అతడెందుకు అని తిట్టారు.. క‌ట్ చేస్తే! 133.33 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు | Harshit Rana Silences Critics with Fiery Knock in 2nd ODI vs Australia | Sakshi
Sakshi News home page

IND vs AUS: అతడెందుకు అని తిట్టారు.. క‌ట్ చేస్తే! 133.33 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు

Oct 23 2025 2:06 PM | Updated on Oct 23 2025 2:32 PM

Harshit Rana silences critics with fine cameo in IND vs AUS 2nd ODI

ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గౌతం గంభీర్ సపోర్ట్‌తోనే అతడిని ఎంపిక చేశారని అశ్విన్‌, కృష్ణమచారి శ్రీకాంత్ దిగ్గజ క్రికెటర్ల సైతం మండిపడ్డారు.

ఆ తర్వాత వారిద్దరికి గంభీర్ సైతం గట్టిగా కౌంటరిచ్చాడు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేశామని, రాణాకు బంతితో బ్యాట్‌తో రాణించే సత్తా ఉందని గౌతీ చెప్పుకొచ్చాడు. అయితే గంభీర్ చెప్పిన మాటలు నిజమేనని రాణా నిరూపించుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో హర్షిత్ రాణా సత్తాచాటాడు.

తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్‌కు దిగిన రాణా.. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఆడమ్‌ జంపా వంటి స్టార్ స్పిన్నర్‌ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.  రాణా 18 బంతుల్లో మూడు ఫోర్లు సాయంతో 24 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాణా 133.33 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. అతడి కీలక ఇన్నింగ్స్‌తో  భారత స్కోర్‌ 250 పరుగుల మార్క్‌ దాటింది.

రోహిత్, అయ్యర్ హాఫ్ సెంచరీలు
కాగా అడిలైడ్ వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు.

అతడితో పాటు శ్రేయస్ అయ్యర్‌(61), అక్ష‌ర్ ప‌టేల్‌(44) రాణించారు. ఆఖరిలో హర్షిత్‌తో పాటు అర్ష్‌దీప్ కూడా 13 పరుగులతో కీలక నాక్ ఆడాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..బార్ట్‌లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement