిని జట్టులోకి తీసుకున్నారని అశ్విన్, కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం విమర్శించారు. అయితే విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే రాణాను సెలక్ట్ చేశామని, అతడిని టార్గెట్ చేయడం అపండి అంటూ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు.అయితే గంభీర్ నమ్మకాన్ని రాణా నిలబెట్టుకున్నాడు. తొలి వన్డేలో వికెట్ పడగొట్టనప్పటికి.. రెండో వన్డేలో 24 పరుగులతో పాటు 2 వికెట్లు సాధించాడు. ఇక మూడో వన్డేలో కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను కాదని మరి హర్షిత్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ ఆడించింది. మెనెజ్‌మెంట్ నమ్మకాన్ని రాణా వమ్ము చేయలేదు. నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఇదే తరహా ప్రదర్శనలు కనబరిస్తే అతడు వన్డే జట్టులో తన స్దానాన్ని మరింత పదిలం చేసుకోవడం ఖాయం.చదవండి: సింగిల్ తీసిన కోహ్లి.. దద్దరిల్లిన స్టేడియం.. వీడియో వైరల్
- 
      
                   
                                                       సింగిల్ తీసిన కోహ్లి.. దద్దరిల్లిన స్టేడియం.. వీడియో వైరల్టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా తాజా పర్యటనలో పరుగుల ఖాతా తెరిచాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తన మార్కు చూపిస్తున్నాడు.కాగా కెరీర్ చరమాంకానికి చేరుకున్న కోహ్లికి ఇదే ఆఖరి ఆసీస్ టూర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెర్త్, అడిలైడ్‌లో కోహ్లి ఆట చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. అయితే, రాజు ఎక్కడైనా రాజే అన్నట్లుగా అడిలైడ్ వన్డేలో ఈ లెజెండరీ బ్యాటర్ డకౌట్ అయినా.. టీమిండియా, ఆసీస్ అభిమానులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి కోహ్లి పట్ల ప్రేమను చాటుకున్నారు.తాజాగా శనివారం నాటి మూడో వన్డేలో కోహ్లి బ్యాటింగ్‌కు వస్తున్నపుడే సిడ్నీ క్రౌడ్... లేచి నిలబడి అతడిని చీర్ చేస్తూ ఎమోషనల్ అయింది. కాగా ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ త్వరగానే పెవిలియన్ చేరాడు.మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న గిల్.. భారత ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో రెండో బంతికి జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి.. రోహిత్ శర్మతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు.దీంతో సిడ్నీ ప్రేక్షకుల సంబరాలు అంబరాన్నంటాయి. కోహ్లి ఒక్క పరుగు పూర్తి చేసుకోగానే స్టేడియం కేరింతలతో దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 16 ఓవర్ల ఆట (డ్రింక్స్ బ్రేక్) పూర్తయ్యేసరికి రోహిత్ 49 బంతుల్లో 43, కోహ్లి 21 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.So many emotions! ☺️🥹❤️He’s off the mark & the crowd has made its happiness loud and clear! 🙌Will we witness a Chase Master special from #ViratKohli tonight? 🔥#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/SZiBRnnvUY— Star Sports (@StarSportsIndia) October 25, 2025 ఇక మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మార్ష్ బృందం.. 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత యువ పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్ రెండు. సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. కోహ్లి మాథ్యూ షార్ట్ (30), కూపర్ కన్నోలి (23) క్యాచ్‌లు అందుకుని టీమిండియా కీలక వికెట్లు దక్కించుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
- 
      
                   
                                                       భారత బౌలర్ల విజృంభణ... ఆసీస్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (IND vs AUS 3rd ODI) బౌలర్లు రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ చేశారు. యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) నాలుగు వికెట్లతో మెరిసి.. యాజమాన్యం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను ఆసీస్‌కు కోల్పోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.సిరాజ్ మొదలెడితే..ఆసీస్ టాపార్డర్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) వేగంగా ఆడే ప్రయత్నంలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (41)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (30) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.అదరగొట్టిన హర్షిత్విరాట్ కోహ్లి అద్భుత క్యాచ్ అందుకుని షార్ట్‌ను పెవిలియన్‌కు పంపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23), మిచెల్ ఓవెన్ (1) రూపంలో మూడు కీలక వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. జోష్ హాజిల్‌వుడ్ (0)ను కూడా అవుట్ చేశాడు. మొత్తంగా 8.4 ఓవర్లు బౌల్ చేసి 39 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.CLUTCH! ⭐⭐⭐⭐#HarshitRana bags his maiden 4-wicket haul in international cricket as #TeamIndia bowl out Australia in Sydney 👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/JXFhwCDgzX— Star Sports (@StarSportsIndia) October 25, 2025మిగతా వారిలో సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీయగా.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (56) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో నాథన్ ఎల్లిస్ (16) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్ (2), జంపా (2*) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక సిడ్నీలో గత మూడు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా 237 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించి గెలుపు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.చదవండి: శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్!
- 
      
                   
                                                       IND vs AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్!ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు. తద్వారా టీమిండియాకు కీలక వికెట్ దక్కడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయితే, బంతిని ఒడిసిపట్టే క్రమంలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువైతే అయ్యర్ రూపంలో కీలక బ్యాటర్ సేవలను టీమిండియా కోల్పోతుంది.మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా.. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేలోనూ టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్‌కు దిగింది.ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), ట్రవిస్ హెడ్ (29) రాణించగా.. మాథ్యూ షార్ట్ 30 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా అర్ధ శతకం (56)తో మెరవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో ఆసీస్ 34వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన భారత పేసర్ హర్షిత్ రాణా.. గంటకు 134.1 కిలోమీటర్ల వేగంతో అవుట్ సైడాఫ్ దిశగా నాలుగో బంతిని సంధించగా.. క్యారీ మిడాఫ్/ ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.ఇంతలో బ్యాక్వర్డ్ పాయింగ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ అయ్యర్ డైవ్ కొట్టి మరీ సూపర్‌మేన్‌లా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు గాయపడ్డాడు. నడుముకు ఎడమవైపు కిందిభాగంలో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలోనే పడుకుండిపోయాడు.సహచర ఆటగాళ్లు వచ్చి శ్రేయస్‌ను పరామర్శించగా.. ఫిజియో వచ్చి తీసుకువెళ్లాడు. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో ఆసీస్ 236 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఆసీస్‌తో రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం (61)తో మెరిసిన విషయం తెలిసిందే. Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025
- 
      
                   
                                                       ఎంత పనిచేశావు గిల్!.. టైమ్ ఉంది కదా.. రవిశాస్త్రి ఫైర్ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఓ పొరపాటు చేశాడు. అతడి ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా ఆసీస్ వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (Matthew Short)ను త్వరగా పెవిలియన్‌కు పంపే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. అసలేం జరిగిందంటే..ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ (IND vs AUS)కు కోల్పోయిన టీమిండియా సిడ్నీ వేదికగా నామమాత్రపు ఆఖరి వన్డేలో.. టాస్ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఆది నుంచే బౌండరీలు బాదుతూ పరుగులు పిండుకున్నారు.డైరెక్ట్ త్రో మిస్ చేసిన గిల్ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు గట్టిగానే ప్రయత్నించగా.. మొహమ్మద్ సిరాజ్ సఫలమయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో రెండో బంతికి డేంజరస్ బ్యాటర్ హెడ్ (29)ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో మాథ్యూ షార్ట్ క్రీజులోకి వచ్చాడు. పదో ఓవర్లో సిరాజ్ వేసిన మూడో బంతికి అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఫ్రంట్ ఫుట్ డిఫెండ్ షాట్‌తో సేవ్ అయ్యాడు. అయితే, సిరాజ్ సంధించిన నాలుగో బంతిని షార్ట్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు. ఈ క్రమంలో మిడాఫ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫీల్డర్ గిల్ బంతిని అందుకున్నా.. దానిని సమర్థవంతంగా వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈజీ డైరెక్ట్ త్రోకు ఆస్కారం ఉన్నా గిల్ మిస్‌ఫీల్డ్ కారణంగా టీమిండియా రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.Can't BatCan't BowlCan't FieldCan't Captain What does Shubman Gill even do? pic.twitter.com/1tftX7250A— ADITYA (@Wxtreme10) October 25, 2025రవిశాస్త్రి ఫైర్అప్పటికే సింగిల్‌కు వచ్చిన షార్ట్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోకి చేరుకోగా.. నిరాశగా స్టంప్స్ వైపు వచ్చిన సిరాజ్ అదుపు తప్పి షార్ట్‌పై పడిపోయాడు. మరోవైపు.. మార్ష్ కూడా సర్వైవ్ అయ్యాడు. ఈ ఘటన గురించి కామెంటేటర్ .. ‘‘ఇదొక మిక్స్ అప్. రనౌట్ చేసే అవకాశం మిస్సయ్యారు’’ అని పేర్కొనగా.. రవిశాస్త్రి.. ‘‘అవును.. అతడికి చాలా సమయం ఉన్నా సరైన విధంగా హిట్ చేయలేకపోయాడు’’ అని గిల్‌ను విమర్శించాడు.ఇదిలా ఉంటే.. సున్నా వద్ద లైఫ్ పొందిన షార్ట్ 30 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు మార్ష్ (41) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 33 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 178పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ 24, మ్యాట్ రెన్షా 46 పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs AUS 3rd ODI: నితీశ్ రెడ్డి అవుట్.. కారణం వెల్లడించిన బీసీసీఐ A classic Axar Patel delivery! 🔥The Aussie skipper heads back, and #TeamIndia are right back in the contest! 🇮🇳👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/BDrWFPLvgs— Star Sports (@StarSportsIndia) October 25, 2025
- 
      
                   
                                                       చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) చరిత్ర సృష్టించాడు. ఆసీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. టీమిండియాతో శనివారం నాటి మూడో వన్డే (IND vs AUS 3rd ODI) సందర్భంగా హెడ్ ఈ ఘనత సాధించాడు.స్వదేశంలో ఆస్ట్రేలియా భారత్‌తో మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న కంగారూలు.. సిడ్నీ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనూ శుభారంభం అందుకున్నారు.వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్లోసిడ్నీ గ్రౌండ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. కెప్టెన్, ఓపెనర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh)తో కలిసి ట్రావిస్ హెడ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 22 పరుగుల (20 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. స్మిత్ రికార్డు బ్రేక్కాగా ఆసీస్ తరఫున హెడ్‌కు ఇది 76వ ఇన్నింగ్స్. తద్వారా తక్కువ ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్ క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ సాధించిన రికార్డును హెడ్ తాజాగా బద్దలు కొట్టాడు. స్మిత్ 79 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధిస్తే.. హెడ్ 76 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.అంతేకాదు.. అతితక్కువ బంతుల్లో వన్డేల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో హెడ్ ఈ సందర్భంగా చోటు సంపాదించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2839 బంతుల్లో మూడువేల పరుగుల మార్కును అందుకున్నాడు.సిరాజ్ బౌలింగ్‌లో..ఇక ఆసీస్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ బంతితో రంగంలోకి దిగగా.. హెడ్.. ఫోర్‌తో అతడికి స్వాగతం పలికాడు. అయితే, రెండో బంతికే సిరాజ్ అతడిని పెవిలియన్‌కు పంపి ప్రతీకారం తీర్చుకున్నాడు.సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన హెడ్.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్రమంలో ప్రసిద్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో టీమిండియాకు ‘హెడేక్’ తప్పింది. Much needed! 💪Just as the opening stand was starting to look dangerous, #MohammadSiraj gets #TravisHead! 👏🇮🇳#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/Kimj8efFnZ— Star Sports (@StarSportsIndia) October 25, 202525 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసిన హెడ్ మరో బౌండరీ బాదే క్రమంలో అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 15 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. మార్ష్ 41, మాథ్యూ షార్ట్ 10 పరుగులతో క్రీజులో నిలిచారు.ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో మూడు వేల పరుగులు సాధించిన క్రికెటర్లు🏏ట్రావిస్ హెడ్- 76 ఇన్నింగ్స్‌లో🏏స్టీవ్ స్మిత్- 79 ఇన్నింగ్స్‌లో🏏మైఖేల్ బేవాన్/జార్జ్ బెయిలీ- 80 ఇన్నింగ్స్‌లో🏏డేవిడ్ వార్నర్- 81 ఇన్నింగ్స్లోవన్డేల్లో తక్కువ బంతుల్లోనే 3 వేల పరుగుల క్లబ్లో చేరిన క్రికెటర్లు🏏గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2440 బంతుల్లో🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2533 బంతుల్లో🏏జేసన్ రాయ్ (ఇంగ్లండ్)- 2820 బంతుల్లో🏏ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)- 2839 బంతుల్లో🏏జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్)- 2842 బంతుల్లో. చదవండి: అవమాన భారంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్
- 
      
                   
                                                       ఎట్టకేలకు కుల్దీప్ ఎంట్రీ.. నితీశ్ రెడ్డి అవుట్.. కారణం ఇదేనన్న బీసీసీఐఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డే (IND vs AUS 3rd ODI)లో భారత్ తమ తుదిజట్టులో కీలక మార్పులు చేసింది. గత రెండు వన్డేల్లోనూ పక్కన పెట్టిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఎట్టకేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంది.పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ను తుదిజట్టులోకి ఎంపిక చేసుకుంది. మరోవైపు.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానంలో యువ పేసర్ ప్రసిద్ కృష్ణ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.కారణం వెల్లడించిన బీసీసీఐకాగా నితీశ్ కుమార్ రెడ్డి మూడో వన్డేకు దూరం కావడానికి గల కారణాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వెల్లడించింది. గాయం కారణంగానే అతడిని పక్కనపెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు ‘‘ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో నితీశ్ కుమార్ రెడ్డి ఎడమవైపు గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు.అందుకే మూడో వన్డే సెలక్షన్‌కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’’ అని బీసీసీఐ కీలక అప్డేట్ అందించింది. ఒకవేళ నితీశ్ రెడ్డి త్వరగా కోలుకోకపోతే టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.సిరీస్ కోల్పోయిన భారత్‌కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. పెర్త్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. అడిలైడ్‌లో రెండు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.పరువు నిలుపుకోవాలనిఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య ఆస్ట్రేలియా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా జరిగే నామమాత్రపు ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా రెండో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి తమ జట్టుకు విజయం అందించగా.. కుల్దీప్ను పక్కనపెట్టడం ద్వారా టీమిండియా భారీ మూల్యమే చెల్లించిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: తెలివి తక్కువ నిర్ణయం: టీమిండియా మేనేజ్మెంట్పై అశూ ఫైర్
- 
      
                   
                                                       IND vs AUS: సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయంAustralia vs India, 3rd ODI Updates And Highlights: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 236 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ లక్ష్యం: 237 పరుగులుగా నిర్దేశించింది.భారత్ ఘన విజయం..సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వైట్ వాష్ నుంచి టీమిండియా తప్పించుకుంది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రం కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరూ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.విజయం దిశగా32.6: జంపా బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. వన్డేల్లో రోహిత్‌కు ఇది 33వ శతకం. 33 ఓవర్లలో టీమిండియా స్కోరు 200-1. రోహిత్ 100, కోహ్లి 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి 37 పరుగుల దూరంలో ఉంది.కోహ్లి హాఫ్ సెంచరీ..వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌటైన విరాట్ కోహ్లి.. సిడ్నీ వన్డేలో మాత్రం సత్తాచాటాడు. కోహ్లి 56 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 178-1(29).రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..సిడ్నీ వన్డేలోనూ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 63 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 23 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌తో పాటు కోహ్లి(36) ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్10.2: గిల్ (24) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 70-1(10.3). రోహిత్ 32 పరుగులతో ఉన్నాడు. కోహ్లికి సిడ్నీలో ఇదే ఆఖరి మ్యాచ్ అన్నట్లుగా ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తూ ఎమోషనల్ అయ్యారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 68-0 (10).గిల్ 24, రోహిత్ 31 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రోహిత్, గిల్237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఆది నుంచే ఆసీస్ బౌలర్లు కట్టడి చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఆచితూచి ఆడుతున్నారు. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 48-0. రోహిత్ 25, గిల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.హాజిల్‌వుడ్ బౌల్డ్46.4: హర్షిత్ రాణా బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ (0) బౌల్డ్ కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. ఫలితంగా 236 పరుగులకే ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ డౌన్46.2: హర్షిత్ రాణా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన కన్నోలి (23). దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 236-9(46.2). హాజిల్‌వుడ్ క్రీజులోకి రాగా... జంపా రెండు పరుగులతో ఉన్నాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా43.5: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన నాథన్ ఎల్లిస్ (16). స్కోరు: 223-8(43.5). కన్నోలి 13 పరుగులతో ఉన్నాడు. జంపా క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ డౌన్38.4: కుల్దీప్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన స్టార్క్ (2). కుల్దీప్ అద్భుత బంతితో స్టార్క్‌ను బౌల్డ్ చేశాడు. ఆసీస్ స్కోరు: 201-7(38.4). నాథన్ ఎల్లిస్ క్రీజులోకి రాగా.. కన్నోలి 8 పరుగులతో ఉన్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఓవెన్ (1) రూపంలో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి రాగా.. 38 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 199-6(38). కన్నోలి 7, స్టార్క్ ఒక పరుగుతో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా36.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ వీరుడు మ్యాట్ రెన్షా (56) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఎల్బీడబ్ల్యూ విషయంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా.. బంతి లెగ్ స్టంప్‌ను హిట్ చేస్తున్నట్లుగా తేలింది. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోగా.. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 37 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 197-5. కన్నోలి 6 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా33.4: హర్షిత్ రాణా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి క్యారీ (24) అవుట్. అద్భుతమైన క్యాచ్‌తో మెరిసి టీమిండియా కీలక వికెట్ పొందడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ గాయపడినట్లు తెలుస్తోంది. కూపర్ కన్నోలి క్రీజులోకి రాగా 34 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 184-4. రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్22.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి మాథ్యూ షార్ట్ అవుటయ్యాడు. 41 బంతుల్లో 30 పరుగులు చేసి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. 24 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. రెన్షా 22, క్యారీ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.The only leadership summit all of us want to be part of! 📝📚#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/HzAE2KIPI1— Star Sports (@StarSportsIndia) October 25, 2025 రెండో వికెట్ డౌన్15.1: మార్ష్ (41) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మార్ష్ బౌల్డ్ అయ్యాడు. మ్యాట్ రెన్షా క్రీజులోకి రాగా.. షార్ట్ 11 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 92-2 (16)A classic Axar Patel delivery! 🔥The Aussie skipper heads back, and #TeamIndia are right back in the contest! 🇮🇳👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/BDrWFPLvgs— Star Sports (@StarSportsIndia) October 25, 2025తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ట్రావిస్ హెడ్. 25 బంతులు ఎదుర్కొని 29 పరుగుల చేసిన హెడ్ అవుట్. ఫలితంగా తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. మాథ్యూ షార్ట్ క్రీజులోకి రాగా.. మార్ష్ 25 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 63-1ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 26-0(5)మిచెల్ మార్ష్ 6, ట్రావిస్ హెడ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. హర్షిత్ రాణా సిరాజ్ కలిసి ఆల్టర్నేటివ్ ఓవర్లలో బరిలోకి దిగాడు.ఒక మార్పుతో బరిలోకిఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. యువ ఆటగాళ్లు రాణించడం మా జట్టుకు శుభపరిణామం. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే సువర్ణావకాశం మా ముందుంది. గత మ్యాచ్‌లో కూపర్ కన్నోలి అద్భుతంగా ఆడాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్ బార్ట్లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.టీమిండియాలో రెండు మార్పులుమరోవైపు.. టీమిండియా గత మ్యాచ్‌లలో చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లు అనిపిస్తోంది. రెండు వన్డేల్లో బెంచ్‌కే పరిమితం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఎట్టకేలకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణలను ఎంపిక చేసుకుంది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.
- 
      
                   
                                                       భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డేకు సంబంధించి బిగ్ అప్డేట్భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య సిడ్నీ వేదికగా రేపు (అక్డోబర్ 25) వన్డే మ్యాచ్ జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ ఇది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే కైవసం చేసుకుంది. ఆ జట్టు తొలి రెండు వన్డేల్లో భారత్‌పై ఏకపక్ష విజయాలు సాధించింది. రేపు జరుగబోయే మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది.కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేకు వరుణుడు ఆటంకాలు కలిగించిన నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంలో వారికి గుడ్ న్యూస్ అందింది.Accuweather సమాచారం ప్రకారం, సిడ్నీలో రేపు వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్ పూర్తిస్థాయిలో సజావుగా సాగుతుంది. ఉష్ణోగ్రతలు సుమారు 16°C నుంచి 23°C మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో అభిమానులు హాజరుకానున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ మధ్యాహ్నమే సిడ్నీ మైదానం బయట సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టింది. అప్రాధాన్యమైన మ్యాచ్ అయినప్పటికీ.. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపు వీకెండ్ కావడంతో ఈ మ్యాచ్‌ను అదనపు ఆదరణ లభించనుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా పరంగా రేపటి మ్యాచ్ అప్రాధాన్యమైనప్పటికీ టీమిండియాకు మాత్రం చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే 0-2తో సిరీస్ కోల్పోయిన భారత్, రేపటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకోవాలని భావిస్తుంది. ఒకవేళ రేపటి మ్యాచ్‌లో కూడా భారత్ ఓడితే వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్‌వాష్ పరాభవాన్ని ఎదుర్కొంటుంది.చదవండి: ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్రేపటి మ్యాచ్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం భారత టీ20 జట్టు ఇదివరకే ఆసీస్ గడ్డపై ల్యాండ్ అయ్యింది. భారత వన్డే జట్టులో కొందరు మాత్రమే టీ20 జట్టులో ఉన్నారు. సీనియర్లు విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ తర్వాత భారత్‌కు బయల్దేరిపోతారు.
- 
      
                   
                                                       IND vs AUS: అదొక తెలివి తక్కువ నిర్ణయం: అశ్విన్ ఫైర్ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు. అడిలైడ్ మ్యాచ్‌లో భారత జట్టు యాజమాన్యం అనుసరించిన వ్యూహాన్ని తప్పుబట్టిన అశూ.. తెలివి తక్కువ నిర్ణయం కారణంగా సిరీస్ కోల్పోయామంటూ ఘాటు విమర్శలు చేశాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది టీమిండియా. తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా పెర్త్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. గురువారం నాటి రెండో వన్డేలో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా 0-2తో సిరీస్‌ను ఆసీస్‌కు కోల్పోయింది.బెంచ్‌కే పరిమితంఅయితే, ఈ రెండు వన్డేల్లోనూ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను బెంచ్‌కే పరిమితం చేసింది టీమిండియా మేనేజ్మెంట్. వికెట్ల తీయగల సత్తా ఉన్నా అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.జంపా అదుర్స్ముఖ్యంగా రెండో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా (Adam Zampa) నాలుగు వికెట్లతో రాణించి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించడం.. కుల్దీప్ లేనిలోటును మరింత ఎత్తి చూపింది. ఆతిథ్య జట్టు తమ స్పిన్నర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే.. టీమిండియా మాత్రం వ్యూహాత్మక తప్పిదం చేసిందనే విమర్శలు వచ్చాయి.వికెట్లు తీసే బౌలర్లు కావాలిఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అడిలైడ్ వన్డేలో టీమిండియా బౌలింగ్ అటాక్ అత్యంత సాధారణంగా అనిపించింది. అసలు వికెట్ తీయాలని ఎవరూ ప్రయత్నించినట్లుగా అనిపించనేలేదు. పరుగులు చేయడం కంటే కూడా వికెట్లు పడగొట్టగలిగే బౌలర్లను ఎంపిక చేసుకోవాలి.మంచి కెప్టెన్లు, నాయకులు ఎలా ఆలోచిస్తారంటేఆడం జంపా నాలుగు వికెట్లు ఎలా తీశాడో చూశారా?.. అతడు బంతిని తిప్పేశాడు. ప్రతిసారీ మన డ్రెసింగ్‌రూమ్ దృష్టికోణం గురించే ఆలోచించవద్దు. మంచి కెప్టెన్లు, నాయకులు.. ఎల్లప్పుడూ ప్రత్యర్థి జట్టు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో ముందే ఊహించి.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు.ఈ మ్యాచ్‌లో ఆడిన కూపర్ కన్నోలి ఇది వరకు అసలు కుల్దీప్ యాదవ్‌ను ఎదుర్కొన్నాడా? లేదు కదా!.. మరి మాథ్యూ షార్ట్.. అలెక్స్ క్యారీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డాడు. మిచెల్ ఓవెన్ కూడా ఇంత వరకు కుల్దీప్ను ఎదుర్కొనేలేదు.తెలివి తక్కువ నిర్ణయంఆస్ట్రేలియా ప్రస్తుత బ్యాటింగ్ లైనప్‌లో చాలా మందికి కుల్దీప్ బౌలింగ్‌లో ఆడిన అనుభవమే లేదు. కాబట్టి అతడిని ఆడిస్తే.. ప్రత్యర్థి జట్టులోని ప్రతి బ్యాటర్ ఇబ్బంది పడేవాడు. కుల్దీప్ను బెంచ్‌కే పరిమితం చేయడం తెలివిగల నిర్ణయం అయితే కానేకాదు’’ అని అశ్విన్.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. చదవండి: రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు?
- 
      
                   
                                                       రోహిత్ శర్మకు అనుకూలం.. టీమిండియాకు వ్యతిరేకంఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు (Team India) క్లీన్ స్వీప్ భయం పట్టుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (India vs Australia) తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి, ఇదివరకే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. రేపు (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా జరుగబోయే మూడో వన్డేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.చెత్త రికార్డుఅయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గత రికార్డులు కలవరపెడుతున్నాయి. సిడ్నీలో భారత జట్టుకు చాలా చెత్త రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడిన 19 వన్డేల్లో భారత్ కేవలం రెండింట మాత్రమే గెలిచింది. 16 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.ప్రస్తుతం ఈ రికార్డే భారత క్రికెట్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ సిడ్నీలో చరిత్ర రిపీటై భారత్ 17వ సారి ఓడితే ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్‌వాష్ (వన్డేల్లో) ఎదురవుతుంది.రోహిత్‌కు అనుకూలంసిడ్నీ మైదానంలో టీమిండియాకు వ్యతిరేకంగా ఉన్న ట్రాక్ రికార్డు, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ విషయానికి వచ్చే సరికి అనుకూలంగా ఉంది. హిట్ మ్యాన్ గత నాలుగు వన్డేల్లో ఇక్కడ సెంచరీ, 2 అర్ద సెంచరీలు చేశాడు. చివరిగా (2019) ఆడిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (133) బాదాడు.సిడ్నీలో గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ స్కోర్లు..133 (129)99 (108)34 (48)66 (87)కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు తొలి రెండు వన్డేల్లో పరాజయాలపాలై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోయింది. సిడ్నీ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.విరాట్ వైఫల్యాలుఏడు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అంచనాలను తలకిందులు చేస్తూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు వన్డేల్లో డకౌటై అభిమానుల తీవ్ర నిరాశకు గురి చేశాడు. తొలి వన్డేలో 8 బంతులు, రెండో వన్డేలో 4 బంతులు ఆడిన కోహ్లి ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతని 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి.మరో పక్క కోహ్లితో పాటే ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన రోహిత్ శర్మ మాత్రం తొలి వన్డేలో (8) విఫలమైనా, రెండో వన్డేలో అత్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించనప్పుడు చాలా బాధ్యతగా ఆడి అర్ద సెంచరీ (73) చేశాడు. రోహిత్ నిలకడగా ఆడటంతోనే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264) చేయగలిగింది. అయితే బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, కీలక సమయాల్లో క్యాచ్‌లు నేలపాలు చేయడంతో భారత్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. చదవండి: భారత్‌తో మూడో వన్డే.. ఆసీస్ అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు.. ఎవరీ ఆల్‌రౌండర్?
- 
      
                   
                                                       భారత్‌తో మూడో వన్డే.. ఆసీస్ అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు.. ఎవరీ ఆల్‌రౌండర్?స్వదేశంలో ఆస్ట్రేలియా సత్తా చాటింది. టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 (IND vs AUS 2025 ODIs)తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టులో కీలక మార్పులు చేసింది. ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards)కు జట్టులో చోటిచ్చింది. దేశీ క్రికెట్లో అదరగొడుతూ సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ న్యూ సౌత్‌వేల్స్ ఆటగాడిని తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. మార్నస్ లబుషేన్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంది. మరోవైపు.. నామమాత్రపు ఆఖరి వన్డేలో మ్యాట్ కుహ్నెమన్‌కు కూడా ఆసీస్ యాజమాన్యం జట్టులో స్థానం కల్పించింది.ఇంతకీ ఎవరీ జాక్ ఎడ్వర్డ్స్?అండర్-19 వరల్డ్‌కప్-2018లో బ్యాట్, బంతితో మెరిసిన జాక్ ఎడ్వర్డ్స్ ఆస్ట్రేలియా రన్నరప్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 216 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టాడు.ఆసీస్ వన్డే కప్ చరిత్రలోనే..ఈ క్రమంలో ఫామ్‌ను కొనసాగిస్తూ ఎడ్వర్డ్స్ ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే టోర్నీలోనూ సత్తా చాటాడు. ఆసీస్ వన్డే కప్ చరిత్రలో అత్యంత పిన్న వయసు (18 ఏళ్లు)లో సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ రికార్డు సాధించాడు.ఏడేళ్ల క్రితం క్వీన్స్‌లాండ్‌పై ఈ న్యూ సౌత్‌వేల్స్ బ్యాటర్ 112 బంతుల్లోనే 116 పరుగులు సాధించాడు. అప్పటికి ఎడ్వర్డ్స్ వయసు 18 ఏళ్ల 165 రోజులు మాత్రమే కావడం గమనార్హం.ఇండియా- ఎ జట్టుతో వన్డేలలో అదరగొట్టిఇక ఇటీవల ఇండియా- ఎ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్‌లోనూ ఎడ్వర్డ్స్ అదరగొట్టాడు. తొలి వన్డే మిస్సయినప్పటికీ.. రెండో వన్డేలో మాత్రం అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ల వికెట్లు కూల్చాడు. ఓవరాల్‌గా 4/56 గణాంకాలతో అదరగొట్టాడు.అంతేకాదు.. 75 బంతుల్లోనే 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా బౌలింగ్‌లోనూ చితక్కొట్టి తనను తాను నిరూపించుకున్నాడు.కాగా ఎడ్వర్డ్స్ అన్న మిక్కీ ఎడ్వర్డ్స్ కూడా క్రికెటరే. ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ దేశీ క్రికెట్ ఆడాడు. ఇక 2018లో బిగ్ బాష్ లీగ్‌లో అడుగుపెట్టిన జాక్ ఎడ్వర్డ్స్ నాటి నుంచి పొట్టి ఫార్మాట్లో తన ప్రభంజనం కొనసాగిస్తూనే ఉన్నాడు.సిడ్నీ సిక్సర్స్ 2019-20, 2020-21 సీజన్లలో టైటిల్ గెలవడంలో జాక్ తన వంతు పాత్ర పోషించాడు. ఇక వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున గత రెండు ఎడిషన్లలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు 63 టీ20 మ్యాచ్‌లలో 25 ఏళ్ల జాక్ ఎడ్వర్డ్స్ 700 పరుగులు చేయడంతో పాటు 33 వికెట్లు కూల్చడం విశేషం.భారత్‌తో మూడో వన్డేకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ కుహ్నెమన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మ్యాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.చదవండి:
- 
      
                   
                                                       అతడు అదరగొట్టాడు.. నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్తొలి వన్డేతో పోలిస్తే మెరుగైన బ్యాటింగ్... బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన... విజయావకాశాలు లభించినా సరే, కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరకు టీమిండియాకు నిరాశ తప్పలేదు. అడిలైడ్‌లో గురువారం ఆసక్తికరంగా సాగిన రెండో వన్డే (IND vs AUS)లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో గిల్ సేనను ఓడించి.. సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.రోహిత్, శ్రేయస్ అర్ధ శతకాలు వృథారోహిత్ శర్మ (97 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. పేసర్ హర్షిత్ రాణా 18 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆసీస్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (Adam Zampa- 4/60) నాలుగు వికెట్లు పడగొట్టగా... బార్త్‌లెట్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మాథ్యూ షార్ట్ (74; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ కనోలీ (61 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేయగా, మిచెల్ ఒవెన్ (36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.షార్ట్, కనోలీలదే కీలక పాత్రఅయితే, ఛేదనలో ఆసీస్ కూడా కొంత ఇబ్బంది పడింది. 132/4 వద్ద భారత్‌కు పట్టు బిగించే అవకాశం వచ్చింది. కానీ.. షార్ట్, కనోలీ కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివర్లో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ (Cooper Connolly) ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక బ్యాటింగ్‌లో కేవలం ఎనిమిది పరుగులే చేసి నిరాశపరిచిన ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి.. బౌలింగ్ పరంగానూ తేలిపోయాడు. మూడు ఓవర్లు బౌల్ చేసి ఏకంగా 24 పరుగులు ఇచ్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ నితీశ్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సింది. ఏదేమైనా తదుపరి సిడ్నీ వన్డేకు నితీశ్ రెడ్డిని తప్పిస్తారో లేదంటే ఇంకెవరిపైనైనా వేటు వేస్తారో తెలియదు.అతడు అదరగొట్టాడు.. నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చునైపుణ్యం లేకుండా ఇలాంటి బౌలింగ్‌తో నితీశ్ రెడ్డి నిలదొక్కుకోలేడు. ఇలాగే ఉంటే బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను చితక్కొడతారు. బ్యాటింగ్‌లో సిక్సర్లు బాదడం వరకు సరే.. కానీ బౌలింగ్ పరంగానూ రాణించాలి కదా!ఒకవేళ కావాలంటే హర్షిత్‌ను ఎనిమిది, కుల్దీప్ను తొమ్మిదో స్థానంలో ఆడించండి. హర్షిత్ ఈ వన్డేలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ నితీశ్ నిరాశపరిచాడు. హర్షిత్ రెండు వికెట్లు కూడా తీశాడు. కాబట్టి అతడిని తప్పించలేరు.అందుకే కుల్దీప్ను ఆడించాలంటే నితీశ్ రెడ్డిపై వేటు పడకతప్పకపోవచ్చని అనిపిస్తోంది’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. కాగా హర్షిత్ రాణా ఎంపికను తప్పుబడుతూ చిక్కా.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ యువ పేసర్ ప్రదర్శనకు ఫిదా అయి.. అతడిని ప్రశంసించడం గమనార్హం.చదవండి: WTC: ఒక్క మ్యాచ్‌తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!
- 
      
                   
                                                       రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు?వన్డే కెప్టెన్‌గా టీమిండియా పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ (IND vs AUS ODIS 2025)ను భారత్ కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.ఈ నేపథ్యంలో వన్డే సారథిగా తొలి సిరీస్‌లోనే వరుసగా రెండు వన్డేలు ఓడిన ఆరో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. అతడి కంటే ముందు అజిత్ వాడేకర్, దిలీప్ వెంగ్‌సర్కార్, క్రిస్ శ్రీకాంత్, మొహమ్మద్ అజారుద్దీన్, కేఎల్ రాహుల్ ఈ చేదు అనుభవాన్ని చవిచూశారు.రోహిత్ శర్మపై వేటు వేసికాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025 అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి మరీ.. బీసీసీఐ గిల్‌కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడిలైడ్‌లో రెండో వన్డేలో గిల్ సేన ఓటమి నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తనదైన శైలిలో స్పందించాడు.రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు..‘‘కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రతి కెప్టెన్ మదిలో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. గిల్ కూడా ఇందుకు అతీతం కాదు. అతడి జట్టులో ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటికే నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న దిగ్గజం. అతడి సారథ్యంలో గిల్ ఆడాడు. కెప్టెన్‌గా రోహిత్ ఎలాంటి తప్పూ చేయలేదని గిల్‌కు బాగా తెలుసు.అయినా సరే.. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారనీ తెలుసు. హోటల్ రూమ్‌లో నిద్రకు ఉపక్రమించే ముందు బహుశా గిల్ ఇదే అనుకుంటూ ఉంటాడు. ‘రోహిత్ భాయ్ ఎలాంటి తప్పూ చేయలేదు. అయినా ఎందుకిలా చేశారు?నన్నెందుకు కెప్టెన్ చేశారు?నన్ను సమర్థిస్తున్న వాళ్లు ఒక్కసారైనా రోహిత్ భాయ్ గురించి ఆలోచించారా? ఆయన రెండు ట్రోఫీలు గెలిచాడు. అయినా సరే కెప్టెన్‌గా వేటు వేశారు. కొత్త కెప్టెన్‌గా నన్ను ఎంపిక చేశారు’ అనే గిల్ట్తో సతమతమవుతూ ఉంటాడు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా సిరీస్ ఓటమిపై స్పందిస్తూ..ఆ విషయం గుర్తే లేదు ‘‘వరుస సిరీస్‌లు, ప్రయాణ బడలిక. రోహిత్, కోహ్లి వంటి దిగ్గజాలను లీడ్ చేయడం వంటికి గిల్‌కు పెద్ద సవాలు. వన్డే కెప్టెన్‌గా గిల్ ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నాడు. జట్టు మార్పు చెందే ప్రక్రియలో ఇలాంటివి సహజమే.గిల్ కాస్త ఒత్తిడికి లోనై ఉంటాడు. అతడి సారథ్యంలో మనం వన్డే సిరీస్ కోల్పోయాం. చివరగా ఎప్పుడు ఇది జరిగిందో కూడా ఎవరికీ గుర్తులేదు. గిల్ కెప్టెన్సీలో ఆరంభంలోనే ఇది జరిగింది’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.చదవండి: WTC: ఒక్క మ్యాచ్‌తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95— Star Sports (@StarSportsIndia) October 23, 2025
- 
      
                   
                                                       రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో విఫలమైన హిట్‌మ్యాన్ రెండో మ్యాచ్‌లో తన మార్క్ చూపించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ క్రీజులో నిలదొక్కున్నాక మాత్రం తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ అలరించాడు.ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు తన అద్బుత ఇన్నింగ్స్‌తో రోహిత్ ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 97 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిశాక టీమ్ హోటల్‌కు వెళ్లే క్రమంలో రోహిత్ శర్మను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటపట్టించాడు."రోహిత్.. అందరికీ ఇదే నీ ఫేర్వెల్ మ్యాచ్ అనిపిస్తోంది. ఒక్క ఫొటో అయినా పెట్టు" అని గంభీర్ అన్నాడు. అందుకు రోహిత్ నవ్వుతూ తన రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ టూర్‌కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే.దీంతో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో రోహిత్ ఆడుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత లేదు. వరల్డ్‌కప్‌నకు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటికి ఈ ముంబై ఆటగాడి వయస్సు నాలభైకి చేరుకుంటుంది. ఒకవేళ రోహిత్ ఫిట్‌గా ఉండి, ఫామ్‌లో ఉంటే వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశముంది. అంతేకాకుండా వరల్డ్‌కప్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలంటే దేశవాళీ టోర్నీ విజయహాజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని అగార్కర్ స్పష్టం చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. View this post on Instagram A post shared by Rohit Sharma (Fan Page) (@rohit_cha_fans45)చదవండి: వరుసగా రెండుసార్లు డకౌట్.. కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే
- 
      
                   
                                                       విరాట్ కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదేఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లి (Virat Kohli) విఫలమయ్యాడు. అడిలైడ్‌లో మంచి రికార్డు కలిగి ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గురువారం నాటి మ్యాచ్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు. అంతకు ముందు పెర్త్ వేదికగా తొలి వన్డేలోనూ ఈ దిగ్గజ ఆటగాడు సున్నా చుట్టడం గమనార్హం.ఈ నేపథ్యంలో అడిలైడ్ వన్డేలో కోహ్లి అవుటై.. పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా కోహ్లి సైతం గ్లోవ్స్ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా మైదానం వీడాడు. అయితే, కోహ్లి చర్య రిటైర్మెంట్కు సంకేతమంటూ వదంతులు వ్యాపించాయి.రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన..ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. ‘‘వన్డేల్లో 52 సెంచరీలు చేశాడు. 14 వేలకు పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లోనూ 32 దాకా శతకాలు ఉన్నాయి. ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు.అలాంటి ఆటగాడు వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏమీలేదు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. మున్ముందు ఇంకా ఆడతాడు. తదుపరి సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్ కోహ్లికి ఫేవరెట్ గ్రౌండ్. అక్కడ శతకాలు బాదిన చరిత్ర అతడికి ఉంది. కాబట్టి.. సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ తట్టుకోలేకపోయారు. అయినా ఆటగాడి కెరీర్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.ఆ స్పందన అమోఘంఏదేమైనా కోహ్లి మైదానాన్ని వీడుతున్న వేళ అభిమానుల నుంచి వచ్చిన స్పందన అమోఘం. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. వారంతా కూడా భారతీయ అభిమానులతో కలిసి కోహ్లికి ఓవియేషన్ ఇచ్చారు. గొప్ప ఆటగాడికి లభించే ఆదరణకు తార్కాణం అది.ఇది చాలా చాలా ప్రత్యేకం. ఇదేమీ కోహ్లి కెరీర్‌కు ముగింపు కాదు. అతడు ఆటగాళ్లు కూర్చునే స్టాండ్ వైపు వెళ్లాడు. అయితే, తన పట్ల అభిమానం చూపుతున్న వారి కోసం మాత్రమే గ్లోవ్స్ తీసి వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.అంత తేలికగా ఓటమిని ఒప్పుకోడువిరాట్ కోహ్లి.. అంత తేలికగా ఓటమిని ఒప్పుకొని ఆటను వదిలేసే రకం కాదు. వరుసగా రెండుసార్లు డకౌట్ అయిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఉన్నత స్థాయిలోనే అతడు ఆటకు వీడ్కోలు పలుకుతాడు.సిడ్నీ మ్యాచ్ తర్వాత.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఉంది. ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. రోహిత్ శర్మతో కలిసి విరాట్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతాడనే భావిస్తున్నా. లేదంటే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్కూడా నిరాశ చెందుతారనడంలో సందేహం లేదు.ఆ ఛాన్సే లేదుఏదేమైనా కోహ్లి తన పట్ల అభిమానం చూపిన వారికి కృతజ్ఞతగా మాత్రమే గ్లోవ్స్ తీశాడు. ఒకవేళ తను సెంచరీ చేసి ఉంటే బ్యాట్ ఎత్తి అభివాదం చేసేవాడు. కాబట్టి కోహ్లి రిటైర్మెంట్ అంటూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని గావస్కర్ స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు. కాగా పెర్త్ వన్డేలో ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. అడిలైడ్‌లో రెండు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల, టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడుA tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8— Star Sports (@StarSportsIndia) October 23, 2025
- 
      
                   
                                                       భారత్‌తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడుటీమిండియాతో మూడో వన్డేకు ముందు ఆస్ట్రేలియా జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను జట్టు నుంచి సెలక్టర్లు రిలీజ్ చేశారు. కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరం కావడంతో లబుషేన్‌ను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ రెండు వన్డేలకు కూడా అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు నామమాత్రపు మ్యాచ్‌కు మందుకు జట్టు నుంచి తప్పించడంతో.. లబుషేన్ తిరిగి డొమాస్టిక్ క్రికెట్లో క్వీన్స్‌ల్యాండ్ తరపున ఆడేందుకు వెళ్లనున్నాడు. ఇక ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్, స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్‌లను జట్టులోకి చేర్చారు. మూడో వన్డేకు స్టార్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.మాక్సీ వచ్చేశాడు..ఇక భారత్‌తో ఆఖరి మూడు టీ20లకు కూడా తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. తొలి రెండు టీ20లకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోపోయిన స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.. రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. ఆసీస్ సెలక్టర్లు తాజాగా ప్రకటించిన జట్టులో మాక్సీ ఉన్నాడు. అదేవిధంగా యువ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మహ్లి బియర్డ్మాన్కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. 20 ఏళ్ల మహ్లి బియర్డ్‌మాన్ గతేడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో అతడు 10 వికెట్లు పడగొట్టి.. ఆసీస్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో అతడు మూడు వికెట్లు సాధించాడు. అంతేకాకుండా దేశీయ క్రికెట్లో మెరుగ్గా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి తొలిసారి ఆసీస్ జట్టులో చోటు దక్కింది. ఇక చివరి మూడు టీ20లకు సీనియర్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్దానంలోనే బియర్డ్‌మాన్ ఛాన్స్ లభించింది.భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్ (గేమ్స్ 1-3), జేవియర్ బార్ట్లెట్, మహ్లి బియర్డ్‌మాన్ (గేమ్స్ 3-5), టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్ (గేమ్స్ 4-5), నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్ (గేమ్స్ 1-2), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్ (గేమ్స్ 3-5), మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఆస్ట్రేలియా వన్డే జట్టు (మూడవ మ్యాచ్): మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కోనోలీ, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపాచదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?
- 
      
                   
                                                       టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడు..అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మార్ష్ సేన మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సొంతం చేసుకుంది. కాగా ఆసీస్ విజయంలో ఆ జట్టు యువ ఆటగాడు కూపర్ కొన్నోలీది కీలక పాత్ర.లక్ష్య చేధనలో కొన్నోలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 132 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమంయలో కంగారులను షార్ట్‌తో కలిసి కూపర్ ఆదుకున్నాడు. షార్ట్ ఔటయ్యాక కూడా 22 ఏళ్ల యువ సంచలనం ఏ మాత్రం ఒత్తడికి లోనవ్వకుండా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఆఖరిలో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న కొన్నోలీ.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఒకవేళ కొన్నోలీ వికెట్‌ను టీమిండియా సాధించి ఉంటే కథ మరో విధంగా ఉండేది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కూపర్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్ కెప్టెన్ మార్ష్ సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తాడు.కూపర్ ఒక అద్భుతం. అతడు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించగలడు. ఈ మ్యాచ్‌లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడు వయస్సు 22 ఏళ్లు మాత్రమే. ఖచ్చితంగా ఆసీస్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని మార్ష్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. కొన్నోలీ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఆసీస్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు.అయితే ఈ మ్యాచ్ కంటే ముందు అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా అతడు ఇప్పటివరకు కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ బిగ్ బాష్ లీగ్‌లో మాత్రం అతడికి మంచి రికార్డు ఉంది.చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?
- 
      
                   
                                                       అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. తొలి వన్డేతో పోలిస్తే మెరుగైన బ్యాటింగ్... బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచినప్పటికి కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరికి భారత్‌కు నిరాశే మిగిలింది.265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లకు షాకిచ్చారు. స్టార్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(11), హెడ్(28) వెంటవెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్(74), రెన్ షా(30) దూకుడుగా ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. రెన్ షా ఔటయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్స్ క్యారీ(9) ఎక్కవసేపు క్రీజులో ఉండలేకపోయాడు. దీంతో 132/4 వద్ద భారత్‌కు పట్టు బిగించే అవకాశం వచ్చింది. అయితే షార్ట్, యువ ఆటగాడు కూపర్ కొన్నోలీ(61 నాటౌట్) కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివర్లో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (97 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు.గంభీర్ ప్లాన్ అట్టర్ ప్లాప్..కాగా అడిలైడ్‌లో భారత్ ఒక వన్డే మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై సర్వాత్ర విమర్శల వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించికపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. గంభీర్ ఆల్‌రౌండర్ల వ్యూహాం బెడిసి కొట్టింది అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. పిచ్ కండీషన్స్ తగట్టు ఆస్ట్రేలియా మెనెజ్‌మెంట్ ఒక ఫాస్ట్ బౌలర్‌ను పక్కన పెట్టి స్పిన్నర్‌ను తీసుకొస్తే.. భారత్ మాత్రం ముగ్గురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఆసీస్ జట్టులోకి వచ్చిన ఆడమ్ జంపా నాలుగు వికెట్లు పడగొట్టి ఏకంగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అడిలైడ్‌లో పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుంది. ఇటువంటి వికెట్‌పై కుల్దీప్ బంతితో అద్భుతాలు చేయగలడు. కానీ గంభీర్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా కుల్దీప్కు ఛాన్స్ ఇవ్వలేదు. బ్యాటింగ్ డెప్త్‌ను కారణంగా చూపుతూ.. మ్యాచ్ విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున ఆడిన ముగ్గురు ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రాణించినప్పటికి.. నితీశ్ కుమార్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్‌లో విఫలమైన నితీశ్.. బౌలింగ్‌లో కేవలం 3 ఓవర్లలోనే 24 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కుల్దీప్ ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కుల్దీప్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాకప్-2025లో అతడు 17 వికెట్లు తీసి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లోనూ సత్తాచాటాడు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ ఆడే అవకాశముంది.చదవండి: IND vs AUS: ఏయ్.. ఏమి చేస్తున్నావు! శ్రేయస్‌పై రోహిత్ సీరియస్(వీడియో)
- 
      
                   
                                                       క్యాచ్‌లే కొంపముంచాయి.. ఓటమిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో (India vs Australia) టీమిండియా 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. 17 ఏళ్ల తర్వాత అడిలైడ్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి (వన్డేల్లో). మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఓటమిపై స్పందిస్తూ ఇలా అన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి డీసెంట్ స్కోర్ చేశాం. అయితే కొన్ని క్యాచ్‌లు వదిలేయడం వల్ల ఆ స్కోర్‌ను కాపాడుకోలేకపోయాం.ప్రారంభంలో పిచ్ ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందించింది. 15–20 ఓవర్ల తర్వాత పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. మొదటి మ్యాచ్‌లో టాస్ చాలా కీలకమైంది. వర్షం ప్రభావం ఉన్నందున అది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. అయితే రెండో మ్యాచ్‌లో టాస్ ప్రభావం పెద్దలా లేదు. ఇరు జట్లు దాదాపు 50 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి.రోహిత్ శర్మపై ప్రశంసలుఏడు నెలల గ్యాప్ తర్వాత మునుపటి తరహాలో ఆడటం అంత ఈజీ కాదు. అయినా రోహిత్ ధైర్యంగా ఆడి, అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను భారీ స్కోర్ మిస్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో వీరోచితంగా పోరాడాడు. రోహిత్ బ్యాటింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను.కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా.. రోహిత్ (73), శ్రేయస్ (61), అక్షర్ (44) బాధ్యతాయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా కూడా తడబడినప్పటికీ.. అంతిమంగా విజయం సాధించింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోల్నీ (61 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో షార్ట్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. కీలక సమయాల్లో అక్షర్ పటేల్, సిరాజ్ ఈజీ క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఈ క్యాచ్‌లే మ్యాచ్‌ను ఆస్ట్రేలియాకు అనుకూలంగా మార్చాయి. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే సిడ్నీ వేదికగా అక్టోబర్ 25న జరుగనుంది. చదవండి: ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్
- 
      
                   
                                                       IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసంఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. తాజాగా అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ జయభేరి మోగించారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాఅడిలైడ్ ఓవల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పర్యాటక భారత జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) వికెట్ తీసి జేవియర్ బార్ట్లెట్ ఆసీస్‌కు శుభారంభం అందించాడు.రాణించిన రోహిత్, శ్రేయస్ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రోహిత్ (97 బంతుల్లో 73), అయ్యర్ (77 బంతుల్లో 61) పరుగులతో రాణించగా.. మిగతా వారిలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (11) నితీశ్ రెడ్డి (8) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. పేసర్లలో బార్ట్లెట్ గిల్, కోహ్లి, వాషింగ్టన్ సుందర్ (12) వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. మిచెల్ స్టార్క్ రోహిత్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (13)లను అవుట్ చేశాడు.264 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (11)ను అర్ష్‌దీప్ త్వరగానే పెవిలియన్‌కు పంపగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 28)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.అదరగొట్టిన షార్ట్, కన్నోలి అయితే, వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ అద్భుత అర్ధ శతకం (74)తో మెరిసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేయగా.. మ్యాట్ రెన్షా (30) అతడికి సహకరించాడు. షార్ట్, రెన్షా వేసిన పునాదిపై ఆల్‌రౌండర్ కూపర్ కన్నోలి మిచెల్ ఓవెన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.Just the wicket #TeamIndia needed! 🤩#NitishKumarReddy gets the wicket and #MohammedSiraj makes amends for the dropped catch. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YZwdPY0nr7— Star Sports (@StarSportsIndia) October 23, 2025 ఆఖర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినా కన్నోలి పట్టుదలగా నిలబడ్డాడు. ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగులతో వేగంగా ఆడి.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వెనుదిరగగా.. బార్ట్లెట్ (3), స్టార్క్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.అయితే, కన్నోలి మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. 53 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయిన ఆస్ట్రేలియా లక్ష్యం పూర్తి చేసింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు సిడ్నీ వేదిక. కాగా వన్డే సారథిగా గిల్‌కు తొలి సిరీస్‌లోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇక రెండో వన్డేలో జంపాకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ
- 
      
                   
                                                       Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (India vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 23) తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్‌లో 4 బంతుల డకౌట్‌ను నమోదు చేశాడు.కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ డబుల్ డక్ కోహ్లి కెరీర్లో చెరగని మరకలా మిగిలిపోతుంది. కెరీర్ చరమాంకంలో రికార్డుల రారాజుకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం.టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లి మునుపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో వన్డేలో ఔటైన తర్వాత అతని ప్రవర్తన ఈ సిరీస్‌తో కెరీర్ ముగింపును సూచించింది. తమ ఆరాధ్య ఆటగాడు కెరీర్ చరమాంకంలో వరుస డకౌట్లు కావడాన్ని కోహ్లి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.డబుల్ డక్ తర్వాత కోహ్లి వన్డే సగటు కూడా పడిపోయింది. కోహ్లి ఫామ్‌లో ఉన్నప్పుడే రిటైరయ్యుంటే గౌరవంగా ఉండేదని అతని అభిమానులు అనుకుంటున్నారు. మరోపక్క కోహ్లిలాగే కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం రెండో వన్డేలో హిట్ అయ్యాడు.రోహిత్ కూడా తొలి వన్డేలో నిరాశపరిచినా రెండో వన్డేలో మాత్రం బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (73) జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో రోహిత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతుంది. 54 పరుగులకే ఓపెనర్లు మిచెల్ మార్ష్ (11), ట్రవిస్ హెడ్ (28) వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (32), మ్యాట్ రెన్షా (23) క్రీజ్‌లో ఉన్నారు. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96/2గాఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆసీస్ మరో 169 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.చదవండి: కొత్త బ్యాటర్.. ఆరంభంలోనే అదుర్స్!
- 
      
                   
                                                       చరిత్ర సృష్టించిన ‘హిట్‌మ్యాన్’.. ఆసియాలోనే తొలి క్రికెటర్గాఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి పుంజుకున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఎనిమిది పరుగులే చేసిన ‘హిట్‌మ్యాన్’.. రెండో వన్డేలో మాత్రం రాణించాడు.అడిలైడ్ (IND vs AUS 2nd ODI)లో గురువారం నాటి మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. అర్ధ శతకం సాధించాడు. డెబ్బై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉన్నాయి.సరికొత్త చరిత్రఇక రోహిత్ బాదిన రెండు సిక్సర్లు కూడా భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వచ్చినవే. ఆసీస్ పేసర్ మిచెల్ ఓవెన్ బౌలింగ్‌లో తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన హిట్‌మ్యాన్.. మూడో బంతిని కూడా బౌండరీ మీదుగా తరలించాడు. అయితే, తొలి సిక్సర్‌తోనే రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు.SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 సిక్సర్లు బాదిన ఆసియా తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు రో‘హిట్’ శర్మ SENA దేశాల్లో మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచ్‌లు ఆడి 151 సిక్సర్లు బాదడం విశేషం.Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95— Star Sports (@StarSportsIndia) October 23, 2025SENA దేశాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆసియా క్రికెటర్లు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 156 మ్యాచ్‌లలో 151*🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 171 మ్యాచ్‌లలో 113🏏షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 139 మ్యాచ్‌లలో 105🏏మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 175 మ్యాచ్‌లలో 83🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 177 మ్యాచ్‌లలో 83.👉ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్ (61)తో కలిసి మూడో వికెట్‌కు 118 పరుగులు జతచేసిన రోహిత్ శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్, శ్రేయస్ అర్ధ శతకాలకు తోడు అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?
- 
      
                   
                                                       అతడెందుకు అని తిట్టారు.. కట్ చేస్తే! 133.33 స్ట్రైక్ రేట్‌తో మెరుపులుఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గౌతం గంభీర్ సపోర్ట్‌తోనే అతడిని ఎంపిక చేశారని అశ్విన్, కృష్ణమచారి శ్రీకాంత్ దిగ్గజ క్రికెటర్ల సైతం మండిపడ్డారు.ఆ తర్వాత వారిద్దరికి గంభీర్ సైతం గట్టిగా కౌంటరిచ్చాడు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేశామని, రాణాకు బంతితో బ్యాట్‌తో రాణించే సత్తా ఉందని గౌతీ చెప్పుకొచ్చాడు. అయితే గంభీర్ చెప్పిన మాటలు నిజమేనని రాణా నిరూపించుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో హర్షిత్ రాణా సత్తాచాటాడు.తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్‌కు దిగిన రాణా.. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఆడమ్ జంపా వంటి స్టార్ స్పిన్నర్‌ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. రాణా 18 బంతుల్లో మూడు ఫోర్లు సాయంతో 24 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాణా 133.33 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. అతడి కీలక ఇన్నింగ్స్‌తో భారత స్కోర్ 250 పరుగుల మార్క్ దాటింది.రోహిత్, అయ్యర్ హాఫ్ సెంచరీలుకాగా అడిలైడ్ వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు.అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(61), అక్షర్ పటేల్(44) రాణించారు. ఆఖరిలో హర్షిత్‌తో పాటు అర్ష్‌దీప్ కూడా 13 పరుగులతో కీలక నాక్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు.Harshit Rana scored 24 unbeaten runs off 18 balls. It’s not a massive contribution but it clearly shows that he can bat. All those who troll him 24x7 will not a say a word about his good cameo. These runs can be a deciding factor sometimes. #INDvsAUS pic.twitter.com/eS6dTxiygJ— Madhav Sharma (@HashTagCricket) October 23, 2025
- 
      
                   
                                                       రోహిత్, శ్రేయస్ ఫిఫ్టీలు.. అదరగొట్టిన అక్షర్, హర్షిత్.. ఆసీస్ లక్ష్యం ఎంతంటే?ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అర్థ శతకాలతో రాణించగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు లోయర్ ఆర్డర్లో పేస్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) అదరగొట్టారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య పెర్త్‌లో తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో ఆడిలైడ్‌లో గురువారం నాటి రెండో వన్డేలోనూ టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.A tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8— Star Sports (@StarSportsIndia) October 23, 2025గిల్, కోహ్లి ఫెయిల్ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0)లను వరుస బంతుల్లో ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆదిలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ, నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.రోహిత్, శ్రేయస్ హాఫ్ సెంచరీలునెమ్మదిగా, నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 74 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇవ్వడంతో రోహిత్ పెవిలియన్‌కు చేరాడు.Making Head(s) turn! 🚨#AxarPatel sends it straight back over the bowler's head for a boundary. 💪#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/GSBJAAzEbG— Star Sports (@StarSportsIndia) October 23, 2025వేగంగా ఆడిన అక్షర్, హర్షిత్ఇక శ్రేయస్ అయ్యర్ 77 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు బాది 61 పరుగుల వద్ద.. ఆడం జంపా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 41 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టిన అక్షర్ హాఫ్ సెంచరీ (44)కి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జంపా బౌలింగ్‌లో అవుటయ్యాడు.Crucial runs for #TeamIndia from the blade of #HarshitRana! 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/lUjw3AVjEt— Star Sports (@StarSportsIndia) October 23, 2025ఇతరులలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (11), ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్ కుమార్ రెడ్డి (8) విఫలం కాగా.. టెయిలెండర్ హర్షిత్ రాణా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 14 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేశాడు.#ArshdeepSingh bhai, how much room is too much room? 🙌😄#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/bNwG2pNnt3— Star Sports (@StarSportsIndia) October 23, 2025జంపాకు నాలుగు వికెట్లుఈ నేపథ్యంలో తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 264 పరుగులు సాధించి.. ఆసీస్‌కు 265 పరుగుల లక్ష్యం విధించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?
- 
      
                   
                                                       ఏయ్.. ఏమి చేస్తున్నావు! శ్రేయస్‌పై రోహిత్ సీరియస్(వీడియో)అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) సత్తాచాటాడు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అద్బుతమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.తొలుత ఆచితూచి ఆడిన రోహిత్.. క్రీజులో సెటిల్ అయ్యాక దూకుడు పెంచాడు. 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 పరుగులు చేశాడు. అయితే భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో రోహిత్-శ్రేయస్ అయ్యర్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో రోహిత్ శర్మ ఎక్కువగా సింగిల్స్ పైన దృష్టిపెట్టాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోష్ హాజిల్‌వుడ్.. ఐదో బంతిని బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా రోహిత్‌కు సంధించాడు. ఆ బంతిని హిట్‌మ్యాన్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి ప్యాడ్లను తాకి కాస్త దూరంగా వెళ్లింది. దగ్గరలో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో క్విక్ సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. అయ్యర్ మాత్రం రోహిత్ పిలుపును తిరష్కరించాడు. అయితే రన్‌కు పిలిచిన శ్రేయస్ రాకపోవడంపై హిట్‌మ్యాన్ అసహనం వ్యక్తం చేశాడు. నువ్వు త్వరగా వచ్చి ఉంటే పరుగు పూర్తయ్యేది అని రోహిత్ అనగా.. అరె.. మీరే చూసుకుని రండి.. మళ్లీ నన్ను అంటారెందుకు? అని శ్రేయస్ గట్టిగానే బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా అయ్యర్(61) సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు.చదవండి: #Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్Stump mic captures Rohit Sharma vs Shreyas Iyer 🤣🙌Whose call was it really?✍🏻👇#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YipS5K9ioa— Star Sports (@StarSportsIndia) October 23, 2025 pic.twitter.com/mN9s6b7piw— crictalk (@crictalk7) October 23, 2025
- 
      
                   
                                                       చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ ఆదుకున్నాడు.తొలుత ఆచితూచి ఆడిన రోహిత్, క్రీజులో నిలదొక్కకున్నాక ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 పరుగులు చేశాడు. సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో ఓపెనర్‌గా 9180* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (9146 ) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో గంగూలీని రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్(15310) అగ్రస్ధానంలో ఉన్నాడు.👉ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టుపై 1,000 కంటే ఎక్కువ వన్డే పరుగులు తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్‌గా ఐదో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఫీట్‌ను అంత్యంత వేగంగా అందుకున్న రెండో బ్యాటర్ మాత్రం రోహిత్ శర్మనే కావడం గమనార్హం. రోహిత్ కేవలం 21 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ (19) అగ్రస్దానంలో ఉన్నాడు.👉వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్ధానానికి చేరుకున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 11225 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గంగూలీ(11221)ని రోహిత్ అధిగమించాడు.👉ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా బ్రియాన్ లారా రికార్డును హిట్‌మ్యాన్ సమం చేశాడు. వీరిద్దరూ 18 హాఫ్ సెంచరీలు ఆసీస్‌పై సాధించారు.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్‌కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!?
- 
      
                   
                                                       డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. పెర్త్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొని మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయిన కోహ్లి.. అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. లెగ్ బిఫోర్ వికెట్గాభారత జట్టు ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్లో ఆస్ట్రేలియా యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ (Xavier Bartlett) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న కోహ్లి వికెట్ల ముందు అతడికి దొరికిపోయాడు. బార్ట్లెట్ సంధించిన బంతిని ఫ్లిక్ షాట్ ఆడబోయిన కోహ్లి విఫలమయ్యాడు. బంతి బ్యాట్‌కు బదులు ప్యాడ్‌కు తాకింది.VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T— cricket.com.au (@cricketcomau) October 23, 2025 అయితే, ఫీల్డ్ అంపైర్ సామ్ నొగాజ్స్కి లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా ప్రకటించేందుకు తటపటాయించాడు. అయితే, ఆసీస్ బౌలర్లు అప్పీలు చేసిన వెంటనే అవుట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో కోహ్లితో పాటు అడిలైడ్ స్టేడియంలోని అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. నాలుగు బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఇలా మరోసారి సున్నా చుట్టడంతో స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది.ఇదే తొలిసారికాగా వన్డే క్రికెట్లో కోహ్లి తన పదిహేడేళ్ల కెరీర్లో వరుసగా రెండుసార్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. అవుటైన తర్వాత పెవిలియన్‌కు చేరే క్రమంలో కోహ్లి గ్లోవ్స్ తీసి.. అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ డ్రెసింగ్ రూమ్ వైపు వెళ్లడం రిటైర్మెంట్ వదంతులకు ఊతమిచ్చింది.డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?ఆస్ట్రేలియాతో గతేడాది బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లోనూ వరుస వైఫల్యాల నేపథ్యంలో కోహ్లి ఆఖరి మ్యాచ్‌లో ఇలాగే చేశాడంటూ ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. ఇక ఆ సిరీస్ తర్వాత కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి తాజా చర్య కూడా వన్డే రిటైర్మెంట్కు సంకేతమేనంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మరికొంత మంది మాత్రం తనకెంతో ఇష్టమైన అడిలైడ్ వేదికపై కోహ్లి చివరి వన్డే ఆడేశాడని.. ఓవల్‌తో పాటు ఇక్కడి అభిమానులకు మాత్రమే గుడ్‌బై చెప్పాడని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తు ప్రశ్నార్థకంచివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన కోహ్లి ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ ఆసీస్‌తో వన్డేతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, పునరాగమనంలో ఇలా వరుసగా డకౌట్లు కావడం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడాలని కోహ్లి పట్టుదలగా ఉండగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం ఇది కుదరదనే సంకేతాలు ఇచ్చాడు. ఆసీస్‌తో వన్డే జట్టు ప్రకటన సందర్భంగా రోహిత్ శర్మ, కోహ్లి తమకు ఈ విషయమై హామీ ఇవ్వలేదని.. అందుకే రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తొలగించినట్లు తెలిపాడు. కాగా రో- కో ఇప్పటికే పొట్టి ఫార్మాట్, టెస్టులకు గుడ్‌బై చెప్పి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇక ఆసీస్‌తో రెండో వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్‌ను మించిపోయేవాడిని' End is very-very near guys, cherish each and every moment of Virat kohli in this tour.💔 pic.twitter.com/vgJ3Uy4rxO— U' (@toxifyy18) October 23, 2025
- 
      
                   
                                                       విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్‌కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!?ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అసీస్తో తొలి వన్డేలో డకౌటైన కోహ్లి.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. 4 బంతులు ఎదుర్కొని తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.గిల్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్ కోహ్లి.. ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన బార్ట్లెట్ తొలి బంతికి కెప్టెన్ గిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత అదే ఓవర్లో ఆఖరి బంతిని కోహ్లికి మిడిల్ స్టంప్ లైన్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సాధించాడు. ఆ బంతిని కోహ్లి ఫ్లిక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కనీ బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి ఫ్రంట్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మతో చర్చించాక రివ్యూ తీసుకోకుండానే కోహ్లి మైదానం వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రిప్లేలో బంతి మిడిల్ స్టంప్‌ను హిట్ చేస్తున్నట్లు కన్పించింది.ఇక తన ఇంటర్ననేషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో దారుణ ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లిపై నెటిజన్లు ఫైరవతున్నారు. ఇక నీ పని అయిపోయింది.. లండన్‌కు బ్యాగ్ సర్దుకో అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా అడిలైడ్‌లో కోహ్లికి మంచి రికార్డు ఉన్నప్పటికి.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు.ఈ మైదానంలో అతడికి రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని లక్ష్యం పెట్టుకున్న కోహ్లి ఈ తరహా ప్రదర్శనలు కనబరిచడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్‌ను మించిపోయేవాడిని'VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T— cricket.com.au (@cricketcomau) October 23, 2025
- 
      
                   
                                                       'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్‌ను మించిపోయేవాడిని'మైఖేల్ హస్సీ.. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించకున్నాడు. 28 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికి అన్ని ఫార్మాట్లలో కలిపి పన్నేండు వేలకు పైగా పరుగులు చేశాడు. 2007లో వన్డే వరల్డ్ కప్, , 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ గెలుచుకున్న ఆసీస్ జట్టులో హస్సీ భాగమయ్యాడు.మిస్టర్ క్రికెట్‌గా పేరు గాంచిన హస్సీ తన అద్భుత ఇన్నింగ్స్‌లతో కంగారులకు చారిత్రత్మక విజయాలను అందించాడు. కాగా దేశవాళీ క్రికెట్లో మెరుగైన రికార్డులు ఉన్నప్పటికి.. ఆ సమయంలో తీవ్రమైన పోటీ వల్ల ఆసీస్ జట్టులో ఆలస్యంగా హస్సీకి జట్టులో చోటు దక్కింది. లేటుగా వచ్చినా అందరితో మాత్రం గ్రేట్ అని అన్పించుకున్నాడు. అయితే హస్సీ తాజాగా యూట్యూబ్ ఛానల్ ది గ్రేడ్ క్రికెటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను త్వరగా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ పరుగులు చేసేవాడినంటూ అతడు చెప్పుకొచ్చాడు."సచిన్ రికార్డులు గురుంచి నేను చాలాసార్లు ఆలోచించాను. నాకు ముందుగా ఆసీస్ జట్టులో చోటు దక్కింటే,సచిన్ టెండూల్కర్ కంటే 5,000 పరుగులు ఎక్కువ చేసేవాడిని. అంతేకాకుండా ఎక్కువ సెంచరీలు, ఎక్కువ యాషెస్ విజయాలు,వరల్డ్ కప్‌లు గెలిచేవాడినని కూడా అనిపిస్తుంది.కానీ దురదృష్టవశాత్తూ ఉదయం నిద్రలేవగానే మాయపోతున్నాయి. అప్పుడు అర్ధమైంది అదింతా కల అని. ముందే నాకు ఆడే ఛాన్స్ లభించింటే బాగుండేది. ఏదేమైనప్పటికి నాకు అవకాశం ఆలస్యంగా వచ్చినప్పటికీ గొప్పగా భావిస్తున్నా అని హస్సీ పేర్కొన్నాడు. ఈ ఆసీస్ గ్రేట్ ఐపీఎల్లో చాలా సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం సీఎస్కే బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు.మైఖల్ హస్సీ తన అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 49 సగటుతో 12,398 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. అయితే హస్సీతో పోలిస్తే టెండూల్కర్ కెరీర్ 24 సంవత్సరాలు ఎక్కువగా సాగింది. 16 ఏళ్ల వయసులోనే లిటల్ మాస్టర్ భారత క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(34,357) అగ్రస్ధానంలో ఉన్నాడు. అయన దారిదాపుల్లో ఎవరూ లేరు.చదవండి: World cup 2025: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్..
- 
      
                   
                                                       IND Vs AUS: ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమిIND vs Aus 2nd Odi live updates and Highlights: అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోలి (61 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీలతో రాణించి ఆసీస్‌కు విజయం అందించారు. ఎనిమిదో వికెట్ డౌన్స్టార్క్ (4) రూపంలో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్అర్ష్దీప్ సింగ్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా బార్ట్లెట్ (3) వెనుదిరిగాడు. 45 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసినన ఆసీస్.. విజయానికి 30 బంతుల్లో 10 పరుగుల దూరంలో ఉంది. కన్నోలి 56, స్టార్క్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ ఓవెన్ (36) అవుటయ్యాడు. దీంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అయితే, అర్ధ శతకంతో కూపర్ కన్నోలి జోరుమీద ఉన్నాడు. జేవియర్ బార్ట్లెట్ అతడికి సహకరిస్తున్నాడు. 43.1 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ విజయానికి.. 41 బంతుల్లో కేవలం 16 పరుగులే అవసరం.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు అర్థ శతక వీరుడు మాథ్యూ షార్ట్ (74). సిరాజ్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోగా ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు 207-5. విజయానికి 66 బంతుల్లో 58 పరుగులు కావాలి. కన్నోలి 34, మిచెల్ ఓవెన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్26.2వ ఓవర్- 132 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ (9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 30.3 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 143 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే మరో 122 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్21.4వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మ్యాట్ రెన్షా (30) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మాథ్యూ షార్ట్‌తో 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. షార్ట్‌కు (37) జతగా అలెక్స్ క్యారీ క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్12.2వ ఓవర్- 265 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి హెడ్ (28) ఔటయ్యాడు. అంతకుముందు 8వ ఓవర్ రెండో బంతికి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ మిచెల్ మార్ష్ (11) పెవిలియన్‌కు చేరాడు. రోహిత్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. భారత్ స్కోర్: 264/9అడిలైడ్ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(61), అక్షర్ పటేల్(44) రాణించారు. ఆఖరిలో హర్షిత్ రాణా(24), అర్ష్‌దీప్ సింగ్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(0), కేఎల్ రాహుల్(11) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు.భారత్ ఎనిమిదో వికెట్ డౌన్..అడిలైడ్ వన్డేలో భారత్ ఆలౌట్ దిశగా సాగుతోంది. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన నితీశ్.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. భారత్ స్కోర్: 229-8(46 ఓవర్లు)ఏడో వికెట్ కోల్పోయిన భారత్44.1: నిలకడగా ఆడుతున అక్షర్ పటేల్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇవ్వడంతో అక్షర్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి ఏడు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 223-7(44.1)వాషీ అవుట్.. ఆరో వికెట్ డౌన్41.5: బార్ట్లెట్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన వాషింగ్టన్ సుందర్ (12). దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి రాగా.. అక్షర్ పటేల్ 41 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 213-6(42). టీమిండియా ఐదో వికెట్ డౌన్టీమిండియా 174 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్శ్రేయస్ అయ్యర్ (61) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో అయ్యర్ బౌల్డ్. స్కోరు: 160-4(32.4). అక్షర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు.రోహిత్ శర్మ ఔట్..రోహిత్ శర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోంయింది. 73 పరుగులు చేసిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు.అయ్యర్ హాఫ్ సెంచరీ..శ్రేయస్ అయ్యర్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో అయ్యర్ తన 23వ ఆర్ధ శతకాన్ని అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 94-2 (29). రోహిత్ 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ21.5: కన్నోలి బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 74 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న హిట్‌మ్యాన్. వన్డేల్లో ఇది 59వ ఫిఫ్టీ. టీమిండియా స్కోరు: 94-2 (22). అయ్యర్ 33 పరుగులతో ఆడుతున్నాడు.సిక్స్‌లు, ఫోర్.. 17 పరుగులు19వ ఓవర్లో రోహిత్ శర్మ రెండు సిక్స్‌లు బాదగా.. శ్రేయస్ అయ్యర్ ఓ ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మిచెల్ ఓవెన్ బౌలింగ్‌లో ఈ ఓవర్లో ఓవరాల్‌గా 17 పరుగులు వచ్చాయి. టీమిండియా స్కోరు 83-2.నిలకడగా ఆడుతున్న రోహిత్, అయ్యర్..15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(26), శ్రేయస్ అయ్యర్(13) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.టీమిండియాకు భారీ షాక్.. కోహ్లి డకౌట్విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే కోహ్లి పెవిలియన్‌కు చేరాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్..రెండో వన్డేలో కూడా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన గిల్.. బార్ట్లెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు.తడబడుతున్న గిల్..6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఓ వైపు శుభ్‌మన్ గిల్(8 బంతుల్లో 9) మంచి టచ్‌లో కన్పిస్తుంటే.. రోహిత్ శర్మ(28 బంతుల్లో 8) మాత్రం తడబడుతున్నాడు.అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి స్టార్ ప్లేయర్లు అలెక్స్ క్యారీ, అడమ్ జంపా వచ్చారు. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పెర్త్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు.తుది జట్లుఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
- 
      
                   
                                                       సిరీస్ కాపాడుకునేందుకు...అడిలైడ్: శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో తొలి వన్డే ఓడిన భారత జట్టు మరో పోరులో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. ప్రస్తుతం 0–1తో వెనుకంజతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ను చేజార్చుకుంటుంది. వర్షం కారణంగా 26 ఓవర్లకే కుదించిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ్రస్టేలియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. సహజంగానే మరోసారి అందరి దృష్టీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపైనే ఉంది. తొలి వన్డేలో వీరిద్దరు విఫలం కావడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రతీ మ్యాచ్ వీరికి పరీక్ష కాదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెబుతున్నా... కచి్చతంగా రాణించాల్సిన ఒత్తిడి వీరిపై ఉందనేది వాస్తవం. అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి తన ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. భారత్ తుది జట్టు విషయంలో మార్పు ఉండకపోవచ్చు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్‌లలో ఒకరిని తప్పించి రెగ్యులర్ స్పిన్నర్ కుల్దీప్కు అవకాశం ఇస్తారా అనేది సందేహమే. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్‌లో ఫిలిప్స్, కునెమన్ స్థానాల్లో అలెక్స్ కేరీ, ఆడమ్ జంపా రావడం ఖాయమైంది. అడిలైడ్ మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం కావడంతో భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడిన గత రెండు వన్డేల్లో (2012, 2019) భారత జట్టే గెలిచింది.
- 
      
                   
                                                       ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లిమూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్‌లో విరాట్ 54 పరుగులు చేస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ టెండూల్కర్-18426కుమార సంగక్కర-14234విరాట్ కోహ్లి-14181ఈ మ్యాచ్‌లో విరాట్ 68 పరుగులు చేస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో (వన్డేలు, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 వన్డేల్లో 18426 పరుగులు, ఒకే ఓక టీ20లో 10 పరుగులు సహా 18436 పరుగులు చేయగా.. విరాట్ 303 వన్డేల్లో 14181 పరుగులు, 125 టీ20ల్లో 4188 పరుగులు 18369 చేశాడు.ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేస్తే సచిన్ పేరిటే ఉన్న మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. ఏదైనా సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్, సచిన్‌ల పేరిట సంయుక్తంగా ఉంది. విరాట్ వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. టెస్ట్‌ల్లో సచిన్ పేరిట 51 శతకాలు ఉన్నాయి.కాగా, టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. ఆరు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) ప్రస్తుత ఆసీస్ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌటైన విరాట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. రేపు జరుగబోయే రెండో వన్డేలో విరాట్ చెలరేగడం ఖాయమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఈ మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో విరాట్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో 2 సెంచరీల సాయంతో 244 పరుగులు చేశాడు. ఈ మైదానంలో మిగతా రెండు ఫార్మాట్లలో కూడా విరాట్‌కు మంచి రికార్డు ఉంది. 5 టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, ఓ అర్ద సెంచరీ సాయంతో 527 పరుగులు... 3 టీ20ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 204 పరుగులు చేశాడు.రేపటి మ్యాచ్‌లో విరాట్ 25 పరుగలు చేస్తే అడిలైడ్‌లో 1000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకుంటాడు. ఇదిలా ఉంటే, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా మరో 29 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: ఓపెనర్‌గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్
- 
      
                   
                                                       కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్దాదాపు ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేసిన దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఊహించని రీతిలో విఫలమయ్యారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఇద్దరూ తేలిపోయారు. ఓపెనర్ రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది ఎనిమిది పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు.కోహ్లి.. తొలిసారి డకౌట్ఎనిమిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి పరుగుల ఖాతా తెరవకుండానే.. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్‌లో కూపర్ కన్నోలికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తద్వారా ఆసీస్‌తో వన్డేల్లో కోహ్లి తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో రో- కో వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించిన తీరు చర్చకు దారితీసింది.కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు‘‘వాళ్లిద్దరు ఐపీఎల్ ఆడారు. కాబట్టి రీఎంట్రీ సన్నాహకాల గురించి సందేహాలు అవసరమే లేదు. నాకు తెలిసి వాతావరణం కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన వాళ్ల టాపార్డర్‌కు ఇలాగే జరిగి ఉండేది.నాలుగైదుసార్ల అంతరాయం తర్వాత బ్యాటింగ్‌కు వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్లిద్దరు తిరిగి పుంజుకుంటారు’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘వాళ్లిద్దరు అనుభవజ్ఞులైన బ్యాటర్లు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందు ఇద్దరూ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు.ఇప్పుడే వాళ్ల ప్రదర్శను జడ్జ్ చేయడం సరికాదు. ఇటీవలే వాళ్లు టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఈ సిరీస్ ఆడేందుకు వచ్చారు. ఇద్దరూ పూర్తి ఫిట్‌గా ఉన్నారు. సీనియర్లకు ప్రత్యేకంగా మేము ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని సితాన్షు కొటక్ రోహిత్- కోహ్లిలను వెనకేసుకువచ్చాడు.వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా!అయితే, కొటక్ చెప్పినట్లు రోహిత్- కోహ్లి వర్షం అంతరాయం కలిగించేంత వరకు క్రీజులోనే లేరు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో.. ‘‘వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా.. అంతరాయాల వల్ల డిస్టర్బ్ అవడానికి’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసీస్- భారత్ మధ్య పెర్త్‌లో జరిగిన తొలి వన్డేను వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం తమకు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ఆసియా కప్ భారత్‌దే.. కానీ నా చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తా: నఖ్వీ ఓవరాక్షన్
- 
      
                   
                                                       అక్షర్‌తో పాటు వరల్డ్‌కప్ జట్టులో అతడూ ఉండాలి.. ఎందుకంటే...ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2027 (ICC ODI WC 2027) కోసం టీమిండియా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే కెప్టెన్‌ను మార్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వెల్లడించాడు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించినట్లు స్పష్టం చేశాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్క్ సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను సెలక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే.సెలక్షన్ నా చేతుల్లో లేదుజడ్డూకు మొండిచేయి చూపి స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయంపై జడ్డూ స్పందిస్తూ.. ‘‘సెలక్షన్ నా చేతుల్లో లేదు. అయితే, ఈ టూర్లో ఆడాలని ఆశపడిన మాట వాస్తవమే.కానీ జట్టు యాజమాన్యం, సెలక్టర్లు, కోచ్, కెప్టెన్ ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. నన్ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే, జట్టు ప్రకటనకు ముందే నాతో ఈ విషయం గురించి చర్చించడం సంతోషం కలిగించింది.అందుకే జట్టులో నా పేరు లేనపుడు పెద్దగా ఆశ్చర్యపోలేదు. నన్ను ఎందుకు తప్పించారో చెప్పినందుకు కాస్త ఊరటగా అనిపించింది’’ అని జడేజా కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలు వన్డే వరల్డ్‌కప్ ఆడే విషయంపై హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.తద్వారా దిగ్గజ బ్యాటర్లను మెగా టోర్నీ దాకా కొనసాగించే పరిస్థితి లేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జడ్డూకు కూడా రో-కో మాదిరి తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి జడ్డూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.భారత జట్టులో అతడు తప్పక ఉండాలిఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు 2027 వరల్డ్‌కప్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో దయచేసి రవీంద్ర జడేజా పేరు విస్మరించకండి. అతడు కూడా ప్రణాళికల్లో ఉంటాడు. ఇందులో సందేహానికి తావులేదు.ఇప్పటికీ ఏడు- ఎనిమిదేళ్ల క్రితం మాదిరే అతడు ఫీల్డింగ్ చేస్తున్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు. బంతి కోసం అతడు పాదరసంలా పరుగులు తీస్తుంటే చూడటం ముచ్చటగా అనిపిస్తుంది. ఆస్ట్రేలియాతో వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నేను అర్థం చేసుకోగలను. అయితే, వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి వేదికైన సౌతాఫ్రికాలో పిచ్ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్షర్ పటేల్‌తో పాటు రవీంద్ర జడేజా తప్పక జట్టులో ఉండాలి’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డేలో గిల్ సేన ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
- 
      
                   
                                                       రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలుటీమిండియా తరఫున పునరాగమనంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్రంగా నిరాశపరిచారు. చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన రో-కో తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేయగా.. కోహ్లి మరీ ఘోరంగా విఫలమయ్యాడు.ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు కోహ్లి. ఆసీస్‌తో వన్డేల్లో కోహ్లి ఇలా సున్నా చుట్టడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఆట తీరును విమర్శించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT) నాటి కోహ్లి వైఫల్యాలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నాడు.ఆ వైఫల్యాలే వెంటాడుతున్నాయి.. ఇలా అయితే కష్టంకాగా బీజీటీ టెస్టు సిరీస్‌లో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడబోయి దాదాపు ఎనిమిదిసార్లు అవుటైన విషయం తెలిసిందే. మరోవైపు.. రోహిత్ కూడా నాటి సిరీస్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఈ ఇద్దరు ఇప్పుడు సరికొత్తగా తిరిగివచ్చారు. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఇక ఫిట్‌నెస్‌కు మారుపేరైన కోహ్లి నెట్స్‌లో చెమటోడ్చి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ ఏకంగా పది కిలోల మేర బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. అయితే, ఇద్దరూ రీఎంట్రీలో విఫలం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..‘‘ఫిట్నెస్ వేరు. మ్యాచ్ ఫిట్నెస్ వేరు. ఆసీస్‌తో తొలి వన్డేలో పరుగులు రాబట్టేందుకు రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇక విరాట్కేమో బీజీటీ కష్టాలు మళ్లీ తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. అడిలైడ్, సిడ్నీ వన్డేల్లో మాత్రం వీరు కచ్చితంగా లోపాలను అధిగమించి సత్తా చాటుతారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం ఉత్తమంఇక తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు. ‘‘ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించేటపుడు.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం ఉత్తమం.నేరుగా వెళ్లి మ్యాచ్‌లు ఆడటం అంటే.. టీమిండియాకు కఠిన సవాలే. అక్కడి పిచ్ పరిస్థితులకు అంత తేలికగా అలవాటుపడలేము. బౌన్సీ పిచ్‌లు మనల్ని పరీక్షిస్తాయి. మన బౌలర్లు తొలి వన్డేలో సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయారు. ఇకనైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ హితవు పలికాడు.చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి
- 
      
                   
                                                       244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లిటీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) తమ అంతర్జాతీయ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు నెలల తర్వాత భారత్ తరపున ఆడిన ఈ సీనియర్ ద్వయం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగారు. బౌన్స్ అండ్ ఫాస్ట్ పెర్త్ పిచ్‌పై ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడానికి వీరిద్దరూ ఇబ్బంది పడ్డారు. హిట్‌మ్యాన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్ బంతికి దొరికి పోగా.. స్టార్క్ బౌలింగ్‌లో డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అందరి కళ్లుపై వీరిద్దరి పైనే ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన రో-కో అడిలైడ్లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆడిలైడ్ ఓవల్‌లో రోహిత్, కోహ్లి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.కోహ్లి రికార్డు అదుర్స్.. ఈ మైదానంలో కోహ్లికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన కోహ్లి.. 61.00 సగటుతో 244 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ మైదానంలో అతడు చివరగా 2019లో ఆడాడు. అయితే ఈ ఓవల్ స్టేడియంలోని పిచ్ తొలుత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించినప్పటికి.. నెమ్మదిగా స్పిన్నర్లు గేమ్‌లోకి వస్తారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కోహ్లి సత్తాచాటే అవకాశముంది. ఈ ఓవల్ మైదానంలో కోహ్లికి టెస్టుల్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన కింగ్ కోహ్లి.. 52.70 సగటుతో 527 పరుగులు చేశాడు. ఈ చారిత్రత్మక మైదానంలో అతడి పేరిట మూడు టెస్టు సెంచరీలు ఉన్నాయి.రోహిత్.. నో హిట్అయితే ఈ మైదానంలో గత రికార్డులు రోహిత్ శర్మను భయపెడుతున్నాయి. అడిలైడ్‌లో హిట్‌మ్యాన్ ట్రాక్ రికార్డు అస్సలు బాగోలేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో 6 వన్డేలు ఆడిన ఈ మాజీ కెప్టెన్.. 21.83 సగటుతో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 44గా ఉంది. టెస్టుల్లో కూడా రోహిత్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు.చదవండి: 352 వికెట్లు.. 10,470 రన్స్.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్
- 
      
                   
                                                       ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలుటీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కమార్ రెడ్డి (Nitish Kumar Reddy)పై భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ప్రశంసలు కురిపించాడు. ఈ ఆంధ్ర ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని పేర్కొన్నాడు.అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. ఇప్పటికే టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారాడు. అంతకుముందే టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన ఈ విశాఖ కుర్రాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా టీమిండియా దిగ్గజ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాడు నితీశ్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క్యాప్ నంబర్ 260. నితీశ్ రెడ్డి. నీ ఆటిట్యూడ్, నైపుణ్యాలతో కెరీర్‌ను గొప్పగా ఆరంభించావు. ఇదే జోరును కొనసాగిస్తే వందకు 110 శాతం.. నువ్వు టీమిండియాతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తావని చెప్పగలను. ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదగబోతున్నావని అనిపిస్తోంది. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఫార్మాట్లోనూ ఆడాలన్న నీ కల నెరవేరింది. అందరూ నీకు తోడుగా ఉంటారునీకు జట్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆటగాడిగా నీకేం కావాలో అన్నీ సమకూరుస్తుంది. ఎప్పుడు, ఏం కావాలన్నా అందరూ నీకు తోడుగా ఉంటారు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. గుడ్ లక్. నీ కెరీర్ గొప్పగా ఉండాలి’’ అంటూ రోహిత్ శర్మ నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆసీస్‌తో తొలి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టెస్టుల్లో ఎనిమిది, టీ20లలో మూడు వికెట్లు తీశాడు.అపుడు కోహ్లి.. ఇపుడు రోహిత్అదే విధంగా ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో టెస్టుల్లో 386, టీ20లలో 90 పరుగులు ఉన్నాయి. కాగా గతేడాది పెర్త్ వేదికగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న 22 ఏళ్ల నితీశ్ రెడ్డి.. తాజాగా అదే వేదిక మీద రోహిత్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం విశేషం. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గిల్ సేనకు ఓటమిఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఇక డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా తమ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)
- 
      
                   
                                                       అదేంటో.. ఎవరికీ అర్థం కాదు: DLS పద్ధతిపై గావస్కర్ విమర్శలుఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా 26 ఓవర్లకు ఈ మ్యాచ్‌ను కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యం 131 పరుగులుగా నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి కంగారూలు పనిపూర్తి చేశారు. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది.అదేంటో.. ఎవరికీ అర్థం కాదుఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీఎల్ఎస్ (Duckworth–Lewis–Stern method) పద్ధతి ద్వారా లక్ష్యాలు ఎలా నిర్దేశిస్తారో ఎవరికీ అర్థం కాదని వాపోయాడు. ‘‘ఈ మెథడ్ అందరికీ అర్థం అవుతుందని నేను అనుకోను. అయితే, సుదీర్ఘ కాలంగా ఈ పద్ధతినే వాడుతున్నారు.ఇలా మ్యాచ్‌లకు వర్షాలు ఆటంకం కలిగించినపుడు.. గతంలో ఓ భారతీయుడు VJD (వి. జయదేవన్ మెథడ్)మెథడ్‌ను ప్రవేశపెట్టాడు. దేశవాళీ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇదే ఉపయోగించేది. అయితే, ఇప్పుడు ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు.ఇరుజట్లకు సమన్యాయం జరిగేలాఏదేమైనా వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగినపుడు.. ఇరుజట్లకు సమన్యాయం జరిగేలా ఉండే పద్ధతులను వాడితే బాగుంటుంది. లక్ష్యం నిర్దేశించేందుకు ప్రామాణికం ఏమిటో వివరించాల్సి ఉంటుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అదే విధంగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆసీస్‌తో తొలి వన్డేలో విఫలం కావడంపై కూడా గావస్కర్ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘టీమిండియా ఐదు నెలల క్రితమే చాంపియన్స్ ట్రోపీ గెలిచింది. జట్టు బాగుంది.రో- కో ఒక్కసారి ఫామ్‌లోకి వస్తేరోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదుపరి మ్యాచ్‌లలో భారీగా పరుగులు రాబట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాన్నాళ్ల తర్వాత వారు మైదానంలో అడుగుపెట్టారు. నెట్స్‌లో రిజర్వు బౌలర్ల త్రోడౌన్స్‌ను ఎదుర్కొన్నారు. వాళ్లిద్దరు ఫామ్‌లోకి వస్తే టీమిండియా 300- 320 పరుగులు చేయగలదు’’ అని గావస్కర్ రో-కోకు మద్దతుగా నిలిచాడు.కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను నయా సారథిగా ఎంపిక చేసింది. ఇక గిల్ ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ వేదిక.చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’
- 
      
                   
                                                       అతడిని ఎక్స్పోజ్ చేయండి.. దాచి పెడతారెందుకు?.. జస్సీ లేనపుడు..ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి చర్చనీయాంశమైన పేరు హర్షిత్ రాణా (Harshit Rana). హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రియ శిష్యుడైన కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కిందనే విమర్శలు వచ్చాయి. భారత మాజీ క్రికెటర్లు క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ ప్రధానంగా ఈ విషయంపై వీడియోలు చేశారు.27 పరుగులు ఇచ్చిఅయితే, గంభీర్ కూడా వారికి అదే రీతిలో బదులిచ్చాడు. యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడి భవిష్యత్తు నాశనం చేస్తారా? అంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో తొలి వన్డే (IND vs AUS 1st ODI) తుదిజట్టులోనూ హర్షిత్ రాణాకు స్థానం దక్కింది. ఈ రైటార్మ్ యువ పేసర్ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్‌లోనే 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు హర్షిత్ రాణా. ఈ నేపథ్యంలో భారత-‘ఎ’ జట్టు మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ హర్షిత్‌కు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇవ్వడాన్ని విమర్శించాడు.అతడిని ఎక్స్పోజ్ చేయండి.. దాచి పెడతారెందుకు?ఈ మేరకు.. ‘‘ఒకవేళ హర్షిత్ రాణాను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడానికే జట్టులోకి తీసుకుంటే.. అతడిని తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. ఎక్స్పోజ్ చేయండి. రెండేళ్ల పాటు ఆ పాత్రలో తనను కొనసాగించండి.అంతేగానీ.. అదనపు బ్యాటర్‌ను జట్టులోకి తీసుకుని హర్షిత్‌ను కాపాడటం ఎందుకు? జస్సీ లేనపుడు..ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి లేదంటే వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సింది. జస్సీ (జస్ప్రీత్ బుమ్రా) గైర్హాజరీలో.. అతడు లేని లోటు పూడుస్తూ కుల్దీప్ వికెట్లు తీసేవాడు కదా!’’ అని ప్రియాంక్ పాంచల్ సోషల్ మీడియా వేదికగా మేనేజ్మెంట్ తీరుపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకున్నాడు.ఓటమితో మొదలుకాగా పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో గిల్ సేన తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆసీస్ తమ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 21.1 ఓవర్లలో 131 పరుగులు చేసి జయభేరి మోగించింది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్
- 
      
                   
                                                       నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం (IND vs AUS 1st ODI) పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు గుప్పించాడు.పెర్త్ వన్డేలో భారత తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరుగార్చారని అశూ మండిపడ్డాడు. వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసీస్‌తో సిరీస్‌తో తన ప్రయాణం మొదలుపెట్టాడు. పెర్త్ స్టేడియంలో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.రో- కో ఫెయిల్ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ 8, గిల్ 10 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా విఫలం కాగా.. అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్(10), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు.రాణించిన మిచెల్ మార్ష్వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 21.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసి.. డీఎల్ఎస్ పద్ధతితో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37), మ్యాట్ రెన్షా (21 నాటౌట్) రాణించారు.Just when #TeamIndia needed it most! @Sundarwashi5 breaks a crucial partnership. 👏#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/6e1VZmbAjz— Star Sports (@StarSportsIndia) October 19, 2025 తేలిపోయిన భారత బౌలర్లువికెట్ తీయడానికి తిప్పలు పడ్డ భారత బౌలర్లలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం గురించి అశ్విన్ మాట్లాడుతూ.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు‘‘వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నేను అర్థం చేసుకోగలను. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్‌లో డెప్త్ కోసమే. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి నితీశ్‌ను వారికి జతచేశారు.కానీ ఇదేం పద్ధతి?అసలు మీరెందుకు బౌలింగ్‌పై దృష్టి పెట్టడం లేదు బాస్. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు? ఈ పిచ్‌పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు.అత్యుత్తమ బౌలర్లను పక్కన పెడతారా?ఏమైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడతారు. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే... బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా! పరుగులు రాబట్టడం బ్యాటర్ల పని. అదనపు బ్యాటర్ కోసం ఆల్రౌండర్లను దించి వారి పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? జట్టులో అత్యుత్తమ బౌలర్లను పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం?కేవలం బ్యాటింగ్ ఆర్డర్‌ను పొడిగించుకోవడానికి తుదిజట్టు కూర్పు విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి’’ అని అశ్విన్.. టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్- భారత్ మధ్య గురువారం రెండో వన్డేకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అడిలైడ్ వేదిక.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?
- 
      
                   
                                                       సోదరా... రోహిత్‌కు పాప్‌కార్న్ ఇవ్వకు: అభిషేక్భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే సందర్భంగా జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం వాటిల్లగా... చివరకు 26 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది.అయితే మ్యాచ్‌కు పదేపదే వర్షం ఆటంకం కల్పించినప్పుడు ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సేదతీరుతూ కనిపించారు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తన స్నేహితుడైన రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి పాప్‌కార్న్ తింటున్న రోహిత్‌ను చూస్తూ... ‘అరే భాయ్ ఉసే పాప్‌కార్న్ మత్ దే’ (సోదరా అతడికి పాప్‌కార్న్ ఇవ్వకు) అంటూ కామెంట్ చేశాడు.టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న హిట్‌మ్యాన్... ఇటీవల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వచ్చిన విరామంలో... ఏకంగా 11 కేజీల బరువు తగ్గాడు. దీనిపై మ్యాచ్‌కు ముందు అభిషేక్ మాట్లాడుతూ... ‘రోహిత్ పూర్తిగా మారిపోయాడు. మరింత ఫిట్‌గా, మరింత దృఢంగా మారాడు. ఫిట్నెస్ పెంపొందించుకుంటే... నైపుణ్యం దానంతటదే పెరుగుతుంది. ఈ విషయంలో రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇదంతా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే కావచ్చు. అప్పటి వరకు ఆటలో కొనసాగాలంటే మొదట తన బరువు తగ్గించుకోవాలని రోహిత్ బలంగా అనుకున్నాడు. దాని వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడతడు నవ యువకుడిలా కనిపిస్తున్నాడు’ అని అన్నాడు.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?
- 
      
                   
                                                       ఓడినా సంతృప్తిగా ఉన్నాం.. ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం గిల్ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం) పరాజయంపాలైంది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31), ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించి టీమిండియా పరువు కాపాడారు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా గిల్ తొలి మ్యాచ్‌లోనే (10) నిరాశపరిచాడు. ఓవర్ హైప్ మధ్య శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా భారత్ పవర్‌ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది.అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిన కుదించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది.గిల్ ఆసక్తికర వ్యాఖ్యలుమ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు, ఆట మొత్తం క్యాచ్-అప్ గేమ్‌గా మారుతుంది. ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. కొన్ని పాజిటివ్‌లు కూడా ఉన్నాయి. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాం. దానికి సంతృప్తిగా ఉన్నాం" అని అన్నాడు.అభిమానుల మద్దతుపై కూడా గిల్ స్పందించాడు. "అభిమానులు భారీగా వచ్చారు. మేము అదృష్టవంతులం. అడిలైడ్‌లో కూడా మాకు ఇలాగే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నాడు.కాగా, గిల్ తన వన్డే కెప్టెన్సీ కెరీర్‌ను ఓటమితో ప్రారంభించాడు. తద్వారా విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఓటమితో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. ఈ ఏడాది ఎనిమిది వరుస విజయాల తర్వాత (వన్డేల్లో) భారత్‌కు ఇది తొలి పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలి భారత ప్లేయర్
- 
      
                   
                                                       టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్వన్డే క్రికెట్లో టీమిండియా (Team India) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత జట్టు.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఓటమిపాలైంది. వన్డేల్లో దాదాపుగా రెండేళ్ల తర్వాత భారత్‌కు ఇది తొలి పరాజయం. భారత్ చివరిగా 2023 డిసెంబర్ 19న సౌతాఫ్రికా చేతిలో ఓడింది.లేట్‌గా పలకరించిన పరాజయంఈ ఏడాది వన్డేల్లో భారత్‌ను పరాజయం చాలా లేట్‌గా పలకరించింది. 1991 తర్వాత ఓ ఏడాది అత్యంత లేట్‌గా పలకరించిన పరాజయం ఇది. నాడు భారత్‌కు తొలి వన్డే పరాజయం అక్టోబర్ 23న ఎదురైంది.టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసిన గిల్వన్డేల్టో టీమిండియా జైత్రయాత్రకు శుభ్‌మన్ గిల్ బ్రేక్‌లు వేశాడు. భారత వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు.కోహ్లి సరసన గిల్ఈ ఓటమితో గిల్ మరో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్‌లో కొత్తగా నిర్మించిన ఓపస్ స్టేడియంలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (10) కూడా తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం
- 
      
                   
                                                       బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియాఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా (Team India) ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో (India vs Australia) 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వరుణుడి ఆటంకాలు.. 26 ఓవర్ల మ్యాచ్పలు అంతరాయాల తర్వాత మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆదుకున్న రాహుల్, అక్షర్.. నితీశ్ మెరుపులువికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.దారుణంగా విఫలమైన రోహిత్, కోహ్లినాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. సత్తా చాటిన ఆసీస్ బౌలర్లుఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.సునాయాసంగా ఛేదించిన ఆసీస్26 ఓవర్లలో భారత్ 136 పరుగులు చేసినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం
- 
      
                   
                                                       విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..!పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగుతున్న తొలి వన్డేలో (India Vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) డకౌటయ్యాడు. 8 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లికి ఇది తొలి డకౌట్.ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 29 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఐదు సెంచరీలు, 51కు పైగా సగటుతో పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. చాలా విరామం తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి డకౌట్ కావడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఓవరాల్‌గా కోహ్లికి వన్డేల్లో ఇది 17వ డకౌట్. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లైన రికార్డు సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా ఈ రికార్డు సనత్ జయసూర్య (34) ఖాతాలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, అనంతరం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోని సరసన
- 
      
                   
                                                       రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోనిల సరసనటీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ ఫీట్ అందుకున్న ఐదో భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు. 38 ఏళ్ల రోహిత్ భారత తరపున ఇప్పటివరకు 274 వన్డేలు, 67 టెస్టులు,159 టీ20లు ఆడాడు. గత ఏడాది జూన్‌లో టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. నాలుగు నెలల కింద టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఈ ముంబైకర్ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్లో 19,708 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264(వన్డేల్లో)గా ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్ భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.500 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ప్లేయర్స్ వీరే👉 సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్‌లు👉విరాట్ కోహ్లి – 551 మ్యాచ్‌లు👉ఎంఎస్ ధోని – 535 మ్యాచ్‌లు👉 రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్‌లు👉రోహిత్ శర్మ – 500 మ్యాచ్లుచదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు
- 
      
                   
                                                       చెత్త షాట్ ఆడి ఔట్.. కట్ చేస్తే! పాప్ కార్న్ తింటూ రిలాక్స్(వీడియో)టీమిండియా టెస్టు కెప్టెన్సీని అద్బుతమైన సెంచరీతో ఆరంభించిన శుభ్‌మన్ గిల్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. భారత వన్డే సారథిగా తొలి మ్యాచ్‌లో గిల్ విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఔటైన సమయంలో బాధ్యతయతంగా ఆడాల్సిన గిల్.. పేలవ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. భారత ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన నాథన్ ఈల్లీస్.. తొలి బంతిని గిల్‌కు లైగ్ సైడ్ డెలివరీగా సంధించాడు. బౌలర్ ట్రాప్‌లో పడ్డ గిల్ ఆ డెలివరీని డౌన్‌ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో వికెట్ కీపర్ ఫిలిప్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే గిల్ ఔటయ్యాక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన గిల్.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పాప్ కార్న్ తింటూ రిలాక్స్‌గా కన్పించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొంచెం బాధ లేకుండా పాప్ కార్న్ తింటూ రిలాక్స్ అవుతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించారు. ఇంకా 17 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లి(0), శ్రేయస్ అయ్యర్(11) తీవ్ర నిరాశపరిచారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు😭😭 #RohitSharma𓃵 #ShubmanGillpic.twitter.com/DCNj5q3Spu— 𝓗𝓲𝓽𝓶𝓪𝓷 (@Slefless45) October 19, 2025
- 
      
                   
                                                       చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడుటీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇకపై ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లలో భారత్‌కు వహిస్తున్న నితీశ్ .. తాజాగా వన్డేల్లోకి కూడా అడుగుపెట్టాడు.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా నితీశ్ భారత్ తరపున 50 ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తేడాది నవంబర్ 22వ తేదీ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ డెబ్యూ క్యాప్ అందుకున్న ఈ తెలుగు కుర్రాడు.. ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదగా వన్డే క్యాప్‌ను తీసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన నితీశ్..93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో పెర్త్ వేదికగా టెస్ట్, వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 1932 నుంచి భారత్ క్రికెట్ ఆడుతున్నప్పటికి ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. 2024/25 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పెర్త్ వేదికగా టెస్టుల్లో డెబ్యూ చేసిన నితీశ్.. యాదృఛ్చికంగా ఏడాది తర్వాత అదే మైదానంలో వన్డే అరంగేట్రం చేశాడు.ఇంతకముందు పెర్త్ వేదికగా బరిందర్ శ్రణ్, సుబ్రోతో బెనర్జీలు భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేయగా.. హర్షిత్ రాణా, వినయ్ కుమార్‌లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు. కానీ నితీష్ ఒక్కడే రెండు వైట్ బాల్ ఫార్మాట్లలోనూ పెర్త్‌లో డెబ్యూ చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), కోహ్లి(0), గిల్(10) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్ వుడ్, ఈల్లీస్ తలా వికెట్ సాధించారు. అయితే వర్షం కారణంగా ఆట ఆగిపోయింది.చదవండి: Virat Kohli: రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?
- 
      
                   
                                                       రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆతృతగా ఎదురు చూసిన అభిమానులను కింగ్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ డకౌటయ్యాడు. 8 బంతులు ఆడిన కోహ్లి తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని అంతా భావించారు. కానీ ఈ ఢిల్లీ ఆటగాడు అందరి అంచనాలను తారుమారు చేశాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అతడు ఇబ్బంది పడుతూ కన్పించాడు. వరుసుగా ఏడు బంతుల్లో సింగిల్ రన్ కూడా రాకపోవడంతో విరాట్‌పై ఒత్తడి పెరిగింది. ఈ క్రమంలో 7 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కు వెలుపుల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని కోహ్లి డ్రైవ్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బ్యాక్వర్డ్ పాయింట్లో కూపర్ కొన్నోలీ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో కోహ్లి డకౌట్‌గా మైదానాన్ని వీడాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లి డకౌట్ కావడం ఇదే తొలిసారి.అయితే వన్డే ప్రపంచకప్-2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లి.. ఈ తరహా ప్రదర్శనలు కనబరిస్తే భారత జట్టులో చోటు గల్లంతే అని చెప్పుకోవాలి. ఫిట్నెస్ పరంగా అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వరల్డ్‌కప్ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటివరకు అతడు ఫామ్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నర్థకంగా మారింది. మరోవైపు యువ ఆటగాళ్ల నుంచి కోహ్లి తీవ్ర పోటీ ఎదురు అవుతోంది. దీంతో కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా అతడు సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన రీఎంట్రీలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IND vs AUS: ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగాMitchell Starc gets Virat Kohli. pic.twitter.com/zsdEltOHRe— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2025
- 
      
                   
                                                       ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగాటీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.7 నెలల తర్వాత భారత జట్టులోకి హిట్‌మ్యాన్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ అందరి ఆశలను ఈ మాజీ కెప్టెన్ ఆడియశలు చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ ఇబ్బంది పడ్డాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లు బౌన్సర్లతో రోహిత్‌ను భయపెట్టారు.భారత్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ స్లిప్స్‌లో దొరికిపోయాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని హేజిల్‌వుడ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ బంతిని రోహిత్ ఆడకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ బంతిని ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న మాట్ రెన్షా చేతికి వెళ్లింది. దీంతో 14 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. మైదానం వీడాల్సి వచ్చింది. పెర్త్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. ఈ విధంగా ఔట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో శుభ్‌మన్ గిల్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్‌కు భారత్ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్
- 
      
                   
                                                       ఆసీస్‌తో తొలి వన్డే.. టీమిండియా ఓటమిమూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్7.5వ ఓవర్- 44 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో మాథ్యూ షార్ట్ (8) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్26 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఛేదనను ఆసీస్ ఘనంగా ప్రారంభించింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో హెడ్ రెండు బౌండరీలు బాదాడు. అయితే రెండో ఓవర్లో ఆసీస్‌కు షాక్ తగిలింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి హెడ్ (8) ఔటయ్యాడు. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన భారత్పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా19.6వ ఓవర్- 84 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కుహ్నేమన్ బౌలింగ్‌లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (310 ఔటయ్యాడు. రాహుల్‌కు (17) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 26 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. భారత్ నాలుగో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(10), కేఎల్ రాహుల్(0) ఉన్నారు. మరి కాసేపట్లో ఆట మొదలుమరో 10 నిమిషాల్లో ఆట తిరిగి ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌ను వర్షం కారణంగా 35 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.మరోసారి వర్షం అడ్డంకి..పెర్త్ వన్డేకు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. భారత్ స్కోర్ 37/3 వద్ద ఉండగా.. వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.11 ఓవర్లకు భారత్ స్కోర్: 35/311 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(6), శ్రేయస్ అయ్యర్(6) ఉన్నారు.వర్షం అటంకి..తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి భారత్ స్కోర్: 25/3.కెప్టెన్ గిల్ ఔట్.. భారత్‌కు వరుస షాక్‌లు తగిలాయి. కెప్టెన్ గిల్ ఔట్. ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసిన గిల్.. ఇల్లీస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కింగ్ కోహ్లీ ఔట్..భారత్ మరో షాక్ తగిలింది. రోహిత్ బాటలోనే కింగ్ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్‌లో కోహ్లీ.. క్యాచ్ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా13 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(5), రోహిత్ శర్మ(8) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున నితీశ్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లతో టీమిండియాకు బరిలోకి దిగింది.మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లు ఫాస్ట్ బౌలర్లగా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు.రోహిత్, విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేశారు. మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్లకు వన్డే క్యాప్‌లను అందించారు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్
- 
      
                   
                                                       ఆసీస్‌తో తొలి వన్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది.అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్.పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామమే అనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్చదవండి: ప్లే ఆఫ్స్‌కు చేరిన తెలుగు టైటాన్స్
- 
      
                   
                                                       పబ్లిక్‌గా అంత మాట అంటావా? ముందు నీ పనేంటో చూసుకో గంభీర్టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) తీరుపై భారత మాజీ క్రికెటర్ బల్విందర్ సంధు (Balvinder Sandhu) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోచ్‌గా చేయాల్సిన పని మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు. ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని.. దిగ్గజాల గురించి కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చురకలు అంటించాడు.అసలేం జరిగిందంటే.. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు చోటు ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చాయి. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తాను ఫిట్‌గానే ఉన్నానని చెప్పినా.. అతడిని కాదని హర్షిత్‌కు పెద్ద పీట వేయడం విమర్శలకు దారితీసింది.ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న క్రమంలో అప్పటి మెంటార్ గంభీర్‌కు ప్రియ శిష్యుడైన కారణంగానే.. ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రధానంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తనదైన శైలిలో గంభీర్- హర్షిత్‌ల గురించి కామెంట్ చేశాడు.చిక్కాపై గంభీర్ ఫైర్ఈ నేపథ్యంలో ఇటీవల వెస్టిండీస్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన గంభీర్ స్పందించాడు. ‘‘యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేస్తారా? కావాలంటే నన్ను ఏమైనా అనండి. అతడి జోలికి మాత్రం వెళ్లవద్దు. వాళ్ల నాన్న క్రికెటరో, సెలక్టరో కాదు’’ అంటూ చిక్కాపై ఫైర్ అయ్యాడు.ఈ క్రమంలో భారత మాజీ పేసర్, 1983 గెలిచిన భారత జట్టులో చిక్కా సహచర సభ్యుడైన బల్విందర్ సంధు గంభీర్ వ్యాఖ్యలపై స్పందించాడు. మిడ్-డేతో మాట్లాడుతూ.. ‘‘ఏ విషయం గురించైనా ప్రతి ఒక్కరికి తమకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటితో ఇతరులు ఏకీభవించాలన్న నియమం లేదు.పబ్లిక్‌గా అంత మాట అంటావా?అయితే, పబ్లిక్‌గా చిక్కా గురించి అలా మాట్లాడంలో అర్థం లేదు. అవును.. శ్రీకాంత్ బ్యాటింగ్‌లాగే.. అతడి మాటలు కూడా ఉంటాయి. అందుకే అతడిని చాలా మంది ఇష్టపడతారు కూడా!.. సెలక్షన్ గురించి విమర్శించేటపుడు కొంతమంది మాజీ క్రికెటర్లు హద్దులు దాటుతున్న మాట వాస్తవమే.అందుకు సోషల్ మీడియాలో వారిపై భారీ ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయినంత మాత్రాన స్వేచ్ఛగా మాట్లాడే మాజీ ప్లేయర్ల హక్కును హరించేందుకు వీలులేదు. దేశం కోసం కష్టపడి, ఇష్టపడి ఆడిన వాళ్లు ఇలాంటి వాటిని పొందేందుకు ఎంత మాత్రం అర్హులు కాదు.హెడ్‌కోచ్‌గా నీ పనేంటో చూసుకోసలహాలు ఇస్తే క్రీడాస్ఫూర్తితో స్వీకరించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. హెడ్‌కోచ్‌గా మైదానంలో ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్న అంశం మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుంది. అలా కాకుండా ఇలా ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని వేలాడితే అసలు లక్ష్యం పక్కదారి పడుతుంది.శ్రీకాంత్ అభిప్రాయాల గురించి గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు చదువుతుంటే నా మనసుకు ఎంతో బాధ కలిగింది. మాజీ ఆటగాడిని ఉద్దేశించి మీడియా ముఖంగా ఇలా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదు’’ అని బల్విందర్ సంధు గంభీర్ తీరును విమర్శించాడు. చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్
- 
      
                   
                                                       IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్భారత క్రికెట్ జట్టు యువ రక్తంతో నిండిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ మార్పు కూడా జరిగింది. టెస్టులకు రోహిత్ శర్మ (Rohit Sharma) స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించగా.. వన్డే కెప్టెన్సీ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని తప్పించింది.ఇక ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ స్థానాన్ని యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill) భర్తీ చేశాడు. ఇప్పటికే టెస్టు సారథిగా ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్‌ను 2-2తో సమం చేసిన గిల్.. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేశాడు.త్వరలోనే టీ20 పగ్గాలు కూడా అతడికేఈ క్రమంలో వన్డే సారథిగా తొలి ప్రయత్నంలోనే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గిల్‌కు కఠిన సవాలు ఎదురుకానుంది. ఇదిలా ఉంటే.. మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలని భావిస్తున్నామని.. త్వరలోనే టీ20 పగ్గాలు గిల్‌కు అప్పగిస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ కావడం పట్ల సంతోషంగా ఉంది. తను అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను.కెప్టెన్సీ చేజారుతుందనే భయంఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్‌తో నా రిలేషన్ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం.మనిషిగా, ఆటగాడిగా తను ఎలాంటివాడో నాకు పూర్తిగా తెలుసు. తను ఈ స్థాయికి చేరడం పట్ల సంతోషంగా ఉంది. అందరికీ అతడు స్ఫూర్తిగా నిలిచాడు కూడా!’’ అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అక్టోబరు 18- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.ఆసియా కప్ విజేతగాఇందుకోసం గిల్ సారథ్యంలోని వన్డే జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకోగా.. సూర్య సేన టీ20 సిరీస్‌కు ముందు అక్కడికి చేరుకుంటుంది. కాగా ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా ఇటీవలే చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్
- 
      
                   
                                                       అందరికీ తెలుసు: అగార్కర్‌కు ఇచ్చిపడేసిన షమీ.. స్ట్రాంగ్ కౌంటర్టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు యాజమాన్యం. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అతడి ఫిట్నెస్ గురించి తమకు సమాచారం లేదని అగార్కర్ జట్టు ప్రకటన సందర్భంగా మీడియా ముఖంగా వెల్లడించాడు.ఇందుకు షమీ ఘాటుగానే స్పందించాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలక్షన్ అనేది తన చేతుల్లో లేదని.. ఫిట్నెస్ గురించి ఎవరూ అడగకపోయినా చెప్పడం సరికాదంటూ.. సెలక్టర్లు జట్టు ఎంపిక సమయంలో తనను సంప్రదించలేదని సంకేతాలు ఇచ్చాడు.ఫిట్‌గా లేకపోవడం వల్లేఈ క్రమంలో షమీ వ్యాఖ్యలపై అగార్కర్ శుక్రవారం స్పందించాడు. ఎన్డీటీవీ వేదికగా మాట్లాడుతూ.. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్‌గా ఉంటే అలాంటి బౌలర్‌ను ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను.ఫిట్‌గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేకపోయాం’ అని ఈ భారత మాజీ పేసర్ స్పష్టం చేశాడు. తాము ఆడిన రోజుల్లో సెలక్టర్లకు ఏనాడూ ఫోన్ చేయలేదని, ఇప్పుడు కాలం మారిందన్న అగార్కర్... జట్టుకు ఎంపిక కాని యువ ఆటగాళ్లు తనకు వెంటనే ఫోన్ చేస్తారని, వారికి వంద శాతం నిజాయితీగా తాను సమాధానం ఇస్తానని చెప్పాడు.అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!ఈ నేపథ్యంలో అగార్కర్‌కు షమీ మరోసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చిపడేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్‌గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!’’ అంటూ అగార్కర్‌కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.కాగా షమీ చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో తొమ్మిది వికెట్లు కూల్చిన ఈ కుడిచేతి వాటం పేసర్.. వరుణ్ చక్రవర్తితో కలిసి భారత్ తరఫున సంయుక్తంగా లీడ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఈ సీజన్లో షమీ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 11.23 ఎకానమీతో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. కాగా ఫామ్‌లేమి, పనిభారం కారణంగా ఇంగ్లండ్‌తో టెస్టులకు షమీని ఎంపిక చేయలేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కూడా అతడిని తప్పించడం గమనార్హం.దుమ్ములేపిన షమీఇదిలా ఉంటే.. షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బౌలర్.. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లలో కేవలం 38 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.తద్వారా బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు షమీ. కాగా ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో భాగంగా బెంగాల్ జట్టు ఉత్తరాఖండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.చదవండి: సెలక్షన్ విషయంలో ద్రవిడ్‌తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్
- 
      
                   
                                                       రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) విజయశాతం 75. ఆటగాడిగానూ యాభై ఓవర్ల ఫార్మాట్లో హిట్‌మ్యాన్‌కు తిరుగులేదు. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన రోహిత్.. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గెలిచాడు. రానున్న వన్డే వరల్డ్‌కప్‌లోనూ అతడే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని అంతా అనుకున్నారు.పది కిలోల బరువు తగ్గి అందుకు అనుగుణంగానే ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. తద్వారా తన దృష్టి మొత్తం వన్డేలపైనే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు.. 38 ఏళ్ల రోహిత్ ఇటీవలే పది కిలోల బరువు కూడా తగ్గి మునుపటి కంటే కూడా మరింత ఫిట్‌గా తయారయ్యాడు.అయితే, అనూహ్య రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థాయంలో యువ ఆటగాడు, టెస్టు సారథి అయిన శుబ్‌మన్ గిల్‌కే వన్డే జట్టు బాధ్యతలూ అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు గిల్‌తోనూ రోహిత్‌కు విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.రెండింటికీ చాలా తేడా ఉంటుందిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు శనివారం మీడియాతో మాట్లాడిన గిల్.. ఈ విషయంపై స్పందించాడు. ‘‘బయట మా గురించి జరుగుతున్న ప్రచారానికి, అంతర్గత విషయాలకు చాలా తేడా ఉంటుంది. మా మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ చెరిపివేయలేరు.ఇంతకు ముందు మేమెలా కలిసి ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నాము. అతడు పూర్తి సహాయసహకారాలు అందించే వ్యక్తి. ఇన్నేళ్ల అనుభవం కారణంగా.. నేనేదైనా తప్పు చేసినట్లు భావిస్తే.. నా తప్పులను సరిదిద్దుతాడు. ఒకవేళ నాకు ఆయన సలహాలు అవసరమని భావిస్తే.. తప్పక అడుగుతా.అంతిమ నిర్ణయం నాదేప్రతి ఒక్కరి ఆలోచనలను నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా. అలాగే మ్యాచ్ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నేనే అంతిమ నిర్ణయం తీసుకుంటా. రోహిత్ భాయ్, విరాట్ భాయ్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది.నాకు ఏవైనా సందేహాలు వస్తే.. వారి సలహాలు తీసుకుంటా. నాకు సహాయం చేసేందుకు వాళ్లు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని శుబ్‌మన్ గిల్ తెలిపాడు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. కాగా రోహిత్ పాటు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
- 
      
                   
                                                       సెలక్షన్ విషయంలో ద్రవిడ్‌తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తనదైన ముద్ర వేశాడు. రెండున్నరేళ్ల పాటు అతడి మార్గదర్శనంలో ముందుకు సాగిన భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచింది. అంతకుముందు.. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరి.. రన్నరప్‌గా నిలిచింది.ఇక ద్రవిడ్ జట్టులో నింపిన స్ఫూర్తి కారణంగానే తాము టీ20 ప్రపంచకప్‌తో పాటు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచామని టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలే వెల్లడించాడు. ద్రవిడ్ భాయ్ తమలో గెలవాలన్న పట్టుదలను మరింత పెంచి జట్టు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా రోహిత్- ద్రవిడ్ కాంబోలో టీమిండియా మంచి ఫలితాలు రాబట్టిందని చెప్పవచ్చు.ద్రవిడ్‌తో మాకు విభేదాలుభారత క్రికెట్లో ద్రవిడ్‌కు సౌమ్యుడనే పేరుంది. ఈ మాజీ కెప్టెన్ కెరీర్లో వివాదాలకు తావులేదు. అయితే, అలాంటి ద్రవిడ్ కోచ్‌గా మారిన తర్వాత మాత్రం జట్టు విషయంలో తగ్గేదేలే అన్నట్లు సెలక్టర్లతో వాదనలకు దిగేవాడట. తన ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా జట్టు కూర్పు ఉండాల్సిందేనని పట్టుబట్టేవాడట.టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ద్రవిడ్ నాకు ప్రియమైన స్నేహితుడు. అయితే, అతడు కోచ్‌గా ఉన్న సమయంలో మా మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవం. అవి తగువులాటలు అని నేను చెప్పను.మా నిర్ణయమే ఫైనల్కానీ ఇద్దరి మధ్య కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చేవి. కొన్ని విషయాల్లో తను అనుకున్నట్లే జరగాలని ద్రవిడ్ పట్టుబట్టేవాడు. ఏదేమైనా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉండేవి.జట్టు ఎంపిక పూర్తిగా మా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు రాహుల్.. ఇప్పుడు గంభీర్.. గతంలో రోహిత్.. ఇప్పుడు శుబ్‌మన్.. ఇలా కోచ్‌లు, కెప్టెన్లుగా ఎవరున్నా సరే.. వారికి కూడా జట్టు ఎంపిక విషయంలో జోక్యం కల్పిస్తాం. వారితో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తాం.మా పని అదేకోచ్, కెప్టెన్ పని సులువు చేసే విధంగా అత్యుత్తమైన పదిహేను మంది ఆటగాళ్లను ఎంపిక చేయడమే మా పని. ఒకవేళ కోచ్, కెప్టెన్‌ను గనుక సెలక్షన్ విషయంలో భాగం చేయకపోతే.. అంతకంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్‌కు ముందే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించిన యాజమాన్యం.. గిల్‌కు వన్డే పగ్గాలూ అప్పగించింది. ఇక ఇప్పటికే అతడు టెస్టు సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించిన నేపథ్యంలో గంభీర్‌తో పాటు అగార్కర్పైనా విమర్శలు వెల్లువెత్తాయి.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
- 
      
                   
                                                       ఆసీస్‌తో తొలి వన్డే.. డేంజర్లో సచిన్ వరల్డ్ రికార్డుటీమిండియా స్టార్ విరాట్ కోహ్లి దాదాపు 7 నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా జఆస్ట్రేలియాతో జరుగునున్న తొలి వన్డేలో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి సిద్దమయ్యాడు. మూడు రోజుల కిందట జట్టుతో పాటు ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన విరాట్.. ఈ సిరీస్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ క్రమంలో తొలి వన్డేకు ముందు కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(100) అగ్రస్ధానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో 51 టెస్టు, 49 వన్డేలు సెంచరీలు సాధించాడు. సచిన్ తర్వాతి స్ధానంలో 82 సెంచరీలతో విరాట్ కోహ్లి రెండో స్దానంలో ఉన్నాడు.ఈ మాజీ కెప్టెన్ వన్డేల్లో 51 శతకాలు సాధించగా.. టెస్టుల్లో 30 సెంచరీలు, టీ20ల్లో ఒకటి బాదాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి, సచిన్ పేరిట సంయుక్తంగా ఉంది. కోహ్లి వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. సచిన్ టెస్టుల్లో 51 శతకాలు చేశాడు. ఈ క్రమంలో పెర్త్ వన్డేలో కోహ్లి శతక్కొడితే.. ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ను అధిగమిస్తాడు. తొలి వన్డేలో సచిన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన రెండు వన్డేల్లోనైనా కోహ్లి ఈ ఫీట్‌ను అందుకునే ఛాన్స్ ఉంది. కోహ్లికి ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు అక్కడ 29 వన్డేలు ఆడిన విరాట్ 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!
- 
      
                   
                                                       గిల్, శ్రేయస్ కాదు.. అతడే టీమిండియా లీడింగ్ రన్ స్కోరర్: క్లార్క్ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా ఆదివారం(అక్టోబర్ 19) జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు భావిస్తున్నాయి. అందు కోసం తమ తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు దాదాపు ఏడు నెలల తర్వాత ఆడనుండడంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టాప్ రన్‌స్కోరర్ ఎవరు? లీడింగ్ వికెట్ టేకర్ ఎవరు? విజేత ఎవరు? అన్న ఆంశాలపై తమ అంచనాలను మాజీలు వెల్లడిస్తున్నారు. ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ చేరాడు. క్లార్క్ ఇటీవలే Beyond23 క్రికెట్ పోడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ తరపున ఎవరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారన్న ప్రశ్న క్లార్క్‌కు ఎదురైంది. అందుకు బదులుగా విరాట్ కోహ్లి(Virat Kohli) పేరును క్లార్క్ చెప్పుకొచ్చాడు."నా అభిప్రాయం ప్రకారం.. ఈ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లిలో ఎవరు ఒకరో నిలుస్తారు. వారికి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అని అనుకుంటున్నారు. కాబట్టి వారు ఈ టూర్‌ను విజయవంతంగా ముగించే అవకాశముంది.అయితే ఆస్ట్రేలియా పిచ్‌లో ఓపెనర్‌గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. అదే మూడు, నాలుగో స్దానంలో బ్యాటింగ్ చేయడం సులభం. ఎందుకంటే బంతి పాతబడి ఉంటుంది, అంతేకాకుండా పిచ్ కూడా బ్యాటర్లకు సహకరించనుంది. కాబట్టి రోహిత్ కంటే కోహ్లికే లీడింగ్ రన్స్కోరర్కే నిలిచే అవకాశాలు ఉన్నాయి" అని క్లార్క్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరును క్లార్క్ చెప్పకపోవడం గమనార్హం. గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై అదరగొట్టాడు. 700 పైగా పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఆస్ట్రేలియాపై వన్డేల్లో గిల్‌కు అంత మంచి రికార్డు లేదు. గిల్ ఇప్పటివరకు 8 వన్డే ఇన్నింగ్స్‌లలో 35.00 సగటుతో కేవలం 280 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!
- 
      
                   
                                                       25 ఫోర్లు, 8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న భారత జట్టు నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.మరోవైపు ఆస్ట్రేలియా కూడా తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆసీస్ జట్టు పగ్గాలను మిచెల్ మార్ష్ చేపట్టాడు. ఇక మొన్నటివరకు టీమిండియా వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ.. ఇప్పడు కేవలం ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. భారత వన్డే జట్టు సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. భారత వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత హిట్‌మ్యాన్ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.ఆసీస్ గడ్డపై అదుర్స్..కాగా ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆసీస్‌లో ఇప్పటివరకు ఇప్పటివరకు 30 వన్డేలు(ప్రపంచకప్ మ్యాచ్‌లతో కలిపి) ఆడిన రోహిత్ శర్మ.. 53.12 సగటుతో 1,328 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాడు.అదేవిధంగా కంగారుల గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌ల్లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 19 వన్డేల్లో 58.23 సగటుతో 990 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అత్యదిక స్కోర్ 171 పరుగులుగా ఉంది.పెర్త్‌లో తిరుగులేని హిట్‌మ్యాన్..ఇక తొలి వన్డే జరిగే పెర్త్‌లో కూడా రోహిత్ మంచి రికార్డు ఉంది. పెర్త్ మైదానంలో హిట్‌మ్యాన్ కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 122.5 సగటుతో ఏకంగా 245 పరుగులు చేశాడు. ఈ వేదికగా 2016లో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశాడు. ఈ మైదానంలో రోహిత్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో 163 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్..13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 171 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. పెర్త్‌లోనే వాకా స్టేడియంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు అదే జోరును కనబరిచాలని రోహిత్ అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: 'ఇదొక క్రూరమైన చర్య'.. అఫ్గాన్ క్రికెటర్ల మృతిపై రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి
- 
      
                   
                                                       IND vs AUS: జట్లు, షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుపరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా ఆదివారం (అక్టోబరు 19)నాటి మ్యాచ్‌తో తొలుత వన్డే సిరీస్‌కు తెరలేస్తుంది. అనంతరం ఆసీస్- భారత్ (IND vs AUS) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు ముహూర్తం ఖరారైంది.ఇందుకోసం ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం!ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ షెడ్యూల్🏏తొలి వన్డే: అక్టోబరు 19 (ఆదివారం)- పెర్త్ స్టేడియం, పెర్త్🏏రెండో వన్డే: అక్టోబరు 23 (గురువారం)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్🏏మూడో వన్డే: అక్టోబరు 25 (శనివారం)- సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఆసీస్- భారత్ వన్డే మ్యాచ్‌లు ఉదయం 9 గంటలకు ఆరంభంఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్, కాన్బెర్రా🏏రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్🏏మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్ ఓవల్, హోబర్ట్🏏నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్🏏ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్.👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్‌లు ఆరంభం.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..👉జియో హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం👉టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్స్‌లో ప్రసారంఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుఅభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.భారత్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే)మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
- 
      
                   
                                                       రీఎంట్రీలో అదరగొట్టిన సంజూ శాంసన్.. ‘మెరుపు’ అర్ధ శతకంటీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో శుభారంభం అందుకున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్‌లో ఈ కేరళ బ్యాటర్ ‘మెరుపు’ అర్ధ శతకం సాధించాడు. దేశీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ తాజా సీజన్ బుధవారం మొదలైన విషయం తెలిసిందే.రుతురాజ్ గైక్వాడ్ పోరాటంఈ క్రమంలో ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ- మహారాష్ట్ర (Kerala Vs Maharashtra) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్‌కు దిగింది. టాపార్డర్ విఫలమైన చోట రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad- 151 బంతుల్లో 91; 11 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో... మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 84.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్ల ధాటికి ఒక దశలో 18/5తో నిలిచిన మహారాష్ట్ర ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పోరాటంతో తేరుకుంది. జలజ్ సక్సేనా (49; 4 ఫోర్లు), వికీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) ఆకట్టుకున్నారు.కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10.4 ఓవర్లలో 3 వికెట్లకు 35 పరుగులు చేసింది.ఘీ క్రమంలో 35/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన కేరళ ఇన్నింగ్స్‌ను సంజూ చక్కదిద్దాడు.సంజూ శాంసన్ ‘మెరుపు’ అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ 63 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అజారుద్దీన్ 36 పరుగులతో ఆకట్టుకోగా.. సల్మాన్ నిజార్ 49 పరుగులతో రాణించాడు.అయితే, మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో 63.2 ఓవర్లలో కేరళ 219 పరుగులకు ఆలౌట్ అయింది. సంజూ పోరాడినప్పటికీ కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయాడు. ఇరవై పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు శుభారంభమే దక్కింది. ఆధిక్యంలో మహారాష్ట్రతొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్లు పృథ్వీ షా 37, అర్షిన్ కులకర్ణి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసేసరికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మహారాష్ట్ర 51 పరుగులు చేసింది. తద్వారా కేరళ కంటే 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సంజూకాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు సొంత జట్టు కేరళ తరఫున రీఎంట్రీ ఇస్తూ రంజీ బరిలో దిగాడు. అయితే, ఆసీస్‌తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో త్వరలోనే సంజూ జట్టును వీడనున్నాడు. ఇక అక్టోబరు 19- 29 వరకు ఆసీస్- భారత్ మధ్య వన్డే సిరీస్.. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య టీ20 సిరీస్ జరుగునుంది. చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
- 
      
                   
                                                       ‘సిగ్గుచేటు’ అంటూ గంభీర్ ఫైర్.. అశ్విన్ స్పందన ఇదేఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌తో కలిసి సంజూ శాంసన్ (Sanju Samson)ను కాదని.. ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేయడం.. అదే విధంగా.. యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు ఈ జట్టులో చోటివ్వడం విమర్శలకు దారితీశాయి.టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు ప్రియ శిష్యుడు గనుకే హర్షిత్ రాణాకు వరుస అవకాశాలు ఇస్తున్నారని మాజీ క్రికెటర్లు విమర్శించారు. చెన్నై దిగ్గజాలు క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రధానంగా ఈ మేరకు విమర్శలు చేశారు. ఈ క్రమంలో హర్షిత్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.‘సిగ్గుచేటు’ అంటూ గంభీర్ ఫైర్ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా గెలిచిన తర్వాత గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం కుర్రాడి జీవితాన్ని నాశనం చేస్తారా?.. సిగ్గుచేటు అని మండిపడ్డాడు. కావాలంటే తనను ఏమైనా అనొచ్చని.. కానీ 23 ఏళ్ల హర్షిత్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. అతడి తండ్రి మాజీ క్రికెటరో, సెలక్టరో కాదని.. నైపుణ్యాలతోనే అవకాశాలు దక్కించుకుంటున్నాడని గంభీర్ పేర్కొన్నాడు.కచ్చితంగా విమర్శిస్తానంటూనే.. ఈ క్రమంలో అశ్విన్ తాజాగా గంభీర్ వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశాడు. అయితే, ఈసారి అశూ మాట మార్చడం విశేషం. హర్షిత్ నైపుణ్యాలను కచ్చితంగా విమర్శిస్తానంటూనే.. వ్యక్తిగతంగా ఎవరూ ఎవరినీ టార్గెట్ చేయవద్దంటూ హితవు పలికాడు. సోషల్ మీడియాలో ప్రతికూల విషయాలే తొందరగా వ్యాప్తి చెందుతాయని.. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.పగ పెట్టుకోలేదు‘‘నేను మరోసారి చెప్తున్నా.. ఏ ఆటగాడిని వ్యక్తిగతంగా విమర్శించవద్దు. పర్సనల్ అటాక్‌కి దిగితే జానర్ మారిపోతుంది. నా కెరీర్ ఆసాంతం సంజయ్ మంజ్రేకర్ నన్ను విమర్శిస్తూనే ఉన్నారు. అయినా సరే నేనేమీ ఆయన మీద పగ పెట్టుకోలేదు.విమర్శలు చెప్పేది సరైంది లేదంటే తప్పు కావొచ్చు. కానీ ముందుగా చెప్పినట్లు అది వ్యక్తిగతంగా ఉండకూడదు. ఒకవేళ హర్షిత్ రాణా.. తనను ఎవరైనా కఠిన పదజాలంతో విమర్శించిన వీడియో చూస్తే అతడి పరిస్థితి ఏమై పోతుంది?మ్యాచ్‌కు ముందు ఇలాంటివి జరిగితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది?.. ఒకవేళ అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరైనా ఈ వీడియోల గురించి తనకు చెబితే పరిస్థితి ఏంటి? ఓ ఆటగాడి నైపుణ్యాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.దానికే ఇక్కడ డిమాండ్ ఎక్కువకానీ వ్యక్తిగతంగా మాత్రం వద్దు. ఇలా చేయడం ఒకటీ రెండు సార్లు బాగుంటుంది. ఆ తర్వాత పరిస్థితి గంభీరంగా మారిపోతుంది. ఈరోజుల్లో నెగటివిటీ అమ్ముడుపోయే వస్తువుగా మారిపోయింది. ఎందుకంటే దానికే ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది.ప్రస్తుతం హర్షిత్ రాణాను అన్ని కోణాల్లో టార్గెట్ చేస్తున్న వాళ్లు.. అతడు ఒకవేళ వచ్చే ఏడాది బాగా ఆడితే.. తన నైపుణ్యాల గురించి ఇదే స్థాయిలో ప్రశంసిస్తారా? లేదంటే కేవలం ప్రతికూలతల వరకే పరిమితం అవుతారా?’’ అంటూ అశూ ఫైర్ అయ్యాడు. హర్షిత్ నైపుణ్యాలను మాత్రమే తాను విమర్శించానంటూ పరోక్షంగా చిక్కాపైకే అంతా నెట్టేశాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లకు ముహూర్తం ఖరారైంది.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
- 
      
                   
                                                       Ro- Ko వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్‌కప్‌లో ఆడతారా?: అగార్కర్టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నమెంట్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం.అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్లను ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి. రో- కో వన్డే ప్రపంచకప్ ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు.ఆడుతూనే ఉంటాం అనే సందేశంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత కోహ్లి.. ‘‘మీరు ఎప్పుడైతే ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడే నిజంగా మీరు విఫలమైనట్లు’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తద్వారా తాను ఇంకొన్నాళ్లు ఆటలో కొనసాగే అవకాశం ఉందంటూ పరోక్షంగా అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు.మరోవైపు.. 38 ఏళ్ల రోహిత్ శర్మ సైతం ఇటీవలే పది కిలోల బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా చివరగా టీమిండియా తరఫున బరిలో దిగిన రో-కో.. ఆసీస్‌తో అక్టోబరు 19 నాటి తొలి వన్డేతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లుఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రో- కో భవితవ్యంపై మరోసారి స్పందించాడు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం వాళ్లిద్దరు జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లు. వరల్డ్‌కప్‌నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. యువ ఆటగాళ్లు వీరి స్థానాలను ఆక్రమిస్తారేమో.. చెప్పలేము కదా!.. లేదంటే యువ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కదేమో!ఏదేమైనా రోహిత్- కోహ్లి.. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. ప్రతి మ్యాచ్ తర్వాత వారి ప్రదర్శన గురించి శల్య పరీక్ష చేయడం ఉండదు. వాళ్లు ఆడటం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం.వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్‌కప్‌లో ఆడతారా?కేవలం పరుగులు చేయడం కాదు.. ట్రోఫీ గెలవడం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆస్ట్రేలియాలో రోహిత్- కోహ్లి వరుసగా మూడు సెంచరీలు చేసినంత మాత్రాన.. వారు వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతారనే గ్యారెంటీ లేదు కదా!..అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే మా నిర్ణయం ఉంటుంది’’ అంటూ రోహిత్- కోహ్లిలకు మరో మెగా టోర్నీ ఆడే అవకాశం ఇవ్వకపోచ్చని అగార్కర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.అదే సమయంలో తాము సీనియర్ ఆటగాళ్లకు అత్యంత గౌరవం ఇస్తామని.. వారితో జరిగే మా సంభాషణలు బయటకు రావు కాబట్టి బయట అందరూ ఏదో ఊహించుకుంటారని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌తో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ Brace yourselves…they’re 𝘽𝙖𝙘𝙠 𝙄𝙣 𝘽𝙡𝙪𝙚𝙨 🔥 Rohit Sharma 🤝 Virat Kohli 🎥 Watch on loop as the duo gears up for #AUSvIND 💪 #TeamIndia | @ImRo45 | @imVkohli pic.twitter.com/u99yHyFfwJ— BCCI (@BCCI) October 17, 2025
- 
      
                   
                                                       ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్.. సంజూ కూడా సూపర్: వార్నర్టీమిండియా స్టార్లు సంజూ శాంసన్ (Sanju Samson), రింకూ సింగ్ (Rinku Singh)లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు. జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు వీరిద్దరు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తోటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకుని అద్భుత ప్రదర్శనలతో రాణించారంటూ కొనియాడాడు.మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తొలుత వన్డే సిరీస్ జరుగనుండగా.. అనంతరం ఇరుజట్లు టీ20 సిరీస్‌లో పాల్గొంటాయి. ఇక ఈసారి కూడా సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌తో కలిసి.. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వన్డే టీమ్‌లోకి వచ్చాడు.సెలక్టర్ల తీరుపై విమర్శలుసంజూను కాదని మరీ జురెల్‌ను ఎంపిక చేయడం పట్ల టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. టీ20 జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది. ఇక రింకూ సింగ్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్ఈ నేపథ్యంలో ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ డేవిడ్ వార్నర్.. సంజూ, రింకూలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా టీ20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకునేందుకు వాళ్లిద్దరు ఎంతగానో కష్టపడ్డారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రింకూ ఐపీఎల్ చరిత్రలోనే ప్రస్తుతం అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పటికే భారత జట్టులో ఎంతో మంది వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. వారితో పాటు ఇప్పుడు ఫియర్లెస్ యంగ్స్టర్లు కూడా వచ్చేశారు. భారత క్రికెట్‌కు ఇది శుభ పరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.మా వాళ్లకు అగ్ని పరీక్షఆస్ట్రేలియన్లకు ఈ సిరీస్ అగ్ని పరీక్ష వంటిది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా టీమిండియా ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 గెలిచి జోరు మీదుంది.చదవండి: IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?
- 
      
                   
                                                       షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) వ్యాఖ్యలపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్పందించాడు. షమీ నిజంగానే ఫిట్‌గా ఉండి ఉంటే కచ్చితంగా జట్టులో ఉండేవాడని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో చివరగా టీమిండియాకు ఆడాడు షమీ.టాప్ వికెట్ టేకర్ఈ వన్డే మెగా టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసిన షమీ.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఈ రైటార్మ్ పేసర్‌కు సెలక్టర్లు చోటివ్వలేదు.అప్డేట్ లేదన్న అగార్కర్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షమీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. రంజీలు ఆడగలిగే తాను వన్డేల్లో ఆడలేనా అంటూ సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించాడు.షమీ కౌంటర్ఫిట్నెస్ గురించి ఎవరైనా తనను అడిగితే సమాధానం ఇస్తానే తప్ప.. తనంతట తానే ఫిట్‌గా ఉన్నానని చెప్పలేను కదా అంటూ అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు. తద్వారా సెలక్షన్ సమయంలో తనను ఎవరూ సంప్రదించలేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం గురించి అగార్కర్ తాజాగా స్పందించాడు.అగార్కర్ స్పందన ఇదేఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌కు హాజరైన అగార్కర్.. షమీ పట్ల తమ నిర్ణయం సరైందేనని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ అతడు నేరుగా మాట్లాడి ఉంటే.. అందుకు నేను సమాధానం ఇచ్చేవాడిని. కానీ అతడు సోషల్ మీడియాలో ఏ ఉద్దేశంతో మాట్లాడాడో తెలియదు.ఒకవేళ నేను ఈ విషయం గురించి చదివి ఉంటే.. అతడికి ఫోన్ ద్వారానైనా జవాబు ఇచ్చేవాడిని. ప్రతి ఒక్క ప్లేయర్ కోసం నా ఫోన్ ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. గత కొన్నినెలలుగా అతడితో నేను తరచూ చాట్ చేస్తూనే ఉన్నాను.ఏం జరుగుతుందో చూద్దాంకానీ మీకు ఇక్కడ హెడ్లైన్ ఇచ్చేలా ఏమీ మాట్లాడదలచుకోలేదు. టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఘనత షమీకి ఉంది. ఏదేనా ఉంటే పరస్పరం మాట్లాడుకుంటాం.ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా.. తను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా టూర్‌కు పంపిస్తామని చెప్పాము. దురదృష్టవశాత్తూ అప్పుడు అతడు ఫిట్‌గా లేడు. ఇక దేశీ క్రికెట్ సీజన్ ఇప్పుడే ఆరంభమైంది కదా.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్‌తో టెస్టులకు సిద్ధంగా లేకపోయినా.. వన్డే ఫార్మాట్‌కు తాను ఫిట్‌గా ఉన్నానని షమీ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇలా స్పందించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ‘భర్త కంటే ‘బాబా’నే ఎక్కువ!.. తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. అతడికి రూ. 15 లక్షల గిఫ్ట్!’
- 
      
                   
                                                       IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?వరల్డ్ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు సమయం అసన్నమైంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియా-భారత్ జట్లు సిద్దమయ్యాయి. తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న భారత్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ఆసీస్ కూడా స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో చెమటోడ్చుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బలబలాలు, గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దం.గిల్ జర్నీ మొదలు.. ఈ సిరీస్‌తో భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ప్రయాణం మొదలు కానుంది. రోహిత్ శర్మ స్ధానంలో జట్టు పగ్గాలను గిల్‌కు సెలక్టర్లు అప్పగించిన సంగతి తెలిసిందే. టెస్టు కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న గిల్.. ఇప్పుడు వన్డే సారథిగా ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియాకప్, విండీస్‌తో టెస్టు సిరీస్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత్.. అదే జోరును ఆసీస్ గడ్డపై కొనసాగించాలని భావిస్తోంది. గిల్ సేన బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం చాలా వీక్‌గా కన్పిస్తోంది.బుమ్రా దూరం.. సిరాజ్‌పైనే భారంఆసీస్తో వన్డే సిరీస్‌కు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో మరో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో భారత్ పేస్ ధళ నాయకుడిగా సిరాజ్ వ్యవహరించనున్నాడు. అయితే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లలో సిరాజ్‌కు ఒక్కడికే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది.అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ పేసర్లకు ఆసీస్ పిచ్ల్పై పట్టు లేదు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022లో అర్ష్‌దీప్ 10 వికెట్లు పడగొట్టినప్పటికి.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో ఎలా రాణిస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మారింది.హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడినప్పటికి వారి స్ధాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. అతడితో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఆసీస్ పిచ్‌లు ఎక్కువగా పేస్ బౌలర్లు అనుకూలించే అవకాశమున్నందన తుది జట్టులో కుల్దీప్కు చోటు దక్కడం కష్టమే.రో-కోపై అందరి కళ్లు.. భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కన్పిస్తోంది. భారత్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండి ఉన్నది. నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ఆల్‌రౌండర్లు సైతం జట్టులో ఉన్నారు.కాబట్టి బ్యాటింగ్ పరంగా భారత్‌కు ఎటువంటి సమస్య లేదు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌కు ఆసీస్ గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ సీనియర్ ద్వయం మరోసారి చెలరేగితే కంగారులకు కంగారు తప్పదు. వీరిద్దరూ దాదాపు 7 నెలల తర్వాత భారత జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యారు. దీంతో అందరి కళ్లు వీరిద్దరిపైనే ఉన్నాయి.ఆసీస్‌కు గాయల బెడద..కాగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకుండా ఆడనుంది. నిజంగా ఇది ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే కమ్మిన్స్‌కు ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉంది. అతడితో పాటు వెన్ను గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం భారత్‌తో సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. గ్రీన్ స్దానంలో మార్నస్ లబుషేన్ జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా తొలి వన్డేకు స్టార్ స్పిన్నర్ జంపా, ఇంగ్లిష్ కూడా దూరమయ్యారు. కమ్మిన్స్ లేకపోవడంతో ఆసీస్ బౌలింగ్ విభాగం కూడా కాస్త వీక్‌గానే కన్పిస్తోంది. మిచెల్ స్టార్, జోష్ హాజిల్‌వుడ్‌లతో కూడిన ఆసీస్ బౌలింగ్ యూనిట్ ఫవర్ ఫుల్ భారత బ్యాటింగ్ లైనప్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే హోమ్ ఎడ్వంటేజ్ ఖచ్చితంగా ఆసీస్‌కు కలిసిస్తోంది.భారత్‌కు హెడ్ 'ఎక్'భారత బౌలర్లకు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నుంచి ముప్పు పొంచి ఉంది. టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు. ఇక అతడితో కెప్టెన్ మిచిల్ మార్ష్, మాథ్యూ షార్ట్, అలెక్స్ క్యారీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఏదేమైనప్పటికి ఆసీస్ కంటే భారత్ బ్యాటింగ్ విభాగమే పటిష్టంగా కన్పిస్తోంది.ఆసీస్‌దే పైయి..భారత జట్టు చివరగా వైట్‌బాల్ సిరీస్‌లు ఆడేందుకు 2020-21లో వెళ్లింది. అయితే వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కోల్పోయింది. ఆ సిరీస్‌లో భారత్ తరపున హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు భారత్-ఆసీస్ మధ్య 152 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌లలో విజయం సాధించగా, భారత్ 58 మ్యాచ్‌లలో గెలిచింది. 10 మ్యాచ్‌లు ఫలితంలేకుండా ముగిశాయి.చెత్త రికార్డు..ఆస్ట్రేలియాలో భారత్ జట్టు చెత్త రికార్డు ఉంది. ఆసీస్ గడ్డపై భారత్ 54 వన్డేలు ఆడగా.. కేవలం 14 సార్లు మాత్రమే గెలిచింది. 38 సార్లు ఓడింది, 2 మ్యాచ్‌లు ఫలితంలేకుండా ముగిశాయి. అక్కడ భారత్ విజయం శాతం సుమారు 25.9% మాత్రమే.
- 
      
                   
                                                       టీమిండియాతో వన్డే సిరీస్‌కు.. ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టింది. ఫిట్నెస్ సమస్యలతో దాదాపు 12 నెలలు పాటు జట్టుకు దూరంగా ఉన్న గ్రీన్.. ఈ ఏడాది ఆగస్టులో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పునరాగమనం చేశాడు.తన రీ ఎంట్రీలో కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే అతడు కొనసాగాడు. అయితే వైట్‌బాల్ క్రికెట్లో మళ్లీ బౌలింగ్ ప్రారంభించడానికి గ్రీన్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడికి వెన్ను నొప్పి తిరగబెట్టింది. దీంతో టీమిండియాతో వన్డే సిరీస్‌కు అతడిని సెలక్టర్లు పక్కన పెట్టారు.మార్నస్ వచ్చేశాడు..ఇక గ్రీన్ స్ధానాన్ని స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత్‌తో వన్డేలకు తొలుత లబుషేన్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే ఇటీవల షెఫీల్డ్ షీల్డ్, డొమెస్టిక్ వన్డే టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ప్రదర్శన కనబరుస్తుండంతో ఆసీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.లబుషేన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా వన్డే కప్‌లో ఇప్పటి వరకు 3 మూడు మ్యాచ్‌లు ఆడిన లబుషేన్.. 237 పరుగులు సాధించాడు. అందులో 2 శతకాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కుడిచేతి బ్యాటర్ ఇప్పటివరకు 66 వన్డేలు ఆడి, 1,871 పరుగులు సాధించాడు. అయితే గతేడాది నుంచి అతడు వన్డేల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 2024 నుంచి లబుషేన్ 12 ఇన్నింగ్స్‌లలో కేవలం 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్‌తో తొలి వన్డేకు జంపా, ఇంగ్లిష్ కూడా దూరమయ్యారు. అయితే వీరిద్దరూ ఆఖరి రెండు వన్డేల్లో ఆడే అవకాశముంది. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆసీస్-భారత్ జట్లు తలపడనున్నాయి.భారత్‌తో వన్డేలకు ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్చదవండి: అఫ్గాన్ చేతిలో వైట్ వాష్.. బంగ్లాదేశ్ క్రికెటర్ల వాహనాలపై దాడి!
- 
      
                   
                                                       రోహిత్, అర్షదీప్ పోరాటం వృధా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిమలేసియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్‌లో (Sultan of Johor Cup 2025) భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు (Indian Junior Men's Hockey Team) తొలి పరాజయం ఎదురైంది. నిన్న (అక్టోబర్ 15) ఆస్ట్రేలియాతో జరిగిన పూల్ మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 2-4 తేడాతో ఓటమి పాలైంది.భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ (22వ నిమిషం), అర్ష్‌దీప్ సింగ్ (60వ నిమిషం) గోల్స్ సాధించగా.. ఆస్ట్రేలియా తరఫున ఆస్కార్ స్ప్రౌల్ (39, 42), ఆండ్రూ ప్యాట్రిక్ (40) మరియు కెప్టెన్ డిలన్ డౌనీ (51) గోల్స్ చేశారు.ఈ మ్యాచ్ తొలి క్వార్టర్లో భారత్ అద్భుతంగా ఆడింది. ఆదిలోనే గోల్ కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి గోల్‌ను సేవ్ చేశాడు. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అన్మోల్ ఎక్కా గోల్‌గా మలచలేకపోయాడు. 22వ నిమిషంలో కెప్టెన్ రోహిత్ మ్యాచ్ తొలి గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించాడు.25వ నిమిషంలో అమీర్ అలీ సోలో రన్‌తో గోల్‌కి ప్రయత్నించగా.. ఆస్ట్రేలియా గోల్‌కీపర్ అద్భతంగా అడ్డుకున్నాడు.ఆతర్వాత కొద్ది నిమిషాలకే మ్యాచ్ భారత్‌వైపు నుంచి ఆస్ట్రేలియావైపు మళ్లింది. 39 నుంచి 42 నిమిషాల్లోపు ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆఖరి నిమిషంలో (60) అర్షదీప్ సింగ్ అద్భుతమైన డిఫ్లెక్షన్‌తో గోల్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య మలేసియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై భారత సెమీస్ బెర్త్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా, ఓ ఓటమితో 7 పాయింట్లు కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ డ్రాతో 10 పాయింట్లు కలిగి ఉండి టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్
- 
      
                   
                                                       చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మటీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (వన్డేలు, టెస్ట్‌లు, టీ20లు) 500 మ్యాచ్‌ల మార్కును తాకనున్న పదో ఆటగాడిగా, నాలుగో భారతీయుడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే మ్యాచ్ (India vs Australia) రోహిత్‌కు అంతర్జాతీయ కెరీర్లో 500వ మ్యాచ్ అవుతుంది. ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ 42.18 సగటున, 49 సెంచరీల సాయంతో 19700 పరుగులు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ మూడు ఫార్మాట్లలో 664 మ్యాచ్‌లు ఆడి 100 శతకాల సాయంతో 34357 పరుగులు చేశాడు.సచిన్ తర్వాత భారత్ తరఫున విరాట్ కోహ్లి (550), ఎంఎస్ ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509) మాత్రమే 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల అరుదైన మైలురాయిని తాకారు.కాగా, రోహిత్ శర్మ గతేడాది (2024) టీ20 ప్రపంచకప్ గెలిచాక పొట్టి ఫార్మాట్‌కు, ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ చివరిగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహించిన హిట్‌మ్యాన్ టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. ఇందులో భాగంగా భారీగా బరువు తగ్గి, కెరీర్ తొలినాళ్లలో రోహిత్‌ను గుర్తు చేస్తున్నాడు. వన్డేల్లో రోహిత్ భవితవ్యం ఆసీస్ పర్యటనలో ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటనలో రాణిస్తే హిట్‌మ్యాన్‌ను తిరుగుండదు.ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్‌పై హిట్‌మ్యాన్‌ను అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ జట్టుపై అతను 46 ఇన్నింగ్స్‌ల్లో 57.3 సగటున 2407 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి.🚨 ROKO IN NETS AT PERTH 🚨- Virat Kohli & Rohit Sharma in the bathing practice together at Perth ahead of ODI series. 🐐 (RevSportz).pic.twitter.com/1IMvphZIvi— Tanuj (@ImTanujSingh) October 16, 2025అభిమానులు రోహిత్ నుంచి మరోసారి ఇదే ప్రదర్శనను ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ కోరికల అనుగుణంగానే హిట్‌మ్యాన్ కూడా కఠోరంగా శ్రమిస్తున్నాడు. నిన్న పెర్త్‌లో ల్యాండ్ అయిన వెంటనే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లితో కలిసి గంటల కొద్ది నెట్స్‌లో చమటోడ్చాడు.చదవండి: హర్భజన్ సింగ్ రీఎంట్రీ
- 
      
                   
                                                       సెలక్టర్లను బాగానే విమర్శిస్తున్నావు షమీ!.. కానీ..: మాజీ క్రికెటర్టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra)స్పందించాడు. షమీ బాధలో అర్థం ఉందని.. అయితే, అందరూ నాణేనికి మరోవైపు కూడా చూడాలని అన్నాడు.చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భాగంగా టీమిండియాకు ఆడాడు షమీ. ఈ వన్డే మెగా టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసిన ఈ బెంగాల్ పేసర్‌ను.. ఆస్ట్రేలియాతో వన్డేలకు సెలక్టర్లు పక్కనపెట్టారు. అతడి ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా మీడియాతో పేర్కొన్నాడు.అది నా పని కాదుఈ నేపథ్యంలో షమీ స్పందిస్తూ.. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానంటూ సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చాడు. రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. ‘‘ఫిట్నెస్ గురించి సమాచారం ఇవ్వడం లేదంటే అడగటం నా పని కాదు.. జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి సన్నద్ధ కావడమే నా చేతుల్లో ఉంటుంది’’ అంటూ పరోక్షంగా అగార్కర్‌ను టార్గెట్ చేశాడు.సెలక్టర్లను బాగానే విమర్శిస్తున్నావు షమీ!.. కానీఈ విషయంపై కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తాజాగా స్పందిస్తూ.. ‘‘టీమిండియా సెలక్షన్ కమిటీ గురించి షమీ చాలా గట్టిగానే మాట్లాడుతున్నాడు. విమర్శిస్తున్నాడు. అయితే, ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి.ఇరువర్గాల మాటల్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోచ్, కెప్టెన్ లేదంటే సెలక్టర్ ఎవరో ఒకరు షమీ వ్యాఖ్యలపై స్పందించేదాకా వేచి చూడాలి. అంతవరకు ఈ విషయంలో తప్పు ఎవరిదో నిర్ధారించలేము.అతడి ఆవేదనలో అర్థం ఉందిఏదేమైనా సెలక్టర్లు షమీని పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. కాబట్టి అతడి బాధ, ఆవేదనలో అర్థం ఉంది. ఒకవేళ షమీ తన ఫిట్నెస్తో సంతృప్తి చెందినా.. సెలక్టర్లు పక్కనపెడితే అది తన దురదృష్టమే. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. షమీ గనుక తిరిగి టీమిండియాలోకి రావాలనుకుంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.చెలరేగిన షమీటీమిండియా పేసర్ షమీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో మెరిశాడు. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ఈ సీనియర్ పేసర్... ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున ఆకట్టుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 72.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది.భుపెన్ లాల్వాని (128 బంతుల్లో 71; 9 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... బెంగాల్ బౌలర్లలో షమీ 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ పొరెల్ 3, సూరజ్ సింధు జైస్వాల్ 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంంచిన బెంగాల్ బుధవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. ఇక 8/1 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన బెంగాల్.. 50 ఓవర్ల ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టాఇకి 142 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 71 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్.. టీ20 మ్యాచ్ అనుకున్నావా?
- 
      
                   
                                                       రూ. 80 కోట్ల ప్రాపర్టీ అన్నకు ఇచ్చేసిన కోహ్లి.. ట్విస్ట్ ఏంటంటే?ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్(Shubman Gill) సారథ్యంలోని భారత జట్టు కంగారుల గడ్డపై అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత బృందంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సైతం ఉన్నాడు. దాదాపు ఆరు నెలల తర్వాత టీమిండియా తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు.ఐపీఎల్-2025 సీజన్ తర్వాత లండన్‌లో ఉన్న కోహ్లి ఇటీవలే భారత్‌కు వచ్చాడు. అయితే ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి గురుగ్రామ్ ప్రాపర్టీని తన సోదరుడు వికాస్ పేరుకు బదిలీ చేసినట్టు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. 37 ఏళ్ల విరాట్ ఇటీవలే తన ఆస్తి సంబంధిత పనుల కోసం గురుగ్రామ్‌లోని వజీరాబాద్ తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. దైనిక్ భాస్కర్’ నివేదిక ప్రకారం.. అతడు గురుగ్రామ్‌లో ఉన్న తన ఇంటికి సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)ని వికాస్ కోహ్లి పేరిట నమోదు చేసినట్లు సమాచారం.ఒక వ్యక్తి తన ప్రాపర్టీకి చెందిన ఆర్థిక, చట్టపరమైన, వ్యాపార సంబంధిత పనులు చూసుకోవడానికి మరొకరికి అధికారం కల్పించడాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు.కాగా కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ పేరిట గురుగ్రామ్‌లోని DLF ఫేజ్–1 ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఒకటి ఉంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ.80 కోట్లు పైమాటే. సుమారు 10,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఆ విల్లా.. అద్భుతమైన ఇంటీరియర్స్, వుడ్‌వర్క్, స్విమ్మింగ్ పూల్, బార్ వంటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడింది.చదవండి: IND vs AUS: జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపాన్ని అక్కడ చూపించేస్తున్నాడు
- 
      
                   
                                                       Rohit- Kohli: ‘మా అభిమానులకు ఇదే ఆఖరి అవకాశం’టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (IND vs AUS ODIs)తో పునరాగమనం చేయనున్నారు. చాన్నాళ్ల తర్వాత రో- కో తిరిగి వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు.అదే సమయంలో రోహిత్- కోహ్లి వన్డేల నుంచి కూడా త్వరలోనే రిటైర్ అవనున్నారనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.హామీ ఇవ్వలేదువన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి.. శుబ్‌మన్ గిల్ (Shubman Gil)కు పగ్గాలు అప్పగించడంపై స్పందిస్తూ.. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు.. రో- కో ఈ మెగా ఈవెంట్లో ఆడతామని హామీ ఇవ్వలేదు’’ అంటూ రిటైర్మెంట్ ఊహాగానాలకు అగార్కర్ ఊతమిచ్చాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీమిండియా టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆస్ట్రేలియాలోని అభిమానులకు ఇది ఆఖరి అవకాశమని కమిన్స్ అన్నాడు.ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్‌కు ఇదే ఆఖరు‘‘ నిస్సందేహంగా వారిద్దరు ఆటలో చాంపియన్లు. వారితో మేం ఆడినప్పుడల్లా అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. గత 15 ఏళ్లలో వారిద్దరు భారత్ ఆడిన ప్రతీ సిరీస్‌లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్‌కు వారి ఆటను చూడటం ఇదే ఆఖరిసారి కావచ్చు’’ అని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.కమిన్స్ లేకుండానేకాగా వెన్ను నొప్పితో బాధపడుతున్న కమిన్స్ టీమిండియాతో సిరీస్‌లలో ఆడటం లేదన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో.. ఆసీస్ టీ20 సారథి మిచెల్ మార్ష్.. వన్డే జట్టును కూడా ముందుకు నడిపించనున్నాడు. ఇక అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టులకు కూడా రోజుల వ్యవధిలో రో- కో గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్లు.. ఐపీఎల్‌లోనూ అభిమానులను అలరిస్తున్నారు.చదవండి: IND vs AUS: వన్డే సిరీస్‌కు ముందు.. విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్
- 
      
                   
                                                       ఆసీస్ టూర్ తర్వాత రిటైర్మెంట్.. !? విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన కోహ్లి.. మళ్లీ ఇప్పుడు ఏడు నెలల తర్వాత భారత జెర్సీలో కన్పించనున్నాడు. ఈ నెల 19 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.కాగా ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో ఈ మాజీ కెప్టెన్ వన్డే ప్రపంచకప్-2027లో ఆడుతాడా లేదా? అన్నది సగటు క్రికెట్ అభిమాని మొదడను తొలుస్తున్న ప్రశ్న. రోహిత్, కోహ్లి వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ మెగా టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే ఏమి చెప్పలేమని అగార్కర్ చెప్పుకొచ్చాడు. అయితే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలంటే ఖచ్చితంగా దేశవాళీ టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో పాల్గోవల్సేందేనని మాత్రం అగార్కర్ తెల్చి చేప్పేశాడు. కానీ రో-కో ద్వయం విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతారో లేదో మాత్రం తెలియదు. అయితే దేశవాళీ టోర్నమెంట్లలో ఆడకపోయినా వారిద్దరని వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ టూర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో కోహ్లి చేసిన ట్విట్ వైరలవుతోంది. "ఎప్పుడైతే మీరు ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడు మీరు నిజంగా విఫలమైనట్లే" ఎక్స్‌లో కోహ్లి రాసుకొచ్చాడు. దీంతో కింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కోహ్లి రాబోయో వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడని ఫిక్స్ అయిపోతున్నారు.ఆసీస్‌తో సిరీస్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్, ధ్రువ్ జురెల్, జైశ్వాల్చదవండి: పిరికిపందల్లారా!.. చిన్న పిల్లాడు.. వదిలేయండిరా!: టీమిండియా స్టార్ ఫైర్
- 
      
                   
                                                       పిరికిపందల్లారా!.. చిన్న పిల్లాడు.. వదిలేయండిరా!డిజిటల్ యుగంలో ఎవరు.. ఎప్పుడు.. ఎవరికి.. ఎందుకు టార్గెట్ అవుతారో తెలియదు. పనీపాటాలేని ‘కీ-బోర్డు’ యోధులు తమకు నచ్చని వారిపై విద్వేష విషం చిమ్మేందుకు సోషల్ మీడియా అనే ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడతారు. అలాంటి వారికి ఇప్పుడు ఓ పదేళ్ల పిల్లాడు లక్ష్యంగా మారాడు.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)’ అనే షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేబీసీ 17 సీజన్లో ఇషిత్ భట్ (Ishit Bhatt) అనే ఐదో తరగతి చదివే పిల్లాడు హాజరయ్యాడు. గుజరాత్‌లోని గాంధీనగర్ అతడి స్వస్థలం.నాకు నిబంధలన్నీ తెలుసుఇక షోలో భాగంగా ఇషిత్తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ ముచ్చటిస్తున్న సమయంలో.. ‘‘నాకు నిబంధలన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు వాటిపై నాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకండి. అరె బాబా నాకు ఆప్షన్స్ ఇవ్వండి. సర్.. ఈ జవాబును ఒకటి కాదు.. నాలుగుసార్లు లాక్ చేసుకోండి’’ అంటూ కాస్త అతిగా మాట్లాడుతూ.. అత్యుత్సాహం ప్రదర్శించాడు.బుద్ధిలేని పిల్లాడు అంటూ ట్రోల్స్ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇషిత్ భట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘‘బుద్ధిలేని పిల్లాడు.. తల్లిదండ్రులు అతడి కనీస గౌరవ మర్యాద ఇవ్వడం నేర్పలేదు. బిగ్ బీ వంటి మెగాస్టార్‌తోనే ఇలా మాట్లాడతాడా?’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.అదే సమయంలో అమితాబ్ బచ్చన్ ఈ పరిణామాన్ని చక్కగా హాండిల్ చేశారనే ప్రశంసలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇషిత్ భట్‌ను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.పిరికిపందల్లారా!.. చిన్న పిల్లాడు.. వదిలేయండిరా!‘‘ఏమాత్రం సెన్స్ లేకుండా.. పిరికిపందలంతా తమ నోరుపారేసుకోవడానికి సోషల్ మీడియా ఎలా వేదిక అవుతుందో తెలిపే మరొక ఉదాహరణ ఇది. అతడు చిన్నపిల్లాడు!!తనని ఎదగనివ్వండి!!.. చిన్న పిల్లోడినే సహించలేని ఈ సమాజం.. ఎంతో మంది మూర్ఖులకు మాత్రం బ్రహ్మరథం పడుతుంది. ఈ పిల్లాడిని ట్రోల్ చేస్తున్నవారిని సహిస్తుంది’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వరుణ్ చక్రవర్తి ట్రోల్స్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.కాగా సెలబ్రిటీలు ముఖ్యంగా క్రికెటర్లు కూడా సోషల్ మీడియాకు ఈజీ టార్గెట్ అన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఆడకపోతే గనుక వారిపై మీమ్స్ వేస్తూ.. ట్రోల్స్ చేసేవాళ్లకు కొదవలేదు. ఈ నేపథ్యంలోనే వరుణ్ చక్రవర్తి.. పిల్లాడి విషయంలోనూ ఇలా చేయడాన్ని సహించలేక నెటిజన్లకు ఇలా చురకలు అంటించాడు.ఇదిలా ఉంటే.. ఇషిత్ భట్.. ‘వాల్మీకి రామాయణంలోని మొదటి కాండ ఏది?’ అనే ప్రశ్నకు అయోధ్య కాండ అనే తప్పుడు సమాధానం ఇచ్చి ఎలిమినేట్ అయ్యాడు. దీనికి సరైన జవాబు బాలకాండ. ఫైనల్లో మ్యాజిక్వరుణ్ చక్రవర్తి ఇటీవల ఆసియా టీ20 కప్-2025 టోర్నీలో పాల్గొన్నాడు. ఈ ఖండాంతర ఈవెంట్లో మొత్తంగా తొమ్మిది వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఫైనల్లో ఫఖర్ జమాన్ రూపంలో కీలక వికెట్ తీసి.. పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియా టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. తదుపరి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో వరుణ్ భాగం కానున్నాడు.చదవండి: గిల్.. ఇప్పటికీ అవే వాడుతున్నాడు.. వాటిని అస్సలు మార్చడు: సూర్య
- 
      
                   
                                                       ఆసీస్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! మ్యాచ్ విన్నర్‌కు నో ఛాన్స్?భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలు దేరింది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో పెర్త్ వేదికగా అక్టోబర్ 19న తొలి వన్డేలో భారత్-అసీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.శుభ్‌మన్ గిల్(Shubman Gill) సారథ్యంలో తొలిసారి భారత్ వన్డేల్లో ఆడనుంది. రోహిత్ శర్మ (Rohit sharma) స్ధానంలో గిల్‌ను టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లగా జట్టును నడిపించిన హిట్‌మ్యాన్ ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అతడితో పాటు విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే ఆసీస్‌తో తొలి వన్డేలో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎటువంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో పెర్త్ వన్డే కోసం భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు. ఓపెనర్లగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ఎంపిక చేశాడు.. ఆ తర్వాత మూడు నాలుగు స్ధానాల్లో వరుసగా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.కేఎల్ రాహుల్ ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు రావాలని చోప్రా సూచించాడు. గాయం కారణంగా ఆసీస్ టూర్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో ఆకాష్ చోప్రా అవకాశమిచ్చాడు. అదేవిధంగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు చోటిచ్చాడు. ఇటీవల కాలంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మాత్రం చోప్రా ఎంచుకున్న జట్టులో చోటు దక్కలేదు. మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే అతడు వెల్లడించలేదు. ముగ్గురు పేసర్లకు తన జట్టులో అతడు ఛాన్స్ ఇచ్చాడు. హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఫాస్ట్ బౌలర్లగా ఉన్నారు. నితీష్ రూపంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉన్నప్పటికి చోప్రా హర్షిత్ రాణాకు మూడో పేసర్ అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఆసీస్‌తో వన్డేలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌లో మాత్రం ఈ పేస్ గుర్రం ఆడనున్నాడు.చోప్రా ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేరోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ
- 
      
                   
                                                       ఎలా ఉన్నావు హీరో!న్యూఢిల్లీ: దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుతో చేరారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగలేదు. టెస్టు లేదా టి20 జట్టు సభ్యులుగా ఉన్న ఇతర ప్లేయర్లు కలిసి ఆడుతూ బిజీగా ఉండగా వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లి మాత్రం టీమ్‌కు దూరంగా ఉన్నారు. వన్డే, టి20ల సిరీస్‌ల కోసం బుధవారం భారత జట్టు రెండు బృందాలుగా ఆ్రస్టేలియాకు బయల్దేరి వెళ్లింది. మొదటి బృందంలో రోహిత్, కోహ్లి, శ్రేయస్, కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తదితరులు ఉన్నారు. ఎలా ఉన్నావు హీరో?ఈ సందర్భంగా రోహిత్, గిల్ భేటీ ఆసక్తిని సంతరించుకుంది. తన స్థానంలోనే గిల్‌ను సెలక్టర్లు వన్డే కెప్టెన్ గా నియమించగా... గిల్ నాయకత్వంలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. టూర్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లంతా ఒకే చోటికి చేరే క్రమంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రోహిత్‌ను చూసిన గిల్ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే రోహిత్ కూడా ‘ఎలా ఉన్నావు హీరో’ అంటూ ఆత్మీయంగా పలకరించాడు. టీమ్ బస్సులోకి వెళ్లాక మొదటి సీటులోనే కూర్చున్న కోహ్లికి కూడా గిల్ అభివాదం చేయగా... దానికి బదులిచ్చిన కోహ్లి కెపె్టన్ భుజం తట్టి అభినందించాడు. జట్టు సహచరుల్లో కనిపించిన చిరునవ్వులు అందరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించాయి. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 5 టి20లు ఆడుతుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. 𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝘿𝙤𝙬𝙣 𝙐𝙣𝙙𝙚𝙧 ✈️Of familiar faces and special reunions as #TeamIndia depart for the Australia challenge 😍#AUSvIND pic.twitter.com/ElV3OtV3Lj— BCCI (@BCCI) October 15, 2025
- 
      
                   
                                                       టీమిండియాకు దెబ్బ మీద దెబ్బమహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's CWC 2025) భారత్‌కు (Team India) వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో (శ్రీలంక, పాకిస్తాన్) గెలిచిన టీమిండియా, ఆతర్వాత వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచే స్థితిలో ఉండి కూడా అవకాశాలు చేజార్చుకుంది. ముఖ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్ 330 పరుగులు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఇంత భారీ స్కోర్ చేయకపోయినా బౌలర్ల వైఫల్యం కారణంగా చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజారింది.తాజాగా ఆసీస్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోక ముందే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో 5 శాతం కోత విధించారు. నిర్దేశిత సమయంలోగా భారత బౌలర్లు ఓ ఓవర్ వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ జరిమానా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయని ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కొత విధిస్తారు.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ కప్‌లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న ఇండోర్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన పాకిస్తాన్
- 
      
                   
                                                       గంభీర్ లేకుండానే!.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ ఆస్ట్రేలియాకు..పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. తొలి బ్యాచ్‌లో భాగంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తదితరులు కంగారూ దేశానికి బయల్దేరారు.వీరితో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఆ సమయంలో కొంత మంది సహాయక సిబ్బంది కూడా ఆటగాళ్ల వెంట ఉన్నారు.Team India off to Australia ✈️ pic.twitter.com/FCpqxYjTSI— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025గంభీర్ లేకుండానే..అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ లేకుండానే తొలి బ్యాచ్‌తో వెళ్లడం లేదు. రెండో బ్యాచ్‌తో కలిసి అతడు సాయంత్రం ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నట్లు సమాచారం. ఇక టీమ్ బస్‌లో రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో కూర్చోగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Virat Kohli with Team India at Airport left for Australia. pic.twitter.com/ZJ6Wb80hPC— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025 కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులను 2-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. అక్టోబరు 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలుపెట్టనుంది. ఈ సిరీస్‌కు ముందే వన్డే సారథిగా రోహిత్‌ను తప్పించిన బీసీసీఐ.. గిల్‌కు కెప్టెన్సీ అప్పగించింది.కెప్టెన్సీ మార్పు వెనుకఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు వెనుక గంభీర్ హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్- కోహ్లి చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడారు. ఈ మెగా టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు.ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున రో- కో తొలిసారి ఆస్ట్రేలియాతో వన్డేల సందర్భంగా బరిలోకి దిగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న ఈ ఇద్దరు కంగారూ గడ్డపై సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతారా?కాగా 37 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతారో లేదోనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్‌గా ఉన్న ఈ ఇద్దరు తప్పక మెగా టోర్నీ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. వీరిద్దరి విషయంలో మేనేజ్మెంట్ వైఖరిపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐpic.twitter.com/BZLAUZArJP— Ro³ (@45__rohan) October 15, 2025
- 
      
                   
                                                       ఇప్పటికీ అవే వాడుతున్నాడు.. వాటిని అస్సలు మార్చడు: సూర్యప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఫలానా రంగు డ్రెస్ ధరిస్తే ఆరోజంతా మంచేనని కొందరు భావిస్తే.. మరికొందరు వివిధ వస్తువులను తమతో పెట్టుకోవడం ద్వారా అనుకున్న ఫలితాన్ని రాబట్టవచ్చని నమ్ముతూ ఉంటారు.ముఖ్యంగా సెలబ్రిటీలు ఇలాంటి సెంటిమెంట్లు బాగా ఫాలో అవుతుంటారు. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag).. ఎల్లప్పుడూ ఎరుపు రంగు రుమాలును తన వెంటే ఉంచుకునేవాడు. రెడ్ హ్యాండ్కర్చీఫ్ను అతడు తన లక్కీ చార్మ్‌గా భావించేవాడు. అంతకుముందు మోహిందర్ అమర్నాథ్, స్టీవ్ వా కూడా ఇలాంటి సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేవారు.2022లో తొలిసారి గమనించాటీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు కూడా ఇలాంటి ‘మూఢనమ్మకం’ ఒకటి ఉందట. భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. ‘‘శుబ్‌మన్ గిల్ గుడ్డిగా నమ్మే ఓ విషయం గురించి చెబుతాను. ఈ విషయం గురించి ఆసియా కప్ సమయంలోనూ ఎవరో నన్ను అడిగారు.నేటికీ ఆ ప్యాడ్ల రంగును గిల్ మార్చలేదుదీనిని నేను 2022లో తొలిసారి గమనించా. బహుశా ఆ ఏడాది లేదంటే మరుసటి సంవత్సరం నుంచో ఇది మొదలైనట్లుంది. జట్టులో అందరికంటే భిన్నమైన రంగులో ఉన్న ప్యాడ్లను గిల్ ధరిస్తాడు. అతడి ప్యాడ్స్ రంగు లేత నీలం రంగులో ఉంటుంది.ఆ ప్యాడ్స్ ధరించిన నాటి నుంచి అతడు పరుగుల వరద కొనసాగిస్తూనే ఉన్నాడు. నేటికీ ఆ ప్యాడ్ల రంగును గిల్ మార్చలేదు. ఆసియా కప్ టోర్నీలోనూ అవే ధరించాడు. మా అందరి జెర్సీ ప్యాంట్ కలర్ ఒకేలా ఉంటుంది. కానీ అతడి ప్యాడ్స్ కలర్ మాత్రం డిఫరెంట్.మూఢనమ్మకంగా మారిపోయింది కదా!ఈ విషయం గురించి.. ‘సోదరా.. నీకిది ఒక మూఢనమ్మకంగా మారిపోయింది కదా!’ అని నేను చాలాసార్లు తనతో అన్నాను’’ అని సూర్యకుమార్ యాదవ్ సరదాగా వ్యాఖ్యానించాడు. న్యూస్24తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా సూర్య చివరగా ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన ఈ ఖండాంతర టోర్నీలో బ్యాటర్‌గా విఫలమైనా.. కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించాడు.వన్డే సారథిగానూఈ టోర్నీలో గిల్ సూర్యకు డిప్యూటీగా వ్యవహరించాడు. ఇక అంతకుముందే టీమిండియా టెస్టు కెప్టెన్ అయిన గిల్.. తాజా ఆస్ట్రేలియా పర్యటనతో వన్డే సారథిగానూ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్-2026 తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా సూర్య స్థానాన్ని అతడు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత జట్టు ఆసీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డేల్లో గిల్, టీ20లలో సూర్య సారథ్యం వహిస్తారు.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ
- 
      
                   
                                                       BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐటీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma)ల అంతర్జాతీయ క్రికెట్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఇద్దరూ ఐదు రోజుల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించారు.వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపుఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పెద్దల వైఖరితో నొచ్చుకున్న రో- కో ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కూ వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు. అయితే, ఊహించని రీతిలో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది బీసీసీఐ.దేశీ టోర్నీలు కూడా ఆడాలిఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా రో- కో వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతారనే హామీ కూడా లేదని చెప్పాడు. అంతేకాదు.. అవసరమైతే ఈ ఇద్దరు దేశీ టోర్నీలు కూడా ఆడాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు.రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి వన్డేలకూ త్వరలోనే గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ వీరి అంతర్జాతీయ కెరీర్లో చివరిదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.స్పందించిన బీసీసీఐఢిల్లీలో మంగళవారం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించిన అనంతరం రాజీశ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు.వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్- కోహ్లికు ఆసీస్ సిరీస్ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇద్దరూ ఇద్దరేకాగా వన్డేల్లో కోహ్లి, రోహిత్‌లకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో 51 సెంచరీలతో కోహ్లి ప్రపంచ రికార్డు సాధిస్తే.. రోహిత్ వన్డే ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది వీరిద్దరు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలవడంలో తమ వంతు పాత్ర పోషించారు.అంతేకాదు 2025లో రోహిత్ ఇప్పటికి 8 వన్డేల్లో ఓ సెంచరీ సాయంతో 302 పరుగులు చేయగా.. కోహ్లి ఏడు ఇన్నింగ్స్ ఆడి 275 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 36 ఏళ్ల కోహ్లి ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. 37 ఏళ్ల రోహిత్ ఇటీవల పది కిలోలు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. కాబట్టి ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా వీరిద్దరు ఇప్పట్లో రిటైర్ కాకపోవచ్చని చెప్పవచ్చు.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే
- 
      
                   
                                                       BCCI: గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐటీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చేసిన ‘సిగ్గుచేటు’ వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) స్పందించాడు. గంభీర్ సరిగ్గానే మాట్లాడానని సమర్థించిన అతడు.. యువ ఆటగాడి పట్ల సీనియర్ల ప్రవర్తన సరికాదని పేర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..గంభీర్ హెడ్‌కోచ్ కాగానే..ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో యువ పేసర్ హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి కేకేఆర్ మెంటార్ గంభీర్.. టీమిండియా హెడ్‌కోచ్ కాగానే హర్షిత్ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. వరుస వైఫల్యాలు చెందినా.. టీమిండియాలో అతడి స్థానానికి ఢోకా లేకుండా పోయింది.ముఖ్యంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్‌గానే ఉన్నానని మొత్తుకుంటున్నా.. సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియాతో వన్డే, టీ20లకు హర్షిత్ రాణా ఎంపిక కావడం విమర్శలకు దారితీసింది. గంభీర్ ప్రియ శిష్యుడు కాబట్టే అతడికి ఛాన్సులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.చిక్కా, అశూ విమర్శలుఈ విషయంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగానే స్పందించారు. హర్షిత్‌ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం కావడం లేదని పరోక్షంగా గంభీర్‌ను విమర్శించారు.గంభీర్ ఆగ్రహంఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో విజయానంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్.. చిక్కా, అశూలను టార్గెట్ చేశాడు. ‘‘యూట్యూబ్‌లో వ్యూస్ కోసం యువ ఆటగాడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.మీ స్వార్థం కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను టార్గెట్ చేస్తారా? ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఆటగాడి గురించి ఇలా మాట్లాడకండి’’ అంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా స్పందించాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘గౌతం గంభీర్ సరిగ్గానే చెప్పాడు. ఓ ఆటగాడి ఎంపిక గురించి ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే.. బాధ్యతాయుతంగా విమర్శించాలి. అంతేకానీ.. సదరు ప్లేయర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడకూడదు.ఎవరిని ఎంపిక చేయాలో యాజమాన్యం చూసుకుంటుంది. ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడేటపుడు.. మీరెంత బాధ్యతాయుతంగా ఉన్నారో ఆలోచించుకోండి’’ అంటూ రాజీవ్ శుక్లా గంభీర్‌కు మద్దతు పలికాడు. ANIతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గంభీర్, హర్షిత్ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారే కావడం గమనార్హం.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్#WATCH | Delhi: On Indian Men’s Cricket Team Head Coach Gautam Gambhir's statement on the selection process and bowler Harshit Rana, BCCI Vice President Rajeev Shukla says, "What Gautam Gambhir said is absolutely right. Comments should be made about players with responsibility;… pic.twitter.com/yOrJXFKanF— ANI (@ANI) October 14, 2025
- 
      
                   
                                                       ‘ఆస్ట్రేలియాలో కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు’వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియా (India Tour Of Australia 2025)లో పర్యటించనుంది. కంగారూ జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 19 నుంచి టీమిండియా ఆసీస్ టూర్ ప్రారంభం కానుండగా... దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నారు.అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాకు ఆడిన రో- కో.. ఆ తర్వాత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక గతేడాదే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు మేటి బ్యాటర్లు.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు.ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలోఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలో మాజీ కెప్టెన్లు రోహిత్- కోహ్లి కలిసి ఆడనున్నారు.కాగా రోహిత్‌పై వేటు వేసిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటం గురించి తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రో-కో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో నాలుగైదేళ్లు ఢోకా లేదు‘‘దయచేసి విరాట్ ఫిట్నెస్ గురించి ఎవరూ ఏమీ అడగకండి. ఫిట్నెస్ విషయంలో అతడొక గురు. అతడు ఏం చేసినా మిగతా వాళ్లు ఫాలో అయిపోతారు. కాబట్టి విరాట్ కోహ్లి ఫిట్నెస్ గురించి మనమేమీ ఆందోళన పడాల్సిన పనిలేదు.అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం అతడి కంటే ఫిట్‌గా ఉన్న మరొక ప్లేయర్ ఎవరూ లేరు. అయితే, కోహ్లి బ్యాట్చేతపట్టి ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని నేను ఎదురుచూస్తున్నా.చాలా రోజులుగా అభిమానులతో పాటు నేనూ అతడి ఆటను మిస్సవుతున్నాను. వన్డేల్లో కోహ్లి ఇంకా ఎంతో సాధించగలడు. ఇంకొన్నేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. కనీసం మరో నాలుగైదేళ్లు కోహ్లి వన్డేలు ఆడతాడని నేను నమ్ముతున్నా.కేవలం ఆడటమే కాదు.. తనదైన శైలిలో ఆధిపత్యం కూడా చూపిస్తాడని విశ్వసిస్తున్నా. ఆస్ట్రేలియాలో అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా. ఇక రోహిత్ విషయంలోనూ నేను ఇదే చెప్తా.కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడుఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు భారీ స్కోర్లు సాధించి టీమిండియాను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా కోహ్లికి ఇష్టమైన ప్రత్యర్థి. మూడు వన్డేల్లో కలిపి అతడు కనీసం రెండు శతకాలైనా బాదుతాడని అనుకుంటున్నా’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్
- 
      
                   
                                                       కింగ్ కోహ్లి వచ్చేశాడు..!భారత క్రికెట్ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) భారత్‌లో (ఢిల్లీ) ల్యాండయ్యాడు. విరాట్ గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కోహ్లి భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.THE AURA OF KING KOHLI..!!!! 🐐- The Arrival of Virat Kohli at home in Delhi. 👑pic.twitter.com/fevrsiSB7L— Tanuj (@ImTanujSingh) October 14, 2025ఇవాళ (అక్టోబర్ 14) ఉదయం కోహ్లి న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం స్వల్ప తోపులాట కూడా జరిగింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణg మార్మోగిపోయింది. ప్రస్తుతం ఎక్స్‌లో #ViratReturns అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే సిరీస్ కోసం కోహ్లి ఢిల్లీ నుంచి బయల్దేరతాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ కూడా వెళ్తాడని సమాచారం. మిగతా సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో జరుగనున్నాయి.విరాట్ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లికి ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ తర్వాత కోహ్లి భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ (ఆసీస్ సిరీస్ తర్వాత) ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్‌పై గంభీర్ ఫైర్ కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్‌ల ఆట చూసేందుకు అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోహ్లి, రోహిత్‌ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు.
- 
      
                   
                                                       టీమిండియాతో తొలి వన్డే.. ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్వదేశంలో టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. మొదట వన్డే సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో భారత్-ఆసీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. మొదట వన్డేకు ప్లేయర్లు ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. రిపోర్ట్స్ ప్రకారం.. తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వనుండడంతో స్పిన్నర్ జంపా న్యూ సౌత్ వేల్స్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడంట. దీంతో అడిలైడ్, సిడ్నీలలో జరిగే రెండు, మూడో వన్డేల కోసం తిరిగి జట్టులోకి చేరనున్నాడు. మరోవైపు ఇంగ్లిష్ కాలి కండరాల గాయం నుంచి కోలుకోలేదు.ఈ క్రమంలోనే అతడు పెర్త్ వన్డేకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక వీరిద్దరి స్ధానాలను మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్లతో ఆసీస్ సెలక్టర్లు భర్తీ చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఫిలిప్ ఆసీస్ తరపున వన్డే అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి.ఆస్ట్రేలియా ఫస్ట్-ఛాయిస్ కీపర్ అలెక్స్ కారీ భారత్‌తో వన్డేలకు ఎంపికైనప్పటికి.. యాషెస్‌కు సిద్ధం కావడానికి షెఫీల్డ్ షీల్డ్ గేమ్‌లో పాల్గోనేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు వన్డే సిరీస్ నుంచి వైదొలిగనట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫిలిప్ వికెట్ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు.భారత్‌తో తొలి వన్డేకు ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్చదవండి: ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా రికీ భుయ్
- 
      
                   
                                                       World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీస్ చేరాలంటే...ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI WC 2025)లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్నం వేదికగా తొలుత సౌతాఫ్రికా వుమెన్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన హర్మన్‌సేన.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది.ఓపెనర్లు సూపర్హిట్విశాఖలో ఆస్ట్రేలియా మహిళా జట్టు (IND W vs AUS W)తో మ్యాచ్‌లో 330 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మూడు వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు ప్రతికా రావల్ (75), స్మృతి మంధాన (Smriti Mandhana- 80) గొప్ప ఆరంభం అందించారు.మిగతావారిలో వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 38, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22, జెమీమా రోడ్రిగెస్ 33, రిచా ఘోష్ 32 పరుగులతో ఓ మోస్తరుగా రాణించారు. అయితే, ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ వేగంగా పతనమైంది. అమన్‌జోత్ కౌర్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. దీప్తి శర్మ (1), స్నేహ్ రాణా (8), క్రాంతి గాడ్ (1), శ్రీ చరణి (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది.అనాబెల్ సదర్లాండ్కు ఐదుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సోఫీ మొలినక్స్ మూడు వికెట్లు పడగొట్టింది. మిగిలిన వారిలో మేగన్ షట్, ఆష్ల గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ అలిసా హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.హేలీ విధ్వంసంకేవలం 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించింది. 142 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీచరణి బౌలింగ్‌లో స్నేహ్ రాణాకు క్యాచ్ ఇవ్వడంతో హేలీ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆమెకు తోడుగా మరో ఓపెనర్ ఫోబే లిచ్‌ఫీల్డ్ 40, వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ 47, ఆష్లే గార్డ్నర్ 45 పరుగులతో రాణించారు. ఆఖర్లో కిమ్ గార్త్ (14) సిక్సర్‌బాది ఆసీస్ విజయాన్ని ఖరారు చేసింది.It took another moment of brilliance to stop Alyssa Healy! 🙌Shree Charani ends her spell with 3 wickets, while Sneh Rana takes a stunner 🔥Will this wicket be the turning point of the match? 👀Catch the LIVE action ➡https://t.co/qAoZd44TEs#CWC25 👉 #INDvAUS | LIVE NOW… pic.twitter.com/NMKHPYlZ8q— Star Sports (@StarSportsIndia) October 12, 2025వరుసగా రెండు ఓటములు..కాగా వన్డే వరల్డ్‌కప్-2025లో భారత జట్టు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది.అనంతరం సౌతాఫ్రికా, ఆసీస్ చేతుల్లో వరుస ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌లలో మెరుగైన ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు విజయాలతో ఉన్న భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.సెమీస్ చేరాలంటే..ఆస్ట్రేలియా (7), ఇంగ్లండ్ (6) తర్వాత హర్మన్‌సేన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక భారత్ తదుపరి ఇంగ్లండ్ (అక్టోబరు 19), న్యూజిలాండ్ (23), బంగ్లాదేశ్ (అక్టోబరు 26) జట్లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో గెలిస్తే నెట్‌రన్‌రేటుతో పనిలేకుండా టాప్-4లో నిలిచి.. నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది హర్మన్‌సేన.ఒకవేళ ఇంగ్లండ్ చేతిలో ఓడితే మాత్రం.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై భారత జట్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తద్వారా మరో నాలుగు పాయింట్లు సాధించి.. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో సెమీస్‌కు దూసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే నెట్‌రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.చదవండి: ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా
- 
      
                   
                                                       ఒకే ఒక తప్పు.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై మూడు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 331 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు.ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ అలీసా హీలీ(142) అద్భుత శతకంతో మెరిసింది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు, దీప్తి శర్మ, అమన్ జ్యోత్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) ప్రతికా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ బౌలర్ సదర్లాండ్ 5 వికెట్లతో సత్తాచాటింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. తొలుత బ్యాటింగ్‌లో అదనంగా కొన్ని పరుగులు సాధించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది అని ఆమె చెప్పుకొచ్చింది."ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణించాము. కానీ ఆఖరిలో మా రిథమ్‌ను కోల్పోయాము. అదనంగా మరో 30–40 పరుగులు చేసింటే మేమే విజయం సాధించేవాళ్లం. చివరి 6–7 ఓవర్లలో వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల మేము అనుకున్న టార్గెట్‌ను సెట్ చేయలేకపోయాము.ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికి మేము సరిగా ఉపయోగించుకోలేకపోయాం. గత మూడు మ్యాచ్‌ల్లో మేం మిడిల్ ఓవర్లలో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. కానీ లోయరార్డర్ బాధ్యత తీసుకొని జట్టును గట్టెక్కించింది.కానీ ఈ రోజు మాత్రం 40 ఓవర్ల వరకు మా బ్యాటింగ్ బాగుంది. చివరి ఓవర్లలో మేము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాము. ఆటలో ఇలాంటివి సహజంగా జరగుతూనే ఉంటాయి. ప్రతి మ్యాచ్‌లో 100 శాతం రాణించడం సాధ్యం కాదు. కానీ తిరిగి ఎలా పుంజుకున్నామన్నది ముఖ్యం. తదుపరి రెండు మ్యాచ్‌లు మాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మేము ఓటమిపాలైనప్పటికి మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. చరణి ప్రదర్శనపై మాట్లాడుతూ.. ఆమె నిజంగా అద్భుతం. జట్టుకి అవసరమైనప్పుడు ప్రతీసారి చరణి ముందుంటుంది. హీలీ లాంటి బ్యాటర్‌కి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగింది. ఆమెపై మాకు చాలా నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితులలోనైనా మాకు వికెట్ అందించగలదు. మా జట్టు కాంబనేషన్ గురించి ఎటువంటి చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఈ కాంబినేషన్‌తోనే మేం విజయాలు సాధించాం. ఒకట్రెండు ఓటములతో ఈ కాంబినేషన్ సరి కాదని నేను అనుకోవడం లేదు. మా తదుపరి మ్యాచ్‌లపై దృష్టిపెడతాము అని హర్మన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొంది.చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా
- 
      
                   
                                                       IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయంమహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్‌పై ఆస్ట్రేలియా మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచారు. నిర్ణీత 49 ఓవర్లలో 331 పరుగులు చేసి టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా ఇది రెండవ ఓటమి.తొలుత టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది. 96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అలీస్సా హీలీ: 142 పరుగులు (107 బంతుల్లో) చేసి తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించింది దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, అయితే చివరి ఓవర్లలో ఆసీస్ విజయం సాధించింది. భారత్ మంచి స్కోరు చేసినా, హీలీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను ఆసీస్ చేతుల్లోకి తీసుకెళ్లింది.
- 
      
                   
                                                       IND VS AUS: చెలరేగిన మంధన.. టీమిండియా భారీ స్కోర్మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో (India vs Australia) టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది.96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది. వీరిద్దరు ఔటయ్యాక స్కోర్ కాస్త నెమ్మదించింది. హర్లీన్ డియోల్ (38), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (22), జెమీమా రోడ్రిగెజ్ (33), రిచా ఘోష్ (32), అమన్‌జోత్ కౌర్ (16) అడపాదడపా మెరుపులు మెరిపించారు. టెయిలెండర్లు దారుణంగా విఫలమయ్యారు. వీరు కూడా తలో చేయి వేసి ఉంటే టీమిండియా ఇంకాస్త భారీ స్కోర్ చేసుండేది. 21 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ తలా ఒకటి, శ్రీ చరణి డకౌటయ్యారు. స్నేహ్ రాణా 8 పరుగులతో అజేయంగా నిలిచింది.ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 5 వికెట్లతో సత్తా చాటగా.. సోఫీ మోలినెక్స్ 3, మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో మంధన పలు రికార్డులు నెలకొల్పింది. 18 పరుగుల స్కోర్ వద్ద ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆమె.. వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.అలాగే అర్ద సెంచరీ తర్వాత వన్డేల్లో 5000 పూర్తి చేసుకున్న మంధన.. బంతులు, ఇన్నింగ్స్‌ల పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్‌లు, 5569 బంతులు అవసరమయ్యాయి. ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29 ఏళ్లు) సొంతం చేసుకున్న ప్లేయర్‌గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.చదవండి: భారత్‌తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం
- 
      
                   
                                                       IND VS AUS: అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచ రికార్డుమహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది.తొలుత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఆతర్వాత కొద్ది నిమిషాలకే వన్డేల్లో 5000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుంది. 1000 పరుగుల మార్కును సిక్సర్‌తో తాకిన మంధన.. 5000 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్‌తోనే అందుకుంది.బంతులు, ఇన్నింగ్స్‌ల పరంగా మంధన ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్‌లు, 5569 బంతులు అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డులు స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్‌లు), సూజీ బేట్స్ (6182 బంతులు) పేరిట ఉండేవి.ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29) సొంతం చేసుకున్న ప్లేయర్‌గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.ఈ మ్యాచ్‌లో మంధన 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటైంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో మంధనకు ఇదే తొలి అర్ద సెంచరీ (4 మ్యాచ్‌ల్లో).వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/1గా ఉంది. మంధన ఔట్ కాగా.. ప్రతిక రావల్ (68), హర్లీన్ డియోల్ (12) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ సోఫీ మోలినెక్స్కు దక్కింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
- 
      
                   
                                                       చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్‌తో చేరుకోవడం మరో విశేషం.వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్‌ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.మంధన@18మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్‌లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు
- 
      
                   
                                                       CWC 2025: ఆస్ట్రేలియాతో సమరం.. టీమిండియా బ్యాటింగ్మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి. తుది జట్లు..ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణికాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు
- 
      
                   
                                                       ఏయ్.. ఏమి చేస్తున్నావు! సీరియస్ అయిన రోహిత్ శర్మ(వీడియో)టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్ ప్రస్తుతం ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్క్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది.హిట్‌మ్యాన్ శివాజీ పార్క్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. శివాజీ పార్క్ వచ్చిన ఓ చిన్నారి అభిమాని రోహిత్‌ను కలిసేందుకు ప్రయత్నించాడు.రోహిత్ వద్దకు వెళ్లే క్రమంలో ఆ యంగ్ ఫ్యాన్‌తో సెక్యూరిటీ సిబ్బంది కాస్త దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని గమనించిన రోహిత్ సెక్యూరిటీపై సీరియస్ అయ్యాడు. వారిపై గట్టి అరుస్తూ అతన్ని తనవద్దకు పంపించాలని సూచించాడు. దీంతో హిట్‌మ్యాన్ వద్దకు వెళ్లిన ఆ యువ అభిమాని సెల్పీ తీసుకుని ఖుషీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రోహిత్ శర్మ మనసు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి రోహిత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను వన్డే సారథిగా, అతడికి డిప్యూటీగా శ్రేయస్ అయ్యర్‌ను సెలక్టర్లు నియమించారు.గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగిన తర్వాత భారత్ తరపున రోహిత్‌కు ఇదే తొలిమ్యాచ్. ఆసీస్ టూర్ కోసం రోహిత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మాజీ కెప్టెన్ గతంతో పోలిస్తే చాలా ఫిట్‌గా కన్పిస్తున్నాడు.చదవండి: టీమిండియాపై ఓవరాక్షన్.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీpic.twitter.com/dx0Bn2dp6D— Ro³ (@45__rohan) October 10, 2025
- 
      
                   
                                                       నాకైతే ఆడాలని ఉంది.. కానీ అది నా చేతుల్లో లేదు: జడేజాఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. జడ్డూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.గతేడాది టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2009 నుంచి భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడుతున్న జడేజా అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు.ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ ఈ సౌరాష్ట్ర క్రికెటర్ అదరగొడుతున్నాడు. ఫిట్నెస్ పరంగా కూడా అతడు చాలా మెరుగ్గా ఉన్నాడు. ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వన్డే ప్రపంచ కప్-2027లో జడేజా ఆడుతాడో లేదో సందిగ్ధంగా మారింది. అయితే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ మాత్రం జడేజా తమ ప్రణాళిలకలలో ఉన్నాడని జట్టు ప్రకటన సందర్భంగా చెప్పుకొచ్చాడు. తాజాగా జడేజా కూడా ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు."వన్డే ప్రపంచ కప్-2027లో ఆడాలనుకుంటున్నాను. కానీ అది నా చేతుల్లో లేదు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆసీస్ టూర్‌కు జట్టు ఎంపికకు ముందు సెలక్టర్లు, కెప్టెన్ నాతో మాట్లాడారు. వారి చెప్పిన కారణాలు నాకు అర్థమయ్యాయి. కానీ వన్డే ప్రపంచకప్ గెలవడం మా అందరి కల" అని జడేజా విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: అది నేను ఎప్పటికీ మర్చిపోలేను: గంభీర్
- 
      
                   
                                                       ఇదొక తప్పుడు నిర్ణయం: టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) పెదవి విరిచాడు. అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని టీమిండియా సెలక్టర్లు ఓ ఆటగాడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.మూడు వన్డేలు, ఐదు టీ20లుఇందులో భాగంగా అక్టోబరు 19 నుంచి ఆసీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు... 15న ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. న్యూఢిల్లీ నుంచి రెండు విడతలుగా మన ప్లేయర్లు పెర్త్‌కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా... ఆసీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే వన్డే, టీ20 జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.సంజూ శాంసన్‌ను కాదని...అయితే, వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌కు తోడుగా.. ధ్రువ్ జురెల్‌ను వన్డేలకు తొలిసారి ఎంపిక చేశారు సెలక్టర్లు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్‌పై వేటు వేసి.. టెస్టుల్లో ఇరగదీస్తున్న జురెల్‌ను ఆసీస్ టూర్‌కు ఎంచుకున్నారు.అతడి ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది.. కానీఈ నేపథ్యంలో కైఫ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ‘‘ఇటీవలి కాలంలో ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో శతకంతో మెరవడం విశేషమే. అతడి ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది.భారత క్రికెట్‌కు ఆశాకిరణం అతడు. ప్రతి మ్యాచ్‌లోనూ చితక్కొట్టగల నైపుణ్యాలు అతడికి ఉన్నాయి. కానీ వన్డేల్లో సంజూ శాంసన్‌ను కాదని జురెల్‌ను ఎంచుకోవడం తప్పుడు నిర్ణయం. ఎందుకంటే.. సంజూ సాధారణంగానే లోయర్ ఆర్డర్లో ఆడతాడు.వన్డేల్లో సంజూ గొప్ప ఆప్షన్ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి జురెల్ కంటే వన్డేల్లో సంజూ గొప్ప ఆప్షన్ అవుతాడు. లోయర్ ఆర్డర్లో ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సంజూ భేష్. సిక్సర్లు బాదగలడు. ఒకవేళ ఆసీస్‌తో వన్డేలో అతడిని ఆడిస్తే.. ఆడం జంపా బౌలింగ్‌లో హిట్టింగ్ ఆడగల సత్తా అతడికి ఉంది. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో సంజూ టాప్-10లో ఉన్న సంగతి మర్చిపోవద్దు.ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులకు సంజూ ఐదు లేదంటే ఆరో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. జురెల్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందుకోసం సంజూ వంటి నిలకడగా ఆడే బ్యాటర్లను పక్కన పెట్టడం సరికాదు. వన్డే జట్టులో చోటుకు అతడు అర్హుడు’’ అని కైఫ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు మాత్రం సెలక్టర్లు సంజూను ఎంపిక చేయడం గమనార్హం.రోహిత్‌పై వేటు వేసి.. గిల్‌కు పగ్గాలుఇక ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్ వేదికగా అక్టోబరు 19న తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ నుంచి భారత వన్డే జట్టుకు కూడా శుబ్‌మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ టూర్లో టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేసిన గిల్‌ను... తొలిసారి వన్డే జట్టుకు సారథిగా ఎంపిక చేశారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలో దర్శనమివ్వనున్నారు. కాగా వన్డే సారథిగా రోహిత్‌ను ఇప్పుడే తప్పించడాన్ని కైఫ్ ఇప్పటికే తప్పుబట్టిన విషయం తెలిసిందే.చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్
- 
      
                   
                                                       అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు: అశ్విన్ ఫైర్ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం అద్భుతమైన డెలివరీ సంధించాడని.. అదే ప్రాతిపదికగా ఇప్పటికీ ఓ ఆటగాడికి జట్టులో స్థానం కల్పిస్తున్నారంటూ ‘యువ పేసర్’ను టార్గెట్ చేశాడు.గిల్ సారథ్యంలో ..వెస్టిండీస్ స్వదేశంలో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)కు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే జట్టును ప్రకటించింది.వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్‌తో ఆడే వన్డే, టీ20 జట్లలో యువ పేసర్ హర్షిత్ రాణాకు చోటు దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలో అశ్విన్ ఘాటుగా స్పందించాడు.అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు‘‘అసలు అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకైతే ఈ విషయం అంతుపట్టడం లేదు. రాణాను జట్టులో చేర్చడానికి గల కారణమేమిటో తెలుసుకునేందుకైనా సెలక్షన్ కమిటీ సమావేశంలో భాగమైతే బాగుండు అనిపిస్తోంది.ఆస్ట్రేలియాలో బ్యాట్‌తోనూ రాణించగల ఫాస్ట్‌బౌలర్ టీమిండియాకు అవసరం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలిగే బౌలర్‌ను వాళ్లు ఎంపిక చేయాలి. నాకైతే అతడి బ్యాటింగ్‌పై ఎలాంటి నమ్మకమూ లేదు. రెండేళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని అద్భుతమైన పేస్ డెలివరీతో అవుట్ చేసినందుకు.. నేటికీ ఆ ఒక్క కారణంతోనే వరుస అవకాశాలు ఇస్తున్నారు’’ అని అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.గంభీర్‌కే చురకలుకాగా ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో కేకేఆర్ మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్.. తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ అయ్యాడు. ఈ క్రమంలో గంభీర్ ప్రియ శిష్యుడైన హర్షిత్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడమే కాదు.. వైఫల్యాలు ఎదురైనా జట్టులో వరుస అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అశూ పరోక్షంగా గంభీర్‌కు ఈ విధంగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది.చదవండి: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు!.. నాకు ముందే తెలుసు: గిల్
- 
      
                   
                                                       రోహిత్‌పై వేటు!.. నాకు ముందే తెలుసు: శుబ్‌మన్ గిల్రోహిత్ శర్మ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు. రోహిత్ భయ్యా తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథి రోహిత్ శర్మ (Rohit Sharma).వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు!గతేడాది టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన రోహిత్.. ఈ ఏడాది ఐసీసీ (వన్డే) చాంపియన్స్ ట్రోఫీ -2025లో జట్టుకు కప్ అందించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించగా.. టెస్టు సారథిగా గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అయితే, వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పినా.. బీసీసీఐ (BCCI) ఇటీవలే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. రోహిత్ స్థానంలో వన్డే కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను నియమించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడి శకం మొదలుకానుంది. ఇక ప్రసుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న గిల్ గురువారం మీడియాతో మాట్లాడాడు.నాకు ముందే ఈ విషయం గురించి తెలుసుఈ సందర్భంగా వన్డే సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడం గురించి స్పందిస్తూ.. ‘‘టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే, అంతకంటే ముందే నాకు ఈ విషయం గురించి తెలుసు. నాకు దక్కిన గొప్ప గౌరవం. అతిపెద్ద బాధ్యత.వన్డేల్లో టీమిండియాను ముందుకు నడిపించడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. గత కొన్ని నెలలుగా నా జీవితం కొత్తగా మారిపోయింది. ఉత్సుకతను పెంచింది. భవిష్యత్తులో జట్టును గొప్పగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.రోహిత్ భాయ్ నుంచి నేర్చుకున్నవి ఇవేఇక రోహిత్ శర్మ గురించి ప్రస్తావన రాగా.. ‘‘రోహిత్ భాయ్‌లో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. వాటిని వారసత్వంగా నేను స్వీకరిస్తా. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండటం.. డ్రెసింగ్‌రూమ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ఆయనలో నాకు నచ్చే గుణాలు. ఈ రెండింటిని నేను తప్పకుండా కొనసాగిస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు.కాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అక్టోబరు 10- 14 మధ్య జరిగే రెండో టెస్టులోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. చదవండి: నిజం చెప్పడానికి సిగ్గెందుకు?: సూర్యకుమార్ యాదవ్
- 
      
                   
                                                       టీమిండియాకు షాక్ ఇవ్వనున్న మ్యాక్స్‌వెల్..!త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో (తొలి రెండు మ్యాచ్‌లు) విధ్వంకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు (Glenn Maxwell) చోటు దక్కని విషయం తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడటంతో మ్యాక్సీని ఎంపిక చేయలేదు. గాయం తీవ్రతగా అధికంగా ఉండటంతో మ్యాక్స్‌వెల్ ఈ సిరీస్ మొత్తానికే దూరమవుతాడనే ప్రచారం జరిగింది.మ్యాక్స్‌వెల్ లాంటి ప్రమాదకర ఆటగాడు లేకపోవడం ఈ సిరీస్‌లో తమ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని టీమిండియా భావించింది. అయితే తాజాగా మ్యాక్సీ చేసిన ఓ ప్రకటన టీమిండియా ధీమాను దెబ్బతీసేలా కనిపిస్తుంది.చివరి మూడు మ్యాచ్‌లకు తాను సిద్దమంటూ మ్యాక్సీ సంకేతాలు పంపాడు. ఒకవేళ ఇదే జరిగితే టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి. ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాక్సీ పూర్తిగా పొట్టి ఫార్మాట్‌పైనే ఫోకస్ పెట్టాడు. భారత్‌తో సిరీస్‌లో అతను చెలరేగే అవకాశం ఉంది. చివరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తే చేయాల్సిన డ్యామేజ్ చేస్తాడు.ఈఎస్పీఎన్ కథనం ప్రకారం.. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న మ్యాక్సీ భారత్‌తో మూడో వన్డే సమయానికి పూర్తిగా కోలుకుంటాడు. శస్త్ర చికిత్సకు ముందు డాక్టర్లు అతనికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి.. సహజంగా కోలుకోవాలంటే భారత్‌తో సిరీస్ మొత్తానికే దూరం కావాలి. ఒకవేళ పాక్షికంగా అయినా ఆ సిరీస్‌లో పాల్గొనాలనుకుంటే శస్త్ర చికిత్సకు వెళ్లాలి. దీంట్లో మ్యాక్సీ రెండో ఆప్షన్‌ను చూస్ చేసుకొని శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మరికొద్ది రోజుల్లో అతను పూర్తి ఫిట్‌గా ఉంటాడు. కాగా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ ఓవెన్ కొట్టిన బలమైన షాట్ కారణంగా మ్యాక్స్‌వెల్ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతను ఆ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు.ఇకపై అలాంటి వారికి బౌలింగ్ చేయను.. మ్యాక్సీమిచెల్ ఓవెన్ కొట్టిన బలమైన షాట్ కారణంగా తీవ్ర గాయానికి గురైన మ్యాక్స్‌వెల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ప్రాక్టీస్ సమయంలో స్టోయినిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ లాంటి హిట్టర్లకు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్‌తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపాటీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: విండీస్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు ఇదే.. యువ ఆటగాడికి వార్నింగ్..!
- 
      
                   
                                                       నిజం చెప్పడానికి సిగ్గెందుకు?: సూర్యకుమార్ యాదవ్టీమిండియా టీ20 కెప్టెన్‌గా గతేడాది పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పూర్తిస్థాయి సారథిగా తొలుత శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఈ ముంబై బ్యాటర్.. ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌ను గెలుపుబాటలో నడిపించాడు.తాజాగా ఆసియా టీ20 కప్-2025 (Asia Cup)లో అజేయంగా ఫైనల్‌కు చేర్చిన సూర్య... టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియాను విజేతగా నిలిపాడు. కెప్టెన్‌గా ఈ మేరకు విజయవంతమవుతున్నా.. బ్యాటర్‌గా మాత్రం సూర్య రోజురోజుకూ గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోతున్నాడు.ఐపీఎల్లో అదరగొట్టినా...ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరఫున అదరగొట్టిన సూర్య.. సగటు 65తో ఏకంగా 717 పరుగులు రాబట్టాడు. కానీ టీమిండియా తరఫున మాత్రం బ్యాట్‌తో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఆసియా కప్ టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో కలిపి సూర్య సాధించిన పరుగులు కేవలం 72. సగటు 18. స్ట్రైక్‌రేటు 101.41. అంతకు ముందు కూడా అంతర్జాతీయ టీ20లలో సూర్య పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.నిజం చెప్పడానికి సిగ్గెందుకు?ఈ నేపథ్యంలో తన ఫామ్‌లేమి గురించి సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు. ‘‘నిజం చెప్పడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు. ఆసియా కప్ టోర్నీని నేను మెరుగ్గానే ఆరంభించాను. 40 పరుగుల వరకు చేయగలిగా. ఆ తర్వాత కూడా నా బ్యాటింగ్ బాగానే ఉంది.కానీ పరుగులు మాత్రం రాబట్టలేకపోయాను. మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే తీరు, ప్రక్రియలో నేను ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాను. సరైన దారిలో నడుస్తున్నపుడు ఒక్కోసారి పరుగులు రాకపోయినా పెద్దగా ఆందోళన పడకుండా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుంటే సరి.జట్టుపై ప్రభావం పడకుండా..ఏదేమైనా నా ఫామ్ జట్టుపై ప్రభావం చూపనంత వరకు పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు. అయితే, మా జట్టు ప్రస్తుతం అదరగొడుతోంది. సూపర్ ఫామ్‌లో ఉంది. డ్రెసింగ్‌రూమ్‌లో వాతావరణం గొప్పగా ఉంటుంది.నా ఫామ్ ప్రభావం జట్టుపై పడకుండా.. విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంపై మాత్రమే నేను దృష్టి సారిస్తాను’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. విమల్ కుమార్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. లేటు వయసులో అరంగేట్రంకాగా సూర్యకుమార్ తదుపరి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీకానున్నాడు. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య భారత్- ఆస్ట్రేలియా మధ్య ఈ సిరీస్‌కు షెడ్యూల్ ఫిక్స్ అయింది.ఇక 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 35 ఏళ్ల సూర్య.. ఇప్పటి వరకు 90 టీ20లు, 37 వన్డేలు, ఒక టెస్టు ఆడాడు. టీ20లలో నాలుగు శతకాల సాయంతో 2670 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో 773, టెస్టుల్లో 8 పరుగులు చేయగలిగాడు. ఐపీఎల్లో ఇప్పటికి 166 మ్యాచ్‌లు ఆడి 4311 పరుగులు చేశాడు.చదవండి: ఫిట్‌గానే ఉన్నా.. అందుకే నన్ను సెలక్ట్ చేయలేదు: స్పందించిన షమీ
- 
      
                   
                                                       ఫిట్‌గానే ఉన్నా.. అందుకే నన్ను సెలక్ట్ చేయలేదు: స్పందించిన షమీసీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami)ని టీమిండియా సెలక్టర్లు పక్కన పెట్టేశారు. ముఖ్యంగా టెస్టు జట్టులో అతడికి చోటు దక్కడమే లేదు. ఫిట్నెస్ కారణాలు చూపి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు షమీని ఎంపిక చేయని సెలక్టర్లు.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా అతడికి మొండిచేయి చూపారు.బుమ్రా అలా.. సిరాజ్ ఇలామరోవైపు.. ఫిట్నెస్ సమస్యలు ఉన్నప్పటికీ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకుంటూ.. మరికొన్ని మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇక మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మాత్రం రెస్ట్ అన్నదే లేకుండా టెస్టుల్లో ఇరగదీస్తుండగా.. షమీని కాదని యువ పేసర్ ప్రసిద్ కృష్ణ వైపు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతోంది.ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే... ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఖరిగా ఆడిన షమీ 9 వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే వన్డే, టీ20 జట్లకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు.స్పందించిన షమీఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ గురించి తమకు అప్డేట్ లేదని చెప్పాడు. ఈ నేపథ్యంలో షమీ మౌనం వీడాడు. టీమిండియా నుంచి తనను పక్కనపెట్టడం గురించి స్పందిస్తూ..‘‘నా విషయంలో ఎన్నో వదంతులు పుట్టుకొస్తున్నాయి. మీమ్స్ కూడా వేస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై నా స్పందన తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఏదేమైనా సెలక్షన్ అనేది నా చేతుల్లో లేదు.అందుకే నన్ను సెలక్ట్ చేయలేదు.. కానీసెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ నిర్ణయానుసారమే అంతా జరుగుతుంది. ఒకవేళ నేను జట్టులో ఉండాలని వారు భావిస్తే ఎంపిక చేస్తారు. లేదు నేను ఇంకొన్నాళ్లు వేచిచూడాలని అనుకుంటే ఇలా చేస్తారు. నేను మాత్రం పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ప్రాక్టీస్ కూడా చేస్తున్నా.దులిప్ ట్రోఫీ ఆడాను. 35 ఓవర్లు బౌలింగ్ చేశాను. ఫిట్నెస్ కారణంగా ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. నా రిథమ్ బాగుంది’’ అని షమీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్


