ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనుంది. ఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా 2026-27 కాలానికి గానూ ఆస్ట్రేలియా షెడ్యూల్‌కు సంబంధించిన అంతర్జాతీయ క్యాలెండర్‌ను సీఏ ప్రకటించింది.
ఇందులో భాగంగా ఆగష్టు నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ ద్వారా ఆసీస్ హోం సీజన్ మొదలుకానుంది. ఇంగ్లండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్టుతో 2027 మార్చితో ఈ సీజన్ ముగియనుంది. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో నాలుగు వారాల పాటు సిరీస్‌లు ఆడనున్న ఆసీస్.. అక్టోబరు చివరలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
ఆ తర్వాత నవంబరులో ఇంగ్లండ్‌తో ఎనిమిది మ్యాచ్‌ల వైట్‌బాల్ సిరీస్ ఆడనుంది. ఇక వచ్చే ఏడాది జనవరి మధ్య లేదంటే చివరి వారంలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది.
వారికి ఇదే ఆఖరి సిరీస్
ఈ నేపథ్యంలో.. ‘‘భారత్‌లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియోన్ వంటి ఆటగాళ్లకు ఇదే ఆఖరి సిరీస్ కావొచ్చు’’ అని సీఏ తన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఒకవేళ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్‌కు అర్హత సాధిస్తే జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా ఆసీస్ ప్రత్యర్థితో తలపడుతుంది. అనంతరం జూన్- ఆగష్టు మధ్య కాలంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతుంది.
ఆస్ట్రేలియా టెస్టు షెడ్యూల్ 2026-2027
👉ఆగష్టు: బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై రెండు టెస్టులు
👉అక్టోబరు- సౌతాఫ్రికాతో మూడు టెస్టులు
👉డిసెంబరు- జనవరి: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై నాలుగు టెస్టులు
👉జనవరి- మార్చి: టీమిండియాతో ఐదు టెస్టులు
👉మార్చి 11-15: ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై 150వ వార్షికోత్సవ టెస్టు
👉జూన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (అర్హత సాధిస్తే)
👉జూన్- ఆగష్టు: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు.
చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!


