breaking news
melbourne cricket
-
గంభీర్ ప్రయోగం సక్సెస్.. టీమిండియా పరువు కాపాడిన హర్షిత్
టీమిండియా ఆల్‌రౌండర్ హర్షిత్ రానా మరోసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్లో రాణాను టీమ్ మెనెజ్‌మెంట్ ప్రమోట్ చేసింది.శివమ్ దూబే కంటే ముందు రాణా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాణా కీలకమైన పరుగులు సాధించాడు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రాణా.. అభిషేక్ శర్మతో కలిసి ఆదుకున్నాడు. తొలుత కాస్త ఇబ్బంది పడినప్పటికి క్రీజులో కదుర్కొన్నాక మాత్రం ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మార్కస్ స్టోయినిష్ బౌలింగ్‌లో రాణా బాదిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్ అని చెప్పుకోవాలి. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న హర్షిత్.. 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడు బ్యాటింగ్ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గంభీర్ నమ్మకం నిజమే అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయడం పట్ల తీవ్ర విమర్శల వర్షం కురిసింది.గంభీర్ సపోర్ట్ అతడికి ఉందని, అందుకే వన్డే, టీ20లు రెండింటికి సెలక్ట్ చేశారని మాజీలు సైతం మండిపడ్డారు. అయితే వాళ్లందరికి గంభీర్ గట్టి కౌంటరిచ్చాడు. రాణాను మెరిట్ ఆధారంగా సెలక్ట్ చేశామని, అతడికి ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయని గౌతీ మద్దతుగా నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా రాణా బంతితో బ్యాట్‌తో కూడా మెరిశాడు. ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ సత్తాచాటాడు.అభిషేక్ సూపర్ ఇన్నింగ్స్..ఇక ఈ మెల్బోర్న్ టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి అభిషేక్ మాత్రం తన విరోచిత పోరాటాన్ని కొనసాగించాడు. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్‌తో పాటు కూడా రాణా కూడా కీలక నాక్ ఆడడంతో ఆ మాత్రం స్కోర్ అయినా భారత్ సాధించగల్గింది. వీరిద్దరూ మినిహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్,నాథన్ ఎల్లీస్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs AUS: సంజూకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్.. కట్ చేస్తే! 4 బంతులకేShort ball? No problem! #HarshitRana clears it for a six! 🚀Brings up a solid fifty stand fearless, fiery, and full Skyball mode on! 🔥#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/sOGZ6m3u5y— Star Sports (@StarSportsIndia) October 31, 2025 -
సచిన్ టెండుల్కర్ అందుకు అంగీకరించారు: ఎంసీసీ
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు విశిష్ట గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (Melbourne Cricket Club-ఎంసీసీ) ప్రకటించింది. తమ ప్రతిపాదనను సచిన్ అంగీకరించినట్లు తెలిపింది.కాగా 1838లో స్థాపించిన ఎంసీసీ ఆస్ట్రేలియాలోనే పురాతన క్రీడా క్లబ్. ఈ క్లబ్‌కు చెందిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సచిన్ చేసిన పరుగుల రికార్డు ఇంకా పదిలంగానే ఉంది.ఎంసీజీలో పరుగుల వరదఈ వేదికపై మొత్తంగా ఐదు టెస్టులాడిన టెండుల్కర్(Sachin Tendulkar) 44.90 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. సచిన్‌కు విశిష్ట సభ్యత్వం(Honorary Cricket Membership) ఇవ్వాలని ఎంసీసీ నిర్ణయించింది. ఆయన అంగీకరించడం మాకు సంతోషంఈ మేరకు.. ‘ఎంసీసీ సభ్యత్వం స్వీకరించేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ సచిన్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్‌కే అతడొక ఐకాన్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణ ఆటతీరుకు గుర్తింపుగా విశిష్ట సభ్యత్వం ఇస్తున్నాం’ అని ఎంసీసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.అదే విధంగా.. ఎంసీసీ అధ్యక్షుడు ఫ్రెడ్ ఓల్డ్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘కేవలం భారత క్రికెట్‌కే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు కూడా సచిన్ టెండుల్కర్ ఎనలేని సేవలు అందించారు. ఆయన మా విశిష్ట సభ్యత్వం స్వీకరించేందుకు ఒప్పుకొన్నారు. ఇంతకంటే మాకు గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఇలాంటివేం కొత్త కాదుఇక.. ఆస్ట్రేలియా నుంచి సచిన్‌కు ఈ గౌరవం కొత్తేం కాదు. మనదేశంలో ‘భారతరత్న’ లాంటి ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారంతో 2012లోనే అక్కడి ప్రభుత్వం సచిన్ టెండుల్కర్‌ను సత్కరించింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఎంసీజీలోనే ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు ఆడుతోంది. అంతకు ముందు పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్, అడిలైడ్ టెస్టులో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. దీంతో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సమంగా ఉన్నాయి. చదవండి: IND VS AUS: తగ్గేదేలేదన్న నితీశ్ రెడ్డి.. వైరలవుతున్న పుష్ప స్టయిల్ సెలబ్రేషన్స్ -
రైనాకు అవకాశం ఇస్తారా?
రేపటి నుంచి బాక్సింగ్ డే టెస్టు తీవ్ర ఒత్తిడిలో ధోనిసేన వార్నర్, వాట్సన్ సిద్ధం మెల్బోర్న్: తొలి రెండు టెస్టుల్లో చేజేతులా ఓటమిపాలైన భారత్ కీలకమైన మూడో టెస్టు (బాక్సింగ్ డే)పై దృష్టిసారించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ‘అనిశ్చితి’కి తెరదించి ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో శుక్రవారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టెస్టు సిరీస్‌ను ధోనిసేన డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే గత జట్ల మాదిరిగా పరాభావంతో వెనుదిరగాల్సిందే. గత రెండు మ్యాచ్‌ల్లో ఒత్తిడికి తలొగ్గిన భారత జట్టులో కొన్ని మార్పులు చేయాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. మిడిలార్డర్లో రోహిత్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 43, 6, 32, 0 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇతని స్థానంలో సురేశ్ రైనాను జట్టులోకి తెస్తే ఎలా ఉంటుందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి తీవ్రంగా యోచిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తే అతని సత్తాను కూడా పరీక్షించే అవకాశం దక్కుతుందని నమ్ముతున్నారు. ఇందుకు అనుగుణంగా రైనా కూడా రహానే, అశ్విన్‌తో కలిసి నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. దీంతో ఎవరికి విశ్రాంతి ఇస్తారనే అంశం ఇప్పుడు జట్టులో హాట్ టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. రోహిత్ నెట్ ప్రాక్టీస్‌లో జోరు తగ్గించడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. సెషన్ చివర్లో వృద్ధిమాన్ సాహాతో కలిసి రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ ఎక్కువసేపు బౌలింగ్ చేయలేదు. దీంతో అతను తుది జట్టులో ఉండటంపై సందేహం నెలకొంది. వార్నర్ ఫిట్! మరోవైపు గాయాల నుంచి కోలుకుంటున్న ఆసీస్ కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. బొటన వేలి గాయంతో బాధపడుతున్న వార్నర్ మ్యాచ్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. మంగళవారం ప్యాటిన్సన్ బౌన్సర్‌కు ప్రాక్టీస్ వదిలేసి వెళ్లిన వాట్సన్ కూడా మ్యాచ్‌కు సిద్ధమేనని చెప్పాడు. ఈ ఇద్దరు బుధవారం ప్రాక్టీస్ సెషన్లో ఎలాంటి సమస్యలు లేకుండా బ్యాటింగ్ చేశారు. ‘బంతి తగిలినప్పుడు కాస్త నొప్పి ఎక్కువగా ఉండింది . ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. మ్యాచ్ ఆడతా’ అని వార్నర్ పేర్కొన్నాడు. మిషెల్ మార్ష్ స్థానంలో వచ్చిన జో బర్న్స్ టెస్టుల్లో అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. నెట్స్‌లో గాయపడిన స్టార్క్, తొడ కండరాల గాయం నుంచి హారిస్‌లు పూర్తిగా కోలుకున్నారు. అయితే ప్రాక్టీస్‌లో వేగంగా దూసుకొచ్చిన బంతి షాన్ మార్ష్ ఎడమ చేతికి బలంగా తాకడంతో ఆసీస్ మేనేజ్మెంట్ మళ్లీ ఆందోళనలో పడింది. భారత్‌కు నమ్మకం లేదు: హెడెన్ విదేశాల్లో టెస్టు మ్యాచ్‌లు గెలుస్తామన్న నమ్మకం భారత జట్టులో లేదని ఆసీస్ మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హెడెన్ అన్నాడు. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో కీలక సమయాలను ధోనిసేన సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నాడు. ‘విదేశాల్లో మ్యాచ్‌లు గెలవలేమన్నది భారత్ నమ్మకం. ఇదే అతిపెద్ద బలహీనత. తొలి రోజు మంచి ఆరంభాలు లభించినా మ్యాచ్‌ను ముగించే విషయంలో మాత్రం వెనుకబడిపోయారు. అత్యంత కీలక క్షణాలను వాళ్లు చేజేతులా జారవిడుచుకున్నారు. జట్టును పనికిమాలిన అంశాలు చుట్టుముట్టాయి. ఫుడ్ విషయాన్ని పక్కనబెడితే.. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు సాకులను వెదుకుతోంది. బ్రిస్బేన్ మ్యాచ్‌లో ధావన్ బ్యాటింగ్ చేయలేనని చెప్పడమే వాళ్ల పిరికితనానికి నిదర్శనం’ అని హెడెన్ విమర్శించాడు. ఆసీస్ ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేసి భారత్ అనవసరంగా ఇబ్బందుల్లో పడుతుందన్నాడు. అయితే ఆసీస్‌తో పోలిస్తే భారత బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. బౌలింగ్‌లో మాత్రం ఆసీస్‌దే పైచేయి అని చెప్పాడు. మూడో టెస్టు రేపు ఉదయం గం. 5.00 నుంచి స్టార్ క్రికెట్-1లో ప్రత్యక్ష ప్రసారం


