breaking news
National
-
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్‌లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు. కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. -
దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000..!
భారతదేశం విద్యారంగం చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. 2024-25లో మొత్తం పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య ఒక కోటి మార్కును దాటడం దీనికి నిదర్శనం. అయితే దేశంలోని విద్యారంగంలో కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కేవలం విద్యా నాణ్యతకే పరిమితం కాకుండా, దేశ సుస్థిర ఆర్థిక వృద్ధికి, మానవ వనరుల అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ప్రధాన సమస్యలువిద్యార్థులు లేని పాఠశాలలు2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అంతటా దాదాపు 8,000 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రభుత్వం ఖర్చు చేసిన వనరులపై ఎలాంటి ఫలితాలు అందించని పెట్టుబడిని సూచిస్తాయి. భవనాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతాల కోసం ఖర్చు చేసిన ప్రజా ధనం వృథా అవుతుంది. చాలాచోట్ల పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాల రూపంలో ప్రజాధనం పంపిణీ అవుతున్నా ఉత్పత్తి శూన్యం (Zero Output). అంటే విద్యార్థులకు విద్య అందకపోవడం, ద్రవ్య వనరుల దుర్వినియోగానికి ఇది దారితీస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.🚨 Nearly 8,000 schools across India recorded no student enrolments during the 2024-25 academic session, and yet, over 20,000 teachers for paid. (MoE)— Indian Tech & Infra (@IndianTechGuide) October 27, 2025జీతాలు లేకుండా పనులు..కొన్ని చోట్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులు సుమారు 20,000 మందికి పైగా జీతాలు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది వ్యవస్థాపరమైన లోపాలను స్పష్టం చేస్తుంది. తమిళనాడు, కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ‘సమగ్ర శిక్ష’ వంటి పథకాల కింద పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు తమ వేతనాల్లో ఆలస్యం జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడం కారణంగా ఉంది.జీతాల ఆలస్యం ఉపాధ్యాయుల్లో నిరాశ, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారు తమ వృత్తిపై దృష్టి పెట్టలేక ఆర్థిక భద్రత కోసం అదనపు వనరులను వెతుక్కోవాల్సి వస్తుంది. జీతాల ఆలస్యం కారణంగా ఉపాధ్యాయుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది వినియోగాన్ని తగ్గించి మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: ప్రయాణికుల వాహన ఎగుమతులు అప్ -
వైద్యురాలి మృతి కేసులో మరో ట్విస్ట్.. దీపాలీ రిపోర్టు నిజమేనా?
ముంబై: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యురాలు మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వైద్యురాలి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. చనిపోయిన వైద్యురాలు.. దీపాలీ మారుతీ అనే మహిళ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై దర్యాప్తు చేయాలని ఆమె తల్లి భాగ్యశ్రీ డిమాండ్ చేశారు.కాగా, మహారాష్ట్ర ఓ వైద్యురాలు.. ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తనపై లైంగిక దాడి చేశారని.. మానసిక, శారీరక వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. అలాగే, తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నాయకులు వైద్య నివేదికలు మార్చాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. దీంతో, ఆమె ఇచ్చిన రిపోర్టులకు సంబంధించి.. పాత కేసుల దర్యాప్తు విషయంలో సందేహాలు ఉన్నట్టు తాజాగా ఓ మహిళ అనుమానాలు వ్యక్తం చేశారు.తాజాగా సతారాకు చెందిన భాగ్యశ్రీ పచాంగ్నే.. తన కుమార్తె దీపాలీ మారుతీ మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలే రిపోర్ట్ మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, భాగ్యశ్రీ పచాంగ్నే కుమార్తె దీపాలి మారుతిని సైన్యంలో పని చేస్తున్న అజింక్య హన్మంత్ నింబాల్కర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి అత్త గారింట్లో దీపాలి.. తీవ్ర మానసిక క్షోభకు గురైంది. అనంతరం, ఆగస్టు 19న దీపాలి మారుతి చనిపోయింది. అల్లుడు ఫోన్ చేసి దీపాలి పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి తల్లికి తెలియజేశాడు. గర్భవతి కాబట్టి మూర్ఛపోయి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ భావించింది. కానీ, ఆసుపత్రికి వెళ్లి చూసే సమయానికి దీపాలి చనిపోయి ఉండటం చూసి ఆవేదనకు గురైంది.అయితే, దీపాలి ఆత్మహత్య చేసుకుందని బంధువు ఒకరు తల్లికి తెలిపారు. కానీ, భాగ్యశ్రీ మాత్రం దీపాలి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు.. దీపాలి మరణం తర్వాత పోస్ట్‌మార్టం జరిగి ఐదు రోజులైనా నివేదిక ఇవ్వలేదు. నెల రోజుల తర్వాత నివేదిక వచ్చింది. తీరా ఆ నివేదికలో సహజ మరణం అని రావడంతో భాగ్యశ్రీ ఖంగుతిన్నది. ఆ నివేదికపై తల్లి స్పందిస్తూ.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. దీపాలిని భర్త, అత్తమామలు చంపేశారని నమ్ముతున్నాను. ఆమె ఆరు నెలల గర్భవతి. ఏడాదిన్నర కుమార్తె కూడా ఉంది. నా కుమార్తె ఆత్మహత్య చేసుకోదు అని తెలిపారు. అనంతరం, దీపాలి మృతిపై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేశారు. -
వేధింపులపై మంత్రి షాకింగ్ కామెంట్లు
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల వేధింపుల వ్యవహారంలో.. నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈలోపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటన ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లకూ గుణం పాఠం లాంటిందంటూ వ్యాఖ్యానించారాయన. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టోర్నీ కోసం వచ్చిన ఆసీస్ టీంలో ఇద్దరు క్రికెటర్లు ఇండోర్ నగరంలో వేధింపులకు గురయ్యారు(Indore Incident). అక్టోబర్ 23వ తేదీన ఖజ్రానా రోడ్లో ఉన్న హోటల్ నుంచి దగ్గర్లోని ఓ కేఫ్‌కి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి వాళ్లిద్దరినీ తాకి పరాయ్యాడు. జట్టు నిర్వాహకుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని పట్టుకున్నారు. తాజాగా.. మంత్రి విజయ వర్గీయ ఈ ఘటనపై స్పందిస్తూ.. గతంలో ఓ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడికి తన సమక్షంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘ఇంగ్లీష్ ఫుట్‌బాలర్ ఒకరు నాతో పాటే ఓ హెటల్లో దిగారు. అతను దిగాడనే సమాచారం అందుకుని అభిమానులు అక్కడికి పోటెత్తారు. కొందరు అతని నుంచి ఆటోగ్రాఫులు తీసుకుంటుంటే.. ఓ అమ్మాయి అతనికి ముద్దు పెట్టింది. ఆ సయమంలో పెనుగులాట జరిగి.. అతని దుస్తులు చించేశారు. క్రీడాకారులు ఎప్పుడూ తమకు ఉన్న ప్రజాదరణను గుర్తుంచుకోవాలి. అలా పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లేటప్పుడు కచ్చితంగా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఈ ఘటన మనకు మాత్రమే కాదు.. వాళ్లిద్దరీకి కూడా ఓ గుణపాఠం’’ అని అన్నారాయన.మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల భద్రతను పక్కనపెట్టి బాధితులను తప్పుపడుతున్నట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ నేత అరుణ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. అతిథి దేవో భవ అనేది మర్చిపోయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. విజయవర్గీయ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాను కేవలం సెల్ఫీ కోసమే ప్రయత్నించానని, వేధించలేదని తొలుత నిందితుడు అకీల్(28) చెప్పాడు. అయితే విచారణలో ఉద్దేశపూర్వకంగానే వాళ్లను వెంబడించి వేధించాడని తేలడంతో నిజం ఒప్పుకున్నాడు. తన తండ్రిని డ్యూటీలో దించేసి వెళ్తుండగా ప్లేయర్స్‌ని చూసి బైక్ వాళ్ల వైపు తిప్పాడు. కొద్ది దూరం వెంబడించి వికృత చేష్టలకు పాల్పడి పారిపోయాడు. మంత్రి విజయవర్గీయకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ తన సోదరి పట్ల చూపే ఆప్యాయత భారతీయ సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అది విదేశాల నుంచి తెచ్చుకున్న విలువలని విమర్శించారు. ‘మేము పాత సంస్కృతికి చెందినవాళ్లం. మా సోదరీమణుల గ్రామంలో కనీసం నీళ్లు కూడా తాగము. మా అత్త నివసించే జిరాపూర్కు వెళ్లినప్పుడు నా తండ్రి కుండ నీరు తీసుకెళ్లేవారు. కానీ, నేడు మన ప్రతిపక్ష నాయకులు తమ సోదరీమణులను నడిరోడ్డుపైనే ముద్దుపెట్టుకుంటున్నారు. మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను.. మీలో ఎవరైనా బహిరంగంగా మీ సోదరిని లేదా కూతురిని ముద్దుపెట్టుకుంటారా..? ఇది విలువలు లేకపోవడమే. ఇవన్నీ విదేశాల్లో పెరగడం వల్ల వచ్చిన విదేశీ విలువలు. వాళ్లు మన ప్రధాన మంత్రితో కూడా అమర్యాదగానే మాట్లాడతారు’ అని అన్నారు. కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఆయన తన కామెంట్లపై అస్సలు తగ్గలేదు.ఇదీ చదవండి: ఇండోర్ ఘటన.. నిందితుడు మాములోడు కాదు! -
నితీశ్‌కు ‘రెబల్స్’ టెన్షన్.. సిట్టింగ్ ఎమ్మెల్యే సహా 16 మందిపై వేటు
పాట్న: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌లో(Bihar Assembly Election) కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేడీయూలోని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ మంత్రులు సహా 16 మంది నేతలపై పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) బహిష్కరణ వేటు వేశారు. ఎన్డీయే అధికారిక అభ్యర్థులకు పోటీగా ఎన్నికల బరిలో నిలిచినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. వీరు జేడీయూ సిద్ధాంతాలను ఉల్లంఘించడంతోపాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.భాగల్పూర్ జిల్లా గోపాల్పూర్ ఎమ్మెల్యే నరేంద్ర నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ ఇటీవల తనకు వరుసగా ఐదో విడత టికెట్ ఇవ్వలేదని సీఎం కార్యాలయం వద్ద నిరసనకు దిగి, వార్తల్లోకి ఎక్కారు. అంతకుమునుపు, జేడీయూకే చెందిన ఎంపీ అజయ్ మండల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో, పార్టీ టికెట్ మరొకరికి కేటాయించింది. ఈ నేపథ్యంలో గోపాల్ మండల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈయనతోపాటు ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ తరఫున గయా జిల్లా గురువా స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, కటిహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి హిమ్‌రాజ్ సింగ్ వేటు పడిన వారిలో ఉన్నారు. అధికార పార్టీ రెండు రోజుల వ్యవధిలో 16 మందిపై బహిష్కరణ వేటు వేసింది.ఇదిలా ఉండగా.. 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్ (Bihar News)లో ఎన్డీయే కూటమిలో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. వచ్చే నెల 6న, 11న రెండు విడతల్లో పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
భారత్–చైనా మధ్య అయిదేళ్ల తర్వాత నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభం
న్యూఢిల్లీ: అయిదేళ్ల అనంతరం భారత్, చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు అధికారికంగా మొదలయ్యాయి. ఈ విషయాన్ని భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఆదివారం ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. మొదటి విమానం కోల్‌కతా నుంచి గ్వాంగ్ఝౌకు టేకాఫ్ తీసుకుందన్నారు. నవంబర్ 11వ తేదీ నుంచి తాము కోల్‌కతా–గ్వాంగ్ఝౌ ఎయిర్ బస్ సర్వీసును ప్రతిరోజూ నడుపుతామని ఇండిగో ప్రకటించింది. అదేవిధంగా, నవంబర్ 9వ తేదీ నుంచి షాంఘై–న్యూఢిల్లీ మార్గంలో వారానికి మూడు సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. 2020 జూన్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య తూర్పులద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర ఘర్షణలు, కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యాల మోహరింపులతో 2024 అక్టోబర్ వరకు తీవ్ర ఉద్రికతలు కొనసాగాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. డైరెక్ట్ విమానాల రాకపోకలతో తిరిగి ఈ సంబంధాలు తిరిగి గాడినపడతాయని భావిస్తున్నారు. -
ఢిల్లీలో యువతిపై వేధింపులు.. యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ముకుంద్‌పూర్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుకుంటోంది. ఆదివారం అదనపు క్లాసులని కాలేజీ వైపు నడిచి వెళ్తున్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన జితేందర్ బైక్‌పై ఇషాన్, అర్మాన్ అనే మరో ఇద్దరితో కలిసి వచ్చి అడ్డగించాడు. ఇషాన్ ఇచ్చిన బాటిల్‌ను ఓపెన్ చేసిన అర్మాన్ అందులోని యాసిడ్‌ను యువతి ముఖంపై చల్లాడు. రక్షణగా అడ్డు పెట్టుకున్న రెండు చేతులపై యాసిడ్ పడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి బైక్‌పై పరార య్యారు. అనంతరం కుటుంబీలకు సాయంతో బాధితురాలు ఆస్పత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా బాధితురాలిని జితే ందర్ వేధింపులకు గురి చేస్తున్నాడు. నెల రోజు ల క్రితం ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. అప్పటి నుంచి వేధింపులు తీవ్రతర మయ్యాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యాసిడ్ చల్లినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
దాద్రా, నగర్ హవేలీ స్థానికంలో బీజేపీ రిగ్గింగ్
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని దాద్రా, నగర్ హవేలీ పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. స్థానిక అధికారులతో కలిసి కుమ్మక్కై 80 శాతం వరకు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించేలా బీజేపీ చేసిందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులకు పోటీకి ఎవరూ లేకుండా చేసిందని, ఇది ఓటు చోరీకి మించిన కుంభకోణమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు తప్ప వేరెవరి నామినేషన్ పేపర్లు కూడా ఆన్లైన్లో కనిపించడం లేదన్నారు. నామినేషన్ పత్రాల కోసం వెళితే సంబంధిత అధికారులు శిక్షణకు వెళ్లినట్లు కార్యాలయం సిబ్బంది తెలిపారని, ఎలాగోలా పత్రాలను పూర్తి చేసి చేతికందిస్తే పరిశీలనలో తిరస్కరించారని ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ఒక్కటీ తిరస్కరణకు గురి కాలేదన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, బాంబే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. డామన్, డయ్యూలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని ఠాక్రే ఆరోపించారు. దీనిపై స్థానిక ఎన్నికల అధికారులు, బీజేపీ స్పందించాల్సి ఉంది. -
అభివృద్ధిలో అంతర్భాగం ఆరోగ్య రంగం
ఘజియాబాద్: దేశ అభివృద్ధిలో ఆరోగ్య రంగం విడదీయరాని భాగమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్య సేవలు ఏ ఒక్క పౌరుడి కూడా దూరం కారాదని నొక్కి చెప్పారు. ఆదివారం ఆమె ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ప్రైవేట్ ఆస్పత్రి యశోద మెడిసిటీని ప్రారంభించారు. ‘ప్రభుత్వ ప్రాధామ్యాల్లో ప్రజలను వ్యాధుల బారిన పడకుండా రక్షణ కల్పించడం, ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడం కూడా ఉన్నాయి. అందుకే, దేశవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో మౌలిక వనరుల కల్పన, వైద్య సేవల విస్తరణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ప్రయత్నాల ఫలితంగానే ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన భారత్ కల సాకారమవుతుంది’అని ముర్ము తెలిపారు. అభివృద్ధి దిశగా దేశం వేగంగా ముందుకు సాగాలంటే ప్రతి పౌరుడూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. నాణ్యమైన వైద్య సేవలను మారుమూల ప్రాంతాల్లోనూ అందించేందుకు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడికీ మెరుగైన వైద్యసేవలను అందించాలన్న లక్ష్యం నెరవేరాలంటే ప్రైవేటు సంస్థలు సైతం తమ అమూల్యమైన సేవల అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని రాష్ట్రపతి తెలిపారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వైద్య నిపుణులంతా దేశానికీ కూడా సేవలందిస్తున్నట్లేనన్నారు. కేన్సర్ చికిత్సకు వాడే జీన్ థెరపీ వంటి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీ–బాంబే వంటి సంస్థలతో సంబంధాలను కలిగి ఉండాలని సూచించారు. ‘ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేశ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఎంతో సేవాభావంతో నిజాయతీగా పనిచేస్తున్న యశోద ఆస్పత్రి యాజమాన్యానికి ప్రశంసలు’అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. తల్లి పేరుతో యశోద మెడిసిటీ ఆస్పత్రిని నెలకొల్పిన చైర్మన్ డాక్టర్ అరోరాను రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇస్రో ఎల్వీఎం రాకెట్ సిద్ధం
బెంగళూరు: అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే ఇస్రో వారి ఎల్వీఎం–3 రాకెట్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లోని ప్రయోగవేదిక మీదకు సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని అమర్చిన ఎల్వీఎం–3 రాకెట్‌ను ఆదివారం తరలించారు. నవంబర్ రెండో తేదీన ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నామని ఇస్రో ఆదివారం వెల్లడించింది. భారత్‌సహా విశాలమైన సముద్రప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలు అందించే లక్ష్యంతో మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఎల్వీఎం3–ఎం5 రాకెట్ సాయంతో కక్షలో ప్రవేశపెట్టాలని నిర్ణయించడం తెల్సిందే. ఈ ఉపగ్రహం బరువు ఏకంగా 4,400 కేజీలు. భారత గడ్డ మీద నుంచి భూస్థిర కక్షలోకి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. గతంలో చంద్రయాన్–3 మిషన్ కార్యక్రమం కోసం ఎల్వీఎం–3 రాకెట్‌ను వినియోగించారు. ఈ రాకెట్‌ను ఇప్పటిదాకా నాలుగుసార్లు ఉపయోగించారు. పౌర, వ్యూహాత్మక, నావికా సేవలను సీఎంఎస్–03 ఉపగ్రహం అందివ్వనుంది. -
కేంద్రమంత్రి కుమారుడి బారసాలకు సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్, శ్రావ్య దంపతుల కుమారుడు శివాన్ బారసాల వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించారు. సీఎం వెంట కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.కాగా, డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్.. తన రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. కేంద్రమంత్రి నివాసంలో జరిగిన బారసాల వేడుకకు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరై శివాన్ను ఆశీర్వదించారు. -
ధీరుడు కొమురం భీమ్
సాక్షి, న్యూఢిల్లీ: నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల్లో కొత్త శక్తిసామర్థ్యాలను, స్ఫూర్తిని నింపిన ధీరుడు కొమురం భీమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ముఖ్యంగా గిరిజన సమాజంపై ఆయన చెరగని ముద్ర వేశారని కీర్తించారు. నెలవారీ మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతిని గుర్తుచేస్తూ ఆయన పోరాట స్ఫూర్తిపై మోదీ ప్రసంగించారు. ‘20వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలో కనుచూపుమేరలో స్వాతంత్య్రంపై నమ్మకం లేదు. బ్రిటిష్ పాలకులు భారత్‌ను దారుణంగా లూటీ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో దేశభక్తులు అత్యంత హేయమైన అణచివేతను ఎదుర్కొన్నారు. క్రూరమైన, కనికరం లేని నిజాం దురాగతాలను భరించారు. పేదలు, అణగారిన, గిరిజన వర్గాలపై జరిగిన దురాగతాలకు అంతే లేదు. వారి భూములను లాక్కున్నారు. భారీ పన్నులు విధించారు. ఇది అన్యాయని ఎదిరించిన వాళ్ల చేతులు నరికేశారు. అలాంటి క్లిష్ట సమయాల్లో దాదాపు ఇరవై ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఆ కాలంలో పెద్ద నేరం. అలాంటిది ఆ యువకుడు సిద్ధిఖీ అనే నిజాం అధికారిని సవాల్ చేశాడు. రైతుల పంటలను జప్తు చేయడానికి నిజాం సిద్ధిఖీని పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని అంతంచేశాడు. అతను అరెస్ట్‌ను సైతం తప్పించుకోగలిగాడు. ఆ గొప్ప వ్యక్తే కొమురం భీమ్. అక్టోబర్ 22న ఆయన జయంతి చేసుకున్నాం. భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 40 ఏళ్లు మాత్రమే జీవించారు. నిజాం పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. అంతటి యోధుడి ప్రాణాలను 1940లో నిజాం సైన్యం బలిగొంది. ఇంతటి గొప్ప వీరుని సాహసాలు, గొప్పతనం ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయతి్నంచాలని ప్రజల్ని కోరుతున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. ‘‘నా వినమ్ర నివాళులు. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’’ అని అన్నారు.వందేమాతరం వేడుకలు ‘‘మనందరి హృదయాలకు దగ్గరైన ఒక గీతం గురించి మొదట మాట్లాడుకుందాం. అదే మన జాతీయగీతం వందేమా తరం. ఈ ఒక్క పదమే ఎన్నో భావోద్వేగాలను, ఉరిమే ఉత్సాహాలను తట్టిలేపుతుంది. భరతమాతతో మన అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. వందేమాతర గీతా న్ని ఆలపించి 140 కోట్ల మంది ఐక్యశక్తిని చాటుదాం’’ అని మోదీ అన్నారు. కమ్మని కోరాపుట్ కాఫీ ‘‘చాయ్‌తో నా అనుబంధం మీకు తెల్సిందే. కానీ ఈసారి కాఫీ విషయాలు మాట్లాడుకుందాం. గత మన్ కీ బాత్‌లో ఏపీలోని అరకు కాఫీ గురించి చర్చించాం. ఇప్పుడు ఒడిశా ప్రజలు ఎంతో ఇష్టపడే కొరాపుట్ కాఫీ కబుర్లు చెప్పుకుందాం. కోరాపుట్ కాఫీ ఘుమఘుమలు అద్భుతం. అంతేకాదు అక్కడి కాఫీ గింజల సాగు సైతం స్థానికుల ఆదాయాన్ని పెంచుతోంది. కోరాపుట్ కాఫీ ఎంతో స్వాదిష్టమైంది. అది ఒడిశా గౌరవం. అసలు భారతీయ కాఫీ అంటేనే ప్రపంచం దేశాలు పడిచస్తాయి’’ అని మోదీ అన్నారు. -
సల్మాన్‌పై పాక్ ఉగ్ర ముద్ర
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబి యాలోని రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర్నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం–1997లోని నాలుగో షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలున్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు. ఈ చట్టం ప్రకారం సల్మాన్‌ను పాక్ ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదీన బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తాజాగా పాక్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆయన్ను స్వతంత్ర బలూచిస్తాన్ దోహదకారి (ఆజాద్ బలూస్తాన్ ఫెసిలిటేటర్)గా అందులో పేర్కొంది. దీని ప్రకారం ఆయనపై నిఘా, కదలికలపై నియంత్రణ. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. మధ్యప్రాచ్యం భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్ ఫోరం–2025 అక్టోబర్ 17న రియాద్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారూక్, ఆమిర్ ఖాన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడారు. ‘హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్ హిట్టవడం ఖాయం. తమిళం, తెలుగు, మలయాళ సినిమాలతో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్.. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా దేశాల వారు ఇక్కడ పని చేస్తున్నారు’అంటూ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. -
స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతం
ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశి్చత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. కౌలాలంపూర్/న్యూఢిల్లీ: ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్ నగరంలో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ అన్నారు. ఆసియాన్–ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్(ఏఐటీఐజీఏ)ను వీలైనంత త్వరగా సమీక్షించాలని మోదీ అభిలషించారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఏఐటీఐజీఏ ఒప్పందం 15 ఏళ్ల క్రితం అమల్లోకి వచి్చంది. ఇప్పుడు భారత్–ఆసియాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమైతే ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రాంతీయ సహకారం సైతం ఇనుమడిస్తుంది’’అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ఆసియాన్, భారత్‌ల ఆర్థిక ప్రగతికి బాటలువేసే కీలకమైన సుస్థిర పర్యాటకంపై ఇరువర్గాలు ఒక ప్రకటన విడుదలచేశాయి. ‘‘ఇండో–పసిఫిక్‌లో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) కూటమికి భారత్ గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం(2026–2030) అమలు కోసం ఆసియాన్–భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కు మద్దతు పలుకుతున్నాం. త్వరలో రెండో ఆసియాన్–భారత్ రక్షణ మంత్రుల సమావేశం, రెండో ఆసియాన్–భారత్ నౌకావిన్యాసాలు జరుపుదాం’’అని మోదీ అన్నారు. నాలుగో వంతు మనమే ‘‘విశ్వమానవాళిలో నాలుగో వంతు జనాభాకు భారత్, ఆసియాన్ దేశాలే ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. జనాభాను మాత్రమే కాదు మనం అత్యంత చరిత్రాత్మకమైన ఒప్పందాలు, విలువల బంధాలతో పెనవేసుకుపోయా. గ్లోబల్ సౌత్‌లో మనం కలిసి ముందడుగువేస్తున్నాం. కేవలం వాణిజ్య భాగస్వాములం కాదు సాంస్కృతిక సహచరులం. భారత్ అవలంభిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ అనేది పునాదిరాయి. ఆసియాన్ లక్ష్యాలకు, ఇండో–పసిఫిక్ విషయంలో ఆసియాన్ వైఖరికి భారత్ ఎల్లవేళలా పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతోంది. ఒడిదుడుకుల కాలంలోనూ భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది సుస్థిరాభివృద్ధిని కొనసాగించింది. ఈ బలమైన బంధమే యావత్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి, ప్రగతికి కొత్త అంకురార్పణ చేస్తోంది. భారత్, ఆసియాన్ రెండూ విద్య, పర్యాటకం, శాస్త్రసాంకేతిక, ఆరోగ్య, శుద్ధ ఇంధనం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మరింత బలమైన పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఇకమీదట సైతం సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకునేందుకు కలిసి పనిచేస్తాం. భారత, ఆసియాన్ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంచుతాం. ఇందుకోసం భుజం భుజం కలిపి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమం కోసం 400 నిపుణులకు పునరుత్పాదక ఇంధన రంగంలో శిక్షణనిప్పిస్తాం ’’అని మోదీ అన్నారు. సవాళ్లు ఎదురవుతున్నా.. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా డిజిటల్ సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత, సరకు రవాణా గొలుసు వంటి అంశాల్లో ఆసియాన్ దేశాలు సమష్టిగా పోరాడుతూ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తమైన ‘సమ్మిళిత సుస్థిరత’భావనను శిఖరాగ్రాలపై నిలిపాయి. ఆసియాన్ దేశాల ప్రాధాన్యతలను మద్దతు పలుకుతూనే ఆసియాన్ దేశాలను ఇలాగే సమష్టిగా కలిపి ఉంచేందుకు భారత్ కృషిచేస్తుంది. ఆపత్కాలంలో ఆసియాన్ దేశాలను ఆదుకునేందుకు భారత్ సదా ఆపన్నహస్తం అందించింది. మనవతా సాయం, విపత్తు సాయం, సముద్రయాన భద్రత, సాగరసంబంధ వాణిజ్యాభివృద్ధికి భారత్ అండగా నిలబడుతుంది. 2026 ఏడాదిని ‘ఆసియాన్–భారత్ సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటిస్తున్నాం’’అని మోదీ చెప్పారు. -
దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం
ఢిల్లీ: ఇప్పటికే బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ-SIR(Special Intensive Revision) ను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది.. దీనిలో రేపు(సోమవారం, అక్టోబర్ 27వ తేదీ) రాష్ట్రాల ‘SIR’ నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశాలు కనబుడుతున్నాయి. సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు సర్ నిర్వహించే తదీలను ఖరారు చేయనుంది. ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు సీఈసీ రేపు కీలక మీడియా సమావేశంలో ‘సర్’ నిర్వహణ రాష్ట్రాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మీడియా సమావేశానికి సీఈసీ ఆహ్వారం పంపిన దరిమిలా ‘సర్’పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు కనుక వాటికి జోలికి వెళ్లకుండా మిగతా రాష్ట్రాల్లో సర్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
లొంగిపోయిన మరో 21 మంది మావోలు
రాయ్‌పూర్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఆదివారం మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులు కేశ్కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, మావోయిస్టులు కుయెమారి/కిస్కోడో ఏరియా కమిటీ, కేశ్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేశ్ ఉన్నారు. ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల్లో నాలుగు మంది డివిజన్ స్థాయి కమాండర్లు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ,ఎనిమిది మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 21 మంది మావోయిస్టుల్లో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మూడు ఏకే-47 రైఫిళ్లు,నాలుగు ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరోనంబర్ 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ ఆయుధాన్ని సరెండర్ చేసినట్లు బస్తర్‌రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పీ సుందర్రాజ్ వెల్లడించారు. -
మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్ జగత్ సింగ్ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్ వేపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు. लखनऊ आगरा एक्सप्रेस वे पर दिल्ली से आ रही डबल डेकर बस के पिछले पहिए में रेवरी टोल प्लाजा से पहले आग लग गई । जिससे पूरी बस धू धू कर जल गई। हालांकि बस में सवार 39 सवारी सुरक्षित रही। pic.twitter.com/jTkFQvdztM— Ajay Srivastav (@ajaysridj) October 26, 2025 A major accident was averted on the Lucknow-Agra Expressway early Sunday morning. A double-decker bus from #Delhi to Gonda caught fire after a tyre burst, but all passengers were safely evacuated before the flames engulfed the vehicle.(Video/Picture Courtesy : X) pic.twitter.com/wPERgIbV84— Deccan Chronicle (@DeccanChronicle) October 26, 2025 -
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు.. నిందితుడు మామూలోడు కాదు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన నిందితుడు అఖిల్ అలియాస్ నైట్రా నేర చరిత్రకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇండోర్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ రౌడీగా పోలీసులు గుర్తించారు. ప్రపంచ కప్ మ్యాచ్ కోసం ఇండోర్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్‌కు సమీపంలో ఉన్న ఒక కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో అఖిల్ తన బైక్‌పై క్రికెటర్ల వద్దకు వచ్చి, వారిలో ఒకరిని లాగడానికి ప్రయత్నించి, ఆ తర్వాత వేగంగా వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మరో క్రికెటర్‌ను అసభ్యంగా తాకి పారిపోయాడు. భయపడిన క్రీడాకారులు వెంటనే తమ భద్రతాధికారికి తెలిపారు. ఆస్ట్రేలియా జట్టు సెక్యూరిటీ ఇన్‌ఛార్జి డ్యానీ సిమన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అఖిల్‌పై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతడి నేర చరిత్రలో దోపిడీ, దారి దోపిడీ, దొంగతనం, హత్యాయత్నం, బెదిరింపులు, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ మద్యం వ్యాపారం వంటి కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాజేష్ దండోతియా మాట్లాడుతూ, అఖిల్‌కు నేర చరిత్ర ఉందని.. అతను చాలాసార్లు జైలుకెళ్లి.. బెయిల్, పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడల్లా కొత్త నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. సుమారు ఏడాది క్రితం, అఖిల్ కత్తితో ఒక యువ జంటపై దాడి చేసి, ఆ మహిళను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. మరో కేసులో, అతను ఉజ్జయినిలో పోలీసుల వద్ద నుంచి రైఫిల్స్‌ను లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడని.. జైలు శిక్ష పూర్తయ్యాక అతను ఇటీవలనే ఇండోర్‌కు తిరిగి వచ్చాడని తెలిపారు.ఈ ఘటనపై బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించిన సంగతిత తెలిసిందే. "ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరిపట్ల కూడా ఇలా ప్రవర్తించకూడదు. ఆసీస్ క్రికెటర్లకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నామని పేర్కొంది -
‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు
సతారా: మహారాష్ట్రలోని సతారాలో వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన దరిమిలా న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి వెలువడిన కొన్ని నివేదికలను గుర్తుచేస్తూ, రాహుల్ గాంధీ ‘బీజేపీతో సంబంధం కలిగిన కొందరు ప్రముఖులు.. బాధిత వైద్యురాలిని అవినీతి ఊబిలోనికి నెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన నాగరిక సమాజపు మనస్సాక్షిని కదిలించే విషాదమని ఆయన అన్నారు. తన వైద్యంతో ఇతరుల రోగాలను తగ్గించాలని ఆశపడిన వైద్యురాలు.. అవినీతి వ్యవస్థలో కూరుకుపోయిన నేరస్థుల వేధింపులకు గురయ్యిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తుల నుండి ప్రజలను రక్షించే బాధ్యత కలిగిన అధికారులే.. అమాయక మహిళపై అత్యంత దారుణానికి పాల్పడ్డారని రాహుల్ పేర్కొన్నారు. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी भी सभ्य समाज की अंतरात्मा को झकझोर देने वाली त्रासदी है।एक होनहार डॉक्टर बेटी, जो दूसरों का दर्द मिटाने की आकांक्षा रखती थी, भ्रष्ट सत्ता और तंत्र में बैठे अपराधियों की प्रताड़ना का शिकार…— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2025ఇది ఆత్మహత్య కాదు.. ఒక సంస్థాగత హత్య అంటూ రాహుల్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. అధికారం నేరస్థులకు కవచంగా మారినప్పుడు, ఎవరి నుండి న్యాయం ఆశించగలం? డాక్టర్ మరణం.. బీజేపీ ప్రభుత్వ అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నది. న్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. భారతదేశంలోని ప్రతి ఆడబిడ్డ భయపడనవసరం లేదు. వారికి అండగా ఉంటూ, వారి తరపున మేము న్యాయం పోరాటం చేస్తాం అని రాహుల్ పేర్కొన్నారు.గురువారం రాత్రి సతారాలోని ఒక హోటల్ గదిలో ఒక మహిళా డాక్టర్ ఉరి వేసుకున్నారు. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఫల్తాన్ సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ వేధింపులకు గురి చేశాడని ఆమె సూసైడ్ లేఖలో రాశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది -
ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది
ఔరంగాబాద్: భారతీయ రైల్వే మరో రైల్వే స్టేషన్ పేరును మార్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ నగరం పేరును మార్చిన మూడేళ్ల తరువాత సెంట్రల్ రైల్వే.. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ‘ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్’గా మార్చింది. ఈ కొత్త స్టేషన్‌కు కోడ్ ‘సీపీఎస్ఎన్’ అని సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.ఈ ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ కిందకు వస్తుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఇటీవల ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని నాటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరం పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు నివాళిగా నగరం పేరును మార్చారు.రైల్వే అధికారులు ప్రభుత్వ తాజా ఉత్తర్వులను అనుసరించి, స్టేషన్ పేరును మార్చడంతో పాటు ఆన్లైన్లో కూడా ఈ పేరు మార్పు ప్రక్రియను పూర్తిచేశారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను 1900లో హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో నిర్మించారు. ఛత్రపతి శంభాజీనగర్ పర్యాటక కేంద్రంగా పేరొందుతోంది. ఈ ప్రాంతంలోనే అజంతా గుహలు, ఎల్లోరా గుహలతో పాటు పలు చారిత్రక కట్టడాలున్నాయి.ఇది కూడా చదవండి: Mann Ki Baat: స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రధాని మోదీ -
గీజర్ మృత్యువాయువు
మైసూరు: వేడినీళ్ల కోసం అమర్చుకున్న గ్యాస్ గీజర్ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గీజర్ నుంచి గ్యాస్ లీకై అక్కాచెల్లెళిద్దరూ ఊపిరాడక మరణించిన దారుణ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో జరిగింది. మృతులను పిరియాపట్టణలోని బెట్టదపుర నివాసులైన అల్తాఫ్ పాషా రెండో కుమార్తె గుల్బమ్ తాజ్ (23), నాలుగో కుమార్తె సిమ్రాన్ (21)గా గుర్తించారు. వివరాలు.. పిరియాపట్టణలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం కొత్తగా బాడుగ ఇంటిలోకి చేరి ప్రార్థనలు చేసి పిండివంటలు చేసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికి.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లిద్దరూ స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో స్నానాల గదిలోని గ్యాస్ గీజర్‌ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ లీకైంది. కొంతసేపటికి ఊపిరాడక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపులు తెరిచి చూడగా కుప్పకూలిపోయి ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల నిశ్చితార్థం కాగా అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు సంతానం ఉండగా, వారిలో ఇద్దరికి వివాహాలయ్యాయి. గుల్బమ్ తాజ్‌కు ఇటీవల నిశి్చతార్థమైంది. ఘటన సమయంలో కాబోయే భర్త కుటుంబం వారి ఇంటిలోనే ఉంది. ఈ ఘోరంతో కుటుంబీకులు తీవ్రంగా విలపించారు. -
Mann Ki Baat: స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మరోమారు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈరోజు ‘మన్ కీ బాత్’ 127వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో తొలుత ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అవకాశం దొరికినవారంతా ఛత్ పండుగలో పాల్గొనాలని కోరారు. ఈ పండుగ భారతదేశంలోని ఐక్యతకు చిహ్నమన్నారు. పండుగ సమయంలో దేశ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఛత్ ఉత్సవం సంస్కృతి, ప్రకృతి, సమాజం మధ్య ఉన్న లోతైన ఐక్యతను తెలియజేస్తుందని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకం చేస్తుందని, ఇది భారతదేశ సామాజిక ఐక్యతకు అందమైన ఉదాహరణ అని ప్రధాని అభివర్ణించారు. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు సాధించిన విజయానికి ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు. భారతదేశం సాధించిన విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని నింపిందన్నారు. ఇదేవిధంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని కూడా ఆయన ప్రశంసించారు.దేశ ప్రజలంతా మొక్కలు నాటాలని కోరుతూ చెట్లు, మొక్కలు ఏ ప్రదేశంలో ఉన్నా, అవి ప్రతి జీవి శ్రేయస్సుకు ఉపయోగపడతాయన్నారు. మన గ్రంథాలలో ఇదే విషయాన్ని వివరించారన్నారు. అక్టోబర్ 31న జరగనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని ప్రముఖులలో ఒకరని మోదీ పేర్కొన్నారు. సర్దార్ పటేల్ పరిశుభ్రత, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారని, భారతదేశాన్ని ఏకం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ప్రధాని అన్నారు.అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రధాని కోరారు. బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ 2025, నవంబర్ 7న భారతదేశం ‘వందేమాతరం’ 150వ వేడుకల్లోకి అడుగుపెడుతుందని అన్నారు. ఈ పాటను రచించిన బంకిం చంద్ర ఛటర్జీని ఆయన ప్రశంసించారు.ఇది కూడా చదవండి: Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్ -
Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్
పట్నా: నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. తాజాగా పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్‌ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మా ప్రచారం ప్రారంభమైంది. బీహార్ మార్పు కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా, అన్ని కులాలు, మతాల ప్రజలు మాకు మద్దతు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. బీహార్ ప్రజల నుండి మేము 20 నెలలు కోరుకుంటున్నాం. ఈ కాలంలో బీహార్‌ను నంబర్ వన్‌గా మార్చడానికి మేము కృషి చేస్తాం’ అని అన్నారు.ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ పలు ప్రధాన ప్రకటనలు కూడా చేశారు. మూడు అంచెలుగా పంచాయతీ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లు అందించాలని కూడా నిర్ణయించామన్నారు. వారికి రూ. 50 లక్షల బీమా అందజేయనున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల గౌరవ వేతనాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తామని, క్వింటాలుకు మార్జిన్ మనీ పెంచుతామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్నవారికి కారుణ్య ఉపాధికి వర్తించే వయోపరిమితి కూడా పెంచుతామన్నారు. కుమ్మరి, కమ్మరి వడ్రంగి తదితర స్వయం ఉపాధి పనుల కోసం ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని విధంగా రూ. 5 లక్షల రుణం అందిస్తామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి.. -
అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..
ఫరీదాబాద్: హర్యానాలోని గ్రేటర్ ఫరీదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తమతో పాటు ఉండకూడదని భార్య, అత్తామామలు, బావమరుదులు వేధిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన కుమార్ గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రేడియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితం నేహా రావత్‌తో వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ దంపతులు గతంలో నోయిడాలో ఉండేవారు. అక్కడ నేహా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేది.. మృతుడి మామ ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో వారు కుమార్తెను చూసుకోలేకపోయారు. ఈ నేపధ్యంలో యోగేష్ తన తల్లిని తమతో పాటు ఉండేలా చూసుకోవాలని అనుకున్నాడు. అయితే నేహా ఇందుకు అంగీకరించలేదు.ఆరు నెలల క్రితం యోగేష్ తన కుమార్తెతో సహా గ్రేటర్ ఫరీదాబాద్‌లోని సెక్టార్ 87లోని పెర్ల్ సొసైటీకి మారాడు. అయితే నేహా.. నోయిడా నుండి యోగేష్‌తో పాటు ఇక్కడికి రాలేదు. దీంతో యోగేష్ తమ కుమార్తెను చూసుకునేందుకు తన తల్లిని తీసుకువచ్చాడు. ఇంతలో నేహా తన యోగేష్‌తో పాటు ఉండేందుకు పెర్ల్ సొసైటీ అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. తరువాత యోగేష్ తల్లి తమతో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నేహా తల్లిదండ్రులు, సోదరులు ఆశిష్ రావత్, అమిత్ రావత్ కూడా ఈ విషయమై యోగేష్‌తో గొడవ పడ్డారు. దీంతో యోగేష్ తీవ్రంగా కలత చెందాడు.గురువారం, యోగేష్ తన భార్య నేహాను గ్వాలియర్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ, నేహాను నోయిడాలో దింపి, ఒంటరిగా తమ అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చాడు. శుక్రవారం రాత్రి పెర్ల్ సొసైటీలోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతని మామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని భార్య నేహా రావత్, అత్త శాంతి రావత్, మామ వీర్ సింగ్ రావత్, నేహా సోదరులు ఆశిష్, అమిత్ రావత్ లపై కేసు నమోదు చేశామని భూపాని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంగ్రామ్ దహియా మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు -
మాజీ ఎమ్మెల్యేను కుమ్మేసిన ఎద్దు.. పోటీల్లో అపశృతి
బెంగళూరు: కర్ణాటకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల పందెం పోటీల ఉత్సవం సందర్భంగా ఓ ఎద్దు.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తి పాడేసింది. దీంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కర్ణాటకలోని శివమొగ్గలోని బల్లిగావిలో హోరీ హబ్బా అనే సాంప్రదాయ ఎద్దుల పందేల ఉత్సవం జరిగింది. ఈ సందర్బంగా శికారిపుర పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహాలింగప్ప, స్థానికులు ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక ఎద్దు అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. ఇంతలో ఒక ఇంటి ముందే నిలుచున్న మాజీ ఎమ్మెల్యే మహాలింగప్పపైకి ఎద్దు దూసుకెళ్లింది. తన కొమ్ములతో అతడిని ఎత్తి పడేసింది. దీంతో, మహాలింగప్ప తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు. అనంతరం, స్థానికుల.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహాలింగప్ప చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కర్ణాటకలో హోరీ అనేది ఒక సాంప్రదాయ గ్రామీణ క్రీడ. ఈ సందర్బంగా అలంకరించబడిన ఎద్దులను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులపైకి పరుగెత్తిస్తారు. ఇందులో పాల్గొనే కొంతమంది వాటిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రోజుల క్రితం హోరీ పోటీల సమయంలో హవేరి జిల్లాలో నలుగురు మరణించారు. హవేరి, తిలవల్లి తాలూకాలతో సహా వివిధ ప్రాంతాలలో ప్రాణనష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.Video: Karnataka Ex-MLA Gored During Bull Race Festival https://t.co/4HGPlNhBap pic.twitter.com/NAFHOLB2Lb— NDTV (@ndtv) October 25, 2025 -
బ్లడ్‌బ్యాంక్ నిర్వాకం.. ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్
రాంచీ: జార్ఖండ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటన కారణంగా ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్యశాఖపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని చాయ్‌బాసాలో స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియాతో బాధపడుతున్న తమ ఏడేళ్ల కుమారుడికి హెచ్ఐవీ సోకిందని శుక్రవారం ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని విచారణకు పంపింది. శనివారం జరిగిన విచారణలో అదే ఆసుపత్రిలో తరచుగా రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియాతో బాధపడుతున్న మరో నలుగురు పిల్లలకు కూడా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదుగురికి పెరిగింది.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘తలసీమియా రోగికి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలు ఉన్నట్లు విచారణ సందర్భంగా గుర్తించాం. లోపాలు సరిచేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాం’’ అని అన్నారు. ఈ అవకతవకలను వివరించే నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమర్పించారు.అనంతరం, జిల్లా సివిల్ సర్జన్ డా. సుశాంత్ కుమార్ మాఝీ ఈ అంశంపై మాట్లాడారు. ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ రక్త మార్పిడి ద్వారా మాత్రమే వచ్చిందని నిర్ధారించడం తొందరపాటు అవుతుందని, ఎందుకంటే కలుషితమైన సూదులు వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్ఐవీ సంక్రమించవచ్చని ఆయన తెలిపారు.హైకోర్టు ఆగ్రహం..ఈ ఘటనను జార్ఖండ్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్ నుంచి ఈ విషయంపై నివేదిక కోరింది. ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం, వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో 515 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు, 56 తలసేమియా రోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రక్త దాతలందరిని గుర్తించి వారి రక్త నమూనాలను మళ్లీ పరీక్షించాలని ఆదేశించింది.వ్యక్తిగత కక్ష కారణమా?అయితే, ఈ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూసింది. మంజహరి జిల్లా పరిషత్ సభ్యుడు మాధవ్ చంద్ర కుంకల్ ఈ ఘటన వెనుక వ్యక్తిగత విద్వేషం కారణంగా ఉన్నట్లు ఆరోపించారు. రక్త బ్యాంక్ సిబ్బందికి, బాధితుల్లో ఓ బాలుడి బంధువులో ఒకరికి మధ్య ఏడాదికాలంగా కోర్టులో కేసు నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. -
‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం
పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫల్తాన్ పోలీసుల బృందం పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్‌ను అరెస్టు చేసింది. వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు ఆరోపితులలో ప్రశాంత్ బంకర్ ఒకరు.సతారా ఎస్పీ తుషార్ దోషి తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ బదానే ఫల్తాన్ గ్రామీణ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మరోవైపు బాధితురాలిని మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బంకర్‌ను సతారా జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ పరిధిలోని బీడ్ జిల్లాకు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫల్తాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ బదానే తనపై పలుమార్టు అత్యాచారం చేశాడని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన బంకర్ తనను మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ నేపధ్యంలో వీరిద్దరిపై కేసు నమోదైంది.పోలీసుల కథనం ప్రకారం ప్రశాంత్ బంకర్.. ఆ వైద్యురాలు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు. కేసు దర్యాప్తులో సబ్-ఇన్స్పెక్టర్ బదానే పేరు బయటకు రాగానే ఉన్నతాధికారులు ఆయనను సర్వీసు నుండి సస్పెండ్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ వేధింపులపై పలుమార్టు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆమె బంధువు మీడియా ముందు ఆరోపించారు. మహిళా వైద్యురాలిని వేధించిన ఎంపీని ఈ కేసులో నిందితునిగా చేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ధాస్ డిమాండ్ చేశారు. కాగా మృతురాలు తన ఎంబీబీఎస్ చదువు కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆమె మామ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Singapore: విజిటర్‌ను వేధించిన భారత నర్సుకు జైలు -
యాసిడ్ దాడి జరిగిన 28 ఏళ్లకు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
షాజహాన్‌పూర్: పెళ్లిని రద్దు చేసుకున్నారనే కోపంతో ఓ యువకుడు, వధువు కావాల్సిన 15 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘోరం 1997 అక్టోబర్ 28వ తేదీన యూపీ రాజధాని లక్నోలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక ముఖమంతా కాలిపోయింది. చూపుమందగించింది. నేరానికి గాను పప్పు అనే నిందితుడికి జైలు శిక్ష పడింది. అయితే, బాధితురాలిది తీరని వ్యథ అయ్యింది. అప్పట్నుంచి ఆమె ముఖానికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి. టైలర్‌గా పనిచేసే తండ్రి సంపాదించిందంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు. అనంతర కాలంలో తల్లి,తండ్రి చనిపోయారు. తోబుట్టువులు వదిలేశారు. ఒంటరిగా బతుకు లాగుతోంది. ఆమె తరఫున బ్రేవ్ సౌల్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో పోరాడుతోంది. యాసిడ్ దాడి బాధితురాలికి అవసరమైన సాయం అందజేయాలని అధికారులు, నేతల చుట్టూ ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్ మాలిక్ తిరుగుతూనే ఉన్నారు. బాధితురాలికిప్పుడు 43 ఏళ్లు. ఎట్టకేలకు, 28 ఏళ్లకు ఇటీవలే యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసింది. కేంద్రం నుంచి గతేడాది రూ.లక్ష బాధితురాలికి అందాయి. అయితే, తాము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామని, బాధితురాలికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని కోరుతామని షహీన్ తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘నా ముఖంతోపాటు జీవితం కూడా ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి. నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. సోదరులు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడిక కేవలం గౌరవంగా బతకాలని కోరుకుంటున్నా’అని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు. -
‘కీలక ఖనిజాల’పై పరిశోధనలకు మరింత ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్ అవసరాలకు అత్యంత ముఖ్యమైన ‘కీలక ఖనిజాల’రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసేందుకు కేంద్ర గనుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(సీఓఈ) హోదాను కల్పించింది. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ–మెట్), బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) చేరాయి. దీంతో ఈ హోదా పొందిన మొత్తం సంస్థల సంఖ్య 9కి పెరిగింది. ఇటీవల కేంద్ర గనుల శాఖ కార్యదర్శి పియూష్ గోయల్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. గుర్తింపు పొందిన ఈ సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయి. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక కన్సార్టియంగా పనిచేస్తుంది. ఇందులో కనీసం ఇద్దరు పరిశ్రమ భాగస్వాములను, ఇద్దరు ఆర్అండ్డీ/విద్యాసంస్థల భాగస్వాములు ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల్లో జరిగే పరిశోధనల్లో కనీసం 90 పరిశ్రమలు, విద్యా/పరిశోధన సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని గనుల శాఖ తెలిపింది. -
మత్తులో కారు నడిపి ఐదుగురిని చంపేశాడు!
ఆగ్రా: సెలవులకని సొంతూరుకు వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఐదుగురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన అన్షు గుప్తా(40) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సెలవుల్లో గడిపేందుకని సొంతూరుకు బయలు దేరిన అతడు మత్తులో కారు ఉన్నాడు. న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా బుద్ధి సమీపంలో వేగంగా నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నిల్చుకున్న ఏడుగురిపైకి దూసుకెళ్లింది. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే క్షతగాత్రుల్లో ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. బాధితులంతా 20–33 ఏళ్ల వారే కావడం గమనార్హం. పోలీసులు గుప్తాను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
కాపాడకపోతే చావే గతి
న్యూఢిల్లీ: గల్ఫ్ కష్టాలకు అడ్డకట్ట పడడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడి యజమానుల చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయా గ్రాజ్ (అలహాబాద్)కు చెందిన ఓ వ్యక్తి తన కన్నీటి గాథను వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయానని, తనను ఈ చెర నుంచి విడిపించి, ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు. తన పాస్‌పోర్టు లాక్కున్నారని చెప్పాడు. తనను కాపాడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాడు. వీడియోలో అతడి వెనుక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు విన్నవించారు. వీడియోలో బాధితుడు భోజ్‌పురి భాషలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే... ‘‘మా ఊరు అలహాబాద్ జిల్లాలోని హండియా. పని కోసం సౌదీ అరేబియాకు వచ్చా. నా పాస్‌పోర్టును యజమాని లాక్కున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తానని చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా తల్లిని చూడాలని ఉంది. ఈ వీడియోను మీరంతా షేర్ చేయండి. నా ఆవేదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరాలన్నదే నా కోరిక. మీరంతా నాకు సహకరించండి. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే నాకు అండగా ఉండండి. దయచేసి నన్ను ఆదుకోండి. నాకు జీవితం ప్రసాదించండి. లేకపోతే మరణమే గతి’’ అని అభ్యర్థించాడు. ఈ వ్యవహారంపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్టుమెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వీక్షణలు (వ్యూస్), తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అనుమానం వ్యక్తం చేసింది.కఫాలా వ్యవస్థ రద్దయినా..సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా భారతీయుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. విదేశీ కార్మికులు పాస్‌పోర్టు లాక్కోవడం, నిర్బంధించడం, వేధించడం నేరమే అవుతుంది. వలస కార్మికుల హక్కుల విషయంలో ఇదొక కీలకమైన సంస్కరణగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. -
అలాగే ప్రమాదం జరిగి.. అనూహ్యంగా తప్పించుకుని..
రాంచీ: రెండూ బస్సు అగ్ని ప్రమాదాలే. రెండు బస్సులను రహదారులపై అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఒక ఘటనలో బస్సు బుగ్గిపాలై 19 మందిని బలితీసుకుంటే మరో ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా ప్రమాదఘటన సుఖాంతంగా ముగిసింది. ఒకటి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంకాగా మరోటి జార్ఖండ్లోది. డ్రైవర్ అప్రమత్తత, రెప్పపాటులో ప్రతిస్పందనలతో ఎలాంటి పెను ప్రమాదం నుంచైనా అవలీలగా తప్పించుకోవచ్చని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాదం ఘటన నిరూపించింది. రెండు బస్సుల్లోనూ దాదాపు ఒకే సంఖ్యలో ప్రయాణికులు ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే? జార్ఖండ్‌లోని రాంచీలో శనివారం సాయంత్రం అత్యంత వేగంగా రహదారిపై పరుగుల తీస్తున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది రాంచీ–లోహార్దగా జాతీయరహదారిపై మందార్ బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్ రెప్పపాటుకాలంలో బస్సును ఆపేశాడు. ప్రయాణికులు అందర్నీ అప్రమత్తంచేసి అందర్నీ కిందకు దింపేశారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని ఆర్పేశారు. వీళ్లకు స్థానిక దుకాణదారులు సైతం సాయపడి తమ వంతుగా నీళ్లు, ఇసుక చల్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన వివరాలను మందార్ పోలీస్‌స్టేషన్ ఆఫీసర్–ఇన్చార్జ్ మనోజ్ కర్మాలీ వెల్లడించారు. ‘‘బస్సులో అక్రమంగా రసాయన పదార్థాలను తరలిస్తున్నారు. దాంతో అవి హఠాత్తుగా మండి బ్యాటరీబాక్స్ సమీపంలో షాట్ సర్క్యూట్‌కు కారణమయ్యాయి. దీంతో అగ్గిరాజుకొని బస్సును చుట్టుముట్టాయి. ఘటన తర్వాత బస్సును పోలీస్‌స్టేషన్ ప్రాంగణానికి తీసుకొచ్చాం. ప్రయాణికులందర్నీ తమతమ గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశాం. బస్సులో అగ్నిమాపక ఉపకరణాలు లేవు. దీనిపై విచారణకు హాజరురావాలని బస్సు యజమానికి సమన్లు జారీచేశాం’’అని మనోజ్ కర్మాలీ చెప్పారు. అప్రమత్తత ఎలాంటి పెనువిషాదం నుంచైనా కాపాడుతుందని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాద ఘటన రుజువుచేసిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. -
దివంగత నర్లీకర్కు విజ్ఞాన రత్న అవార్డ్
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పేరుప్రఖ్యాతలు పొందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, దివంగత జయంత్ నర్లీకర్ను కేంద్ర ప్రభుత్వం శనివారం ‘విజ్ఞానరత్న పురస్కార్’తో గౌరవించింది. అంతర్జాతీయంగా ప్రాచుర్యంపొందిన విశ్వ ఆవిర్భావ ‘బిగ్‌బ్యాంగ్’ సిద్ధాంతంతో విబేధించి గతంలోనే ఈయన వార్తల్లోకెక్కారు. బ్రిటిష్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్ హోలేతో కలిసి ఈయన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశ్వం అనేది మొదట్నుంచీ ఉందని అది ఎప్పటికప్పుడ కొత్త పదార్థాన్ని సృష్టించుకుంటూ విస్తరిస్తోందని నర్లీకర్ ప్రతిపాదించారు. 86 ఏళ్ల వయసులో మే 20వ తేదీన కన్నుమూయడం తెల్సిందే. సేవారంగంలో చేసిన విశేష కృషికి పద్మ అవార్డ్లు ఇచ్చినట్లే శాస్త్రసాంకేతిక రంగంలో దేశంలో అత్యున్నత అవార్డ్‌గా గత ఏడాది నుంచి విజ్ఞానరత్న పురస్కార్‌ను ప్రకటిస్తుంటడం తెల్సిందే. awards.gov.in వెబ్సైట్లో పలు అవార్డ్‌ల విజేత వివరాలను కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఎనిమిది మందికి ‘విజ్ఞాన్ శ్రీ’, 14 మంది విజ్ఞాన్ యువ, ఒకరికి విజ్ఞాన్ టీమ్ అవార్డ్‌ను కేంద్రం ప్రకటించింది. -
బాలీవుడ్ నటుడు సతీశ్ షా కన్నుమూత
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. చాలారోజులుగా మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. ముంబై బాంద్రా ఈస్ట్‌లోని స్వగృహంలో ఉండగా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో హిందూజా ఆసుపత్రికి తరలించామని సతీశ్ షా మిత్రుడు అశోక్ పండిట్ చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం సతీశ్ షా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. సతీశ్ షాను బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని హిందూజా హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఆయనను మూడు నెలల క్రితం మూత్ర పిండాల మారి్పడి శస్త్రచికిత్స జరిగినట్లు మిత్రుడొకరు చెప్పారు. ఆదివారం సతీశ్ షా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాజోల్, ఫరా ఖాన్, కరణ్ జోహార్, ఆర్.మాధవన్ తదితరులు సతీశ్ షాతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హాస్యనటుడిగా విశేషమైన గుర్తింపు సతీశ్ షా 1951 జూన్ 25న జని్మంచారు. డిజైనర్ మధు షాను వివాహం చేసుకున్నారు. నటనపై ఆసక్తితో ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1978లో అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, 1979లో గామన్, 1981లో ఉమ్రావ్ జాన్ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు. 1983లో విడుదలైన జానే భీ దో యారో చిత్రంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. అవినీతిపరుడైన మున్సిపల్ కమిషనర్‌గా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. టీవీ సీరియళ్లలోనూ సత్తా చాటారు. 1984లో ప్రసారమైన యే జో హై జిందగీలో 55 ఎపిసోడ్లలో 55 భిన్నమైన పాత్రలు పోషించారు. 2000 సంవత్సరంలో ప్రసారమైన సారాభాయ్ వర్సెస్ సారాభాయి సీరియల్ సతీశ్ షాకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచి్చపెట్టింది. ఇదే సీరియల్ 2017లో పునఃప్రసారమైంది. పలు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో సతీశ్ షా నటించారు. కబీ హా కబీ న, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, మై హూ నా, కల్ హో న హో, ఓం శాంతి ఓం, ఫనా, అఖేలే హమ్ అఖేలే తుమ్, హమ్ ఆప్కే హై కౌన్, ముజ్సే షాదీ కరోగీ, సాతియా, కహో నా ప్యార్ హై, జుడ్వా వంటి చిత్రాల్లో హాస్యరసం పండించి ప్రేక్షకులను అలరించారు. -
తొలి దశలో 10–15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రి య చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తొలుత ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్లో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి దశలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉంది. తొలి దశ ఎస్ఐఆర్కు సంబంధించిన షెడ్యూల్‌ను వచ్చే వారమే ప్రకటించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బ ంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు. ఎస్ఐఆర్ విధుల్లో వారు పాల్గొనే పరిస్థితి ఉండదు కాబట్టి తదుపరి దశలోనే ఈ ప్రక్రియ చేపడతారు. బిహార్‌లో ఇటీవల ఎస్ఐఆర్ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. సమగ్ర సవరణ తర్వాత 7.42 కోట్ల మంది ఓటర్లతో తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. అనర్హులైన 3.66 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. ఓటర్లు మరణించడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ ఎంట్రీ తదితర కారణాలతో ఈ పేర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, పశి్చమ బెంగాల్లో నవంబర్ 1 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. -
చొరబాటుదారులను వెళ్లగొట్టుడే..
నలంద: బిహార్‌లో జంగిల్‌రాజ్ మళ్లీ రావాలా? లేక రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణం కొనసాగించాలా? అనేది ఈ ఎన్నికలే తేల్చబోతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. చొరబాటుదారుల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులందరినీ గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించి, వారిని సొంత దేశాలకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. చొరబాటుదారులను బిహార్‌లో ఉండిపోనివ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని ఆక్షేపించారు. చొరబాటుదారులను కాపాడేందుకు ఆయన ఎన్ని ర్యాలీలు నిర్వహించినా ఫలితం ఉండదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను బయటకు వెళ్లగొట్టక తప్పదని పునరుద్ఘాటించారు. అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర పేరిట చొరబాటుదారులను కాపాడే యాత్ర నిర్వహించారని ధ్వజమెత్తారు. అమిత్ షా శనివారం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఒకవేళ లాలూ–రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్‌రాజ్ తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధిలో బిహార్ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అందుకోసమే లాలూ, సోనియా ఆరాటం బిహార్‌లో నలంద యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రతిష్టించారని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు వంద మంది భక్తియార్ ఖిల్జీలు వచి్చనా ఈ యూనివర్సిటీని ధ్వంసం చేయలేరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కారణంగానే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం రెండు దశల్లో జరుగుతున్నాయని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేస్తే వచ్చేసారి ఎన్నికలు ఒకదశలోనే జరుగుతాయని తేలి్చచెప్పారు. విపక్ష మహాగఠ్‌బంధన్ అవినీతి, ఆశ్రితపక్షపాతానికి మారుపేరు అని దుయ్యబట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సొంత కుటుంబం తప్ప ప్రజల బాగు పట్టదన్నారు. బిహార్‌ను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంకలి్పంచారని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్, కుమారుడిని ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా గాంధీ ఆరాటపడుతున్నారని విమర్శించారు. బిహార్ ప్రజల సంక్షేమం గురించి నిజాయితీగా కృషి చేస్తున్న నాయకులు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ మాత్రమేనని స్పష్టంచేశారు. మోదీ, నితీశ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ లెక్కలేనన్ని కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, జంగిల్రాజ్తో జనం కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. నితీశ్ కుమార్ రాకతో జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి లభించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ అహరి్నశలూ శ్రమిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి అడ్డాలోకి వెళ్లి మరీ ఖతం చేశామని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
పాక్ గుండెల్లో ‘త్రిశూల్’
న్యూఢిల్లీ: భారత సైన్యం ‘త్రిశూల్’ విన్యాసాలకు సిద్ధమవుతోంది. భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈ నెల 30 నుంచి నవంబర్ 10 దాకా త్రివిధ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం కలిసికట్టుగా నిర్వహించే ఈ విన్యాసాల ద్వారా త్రివిధ దళాల ఉమ్మడి కార్యాచరణ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతోపాటు భారతదేశ ఆత్మనిర్భరతను చాటిచెప్పబోతున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఇవి అతిపెద్ద సైనిక విన్యాసాలుగా రికార్డుకెక్కబోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే అతిపెద్ద సైనిక కసరత్తు అని చెప్పొచ్చు. భారత సైన్యం తలపెట్టిన ‘త్రిశూల్’ పట్ల పొరుగుదేశం పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్(నోటీసు టు ఎయిర్‌మెన్) జారీ చేసింది. మధ్య, దక్షిణాది గగనతలంలోని పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాల్లో ఈ ఆంక్షలు విధించింది. ఆయా మార్గాల్లో విమానాల రాకపోకలపై నియంత్రణ విధిస్తారు. అయితే, ఇందుకు కారణాలు ఏమిటన్నది బహిర్గతం చేయలేదు. త్రిశూల్ విన్యాసాల నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సైనిక విన్యాసాల పట్ల పాక్ బెంబేలెత్తిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. త్రిశూల్‌కు అడ్డంకులు సృష్టించాలన్నదే పాక్ ప్రయత్నంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్ క్రీక్‌పై వివాదం త్రిశూల్ విన్యాసాల కోసం 28,000 అడుగుల ఎత్తువరకు గగనతలాన్ని రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషకుడు డామియన్ సైమన్ పంచుకున్నారు. త్రిశూల్ కోసం ఎంచుకున్న ప్రాంతం, అందుకోసం జరుగుతున్న సన్నద్ధత ‘అసాధారణం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో జరిగే ఈ విన్యాసాల్లో సదరన్ కమాండ్ కూడా చురుగ్గా పాల్గొనబోతుందని రక్షణ శాఖ తెలియజేసింది. ఎడారి, కొండలు, అడవులు, సముద్రం.. ఇలా విభిన్నమైన భౌగోళిక పరిస్థితుల్లో విన్యాసాలు జరగబోతున్నాయి. సర్ క్రీక్‌పై భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. సర్ క్రీక్ పూర్తిగా తమదేనని రెండు దేశాలు వాదిస్తున్నాయి. ఇది రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం. సర్ క్రీక్‌లో అవాంఛనీయ చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెప్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే పాకిస్తాన్‌ను హెచ్చరించారు. చరిత్రను, భౌగోళిక పరిస్థితులను మార్చేలా తమ ప్రతిస్పందన ఉంటుందని ఆయన తేలి్చచెప్పారు. సర్ క్రీక్ భారత్‌లోని గుజరాత్, పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్ మధ్యనున్న చిత్తడి నేలలతో కూడిన ప్రాంతం. ఇక్కడ మానవ ఆవాసాలు లేవు. దీని పొడవు 96 కిలోమీటర్లు. భద్రత, సైనిక పరంగా రెండు దేశాలకు ఇది కీలకమైనది. సర్ క్రీక్‌లో సైనిక మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. అందుకే పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్రిశూల్ విన్యాసాల కోసం భారత సైన్యం సర్ క్రీక్‌ను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సృష్టికి ప్రతిసృష్టి
సాక్షి, అమరావతి: వివాహం జరుగుతున్నప్పుడు వ«ధూవరుల తల్లిదండ్రుల్లో ఎవరైనా లేకపోతే.. శుభకార్యానికి వచ్చిన వారంతా ‘ఇలాంటి సమయంలో మీ నాన్న, అమ్మ ఉంటే ఎంత సంతోషించేవారో.. వారులేని లోటు కనిపిస్తోంది’ అంటుంటారు. ఇప్పుడు ఆ లోటును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీరుస్తోంది. ఎప్పుడో భౌతికంగా దూరమైన వారిని సజీవ చిత్రాలుగా మలిచి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది. దీనిని సాంకేతిక యుగంలో ఓ అద్భుతంగా అభివర్ణించవచ్చు. చనిపోయిన వ్యక్తులను బతికున్నవారిలా చూపించే ఏఐ సాంకేతికతను ‘డిజిటల్ పునరుత్థానం’ ‘గ్రీఫ్ టెక్’ అని పిలుస్తున్నారు. ఈ సాంకేతికత చనిపోయినవారి ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు, మెసేజ్‌లు వంటి వాటిని ఉపయోగించుకుని వారి రూపాన్ని, స్వరాన్ని, ప్రవర్తనను పునఃసృష్టిస్తోంది. ఇప్పుడు ప్రతి వేడుకలోనూ ఈ విజ్ఞానం భావోద్వేగాలను పంచుతోంది.ఎలా పనిచేస్తుంది?ముందుగా ఏఐ టూల్‌కు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డేటాను ఇస్తారు. ఇందులో టెక్టŠస్ మెసేజ్‌లు, ఈ–మెయిల్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు ఉంటాయి. ఈ డేటాను ఏఐ విశ్లేషించి.. చనిపోయిన వ్యక్తి ముఖం, కదలికలు, హావభావాలు, గొంతుతో ఒక డిజిటల్ అవతార్‌ను సృష్టిస్తుంది. ఈ అవతార్‌తో మనం చాట్‌బాట్ రూపంలో మాట్లాడవచ్చు. కొన్ని ఆధునిక వ్యవస్థలు వీడియో కాల్స్ ద్వారా కూడా సంభాషించే సౌలభ్యాన్ని కల్పిస్తాయి.ఎన్నో యాప్లుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఇలాంటి వీడియోలను సృష్టించేందుకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టోరీఫైల్ వంటి కంపెనీలు చనిపోయినవారు అంత్యక్రియల సమయంలో మాట్లాడేలా ఏఐని వినియోగిస్తున్నాయి. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోలు, వాటికి ఏఐ ప్రశ్నలు, సమాధానాలు జతచేసి బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చేస్తుంది. మైహెరిటేజ్ అనే సంస్థ ‘డీప్ నాస్టాల్జియా’ అనే ఫీచర్‌తో పాత ఫొటోలను కదిలే వీడియోలుగా (యానిమేటెడ్) మారుస్తోంది. ఈ ఫీచర్ చనిపోయినవారి ఫొటోలను యానిమేట్ కూడా చేస్తుంది. డీప్‌బ్రెయిన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ‘రీ మెమరీ 2’ అనే సేవ ద్వారా చనిపోయినవారి వాస్తవిక ఏఐ అవతార్లను తయారు చేస్తోంది.భావోద్వేగంతో ఆందోళన చనిపోయినవారిని ఏఐతో పునఃసృష్టించడం వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి సమ్మతి లేకుండా వారి డేటాను ఉపయోగించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏఐ అవతార్‌తో మాట్లాడినప్పుడు.. కుటుంబ సభ్యులు అది నిజమైన వ్యక్తి కాదని తెలుసుకోలేకపోవడం వల్ల భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సాంకేతికత దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా, కొంతమందిని చనిపోయినవారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బాధను మరింతగా పెంచుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అలాగే ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. -
ఢిల్లీలో రేవంత్ ఇంట్లోకి మహిళా అధికారికి నో ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసేందుకు వచ్చిన ఓ మహిళా అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఐ అండ్ పీఆర్ ఢిల్లీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హర్ష భార్గవి ఇటీవల తెలంగాణ సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం ఢిల్లీ రావడంతో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు సీఎం నివాసానికి చేరుకున్నారు. కానీ అక్కడి భద్రతా సిబ్బంది ఐడీ కార్డు చూపించినా ఆమెను లోపలకు పంపేందుకు నిరాకరించారు. ‘మీరెవరో తెలియదు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు’ అన్నారు. దీంతో ఆమె వెనుదిరిగేందుకు సిద్ధమై క్యాబ్ కోసం నిరీక్షిస్తుండగా ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న మీడియా సిబ్బంది గమనించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులకు ఆమె ఫోన్లో వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో వారు ఈ విషయాన్ని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడతానని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి చెప్పారు. -
‘ ఏ ఒక్కరూ నా కూతుర్ని కాపాడలేకపోయారు’
సతారా: మహారాష్ట్రలోని సతారాలో చోటు చేసుకున్న యువ వైద్యురాలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. తన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, చేతిపైనే సూసైడ్ నోట్ రాసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కూతురు ఎలా చనిపోయిందో అదే తరహాలో నిందితులిద్దరికీ శిక్ష పడాలని వేడుకుంటున్నాడు. ఈ మేరకు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్‌కు తన కన్నీటి వ్యథను మీడియా ద్వారా తీసుకెళ్లారు. ‘ నా కూతురు ఎలా అయితే చనిపోయిందో అదే రకంగా వారికి ఉరిశిక్ష పడేలా చేయండి సీఎం సార్, అంతకు మించి నాకు ఇక వేరే న్యాయం ఏమీ అక్కర్లేదు. ఇదే నా డిమాండ్’ అంటూ గద్దగద స్వరంతో విన్నవించాడు‘ నా కూతుర్ని కాపాడటానికి ఎవరూ రాలేదు. అన్యాయం జరుగుతుంటే, అందరూ నిలబడి చూస్తున్నారు. అక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఉన్నారు, కానీ ఒక్క కృష్ణుడు కూడా నా కూతురికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి, భవిష్యత్తులో కూతుళ్ల కోసం, కనీసం ఒక కృష్ణుడు ముందుకు వచ్చి ‘ఆమె’ గౌరవాన్ని కాపాడాలి’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా, మహారాష్ట్రలో ఓ సన్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్హన్ తహసీల్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉం టున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచా రం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరచేతిపై సూసైడ్ నోట్ రాసి.. వైద్యురాలి బలవన్మరణం -
అవినీతిలో మహారాష్ట్ర టాప్.. తర్వాత స్టేట్..?
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీ వరకు 530 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 785 ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి మహారాష్ట్రలో 28 శాతం అవినీతి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వివరాలు నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడయ్యాయి. టీఎంసీ డీసీ అవినీతి కేసు సంచలనం థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శంకర్ పాటోలేను ఇటీవల అవినీతి కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటన థానే, ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతిపరుల జాబితా మరింత సంచలనం రేపింది. దీంతో విధినిర్వహణలో ఉన్న అధికారులు, మాజీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తరువాత స్ధానాల్లో రాజస్ధాన్, కర్ణాటక, గుజరాత్ సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించనిదే సామాన్యుల పనులు జరగవనేది జగమెరిగిన సత్యం. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల గోడలపై అంచం తీసుకోవడం నేరం– ఇవ్వడం కూడా నేరమే అవుతుందని పెద్దపెద్ద అక్షరాలతో రాసిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ విషయం అందరికి తెలిసినా పనుల కోసం లంచం చెల్లించడం పరిపాటిగా మారింది. మరికొందరు అడిగినంత ఆమ్యామ్యా ఇవ్వలేక, అవినీతిని ప్రొత్సహించలేక అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.వారు పథకం ప్రకారం కాపు కాస్తారు. ఆ తరువాత లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేస్తారు. ఆ తరువాత వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెడతారు. ఇలా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఏసీబీ అధికారులు ఎన్సీఆర్బీకి నివేదిస్తారు. రాష్ట్రాల వారీగా అవినీతి కేసుల సంఖ్యను విడివిడిగా తెలియజేస్తారు. ఇందులో భాగంగా ఇటీవల ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతి, లంచం కేసులకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర (Maharashtra) అగ్రస్ధానంలో ఉంది.ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది మహారాష్ట్రలో 795 కేసులు నమోదుకాగా ఆ తరువాత స్ధానంలో రాజస్ధాన్ (284), మూడో స్ధానంలో కర్ణాటక (245), నాలుగో స్ధానంలో గుజరాత్ (183) ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని వివిధ నగరాలు, జిల్లాల వారీగా పరిశీలిస్తే ముంబై, థానే సహా నాసిక్, పుణే, ఛత్రపతి సంభాజీనగర్ అవినీతిలో టాప్‌లో ఉన్నాయి. అక్కడ ఒక్క అవినీతి కేసు లేదు!ఈశాన్య భారతంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో అస్సాం, సిక్కిం (Sikkim) మినహా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌లలో ఒక్క అవినీతి కేసు నమోదు కాలేదు. కాగా అస్సాంలో 91, సిక్కింలో కేవలం ఒక్కటే అవినీతి కేసు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక (NCRB Report) వెల్లడించింది.చదవండి: ఇదేం విచిత్రం.. చెట్లకు సెల్ఫోన్లు ఎందుకు? -
Delhi: సీఎం రేవంత్ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ
ఢిల్లీ: హర్ష భార్గవి.. తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ(I&PR)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల న్యూఢిల్లీకి బదిలీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమెకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు(శనివారం, అక్టోబర్ 25వ తేదీ) ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీస్ సిబ్బంది ఆమెను గేట్ వద్దే నిలిపేశారు. ఆమెను సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు అనుమంతిచలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా తనను పరిచయం చేసినప్పటికీ, పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె ప్రశ్నించగా, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దాంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇదీ చదవండి:ఓటర్ల జాబితాపై సమీక్ష.. తెలంగాణలో SIR -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ: నాగ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 విమానానికి పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. ఇంజన్లో సౌండ్ రావడంతో గుర్తించిన పైలట్.. విమానాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మళ్లించారు. నాగ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసిన అనంతరం విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. విమాన మరమ్మతులకు అధిక సమయం అవడంతో రద్దు చేసినట్లు వెల్లడించారు.మరో వైపు, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు ఇండిగో విమానాలను దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. పశ్చిమ బెంగాల్, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. -
బిహార్ ఎన్నికల్లో హాట్‌టాపిక్!
'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' - పాపులర్ సినిమా డైలాగ్. ముందు 60 సీట్లు అన్నాడు, తర్వాత 30కి దిగాడు. చివరకు 15తోనే సరిపెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు బిహార్‌లో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు ముకేష్ సహానీ. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) వ్యవస్థాపకుడు. మహాగఠ్‌బంధన్ (మహా కూటమి) ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రస్తుతం బిహార్ పాలిటిక్స్‌లో (Bihar Politics) హాట్‌టాపిక్‌గా మారారు. అంతగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సి ఏముంది అనుకుంటున్నారా? చాలానే ఉంది!ముకేష్ సహానీ గురించి తెలుసుకోవాలంటే 2020 నాటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావించుకోవాలి. మొదటి దశ ఎన్నికలకు వారం రోజుల ముందు మహాగఠ్‌బంధన్‌కు హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలోకి జంప్ చేశారు. తాను అడిగిన 25 సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం దక్కకపోవడంతో బీజేపీ-జేడీయూ కూటమితో చేతులు కలిపాడు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన 11 స్థానాలతోనే సరిపెట్టుకున్నాడు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా తాను కోరుకున్న డిప్యూటీ సీఎం మాత్రం దక్కలేదు. ఆ ఎన్నికల్లో వీఐపీకి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి.ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్బీజేపీ సిఫారసు మేరకు సహానీని ఎమ్మెల్సీ చేసి పశుసంవర్ధక, మత్స్యకార మంత్రి పదవి కట్టబెట్టారు. అది కూడా ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. 16 నెలలకే మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించారు. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వీఐపీ తరపున 53 మంది అభ్యర్థులను నిలబెట్టినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. అంతకు వారం ముందే వీఐపీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహానీని కాదని బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఒంటరి అయ్యారు. చివరకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి కూడా లాగేసుకున్నారు. ఇది జరిగి మూడున్నరేళ్లు అయింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.15 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్సీప్రస్తుత బిహార్ ఎన్నికల విషయానికి వస్తే ముకేష్ సహానీ.. మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నారు. సీట్ల విషయంలో గట్టిగానే పట్టుబట్టారు. ముందు 60 అన్నట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత 30కి తగ్గారని ఊహగానాలు వచ్చాయి. పాతిక సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం ఇస్తేనే ఉంటానని సహానీ కుండబద్దలు కొట్టారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్, ఆర్జేడీ సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో సహానీని ఆకర్షించేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు మీడియాలో వార్తలు షికారు చేశాయి. చివరకు 15 అసెంబ్లీ సీట్లు, రెండు శాసనమండలి స్థానాలతో పాటు రాజ్యసభ సీటుతో సర్దుకుపోయారు. కానీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో మాత్రం రాజీపడలేదు.బలమైన ఓటు బ్యాంకుముకేష్ సహానీ విషయంలో అధికార, విపక్ష ఆసక్తి కనబరచడానికి ప్రధాన కారణం కులం. ఉత్తర బిహార్, లోతట్టు ప్రాంతాల్లో 20 ఉపకులాలతో కూడిన బోట్మెన్- ఫిషర్మెన్ కమ్యూనిటీ 'నిషాద్ కి బలమైన ఓటు బ్యాంకు ఉంది. నిషాద్‌లో మల్లా, బింద్, బెల్దార్, కేవత్ వంటి ఉప కులాలు ఉన్నాయి. ముకేష్ సహానీ మల్లా సామాజిక వర్గానికి చెందిన వాడు. ప్రస్తుతం అతడి పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ప్రధాన పార్టీలు అతడికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఈ ఓటు బ్యాంక్. పట్నాకు ఉత్తరాన ఉన్న వైశాలి, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబని ప్రాంతాలతో పాటు సీమాంచల్ వైపు తూర్పున కూడా కీలకమైన నిషాద్ కి ఓటు బ్యాంకు ఉంది.2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీలో మహాకూటమి అభ్యర్థులు ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.03 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో బలమైన ఓట్లు బ్యాంకు కలిగిన ముకేష్ సహానీ తమతో పాటే ఉండాలని మహాకూటమి బలంగా కోరుకుంది. అందుకే అతడిని డిప్యూటీ సీఎం (Deputy CM) అభ్యర్థిగా ప్రకటించింది. కాగా, తాము అధికారంలోకి మిగతా కులాల నుంచి కూడా ఉప ముఖ్యమంత్రులను నియమిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ ప్రకటించడం గమనార్హం.చదవండి: బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!అందుకే ఒప్పుకున్నాతమకు తక్కువ సీట్లు కేటాయించినా, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో మహాకూటమిలో ఉండేందుకు ఒప్పుకున్నారని ముకేష్ సహానీ తెలిపారు. మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పేరు ప్రకటించినప్పడే సహానీ పేరు కూడా వెల్లడించారు. సన్ ఆఫ్ మల్లాగా పాపులర్ అయిన 44 ఏళ్ల సహానీ ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. బాలీవుడ్లో సెట్ అసిస్టెంట్‌గా పనిచేసిన ముకేష్ రాజకీయ రంగంలో ఎలా రాణిస్తారోనని బిహారీలు ఎదురు చూస్తున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో (నవంబర్ 6, 11) జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి. -
‘రైళ్లలో అమానవీయం’: బీహార్‌పై నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్నికల సందడి నెలకొన్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండుగల సమయంలో బీహార్‌లో సామర్థ్యానికి మించిన రీతిలో రైళ్లను నడపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్లో ప్రయాణికులను రైళ్లలో అమానవీయ రీతిలో తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ మోసపూరిత విధానాలు, ఉద్దేశాలకు ఈ పరిస్థితి సజీవ నిదర్శమని రాహుల్ అభివర్ణించారు.‘బీహార్‌లో రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. టిక్కెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం అమానవీయంగా తయారయ్యింది. చాలా రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. ప్రయాణికులు రైలు తలుపుల దగ్గర వేలాడుతున్నారు’ అంటూ రాహుల్ ‘ఎక్స్’లో వీడియోను షేర్ చేశారు. కేంద్రంలోని బీజేపీ, బీహార్‌లో ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూలు పండుగ రద్దీని తగ్గించేందుకు 12 వేల ప్రత్యేక రైళ్లు నడుపుతన్నట్లు ప్రకటించాయని, అన్ని రైళ్లు ఎక్కడని రాహుల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఏటా పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నాయి? బీహార్ ప్రజలు ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఎందుకు ప్రయాణించాల్సి వస్తున్నదని రాహుల్ నిలదీశారు. त्योहारों का महीना है - दिवाली, भाईदूज, छठ।बिहार में इन त्योहारों का मतलब सिर्फ़ आस्था नहीं, घर लौटने की लालसा है - मिट्टी की खुशबू, परिवार का स्नेह, गांव का अपनापन।लेकिन यह लालसा अब एक संघर्ष बन चुकी है। बिहार जाने वाली ट्रेनें ठसाठस भरी हैं, टिकट मिलना असंभव है, और सफ़र… pic.twitter.com/hjrYJJFJ0F— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2025రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉంటే వారు వేల కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేదని, వీరంతా నిస్సహాయ ప్రయాణికులు మాత్రమే కాదని, ఎన్డీఏ మోసపూరిత విధానాలకు సజీవ సాక్ష్యం అని రాహుల్ పేర్కొన్నారు. కాగా పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అక్టోబర్ ఒకటి, నవంబర్ 30 మధ్య 12,011 ప్రత్యేక రైలు ట్రిప్పుల షెడ్యూల్‌ను ప్రకటించింది. సగటున, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 196 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. -
బస్సులో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్యాసింజర్లు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి కింది భద్రతా వ్యవస్థలు, సదుపాయాలు ఎంతో అవసరం అవుతాయి.ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత)అగ్నిప్రమాదాల వల్ల బస్సుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏసీ, స్లీపర్ బస్సుల్లో కిటికీలు తెరవడానికి వీలులేకపోవడం, తక్కువ ఎంట్రీ/ ఎక్జిట్ మార్గాలు ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పొగ వచ్చినప్పుడు వెంటనే డ్రైవర్‌ను, ప్రయాణికులను అప్రమత్తం చేసే సెన్సార్ ఆధారిత అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించగలిగే కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్లు ఉండాలి.ఎమర్జెన్సీ ఎక్జిట్సాధారణ ఎంట్రీ/ ఎక్జిట్ ద్వారాలు కాకుండా బస్సులో కనీసం రెండు సులభంగా తెరవగలిగే అత్యవసర ద్వారాలు (కిటికీలు లేదా హాచ్లు) తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఇంధన సరఫరాను ఆటోమేటిక్‌గా నిలిపివేసే వ్యవస్థ ఉండాలి.ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కిట్ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వైప్స్, కత్తెర, పట్టీలు, నొప్పి నివారణ మందులు (చిన్న గాయాలు, తలనొప్పి, వాంతులు మొదలైన వాటికి), బర్న్ క్రీమ్స్ వంటి ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలి. డ్రైవర్, అటెండర్లు ఈ పరికరాలను ఉపయోగించడంపై శిక్షణ పొంది ఉండాలి.ఇతర భద్రతా అంశాలుఅత్యవసర పరిస్థితుల్లో (ముఖ్యంగా అగ్నిప్రమాదం లేదా బస్సు నీటిలో పడినప్పుడు) కిటికీల అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే సేఫ్టీ హ్యామర్లు బస్సులో కనీసం 4-6 చోట్ల ఏర్పాటు చేయాలి.స్లీపర్ బెర్త్‌ల్లో ఇవి లేకపోయినా సీటింగ్ విధానం ఉన్న బస్సుల్లో కచ్చితంగా సీట్ బెల్ట్‌లు ఉండాలి.ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ను, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే అత్యవసర బటన్ ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు కూడా మార్గాలు కనిపించేలా అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉండాలి.భద్రతా వ్యవస్థలను ఉపయోగించే విధానంఅగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదట డ్రైవర్‌ను, తోటి ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయాలి. అత్యవసర బటన్‌ను నొక్కాలి. అగ్ని ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యుషర్ను ఉపయోగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే బయటకు వెళ్లాలి. ప్రమాద సమయాల్లో అత్యవసర ద్వారాలు లేదా కిటికీలు (సేఫ్టీ హ్యామర్‌తో పగలగొట్టి) ద్వారా బయటకు రావాలి.బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉన్న యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేసి, బ్యాండేజీ వేయాలి. ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డ లేదా ప్యాడ్‌తో గాయంపై గట్టిగా నొక్కి పట్టుకోవాలి. వీలైనంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి.ఇదీ చదవండి: భారత్‌లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో.. -
Maharashtra: ‘పలుమార్లు ఎస్ఐ అఘాయిత్యం’.. వైద్యురాలి సూసైడ్ నోట్లో ‘దారుణాలు’
ఫల్టన్: మహారాష్ట్రలోని ఫల్టన్‌కు చెందిన మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు ముందుకు ఆమె రాసిన లేఖ అందరినీ కదిలింపజేస్తోంది. తనపై ఎస్సై గోపాల్ బాద్నే నాలుగుసార్లు అత్యాచారం చేశాడని మృతురాలు లేఖలో పేర్కొంది. నాలుగు పేజీల సూసైడ్ లేఖలో..మహారాష్ట్రలో చోటుచేసుకున్న యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చనిపోయేముందు ఆమె తన అరచేతిపై సూసైడ్ లేఖ రాసుకున్నారు. అలాగే అంతకుముందు రాసిన నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ బయటపడటంతో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆ లేఖలో ఆమె తనపై ఎస్ఐ గోపాల్ బాద్నే ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించారు.ఎంపీతోపాటు అతని పీఏల ప్రమేయం?అలాగే ఆ లేఖలో ఆమె ఓ ఎంపీతోపాటు అతని పీఏలపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. పోలీసు కేసుల్లోని పలువురు నిందితులకు నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులతో పాటు ఒక ఎంపీ, అతని సహాయకులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వైద్యురాలు ఆరోపించారు. అందుకే తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యురాలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బాద్నే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని.. 5 నెలలకు పైగా శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆ లేఖలో వివరించారు. ఇక దీనిపై ఫల్టాన్ సబ్ డివిజనల్ ఆఫీస్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసు అధికారి సస్పెండ్బాధిత వైద్యురాలు గత 23 నెలలుగా ఇదే ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. నెల రోజుల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆమె భావించారు. అయితే ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కాగా వైద్యురాలు ఆ లేఖలో తన ఇంటి యజమాని ప్రశాంత్ బంకర్‌పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. ఎస్సై గోపాల్ బాద్నే, ఇంటి యజమాని బంకర్‌పై కేసు నమోదు చేశారు. ఎస్సై గోపాల్ బాద్నేను సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కొల్హాపూర్ డివిజన్) సునీల్ ఫులారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.పోలీసులను కాపాడుతున్న ‘మహాయతి’: కాంగ్రెస్ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతలంతా పోలీసులను కాపాడుతున్నారని ఆరోపించింది.‘రక్షకుడే వేటగానిగా మారినప్పుడు.. న్యాయం ఎలా జరుగుతుంది? బాధిత వైద్యురాలు గతంలో ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహాయుతి ప్రభుత్వం పోలీసులను కాపాడుతోంది. ఫలితంగా పోలీసుల దురాగతాలు పెరుగుతున్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడేట్టివార్ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.‘క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం’‘ఈ సంఘటన దురదృష్టకరం, నేను సతారా పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడాను. వైద్యురాలు ఫిర్యాదు చేశారని, అయితే ఎటువంటి చర్య తీసుకోలేదని మా దృష్టికి వచ్చింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. మహిళలు ఇటువంటి ఫిర్యాదులను నమోదు చేయడానికి 112 హెల్ప్‌లైన్‌ను ఉపయోగించాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని బీజేపీ మహిళా నేత చిత్ర వాఘ్ పేర్కొన్నారు. -
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు
ఇండోర్: అంతర్జాతీయ మహిళా ప్రపంచకప్‌లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చేరుకున్న ఆ్రస్టేలియా మహిళా జట్టులోని ఇద్దరు సభ్యులతో ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు వెంటనే అరెస్ట్‌చేశారు. తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. అసలేం జరిగింది? మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఇండోర్ సిటీకి చేరుకుని అక్కడి ర్యాడిసన్ బ్లూ హోటల్లో బసచేస్తోంది. గురువారం ఉదయం అక్కడి ఖజ్రానా రోడ్‌లోని ఒక కెఫెకు వెళ్లేందుకు ఇద్దరు ఆ్రస్టేలియా క్రీడాకారిణులు నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వచి్చన అకీల్ ఖాన్ వీరిద్దరినీ తన బైక్ మీద అనుసరించాడు. తర్వాత హఠాత్తుగా దగ్గరకు వచ్చి ఒక క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తించి బైక్ మీద పారిపోయాడు. వెంటనే ఈ ఘటనను క్రీడాకారులు తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన డ్యానీ సిమన్స్కు ఫిర్యాదుచేశారు. ఘటన జరిగిన చోటు లైవ్ లొకేషన్‌ను షేర్చేశారు. ఈ ఘటనను స్థానిక సెక్యూరిటీ అధికారికి సైతం చెప్పారు. అతిథి దేవోభవ అని నినదించే భారత్‌లో అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం విషయం తెల్సి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ హిమీనా మిశ్రా వెంటనే రంగంలోకి దిగారు. ఆ ఇద్దరు క్రీడాకారిణులతో స్వయంగా మాట్లాడి ఘటన జరిగిన తీరును అడిగి తెల్సుకున్నారు. వారి వాంగ్మూలాలను నమోదుచేశారు. భారత న్యాయసంహితలోని సెక్షన్ 74(మహిళ గౌరవాన్ని భంగపరచడం), 78( వెంటబడి వేధించడం) సెక్షన్లకింద ఎంఐజీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సబ్–ఇన్స్పెక్టర్ నిధి రఘువంశీ కేసు దర్యాప్తు మొదలెట్టారు. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి ఆ నిందితుడి బైక్ నంబర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ వివరాలతో నిందితుడు అకీల్ ఖాన్‌ను గుర్తించి అరెస్ట్‌చేశారు. ఖాన్‌కు గతంలోనూ నేరచరిత్ర ఉందని దర్యాప్తులో తేలింది. ఘటనపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) సైతం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం పట్ల క్షమాపణలు తెలిపారు. ఇకపై క్రీడాకారులకు బయటివైపు తగు రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంపీసీఏ హామీ ఇచి్చంది. ఘటనను క్రికెట్ ఆ్రస్టేలియా సంఘం సైతం ధ్రువీకరించింది. ఘటనపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి కైలాశ్ విజయ్‌వర్గీయ స్పందించారు. ‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది దేశ పరువు, ప్రతిష్ట, ఆతిథ్యాలకు సంబంధించిన విషయం’’అని ఆయన అన్నారు. ఘటనకు ముందు రోజు ఇదే ఆస్ట్రేలియా టీమ్ ఇంగ్లండ్ జట్టుతో తలపడటం తెల్సిందే. చదవండి: భారత బౌలర్ల విజృంభణ... ఆసీస్ ఆలౌట్.. స్కోరెంతంటే? -
ఇంటర్న్‌షిప్ జాతర.. లక్షమందికి సదవకాశం
న్యూఢ్లిలీ: దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్–2026ను ప్రకటించింది. జాతీయ ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా ఒక కోటి ఇంటర్న్‌షిప్‌లను అందించే లక్ష్యంలో భాగంగా ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రస్తుతం లక్షమందికి ఉచిత ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది.ఎవరు చేరవచ్చు?ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్మెంట్, ఆర్ట్స్, కామర్స్, డిప్లొమా విద్యార్థులకు బోధన కాలంలోనే ఆచరణాత్మక వృత్తి నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఏఐసీటీఈ ప్రవేశపెట్టింది. తద్వారా అభ్యాసం, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులను రెడీ టూ వర్క్‌కు సిద్ధం చేస్తోంది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన విభాగాలలో డిప్లొమా, యూజీ, పీజీ చేస్తున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.రూ.15వేల వరకు స్టయిఫండ్లక్ష మందికి పైగా ఉచితంగా అందించే ఇంటర్న్‌షిప్‌లను ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలోఏఐసీటీఈ అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ–ఎథికల్ హ్యాకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్–డేవ్ ఆప్స్, ప్రభుత్వంలోని నీతి ఆయోగ్, భారత ప్రభుత్వ విధానాలు, ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు, మహిళా సాధికారత, స్మార్ట్ విలేజ్, ఏఐసీటీఈ గ్రామీణ ఆవిష్కరణ మిషన్ల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ, నూతన సాంకేతిక అంశాల్లో వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కల్పిస్తుంది. ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 4 నుంచి 12 వారాలు కాగా, కొన్ని సంస్థలు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు స్టయిఫండ్ ఇస్తాయి. ఇంటర్న్‌షిప్ ముగిసిన తర్వాత ఏఐసీటీఈ పోర్టల్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ అందిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపికలో తొలి ప్రాధాన్యత ఇస్తారు.భాగస్వామ్య సంస్థలుఈ ఇంటర్న్‌షిప్‌లను కింద పేర్కొన్న ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయి.ఐబీఎంసిస్కోమైక్రోసాఫ్ట్ఇస్రోడీఆర్డీఓనాస్కామ్(NASSCOM)నీతి ఆయోగ్ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖనైపుణ్యం అందించే విభాగాలువిద్యార్థులు అత్యాధునిక డొమైన్లలో ఈ కింద పేర్కొన్న నైపుణ్యాలను పొందవచ్చుకృత్రిమ మేధస్సుసైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ఎలక్ట్రిక్ వాహనాలుస్పేస్ టెక్నాలజీక్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవ్ఆప్స్స్మార్ట్ విలేజ్ ఇన్నోవేషన్ప్రభుత్వ పాలసీ అండ్ మహిళా సాధికారతఎలా దరఖాస్తు చేయాలి?విద్యార్థులు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ ఇంటర్న్‌షిప్ బాటలు వేస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో డిప్లొమా, యూజీ, పీజీలలో ఏ విభాగానికి చెందిన విద్యార్థులైనా ఉచితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌ను ఈ లింక్ ( https://internship.aicte-india.org/) ద్వారా చేసుకోవచ్చు. -
భారత్‌లో అలాంటి నిషేధం వద్దా?
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక.. సోషల్ మీడియా మత్తులో జనం మునిగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా.. గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. యూట్యూబ్-ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, మీమ్స్ అని.. ఇలా రాత్రి, పగలు తేడా లేకుండా సోషల్ మీడియా సైట్లలోనే గడిపేస్తున్నారు. ఈ విషయంలో పిల్లలనూ తల్లిదండ్రులు కట్టడి చేయలేకపోతున్నారు. అందుకే విప్లవాత్మక మార్పులో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ వాడకంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో.. యూరోపియన్ యూనియన్‌తో మలేషియాలోనూ బ్యాన్పై చర్చ జరుగుతోంది. అయితే పూర్తి స్థాయి నిషేధం కాకపోయినా.. ఫ్రాన్స్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నియంత్రణకు చట్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ స్పూర్తితో భారత్‌లోనూ అలాంటి నిర్ణయం జరగాలన్న అభిప్రాయాల్ని ఓ సర్వే తోసిపుచ్చింది. భారత్‌లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారట!!..పిల్లల విషయంలో సోషల్ మీడియా వాడకంపై అభిప్రాయం కోరుతూ Ipsos, Statista సంయుక్తంగా ‘గ్లోబల్’ సర్వే నిర్వహించాయి. ఇందులో 30 దేశాలకు చెందిన వేల మంది తల్లిదండ్రులు ఫీడ్ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న 70 శాతం మంది నియంత్రణ సబబేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా ఇండోనేషియా ఆ తర్వాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నుంచి ఈ ఒపీనియన్ వెల్లడైంది. అయితే.. భారత్ నుంచి మాత్రం మిశ్రమ స్పందన లభింaచింది. వందలో 68 మంది మాత్రమే చిన్నారులకు సోషల్ మీడియా కట్టడిని సమర్థించారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. కిందటి ఏడాది ఇది 73 శాతం ఉంది. అంటే.. ఇప్పుడు 5 శాతానికి తగ్గిపోయిందన్నమాట.ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ.. పూర్తి నిషేధం సబబు కాదనే అభిప్రాయం తాజా సర్వేలో ఇండియన్ పేరెంట్స్ నుంచి వ్యక్తమైంది. బ్యాన్‌కి బదులు మార్గదర్శకత్వం అవసరం అనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే మా నుంచి కూడా పరిమితులు ఉండాల్సిన అవసరం ఉంది.:హైదరాబాద్‌కు చెందిన ఓ తల్లినిషేధం సబబు కాదు. దాని కంటే సరైన గైడ్‌లైన్స్ మీద దృష్టి పెట్టాలి: బెంగళూరుకు చెందిన ఓ తండ్రిభద్రతా సమస్యలు ఉన్నా సో.మీ.ను పూర్తిగా నిషేధించడం సమర్థనీయం కాదు: ఢిల్లీకి చెందిన తల్లిదండ్రులుసోషల్ మీడియా వినియోగం అనేది పిల్లల వికాసం, అవగాహన కోసం ఉపయోగపడుతుందని కొంతమంది తల్లిదండ్రుల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత్‌కు డిజిటల్ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయింది. విద్యా, వ్యాపార అభివృద్ధి, కమ్యూనిటీ నిర్మాణం లాంటి రంగాల్లో ఎక్కువగా సోషల్ మీడియా వినియోగం ఉంటోంది. మరీ ముఖ్యంగా.. యూత్ కల్చర్‌లో లోతుగా కలిసిపోయింది. అందుకే ఎక్కువ మంది తల్లిదండ్రులు కఠిన నియంత్రణలు అవసరమని భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఇక్కడి ప్రభుత్వాలు కూడా.. నిషేధం కంటే నియంత్రణ మీదే(వయస్సు ధృవీకరణ, డిజిటల్ విద్యా అవగాహన, తల్లిదండ్రుల పర్యవేక్షణ లాంటి అంశాలు) ఎక్కువ దృష్టిసారిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా పిల్లల విషయంలో హానికరమైన కంటెంట్, అల్గోరిథం విషయంలో నియంత్రణలకు సిద్ధంగానే ఉన్నట్లు సూచన ప్రాయంగా చెబుతున్నాయి. జర్మనీలో.. భారత్‌కు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా నిషేధానికి మద్దతు ఇచ్చిన వారి శాతం అత్యల్పంగా 53% ఉన్నప్పటికీ, గత సంవత్సరం కంటే మద్దతు 13% పెరిగింది. ఇది పెరుగుతున్న అక్కడి తల్లిదండ్రుల ఆందోళనను, మారుతున్న పిల్లల ఆలోచనా ధోరణిని సూచిస్తోంది. -
‘చావనైనా చస్తాను.. ఆర్జేడీలో చేరను’: తేజ్ ప్రతాప్
హాజీపూర్: బీహార్ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితమే పార్టీ నుంచి బహిష్కృతుడైన తేజ్ ప్రతాప్ పలు అంశాలలో వివాస్పదునిగా వార్తల్లో కనిపిస్తున్నారు.జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి, మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్విపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరం అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ‘ఆర్జేడీ పార్టీలోకి తిరిగి వెళ్లేకంటే చావడమే నయం. నాకు అధికార దాహం లేదు. మానవీయ సూత్రాలు, ఆత్మగౌరవం అత్యున్నతమైనవి’ అని తేజ్ ప్రతాప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రజల కోసం పనిచేయడమే తనకు సంబంధించిన పెద్ద విషయం అని, నిజాయితీగా అదే పని చేస్తానని, అప్పుడే ప్రజలు తనను ప్రేమిస్తారు.. నమ్ముతారని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఆయన 2015లో ఎన్నికల అరంగేట్రం చేసిన మహువా స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుండే ఈ నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నానని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. తన తమ్మునికి నమ్మకస్థుడైన సిట్టింగ్ ఆర్జేడీ శాసనసభ్యుడు ముఖేష్ రౌషన్‌ను తాను పోటీదారుగా భావించడం లేదన్నారు.తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ తాము చాలా కాలంగా మాట్లాడుకోవడం లేదని, కానీ వారి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నానని అన్నారు.ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ఎంపిక చేయడం తనకు నచ్చలేదన్నారు. పలు రకాల ప్రకటనలు చేయడం రాజకీయ నాయకుల లక్షణమని, కానీ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తి మాత్రమే అధికారాన్ని చేజిక్కించకుంటాడని తేజ్ ప్రతాప్ అన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పదునైన ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్ల పిరికిపంద చర్య బయటపడింది. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేల కాంకేర్‌లో మావోయిస్టులు ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను హత్యచేశారు. హతులను తిరుపతి సోధి, రవి కట్టంగా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు అక్టోబర్ 13న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత పూనెం సత్యంను దారుణంగా హత్య చేశారు. అతను ఇన్ఫార్మర్ అని వోమావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో పూనెం సత్యం మృతదేహం దగ్గర మావోయిస్టులు ఒక కరపత్రాన్ని ఉంచారు.దానిలో వారు పలు ఆరోపణలు చేశారు. ఈ హత్యకు మద్దీద్ ఏరియా కమిటీ ఆఫ్ నక్సలైట్స్ బాధ్యత వహించింది. కాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో నిఘాను మరింత బలోపేతం చేస్తోంది. పోలీసు ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌ను పెంచుతోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా మావొయిస్టుల స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. -
‘ఇండియా కూటమి అలా నెగ్గాలనుకుంది..’ నడ్డా సంచలన ఆరోపణలు
బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలకు దిగారు. చొరబాటుదారుల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు సాగనివ్వబోదని అన్నారు. శుక్రవారం వైశాలి జిల్లాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించారు. ‘‘బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (special intensive revision)కు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. చొరబాటుదారుల ఓట్ల ఆధారంగానే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు కాబట్టి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాన్ని ఎప్పటికీ సాగనివ్వబోదు.. .. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఆరోపణలపై మాట్లాడటమే మానేశాయి. అక్కడే అసలు వాస్తవం బయటపడింది. తమ ఆరోపణలకు ఆధారాలు చూపలేకనే వాళ్లు తోకముడిచారు అని నడ్డా ఎద్దేవా చేశారు. ఆర్జేడీది జంగిల్ రాజ్లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి గూండా, రౌడీ పార్టీ అనే ముద్ర ఉందని నడ్డా ఆరోపించారు. 2005కి ముందు బీహార్‌లో శాంతి భద్రతలు ఎలా ఉండేవి?. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు అప్పట్లో కిడ్నాప్, హత్యలకు గురైన సంగతి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సమయంలో అప్పటి సీఎం లాలూ నివాసంలోనే ఫిర్యాదులపై చర్చలు జరిగేవి కదా.. నడ్డా ఆరోపించారు. కానీ.. నితీశ్ కుమార్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ నుంచి బీహార్ ప్రజలకు విముక్తి కలిగించిందని నడ్డా అన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్ గణనీయంగా పురోగతి సాధించిందని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులూ బీహార్‌కు సమకూరుతున్నాయని నడ్డా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి ఆ అభివృద్ధిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేధావులకు నడ్డా విజ్ఞప్తి చేశారు. -
బిగ్‌బాస్ ఫేమ్ దివ్యపై హిట్ అండ్ రన్ కేసు.. ఏం జరిగిందంటే?
సాక్షి, యశవంతపుర: బిగ్‌బాస్ అనగానే వివాదాలు, గొడవలు గుర్తుకువస్తాయి. అదే మాదిరిగా బుల్లితెర నటి, గతంలో బిగ్‌బాస్–8 పోటీదారు దివ్య సురేశ్ హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకుంది. బైక్‌ను ఢీకొనడంతో ఓ యువతి కాలు విరిగినట్లు తెలిసింది. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల నాలుగో తేదీ అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బెంగళూరు బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కిరణ్, అనుషా, అనిత కలిసి బైకులో ఆస్పత్రికి వెళుతున్నారు. కుక్కలు అడ్డురావటంతో భయంతో కిరణ్ బైకును కొద్దిగా కుడివైపు తిప్పాడు. అదే సమయంలో వెనుక వేగంగా వస్తున్న దివ్య సురేశ్ కారు.. వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కింద పడ్డారు. అనిత కాలికు దెబ్బ తగిలింది. అయినా కూడా దివ్య కారు ఆపి ఏమైందో తెలుసుకోకుండా అలాగే ఉడాయించింది. రూ.2 లక్షలు ఖర్చయింది ఈ క్రమంలో కిరణ్ ఏడో తేదీన కారు హిట్ అండ్ రన్‌పై బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అది దివ్య సురేశ్ కారుగా గుర్తించారు. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు. అనిత కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్సగానూ రూ. 2లక్షలు ఖర్చయినట్లు, తమకు న్యాయం చేయాలని కిరణ్ ఫిర్యాదులో కోరాడు. Weeks after a late-night hit-and-run accident in Bengaluru, the city traffic police on Friday identified ex Bigg Boss Kannada contestant Divya Suresh as the alleged driver of the car involved in the accident that left three people injured. The accident took place near Nithya… pic.twitter.com/ucoigQ6FWn— Karnataka Portfolio (@karnatakaportf) October 24, 2025 -
క్లీన్ స్వీప్ మిస్.. బీజేపీకి ‘క్రాస్ ఓటింగ్’ విక్టరీ!
కేంద్ర పాలిత జమ్ము కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి(Jammu Rajya Sabha Results). అధికార నేషనల్ కాన్ఫరెన్స్ క్లీన్ స్వీప్ మిస్ అయ్యింది. నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలు ఇవే. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం(అక్టోబర్ 24వ తేదీన) ఓటింగ్ జరిగింది. 88 మంది ఎమ్మెల్యేలకు గానూ.. 86 మంది నేరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. కాంగ్రెస్, పీడీపీ, సీపీఐ(ఎం), ఏఐపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.ఎన్సీ తరఫున చౌదరి మహ్మద్ రంజాన్, సజ్జాద్ కిచ్లూ, జీఎస్ ఒబెరాయ్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సత్ పాల్ శర్మ(Sat Paul Sharma) విజేతలుగా నిలిచారని అసెంబ్లీ సెక్రటరీ ఎంకే పండిత తెలిపారు. भाजपा जम्मू कश्मीर अध्यक्ष श्री @iamsatsharmaca ने आज विधानसभा सचिवालय, श्रीनगर में राज्यसभा सांसद के रूप में विजय का प्रमाण पत्र चुनाव अधिकारी से प्राप्त किया। pic.twitter.com/pZul3mcCjF— BJP Jammu & Kashmir (@BJP4JnK) October 24, 2025నాలుగో సీటు కోసం నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఇమ్రాన్ నబీ, సత్ శర్మ పోటీ పడ్డారు. అయితే 32 ఓట్లతో శర్మ విజయం సాధించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. జమ్ము అసెంబ్లీలో బీజేపీకి కేవలం 28 సీట్లు మాత్రమే ఉండగా.. 4 అదనపు ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ఊహించినట్లుగానే.. స్వతంత్రులు వాళ్ల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ నాలుగు ఓట్లు ఎక్కడివి? అంటూ ఓ ట్వీట్ చేశారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ(Cross Voting For BJP) ఆ నలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక..All of @JKNC_ votes remained intact across the four elections, as witnessed by our election agent who saw each polling slip. There was no cross voting from any of our MLAs so the questions arise - where did the 4 extra votes of the BJP come from? Who were the MLAs who…— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2025డోడా నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద సెప్టెంబర్ 8, 2025న అరెస్ట్ అయ్యారాయన. ఆయన ప్రస్తుతం కథువా జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రం కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఛండీగఢ్, లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు. కాబట్టి వాటికి రాజ్యసభ స్థానాలు ఉండవు. అయితే.. 2020లో జమ్ము కశ్మీర్ రీజనల్ అసెంబ్లీ తిరిగి ఏర్పడింది. అందువల్ల ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికలు మళ్లీ అసెంబ్లీలోనే జరిగాయి. అంతా ఊహించినట్లుగానే అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. -
సదా సన్నద్ధంగా ఉండాలి
జైసల్మేర్: ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా మనం సొంతంగానే తిప్పికొట్టగలమని ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపించామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన ప్రత్యర్థులను ఏనాడూ తక్కువ అంచనా వేయొద్దని సైన్యానికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఎదురైనా గట్టిగా ప్రతిఘటించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. శుక్రవారం రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో సైనిక కమాండర్లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. భారత్–చైనా, భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతపై సమీక్ష నిర్వహించారు. అలాగే భారత సైనిక దళాల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పలు సూచనలు చేశారు. నేటి ఆధునిక యుగంలో సమాచార యుద్ధరీతిపై దృష్టి పెట్టాలని చెప్పారు. అత్యాధునిక రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ఇందుకోసం సైనిక దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత సైనిక శక్తికి ఆపరేషన్ సిందూర్ ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. మన సైనికుల బలం కేవలం ఆయుధాల్లోనే కాకుండా.. నైతిక క్రమశిక్షణ, వ్యూహాత్మకలో ఉందని పేర్కొన్నారు. ఇది మిలటరీ ఆపరేషన్‌గానే కాకుండా మనదేశ ధైర్యసాహసాలకు, సంయమనానికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని తేలి్చచెప్పారు. సమీక్షా సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పాక్ సరిహద్దులో ‘థార్ శక్తి’ విన్యాసాలు భారత్–పాకిస్తాన్ సరిహద్దులో జైసల్మేర్ జిల్లాలోని లాంగేవాలా బోర్డర్ పోస్టులో భారత సైన్యం ‘థార్ శక్తి’ శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. వందలాది మంది జవాన్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. డ్రోన్లు, రోబో జాగిలాలను, అత్యాధునిక ఆయుధాలను సైతం ప్రదర్శించారు. ఎడారి యుద్ధరీతిలో భారత సైన్యం ధైర్యసాహసాలు, సన్నద్ధతను రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. -
మహిళల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్
కొచ్చి: 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్(వికసిత్ భారత్) కల సాకారం అవ్వాలంటే మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. కేరళ రాష్ట్రం కొచ్చిలోని సెయింట్ తెరిసా కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో శుక్రవారం ఆమె మాట్లాడారు. మహిళా నేతలు ముందుండి నడిపే సమాజం మరింత మానవీయంగా కాదు, సమర్థంగానూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో మహిళలకు సంబంధించిన కేటాయింపులు నాలుగున్నర రెట్లు పెరిగాయన్నారు. 2011–2014 మధ్య కాలంలో పరిశ్రమల్లో మహిళల ప్రాతినిథ్యం రెట్టింపయిందన్నారు. వివిధ సామాజిక ఆర్థిక రంగాలకు చెందిన మహిళలు నేడు దేశ పురోగతిలో భాగస్వాములుగా మారారన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళ ముందంజలో ఉందని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ సభలోని 15 మంది మహిళా సభ్యుల్లో కేరళకు చెందిన అమ్ము స్వామినాథన్, అన్నీ మస్కరెనె, దాక్షాయణీ వేలాయుధన్ ఉండటం విశేషమన్నారు. వీరు సామాజిక న్యాయం, లింగ సమానత్వం, ప్రాథమిక హక్కులపై జరిగిన సంప్రదింపులు చురుగ్గా పాలుపంచుకున్నారని రాష్ట్రపతి గుర్తు చేశారు. కేరళకు చెందిన పలువురు మహిళలు వివిధ రంగాల్లో విశేష ప్రతిష్టను గడించారని అంటూ ఆమె..జస్టిస్ అన్నా చాందీ ఒక హైకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా పనిచేయగా, జస్టిస్ ఫాతిమా బీబీ 1989లో సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా నియమితులయ్యారన్నారు. సెయింట్ తెరిసా కాలేజీలో చదువుకున్న ఎందరో దేశ అభివృద్ధి, పురోగతిలో తమ వంతు భాగస్వాములుగా కీలకంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. నిరుపేదలకు సేవ చేస్తూ నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్న కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. వరద బాధితుల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి, విద్యార్థులు నిస్వార్థంగా సేవలందిస్తుండటం ఎంతో సంతోషకరమైన విషయమని ముర్ము తెలిపారు. సెయింట్ తెరిసా కళాశాల వంటి ఉన్నత విద్యాసంస్థల కృషితో భారత్ నాలెడ్జి సూపర్ పవర్‌గా మారనుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉగ్ర బాధితులను, కారకులను ఒకే గాటన కట్టరాదు
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి కారకులైన వారిని రక్షించేందుకు ఐరాస భద్రతా మండలిలో జరిగిన ప్రయత్నాలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి ఎండగట్టారు. వ్యూహం పేరుతో ఉగ్రదాడి బాధ్యులను, కారకులను ఒకే గాటన కట్టడం సరికాదని పేర్కొన్నారు. ఐరాస చర్యలు ఒక్కోసారి ఏకపక్షంగా మారుతున్నాయన్నారు. స్వయం ప్రకటిత ఉగ్రవాదులను ఆంక్షల ప్రక్రియ నుంచి కాపాడేందుకు ప్రయతి్నస్తుంటే నిజాయతీకి స్థానమెక్కడున్నట్లు?అంటూ జై శంకర్ ప్రశ్నించారు. తక్షణమే తగు రీతిలో సంస్కరణలను చేపట్టకుంటే ఐరాసతో ఎలాంటి ఫలితమూ ఉండదని స్పష్టం చేశారు. ఐరాస 80వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఎలాంటి అర్ధవంతమైన సంస్కరణను చేపట్టాలన్నా సంస్కరణ ప్రక్రియతోనే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సంస్కరణలను అమలు చేయడమే ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారిందన్నారు. ఉగ్రవాదంపై స్పందించే విషయంలో ఐరాస ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జై శంకర్ అన్నారు. అమానవీయమైన పహల్గాం ఉగ్రదాడిని ఖండించే విషయంలో ఐరాస భద్రతా మండలిలో తీర్మానానికి సాక్షాత్తూ కౌన్సిల్ సభ్యుడే అభ్యంతరం తెలిపారంటూ పరోక్షంగా ఆయన పాక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లష్కరే తోయిబా ముసుగు సంస్థే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్). పహల్గాంలో దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించుకుంది. అయితే, మండలిలో సభ్యురాలిగా కొనసాగుతున్న పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వెలువరించిన తీర్మానంలో టీఆర్ఎఫ్ ప్రస్తావన లేకుండా చేయడం గమనార్హం. గతంలో పలుమార్లు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను శాశ్వతసభ్య దేశమైన చైనా అడ్డుకుంది. అందుకే, ఉగ్రవాదులను ఆంక్షల చట్రం నుంచి కాపాడేందుకు ప్రయతి్నస్తున్నారంటూ జై శంకర్ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలు కేవలం మాటలకే పరిమితమైన పక్షంలో అభివృద్ధి, సామాజిక–ఆర్థిక పురోగతి మరింత అథోగతికి చేరుకుంటాయన్నారు. ఏదేమైనా ఈ సంక్షోభ సమయంలో ఐక్యరాజ్యసమితికి భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అభివృద్ధి, పురోగతితోపాటు శాంతి, భద్రతలకు భారత్ ప్రాధాన్యమిస్తుందన్నారు. ఐరాస 80వ అవతరణ దినోత్సవం సందర్భంగా జై శంకర్ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. -
దేశ నిర్మాణంలో యువత కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనియువతకు సాధికారిత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత విజయమే, దేశం విజయమని ప్రధాని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన 17వ రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 51 వేల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. పండుగ వేళ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ప్రధాని తెలిపారు. ‘పండుగ ఉత్సాహం, ఉద్యోగం పొందిన విజయం.. ఈ రెండూ కలిసి 51 వేల మందికి పైగా యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. ఈ కొత్త ఆరంభం సందర్భంగా వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు’అని మోదీ పేర్కొన్నారు. నాగరిక్ దేవో భవ మరవద్దు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ రోజు మీరు పొందినవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావు, ఇవి దేశ నిర్మాణంలో చురుకుగా పాల్గొనేందుకు లభించిన అవకాశాలు. కొత్తగా నియమితులైన మీరంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తారని, భవిష్యత్ భారతం కోసం మెరుగైన వ్యవస్థలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని అన్నారు. ‘నాగరిక్ దేవో భవ’(పౌరుడే దైవం) అనే మంత్రాన్ని ఎప్పటికీ మరవవద్దని, సేవాభావం, అంకితభావంతో పనిచేయాలని ఆయన యువ కర్మయోగులకు సూచించారు. 3.5 కోట్ల మంది లక్ష్యం ‘వికసిత భారత్ నిర్మాణం అనే సంకల్పంతో గత 11 ఏళ్లుగా దేశం ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో యువతదే ప్రధాన పాత్ర’అని ప్రధాని నొక్కి చెప్పారు. యువ సాధికారతకు తమ ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ‘యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో రోజ్‌గార్ మేళాలు శక్తివంతమైన మాధ్యమంగా మారాయి. ఇటీవలి కాలంలో ఈ మేళాల ద్వారానే 11 లక్షలకు పైగా నియామక పత్రాలను జారీ చేశాం’అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ‘పీఎం వికసిత భారత్ రోజ్‌గార్ యోజన’ద్వారా 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు. స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి వేదికలు యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని అన్నారు. ప్రతిభావంతుల కోసం యువత కోసం చేపట్టిన మరో కీలకమైన ‘ప్రతిభా సేతు పోర్టల్’గురించి ప్రధాని మోదీ ప్రకటించారు. ‘యూపీఎస్సీ తుది జాబితా వరకు చేరుకుని, ఎంపిక కాని అభ్యర్థులకు ఈ పోర్టల్ అవకాశాలు కల్పిస్తుంది. వారి ప్రతిభ వృథా కాదు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పుడు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈ ప్రతిభావంతుల సేవలను వినియోగించుకుంటున్నాయి. యువత ప్రతిభను ఇలా సద్వినియోగం చేయడం ద్వారా భారత యువశక్తి ప్రపంచానికి తెలుస్తుంది’అని మోదీ అన్నారు. పండుగ సీజన్‌కు కొత్త ఊపు జీఎస్టీ సంస్కరణలు పండుగ సీజన్‌కు కొత్త ఊపునిచ్చాయని ప్రధాని అన్నారు. ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్ కారణంగా నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దీంతో డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్ ఉత్పత్తిని, సప్లై చెయిన్లను వేగవంతం చేసింది. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి పెరిగితే కొత్త ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల, జీఎస్టీ బచత్ ఉత్సవ్.. ‘ఉపాధి ఉత్సవ్’గా కూడా మారుతోంది’అని ప్రధాని విశ్లేషించారు. ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా నమోదైన రికార్డు స్థాయి అమ్మకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. విదేశాంగ విధానం.. యువత కోసమే: ‘భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత యువ దేశం. ఈ యువశక్తే మన గొప్ప ఆస్తి’అని మోదీ అన్నారు. విదేశాంగ విధానాన్ని కూడా భారతీయ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రూపొందిస్తున్నామన్నారు. యూకే, యూరప్, బ్రెజిల్, సింగపూర్, కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాలతో ఏఐ, ఫిన్‌టెక్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు యువతకు శిక్షణ, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘కొత్తగా నియమితులైన ఈ యువ కర్మయోగులు ’వికసిత భారత్’సంకల్పాన్ని నెరవేర్చడంలో ముందుండాలి. ఇందుకోసం ‘ఐ–గాట్ కర్మయోగి భారత్ ప్లాట్‌ఫామ్’ద్వారా నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీ ప్రయత్నాల ద్వారానే భారతదేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. -
14న బిహార్‌కు అసలైన దీపావళి
సివాన్: బిహార్ ప్రజలు నవంబర్ 14వ తేదీన అసలైన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఆర్జేడీతోపాటు మహాగఠ్ బంధన్ కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సివాన్ జిల్లాలో శుక్రవారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. లాలూ ప్రసాద్ సారథ్యంలోని ఆర్జేడీ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత మహ్మద్ షహబుద్దీన్ కుమారుడు ఒసామా షాహాబ్‌కు టికెట్ ఇవ్వడంపై అమిత్ షా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో షహబుద్దీన్ కుమారుడిని ఘోరంగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లాలూ ప్రసాద్, రబ్డీదేవిల ఇరవయ్యేళ్ల జంగిల్ రాజ్‌ను సివాన్ వాసులు చవిచూశారని విమర్శించారు. లాలూ మళ్లీ జంగిల్ రాజ్ తేవాలనుకుంటున్నారని ఆరోపించారు. నవంబర్ 14వ తేదీన ప్రకటించే ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ, ఆ పార్టీ మిత్రపక్షాలను అవమానకర రీతిలో ఓడించి, బిహార్ ప్రజలు అసలైన దీపావళిని జరుపుకోవడం ఖాయమని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
అప్పట్లో ఆర్జేడీతో పొత్తు తప్పే: నితీశ్
సమస్తీపూర్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో బిహార్ అభివృద్ధి చెందుతోందని జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేకే ఓటేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సమస్తీపూర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. 1997లో దాణా కుంభకోణంలో కేసు నమోదు కావడంతో గతంలో లాలూ సీఎం పదవి నుంచి వైదొలిగి, భార్య రబ్డీదేవికి బాధ్యతలను అప్పగించడాన్ని నితీశ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని లాలూ అధోగతి పాల్జేశారన్నారు. ఆయన ఇప్పటికీ మారలేదు. అప్పట్లో భార్యకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన లాలూ, కుమారులు, కుమార్తెలకు అధికారం కట్టబెట్టేందుకు మళ్లీ తెరపైకి వచ్చారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. ఆయన పా ర్టీతో స్వల్పకాలం మైత్రి సాగించా. అది తప్పని ఆ తర్వాత తెలుసుకుని, ఆ కూటమి నుంచి బయటకు వచ్చి తిరిగి బీజేపీతో మైత్రి కొనసాగించా’అంటూ నితీశ్ చెప్పుకొచ్చారు. -
హెచ్‌టీటీ–40 టెస్టు సక్సెస్
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారుచేసిన మొట్టమొదటి దేశీయ శిక్షణ విమానం హిందూస్తాన్ టర్బో ట్రైనర్–40(హెచ్‌టీటీ–40) ఆకాశంలో విజయవంతంగా దూసుకెళ్లింది. ఎలాంటి లోపాలు లేకుండా విమా నం అద్భుతమైన స్థిరత్వాన్ని, పనితీరును కనబర్చినట్లు హెచ్ఏఎల్ అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం బెంగళూరులో ఈ విమానాన్ని పరీక్షించారు. హెచ్‌టీటీ–40 అనేది బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పైలట్లకు ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనిద్వారా వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించవచ్చు. సైనిక విన్యాసాలు చేపట్టవచ్చు. రాత్రిపూట కూడా పనిచేస్తుంది. హెచ్‌టీటీ–40ని పూర్తిగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసింది. ఇందులో అత్యాధునిక వసతులున్నాయి. ఈ విమానంతో తక్కువ ఖర్చుతోనే పైలట్లకు శిక్షణ ఇవ్వొ చ్చు. దేశీయంగానే రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందని హెచ్ఏఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైమానిక దళంలో పాత కాలం నాటికి విమానాలతోనే శిక్షణ ఇస్తున్నారు. వీటి స్థానంలో ఇకపై హెచ్‌టీటీ–40 విమానాలను ప్రవేశపెట్టబోతున్నారు. -
రికార్డులు బద్దలు కొడతాం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విజయం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిని బెయిల్‌పై బయటకు వచ్చిన నేరగాళ్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో సుడిగాలి పర్యటనలు చేశారు. జన నాయక్, భారతరత్న కర్పూరీ ఠాకూర్ సొంత గ్రామాన్ని సందర్శించారు. సమస్తీపూర్, బెగూసరాయ్ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. సొంత ప్రయోజనాలు మాత్రమే కాపాడుకొనే ‘ఇండియా’ కూటమిని పక్కనపెట్టాలని, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ శ్రేణులు ‘జన నాయక్’ అని సంబోధించడాన్ని మోదీ తప్పుపట్టారు. జన నాయక్ అంటే కర్పూరీ ఠాకూర్ మాత్రమేనని స్పష్టంచేశారు. కర్పూర్ ఠాకూర్‌కు ప్రజలిచి్చన బిరుదును దొంగిలించే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. సుపరిపాలనను ఆదరించాలి ‘‘2005లో బిహార్ ప్రజలు జంగిల్‌రాజ్‌కు ముగింపు పలికారు. ఆర్జేడీ–కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేశారు. ఈ విషయం ఇప్పటి యువత తెలుసుకోవాలి. యువత భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉంది. సుపరిపాలనను ఆదరించాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గుజరాత్, మధ్యప్రదేశ్, హరియాణాతోపాటు మహారాష్ట్రలోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో సైతం పాత రికార్డులను తిరగరాయడం తథ్యం. నయీ రఫ్తార్ సే చలేగా బిహార్, జబ్ ఫిర్ సే ఆయేగీ ఎన్డీఏ సర్కార్(ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వస్తే బిహార్ కొత్త వేగంతో ముందుకెళ్తుంది) వారిలో అహంకారం తగ్గలేదు విపక్ష ఇండియా కూటమిలో కీచులాటలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. అది మహాగఠ్‌బంధన్ కాదు.. మహాలాఠ్‌బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు అత్యంత అవినీతిపరులు. వారంతా బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. దశాబ్దాలుగా అధికారంలో లేకున్నా వారిలో అహంకారం తగ్గలేదు. సొంత కూటమిలోని పారీ్టలను బయటకు తరిమేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. జంగిల్‌రాజ్ వల్ల మహిళలు ఎంతగానో నష్టపోయారు. బాధితులుగా మిగిలారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే పార్లమెంట్లో కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు వ్యతిరేకించారు. ఆ నాయకులు ఓట్ల కోసం వస్తే తలుపులు మూసివేయండి. మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి లేదు. నిజానికి ఆ నాయకులే అసలు సమస్య. గతంలో వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేశారు. ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. అప్పటి పాలకులు ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్నారు. కానీ, యువతకు ఉపాధి కలి్పంచలేదు. జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు ఎన్డీఏ విముక్తి కలి్పంచింది. ప్రస్తుతం బిహార్ ప్రజలకు లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) అవసరం లేదు. ఇప్పుడు వారి మొబైల్ ఫోన్లలో ఫ్లాష్లైట్లు ఉన్నాయి.నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం కేంద్రంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో బిహార్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. యూపీఏ పాలనతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా నిధులు అందజేశాం. కనీస అవసరాల కోసం ఒకప్పుడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన బిహార్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. చేపలు, మఖానాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. బిహార్ రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేశాం. మఖానా సాగు, మార్కెటింగ్‌కు దోహదపడుతోంది. బిహార్‌లో నక్సలిజం సమస్య చాలావరకు తగ్గిపోయింది. గతంలో దాదాపు 18 జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉండేది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం. ఇదీ నా గ్యారంటీ. పరివార్ వల్ల సీతారాం కేసరికి అవమానాలు పేద కుటుంబంలో జని్మంచిన నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానంటే అందుకు కర్పూరీ ఠాకూర్ ఇచి్చన స్ఫూర్తే కారణం. పేదలు కూడా కష్టపడి పనిచేసి ఉన్నతులుగా మారగలరని ఆయన నిరూపించారు. బిహార్‌కు గర్వకారణమైన సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. వెనుకబడిన తరగతికి చెందిన కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. కానీ, పరివార్(నెహ్రూ–గాంధీ కుటుంబం) వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనను బాత్రూమ్లో బంధించారు. అనంతరం వీధుల్లోకి నెట్టేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయన నుంచి దొంగిలించారు’’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన పట్ల నిరంతరం విశ్వాసం వ్యక్తం చేస్తున్నందుకు బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, వస్తువుల ధరలు తగ్గిపోయాయని చెప్పారు. రాబోయే ఛత్ పండుగతోపాటు ఆదా(బచత్) ఉత్సవం కూడా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. -
భారత్ పక్కలో చైనా మిసైల్ బల్లెం
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్‌కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్‌ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్‌ను మొదట అమెరికాకు చెందిన ఆల్సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్‌ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్‌కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్‌లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్‌లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్‌క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్‌ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్కు చెందిన ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్ఐఎన్టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు. -
రూ. 25 లక్షల ప్రశ్న.. ఆన్సర్ తెలుసా?
భారతదేశంలోని అజ్మీర్‌లోని మాయో కళాశాలలో 1920లలో చదివి, 1932 నుంచి 1970 వరకు ఒమన్‌ను పాలించిన సుల్తాన్ ఎవరు?ఎ. తైమూర్ బిన్ ఫైసల్ బి. హైతం బిన్ తారిక్సి. సయీద్ బిన్ తైమూర్డి. తుర్కి బిన్ సయీద్దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతిలో (Kaun Banega Crorepati) అడిగిన 25 లక్షల రూపాయల ప్రశ్న ఇది. తన ముందు హాట్సీట్లో కూర్చున్న శివ చోహాన్‌ను ఆయన ఈ ప్రశ్న అడిగారు. ఇంతకీ ఆయన సమాధానం చెప్పారా, రూ.25 లక్షలు గెలుచుకున్నారా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా?ప్రస్తుతం కేబీసీ 17 సీజన్ (KBC 17) నడుస్తోంది. చాలా మంది ఇందులో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన శివ చోహాన్‌ను షోలో పాల్గొన్నారు. ఏటీఎం అథరైజర్గా పనిచేస్తున్న ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, ఆర్థిక ఇక్కట్లను వివరించారు. చదువుకుంటూనే కూరగాయలు అమ్మానని, ఏటీఎంలో పనిచేశానని చెప్పారు. పుస్తకాలు అమ్మడం తాను చేసిన మొదటి ఉద్యోగమని.. పుస్తకాల కారణంగానే తాను కేబీసీలో కనిపించగలిగానని వెల్లడించారు. ట్యూషన్‌కు డబ్బు లేకపోవడంతో శివ చోహాన్ తనకు ట్యూటర్‌గా మారాడని ఆయన సోదరి చెప్పారు.కౌన్ బనేగా కరోడ్‌పతిలో గెలిచిన డబ్బులతో ఏంచేస్తారని అమితాబ్ ప్రశ్నించగా.. ''నా తల్లి ఆరోగ్యం కోసం వెచ్చిస్తానని శివ చోహాన్ సమాధానమిచ్చారు. గతంలో ఇంట్లో జరిగిన ఒక విషాదకర ఘటన కారణంగా మా అమ్మకు 80 శాతం కాలిన గాయాలు అయ్యాయి. అమ్మకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ అప్పట్లో మా వద్ద అంత డబ్బు లేదు. సరైన చికిత్స చేయించకపోవడంతో అమ్మ ఆరోగ్యం క్షీణించింది. గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలయ్యాయి. కేబీసీలో నేను ఎంత ప్రైజ్‌మనీ గెలిచినా అదంతా అమ్మ చికిత్స కోసమే ఖర్చుపెడతాన''ని శివ చెప్పారు.ఇక గేమ్‌లోని ఎంటరైన శివ చోహాన్ (Shiva Chohan) ఆడియన్స్, లైఫ్‌లైన్ సహాయంతో చివరకు పన్నెండున్నర లక్షల రూపాయలు గెల్చుకున్నాడు. మరో ప్రశ్నకు సమాధానం చెప్పివుంటే అతడు 25 లక్షల రూపాయలు గెలిచేవాడు కానీ, సమాధానం తెలియకపోవడంతో అక్కడితో నిష్క్రమించాడు. అయితే తర్వాత అతడు చేసిన గెస్ సరైన సమాధానం అని తేలింది. పైన అడిగిన ప్రశ్నకు సమాధానం C అని కరెక్టుగానే ఊహించాడు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు! -
పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్‌పై విడుదలైనారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు. చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలంఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్‌పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్‌యాక్టివ్‌గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్అయిన సంగతి తెలిసిందే.చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే! -
‘స్లీపర్’లోనే ఎందుకీ ప్రమాదాలు?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడగా, 27 మంది ప్రాణాలతో బతికిబయటపడ్డారు. అయితే బస్సులు అగ్ని ప్రమాదాలకు గురైన సమయంలో అత్యధికంగా ప్రాణానష్టమే కన్పిస్తుంది. ప్రధానంగా ప్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైందంటే ప్రాణనష్టం అనేది భారీగా ఉంటుంది. పది రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటనేది ఒక్కసారి చూస్తే..!డ్రైవర్లకు అలసట.. నిద్రమత్తుసుమారు 250 కిలోమీటర్ల నుంచి 1,000 కి.మీ దాటే వరకూ కూడా ఎక్కువగా ప్రయాణికులు స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ డ్రైవర్లకు అలసట అనేది కీలకంగా మారుతుంది. డ్రైవర్లు అలసట బారిన పడి, నిద్ర మత్తులోకి జారుకోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2018లో నిర్వహించిన ఓ సర్వేలో.. తాము డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తుకు లోనవుతున్నట్లు 25 శాతం మంది డ్రైవర్లు ఏడేళ్ల నాడు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. డిజైన్ సురక్షితమేనా?స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డిజైన్ లోపం కూడా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. బస్సులో పడుకోవడానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, బస్సులో బెర్త్‌లు, సీట్ల మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సింగిల్ మనిషి మాత్రమే వెళ్లేలా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇది కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకర్ని తోసుకుంటూ ఇంకొకరు వెళ్లడం మరింత గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు కూడా కారణమయ్యే చాన్స్‌లు కూడా అత్యధికంగా అనేది నిపుణులు అభిప్రాయం. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఎత్తు కూడా మరొక సమస్య. వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా ఉంటుంది. రెండు-మూడు నిమిషాల్లో బయట పడితేనే..బస్సు ప్రమాదం జరిగినప్పుడు చాలా స్వల్ప సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రెండు, మూడు నిమిషాల్లో తప్పించుకుంటే ప్రాణాలతో బయటపడుతున్నారు. లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. స్లీపర్ బస్సులు సాధారంగా ఏసీ బస్సులే అధికంగా ఉంటాయి. ఏసీ బస్సుల్లో ప్రమాదం జరిగితే డోర్స్ ఓపెన్ కావడం కూడా కష్టమే. ఏమైనా అద్దాలు బ్రేక్ చేయాలంటే కూడా ఎంతో కొంత సమయం ఉండాలి. అంటే ఇక్కడ మేల్కొని ఉన్న ప్రయాణికులే ఎంతో కొంత ప్రతిఘటించి బయటకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఆ కంగారు, తొందరలో మిగతా వారిని నిద్ర లేపే చాన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. నిద్ర నుంచి ప్రయాణికులు మేల్కొనే సరికి వారు ప్రమాదంలో చిక్కుకుని కొట్టుమిట్లాడుతున్న ఘటనలే మనకు తరచు కనిపిస్తూ ఉన్నాయి. చైనాలో అందుకే నిషేధించారా?చైనా స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు రక్షణ లేకపోవడం, సురక్షితంగా బయటపడే అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది. చైనా, జర్మనీ వంటి దేశాలు స్లీపర్ బస్సులపై నిషేధం విధించగా, భారత్‌లో మాత్రం ఇంకా కఠిన చర్యలు తీసుకోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి:కర్నూలు శివారులో ఘోరం.. -
మహాఘట్బంధన్కు మోదీ కౌంటర్.. బిహార్‌పై కీలక ప్రకటన
సమస్తిపూర్: వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలుకొడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఆయన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. "ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్... ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్" అని బిహార్ ప్రజలు అంటున్నారన్నారు.నితీశ్ కుమార్‌ను 'సుశాసన్ బాబు' అనే ప్రజాదరణ పొందిన బిరుదు పేరుతో మోదీ ప్రస్తావించారు. మొదటిసారి నితీశ్ కుమార్‌ను ఎన్డీయే ప్రచార ముఖంగా ప్రస్తావించారు. అయితే, ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి అనే మాట ప్రస్తావించకుండానే.. ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ తేజస్వి సవాల్‌పై ప్రధాని మోదీ స్పందించినట్లయింది.కాగా, బీజేపీ.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో వెనుకడుగు వేస్తోందంటూ మహాఘట్బంధన్ విమర్శించింది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందంటూ తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి?’’ అంటూ తేజస్వీ ధ్వజమెత్తారు. -
అరచేతిపై సూసైడ్ నోట్ రాసి... వైద్యురాలు బలవన్మరణం
సతారా: మహారాష్ట్రలో ఓ సబ్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్తన్ తహసీల్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉంటున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రాజకీయ దుమారం డాక్టర్ ఆత్మహత్య ఘటన మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతోంది. హోంశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సతారా ఎస్పీ తుషార్ దోషీకి ఫోన్‌చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్ఐని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉండటంతో వారికోసం గాలిస్తున్నట్లు తుషార్ దోషీ తెలిపారు. డాక్టర్ ఆత్మహత్య ఘటన చాలా తీవ్రమైన అంశమని మహారాష్ట్ర శాసనమండలిలో డిప్యూటీ చైర్పర్సన్ నీలమ్గోర్హే అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్‌ను కోరినట్లు తెలిపారు. సతారా సివిల్ సర్జన్‌తో తాను మాట్లాడానని, వేధింపుల గురించి మృతురాలు తమకేమీ ఫిర్యాదు చేయలేదని సర్జన్ చెప్పినట్లు రాష్ట ఆరోగ్యశాఖ సహాయమంత్రి మేఘన బోర్డికర్ చెప్పారు. సతారా ఘటనపై సతారా పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మీడియా న్యాయ విచారణ జరపటం మానుకోవాలని మరో మంత్రి పంకజ ముండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫడ్నవీస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఆరోపించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు సిట్‌ను ఏర్పాటుచేయాలని శివసేన యూబీటీ నేత సుష్మఅంధరే డిమాండ్ చేశారు. తీవ్రంగా వేధించారు మృతురాలిని ఆమె ఉన్నతాధికారులతోపాటు నిందితులు తీవ్ర వేధింపులకు గురిచేశారని డాక్టర్ బంధువు ప్రయాగ ముండే ఆరోపించారు. ‘ఆమె ఎంతో తెలివైంది. గొప్ప ఆశయాలు కలిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆమెను మేమే పెంచి, చదివించాం. విధి నిర్వహణలో ఆమె తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంది. తప్పుడు పోస్ట్‌మార్టం నివేదికలు ఇవ్వాలని ఆమెపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితులు కఠినంగా శిక్షించాలి’అని డిమాండ్ చేశారు. పనిచేసే చోట సీనియర్లు వేధిస్తున్నారని రెండురోజుల క్రితమే మృతురాలు తమకు తెలిపిందని మరో బంధువు వెల్లడించారు. నిందితుడికి చివరి ఫోన్‌కాల్ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు వైద్యురాలి నిందితుల్లో ఒకడైన ప్రశాంత్ బంకర్‌కు ఫోన్‌చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ ఫోన్లో చాటింగ్ చేశారని వెల్లడించారు. అయితే, ఆ సందేశాల్లో ఏముంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
అడ్వర్టైజింగ్ దిగ్గజం పీయూష్ కన్నుమూత
ప్రచార రంగ దిగ్గజం పీయూష్ పాండే(70) ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన పాండే ‘ఫెవికాల్, క్యాడ్బెరీ, ఆసియన్ పెయింట్స్..’ ఇలా ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు, పలు ప్రభుత్వ కార్యక్రమాల క్యాంపెయిన్లకు ప్రచార స్లోగన్స్ రూపొందించారీయన. భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా పీయూష్ పాండేకి గుర్తింపు ఉంది. పీయూష్ 1955లో జైపూర్(రాజస్థాన్)లో జన్మించారు. ఆ కుటుంబంలో తొమ్మిది మంది సంతానం. ఆయన సోదరుడు ప్రసూన్ పాండే ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్. సోదరి ఇలా అరుణ గాయని-నటి. క్రికెట్లో రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించిన పీయూష్ పాండే.. కన్స్ట్రక్షన్ రంగంలో కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచి అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 1982లో ఒగిల్వీ ఇండియా Ogilvy Indiaలో చేరి.. మొదట క్లయింట్ సర్వీసింగ్ విభాగంలో పని చేశారు. ఆ తర్వాత క్రియేటివ్ విభాగంలోకి మారిపోయి.. అంచెలంచెలుగా ఎదిగి కీలక పదవులను చేపట్టారు. ఆయన సారథ్యంలో.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే బావోద్వేగాలకు ముడిపెట్టి ఎన్నో ప్రకటనలు రూపొందించారు. పాక్-భారత్ బార్డర్ బ్యాక్‌డ్రాప్‌తో ఫెవికిక్ ‘తోడో నహీ జోడో’ యాడ్, క్యాడ్బెరీ డెయిలీ మిల్క్ “कुछ खास है” యాడ్, వోడాఫోన్ హచ్ డాగ్ వినూత్న ప్రచారాలు ఆకట్టుకున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి కోసం అబ్కీ బార్ మోదీ సర్కార్ అనే ప్రచార స్లోగన్‌ను రూపొందించింది ఈయనే కావడం గమనార్హం. అంతేకాదు.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ‘పల్స్‌పోలియో’ యాడ్‌ను స్వయంగా తీర్చిద్దిద్దారు. అడ్వైర్టైజింగ్ రంగంలో ఈయన అందించిన సేవలకుగానూ 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 2024లో ఎల్ఐఏ లెజెండ్ అవార్డు ఆయన్ని వరించింది.పీయూష్ పాండే మృతిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ‘‘పీయూష్ పాండే భారతీయ ప్రకటనల రంగాన్ని కొత్త దిశలో నడిపించిన సృజనాత్మక మేధావి. ఆయన రూపొందించిన ప్రకటనలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. ఆయన మృతి భారతీయ క్రియేటివ్ ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, Ogilvy India టీమ్‌కు నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు స్మృతి ఇరానీ, ఆనంద్ మహీంద్రా, ఉదయ్ కోటక్ లాంటి వ్యాపారవేత్తలూ ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు.వైఎస్ జగన్ దిగ్ర్భాంతివైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి.అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు. Truly at a loss for words to express my sadness at the demise of Padma Shri Piyush Pandey.A phenomenon in the world of advertising, his creative genius redefined storytelling, giving us unforgettable and timeless narratives.To me, he was a friend whose brilliance shone… pic.twitter.com/t6ZDSViCrS— Piyush Goyal (@PiyushGoyal) October 24, 2025 -
దేశరాజధానిలో భారీ ఉగ్రకుట్ర భగ్నం!
సాక్షి, ఢిల్లీ: భారీ ఉగ్రకుట్రను దేశ రాజధాని పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు ఐసిస్(ISIS) ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఒకరు, సౌత్ ఢిల్లీలో మరొకరికి అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఇద్దరూ దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడులకు కుట్రలు పన్నారని వెల్లడించారు. ఢిల్లీ-భోపాల్ పోలీసులు సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బోఫాల్‌కు చెందిన అద్నాన్‌తో పాటు దక్షిణ ఢిల్లీకి చెందిన మరొక వ్యక్తిని ఐఈడీ బాంబులను తయారు చేస్తుండగా పట్టుకున్నారు. వీళ్లిద్దరి నుంచి పేలుడు పదార్థాలకు చెందిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో జనసంచారం అత్యధికంగా ఉన్న ప్రాంతంలోనే వీళ్లు పేలుడుకు ప్రణాళిక రచించినట్లు తెలిందన్నారు. -
క్లైమాక్స్‌లో ఆపరేషన్ కగార్?!
సాక్షి, చత్తీస్‌గఢ్: మావోయిస్టుల లొంగుబాటు యాత్ర చివరి అంకానికి చేరిందా?. ఆపరేషన్ కగార్‌లో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోందా?. మావోయిస్టు పార్టీ కీలక నేత, మోస్ట్‌వాంటెడ్, మావోయిస్టు పార్టీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా(madavi Hidma) లొంగిపోబోతున్నారా??. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ ప్రచారంపై స్పందించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా లొంగిపోతున్నారనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుమారు 200 మంది అనుచరులతో కలిసి హిడ్మా లొంగుబాటు కానున్నారనేది ఆ ప్రచార సారాంశం. ఈ ప్రచారంపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు స్పందించారు. హిడ్మా లొంగుబాటు విషయంపై జరిగేదంతా ఉత్త ప్రచారమేనని కొట్టిపారేశారు. అయితే.. హిడ్మా లొంగిపోతే మంచి పరిణామమేనని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పధకం కింద ఆయనకు రావాల్సిన రివార్డ్ నగదును ఆయనకే అందజేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆశన్న తమ దళాలతో లొంగిపోయారు. దీంతో వాళ్లను ఉద్యమ ద్రోహులుగా మావోయిస్టు పార్టీ అభివర్ణిస్తూ ఓ లేఖ రాసింది. నిజంగానే.. హిడ్మా గనుక లొంగిపోతే మావోయిస్టు పార్టీ కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు.ఎవరీ హిడ్మా.. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో.. అత్యధిక దళ సభ్యులు(మల్లా, నిషాద్ వర్గాల ప్రజలు) ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఉంది. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా పేరు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంది. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించినట్టు సమాచారం. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫొటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.సంబంధిత కథనం: చదివింది ఐదో తరగతి! పాతికేళ్లకే తుపాకీ పట్టి.. -
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటన విచారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మృతులకు సంతాపం ప్రకటించారు.The loss of lives in a tragic bus fire accident in Kurnool, Andhra Pradesh is deeply unfortunate. I extend my heartfelt condolences to the bereaved family members and pray for the speedy recovery of those injured.— President of India (@rashtrapatibhvn) October 24, 2025ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని కార్యాలయం.. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, క్షతగాత్రులకు 50వేల తక్షణ సాయం ఇవ్వనున్నట్టు తెలిపింది. Extremely saddened by the loss of lives due to a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…— PMO India (@PMOIndia) October 24, 2025 -
ఓటుకు రూ.80 వసూలు.. ఓట్ చోరులను గుర్తించిన కర్నాటక సిట్
బెంగళూరు: 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ల్లో అలంద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోప లు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తెలిపింది. ఓటర్ల పేర్లను తొలగించే కుంభకోణంతో కనీసం ఆరుగురికి సంబంధమున్నట్లు గుర్తించింది.ఇక, వీరికి ఓ డేటా సెంటర్‌తో సంబంధాలున్నాయని, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ ద్వారా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించారని సిట్‌కు సారథ్యం వహించిన సీఐడీ అద నపు డీజీ బీకే సింగ్ చెప్పారు. పేర్లను తొలగించాలంటూ అందిన మొత్తం 6,994 అభ్యర్థన ల్లో ఏవో కొన్ని మినహా చాలామటుకు బోగస్ వేనని గుర్తించామన్నారు. అలంద్‌లో ఓటర్ల తొలగింపునకు కుట్ర జరిగింది వాస్తవమని చెప్పారు. మొత్తం 30 మంది వరకు ప్రశ్నించి, అనుమానితులుగా ఆరుగురిని నిర్ధారించామని, వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని వివరించారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిపామన్నారు.ఇందులో అప్పట్లో అలంద్‌లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన సుభాష్ గుత్తేదార్, ఆయన ఇద్దరు కుమారుల ఇళ్లు కూడా ఉన్నాయన్నారు. సోదాల సమయంలో సుభాష్ ఇంటికి సమీపంలో కాలిపోయిన ఓటరు జాబితాలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు. అయితే, దీపావళి సందర్భంగా తమ సిబ్బంది వృథా వస్తువులను తొలగించే క్రమంలో పనికి రాని ఓటరు జాబితాలను సైతం కాల్చేశారని సుభాష్ గుత్తేదార్ వివరించారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదన్నా రు.ఇలా ఉండగా, అలంద్ నియోజకవర్గం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి పరిధిలోనిదే కావడం గమనార్హం. అలంద్‌లో ఓట్ చోరీ జరిగినట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ ఇటీవల చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై దర్యాప్తు కోసం కర్నా టకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. కాగా, అలంద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగాయని మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం ఆరోపించారు. వాటిపైనా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. ఈ ముఠా ఓటుకు రూ.80 చొప్పున వసూలు చేసిందన్నారు. ఇదంతా బీజేపీ నేతలు పాల్పడిన కుంభకోణమేనన్నారు. బాధ్యులను కటకటా ల్లోకి నెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పట్లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి అడ్డుకోవడం వల్లే ఓట్ల తొలగింపు కుంభకోణానికి బ్రేకులు పడ్డాయని అలంద్‌లో 10వేల ఓట్ల తేడాతో గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ పాటిల్ తెలిపారు. -
నేడు బిహార్‌కు మోదీ, అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా బిహార్ లో పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రక టించిన తర్వాత తొలిసారి మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అమిత్ షాకు ఇది రెండో పర్యటన. ఎన్డీయే తరఫున శుక్రవారం ఈ ఇద్దరు నేతలు మొత్తం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారత రత్న, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ సొంత జిల్లా సమస్తిపూర్ నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం.. బెగుసరాయ్‌లో మరో బహిరంగ సభలో పాల్గొంటారు. హోం మంత్రి అమిత్ షా సివాన్, బక్సర్‌ల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన కూడా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముజఫర్‌పూర్, ఛప్రాలలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇద్దరు కీలక నేతలు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతుందని, ఎన్డీయే ప్రచారానికి మరింత ఊతం ఇస్తాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. 28న మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టో విడుదలబిహార్ ఎన్నికల కోసం మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టోను ఈ నెల 28న పట్నాలో విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి దశ పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆ తర్వాత రెండో దశ ఎన్నికల కోసం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఛత్ పూజ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రి యాంకా గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటారని మహా కూటమి వర్గాలంటున్నాయి. -
కొత్త సీజేఐ ఎంపిక ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం మొదలుపెట్టింది. నవంబర్ 23వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. తదుపరి సీజేఐగా మీరు ఎవరిని సిఫార్సు చేస్తారో తెలపాలంటూ ప్రభుత్వం నుంచి అధికారిక లేఖ గురువా రం లేదా శుక్రవారం లోపు జస్టిస్ బీఆర్ గవాయ్‌కు చేరుకోనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియలో ఇదే విధానాన్ని అమలుచేస్తుండటం తెల్సిందే. సీజే దిగిపోయాక ఆయా కోర్టుల్లో అత్యంత సీనియర్ జడ్జీనే సీజేగా సిఫార్సుచేసే సంప్రదాయం కొనసాగుతోంది. ఇదే విధానాన్ని పాటిస్తూ కేంద్ర న్యాయ శాఖ సీజేఐకి కొత్త సీజేఐ ఎంపిక కోసం తగు గడువు ఇచ్చే అవకాశముందని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. ప్రస్తుత సీజేఐకి 65 ఏళ్లు పూర్తికావడానికి ఒక నెలముందే ఆయనకు తదుపరి సీజేఐ కోసం సిఫార్సు లేఖ పంపడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం సీజేఐ తర్వాత సుప్రీంకోర్టు జడ్జీల్లో అత్యంత సీనియర్ మోస్ట్‌గా జస్టిస్ సూర్యకాంత్ కొనసాగుతున్నారు. తదుపరి సీజేఐ అయ్యే అవకాశాలు ఈయనకే మెండుగా ఉన్నాయి. జస్టిస్ సూర్యకాంత్ హరియాణాలోని హస్సార్ జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జని్మంచారు. 2019 మే 24న సుప్రీంకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. ఈయన సీజేఐ అయితే దాదాపు 15 నెలలపాటు సేవలందించి 2027 ఫిబ్రవరి 9వ తేదీన రిటైర్ అవుతారు. -
రూ.79,000 కోట్ల ఆయుధాల సేకరణకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: అత్యాధునిక ఆయుధాలు, సైనిక ఉపకరణాలతో త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రక్షణ శాఖ మరో భారీ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. మొత్తంగా రూ.79,000 కోట్ల విలువైన ఆయుధాలు, మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోలుకు సంబంధించిన సమీకరణ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని రక్షణ కొనుగోళ్ల మండలి తమ సమావేశంలో ఆమోదముద్ర వేసింది. నాగ్ క్షిపణులు, బహుళచర ఆయుధ నౌకలు, ఎల్రక్టానిక్ సహిత ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థలను సైతం కొనుగోలుచేయనున్నారు. సైనిక హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంక్‌లు, ఆయుధాలు, సైనిక బలగాలను తరలించేందుకు ఉపయోగించే ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్(ఎల్పీడీ), 30 ఎంఎం నావల్ సర్ఫేస్ గన్స్(ఎన్ఎస్జీ), అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడో(ఏఎల్‌డబ్ల్యూటీ), ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ సిస్టమ్తోపాటు 76 ఎంఎం సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ఆయుధం కోసం మందుగుండును కొనుగోలుచేయనున్నారు. ఆర్మీ, వాయుసేన తరహాలో ఇకపై నావికాదళం సైతం భూతల, గగనతలాల్లో ఆపరేషన్లు చేసేలా ఎల్‌పీడీలను సమీకరించి నేవీకి అందజేయనున్నారు. కనీసం నాలుగు ఎల్‌పీడీలను సమీకరించనున్నారు. ఏఎల్డబ్ల్యూటీను రక్షణపరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)లోని నేవల్ సైన్స్, టెక్నాలజికల్ లే»ొరేటరీ దేశీయంగా తయారుచేసింది. ఎన్ఎస్జీతో సముద్రజలాల్లో చిన్నపాటి అత్యయక సేవల్లో పాల్గొనవచ్చు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారీ స్థాయిలో ఆయుధాల సమీకరణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడం ఇది రెండోసారి కావడం విశేషం. -
‘ఆసియాన్’కు వర్చువల్‌గా
న్యూఢిల్లీ: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ దాకా జరుగనున్న అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఆసియాన్) 22వ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఆయన గురువారం మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ఫోన్లో మాట్లాడారు. ఆసియాన్ సదస్సుకు స్వయంగా హాజరుకాలేనని, వర్చువల్‌గా ప్రసంగిస్తానని తెలియజేశారు. ‘‘నా మిత్రుడు అన్వర్ ఇబ్రహీంతో చక్కటి సంభాషణ జరిగింది. ఆసియాన్‌కు సారథ్యం వహిస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేశా. వచ్చేవారం జరిగే సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆసియాన్–ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్నదే నా ఆకాంక్ష’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. షెడ్యూలింగ్ సమస్య వల్లే మోదీ ఆసియాన్ సదస్సుకు వెళ్లలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బదులు ఈ సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హాజరు కాబోతున్నారు. మలేషియాలో మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమవుతారని తొలుత ప్రచారం జరిగింది. మోదీ గైర్హాజరు కానుండడంతో ఈ భేటీ లేనట్లే. అలాగే మోదీ మలేషియాకు వెళ్లడం లేదు కాబట్టి కాంబోడియా పర్యటన కూడా వాయిదా పడినట్లేనని స్పష్టమవుతోంది. ఆసియాన్ 1967 ఆగస్టు 8న ఐదు దేశాలతో ఏర్పాటయ్యింది. ప్రస్తుతం ఈ కూటమిలో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా దేశాలకు సభ్యత్వం ఉంది. ఆసియాన్–భారత్ మధ్య 1992లో భాగస్వామ్యం మొదలయ్యింది. 1995 డిసెంబర్లో పూర్తిస్థాయి భాగస్వామ్యంగా, 2002లో శిఖరాగ్ర స్థాయి భాగస్వామ్యంగా, 2012లో వ్యూహాత్మక భాగస్వామ్యంగా సంబంధాలు బలపడ్డాయి. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర రంగాల్లో ఇరుపక్షాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ట్రంప్ నుంచి తప్పించుకోవడానికే మోదీ వెళ్లడం లేదు: కాంగ్రెస్ ఆసియాన్ సదస్సుకు స్వయంగా హాజరుకాకూడదని, వర్చువల్‌గా ప్రసంగించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం ‘ఎక్స్’లో తప్పుపట్టారు. మోదీ కౌలాలంపూర్‌కు వెళ్లకపోవడానికి అసలు కారణం వేరే ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుపడకుండా తప్పించుకోవడానికే మోదీ ఆసియాన్ సదస్సుకు దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశానంటూ ట్రంప్ ఇప్పటిదాకా 53 సార్లు చెప్పారని అన్నారు. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయదనిమోదీ హామీ ఇచ్చారంటూ కూడా ఐదుసార్లు చెప్పారని గుర్తుచేశారు. ట్రంప్ ప్రకటనలను మోదీ కనీసం ఖండించలేదని ఆరోపించారు. పైగా ట్రంప్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారని మండిపడ్డారు. ట్రంప్‌ను స్వయంగా కలిసి మాట్లాడే ధైర్యం మన ప్రధానమంత్రికి లేదని జైరామ్ రమేశ్ ధ్వజమెత్తారు. -
వికాసానికి– వినాశానికి మధ్య పోరు
ఔరంగాబాద్/హాజీపూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీయే వికాసానికి, విపక్షాల ఇండియా కూటమి వినాశానికి మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అభివర్ణించారు. గురువారం ఆయన ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఔరంగాబాద్, వైశాలి జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఇరవయ్యేళ్ల పాలనలో సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను అంతం చేశారన్నారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయే పాటుపడుతోందని చెప్పారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అందుకే ఈ ఎన్నికలు వికాసానికి, వినాశానికి మధ్య జరుగుతున్న పోరాటం వంటివని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నడ్డా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఆ పార్టీని చిన్నవైన భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నభుక్కుగా ఆయన పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పనతోపాటు, వలసలకు చెక్ పెడతామంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇస్తున్న హామీలను ప్రస్తావిస్తూ నడ్డా.. గతంలో ఆ పార్టీ నేతలు పాల్పడిన ‘భూమికి బదులుగా ఉద్యోగాలు’కుంభకోణం గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. భారీ ఉద్యోగాల కల్పన వట్టిదేనంటూ ఆయన వీరందరికీ వేతనాలను చెల్లించేందుకు నిధులెక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. -
ఆన్లైన్ దర్బార్ భక్తి!
ఆధ్యాత్మిక సందేహాలు, సంప్రదింపులు; వేద పండితుల మార్గదర్శకత్వం, పూజా సామగ్రి కొనుగోలు వంటి అవసరాల కోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్న భక్త వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆధ్యాత్మిక స్టార్టప్‌లకు ఆదరణ పెరిగింది. మతపరమైన ఆచార వ్యవహారాలు, వాటి పాటింపు విధానాలను ప్రామాణికంగా తెలియజెప్పేందుకు ఈ ఆధ్యాత్మిక ఆన్లైన్ వేదికలు వేద పారంగతులను నియమించుకుంటున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్గత ఏడాదితో పోలిస్తే తమ వినియోగదారుల్లో 2.5 రెట్లు, డిజిటల్ సంప్రదింపుల్లో 3 రెట్ల పెరుగుదల కనిపించిందని ఆధ్యాత్మిక ఆన్లైన్ సంస్థ ‘ఆస్ట్రోయోగి’వెల్లడించింది. సుదీర్ఘ ప్రయాణాలు, పొడవాటి క్యూలు లేని ‘డిజిటల్ యాక్సెస్’ సౌలభ్యతే ఈ పెరుగుదలకు కారణం. ప్రధానంగా యువత, ఎన్నారైలు ఈ సంస్థలను సంప్రదిస్తుండటం, పండుగ సీజన్లో అవి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించటం కూడా వాటి అభివృద్ధికి తోడ్పడుతోంది. వేలాదిమంది పండితులు ‘ఆస్ట్రోయోగి’తన నెట్‌వర్క్‌లో.. జ్యోతిషు్కలు, టారో కార్డ్ రీడర్లు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మిక కోచ్‌లు సహా కనీసం 10,000 మంది నిపుణులతో అనుసంధానమై ఉంది. వినియోగదారులకు ఆన్లైన్లో ఆధ్యాత్మిక సేవలను ఒక్క ‘క్లిక్కు’తో అందించటానికి ఈ పండితుల అనుభవం తమకెంతగానో ఉపయోగపడుతోందని ఆస్ట్రోయోగి నిర్వాహకులు అంటున్నారు. ఆధ్యాత్మిక కౌన్సెలింగ్ మరొక సంస్థ ‘ఆస్ట్రోసేజ్ ఏఐ’కూడా భక్తి విశ్వాసాల ఆధారిత సేవల్ని నెట్ యూజర్లకు అందిస్తోంది. పండుగలు, ఇతర సమయాలలో నెటిజన్ల సందేహాలకు ఈ సంస్థ తన కౌన్సెలర్ల ద్వారా సమాధానాలు ఇప్పిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే తమను సంపద్రించేవారి సంఖ్య 300 శాతం పెరిగిందని ఆస్ట్రోసేజ్ నిర్వాహకులు చెబుతున్నారు. లక్షల్లో భక్త యూజర్లు 2025లో ప్రారంభమైన ‘ఆస్ట్రోష్యూర్ ఏఐ’కు నెలవారీ వినియోగదారులు 3 లక్షలకు పైగా ఉన్నారు. రోజువారీగా కనీసం 15 వేల మంది సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రోష్యూర్ ఏఐ యాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓస్‌లు కలిపి 10 లక్షల డౌన్లోడ్లకు చేరుకుంది. ఒకప్పుడు లక్షా 50 వేలుగా ఉన్న యూజర్ల సంఖ్య దాదాపు 8 లక్షలకు పెరిగిందట. పూజా సామగ్రి కిట్లు వినియోగదారులు ప్రధానంగా తమ భవిష్యత్తు, అదృష్ట సంఖ్యలు, పంచాంగం, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, రాహు కాలాలు వంటి వాటి కోసం ‘ఆస్ట్రో’సైట్లను బ్రౌజ్ చేస్తున్నారు. ఇందుకోసం కొందరు డబ్బు చెల్లించి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటున్నారు. కేవలం సంప్రదింపుల కోసమే కాకుండా, ముందుగా ప్యాక్ చేసి ఉంచిన రెడీ మేడ్ పూజా సామగ్రి కిట్ కోసం యూజర్లు వీటి వైపు వస్తున్నారు. సేవలను, వస్తువులను పొందుతున్నారు. గత ఏడాది ఈ వేదికల్లో పూజా సామగ్రి కిట్లు, రత్నాల కోనుగోళ్లు 25 నుంచి 30 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. సదా ‘ఆధ్యాత్మిక’సేవలో.. ఆస్ట్రోయోగి : ఆన్లైన్ సంప్రదింపులు, జాతకాలు, డిజిటల్ ఆధ్యాత్మిక సేవలను అందించే భారతీయ ఆన్లైన్ జ్యోతిష్య శాస్త్ర వేదిక. ఆస్ట్రోసేజ్ ఏఐ : వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక సలహాలు, జాతక చక్రాలు, జ్యోతిష్యం, ఆన్లైన్ సంప్రదింపులు; పూజా విధానం, వివాహ ఆచారాలు, వివరణల వెబ్సైట్. ఆస్ట్రోటాక్ : జ్యోతిష్కులు, పండితులు, పురోహితులతో లైవ్ చాట్లు; ఫోన్ సంప్రదింపులు, జ్యోతిష్య శాస్త్ర సేవలతో అనుసంధానం. దేవ్ధామ్: వర్చువల్ ఆలయ దర్శనాలు. ఆన్లైన్ పూజలు, డిజిటల్ విరాళాల భారతీయ ఆధ్యాత్మిక సాంకేతిక వేదిక. వామా: ఇంటి నుంచే పూజలు, దర్శనాలు, మతాచారాల విషయమై సంప్రదింపులకు ఆన్లైన్ యాక్సెస్‌ను అందించే ఆధ్యాత్మిక సేవల కేంద్రం. -
సీఎం అభ్యర్థి తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో విపక్ష మహాగఠ్‌బంధన్ (మ హాకూటమి) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఊహాగానాలకు తెరది ంచుతూ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గా రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) యువనేత తేజస్వీ యాదవ్ పేరును కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఖరారు చేశాయి. తమ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్సాన్ పారీ్ట(వీఐపీ) అధినేత ముఖేష్ సహానీ పేరును ప్రకటించాయి. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజుపాటు జరిగిన చర్చోపచర్చలు ఎట్టకేలకు ముగిశాయి. కూటమి నేతలు గురువారం పటా్నలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిహార్‌లో మార్పు కోసం ఏడు పారీ్టల మహాగఠ్‌బంధన్ ఐక్యంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. తేజస్వీనే మా సీఎం: అశోక్ గహ్లోత్ కూటమి ముఖ్యమంత్రి అభ్యరి్థగా యువనేత తేజస్వీ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ చెప్పారు. ఆయన నవ యువకుడు అని, ఏది చెబితే అది చేస్తారని, ఇచ్చిన హా మీలకు కట్టుబడి ఉంటారని వెల్లడించారు. కూటమిలో కీలక నేత ముఖేష్ సహానీ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టకొని ఆయనను డిప్యూటీ సీఎం అభ్యరి్థగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బిహార్‌లో సామాజిక నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకొని సీఎం, డీప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడించారు. తమ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీతోపాటు కూటమి నేతలను సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా మరికొందరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తామని స్పష్టంచేశారు. కొత్త రాష్ట్రాన్ని నిర్మిస్తాం: తేజస్వీ ఎన్డీఏ ప్రభుత్వంపై తేజస్వీ యాదవ్ నిప్పు లు చెరిగారు. బిహార్‌లో ఓ కొత్త రాష్ట్రాన్ని నిర్మించేందుకు తామంతా ఏకమయ్యామని చెప్పారు. పనికిమాలిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు సంకల్పం తీసుకున్నామని ఉద్ఘాటించారు ‘‘ఎన్డీఏ నేత లు నకలీ్చ(కాపీక్యాట్లు). మేం ఏ హామీ ఇ స్తే, వాళ్లు దాన్నే కాపీ కొడుతున్నారు. వాళ్ల కు సొంత ఏజెండా లేదు. బిహార్‌లో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ చెప్పలేదు. ఎన్డీఏ నేతలంతా అలసిపోయిన నేత లు. బిహార్‌ను మోసం చేయడంలో వారంతా నిమ గ్నమయ్యారు. సీఎం నితీశ్ కుమా ర్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోంది. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యరి్థగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి? ఇది నితీశ్ కుమార్‌కు జరుగుతున్న అన్యాయం’’ అని తేజస్వీ ధ్వజమెత్తారు. ఎన్డీఏ పాలనలో రా ష్ట్రంలో అవినీతి, నేరాలు విచ్చలవిడిగా పెరి గిపోయాయని ఆరోపించారు. ‘‘రూ.70 వే ల కోట్ల కాగ్ స్కామ్, సృజన్ కుంభకోణం, బాలికా గృహ్ ఘటనలపై చర్యల్లేవు. వంతెనలు కూలుతున్నాయి, ఎలుకలు మద్యం తాగుతున్నాయి, రోజూ కాల్పులు జరుగుతున్నాయి. అవినీతి, ఆఫీసర్ల దౌర్జన్యంతో ప్రజలు విసిగారు’’ అని పేర్కొన్నారు. హామీల వర్షం మహాకూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యో గం, మాయీ–బహిన్ మాన్ యోజన (మహిళలకు ఆర్థిక సాయం), గ్యాస్ సిలిండర్ రూ.500కే అందిస్తామని తేజస్వీ యా దవ్ హామీ ఇచ్చారు. జీవికా దీదీలకు(స్వ యం సహాయక బృందాల మహిళలు) నె లకు రూ.30 వేల జీతంతో శాశ్వత ఉద్యో గం కల్పిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబదీ్ధకరిస్తామని వాగ్దానం చేశారు. బీజేపీని వదలం: ముఖేష్ సహానీ ఈ రోజు కోసం మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నామని డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ వ్యాఖ్యానించారు. బీజేపీని విచ్ఛిన్నం చేసే వరకు వదిలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశామని, ఆ సమయం ఇప్పుడు వచి్చందని స్పష్టంచేశారు. -
ట్రంప్ నోట మళ్లీ చమురు మాట
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఇస్తున్న డబ్బులతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని ఆయన మండిపడుతున్నారు. ఈ కొనుగోళ్లను ఆపేయాల్సిందేనని అంటున్నారు. అదే విషయం మరోసారి స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆ దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోతాయని పేర్కొన్నారు. అంటే కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనకుండా చైనాను ఒప్పించడానికి ప్రయతి్నస్తానని ట్రంప్ తెలిపారు. భారత్ బాటలో చైనా కూడా నడిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన బుధవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్ననే ఫోన్లో మాట్లాడాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, హఠాత్తుగా ఆపేయలేరు కాబట్టి కొంత సమయం పడుతుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయి. భారత్ గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది’’అని ఉద్ఘాటించారు. రష్యా చమురు విషయంలో ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. భారత్, చైనాలు రష్యాకు ఇచ్చే డబ్బులు ఆగిపోతే ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగుతుందని ఆయన తరచుగా చెబుతున్నారు. ఈ యుద్ధానికి ఆ రెండు దేశాలే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయని మండిపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బంద్ చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని భారత్ ఖండించింది. మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని తేల్చిచెప్పింది. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో మరో ఉద్దేశం లేదని వెల్లడించింది. తన మాట లెక్కచేయనందుకు భారతదేశ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. త్వరలో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కాబోతున్నానని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అది చమురు గానీ, ఇంధనం గానీ, ఇంకేదైనా గానీ రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన ప్రతిపాదనల పట్ల జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని వివరించారు. -
జంగిల్‌రాజ్‌ను వందేళ్లయినా మర్చిపోలేం
న్యూఢిల్లీ: బిహార్‌లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్‌రాజ్‌ను వందేళ్లయినా మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పాలనపై నిప్పులు చెరిగారు. అప్పటి అకృత్యాలను దాచిపెట్టేందుకు విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మది నుంచి చెరిగిపోవని చెప్పారు. జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్‌తోపాటు ఎన్డీఏ ఎంతగానో కష్టపడిందని తెలిపారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను నెలకొలి్పందని, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. విపక్ష మహాగఠ్‌బంధన్ నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, అది నేరగాళ్ల కూటమి(లాఠ్బంధన్) అని మండిపడ్డారు. ప్రధాని మోదీ గురువారం ‘నమో యాప్’ ద్వారా బిహార్ బీజేపీ కార్యకర్తలతో సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ప్రచారం సాగించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. రఫ్తార్ పకడ్ చుకా బిహార్, ఫిర్ సే ఎన్డీఏ సర్కార్(బిహార్‌లో ప్రభంజనం ఊపందుకుంది, మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది) అని మోదీ కొత్త నినాదం ఇచ్చారు. తమ కూటమి పాలనలో ఆల్‌రౌండ్ అభివృద్ధి జరిగిందన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రైలు మార్గాలు నిర్మించినట్లు గుర్తుచేశారు. కేంద్రంలో, బిహార్‌లో స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని తేల్చిచెప్పారు. సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న జరిగే ‘ఐక్యతా పరుగు’లో యువత భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. యువతదే కీలక పాత్ర మరోసారి దగా చేయడానికి వస్తున్న నేరగాళ్ల కూటమికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ కూటమికి సొంత ప్రయోజనాలే తప్ప ప్రజాసేవ అంటే ఏమాత్రం తెలియదన్నారు. నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం వల్ల బిహార్ యువత దశాబ్దాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలు, ఉపాధికి దూరమయ్యారని చెప్పారు. అప్పటి పాలకులు ఎన్నికల్లో నెగ్గడానికి మావోయిస్టులను వాడుకున్నారని ప్రధానమంత్రి మండిపడ్డారు. కడుపు మండిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో జంగిల్‌రాజ్‌ను ఓడించారని తెలిపారు. ఆనాటి అరాచక రాజ్యం మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. ఓటు విలువ బిహార్ ప్రజలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. జంగిల్‌రాజ్ కాలం నాటి వేధింపులు, ఘోరాల గురించి ఇప్పటి యువతకు తెలియజేయాలని పేర్కొన్నారు. బిహార్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందులో యువత కీలక పాత్ర పోషించబోతున్నారని ఉద్ఘాటించారు. మహిళా సాధికారత విషయంలో నవంబర్ 14న నూతన శకం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. -
సోషల్ మీడియా..వాడకం తగ్గిందయా!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్.. ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించని ఇంటర్నెట్ యూజర్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా సోషల్ మీడియా జనంలో చొచ్చుకుపోయింది. సామాజిక మాధ్యమాల్లో విహరించడం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లకు దినచర్యగా మారిపోయింది. ఆన్లైన్ కంటెంట్ వినియోగంలోనూ సమూల మార్పులు వస్తున్నాయి. అయితే ఈ వేదికలను ఉపయోగించే విషయంలో యూజర్లలో ఒకనాటి దూకుడు ప్రస్తుతం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారు సుమారు 604 కోట్లు కాగా.. సోషల్ మీడియా (ఎస్ఎం) యూజర్లు 560 కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా. అంటే ప్రపంచ జనాభాలో 65 శాతానికిపైగా అన్నమాట. ప్రతిరోజూ 4.10 లక్షల మంది కొత్తగా వీరికి తోడవుతున్నారు. మనదేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నవారి సంఖ్య సుమారు 70 కోట్లని అంచనా. అంతర్జాతీయంగా 2025 నాటికి ఎస్ఎం రోజువారీ వినియోగం స్థిరంగా ఉండగా.. వార్షిక వృద్ధి రేట్లు మాత్రం తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య ఊహించని రీతిలో కొత్త శిఖరాలకు చేరుకోవడంతో మార్కెట్ సంతృప్త స్థాయికి (సాచురేషన్) చేరుకుందని గణాంకాలు సూచిస్తున్నాయి. » భారత్‌లో సోషల్ మీడియా వాడకం » రోజువారీ సగటు వినియోగం.. 2 గంటల 40 నిమిషాలు» ఆన్లైన్ సమయంలో ఎస్ఎం వాటా 34» యూట్యూబ్ బ్రాడ్కాస్ట్ 2025 నివేదిక ప్రకారం.. మనదేశంలో 18 ఏళ్లకు పైబడినవారు సగటున రోజుకు 72 నిమిషాలు యూట్యూబ్ వీడియోల కోసం వెచ్చిస్తున్నారు. జూన్ 2025 నాటికి దేశంలో యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్న వీక్షకులు 65 కోట్లు. వ్యసనంగా మారిపోయిందిసోషల్ మీడియా వాడకంతో టీనేజర్లలో మానసిక ప్రభావంవ్యసనం 30% మందికిఒంటరితనం 20% మందినిద్ర సమస్యలు 17% మందికిషార్ట్ వీడియోలు, రీల్స్‌కే!యూజర్ల తీరు, కంటెంట్ ప్రాధాన్యతషార్ట్ వీడియోలు, రీల్స్‌కు అత్యధిక సమయం వెచ్చిస్తున్నవారు 80%వీడియో కంటెంట్ కోసం ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నవారు 90%అప్డేట్స్ కోసం ఎఫ్బీ వాడుతున్నవారు 17%స్టోరీస్ కోసం ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తున్నవారు 7% » యూజర్లు వారానికి సగటున 18 గంటల 36 నిమిషాలు ఎస్ఎంకి కేటాయిస్తున్నట్టు అంచనా. » ముఖ్యంగా 18 ఏళ్లకు పైబడిన ప్రపంచ జనాభాలో 92 శాతానికిపైగా ఎస్ఎం వినియోగిస్తున్నారట. » మొత్తం సోషల్ మీడియా యూజర్లలో పురుషులు 54 శాతానికిపైగా ఉన్నారు. అంటే మహిళలు సగానికంటే తక్కువే ఉన్నారన్నమాట.పెరిగి.. తగ్గింది!ప్రపంచవ్యాప్తంగా ఎస్ఎం వేదికలపై యూజర్లు వెచ్చించిన సగటు సమయం-ఆధారం: గ్లోబల్ వెబ్ ఇండెక్స్, స్టాటిస్టా, డేటా రిపోర్టల్ -
‘మేమేం చేయాలో..నువ్వు చెప్పడం ఏంటి?’
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఏం చేయాలో ట్రంప్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు. ట్రంప్ అసత్యమైన, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనవసరమని థరూర్ అన్నారు. ఇది భారత స్వతంత్రతను, విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నేతగా, శశి థరూర్ మాట్లాడుతూ ..భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశం. ఇతర దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనైతికం’అని అన్నారు. -
రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం లేఖ
ఢిల్లీ: రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం((NHRC) లేఖ రాసింది. చలి కాలంలో నిరాశ్రయుల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. వృద్ధులు, పిల్లల కోసం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. చలి గాలులు కారణంగా అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స అందించాలని.. ఎన్హెచ్ఆర్సీ కోరింది.2019 నుంచి 2023 మధ్య చలి గాలులతో 3639 మంది చనిపోయారని ఎన్హెచ్ఆర్సీ గుర్తు చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చలిగాలి మరణాలు తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యల నివేదికను ఎన్హెచ్ఆర్సీకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. -
మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. విచారణ సమయంలో ఏం చేశారంటే?
ఢిల్లీ: మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరయ్యేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే?ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన సంస్థ, ప్రతివాది సంస్థ తరుఫు విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. కేసు వాదనలు జరిగే సమయంలో ఓ మహిళ న్యాయవాది.. న్యాయమూర్తి వాదనలు వినకుండా వీడియోను ఆఫ్ చేసి, సంభాషణలను మ్యూట్‌లో పెట్టారు. ఇది గమనించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా మహిళా న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.2025 జూలై 4న ఢిల్లీ హైకోర్టు విడుదల చేసిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వీడియో కాన్ఫరెన్సుగా నిబంధనలను మహిళ న్యాయవాది ఉల్లంఘించారని గుర్తు చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో న్యాయవాది వీడియో ఆఫ్ చేసి, మ్యూట్‌లోకి వెళ్లడం వీసీ నిబంధనలకు విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది. అందుకు సదరు మహిళా న్యాయవాది తాను మరో కేసు విచారణలో పాల్గొనాల్సి ఉంది. అందుకే వీడియో ఆఫ్ చేసినట్లు తెలిపారు. అనంతరం, జస్టిస్ తేజస్ కారియా..సదరు మహిళ న్యాయవాది విచారణ మధ్యలో వీడియో ఆఫ్ చేసి, విచారణను మ్యూట్‌లో పెట్టినందుకు ఆమె ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావడాన్ని నిషేధించింది.ఢిల్లీ హైకోర్టులో శ్రీరామ్ ఫార్మ్స్ పై మహీంద్ర హెచ్జెడ్పీసీ కేసు వేసింది.‘ఎస్ఆర్ఎఫ్-C51’ అనే బంగాళాదుంప రకాన్ని తన మహీంద్ర సంస్థకు చెందిన ‘Colomba’ వేరియంటుతో పోల్చి అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపణలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తాత్కాలికంగా ‘SRF-C51’ వేరియంటు ఉత్పత్తి, అమ్మకాలు, ప్రచారం చేయడాన్ని నిషేధించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. -
రీల్స్ పిచ్చి : రైలుకెదురెళ్లి తిరిగి రాని లోకాలకు, వీడియో వైరల్
యూట్యూబ్ రీల్స్ పిచ్చి అనేకమంది ప్రాణాలుతీస్తోందని తెలిసినా తీరు మారడం లేదు. నిర్లక్ష్యం కొన సాగుతూనే ఉంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేయ్‌పూర్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది.ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్‌పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మలీ రీల్స్ తీయడానికి ప్రయత్నించాడు. అంతే అందరూ చూస్తుండగానే లిప్తపాటు క్షణంలోనే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం విషాదం.తన మొబైల్ ఫోన్లో చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి తన మొబైల్ ఫోన్లో రీల్ చిత్రీకరిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఇదీ చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్సమాచారం అందిన వెంటనే, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. రైల్వే పట్టాల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025 కాగా ఈ ఏడాది ఆగస్టులో గంజాం జిల్లా బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ కోరాపుట్‌లోని డుడుమా జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే -
సంచలనం.. డీజీపీ వద్ద ‘లైంగిక వేధింపుల పంచాయితీ’లో ఐపీఎస్ vs ఎస్సై భార్య
రాయ్‌పూర్: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులపై లైంగిక ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవటంతోపాటు కుమారుడు మరణానికి కారణం అయ్యాడన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా,ఛత్తీస్‌గఢ్‌లో ఐజీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రతన్‌లాల్ డాంగీపై ఓ ఎస్ఐ భార్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది2003 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఐజీ హోదాలో ఉన్న రతన్‌లాల్ డాంగీపై ఓ ఎస్ఐ భార్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఐపీఎస్ అధికారి రతన్‌లాల్ డాంగీపై బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.డీజీపీకి చేసిన ఫిర్యాదులో బాధితురాలు రతన్‌లాల్ డాంగీ తనపై గత ఏడు సంవత్సరాలుగా మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు ఊతం ఇచ్చేలా తనవద్ద కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పారు.వాటి ఆధారంగా ఈ కేసు విచారణ పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఛత్తీస్‌గఢ్ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో బాధితురాలు తనపై డీజీపీకి ఫిర్యాదు చేయడంపై రతన్ లాల్ డాంగీ అప్రమత్తయ్యారు. తిరిగి బాధితురాలిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో డాంగీ బాధితురాలిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. డాంగీ తనను తాను మహిళా బాధితుడినంటూ డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. బాధితురాలు తనను బలవంతంగా వీడియో కాల్స్‌లో అసభ్యంగా ప్రవర్తించమని ఒత్తిడి తెచ్చిందన్నారు. ఇంకా చెప్పుకోలేని విధంగా మహిళ తనని ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే, డాంగీ చేసిన ఆరోపణలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఎస్సై భార్యను వేధిస్తుంటే ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడే.. ఐపీఎస్ రతన్‌లాల్ డాంగీ డీజీపీతో ఎందుకు భేటీ అయ్యారు?. ఉన్నతస్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారిని ఎస్ఐ భార్య ఎలా వేధిస్తారు?. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?ఇది ఐపీఎస్ అధికారిపై ఆరోపణల కేసు కావడంతో, పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులపై ఒత్తిడి ఉందా? విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందా?. ఈ కేసు విచారణను పారదర్శకంగా, న్యాయంగా జరిపి బాధితుడెవరో, నిందితుడెవరో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఛత్తీస్‌గఢ్ డీజీపీపై ఉంది. ఒకవేళ ఈ కేసును పోలీస్‌శాఖ మసిపూసిమారేడుగాయగా చేస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందనే అభిపప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు విచారణలో నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం ఎవరికి దక్కుతుందో? బాధితులు ఎవరో? కాలమే నిర్ణయించాల్సి ఉంది. -
దీపావళి వేళ అపశ్రుతి..
భోపాల్: దీపావళి పండగ నాడు మధ్యప్రదేశ్‌లో కాల్షియం కార్బైడ్ తుపాకీలతో వందమందికి పైగా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. క్షతగాత్రుల్లో అత్యధికులు 8–14 ఏళ్ల బాలలే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌తోపాటు పొరుగునే ఉన్న విదిశ జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సుమారు 60 మంది భోపాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, కళ్లకు గాయాలైన ఐదుగురు సహా మిగతా బాధితులు విదిశలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. గ్యాస్ లైటర్, ప్లాస్టిక్ పైపు, కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి తయారు చేసిన మొరటు తుపాకులను దీపావళి సందర్భంగా జనం విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. ‘తుపాకీలోని కాల్షియం కార్బైడ్ నీటితో కలిసినప్పుడు ఎసిటలీన్ గ్యాస్ తయారవుతుంది. దానికి నిప్పురవ్వ తగలగానే పేలిపోయేలా రూపొందించారు. ఈ పేలుడుతో ప్లాస్టిక్ పైపు నుంచి చిన్నచిన్న ముక్కలు వెలువడతాయి. ముఖం, కళ్లు సహా ఇవి తగిలిన ప్రతిచోటా గాయాలయ్యాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి’అని భోపాల్ చీఫ్ మెడికల్ హెల్త్ అధికారి మనీశ్ శర్మ చెప్పారు. అయితే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. దీపావళి నాడు ఒక్క భోపాల్ నగరంలోనే ఇటువంటి 150 కేసులు తమ దృష్టికి వచ్చాయన్నారు. భోపాల్ ఎయిమ్స్‌లో ఈ తుపాకీ కారణంగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలుడికి చూపును పునరుద్ధరించేందుకు వైద్యులు ప్రయతి్నస్తున్నారని ఆయన వెల్లడించారు. హమీదియా ఆస్పత్రిలో మరో ఇద్దరు చిన్నారులకు ఇదే రకమైన చికిత్స జరుగుతోందన్నారు. కళ్లకు గాయాలతో ఈ ఆస్పత్రిలో పది మంది చిన్నారులు చేరారన్నారు. విదిశ జిల్లా ఆస్పత్రిలో చూపు తీవ్రంగా దెబ్బతిన్న ఐదుగురు చిన్నారులకు సైతం చూపును తిరిగి తెచ్చేందుకు చికిత్స చేస్తున్నామని కంటి వైద్య విభాగం అధిపతి ఆర్కే సాహు చెప్పారు. కాగా, ప్రమాదకరమైన కార్బైడ్ పైప్ గన్లను విక్రయించకుండా చూడాలంటూ ఈ నెల 18వ తేదీన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధికారుల సమావేశంలో కోరారు. అయినప్పటికీ వీటి విక్రయం, వాడకం యథావిధిగా జరిగిపోయిందని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. -
ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు
భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న గౌరవం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ దేశ శాంతిభద్రతల పరిరక్షణకు వెన్నెముకగా నిలిచే ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అత్యంత గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిగా ఉంది. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ప్రజలకు సేవ చేయడానికి, సరైన న్యాయం అందించడానికి వీలు కల్పిస్తుంది. చదువు పూర్తి చేసుకొని సివిల్స్ పరీక్షలో మెరిట్ సాధించిన చాలామంది యువత ప్రజలకు సర్వీసు అందించడంతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. ఐపీఎస్ స్థాయి అధికారుల నెలవారీ జీతం, ర్యాంక్ వారీగా వేతన నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం.(రాష్ట్రాలు ప్రత్యేకంగా అందించే అలవెన్స్లనుబట్టి వారి వేతనాల్లో మార్పులుంటాయని గమనించాలి)ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ తరహాలో వేతన స్కేల్‌ను అందిస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఐపీఎస్ అధికారుల వేతనాలను పే మ్యాట్రిక్స్ విధానం ద్వారా నిర్ణయిస్తున్నారు. జూనియర్ స్కేల్లో నియమితులైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నెలవారీ ప్రాథమిక వేతనం సుమారు రూ.56,100తో ప్రారంభమవుతుంది. అధికారి అనుభవం, సర్వీస్, ర్యాంక్ పెరిగే కొద్దీ వారి జీతం కూడా అధికమవుతుంది. దేశంలో అత్యున్నత పోలీస్ పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) స్థాయిలో జీతం అత్యధికంగా ఉంటుంది.ర్యాంకుల వారీగా పే స్కేల్ (నెలవారీ ప్రాథమిక వేతనం)ర్యాంక్ నెలవారీ ప్రాథమిక వేతనండిప్యూటీ ఎస్పీ (DSP) / ఏసీపీ (ACP)రూ. 56,100అడిషనల్ ఎస్పీరూ. 67,700పోలీసు సూపరింటెండెంట్ (SP)రూ. 78,800డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG)రూ. 1,31,000ఇన్స్పెక్టర్ జనరల్ (IG)రూ. 1,44,200అడిషనల్ డీజీపీ (ADGP)రూ. 2,05,000డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)రూ. 2,25,000 ఐపీఎస్ అధికారులకు అలవెన్సులు, సౌకర్యాలుఐపీఎస్ అధికారులు ప్రాథమిక జీతంతో పాటు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడే వివిధ రకాల భత్యాలు, సౌకర్యాలను కూడా పొందుతారు. ద్రవ్యోల్బణం రేటును బట్టి ఎప్పటికప్పుడు డియర్నెస్ అలవెన్స్ ఇస్తారు. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాలకు వ్యతిరేకంగా అధికారుల జీతాలను సమతుల్యంగా ఉంచుతుంది.పోస్టింగ్ నగరాన్ని బట్టి HRA మారుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇది అత్యధికంగా ఉంటుంది.అధికారిక పర్యటనల కోసం ప్రయాణ భత్యం ఇస్తారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు కూడా ఉంటాయి.ఐపీఎస్ అధికారులు వారి కుటుంబాలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఉచిత చికిత్స, వైద్య సదుపాయాలు కల్పిస్తారు.సీనియర్ ర్యాంక్ అధికారులకు భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిని అందిస్తారు.ప్రభుత్వ గృహాలు (క్వార్టర్స్), విద్యుత్, సబ్సిడీలు, టెలిఫోన్ బిల్లులపై రాయితీలు కూడా ఉంటాయి.ఇదీ చదవండి: 3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు -
3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు
రహదారి భద్రతను, మౌలిక సదుపాయాల నాణ్యతను గణనీయంగా పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 20,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను కవర్ చేస్తూ అధునాతన 3డీ సెన్సార్లు, డేటా సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది.సాంకేతికతతో పర్యవేక్షణఈ ప్రాజెక్టులో భాగంగా రహదారుల ఉపరితల లోపాలను (గుంతలు, పగుళ్లు వంటివి) అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ప్రత్యేకంగా అమర్చిన వాహనాలను ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేయనుంది. ఈ వాహనాల్లో 3డీ లేజర్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థలు సిద్ధం చేస్తుంది. ఇందులో గుర్తించిన లోపాలను ఇనెర్షియర్ మెజర్మెంట్ యూనిట్స్(IMU) ద్వారా జియోట్యాగ్ చేయడానికి జీపీఎస్ (GPS) ఉంటుంది. ఈ టెక్నాలజీల సాయంతో రియల్‌టైమ్ డేటా సేకరిస్తూ దాన్ని విశ్లేషించే వీలుంటుంది. దాని ద్వారా సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుంది.డేటా లేక్ఇలా సేకరించిన మొత్తం డేటా ఎన్హెచ్ఏఐ ఏఐ ఆధారిత పోర్టల్ ‘డేటా లేక్’లో అప్లోడ్ అవుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఆ డేటాను విశ్లేషించి కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ డేటా ఆధారిత విధానం రహదారి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. సేకరించిన డేటాను ప్రామాణిక ఫార్మాట్లలో భద్రపరచనున్నారు. ఇది దీర్ఘకాలిక సాంకేతిక, ప్రణాళిక ప్రయోజనాలకు తోడ్పడుతుంది.భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు అభివృద్ధి పనులకు ముందే డేటా సేకరణ ప్రారంభమవుతుంది. ఆరు నెలలపాటు ఇది కొనసాగుతుంది. రెండు నుంచి ఎనిమిది లేన్ల రహదారులతో కూడిన అన్ని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఎన్హెచ్ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది.ఇదీ చదవండి: గూగుల్‌కు పోటీగా ఓపెన్ఏఐ కొత్త బ్రౌజర్ -
డేంజర్ జోన్లో ఢిల్లీ ప్రజలు.. రోజుకి 9 సిగరెట్లు తాగినంత వాయు కాలుష్యం..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం కొనసాగుతోంది. దీపావళి తర్వాత రోజురోజుకీ గాలి నాణ్యత పడిపోతోంది. తాజాగా ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో ప్రమాదకర స్థాయికి 429 పాయింట్లకు కాలుష్యం చేరింది. క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇక, కాలుష్య కారక గాలి పీల్చడం వల్ల ఢిల్లీలో సగటున ప్రతి మనిషి రోజుకి 9 సిగరెట్లు తాగినట్లు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి 63 సిగరెట్లు, నెలకి 270 సిగరెట్లు తాగుతున్నట్లు వెల్లడించారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. గత మూడు రోజులుగా తారాస్థాయికి వాయు కాలుష్యం చేరి దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయింది. గాలి పీల్చుకునేందుకు ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, అనవసరంగా బయట తిరగవద్దని వైద్యుల సూచనలు చేశారు. ఎయిర్ ప్యూరిఫైయర్ తప్పనిసరిగా వినియోగించాలన్నారు. కాగా, దీపావళి, పంట వ్యర్థాలు కాల్చివేత వల్ల వాయు కాలుష్యం భారీగా పెరిగింది.#WATCH | Delhi: To mitigate pollution, water being sprinkled with the help of NDMC (New Delhi Municipal Council) vehicle, in the Safdarjung area. pic.twitter.com/nUTsOlUpKf— ANI (@ANI) October 23, 2025ఇదిలా ఉండగా.. ఢిల్లీని చుట్టుముట్టిన వాయు కాలుష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ డిమాండ్ చేశారు. ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం కారణంగా ప్రజలు పడే ఇబ్బందులు అంతాఇంతా కాదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ గత మూడ్రోజులుగా దేశ రాజధానిలో గాలి మసిబారిపోయింది. దీనిని పీల్చిన ప్రజల ఊపిరితిత్తులు పొగచూరి నల్లగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ జవాబుదారీతనం వీసమెత్తయినా కంటికి కనిపించట్లేదు. పండగల వేళ బీజేపీ నేతలు చేసే జ్ఞానబోధనలు ఎవరికీ అక్కర్లేదు.#Delhi | The Air Quality Index (AQI) around #Akshardham was recorded at 350, falling under the 'Very Poor' category, according to data from the Central Pollution Control Board (CPCB) this morning.#AirQuality #AQI #Pollution #CPCB #Environment #Akshardham #AirPollution #CleanAir… pic.twitter.com/vNgfXsJG1O— DD News (@DDNewslive) October 23, 2025ప్రజలు హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చగలిగేలా చేస్తామంటూ బాధ్యత తీసుకునే బాధ్యతాయుత ప్రభుత్వం కావాలి. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు కాలుష్యంతో అతలాకుతలమవుతున్నా బీజేపీ చర్యలు తీసుకోకపోవడం దారుణం’’ అని మనుసింఘ్వీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం బుధవారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) ‘చాలా అధ్వానం‘గా నమోదైన నేపథ్యంలో మనుసింఘ్వీ స్పందించారు. -
అత్యంత అరుదైన కేసు.. 23 ఏళ్ల తర్వాత ఆమెకు పరిహారం
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక చొరవ తీసుకుని.. బాధితురాలిని వెతికించి మరీ పరిహారం ఇప్పించిన ఘటన ఇది. రైలు ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు 23 ఏళ్ల తర్వాత పరిహారం అందింది. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. .. విజయ్ సింగ్ అనే వ్యక్తి 2002 మార్చి 21న భాగల్పూర్–దానాపూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ కంపార్టుమెంట్ నుంచి హఠాత్తుగా జారిపడ్డారు. తీవ్రంగా గాయపడి మృతిచెందారు. పరిహారం కోసం ఆయన భార్య సంయుక్త దేవి న్యాయ పోరాటం ప్రారంభించారు. ప్రమాదం వెనుక రైల్వేశాఖ నిర్లక్ష్యం లేదని, అతడికి మతిస్థిమితం లేదని, ఎవరో అతడిని నెట్టివేయడం వల్లే రైలు నుంచి కిందపడ్డాడని, పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు తేల్చిచెప్పాయి. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఆదేశాలను 2023లో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ కొనసాగించింది. విజయ్ సింగ్‌కు మతిస్థిమితం లేకపోతే రైలు టికెట్ ఎలా కొనుగోలు చేశాడని, రైలు ఎలా ఎక్కాడని? ప్రశ్నించింది. అసంబద్ధమై కారణాలతో పరిహారాన్ని తిరస్కరించడం సరైంది కాదని తేల్చిచెప్పింది. బాధితురాలు సంయుక్త దేవికి రూ.4 లక్షల పరిహారాన్ని ఏటా 6 శాతం వడ్డీతో కలిపి రెండు నెలల్లోగా చెల్లించాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ పరిహారం అందజేయడానికి సంయుక్తి దేవి చిరునామా అందుబాటులో లేకుండాపోయింది. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియరాలేదు. జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దాంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. సంయుక్తి దేవి కోసం పబ్లిక్ నోటీసు జారీ చేయాలని, మీడియాలో ప్రకటన ఇవ్వాలని రైల్వే శాఖకు సూచించింది. ఈ ప్రయత్నం ఫలించింది. సంయుక్త దేవి ఆచూకీ లభించింది. పరిహారాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘జూదం’ కేసు విచారణకు సహకరించండిదేశవ్యాప్తంగా ఆన్లైన్ జూదాన్ని, బెట్టింగ్ వేదికలను నిషేధించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అకౌంటబిలిటీ అండ్ సిస్టమిక్ ఛేంజ్(సీఎఎస్సీ) అనే సంస్థ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సోషల్ గేమ్స్, ఈ–స్పోర్ట్స్ ముసుగులో ఆన్లైన్ జూదం కొనసాగుతోందని పిటిషనర్ తరఫు లాయర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. పిటిషన్‌కు సంబంధించి కాపీని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వి.సి.భారతికి అందజేయాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో తమకు సహకరించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టంచేసింది. ఇదీ చదవండి: సీన్లోకి సిద్ధూ తనయుడు! డీకే ఏమన్నారంటే.. -
బీహార్ ‘గేమ్ ప్లాన్’.. లుకలుకలకు పుల్‌స్టాప్!
బీహార్‌లో గ్రాండ్ అలయన్స్(Mahaghat Bandhan) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపింది. సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ చొరవతో కూటమి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాలపై ఇప్పటికీ ఓ స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. లెక్క తేలకపోవడంతో ఎవరికివారే అభ్యర్థులను ప్రకటించుకుని నామినేషన్లు దాఖలు చేయించారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అయితే దీనిని ‘ఫ్రెండ్లీ పోటీ’గా అభివర్ణించుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్‌లు.. మరో పక్క ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్, మాజీ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్నాట్నాలో నిన్నంతా బిజీబిజీగా గడిపారు. భాగస్వామ్య పార్టీల కీలక నేతలతో సమావేశమై సీటు పంపకాలపై నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 8 స్థానాల్లో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, మరీ ముఖ్యంగా తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్ ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. CPI (ML) నేత దీపంకర్ భట్టాచార్య త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. -
‘అమ్మా కాళికా.. క్షమించు తల్లీ’
కాళి మాత విగ్రహాన్ని పోలీసులు వాహనంలో తరలించిన ఘటన.. పశ్చిమ బెంగాల్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రతలను అదుపు చేసే క్రమంలోనే అలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. సుందర్బన్స్ సమీపంలోని కాక్ద్వీప్ నియోజకవర్గంలో సూర్యనగర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఓ ఆలయంలో మంగళవారం కాళికా దేవి విగ్రహాం ధ్వంసమైన స్థితిలో కనిపించింది. ఈ విషయం దావానంలా పాకడంతో.. పలువురు నేతలు తమ అనుచరులతో అక్కడికి చేరుకుని గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో.. పోలీసులు తమ వాహనంలో ధ్వంసమైన ఆ విగ్రహాన్ని తరలించి నిమజ్జనం చేశారు. అయితే ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాళి దేవి విగ్రహాన్ని ఖైదీలను తరలించే వ్యాన్‌లో తీసుకెళ్లడాన్ని బీజేపీ అవమానకరమైన చర్యగా అభివర్ణించింది. గ్రామస్తులను భయపెట్టి ఆలయ గేట్లు మూసివేశారని, ప్రజల నిరసనలకు దిగడంతో తిరిగి తెరిచారని ఆరోపించింది. నిందితులను అరెస్ట్ చేయకుండా హిందూ రక్షకులను అడ్డుకున్నారని విమర్శించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌గా మారుస్తోందంటూ బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో పలువురు హిందూ రక్షకులతో కలిసి పలు ఆలయాల్లో బీజేపీ శాంతి పూజలు నిర్వహిస్తోంది. అయితే.. নিচের ভিডিওটা দেখে কেউ বাংলাদেশ বলে ভুল করবেন না, এটা পশ্চিমবঙ্গের বর্তমান অবস্থা। আমি বার বার বলেছি পশ্চিমবঙ্গ কে পশ্চিম বাংলাদেশ বানানোর চক্রান্ত চলছে, হিন্দুরা এখনি না জাগলে সমূহ বিপদ অপেক্ষা করছে আগামী দিনেগত রাতে কাকদ্বীপ বিধানসভার সূর্যনগর গ্রাম পঞ্চায়েত এলাকার উত্তর… pic.twitter.com/YB8FwtME3C— Suvendu Adhikari (@SuvenduWB) October 22, 2025ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారని, కొంతమంది దీనిని రాజకీయంగా వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోందని.. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని తెలిపింది. విగ్రహం ధ్వంసం కావడం వల్ల దాన్ని ఆలయంలో ఉంచడం అనుచితమని భావించామని, అందుకే నిమజ్జనం చేయాలని నిర్ణయించామని పోలీసులు అంటున్నారు. ‘‘స్థానికులు విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. అంబులెన్సులు సహా పలు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. సున్నితమైన అంశం కావడంతో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యతగా భావించాం. అందుకే మరో దారి లేకనే విగ్రహాన్ని పోలీస్ వాహనంలో తీసుకెళ్లి నిమజ్జనం చేశాం’’ అని వివరణ ఇచ్చారు. అయితే.. తీవ్ర విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో పోలీస్ శాఖ ధ్వంసమైన విగ్రహ తరలింపు ఘటనపై విచారణకు ఆదేశించింది.ఇదీ చదవండి: బీహార్ పంచాయితీకి కాంగ్రెస్ పెద్ద! -
బీహార్ పాలి‘ట్రిక్స్’.. బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌లో నేతల జంప్ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్ సహానీ బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే ఈయనను మూడేళ్ల క్రితం మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించటంతో అనర్హత వేటు పడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.2012లో ఆయన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్జరీ విమాన టికెట్లు సమర్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సీబీఐ కోర్టు విచారణ జరుపుతుండగానే 2020లో ఆర్జేడీ తరఫున కుర్హానీ నియోజవర్గంలో పోటీచేసి బీజేపీ నేత కేదార్ గుప్తను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం కోర్టు అనిల్‌ను దోషిగా తేల్చటంతో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కేదార్ గుప్త గెలిచి, రాష్ట్ర మంత్రి అయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో అనిత్ సహానీ బీజేపీలో చేరు. -
సిగ్మా గ్యాంగ్ హతం
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన కరుడుగట్టిన నేర ముఠా ‘సిగ్మా గ్యాంగ్’లోని కీలక వ్యక్తులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ, బిహార్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ (25)తోపాటు గ్యాంగ్ సభ్యులు బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) చనిపోయినట్లు ఢిల్లీ క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ సుందర్ కుమార్ తెలిపారు. వీరంతా బిహార్‌లోని సితామర్హి జిల్లాకు చెందినవారు. గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ తలపై రూ.50 వేల రివార్డు కూడా ఉంది. అతడిపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. డబ్బు కోసం ఓ వ్యక్తిని బెదిరించినందుకు ఈ నెల 13న కూడా అతడిపై కేసు నమోదైంది. రంజన్ ప్రమాదకరమైన నేరస్తుడని సుందర్‌కుమార్ తెలిపారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ గ్యాంగ్ భారీ దోపిడీలకు పాల్పడేందుకు కుట్ర చేసిందని చెప్పారు. వీరు కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారన్న విశ్వసనీయ సమాచారం అందటంతో నిఘా పెట్టామని, గురువారం తెల్లవారుజామున వారు ఓ కారులో వెళ్తున్నట్లు తెలియటంతో వెంబడించినట్లు పేర్కొన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో రోహిణిలోని బహదూర్ షా మార్గ్‌లో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరుపగా, పోలీసులు 15 నుంచి 20 రౌండ్లు కాల్చారని వివరించారు. ఈ మూఠా ప్రయాణించిన కారు దోపిడీ చేసిందే. దాని నంబర్ ప్లేట్ కూడా నకిలీదేనని గుర్తించారు. అల్లర్లకు కుట్ర పన్ని హతం.. ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు బిహార్ పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఈ కుట్రకు సంబంధించిన ఆడియో వెలుగు చూడటంతో పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళిక వేసింది’అని బిహార్ డీజీపీ తెలిపారు. సీతామర్హి జిల్లాలో వీరు ఇటీవల ఐదు వరుస హత్యలకు పాల్పడ్డారు. 25 రోజుల క్రితం బ్రహ్మర్షి సమాజ్ జిల్లా అధ్యక్షుడిని హత్య చేశారు. ఈ గ్యాంగ్ సుపారీ హత్యలు కూడా చేసేది. #BigBreakingNews #Delhipolice #BiharPolice#EncounterIn the intervening night of 22-23.10.25, around 2:20 AM, a fierce shoot out took place on Bahadur shah marg from Dr Ambedkar Chowk to Pansali chowk, Rohini, Delhi between 4 suspected accused persons and joint team of Crime… pic.twitter.com/jZmT91isKg— Amit Bhardwaj (@AmmyBhardwaj) October 23, 2025 -
అమిత్ షాకు శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 61వ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అంతర్గత భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రతి భారతీయుడూ భద్రతతో కూడిన గౌరవప్రదమైన జీవితం గడపడానికి అమిత్ షా అహరి్నశలూ కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రజాసేవ పట్ల అమిత్ షా అంకితభావం, కష్టపడిపనిచేసే తత్వం అందరినీ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమిత్ షాకు కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, బిహార్ సీఎం నితీశ్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా 1964 అక్టోబర్ 22న ముంబైలో జని్మంచారు. తొలిసారిగా 2002లో గుజరాత్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హోంశాఖ సహా పలు కీలక శాఖల మంత్రిగా సేవలందించారు. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అత్యంత కీలకంగా వ్యవహరించారు. నంబర్ టూ స్థానానికి చేరుకున్నారు. 2014 జూలైలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2019లో కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన మంచి వ్యూహకర్తగా, మోదీకి నమ్మినబంటుగా పేరుగాంచారు. -
తుది శ్వాస వరకూ పోరాటమే
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేసింది. ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణ కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఎంతోమంది ముష్కరులు అంతమయ్యారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు సైతం ధ్వంసమయ్యాయి. అంతిమంగా పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. అయితే, ఆపరేషన్ సిందూర్‌ను తిప్పికొట్టడానికి పాక్ సైన్యం ప్రయత్నించింది. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. పాక్ దాడుల్లో భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఎస్ఐ మొహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాఖామ్ వీరమరణం పొందారు. మరణానంతరం వారికి వీర్ చక్ర పురస్కారం లభించింది. వారు చివరి వరకూ వీరోచిత పోరాటం సాగించారని, అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించారని కేంద్రం ప్రభుత్వం ఈ నెల 4న ప్రచురించిన గెజిట్‌లో ప్రశంసించింది. ఈ ఏడాది మే 10న జమ్మూలోని ఖర్కోలాలో బోర్డర్ ఔట్‌పోస్టుపై పాక్ సైన్యం దాడికి దిగింది. డ్రోన్లు ప్రయోగించింది. ఎస్ఐ ఇంతియాజ్ అక్కడే విధుల్లో ఉన్నారు. తన బంకర్ నుంచి బయటకు వచ్చారు. లైట్‌మెషిన్ గన్‌తో ఒక పాక్ డ్రోన్‌ను కూల్చివేశారు. కానిస్టేబుల్ దీపక్ మరో డ్రోన్‌ను నేలమట్టం చేశారు. ఇంతలో పాక్ భూభాగం నుంచి ఫిరంగి గుండు దూసుకొచ్చింది. ఎస్ఐ ఇంతియాజ్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ లేక్కచేయకుండా తన దళాన్ని ముందుకు నడిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వారికి ప్రేరణ కల్పించారు. జవానో.. ఆజ్ ఖతం కరో ఇన్కో(సైనికులారా.. పాకిస్తాన్ ముష్కరులను అంతం చేయండి) అంటూ బిగ్గరగా అరిచారు. విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. గాయపడిన కానిస్టేబుల్ దీపక్ సైతం ఆఖరి క్షణం వరకూ యుద్ధం సాగిస్తూనే మృతిచెందారు. ప్రభుత్వం వారిద్దరి ప్రాణత్యాగాన్ని గుర్తించింది. వీర్‌చక్రను ప్రదానం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 16 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు పోలీస్ శౌర్య పతకాలు లభించాయి. -
ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య గహ్లోత్ రాయబారం
పట్నా: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌తో సమావేశమయ్యారు. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. లాలూతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలంటే ఇండియా కూటమి పార్టీల్లో ఐక్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, ఇండియా కూటమి సీఎం అభ్యరి్థగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ‘నా నుంచి అలాంటి ప్రకటనను మీరు ఎందుకు ఆశిస్తున్నారు?’అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ‘రెండు నెలల క్రితం ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీ, తేజస్వీ కలిసి రాష్ట్రమంతా పర్యటించడాన్ని మీరంతా చూశారు. అన్ని విషయాలపై తగిన సమయంలో వారే తగిన నిర్ణయం తీసుకుంటారు’అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 61 చోట్ల పోటీ పడుతోంది. అయితే, కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు స్నేహపూర్వక పోటీలోనూ ఉన్నాయి. ఆర్జేడీ నేతలు ఇటీవల ‘తేజస్వీ సర్కార్’నినాదం అందుకోవటంతో కాంగ్రెస్ కినుకు వహించినట్లు చెబుతున్నారు. -
లవ్ జిహాద్‌పై చట్టం తెస్తాం
నాగోమ్ (అస్సాం): అస్సాంలో త్వరలో లవ్‌జిహాద్, బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాలు తెస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారు. అస్సాంకే ప్రత్యేకతను తెచ్చిపెట్టిన శాస్త్రాల (వైష్ణవ సాంస్కృతిక కేంద్రాలు) పరిరక్షణతోపాటు టీ తోటల్లో పనిచేసే ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పించే చట్టాలు కూడా చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను రూపొందించి, కేబినెట్ ఆమోదించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాకు తెలిపారు. -
‘జీవిక దీదీ’లకు ఆర్జేడీ బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు కీలక హామీలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాల సభ్యు(జీవిక దీదీ)లకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘‘ రాష్ట్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కారి్మకులందరి ఉద్యోగాలను పరి్మనెంట్ చేస్తాం. జీవిక దీదీలుసహా మొత్తం 2,00,000 మంది కమ్యూనిటీ మొబిలైజర్ల ఉద్యోగాలను క్రమబదీ్ధకరిస్తా. కమ్యూనిటీ మొబిలైజర్లకు రూ.30,000 గౌరవ వేతనం అందిస్తా’’ అని తేజస్వీ ప్రకటించారు. ప్రపంచబ్యాంక్ ఆర్థికసాయంతో బిహార్ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ‘జీవిక’ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే.రూ.2,000 అదనపు అలవెన్స్ ‘‘మా ప్రభుత్వం వస్తే జీవిక దీదీలు ఇప్పటికే తీసుకున్న రుణాలను మాఫీ చేస్తా. వచ్చే రెండేళ్లపాటు ఇలాంటి వడ్డీ లేని రుణాలు మంజూరుచేస్తా. జీవిక దీదీలు అందరికీ రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రభుత్వకార్యక్రమాల్లో నిమగ్నమైన వారికి నెలకు అదనంగా రూ.2,000 అలవెన్స్ ఇస్తా’’ అని తేజస్వీ అన్నారు. బిహార్‌లో ప్రస్తుతం దాదాపు 1.45 కోట్ల మంది జీవిక దీదీలున్నారు. ‘‘తాము అధికారంలోకి వస్తే 20 రోజుల్లోçపు ఉపాధి గ్యారంటీ పథకం తెస్తా. 20 నెలల్లోపు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తా’’ అని తేజస్వీ గతంలోనే ప్రకటించడం తెల్సిందే. ‘‘జీవిక దీదీలకు లభిస్తున్న గౌరవ వేతనం చాలా తక్కువగా ఉంది. వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదు’’ అని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తేజస్వీ మండిపడ్డారు. ‘‘ నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారం జోరుమీదుంది. పాలనాపగ్గాలు ఎన్డీఏ కూటమి ఇవ్వకూడదని ఓటర్లు నిర్ణయించుకున్నారు. డబుల్ ఇంజిన్ మోతతో ఓటర్ల చెవులకు చిల్లులు పడ్డాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు, అవినీతి, నేరాలు నితీశ్ హయాంలో పెరిగాయి. నిరుద్యోగం, వలసలతో ప్రజలు విసిగిపోయారు’’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు. -
అయ్యప్ప సన్నిధిలో ముర్ము
పథనంతిట్ట(కేరళ): కేరళలోని ప్రఖ్యాత శబరిమల గిరిపై కొలువైన అయ్యప్ప స్వామిని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం దర్శించుకున్నారు. పథనంతిట్ట జిల్లా దట్టమైన అభయారణ్యంలో వెలసిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము కొత్త రికార్డ్ సృష్టించారు. గతంలో 1970వ దశకంలో నాటి రాష్ప్రపతి వీవీ గిరి మాత్రమే శబరిమలకు రాష్ట్రపతి హోదాలో వచ్చారు. ఆయన అప్పుడు పల్లకీలో వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతులెవ్వరూ ఈ ఆలయ దర్శనానికి రాకపోవడం గమనార్హం. సంప్రదాయ నలుపు దుస్తుల్లో..శబరిమల దర్శనం కోసం బుధవారం ఉదయం 7 గంటలకే రాష్ట్రపతి ముర్ము తిరువనంతపురం నుంచి ఆర్మీ హెలికాప్టర్లో బయల్దేరి పథనంతిట్ట సమీపంలోని ప్రమదం పట్టణ రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో దిగారు. అక్కడి తన వాహనశ్రేణిలో పంబ నది వద్దకు చేరుకుని నదీజలాల్లో కాళ్లు కడుక్కున్నారు. తర్వాత సమీపంలోని గణపతి ఆలయం సహా పలు ఆలయాలను సందర్శించారు. నలుపు రంగు చీరలో వచ్చిన ముర్ముకు కెట్టునీర మండపం వద్ద గణపతి ఆలయ ప్రధాన పూజారి ఇరుముడిని ఆమె తలపై పెట్టారు. తర్వాత అక్కడి రాతిగోడపై ఆమె కొబ్బరికాయలు కొట్టారు. ఇరుముడిని తలపై పెట్టుకుని సన్నిధానంకు బయల్దేరారు. ఇందుకోసం ఆమె 4.5 కిలోమీటర్ల పొడవైన స్వామి అయ్యప్పన్ రోడ్డులో ప్రత్యేక వాహనంలో వచ్చారు. రాష్ట్రపతి ముర్ముతోపాటు ఆమె ఎయిర్–డీ–క్యాంప్(ఏడీసీ) సౌరభ్ ఎస్ నాయర్, వ్యక్తిగత భద్రతాధికారి వినయ్ మాథుర్, ఆమె అల్లుడు గణేష్ చంద్ర హోంబ్రమ్ సైతం తలపై ఇరుముడి ధరించి రావడం విశేషం.పూర్ణకుంభంతో సాదర స్వాగతంసన్నిధానం చేరుకున్నాక నేరుగా ఆమె 18 అత్యంత పవిత్రమైన మెట్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు కేరళ దేవాలయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ స్వాగతం పలికారు. ఆలయ తంత్రి కందదారు మహేశ్ మొహనారు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. తర్వాత ఇరుముడితోనే ఆమె ఆలయ దర్శనం చేసుకున్నారు. గర్భగుడిని సమీపించి ఆలయ ప్రధాన మెట్లపై ఇరుముడిని ఉంచారు. ప్రధాన పూజారి ఆ ఇరుముడిని తీసుకుని పూజ కోసం గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు అయ్యప్పస్వామి జ్ఞాపికను బహూకరించారు. దర్శనం తర్వాత ఆమె సమీపంలోని మాళికాపురం సహా పలు ఉపాలయాలను దర్శించుకున్నారు. తర్వాత దేవస్థానం బోర్డ్ వారి గెస్ట్‌హౌస్‌కు తిరుగుపయనమయ్యారు. సాయంత్రంకల్లా తిరిగి తిరువనంతపురం చేరుకున్నారు. గురు వారం రాజ్‌భవన్‌లో ఆమె మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రతిమను ఆవిష్కరించనున్నారు. -
మన మెదడే.. కంప్యూటర్ చిప్!?
కంప్యూటర్ చిప్‌ల స్థానంలో మానవ మస్తిష్కంలోని కణ సముదాయాలను (మినీ బ్రెయిన్స్) ఉంటే.. మన జీవశక్తితో కంప్యూటర్లు పనిచేయడం మొదలుపెడితే.. అసాధ్యం అనిపిస్తోంది కదూ! కానీ, ఇది సాధ్యం కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే జరిగితే జీవశక్తితో కంప్యూటర్లు నడుస్తాయి. దీన్నే ‘బయోకంప్యూటింగ్’ లేదా ‘వెట్‌వేర్’ అంటున్నారు. స్విట్జర్లాండ్, వెవీలోని ‘ఫైనల్‌స్పార్క్’ స్టార్టప్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు.. మినీ బ్రెయిన్స్ సజీవంగా ఉంచటానికి అవసరమైన పోషకాలతో కూడిన ద్రవాన్ని తయారు చేయటంతో ఈ పరిశోధనలో మరొక ముందడుగు పడింది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవమున్న ‘మినీ బ్రెయిన్స్’ను ప్రాథమిక కంప్యూటర్ ప్రాసెసర్లుగా ఉపయోగించటానికి అవి ‘బతికి’ ఉండటం ఎంతో అవసరం. మినీ బ్రెయిన్స్ నిర్జీవం అయిపోతే ల్యాప్‌టాప్‌లోని ప్రాసెసర్ల మాదిరిగా వాటిని రీబూట్ చేయలేం. అయితే వీటిని ల్యాబ్‌లో అనంతంగా పునరుత్పత్తి చేయగల అవకాశం ఉండటం ‘వెట్‌వేర్’పై పనిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది. వెట్వేర్ను ఎలా సృష్టిస్తారు? అజ్ఞాత మానవ దాతల చర్మం నుంచి మూల కణాలు కొనుగోలు చేసి న్యూరాన్లుగా మారుస్తారు. చర్మ కణాలను మిల్లీ మీటరు వెడల్పులో ‘బ్రెయిన్ ఆర్గానాయిడ్లు’ అనే సమూహాలుగా సేకరిస్తారు. అవి ‘పండు ఈగ’ లార్వా మెదడు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటాయి. ప్రయోగశాలలో ఈ ఆర్గానాయిడ్లకు ఎలక్ట్రోడ్లు (విద్యుత్ వాహకాలు) జత చేస్తారు. ఇవి ఆర్గనాయిడ్ల పనితీరును అధ్యయనం చేస్తాయి. ఆర్గనాయిడ్లను కొద్దిపాటి విద్యుత్తుతో ప్రేరేపిస్తారు. అవి స్పందిస్తే సంప్రదాయ కంప్యూటింగ్ విధానమైన ‘1’,గానూ, స్పందించకపోతే ‘0’గానూ గుర్తిస్తారు. అంటే కంప్యూటర్లకు జీవం వచి్చనట్లే! ‘ఫైనల్ స్పార్క్’ చెబుతున్న ప్రకారం ఆర్గానాయిడ్లు ఆరు నెలల వరకు జీవిస్తాయి. ‘ఏఐ’కి ఏనుగు బలం! చాట్‌జీపీటీ వంటి భారీ ఏఐ ఇంజిన్లను నడిపిస్తున్న సూపర్ కంప్యూటర్లు.. మానవ మెదడులోని కణాలను, నాడీ వ్యవస్థను పోలిన సిలికాన్ సెమీ కండక్టర్లను ఉపయోగించటం తెలిసిందే. అయితే మెదడు కణాలను లేదా ‘మినీ బ్రెయిన్స్’ను ఉపయోగించి తయారు చేసే ప్రాసెసర్లు ఏదో ఒక రోజు, ప్రస్తుతం కృత్రిమ మేధ విజృంభణకు శక్తిని ఇస్తున్న చిప్‌ల స్థానాన్ని ఆక్రమిస్తాయని ఫైనల్‌స్పార్క్ ల్యాబ్ సహ–వ్యవస్థాపకులు ఫ్రెడ్ జోర్డాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. ఏఐ వల్ల పర్యావరణ కాలుష్యమూ తగ్గిపోతుంది. ‘వెట్‌వేర్’ సాధ్యమేనా! ఆర్గానాయిడ్లతో ప్రాసెసర్‌ను సృష్టించటం అసంభవమని కొందరు శాస్త్రవేత్తలు వాది స్తున్నారు. ‘మానవ మెదడులోని 10,000 కోట్ల న్యూరాన్లతో పోలిస్తే ఆర్గానాయిడ్లో ఉండేవి పది వేల న్యూరాన్లే. పైగా వీటిల్లో ‘నొప్పి గ్రాహకాలు’ ఉండవు. అలాగే మాన వ మెదడు.. ‘స్పృహ’ను ఎలా కలిగిస్తోందనే విషయం, ఇంకా మెదడు పనితీరుకు సంబంధించిన అనేక అంశాలు నేటికీ మిస్టరీగానే ఉన్నాయి’ అనేది వారి వాదన.ప్రపంచ వ్యాప్తంగా.. ఫైనల్‌స్పార్క్ సృష్టించిన ఆర్గానాయిడ్స్తో ప్రపంచ వ్యాప్తంగా 10 వర్సిటీలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లోని పరిశోధకులు.. ఒక ఆర్గానాయిడ్ను రోబో మెదడుగా ఉపయోగించి బ్రెయిలీ అక్షరాల మధ్య తేడాను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆటిజం, అల్జీమర్స్ వంటి సమస్యలతో బాధపడేవారి మెదడు పనితీరును తెలుసుకునేందుకు, తద్వారా వాటికి కొత్త ట్రీట్మెంట్లు కనుక్కునేందుకు ఫైనల్‌స్పార్క్ ఆర్గానాయిడ్స్నే ఉపయోగించారు.హార్డ్వేర్కంప్యూటర్లలో: లోహ భాగాలు, చిప్స్ మానవులలో: మెదడు కణాలు, నాడీ వ్యవస్థసాఫ్ట్వేర్ కంప్యూటర్లలో : ప్రోగ్రామ్‌లు, యాప్‌లు మానవులలో: ఆలోచనలు,జ్ఞాపకాలు, అభ్యాసంవెట్వేర్ కంప్యూటర్లలో : ఇంకా తయారు కాలేదు. మానవులలో : సేంద్రియ, జీవమున్నహార్డ్వేర్వెట్వేర్ ప్రయోజనాలు రోగ నిర్ధారణ : శరీరంలో నిర్దిష్ట రకాల కణాల గుర్తింపు. ప్రోస్థెటిక్స్: కృత్రిమ అవయవాల సృష్టిలో తోడ్పాటు డేటా నిల్వ: డీఎన్ఏ దీర్ఘకాలిక డేటా నిల్వకు స్థిరమైన ఏర్పాటు. హైబ్రిడ్ బయో ఎలక్ట్రానిక్ పరికరాలు: ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్‌తో కలపటం ద్వారా కొత్త బయో పరికరాల సృష్టి -
మీకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు
న్యూఢిల్లీ: భారతీయ న్యాయస్థానాల్లో తన కేసు విచారణ సవ్యంగా సాగదని, జుగుప్సాకర జైలు గదిలో రోగాలబారిన పడతానంటూ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ చేసిన వాదనలను బెల్జియం కోర్టు కొట్టేసింది. భారత్‌కు అప్పగించాక కేసు విచారణలో ఎలాంటి అన్యాయం జరగదని, ముంబైలో మీ కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కారాగార సెల్ నిర్మించారని ఆంట్వెర్ప్లోని అప్పీళ్ల కోర్టు వెల్లడించింది. తనను భారత్‌కు అప్పగించడమనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అంటూ ఛోక్సీ చేసిన వాదనలనూ కోర్టు తోసిపుచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.13,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నేరస్థుడు ఛోక్సీని భారతీయ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్‌కు అప్పగించడం సబబేనంటూ గతేడాది ఆంట్వెర్ప్ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు కనిపించట్లేదని అప్పీళ్ల కోర్టు వ్యాఖ్యానించింది. ఛోక్సీని తమకు అప్పగించాలంటూ ముంబై ప్రత్యేక కోర్టు 2018 మే, 2021 జూన్‌లో ఇచ్చిన ఉత్తుర్వులను అమలుచేయొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఛోక్సీని ఉద్దేశిస్తూ కోర్టు పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ మిమ్మల్ని భారతీయ ప్రభుత్వాధికారులకు అప్పగిస్తే ముంబై జైలులో అమానవీయంగా చిత్రహింసకు గురిచేస్తారన్న వాదనల్లో ఆధారాలు లేవు. భారత్‌లో మీకు న్యాయం లభించదన్న వాదనల్లో పస లేదు. ఆంటిక్వా, బార్బుడా నుంచి భారతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కిడ్నాప్ చేశారన్న వాదనలకు ఎలాంటి ఆధారం లేదు. డొమినికా దేశంలో హింసించారన్న వాదన ఉత్తిదే అని మాకు అర్థమైంది. కేసుల విచారణలో భారతీయ న్యాయమూర్తులకు స్వతంత్రత లేదని, అందుకే మీ హక్కులు ఉల్లంఘనకు గురవుతాయన్న వాదనలకు బలం చేకూర్చే డాక్యుమెంట్లు ఏవీ లేవు. అందుకే మిమ్మల్ని తిరిగి భారత్‌కు అప్పగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ముంబై జైలులో చక్కటి సౌకర్యాలున్నాయిఈ సందర్భంగా భారతీయ దర్యాప్తు అధికారులు అందించిన వివరాలను కోర్టు గుర్తుచేసింది. ‘‘ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో మిమ్మల్ని ఉంచుతారు. 12వ నంబర్ బ్యారక్‌లో మీ కోసం ప్రత్యేకంగా రెండు గదులు నిర్మించారు. బ్యారక్ విస్తీర్ణం ఏకంగా 46 చదరపు మీటర్లు. విడిగా మీ కోసం టాయిలెట్ కట్టారు. ధారాళంగా స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడానికి మూడు పెద్దపెద్ద కిటికీలు పెట్టారు. పైన ఐదు వెంటిలేటర్లు నిర్మించారు. మూడు ఫ్యాన్లు, ఆరు పెద్ద ట్యూబ్‌లైట్లు బిగించారు. వార్తలు, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు చూసేందుకు ప్రత్యేకంగా కొత్త టీవీ అమర్చారు. ఈ గదుల్లోకి రావడానికి వెడల్పాటి కారిడార్‌ను కట్టారు. అనారోగ్యం, కేసు విచారణ కాకుండా ఇతర కారణాలతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్లబోరు. దర్యాప్తు సంస్థల పరిధిలో కాకుండా మిమ్మల్ని జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచుతారు’’ అని బెల్జియం కోర్టు వ్యాఖ్యానించింది. రూ.13,000 కోట్ల కుంభకోణంలో చోక్సీ ఒక్కడే రూ.6,400 కోట్లమేర మోసానికి పాల్పడినట్లు సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొనడం తెల్సిందే. -
రష్యా ముడి చమురుకు కత్తెర
వాషింగ్టన్: భారతీయులతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, అమెరికాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మోదీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో మంగళవారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు. సంప్రదాయ చమురు దీపాన్ని స్వయంగా వెలిగించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం అధికంగా ముడిచమురు కొనుగోలు చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా చమురు విషయంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపేస్తామంటూ భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పరిమితంగానే కొనుగోలు చేస్తుందంటూ తాజాగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి వేడుకల్లో ఆహా్వనితులను ఉద్దేశించి ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ ‘‘మీ ప్రధానమంత్రి మోదీతో ఇప్పుడే మాట్లాడాను. మా మధ్య చక్కటి సంభాషణ జరిగింది. వాణిజ్యం సహా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆ అంశంపై మోదీకి ఎక్కువ ఆసక్తి ఉంది. మోదీ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన నాకు చాలాఏళ్లుగా మంచి మిత్రుడు. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం. భారత్–పాకిస్తాన్ సంబంధాలపైనా మోదీతో చర్చించాను. పాకిస్తాన్‌తో యుద్ధాలు వద్దన్న అభిప్రాయం మా సంభాషణలో వ్యక్తమైంది. భారత్, పాకిస్తాన్లతో అమెరికాకు ఎలాంటి యుద్ధాలు, విభేదాలు లేకపోవడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. కీలక ఒప్పందాలపై కలిసి పని చేస్తున్నాంవైట్హౌస్ వేడుకల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నానని చెప్పారు. మోదీతో ఫోన్లో మాట్లాడానని, ఆయనతో తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారత్ అధికంగా(టూ మచ్) ముడి చమురు కొనుగోలు చేయబోదని ఉద్ఘాటించారు. కొన్ని కీలక ఒప్పందాలపై భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని వివరించారు. తనలాగే మోదీ కూడా ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవడాన్ని కళ్లారా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ భారీగా కత్తెర వేస్తుందని తాను భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చాలావరకు తగ్గిపోవడం తథ్యమని అన్నారు. ముడిచమురు దిగుమతుల తగ్గింపు ప్రక్రియ చాలాకాలం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు ఎంతగానో తోడ్పాడు అందిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు భారత్–అమెరికన్లు సారథ్యం వహిస్తున్నారని, వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అదే మనకు దారిదీపం వైట్‌హౌస్‌లో దీపావళి పండుగకు అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్, మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మోహ్రోత్రా, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అమెరికాలో భారత రాయబారి వినయ్‌మోహన్ క్వాత్రా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందేశాన్ని విడుదల చేశారు. ‘‘చీకటిపై వెలుగు విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగిస్తున్నాం. దీపావళి సమయంలో ప్రాచీన గాథలను గుర్తుచేసుకోవాలి. శత్రువులు పరాజయం పాలైన, అవరోధాలు తొలగిపోయిన, సామాన్యులకు విముక్తి లభించిన గాథలను మనం తెలుసుకోవాలి. నిండుగా వెలుగులు విరజిమ్ముతున్న దీపం మనకు దారి చూపిస్తుంది. జ్ఞానమార్గంలో నడవాలని, శ్రద్ధతో పనిచేయాలని, మనకు లభించే ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేయాలని బోధిస్తుంది’’ అని ట్రంప్ వివరించారు. మోదీకి ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఫోన్ చేసి మాట్లాడి, దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కలిసికట్టుగా పనిచేయాలని, ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదంపై భారత్, అమెరికాలు ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్, మోదీ సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావన రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. -
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో అత్యున్నత వ్యక్తిగత గౌరవంగా భావించబడే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు 2025 సవరణ మార్గదర్శకాలను యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటి ఆధారంగా అర్హులైన క్రీడాకారులు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం దరకాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది.ఈ అవార్డు, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ప్రదానం చేయబడుతుంది. దీని కోసం క్రీడాకారులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ అవార్డు గెలుచున్నవారికి రూ. 25 లక్షల నగదు బహుమతి (ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు), గౌరవ పత్రం, పతకం (మెడల్) అందచేయబడతాయి.లక్ష్యంఖేల్ రత్న అవార్డు ప్రధాన ఉద్దేశ్యం, గత నాలుగేళ్లలో అత్యద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన క్రీడా ప్రదర్శన చేసిన భారత క్రీడాకారులను గుర్తించి గౌరవించడం.ఒలింపిక్, కామన్వెల్త్ మరియు ఆసియా గేమ్స్‌లో జరిగే సంవత్సరాల్లో, ఆ గేమ్స్ ముగిసే వరకు సాధించిన విజయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.అర్హులు ఎవరు?గత నాలుగేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన క్రీడాకాులు అర్హులు.ఒలింపిక్, వరల్డ్ కప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో సాధించిన విజయాలు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వారు శిక్షా కాలం పూర్తయిన తర్వాత మాత్రమే అర్హులు అవుతారు.ఎంపిక ప్రక్రియలో తుది నిర్ణయం సంబంధిత కమిటీ తీసుకుంటుంది, ఈ కమిటీలో మాజీ క్రీడాకారులు, క్రీడా జర్నలిస్టులు, పరా స్పోర్ట్స్ నిపుణులు, టార్గెట్ ఒలింపిక్ పోడియం (TOPS) ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు ప్రతి సంవత్సరం ఆగస్టు 29న, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం సందర్భంగా, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయి. -
అర్జున అవార్డులపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో అత్యున్నత గౌరవాల్లో ఒకటైన అర్జున అవార్డులు విధానంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్పులు చేసింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2025కి సవరించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. వీటి ఆధారంగా అర్హులైన క్రీడాకారులు అర్జున అవార్డు కోసం దరకాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది.అవార్డు లక్ష్యంఅర్జున అవార్డు లక్ష్యం కేవలం విజయాలను గుర్తించడం కోసం మాత్రమే కాదు, క్రీడాభివృద్ధికి కృషి చేసిన వారిని ప్రోత్సహించడం కోసం కూడా రూపొందించబడింది. ఇందులో భాగంగా రెండు విభాగాల అర్జున అవార్డులను కేంద్రం అర్హులైన క్రీడాకారులకు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాటిలో ఈ రెండు విభాగాలు ఉన్నాయి.1 అర్జున అవార్డు: గత నాలుగు సంవత్సరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు.2 అర్జున అవార్డు (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్): క్రీడా జీవితానికి అనంతరం కూడా క్రీడల అభివృద్ధిలో సేవలందిస్తున్న మాజీ క్రీడాకారులకు.అర్హత ప్రమాణాలుక్రీడాకారులు ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లలో విజయాలు సాధించి ఉండాలి. డోపింగ్ లేదా నైతిక ఉల్లంఘనలు జరగకూడదు. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలి.ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న క్రీడాకారులు తగిన సర్టిఫికేట్ సమర్పించాలి.ఎంపిక ప్రక్రియఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో మాజీ ఒలింపియన్లు, అర్జున అవార్డు గ్రహీతలు, క్రీడా జర్నలిస్టులు, నిపుణులు ఉంటారు. కమిటీ క్రీడాకారుల ప్రదర్శన, నాయకత్వం, క్రీడాస్ఫూర్తి వంటి అంశాల ఆధారంగా మార్కులు కేటాయించి తుది జాబితా సిద్ధం చేస్తుంది.బహుమతి వివరాలుప్రతి విజేతకు ప్రభుత్వం నుండి రూ. 15 లక్షల నగదు బహుమతి,సర్టిఫికేట్,అర్జున అవార్డును అందిస్తారు, అవార్డులు ప్రతి సంవత్సరం ఆగస్టు 29న – హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం సందర్భంగా అర్హులైన అభ్యర్థులకు రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. -
ఇండిగో విమానంలో కలకలం..ఫ్యూయల్ ట్యాంక్ లీక్
ఢిల్లీ: ప్రముఖ విమానయాన రంగ సంస్థ ఇండిగోలో కలకలం రేగింది. కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం 6E 6961లో ఫ్యూయల్ ట్యాంక్ లీకైంది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని ఉత్తరప్రదేశ్ లాల్‌బహుదూర్ శాస్త్రి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇండిగో విమానంలో 166మంది ప్రయాణికులున్నారు.అత్యవసర ల్యాండింగ్ కారణంగా విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి అపాయం సంభవించలేదని, సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. ల్యాండింగ్ తర్వాత విమానంలోని ఫ్యూయల్ లీకేజీ సమస్యని పరిష్కరించి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం. -
‘పార్టీ మారే ప్రసక్తే లేదు.. సీఎం పదవి ఏనాడు ఆశించలేదు’
కర్నూలు: పార్టీ మారే ఆలోచన తనకు ఎప్పుడూ లేదన్నారు కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అదే సమయంలో సీఎం పదవి కూడా తాను ఏనాడు ఆశించలేదన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పార్టీ కోసం కష్టపడతానన్నారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) మంత్రాలయం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఆహ్వానం మేరకు తాను మంత్రాలయం వెళ్లినట్లు డీకే శివకుమార్ తెలిపారు. ఇందులో ఎటుంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. జోడో భారత్ యాత్రలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నానని, తమ పార్టీ అధికారం చేపట్టడంతో మళ్లీ రావడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ಓಂ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರಾಯ ನಮಃಇಂದು ಮಂತ್ರಾಲಯ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಕ್ಕೆ ನನ್ನ ಧರ್ಮಪತ್ನಿ ಅವರ ಜೊತೆ ಭೇಟಿ ನೀಡಿ, ಶ್ರೀ ಗುರುರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ದಿವ್ಯ ದರ್ಶನ ಪಡೆದು, ವಿಶೇಷ ಪೂಜೆ ಹಾಗೂ ತುಲಾಭಾರ ಸೇವೆಯನ್ನು ನೆರವೇರಿಸಲಾಯಿತು.ಇದೇ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಮಂತ್ರಾಲಯ ಮಠಾಧೀಶರಾದ ಶ್ರೀ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ,… pic.twitter.com/wf7yXISAxl— DK Shivakumar (@DKShivakumar) October 22, 2025 ‘ఇదీ చదవండి: మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు -
‘మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు
సాక్షి,బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య బాంబు పేల్చారు. మా నాన్న కెరీర్ ముగిసింది. ఇక కర్ణాటక కాంగ్రెస్‌ను ముందుండి నడిపించే శక్తిసామర్ధ్యాలు, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఆ రాష్ట్ర ప్రజా పనుల వ్యవహారాల శాఖ మంత్రి (పీడబ్ల్యూడీ) సతీష్ జార్కిహోళికే ఉన్నాయని వ్యాఖ్యానించారు.బెళగావి జిల్లాలోని రాయ్‌బాగ్ తాలూకా కప్పలగుడ్డి గ్రామంలో మహాకవి కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యతీంద్ర తన తండ్రి, సీఎం సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నా తండ్రి తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారు. ఈ దశలో, ఆయనకు బలమైన భావజాలం, ప్రగతిశీల మనస్తత్వం కలిగిన నాయకుడు అవసరం. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకుడిగా ఉంటారు. ఆ నాయకుడే మంత్రి సతీష్ జార్కిహోళి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నిలబెట్టి, పార్టీని సమర్థవంతంగా నడిపించగల వ్యక్తి. అటువంటి సైద్ధాంతిక విశ్వాసం ఉన్న నాయకుడిని గుర్తించడం చాలా అరుదు’ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సతీష్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో వర్గపోరు బయటకొచ్చిన వేళ..సిద్ధారామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతమైంది. పీడబ్యూటీ మంత్రిగా పని చేస్తున్న సతీష్ జార్కిహోళిని తదుపరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో డీకే శివకుమార్‌తో ఉన్న విభేదాల్ని బహిర్గతం చేసింది. కర్ణాటకలో సిద్ధారామయ్య వారసుడిగా డీకే శివకుమార్ పేరే ప్రధానంగా వినిపిస్తున్న తరుణంలో యతీంద్ర చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో హీట్ పుట్టించాయి. యతీంద్ర తన మనసులోని మాటను ఒక ప్రజావేదికపై బయటపెట్టడంతో డీకేతో ఉన్న విభేదాలు ఉన్నాయనే దానికి మరింత బలం చేకూర్చింది. గతంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే క్రమంలో డీకే శివకుమార్‌తో ఒప్పందం కూడా జరిగింది. తలో రెండున్నర ఏళ్లు చేయడానికి ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సిద్ధరామయ్య రెండున్నరేళ్ల కాలం పూర్తి కావడానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో తదుపరి డీకేకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలి. ఈ విషయంపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వద్ద పంచాయతీ కూడా జరిగింది. మరి అటువంటిది ఇప్పుడు డీకేను కాదని, మంత్రి సతీష్‌ను తెరపైకి తీసుకురావడంతో కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు బయటకొచ్చాయి. VIDEO | Mysuru: “My father, (Siddaramaiah), is in the final stages of his political career. Satish Jarkiholi must take the Congress forward,” says Karnataka CM Siddaramaiah’s son, Yathindra Siddaramaiah.(Source: Third Party)#Karnataka (Full video available on PTI Videos -… pic.twitter.com/pCkXLEjqz7— Press Trust of India (@PTI_News) October 22, 2025 -
ఆస్పత్రి సాక్షిగా మహిళా డాక్టర్‌కు అత్యాచార బెదిరింపులు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అరాచక పర్వం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా మహిళల రక్షణకు భద్రత కరువైంది. గత కొన్నినెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందకు అద్దం పడుతుంటే, తాజాగా మరో మహిళా డాక్టర్‌ను ఆస్పత్రి సాక్షిగా వేధించడమే కాకుండా అత్యాచారం చేస్తామనే బెదిరింపు చర్యలకు దిగడం మహిళా భద్రతపై అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఆర్టీ కార్ ఆస్పత్రిలో ఓ మహిళా డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటన ఇంకా కళ్లు ముందు కదులాడుతుండగానే, మళ్లీ మరొక మహిళా డాక్టర్‌కు అత్యాచార బెదిరింపులు రావడం రాష్ట్రంలో మహిళా రక్షణకు సవాల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం నడిపే ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్‌కు ముగ్గురు ఉన్మాదులు బెదిరింపులకు దిగారు. ఆస్పత్రికి వచ్చి వేధించడమే కాకుండా అత్యాచారం చేస్తామని బెదిరించారు. హౌరా జిల్లాలోని ఉలుబెరియాలో ఉన్న శరత్ చంద్ర ఛటోపాధ్యాయం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్-ఆస్పత్రిలో ఇది చోటు చేసుకుంది. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక పేషెంట్ సదరు ఆస్పత్రిలో చికిత్స తీసుకునే క్రమంలో అక్కడకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. మహిళా డాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు .ఈ క్రమంలోనే వేధింపులకు గురి చేసి అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీనిపై ఆ మహిళా డాకర్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆ ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షేక్ సామ్రాట్, షేక్ బాబులాల్, ఫేక్ హసిబుల్‌గా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్స్ జాయింట్ ఫారమ్ ఆందోళనమహిళా డాక్టర్ల భద్రతపై ఆ రాష్ట్ర డాక్టర్స్ జాయింట్ పారమ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉలుబెరియాలో ఆ ఆస్పత్రిని సందర్శించిన ఫారమ్ బృంద సభ్యులు.. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణ ఉందా అంటూ ప్రశ్నించారు. మమతా సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదుమరొకవైపు రాష్ట్ర బీజేపీ సైతం.. టీఎంసీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. రాష్ట్రంలో వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న మమతా సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించింది. రాష్ట్ర బీజేపీ ఎంపీ సామిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన నుంచి మమతా ప్రభుత్వం ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదంటూ మండిపడ్డారు. 11 ఏళ్ల పాప కప్‌బోర్డులో ఆత్మహత్య చేసుకుంటుందా? -
ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?.. మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ కౌంటర్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కావాల్సినంత ప్రాక్టీస్అదే విధంగా రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వంటి టీమిండియా స్టార్లకు కూడా చోటిచ్చారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉండే ఈ రెడ్‌బాల్ సిరీస్‌తో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.పక్కనపెట్టడంపై విమర్శలుఇక ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రధాన జట్టులో స్థానం దక్కదనే స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలే పదిహేడు కిలోల బరువు తగ్గడంతో పాటు రెడ్ బాల్ టోర్నీల్లో సెంచరీ చేసినా సెలక్టర్లు అతడిని ఇలా పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ సంచలన ట్వీట్ చేశారు.ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?‘‘ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు ఎంపిక కాలేదా?.. ఊరికే అడుగుతున్నా అంతే!.. ఈ విషయంలో గౌతం గంభీర్ విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా!’’ అంటూ హెడ్‌కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్‌ను షామా మొహమ్మద్ టార్గెట్ చేశారు.కరెక్ట్ కాదు మేడమ్..ఈ నేపథ్యంలో షామా ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, మెజారిటీ మంది ఆమె ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నారు. మొహమ్మద్ సిరాజ్ జట్టులోని ప్రధాన బౌలర్లలో ఒకడన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు. ఆటలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదని.. ఇలాంటి మాటలతో చిచ్చు పెట్టాలని చూడటం సరికాదని పేర్కొంటున్నారు.భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదుఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్.. షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విషాదకరం. ఇలాంటి మాటలు వద్దు. సర్ఫరాజ్ ఖాన్ జట్టులో ఉండేందుకు అర్హుడు.అయితే, అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అర్థంలేనివి. భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. అజర్ హయాంలోనూ కొందరు ఇలాంటి మాటలే మాట్లాడారు.కానీ ఇందులో మతపరమైన కోణం ఉంటుందని నేను అస్సలు అనుకోను. సర్ఫరాజ్ ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగానే జట్టులోకి ఎంపిక కాలేడు. చాన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.సర్ఫరాజ్‌కు తగినన్ని ఛాన్సులు రాలేదు.. కానీఅయితే, ఓ ప్లేయర్ ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టడం సరికాదు. సర్ఫరాజ్ ఖాన్‌కు తగినన్ని ఛాన్సులు రాలేదు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రిషభ్ పంత్.. తర్వాత విఫలమైనా అతడిని పక్కనపెట్టడం జరగదు.జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ఎవరూ మార్చలేరు’’ అని అతుల్ వాసన్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి ఓ సెంచరీ, మూడు అర్థ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. రోహిత్ లావుగా ఉన్నాడని..కాగా షామా మొహమ్మద్ గతంలోనూ రోహిత్ శర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉన్నాడని.. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడే తప్ప అతడికి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మది.చదవండి: ఓపెనర్‌గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది!
పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్ బారిన పడటం ఖాయం! బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి, మోడల్ నివాశియ్ని కృష్ణన్ (Nivaashiyni Krishnan) గ్లామర్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్‌ను హీరో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రీపోస్ట్ చేశారు.చిన్న తప్పిదం!ఇది గమనించిన కొందరు నెటిజన్లు వెంటనే దాన్ని స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జరిగిన తప్పును గ్రహించిన ఉదయనిధి.. వెంటనే సదరు పోస్ట్‌ను డిలీట్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అటు నివాశి గ్లామర్ పోస్ట్‌కు కామెంట్లను ఆఫ్ చేసింది. అప్పటికీ నెటిజన్లు ఆగడం లేదు.. వేరే పోస్టుల కిందకు వెళ్లి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మా అన్న ఎలా ఉన్నారు? డీఎంకే పార్టీలోకి స్వాగతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఎవరా బ్యూటీ?అటు ఉదయనిధి అభిమానులు మాత్రం ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. పొరపాటను ఉదయనిధి చేయి టచ్ అయి అలా రీపోస్ట్ అయిందని సమర్థిస్తున్నారు. నివాశి విషయానికి వస్తే.. తమిళనాడు మూలాలున్న నివాశి సింగపూర్‌లో మోడల్‌గా రాణిస్తోంది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసినట్లు తెలుస్తోంది. తమిళ బిగ్‌బాస్ ఆరో సీజన్లో కామనర్‌గా పాల్గొంది. ఓహో ఎంతన్ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. Udhaya Anna 🤣❤️🔥 Sunday rowdy time Monday Ena time ??? 🤣 pic.twitter.com/tTjI2UkpNT— விழுப்புரம் கிருபா (@Admk_Kiruba) October 21, 2025 చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
Bihar Election: ‘లాలూ’కు చెక్ పెట్టిన రీతు.. స్వతంత్రంగా రంగంలోకి..
పట్నా:బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న విచిత్ర పరిణామాలు మీడియా కంట పడుతున్నాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రీతూ జైస్వాల్.. ఆర్జేడీని వీడి బీహార్‌లోని పరిహార్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.రాష్ట్రీయ జనతాదళ్‌పై తిరుగుబాటు ప్రకటించిన జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలు తనకు టికెట్ నిరాకరించారని, ఇది ఆర్జేడీ నాయకత్వం తనకు తలపెట్టిన ద్రోహంగా ఆమె అభివర్ణించారు. తనను మరో నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పార్టీ కోరిందని, అది తన మనస్సాక్షికి వ్యతిరేకమని, అందుకే తాను స్వతంత్రంగా నామినేషన్ వేయాలనుకున్నానని రీతూ జైస్వాల్ తెలిపారు.1977, మార్చి ఒకటిన హాజీపూర్‌లో జన్మించిన జైస్వాల్, ప్రభుత్వ మాజీ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య. కుమార్ తన గ్రామానికి సేవ చేసేందుకు, విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)తీసుకున్నారు. అతని భార్య జైస్వాల్ బీహార్ రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలిగా పేరు సంపాదించారు. విద్య, మౌలిక సదుపాయాలు ఇతర సమస్యల పరిష్కారానికి ఆమె ప్రభుత్వంతో పోరాడుతుంటారు. రీతూ జైస్వాల్ రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు.2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆమె పరిహార్ స్థానం నుండి పోటీ చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గాయత్రి దేవి చేతిలో కేవలం 1,569 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో షియోహార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. నాడు ఆమె జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ)నేత లవ్లీ ఆనంద్ చేతిలో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఆమెకు ఓటమి ఎదురైనప్పటికీ, క్షేత్రస్థాయిలో భారీ మద్దతు లభించింది.2020 బీహార్ ఎన్నికల్లో రెండు వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఇప్పుడు పార్టీ తనకు టికెట్ నిరాకరించిందని రీతూ జైస్వాల్ ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆమె ఎంతో భావోద్వేగానికి గురై, తాను రాజకీయ కుట్రకు బలయ్యానని పేర్కొన్నారు. జైస్వాల్‌ను బెల్సాండ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పార్టీ కోరింది. అయితే ఆమె పరిహార్ నుండి పోటీ చేస్తానని పట్టుబట్టారు. -
Bihar Election: మహిళలకు శాశ్వత ఉద్యోగం: తేజస్వీ భారీ హమీ
పట్నా: బిహార్‌లో వచ్చేనెల(నవంబర్)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో నేతల ప్రచార పర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ రాష్ట్రంలోని మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘జీవికా దీదీ’లకు ఉద్యోగం పర్మినెంట్ చేయడంతోపాటు, నెలకు రూ.30 వేల జీతం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ‘జీవికా దీదీ’ పథకంలోని లోపాలను చక్కదిద్ది, మహిళలకు అండగా ఉంటామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఆర్జేడీ నేత నేత తేజస్వీ యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో ‘జీవికా దీదీ’లపై హామీల వర్షం కురిపించారు. బిహార్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ‘జీవికా దీదీ’లకు రూ. 30 వేల జీతంతోపాటు వారు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వ చేపట్టిన ‘జీవికా దీదీ’ పథకం తీరుతెన్నులపై తేజస్వీ పలు విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ‘జీవికా దీదీ’లకు అన్యాయం జరుగుతున్నదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ పథకంలోని మహిళలను పర్మినెంట్ చేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని తాము నిర్ణయించామని తేజస్వీ పేర్కొన్నారు. వారి జీతం కూడా నెలకు రూ. 30 వేలకు పెంచుతామని, ఇది సాధారణ ప్రకటన కాదని అన్నారు. జీవికా దీదీల దీర్ఘకాల డిమాండ్ సాకారం చేయనున్నామని తేజస్వి యాదవ్ పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జీవికా దీదీల ప్రస్తుత రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, రాబోయే రెండేళ్లకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. దీనికితోడు ప్రతి జీవికా దీదీకి నెలకు రూ. రెండువేల అదనపు భత్యం, రూ. ఐదు లక్షల బీమా కవరేజ్ అందిస్తామన్నారు. కాగా ‘జీవికా దీదీ’ పథకం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. -
అమెరికా నుంచి శుభవార్త!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘టారిఫ్ వార్’లో మెత్తబడనున్నారా?. వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిన తరుణంలో త్వరలో భారత్‌కు గుడ్‌న్యూస్ అందించబోతున్నారా?. ఇప్పటికి అమలవుతున్న 50 శాతం సుంకాలను గణనీయంగా తగ్గించబోతున్నారా?.. భారత్ చెందిన ఓ వార్తా సంస్థ కథనం అవుననే అంటోంది.అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ తాజాగా దీపావళి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీతోనూ ఈ అంశంపైనే మాట్లాడానని అన్నారాయన. ఇటు ట్రంప్ ఫోన్‌కాల్‌ను ధృవీకరించిన మోదీ.. ఏ అంశాలపై మాట్లాడరనేది మాత్రం చెప్పలేదు. ఈలోపు.. జాతీయ ఆంగ్ల పత్రి మింట్ ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ట్రేడ్‌డీల్‌కు భారత్-అమెరికా చేరువయ్యాయని, ఇందులో భాగంగానే భారత్‌పై అమెరికా విధించిన సుంకాల్లో భారీగా తగ్గుదల ఉండబోతోందని ఆ కథనంలో ఉంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోళ్లపైనా ఈ ఒప్పందం ప్రభావం చూపించబోతోందని పేర్కొంది. క్రమక్రమంగా తగ్గించే అవకాశం ఉందని ప్రస్తావించింది.అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం శక్తి(ఎనర్జీ), వ్యవసాయ రంగాలపై ఆధారపడి ఉండబోతోంది. ఈ తగ్గింపుతో సుంకాలు 50 శాతం నుంచి 15-16 శాతానికి చేరుకుంటాయి. భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణాన్ని క్రమంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు ముగ్గురికి మాత్రమే తెలుసు అని మింట్ కథనం పేర్కొంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే జన్యుపరంగా మార్పులు చేయని మొక్కజొన్న, సోయా ఆహార పదార్థాలపై పన్నులు తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని తరచుగా సమీక్షించే విధానాన్ని కూడా చేర్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాసింది. ఈ కథనంపై మరో ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్.. ఇటు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖను, అటు వైట్‌హౌజ్‌ను సంప్రదించింది. అయితే.. ఇరువర్గాలు దీనిపై స్పందించలేదు.47వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశం 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశానికి ఆసియాన్ దేశాల నాయకులతో పాటు అమెరికా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సైప్రస్, ఫిన్లాండ్ దేశాల నాయకులు కూడా హాజరుకానున్నారు. ప్రాంతీయ సహకారానికి, ద్వైపాక్షిక ఒప్పందాలకు కీలక వేదికగా ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ఓ పేరుంది.అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాల టైమ్‌లైన్2023 జూన్: భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వ్యవసాయం, టెక్నాలజీ, ఇంధన రంగాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.2023 ఆగస్టు: అమెరికా భారత దిగుమతుల పన్నులపై సమీక్ష ప్రారంభించింది. దీంతో చర్చలు కొంతకాలం నిలిచిపోయాయి.2024 ఫిబ్రవరి: వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతుల పరిమితులు, పన్నుల తగ్గింపు అంశాలపై చర్చలు కొనసాగాయి.2024 జూన్: భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(MSMEs), రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది.2024 డిసెంబర్: పన్నుల సమీక్ష విధానం ప్రతిపాదించబడింది. మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తుల దిగుమతులపై దృష్టి సారించాయి.2025 సెప్టెంబర్ 16: ఆగిపోయిన వాణిజ్య చర్చలు.. ట్రంప్ సుంకాల ప్రభావంతో తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధులు భారత్‌కు చర్చల కోసం వచ్చారు.2025 అక్టోబర్ 13–20: చర్చలు తుది దశకు చేరాయి. ట్రంప్-మోదీలు ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.2025 అక్టోబర్ 22: వాణిజ్య ఒప్పందం తుది రూపు దిద్దుకుంటోంది. మింట్ నివేదిక ప్రకారం.. అమెరికా 50% టారిఫ్‌ను 15–16%కి తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది -
Delhi: యజమాని తిట్టాడని.. అతని ఐదేళ్ల కుమారునిపై పాశవిక దాడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక డ్రైవర్ అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. నరేలా ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారిపై పగతీర్చుకునేందుకు అతని దగ్గర పనిచేసే డ్రైవర్ నీతు తన యజమాని ఐదేళ్ల కుమారుడిపై ఇటుకలతో దాడి చేసి, కత్తితో తీవ్రంగా గాయపరిచి, హత్య చేశాడు. యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు ముందు అతను ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, తన గదిలో ఉంచాడు. ఆ గదిలోని బాలుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ హత్య అనంతరం నిందితుడు నీతు పరారయ్యాడు. అతనిని వెదికేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నీతూను అతని యజమాని తీవ్రంగా మందలించిన దరిమిలా అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నరేలా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు బాలుని కిడ్నాప్‌పై ఫోన్లో ఫిర్యాదు వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) హరేశ్వర్ స్వామి తెలిపారు. బాలుడు తమ ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో అదృశ్యమయ్యాడని ఫిర్యాదులో తెలిపారన్నారు. కుటుంబ సభ్యులు, ఇంటి చుట్టుపక్కలవారు బాలుని కోసం గాలించగా, అతని మృతదేహం అక్కడికి సమీపంలోని నీతు గదిలో కనిపించిందని హరేశ్వర్ స్వామి వివరించారు.బాలుని తండ్రి ఎనిమిది రవాణా వాహనాలను నడుపుతూ, నీతు, వసీంలను డ్రైవర్లుగా నియమించుకున్నాడని, సోమవారం సాయంత్రం, మద్యం మత్తులో ఇద్దరు డ్రైవర్లూ గొడవ పడ్డారని, దీనిలో జోక్యం చేసుకున్న యజమాని.. డ్రైవర్ నీతును కొట్టాడని హరేశ్వర్ స్వామి చెప్పారు. ఈ అవమాన భారంతో నీతు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడన్నారు. ఈ ఉదంతం గురించి తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్లతో తక్షణ చర్యలు -
ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం
చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను మళ్లీ నిలిపివేయడం ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగం ఈ నిర్ణయంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. చైనా చర్యల వల్ల భారత్‌లో ఎరువుల లభ్యత, ధరలపై ప్రభావం పడునుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.చైనా ఎగుమతి నిలిపివేతఅక్టోబర్ 15, 2025 నుంచి టెక్నికల్ మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ (TAMP), యాడ్ బ్లూ (యూరియా సొల్యూషన్), డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP), సాంప్రదాయ యూరియా వంటి ప్రత్యేక ఎరువుల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ సస్పెన్షన్ సుమారు 5-6 నెలల పాటు ఉంటుంది. అంటే ఈ నిలిపివేత మార్చి 2026 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని అనుసరించి సరఫరా గొలుసులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంపై దీని ప్రభావంభారతదేశం ఈ ప్రత్యేక ఎరువుల్లో దాదాపు 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇది ఏటా సుమారు 2.5 లక్షల టన్నులు, అంటే 60-65% రబీ సీజన్లో ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎరువుల దిగుమతులపై ఆధారపడుతుండడం వల్ల చైనా ఏకపక్ష నిర్ణయాలు భారతదేశ వ్యవసాయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.చైనా నిర్ణయం వల్ల కఠినమైన ప్రపంచ సరఫరా, అనిశ్చితి ఫలితంగా ఎరువుల ధరలు 10-15% వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదలతో అంతిమంగా రైతులపై భారం పడనుంది. దాంతో పంట ఉత్పత్తి వ్యయం పెరుగనుంది. కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్ (అక్టోబర్-మార్చి) కోసం భారతీయ వ్యాపారుల వద్ద ఇప్పటికీ నిల్వలున్నాయి. కాబట్టి తక్షణ ఎరువుల కొరత లేనప్పటికీ భవిష్యత్తులో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.గతంలో ఇలా..చైనా గతంలో కూడా 2023 మధ్యలో, మే-జూన్ 2025లో (భారతదేశ ఖరీఫ్ సీజన్‌ను ప్రభావితం చేస్తూ) ఎగుమతులను నిలిపివేసింది. ఆగస్టు 2025లో దౌత్య చర్చల తర్వాత తాత్కాలికంగా వీటిపై నిషేధం ఎత్తివేశారు. తిరిగి అక్టోబర్ 15 నుంచి మళ్లీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ మార్చి 2026 తర్వాత కూడా కొనసాగితే భారతదేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ప్రత్యామ్నాయ సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం, ఎరువుల వినియోగంలో సామర్థ్యాన్ని పెంచే విధానాలను అమలు చేయడం వంటి చర్యలు అత్యవసరం.ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో కేజీ టమాటా రూ.700 -
ఇరుముడి కట్టిన రాష్ట్రపతి!
President Droupudi Murmu Sabarimala Visit Updates..శబరిమలకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము..శబరిమల సన్నిధానానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.అనంతరం ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు.. ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి అయ్యప్ప ఇరుముడి ముడుపుతో రాష్ట్రపతి ముర్ము శబరిమలకు బయలుదేరారు. பம்பா கணபதி கோவிலில் இருமுடி கட்டிக்கொண்டு, சபரிமலை சன்னிதானம் நோக்கி புறப்பட்டார் இந்திய குடியரசுத் தலைவர் திரௌபதி முர்மு! #DroupadiMurmu #Sabarimala #Kerala pic.twitter.com/H0b2QOibyr— Harish M (@chnmharish) October 22, 2025 కాసేపట్లో శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మురాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతంశబరిమల దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో ఘన స్వాగతంప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన రాష్ట్రపతికి దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్ స్వాగతం పలికారు.కాసేపట్లో రాష్ట్రపతి ముర్ము శబరిమలకు వెళ్లనున్నారు.రాష్ట్రపతి ఉదయం 11.55 నుండి మధ్యాహ్నం 12.25 వరకు శబరిమలలో ఉండనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్‌కు సమస్యకేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు సమస్య తలెత్తింది. ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ తర్వాత ఓ వైపు కూరుకుపోయిన హెలికాప్టర్గుంతలో ఇరుక్కుపోవడంతో అక్కడే ఆగిపోయిన ఆర్మీ హెలికాప్టర్దానిని నెట్టేందుకు పోలీస్, అగ్నిమాపకశాఖ ప్రయత్నం.కొత్తగా వేసిన కాంక్రీట్ కావడంతో అందులో ఇరుక్కుపోయిన హెలికాప్టర్ చక్రం. #WATCH | Kerala: A portion of the helipad tarmac sank in after a chopper carrying President Droupdi Murmu landed at Pramadam Stadium. Police and fire department personnel deployed at the spot physically pushed the helicopter out of the sunken spot. pic.twitter.com/QDmf28PqIb— ANI (@ANI) October 22, 2025👉రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్‌భవన్ నుంచి శబరిమలకు బయలుదేరారు. #WATCH | Thiruvananthapuram, Kerala: President Droupadi Murmu leaves from Raj Bhavan for Sabarimala darshan. pic.twitter.com/3HXjQtwMIJ— ANI (@ANI) October 22, 2025👉రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తిరువనంతపురం చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో తిరువనంతపురంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. రాజ్‌భవన్‌కు ఆమె వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటారు.👉ఇక, ఉదయం హెలికాప్టర్లో నీలక్కల్ చేరుకుని, రోడ్డు మార్గంలో పంపకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గూర్ఖా వాహనంలో(ప్రత్యేక ఫోర్ వీలర్ వాహనం) సన్నిధానం చేరుకుంటారు. శబరిమల సందర్శించిన తర్వాత సాయంత్రం తిరువనంతపురం తిరిగి వస్తారు. ఈ క్రమంలో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు ఏర్పాటు చేశారు.👉రేపు ఉదయం 10.30 గంటలకు రాజ్ భవన్లో మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, మధ్యాహ్నం 12.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా శివగిరి చేరుకుని, శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు పాలలోని సెయింట్ థామస్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు వేడుకను ప్రారంభిస్తారు. 24న సాయంత్రం 4.15 గంటలకు కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాలలో జరిగే శతాబ్ది ఉత్సవాల కోసం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరుతారు. -
బీహార్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(prashant Kishor) ఆరోపించారు. మంగళవారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. దానాపూర్, బ్రహాంపూర్, గోపాల్‌గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు.ఈ సందర్బంగా ప్రశాంత్ కిషోర్.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలి’ అని ఆయన కోరారు. ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన బ్రహాంపూర్‌లో తమ అభ్యర్థి సత్యప్రకాశ్ తివారీ సోమవారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ(BJP Party) ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్లి తీవ్రంగా బెదిరించారన్నారు.బీజేపీ నేతలు బెదిరింపుల వల్లే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు గోపాల్‌గంజ్‌లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా, దాన్‌పూర్‌లో అభ్యర్థి అఖిలేశ్ షా తనకు చెప్పారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ప్రజల్లో సడలుతున్న విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలన్నారు. అభ్యర్థులనే కాపాడలేని ఈసీ, ఓటర్లకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన ప్రశాంత్ కిశోర్ బీజేపీ నేతలపై ఆరోపణల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. -
ఐదింట నాలుగు యూపీఐ!
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ రూపురేఖలను యూపీఐ అని పిలిచే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మార్చేసింది. జాతి, మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా యూపీఐ విస్తరించింది. 2022 జనవరి నాటికి యునిక్ యూపీఐ వినియోగదారుల సంఖ్య కేవలం 26.9 కోట్లు. ఈ ఆగస్టు నాటికి ఈ సంఖ్య 50.4 కోట్లకి చేరింది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2022–23లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 74 శాతం కాగా.. 2024–25 నాటికి ఏకంగా 84 శాతానికి పెరిగింది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో సెప్టెంబరులో 1963 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.24.90 లక్షల కోట్లు. 2024 సెప్టెంబరులో లావాదేవీల సంఖ్య 1504 కోట్లు కాగా, వాటి విలువ రూ.20.63 లక్షల కోట్లు. యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే అగ్రస్థానం. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రతి ఐదింటిలో నాలుగు యూపీఐవేనంటే అది ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.‘కానీ’–అమెజాన్‌పే సర్వేమేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘కానీ’, అమెజాన్ పే కలిసి సంయుక్తంగా దేశంలోని 120 పట్టణాల్లో.. డిజిటల్ చెల్లింపులపై అధ్యయనం చేశాయి. మొత్తం 6,000 మందిని సర్వే చేశారు. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు సహా చిన్నచిన్న పట్టణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లలో యూపీఐది సింహభాగం కాగా.. ఆఫ్‌లైన్‌లో మాత్రం ఇప్పటికీ నగదుదే అగ్రస్థానం.రికార్డు స్థాయిలో..2022–23 నుంచి 2024–25 మధ్య రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో.. రాష్ట్ర జీడీపీలో సుమారు 8 శాతం విలువైన యూపీఐ లావాదేవీలు జరగడం విశేషం. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. టాప్ రాష్ట్రాలు..‘ఆన్లైన్’ బాటలో...మొత్తం సర్వే చేసిన వారిలో 90% మంది.. ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులనే ఎంచుకుంటున్నట్టు తెలిపారు. ఆఫ్‌లైన్ కొనుగోళ్లలోనూ (దుకాణాల వంటి చోట్లకు వెళ్లి చేసేవాటిలోనూ).. 56% మంది డిజిటల్ చెల్లింపులే చేశారట. కరెంటు, గ్యాస్ బిల్లు వంటి (యుటిలిటీ) ముఖ్యమైన చెల్లింపులు కూడా 87% మంది డిజిటల్లోనే చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ వాలెట్ల వాడకమూ పెరిగింది. యుటిలిటీ, సబ్స్క్రిప్షన్ల కోసం డిజిటల్ వాలెట్లు వాడుతున్నట్టు 13% మంది చెప్పారు.మహిళలూ ముందంజలో..పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులకు ఇష్టపడుతుండటం గమనార్హం. ఆన్లైన్ కొనుగోళ్ల విషయంలో 88 శాతం మగవాళ్లు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నామంటే.. ఇలా చేస్తామన్న మహిళలు 89 శాతం కావడం విశేషం. మెట్రో నగరాల్లో ఇలాంటి మహిళల శాతం 63 శాతం కాగా, చిన్న పట్టణాల్లో ఇది 47 శాతం.ఎందుకు ‘డిజిటల్’ వైపు?ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఇష్టపడటానికి రెండు ప్రధాన కారణాలు చెప్పారు. అన్ని చోట్లా వాటిని అంగీకరిస్తున్నందున చేస్తున్నామని 57 శాతం, సౌకర్యవంతంగా ఉండటం వల్ల వాటిని వదల్లేకపోతున్నామని 61% మంది చెప్పారు.టాప్ –4 విభాగాలుఎన్పీసీఐ గణాంకాల ప్రకారం.. 2022–23 నుంచి 2024–25 మధ్య యూపీఐ లావాదేవీలు అత్యధికంగా జరిగిన టాప్ విభాగాలు..⇒ కిరాణా, సూపర్ మార్కెట్లు⇒ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లు⇒ ఈటింగ్ ప్లేసెస్, రెస్టారెంట్లు⇒ టెలికమ్యూనికేషన్ సేవలు -
ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మంగళవారం నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్ విభాగంలో చేరిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) తెలిపింది. ఇది గతంలో 2024లో 330, 2023లో 218, 2022లో 312, 2021లో 382గా నమోదైందని సీపీసీబీ గుర్తు చేసింది. పండుగ రోజు, సోమవారం రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే, జనం ఆ పరిమితిని పట్టించుకోలేదు.అర్ధరాత్రి వరకు మోతమోగించారు. సోమవారం రాత్రి కాలుష్య కారక సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)స్థాయిలు 675కు చేరాయని సీపీసీబీ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీపై దట్టమైన బూడిదరంగు మంచు మేఘాలు కమ్ముకున్నాయి. వాయు నాణ్యత రెడ్ జోన్ స్థాయికి చేరుకుంది. వీటన్నిటికీ పంజాబ్ రైతుల పంటవ్యర్థాల దహనమే కారణమని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం నిషేధాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపింది. ఢిల్లీలో దీపావళికి ముందు ఏక్యూఐ 345 ఉండగా, మంగళవారం ఉదయం కేవలం 11 పాయింట్లు పెరిగి 356కి చేరుకుందని పేర్కొంది. -
వేరుపడిన భార్య వస్తువుల్ని 24 గంటల్లోగా అప్పగించాలి
న్యూడిల్లీ: వేరుగా ఉంటున్న భార్యను ఆమె దుస్తులు, ఇతర వస్తువుల్ని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్న ఓ భర్తపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమని పేర్కొంది. ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులను 24 గంటల్లోగా అప్పగించాలని అతడిని ఆదేశించింది. దీపావళి పండుగ జరుపుకునేందుకు తన కుమారుడిని తనతో ఇంటికి పంపించేలా భార్యను ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఆమె కుమారుడిని భర్తతో పంపేందుకు నిరాకరించింది.2022 నుంచి అత్తింట్లో ఉన్న తన వస్తువులను అతడు తీసుకెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది. స్పందించిన ధర్మాసనం ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించింది. ‘వివాహాలు కొన్ని విఫలమవుతుంటాయి. కానీ, భార్య తన దుస్తులు తీసుకోవడానికి కూడా భర్త అనుమతించనంత స్థాయికి దిగజారకూడదు. కలిసి ఉండలేని పరిస్థితి వేరు. ఆమె వస్తువులను 24 గంటల్లో తిరిగి అప్పగించాలని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా, తల్లి, తండ్రి కలిసి తమ కుమారుడిని దగ్గర్లోని గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలని, కావాలనుకుంటే అమ్మమ్మ, తాతయ్యలు కూడా వారితో వెళ్లవచ్చని ధర్మాసనం పేర్కొంది. -
ధర్మ సంస్థాపనకే ‘సిందూర్’
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ధర్మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని బోధించడంతోపాటు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని శ్రీరాముడు మనకు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సిందూర్ ద్వారా ధర్మాన్ని స్థాపించామని, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నామని స్పష్టంచేశారు. ఈ ఏడాది దీపావళికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. దేశంలోని మారుమూల జిల్లాల్లోనూ తొలిసారిగా దీపాల వెలుగులు విరజిమ్మాయని తెలిపారు. అక్కడ నక్సలిజం అంతం కావడంతో ప్రజలు ఉత్సాహంగా దీపావళి నిర్వహించుకున్నారని వివరించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ మంగళవారం దేశ ప్రజలకు లేఖ రాశారు. ప్రధానమంత్రి లేఖలోని వివరాలివీ.. స్థిరత్వం, ప్రగతికి ప్రతీక భారత్ ‘‘చాలా జిల్లాల్లో నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం సమూలంగా తుడిచిపెట్టుపోతున్నాయి. మావోయిస్టులు హింసను వదిలేసి లొంగిపోతున్నారు. ప్రధాన అభివృద్ధి స్రవంతిలో కలిసిపోతున్నారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విధేయత చూపుతున్నారు. ఇది నిజంగా మన దేశం సాధించిన అతిపెద్ద ఘనతగా చెప్పాలి. తదుపరి తరం సంస్కరణలకు ఇటీవల శ్రీకారం చుట్టాం. నవరాత్రుల తొలిరోజు నుంచి జీఎస్టీ రేట్లు తగ్గించాం. జీఎస్టీ బచత్ ఉత్సవంతో దేశ ప్రజలకు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్రపంచమంతటా సంక్షోభాలు, సమస్యలు నెలకొన్న తరుణంలోనూ భారత్‌లో అభివృద్ధి పరుగులు ఆగడం లేదు. స్థిరత్వం, ప్రగతికి ప్రతీకగా మారింది. మనం త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయం. దివ్య దీపాలు వెలిగిద్దాం దీపావళి పండుగ గొప్ప పాఠం నేరి్పస్తోంది. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. దాంతో కాంతి మరింత పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గదు. అదేతరహాలో ఈ దీపావళి సందర్భంగా చుట్టూ ఉన్న సమాజంలో సామరస్యత, సౌభ్రాతృత్వం, సహకారం, సానకూలత అనే దివ్య దీపాలు వెలిగిద్దాం. అయోధ్యలో భవ్య రామమందిరం ప్రాణప్రతిష్ట తర్వాత మనకు ఇది రెండో దీపావళి. మనలో శక్తిని, ఉత్సాహాన్ని నింపే గొప్ప పండుగ ఇది. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.స్వదేశీని ఆదరించండి‘దేశ పౌరులుగా మన ప్రాథమిక బాధ్యతలు, విధులు తప్పనిసరిగా నెరవేర్చాలి. దేశ అభివృద్ధే ధ్యేయంగా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, వినియోగించుకోవాలి. ‘ఇది స్వదేశీ’ అని గర్వంగా చెప్పుకోవాలి. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్దాం. అన్ని భాషలనూ గౌరవిద్దాం. రోజువారీ జీవితంలో స్వచ్ఛతకు పెద్దపీట వేద్దాం. పరిశుభ్రతే మన నినాదం కావాలి. ప్రజలంతా ఆరోగ్య సంరక్షణకు అత్య ధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో మంచినూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకుందాం. అదేసమయంలో యోగా చేయాలని ప్రజలను కోరుతున్నానని మోదీ సూచించారు’ -
పాక్‌కు చుక్కలు చూపించాం
పనాజీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత త్రివిధ దళాలు అద్భుతమైన సమన్వయంతో పనిచేసి, అతి తక్కువ సమయంలోనే పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన సైన్యం పాకిస్తాన్‌ను భయకంపితులను చేసిందన్నారు. వాయుసేన నైపుణ్యాలు, నావికాదళం ధైర్యసాహసాలు పొరుగుదేశానికి చుక్కలు చూపించాయని తెలిపారు. ప్రధాని మోదీ గోవా తీరంలో స్వదేశీ యుద్ధ విమాన వాహకనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై నావికాదళంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.ఆయన ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. రాత్రంతా ఐఎన్ఎస్ విక్రాంత్లోనే ఉన్నారు. సోమవారం ఉదయం యోగా చేశారు. నావికా దళం జవాన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. నేవీ అధికారులు, సిబ్బంది దేశభక్తి గీతాలు ఆలపించారు. ఆపరేషన్ సిందూర్‌లో సైనిక దళాల విజయానికి గుర్తుగా ప్రత్యేకంగా రాసిన పాటను సైతం వారు ఆలపించారు. నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ మిఠాయిలు తినిపించారు. విందు భోజనం చేశారు. పగటిపూట, రాత్రిపూట ఐఎంఐ–27 యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను స్వయంగా తిలకించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశీయంగా నిర్మించుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక ఆత్మనిర్భర్ భారత్‌కు శక్తివంతమైన ప్రతీక అని అభివర్ణించారు. ఈ నౌకను మన నావికాదళానికి అప్పగించడం ద్వారా వలసవాద పాలన నాటి ఆనవాళ్లను వదిలించుకున్నామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుళ్లు మిగిలి్చందని అన్నారు. శత్రువును కాళ్లబేరానికి తీసుకొచి్చందని కొనియాడారు. ఇది కేవలం యుద్ధనౌక కాదని.. 21వ శతాబ్దంలో మన కఠోర శ్రమ, నైపుణ్యం, అంకితభావానికి ఉదాహరణ అని స్పష్టం చేశారు. రక్షణ ఉత్పత్తుల్లో అగ్రస్థానమే లక్ష్యం సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. సైనిక దళాలు మరింత బలోపేతం కావాలన్నారు. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులు ఆపరేషన్ సిందూర్‌లో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సైన్యానికి అవసరమైన వేలాది పరికరాలను దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని, దిగుమతులు నిలిపివేశామని అన్నారు.గత 11 ఏళ్లలో మన రక్షణ ఉత్పత్తులు మూడు రెట్లకుపైగా పెరిగాయని, గత ఏడాది రూ.1.5 లక్షల కోట్లకు చేరాయని హర్షం వ్యక్తంచేశారు. 2014 నుంచి 40కి పైగా దేశీయ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను నావికాదళానికి అప్పగించామని తెలియజేశారు. త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు, పరికరాలు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని సాధించామని వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రస్థానానికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ స్పష్టం చేశారు. కోస్ట్ గార్డుపై ప్రశంసలు తీర రక్షక దళం(కోస్ట్ గార్డు) సేవలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. నేవీతో కలిసి పని చేస్తూ రాత్రింబవళ్లు తీర ప్రాంతాలను చక్కగా కాపాడుతోందని తెలిపారు. నావికా దళం కొత్త జెండాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా నిలిచారని వివరించారు. ఈ సందర్భంగా గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌తోపాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ మోర్ముగోవా, ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ తుశీల్, ఐఎన్ఎస్ తబర్, ఐఎన్ఎస్ తేజ్, ఐఎన్ఎస్ బేత్వా, ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ అదిత్య వంటి విమాన వాహన నౌకలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. అలాగే పలు యుద్ధ విమానాల విన్యాసాలు ఎంతగానో అలరించాయి. నావికా దళం సిబ్బందితో కలిసి నిర్వహించుకున్న ఈ దీపావళి తనకు ఎంతో ప్రత్యేకం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన 2014 నుంచి ప్రతిఏటా దీపావళిని సైనికులతో కలిసి నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. నక్సలిజం నుంచి విముక్తి దేశంలో పదేళ్ల క్రితం 125 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 11కు పరిమితమైందని ప్రధాని మోదీ అన్నారు. మన భద్రతా బలగాల త్యాగాలు, ధైర్యసాహసాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని వివరించారు. మావోయిస్టు ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో ఇదొక మైలురాయి అని చెప్పారు. త్వరలో నక్సలిజం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించడం తథ్యమని స్పష్టంచేశారు. ప్రస్తుతం కేవలం మూడు జిల్లాల్లోనే నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉందన్నారు. నక్సలైట్ల బెడద తప్పిపోవడంతో ఈసారి చాలా జిల్లాల్లో ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా దీపావళి పండుగ చేసుకున్నారని, ఆయా ప్రాంతాల్లో కొనుగోళ్లు అధికంగా నమోదయ్యాయని వెల్లడించారు. నక్సలైట్ల సమస్యను నిర్మూలించడంలో పోలీసులు 90 శాతం విజయం సాధించారని చెప్పారు. -
సెకండ్ హ్యాండ్ ఐనా.. ఐఫోనే!
సాక్షి, స్పెషల్ డెస్క్ : ఐఫోన్.. ఇది చాలామందికి స్టేటస్ సింబల్. బ్రాండ్ న్యూ ఫోన్‌కే కాదు.. పాతదైనా సరే ఐఫోన్‌కు ఏమ్రాతం క్రేజ్ తగ్గలేదు. ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఐఫోన్ హవా నడుస్తోంది. అమ్మకాల సంఖ్య పరంగా సామ్సంగ్ మనదేశంలో నెంబర్‌వన్‌గా ఉన్నప్పటికీ.. వృద్ధి రేటులో మాత్రం ఆపిల్ నంబర్‌వన్‌గా నిలిచింది. మనదేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్లో సామ్సంగ్, యాపిల్ తరవాత వన్ ప్లస్, షియోమి వంటివి ఉన్నాయి.యాపిల్ తయారీ ఐఫోన్–16 విడుదలై, అందుబాటులోకి వచ్చిన తొలి 10 రోజుల్లో అమ్మకాలతో పోలిస్తే.. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్–17 మోడల్ విక్రయాలు చైనా, యూఎస్‌లో 14% అధికంగా నమోదయ్యాయి. భారత్‌లోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కేవలం కొత్త ఐఫోన్లకే గిరాకీ ఉందనుకుంటే పొరపాటే.. మార్కెట్‌ను బట్టి ప్రపంచవ్యాప్తంగా పాత ఐఫోన్ల కోసమూ కస్టమర్లు ఎగబడుతున్నారు. భారత్‌లో చేతులు మారుతున్న (సెకండ్ హ్యాండ్) పాత ఫోన్లలో అయిదింట మూడు ఐఫోన్లేనని రీసేల్ ప్లాట్‌ఫామ్ ‘క్యాషిఫై’ చెబుతోంది. ప్రీమియం మోడళ్ల పట్ల పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. ఆ సంస్థ సర్వే ప్రకారం కొనుగోలుదారుల్లో దాదాపు మూడోవంతు మంది.. రూ.21,000 నుంచి రూ.35,000 వరకు సెకెండ్ హ్యాండ్ ఫోన్ల కోసం వెచ్చిస్తున్నారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పెరుగుతున్నఆకాంక్షఇప్పటికే మొబైల్ ఫోన్ల విస్తృతి పెరగడం, కస్టమర్లు ఎక్కువ కాలంపాటు మొబైల్స్ వినియోగిస్తున్న కారణంగా యూరప్, యూఎస్ఏ, జపాన్ వంటి మార్కెట్లలో 2025 జనవరి–జూన్ మధ్య ప్రీ–ఓన్డ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో పెరుగుదల నమోదైంది. ఆఫ్రికా, భారత్, ఆగ్నేయాసియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోనూ అమ్మకాలు పెరగడం విశేషం. ప్రీమియం మోడళ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం ప్రీ–ఓన్డ్ అమ్మకాలకు కారణమవుతోంది. ప్రజల్లో అత్యధికులకు యాపిల్ ఫోన్లను కలిగి ఉండాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. కానీ తలసరి ఆదాయం ఆ స్థాయిలో లేదు. అందుకే కొత్త ఫోన్ కొనలేకపోయినా.. కనీసం సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా సొంతం చేసుకోవాలనుకుంటున్నారు.భారత్‌లో 5 శాతంజనవరి–జూన్ కాలంలో 2024తో పోలిస్తే 2025లో పాత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ఆఫ్రికాలో 6 శాతం, భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో చెరి 5 శాతం దూసుకెళ్లింది. యూఎస్ఏ, చైనా, లాటిన్ అమెరికా, జపాన్ దేశాలు చెరి 3 శాతం, యూరప్‌లలో ఒక శాతం వృద్ధి నమోదైందని మార్కెట్ పరిశోధన సంస్థ ‘కౌంటర్‌పాయింట్’ వెల్లడించింది. అయితే అన్ని మార్కెట్లలోనూ రీఫర్బిష్డ్ విభాగంలో యాపిల్ ఐఫోన్ల హవా నడుస్తుండడం విశేషం. 19 శాతం పెరిగి..భారత్‌లో రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తొలి స్థానంలో ఉన్న సామ్సంగ్ విక్రయాలుఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో 1 శాతం తగ్గాయి. గెలాక్సీ ఎస్22, ఎస్21 అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఉన్నాయి.ఐఫోన్ 13, 14 సిరీస్ లను వినియోగదారులు ఇష్టపడు తుండటంతో యాపిల్ అమ్మకాలు ఏకంగా 19 శాతం పెరిగి, రెండో స్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ వెల్లడించింది.ఐఫోన్ ముచ్చట్లు» ప్రపంచవ్యాప్తంగాఐఫోన్ కస్టమర్లు..156 కోట్లకుపైమాటే» 2024లోఅంతర్జాతీయంగా ఐఫోన్ అమ్మకాలు.. 23 కోట్లకుపైనే» గతఏడాది భారత్‌లో అమ్ముడైన ఐఫోన్స్.. 1.2 కోట్లు» భారత్‌లో 2024–25లో కంపెనీ ఆదాయం 13 శాతం వృద్ధితో 900 కోట్ల డాలర్లు» 2025లో వాడేసిన, రిఫర్బిష్డ్ ఫోన్లప్రపంచ మార్కెట్ విలువ 6500 కోట్ల డాలర్లకుపైనేఉంటుందని అంచనా. -
దంతాలు దొరికాయి.. రాకాసి ఏనుగు ఎక్కడో.?
స్టెగొడాన్..ఒకప్పుడు భూమిపై సంచరించిన రాకాసి ఏనుగుల జాతి ఇది. ఇవి దాదాపు ఆరు వేల ఏళ్ల క్రితం అంతరించాయి. నాలుగేళ్ల క్రితం మన రాష్ట్రంలో 8 అడుగుల పొడవైన ఈ ఏనుగు దంతాల శిలాజాలను కనుగొన్నారు. దంతాలు దొరికిన చోట అన్వేషిస్తే ఏనుగు శిలాజం కూడా దొరకవచ్చు కదా అనే ఆసక్తితో పురావస్తు శాఖ తవ్వకాలకు సిద్ధమవుతోంది. స్టెగొడాన్ ఏనుగులు ఇప్పుడున్న ఏనుగులతో పోలిస్తే చాలా పెద్దగా ఉండేవి. దాదాపు 13 అడుగుల ఎత్తు, 13 టన్నులకుపైగా బరువు ఉండే భారీ జీవిలివి. 11 మిలియన్ సంవత్సరాల నుంచి 6 వేల ఏళ్ల క్రితం వరకు భూమిపై ఇవి మనుగడ సాగించాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో క్రమంగా అంతరించిపోయాయి. ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో చివరకు 6 వేల ఏళ్ల క్రితం జీవించి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుత రామగుండం పరిసర ప్రాంతాలు కూడా ఒకప్పుడు వాటి ఆవాసాలే. ఈ ప్రాంతంలో అవి విస్తారంగా తిరిగినట్టు నాలుగేళ్ల క్రితం జాడలు వెలుగు చూశాయి. అప్పట్లో రామగుండం భూ ఉపరితల గనుల్లో మేడిపల్లి ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా కొన్ని శిలాజాల (ఫాసిల్స్)ను గుర్తించారు. వాటిని నిపుణుల దృష్టికి తీసుకెళ్లగా... అవి స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలుగా తేల్చారు. ఆ ముక్కలు రెండు ఏనుగులకు చెందిన రెండు జతల దంతాలుగా గుర్తించి వాటిని సేకరించారు. వాటిల్లో రెండు దంతాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సాయంతో అతికించి పూర్తిస్థాయి దంతాల రూపు కల్పించారు. ఆ జాతి ఏనుగుల దంతాలు 12 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇక్కడ గుర్తించిన దంతాల పొడవు దాదాపు 8 అడుగులు ఉంది. ఏనుగు కోసం అన్వేషణ.. జీపీ బిర్లా ఆర్కియోలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయరెడ్డి బృందం సింగరేణి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ రెండు దంతాలను తెచ్చి బిర్లా సైన్స్ సెంటర్లోని డైనోసార్ శిలాజం ఉన్న మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మరో రెండు దంతాల ముక్కలను సింగరేణి అధికారులు హైదరాబాద్‌లోని జూపార్కుకు అందజేశారు. ఈ విషయం తెలిసి తెలంగాణ వారసత్వ (పురావస్తు శాఖ) శాఖ డైరెక్టర్ అర్జునరావు కొద్ది రోజుల క్రితం సింగరేణి సీఎండీ బలరామ్‌ను కలిసి వాటిని తమకే అప్పగించాలని కోరారు. ఆ ప్రాంతంలో తాము శిలాజాలను అన్వేషించేందుకు సహకరించాలని కోరగా, బలరామ్ అంగీకరించారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని యామనపల్లి ప్రాంతంలో డైనోసార్ శిలాజాలు లభించాయి. మరిన్నిశిలాజాలను సేకరిస్తాంకొత్తగా బిర్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలను సగటున రోజుకు మూడున్నర వేల మంది వీక్షిస్తున్నారు. వీటికి మంచిఆదరణ వస్తోంది. దీంతో మరిన్ని శిలాజాలను సేకరించి ప్రదర్శనకుఉంచాలని నిర్ణయించాం. సింగరేణి సంస్థతోసంప్రదింపులుజరుపుతున్నాం. ఇతరుల వద్ద శిలాజాలు ఉన్నాసేకరించి ప్రదర్శనకుఉంచుతాం. -డా.మృత్యుంజయరెడ్డిజీపీ బిర్లా ఆర్కియోలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్.శిలాజాలను గుర్తించి జనం ముందుకు తెస్తాం వేలు, లక్షల ఏళ్ల నాడు అంతరించిన జంతువులు భూగర్భంలో శిలాజాలుగా మారి అనవాళ్లుగా ఉన్నాయి. వాటిని వెలికి తీసి ప్రజల ముందుకు తేవాలన్నది మా ప్రయత్నం. గతంలో సింగరేణి సంస్థకు స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలు లభించిన చోట అన్వేషిస్తే ఆ ఏనుగుల అవశేష శిలాజాలు దొరికే వీలుంది. వాటితోపాటు ఇతర అరుదైన జీవజాతుల శిలాజాలను కూడా వెలుగులోకి తెస్తాం. మరో రెండు రోజుల్లో మా ఇద్దరు అధికారులు రామగుండంలోని మేడిపల్లికి వెళ్లి సింగరేణి నిపుణులతో కలిసి రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తారు. ఆ తర్వాత తవ్వకాలు జరిపి అన్వేషిస్తాం. -అర్జునరావు తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్శిలాజాలు విస్తారంగా దొరుకుతున్నాయిఉమ్మడి ఆదిలాబాద్‌లో విస్తారంగా జీవజాతుల శిలాజాలు వెలుగుచూస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం మేంగుర్తించిన స్టెగొడాన్ జాతి ఏనుగుదంత శిలాజాలను బీఎం బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మాకు లభించే శిలాజాలను జనంఎక్కువ మంది చూడగలిగే చోటఉంచేందుకు అందజేస్తాం. త్వరలోకొన్ని శిలాజాలను అటు పురావస్తు శాఖకు, బిర్లా సైన్స్ సెంటర్కుఇవ్వనున్నాం. -శ్రీనివాసరావు సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ జీఎం-సాక్షి, హైదరాబాద్ -
11ఏళ్ల పాప కప్‌బోర్డ్‌లో ఆత్మహత్య చేసుకుంటుందా?
కోల్‌కతా: ఆర్జీకర్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అతని కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతని మేన కోడలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది.కోల్‌కతా భోవానిపూర్ ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సోమవారం 11 ఏళ్ల బాలిక అల్మారాలో శవమై కనిపించింది. బాలికను పాక్షికంగా ఉరికి వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. బాలిక మరణానికి బాలిక త్రండి భోళా సింగ్, సవతి తల్లి పూజ కారణమంటూ స్థానికులు వారిపై దాడి తెగబడ్డారు. తండ్రి, సవతి తల్లి.. బాలికను మానసికంగా,శారీరకంగా హింసించి ఆపై ప్రాణాలు తీశారు. ఈ దారుణంపై కోపంతో రగిలిపోయిన స్థానికులు భోళా సింగ్,పూజలకు దేహశుద్ధి చేశారు. స్థానికులు సవతి తల్లి జుట్టు పట్టుకుని తన్నారు. తండ్రిని బూట్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.దాడి చేస్తున్న స్థానికుల నుంచి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతిని అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. పోస్టు మార్టం పూర్తయిన తర్వాత బాలికది ఆత్మహత్యనా? హత్యనా? అన్నది తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల తీరుపై స్థానికులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 11ఏళ్ల బాలిక కప్‌బోర్డులో ఆత్మహత్య చేసుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. బాలిక మరణానికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 2024 ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసుపై విచారణ పూర్తి చేసిన సీల్ధా జిల్లా కోర్టు, సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. -
అమిత్ షా కామెంట్స్.. నితీశ్‌కు టెన్షన్!
బిహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. మొదటి దశ పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రధాన కూటములు ఎన్డీఏ, మహాఘఠ్బందన్ గెలుపు వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిష్టిస్తారనే అనుమానం తాజాగా మొదలయింది. బిహార్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు మరో చాన్స్ ఉంటుందా, లేదా అనే చర్చ నడుస్తోంది. నితీశ్ మద్దతుదారులు మాత్రం ఆయనే మళ్లీ సీఎం అంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే, ఎవరు సీఎం అవుతారనే దానిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలతో నితీశ్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక టీవీ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. "నితీష్ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ముందుగా తమ తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు. తర్వాత వారు కలిసి కూర్చుని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తారు" అని అన్నారు.నితీశ్‌కు బీజేపీ ధోకాఅమిత్ షా వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. నితీశ్ కుమార్‌కు బీజేపీ ధోకా ఇవ్వడం ఖాయమన్నట్టుగా ప్రచారం మొదలు పెట్టాయి. నితీశ్ మరోసారి సీఎం కాలేరని అమిత్ షా స్పష్టంగా చెప్పారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని ఎక్స్‌లో బీజేపీ వీడియో షేర్ చేసింది. అమిత్ షా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని, స్వప్రయోజనాల కోసం బిహార్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కమలనాథులు కౌంటర్ ఇచ్చారు.షాకు చిరాగ్ మద్దతు!అమిత్ షాకు మద్దతుగా బీజేపీ కీలక మిత్రుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. "ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాధారణ ప్రక్రియ గురించి అమిత్ షా ప్రస్తావించారు. ఐదు పార్టీలతో కూడిన మా కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను గౌరవించాలి" అని అన్నారు. కాగా, సీట్ల పంపిణీ వ్యవహారంలో చిరాగ్ గట్టిగా పట్టుబట్టి లోక్ జన్ శక్తి పార్టీకి 29 సీట్లు సాధించుకున్న సంగతి తెలిసిందే.ముందే ప్రకటించాలిహిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మాత్రం భిన్నంగా మాట్లాడారు. కూటమిలో క్లారిటీ, యునిటీ కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించాలన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ రాష్ట్రీయ లోక్‌మంచ్ (RLM) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లో గెలుస్తామని, మళ్లీ అధికారంలోకి వస్తామని మీడియాతో అన్నారు.పీకే జోస్యం ఫలిస్తుందా?నితీశ్ కుమార్‌కు ఈసారి అధికార యోగం లేదని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చెబుతూ వస్తున్నారు. జేడీయూకి పరాభవం తప్పదని, 25 సీట్లు కూడా రావని ఆయన అంటున్నారు. శారీరకంగా అలసిపోయి, మానసికంగా బలహీనపడిన నితీశ్ కుమార్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించలేరని పేర్కొన్నారు. జేడీయూ సంప్రదాయ ఓట్లకు జన్ సురాజ్ పార్టీ గండి కొడుతుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేస్తున్నారు.చదవండి: 3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారంనల్లేరు మీద నడక కాదుబిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ ఫేస్‌గా నితీశ్ కుమార్ ప్రస్తుతం ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితుల గురించి అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించడంతో చర్చ మొదలైంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు సాధించి, జేడీయూకు తక్కువ సీట్లు వస్తే నితీశ్‌కు సీఎం పదవి కట్టబెడతారా, లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 14న వెలువడే ఎన్నికల ఫలితాలపై నితీశ్ భవితవ్యం ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు..కన్సల్టెంట్‌గా అడ్వొకేట్ ఉమేష్ సాల్వి
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వివాదంలో భాగంగా ఆ కేసును విచారించే జడ్డిల కమిటీకి సహాయం చేయడానికి న్యాయవాది కరణ్ ఉమేష్ సాల్వి కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా.. ఉమేష్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియలను ప్రారంభించడానికి లోక్‌సభలో మద్దతు ఇచ్చిన తీర్మానం తర్వాత ఈ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా సదర కమిటీకి న్యాయ సహాయం అందించడానికి కరణ్ ఉమేష్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలన్న ప్రతిపాదనపై ఆగస్టు నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 146 మంది ఎంపీలు సంతకాలు చేశారు. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జిల ప్యానల్‌ను నియమించగా, తాజాగా కరణ్ ఉమేవ్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమించారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ శ్రీవాస్తవ్, సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్యలు సభ్యులుగా ఉన్నారు. ఇదీ చదవండి: పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్లతో తక్షణ చర్యలు -
అవినీతి నిరోధక సంస్థలో రూ.5 కోట్ల హైఎండ్ కార్లా? మండిపడుతున్న నెటిజన్లు
దేశంలోని అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ అయిన లోక్‌పాల్ (Lokpal) హై ఎండ్ లగ్జరీ కార్లకోసం అన్వేషిస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ ఏజెన్సీల నుండి ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తోందన్న వార్త నెట్టింట తీవ్ర చర్చకు తెరతీసింది.అక్టోబర్ 16న జారీ చేసిన నోటిఫికేషన్లో లోక్‌పాల్ 7 BMW లగ్జరీ కార్లను కోరుకుంటోంది. వాటి ధర ఒక్కొక్కటి రూ. 70 లక్షలు. BMW 3 సిరీస్ Li కార్లను ఏడింటిని కొనుగోలు చేయడానికి టెండర్‌ను పిలిచింది, ఛైర్పర్సన్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్తో సహా ప్రతి సభ్యునికి ఒకటి చొప్పున వీటిని కేటాయించనున్నారు. అంతేకాదు కార్ల తయారీ సంస్థ BMW లోక్‌పాల్ డ్రైవర్లు ,సిబ్బందికి ఏడు రోజుల 'శిక్షణ' అందించనుంది. ఈ శిక్షణలో కార్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు కార్యకలాపాలపై వారికి ట్రెయినింగి కూడా ఇవ్వాలట. టెండర్ నోటీసు ప్రారంభ తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది.The institution of Lokpal has been ground to dust by the Modi govt, by keeping it vacant for many years & then appointing servile members who are not bothered by graft & are happy with their luxuries. They are now buying 70L BMW cars for themselves! pic.twitter.com/AEEE2gPMtp— Prashant Bhushan (@pbhushan1) October 21, 2025 విమర్శలు, నెటిజన్లు రియాక్షన్స్ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లోఆగ్రహాన్ని రేకెత్తించింది. విలాసాలతో లోక్‌పాల్ ప్రతిష్టను మంటగలుపు తున్నారంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. ఒకపుడు జవాబుదారీతనానికి చిహ్నంగా ఉన్న లోక్‌పాల్ గౌరవం దిగజారుతోందని, సంస్థలో కీలక నియామకాలు చేపట్టలేని ప్రభుత్వం విలాసవంతమైన విదేశీ కార్లను ఎందుకు కొనుగోలు చేస్తోందని యూత్ కాంగ్రెస్ విభాగం విమర్శలు గుప్పించింది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇపుడు ఒక్కొక్కిరికీ రూ. 70 లక్షల విలువైన కారు. తరువాత రూ. 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు అంటూ సెటైర్లు వేశారు. -
దీపావళి బోనస్ ఇవ్వలేదని భారీ నష్టం తెచ్చారు!
దీపావళి బోనస్ (Diwali Bonus) ఇవ్వకపోవడంపై నిరసనగా ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయ నష్టాన్ని కలిగించింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేలోని ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం గంటలపాటు గేట్లు తెరిచి ఉంచడంతో వేలాది వాహనాలు టోల్ చెల్లించకుండా టోల్ గేట్ దాటి వెళ్లిపోయాయి.దేశమంతా ఘనంగా జరుపుకొనే అతిపెద్ద పండుగ దీపావళి. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీల నుంచి చిన్నాచితకా సంస్థల వరకు తమ ఉద్యోగులకు ఎంతో కొంత మొత్తాన్ని దీపావళి బోనస్‌ల కింద ఇస్తుంటాయి. శ్రీసాయి, దాతార్ టోల్ ఆపరేటింగ్ సంస్థలకు చెందిన ఉద్యోగులు కూడా తమకు దీపావళి బోనస్ లభిస్తుందని ఆశించారు.గత వారం దీపావళి సందర్భంగా తమ బోనస్ లు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని కంపెనీ హామీ ఇచ్చిందని, కానీ బోనస్‌లు జమ కాలేదని ఆందోళనకారులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆదివారం రాత్రి టోల్ బూత్ బూమ్ బారియర్ ను తెరిచి సమ్మెలో కూర్చున్నారు. 10 గంటల పాటు కొనసాగిన ధర్నా అధికారులు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన తరువాత విరమించారు.“నేను ఏడాదిగా కంపెనీలో పనిచేస్తున్నాను. మాకు ఎటువంటి బోనస్ ఇవ్వలేదు. జీతాలు కూడా ఆలస్యంగా వస్తున్నాయి” అని ఒక ఉద్యోగి మీడియాకు తెలిపారు. బోనస్ ఇవ్వకపోగా కొత్త ఉద్యోగులను పెట్టుకుంటామని సంస్థ ప్రతినిధులు బెదిరించడం ఉద్యోగులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.ఫతేహాబాద్ టోల్ ప్లాజా ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రవేశ మార్గంగా ఉంటోది. ఢిల్లీ-ఎన్సీఆర్ను యమునా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా లక్నోకు అనుసంధానించే ఈ మార్గం దేశానికి కీలకమైన వ్యూహాత్మక రహదారిగా గుర్తింపు పొందింది.ఇదీ చదవండి: జియో దీపావళి ఆఫర్.. ప్లాన్లపై ‘అన్లిమిటెడ్’ ప్రయోజనాలు -
పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్లతో తక్షణ చర్యలు
న్యూఢిల్లీ: భారతదేశం అంతటా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశప్రజలంతా ఉత్సాహంగా టపాసులు కాల్చారు. అయితే వీటి ప్రభావం పొరుగునున్న పాకిస్తాన్‌పై పడింది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో కాల్చిన బాణసంచా పాక్‌వైపు పొగమంచుగా వెళ్లింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, రాజధాని నగరం లాహోర్‌లో గాలి నాణ్యత బాగా క్షీణించిందని పాక్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది.దీపావళి నేపధ్యంలో భారత్‌లో విడుదలైన ఉద్గారాలు, కాలుష్యకారకాలు పాక్‌లోకి ప్రవేశించి, అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని కరాచీలోని డాన్ పత్రిక పేర్కొంది. పంజాబ్ పర్యావరణ పరిరక్షణ విభాగం (ఈపీడీ) తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ, ఇతర ఉత్తర భారత నగరాల నుండి విడుదలైన కాలుష్య కారకాలను మోసుకెళ్లే గాలులు.. పాకిస్తాన్ పంజాబ్‌లో వాయు పరిస్థితులు దిగజారడానికి గణనీయంగా దోహదపడ్డాయి. మంగళవారం ఉదయం నాటికి లాహోర్ లో గాలినాణ్యత(ఏక్యూఐ)266కు దిగజారింది. దీంతో ప్రపంచంలో రెండవ అత్యంత కలుషిత నగరంగా లాహార్ మారిపోయింది. న్యూఢిల్లీ తర్వాత ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరింది. پنجاب حکومت نے دیوالی کے دوران فضائی آلودگی سے نمٹنے کے لئے جامع پلان پر عملدرآمد شروع کر دیا امرتسر، لدھیانہ اور ہریانہ سے آنے والی ہوائیں فضا میں آلودگی لائیں گی، لاہور کا AQI 210 سے 230 تک رہنے کا امکان، آلودہ ہاٹ اسپاٹس پر اینٹی سموگ گنز اور پانی کے چھڑکاؤ کا آپریشن رات سے… pic.twitter.com/IkqtTdyTkJ— Marriyum Aurangzeb (@Marriyum_A) October 20, 2025విషపూరిత గాలిని తట్టకునేందుకు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం లాహోర్‌లోని ముఖ్య రహదారులపై యాంటీ స్మోగ్ గన్లను వినియోగించడం, నీరు చల్లడం లాంటి అత్యవసర చర్యలను ప్రారంభించింది. కాలుష్య నియంత్ర కార్యకలాపాల కోసం తొమ్మిది విభాగాలను ఏర్పాటు చేశారు. స్మోగ్ రెస్పాన్స్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు, గాలిని కలుషితం చేస్తున్న వారిపై అధికారులు దాడులకు ఉపక్రమించారు. గంటకు 4 నుండి 7 కి.మీ వేగంతో గాలి వీచడంతో, గాలిలోని కణాలు సరిహద్దులు దాటి లాహోర్, ఫైసలాబాద్, గుజ్రాన్వాలా, సహివాల్, ముల్తాన్ తదితర పాకిస్తాన్ నగరాలను ప్రభావితం చేస్తున్నాయి.పాక్ మంత్రి మరియం ఔరంగజేబ్ ప్రస్తుత పరిస్థితిని పెను పర్యావరణ సవాలుగా అభివర్ణించారు. అమృత్సర్, లూథియానా, హర్యానా నుండి వచ్చే గాలులు కాలుష్యాన్ని మోసుకొస్తున్నాయని ఆరోపించారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రాంతాలలో నిర్మాణాలను నిలిపివేయనున్నామని, కీలక రహదారుల్లో ట్రాఫిక్‌ను పరిమితం చేస్తామని, పొగను విడుదల చేసే వాహనాలపై జరిమానా విధించనున్నమని ఆమె హెచ్చరించారు. మరోవైపు లాహోర్ పోలీసులు పలు ప్రాంతాల్లో కాలుష్యాన్ని వ్యాప్తిచేస్తున్న 83 మందిని అరెస్టు చేశారు. వీరిలో పరిశ్రమల నిర్వాహకులు, టైర్లు లాంటివి తగలబెడుతున్నవారు ఉన్నారు. ఇది కూడా చదవండి: Karnataka: ‘వరల్డ్ రికార్డు’తో సీఎం సిద్దరామయ్య నవ్వులపాలు? -
3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారం..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. టిక్కెట్లు దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భోజ్‌పురి సూపర్‌స్టార్ ఖేసరి లాల్ యాదవ్ తాజాగా నామినేషన్ వేశారు. సరన్ జిల్లాలోని చాప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థిగా పోటీకి దిగారు.నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''నా హృదయం ఎప్పుడూ ఆర్జేడీతోనే ఉంద''ని అన్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ఆయన తన భార్య చందాతో కలిసి ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) సాదరంగా ఖేసరి లాల్ యాదవ్, ఆయన భార్యను పార్టీలోకి ఆహ్వానించారు. వారికి స్వయంగా పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.కాగా, తన ఆస్తుల విలువ ₹24.81 కోట్లు అని ఖేసరి లాల్ యాదవ్ (Khesari Lal Yadav) ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ₹16.89 కోట్ల విలువైన చరాస్తులు, ₹7.91 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. భార్య చందా యాదవ్ కు ₹90.02 లక్షల విలువైన చరాస్తులు, ₹6.49 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. తన అసలు పేరు శత్రుఘ్న యాదవ్‌గా అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద ₹5 లక్షల నగదు.. తన సతీమణి వద్ద ₹2 లక్షల నగదుతో పాటు ₹35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 2023–24లో ఖేసరి లాల్ యాదవ్ వార్షిక ఆదాయం ₹73.5 లక్షలుగా ఉంది. 2022–23లో ₹95.02 లక్షలు, 2020–21లో ₹1.01 కోట్లుగా ఉంది. ఖేసరి లాల్ యాదవ్ ఆస్తుల్లో 2023లో కొనుగోలు చేసిన ₹3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ కారు కూడా ఉంది.పాలు అమ్మి.. స్టార్‌గా ఎదిగిసామాన్య కుటుంబంలో పుట్టిన ఖేసరి లాల్ యాదవ్ తన ప్రతిభతో సెలబ్రిటీగా ఎదిగారు. ఆయన తండ్రి మంగరు యాదవ్ ఒకప్పుడు ఉదయం వీధి వ్యాపారిగా, రాత్రిళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. తన బాల్యంలో తమ గ్రామంలో పశువులను మేపుతూ పాలు అమ్మేవాడినని ఖేకరీ పలు సందర్బాల్లో చెప్పారు. నటుడిగా, గాయకుడిగా ఎదిగిన ఆయన వందకు పైగా భోజ్‌పురి చిత్రాలలో నటించారు. 5 వేలకు పైగా పాటలు పాడారు. తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నారు.చదవండి: బిహార్ ఎన్నికల్లో 'వెరైటీ' ఫ్రెండ్లీ ఫైట్!యువతలో ఫాలోయింగ్భోజ్పురిలో ఖేసరి లాల్ యాదవ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత, వలస కార్మికులు ఆయనను బాగా ఇష్టపడతారు. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన సరన్ జిల్లాలో ఖేసరి లాల్ యాదవ్ ప్రభావం ఉంటుందని ఆర్జేడీ అంచనా వేస్తుంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో దశ పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. -
మాజీ డీజీపీ కొడుకు కేసులో భయానక ట్విస్ట్
మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్ వెలుగు చూసింది. తన భార్యతో తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా వెనకడలేదని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.పంజాబ్ మాజీ డీజీపీ(మానవ హక్కుల) ముహ్మద్ ముస్తాఫా తనయుడు అకీల్ అక్తర్(35)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచకుల నివాసంలో అక్టోబర్ 16వ తేదీన అకీల్ విగతజీవిగా కనిపించాడు. అయితే డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది. ఈలోపు పొరుగింట్లో షామ్‌షుద్దీన్ చౌద్రీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే.. సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, తననూ చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అకీల్ వివరించాడు. ఆగస్టు 27వ తేదీన రికార్డు చేసిన ఆ వీడియో 16 నిమిషాల నిడివి ఉంది. ఇంకా అందులో.. తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్ చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని ఫిర్యాదుదారి షాముద్దీన్ కోరుతున్నాడు. దీంతో.. ముస్తాపా, ఆయన సతీమణి(మాజీ మంత్రి కూడా) రజియా సుల్తానా, వీళ్ల కూతురు, కోడలి(మాజీ)పైనా బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
Karnataka: ‘వరల్డ్ రికార్డు’తో సీఎం సిద్దరామయ్య నవ్వులపాలు?
బెంగళూరు: తమ ప్రభుత్వం చేపట్టిన పథకానికి ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ నుంచి సర్టిఫికెట్ అందిందని గొప్పగా ప్రకటించిన కర్ణాటక సీఎం ఇప్పుడు నవ్వులపాలవుతున్నారు. ఆ సర్టిఫికెట్ నకిలీదని తేలిన దరిమిలా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల.. రాష్ట్రంలోని మహిళలకు ‘శక్తి యోజన’పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించామని, ఈ నేపధ్యంలో మహిళలు అత్యధికంగా ఉచితంగా బస్సు ప్రయాణాలు చేశారని తెలిపారు. దీనిని ప్రపంచ రికార్డుగా ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించిందని ప్రకటించారు. కర్ణాటక రెండు చరిత్రాత్మక రికార్డులతో ప్రపంచ వేదికపైకి ప్రవేశించిందని పేర్కొన్నారు.‘శక్తి యోజన’ పథకం కింద మహిళలు మొత్తంగా 564.10 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, ఇది మహిళల రోజువారీ ప్రయాణాలలో కొత్త రికార్డు అని సిద్దరామయ్య తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. దీనికితోడు కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ 1997 నుంచి ఇప్పటివరకూ 464 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుందని చెబుతూ, రెండు సర్టిఫికెట్ల ఫొటో కాపీలను షేర్ చేశారు.ఈ రెండు సర్టిఫికెట్లపై లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్(ఇండియా)డాక్టర్ అవినాష్ డి. సకుండే, యూరోపియన్ యూనియన్ హెడ్(క్రొయేషియా)డాక్టర్ ఇవాన్ గచినాల సంతకాలున్నాయి. A BIG embarrassment for Congress.Yesterday, no less than Karnataka CM Siddaramaiah proudly claimed that two state schemes were recognised by the London Book of Records.Turns out — it’s FAKE. Someone literally conned the Congress! 😂The so-called “certificate” is full of… pic.twitter.com/N0NPu3OUji— Amit Malviya (@amitmalviya) October 17, 2025ఈ సర్టిఫికెట్లను గమనించిన ప్రతిపక్ష పార్టీలు ఇది కేవలం ప్రచార స్టంట్ అని ఆరోపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత పథకాలకు అధికంగా ఖర్చు చేస్తోందని, రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు మొత్తం రూ.6,330 కోట్ల అప్పును కలిగి ఉన్నాయని, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపాయి. కాగా ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ బ్రిటన్‌లో నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ. ఈ సంస్థ అధికారికంగా 2025, జూలై 15న మూతపడింది. అవినాష్ ధనంజయ్ సకుండే 2024, జూన్ 28న ఈ సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పుడు మనుగడలో లేదు. దీంతో కర్ణాటక ప్రభుత్వం చూపిస్తున్న సర్టిఫికెట్లు చెల్లనివని నిరూపితమయ్యాయి. బీజేపీ నేత అమిత్ మాలవియ కర్నాటక ప్రభుత్వం చూపిస్తున్న సర్టిఫికెట్లు ఫేర్ అంటూ ఆధారాలతో సహా షేర్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సీఎం సిద్దరామయ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.ఇది కూడా చదవండి: Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం -
వివాదం వేళ ట్విస్ట్.. డీకేతో కిరణ్ మజుందార్ షా భేటీ
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బయోకాన్(Biocon) ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా(Kiran Mazumdar-Shaw) భేటీ అయ్యారు. బెంగళూరు రోడ్ల దుస్థితి, చెత్త సమస్యలపై ఇటీవల బయోకాన్ ఛైర్మన్ పోస్టులు పెట్టారు. దీనిపై డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కిరణ్ మజుందార్‌కు మద్దతుగా నిలిచిన పారిశ్రామిక వేత్త హర్ష్ గొయెంకా.. సమస్యకు పరిష్కారం వెతకకుండా.. రాజకీయాలా? అంటూ నేతలపై మండిపడ్డారు.ఈ రోడ్లపై వివాదం నేపథ్యంలో డీకేతో బయోకాన్ ఛైర్మన్ భేటీ కావడం విశేషం. సమావేశంలో నగర మౌలిక సదుపాయాలపై ఆమె చేసిన విమర్శలపై చర్చ జరిగినట్లు సమాచారం. శివకుమార్ ఆమెకు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ‘‘ఈ రోజు తన నివాసంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్-షాను కలవడం ఆనందంగా ఉందంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రగతి దిశలో ముందుకు సాగే మార్గం గురించి తాము చర్చ జరిపాం’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.#WATCH | Bengaluru | Biocon Chairman, Kiran Mazumdar Shah met Karnataka Deputy Chief Minister DK Shivakumar. Visuals from outside Dy CM DK Shivakumar's residence. https://t.co/ktBNzwI3AO pic.twitter.com/qLF9l3zo2M— ANI (@ANI) October 21, 2025ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఓ విదేశీ విజిటర్.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానంటూ ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో ఆ పోస్టుపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిస్తూ.. కాస్త ఘాటుగా బదులిచ్చారు. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు. It was a pleasure to meet Ms. @kiranshaw, entrepreneur and Founder of Biocon, at my residence today. We had an engaging discussion on Bengaluru’s growth, innovation, and the path ahead for Karnataka’s growth story. pic.twitter.com/NsEkos6tFS— DK Shivakumar (@DKShivakumar) October 21, 2025 -
బిహార్ ఎన్నికల్లో ‘వెరైటీ’ ఫ్రెండ్లీ ఫైట్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకంపై స్పష్టమైన ప్రకటనేదీ చేయకుండానే రాష్ట్రీయ జనతాదళ్(RJD), కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు.. తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేశాయి. దీంతో మహాఘట్ బంధన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. పైగా కీలకమైన 11 స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు తలపడబోతుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఈ పోటీని ఫ్రెండ్లీ ఫైట్‌గా అభివర్ణించుకున్నప్పటికీ.. బీజేపీ, జేడీయూ, ఇతర ఎన్డీయే మిత్రపక్షాలు మాత్రం విపక్ష కూటమిని ఎద్దేవా చేస్తున్నాయి. ఈలోపు.. ఊహించని పరిణామం ఒకటి అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే.. తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ప్రచారం చేయాల్సి రావడం!.గౌర బౌరమ్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అఫ్జల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ అఫ్జల్ తరఫున కాకుండా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(VIP Candidate) సంతోష్ సాహ్నికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.గౌర బౌరమ్ నియోజకవర్గంలో పోటీకి ఆర్జేడీ తరఫున అఫ్జల్ అలీ ఖాన్‌ను తొలుత అధిష్టానం ఎంచుకుంది. ఆ పార్టీ అధినేత లాలూ తన నివాసానికి పిలిచి మరీ అఫ్జల్‌కు పార్టీ గుర్తు (లాంతరు)తో క్లియరెన్స్ ఇస్తూ సీల్డ్ కవర్ అందజేశారు. ఆ సంతోషంలో.. ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. ఆ వెంటనే నామినేషన్ దాఖలు చేశారు.ఈలోపు.. లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఎంట్రీతో సీన్ మారింది. సీట్ల పంపకంలో భాగంగా.. గౌర బౌరమ్ను వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి అప్పగించినట్లు లాలూకు వివరించారు. ఆపై నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అఫ్జల్‌ను కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించాడు. ఈలోపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. దీంతో ఎన్నికల అధికారులను ఆర్జేడీ ఆశ్రయించింది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లో అభ్యంతరాలు లేవని చెబుతూ.. పోటీ నుంచి తొలగించలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈవీఎం మీద ఆర్జేడీ లాంతర్ గుర్తుతో అఫ్జల్ అలీ అధికారికంగా పోటీ చేయబోతున్నారు. అలా మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాల గ్యాప్ వల్ల తన పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి వ్యతిరేకంగా తేజస్వి ప్రచారం చేసే అరుదైన పరిస్థితి ఏర్పడింది(Gaura Bauram RJD Fight).2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌర బౌరమ్ స్థానం వీఐపీ పార్టీకి చెందిన స్వర్ణ సింగ్‌కు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నెగ్గిన ఆమె తర్వాత బీజేపీలో చేరారు. అంతకు ముందు.. 2015, 2010 ఎన్నికల్లో జేడీయూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కొసమెరుపు.. పైన చెప్పుకున్న సందర్భం మొదటిసారేం కాదు. కిందటి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజస్థాన్ బన్స్వారా నియోజకవర్గంలో ఇదే తరహ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అరవింద్ దామోత్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆపై మనసు మార్చుకున్న హైకమాండ్ భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రౌత్‌కు సీటు కేటాయిస్తూ.. తన అభ్యర్థిని సింబల్ రిటర్న్ చేయమని కోరింది. అయితే పార్టీకి మస్కా కొట్టి నామినేషన్ ఉపసంహరణ గడువు దాకా దామోత్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో.. కాంగ్రెస్‌కు తన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆ ఎన్నికల్లో రౌత్ విజయం సాధించినప్పటికీ.. దామోత్కు 60 వేల ఓట్లు పోలయ్యాయి.


