గంభీర్ ప్ర‌యోగం సక్సెస్‌.. టీమిండియా పరువు కాపాడిన హర్షిత్‌ | IND vs AUS: Harshit Rana shuts critics up with his bat, gives India a lifeline In 2nd T20I | Sakshi
Sakshi News home page

IND vs AUS: గంభీర్ ప్ర‌యోగం సక్సెస్‌.. టీమిండియా పరువు కాపాడిన హర్షిత్‌

Oct 31 2025 4:06 PM | Updated on Oct 31 2025 4:15 PM

IND vs AUS: Harshit Rana shuts critics up with his bat, gives India a lifeline In 2nd T20I

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హ‌ర్షిత్ రానా మ‌రోసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భార‌త బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో రాణాను టీమ్ మెనెజ్‌మెంట్ ప్ర‌మోట్ చేసింది.

శివ‌మ్ దూబే కంటే ముందు రాణా బ్యాటింగ్‌కు వ‌చ్చాడు.  ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన రాణా కీల‌కమైన ప‌రుగులు సాధించాడు. 49 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన భార‌త జ‌ట్టును రాణా.. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ఆదుకున్నాడు. 

తొలుత కాస్త ఇబ్బంది ప‌డిన‌ప్ప‌టికి క్రీజులో క‌దుర్కొన్నాక మాత్రం ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. మార్క‌స్ స్టోయినిష్ బౌలింగ్‌లో రాణా బాదిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్ అని చెప్పుకోవాలి. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న హ‌ర్షిత్‌.. 3 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 35 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

అత‌డు బ్యాటింగ్ సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. గంభీర్ న‌మ్మ‌కం నిజ‌మే అంటూ నెటిజ‌న్లు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా హ‌ర్షిత్ రాణాను ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేయ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది.

గంభీర్ స‌పోర్ట్ అత‌డికి ఉంద‌ని, అందుకే వ‌న్డే, టీ20లు రెండింటికి సెల‌క్ట్ చేశార‌ని మాజీలు సైతం మండిప‌డ్డారు. అయితే వాళ్లంద‌రికి గంభీర్ గ‌ట్టి కౌంట‌రిచ్చాడు. రాణాను మెరిట్ ఆధారంగా సెల‌క్ట్ చేశామ‌ని, అత‌డికి ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయ‌ని గౌతీ మద్దతుగా నిలిచాడు. ఆసీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో కూడా రాణా బంతితో బ్యాట్‌తో కూడా మెరిశాడు. ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ స‌త్తాచాటాడు.

అభిషేక్ సూప‌ర్ ఇన్నింగ్స్‌..
ఇక ఈ మెల్‌బోర్న్ టీ20లో అభిషేక్ శర్మ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డ‌తున్న‌ప్ప‌టికి అభిషేక్ మాత్రం త‌న విరోచిత పోరాటాన్ని కొన‌సాగించాడు. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. 

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్‌తో పాటు కూడా రాణా కూడా కీలక నాక్ ఆడడంతో ఆ మాత్రం స్కోర్ అయినా భారత్ సాధించగల్గింది. వీరిద్దరూ మినిహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..బార్ట్‌లెట్‌,నాథన్ ఎల్లీస్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IND vs AUS: సంజూకు ప్ర‌మోష‌న్ ఇచ్చిన గంభీర్‌.. క‌ట్ చేస్తే! 4 బంతుల‌కే

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement