breaking news
Karnataka
-
దారుణం.. ఆర్టీసీ బస్సు మీది నుంచి పోవడంతో
అత్తవారింట గౌరి గణేశ పండుగను జరుపుకోవడానికి వెళ్లిన మహిళను కేఎస్ ఆర్టీసీ బస్సు యమపాశంలా ఊపిరి తీసింది. ఈ ఘటన హాసన్ నగరంలో జరిగింది. వివరాలు.. అపర్ణ (31), భర్త యోగిశ్ హాసన్ నుంచి బెంగళూరుకు వలస వచ్చి జీవిస్తున్నారు. వినాయక చవితికి సొంతూరికి వెళ్లారు. శనివారం ఉదయం హాసన్ ఎన్ఆర్ సర్కిల్లో అపర్ణ స్నేహితురాలి స్కూటర్లో వెళుతుండగా ఓ కేఎస్ ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. అపర్ణ కిందపడిపోగా ఆమె పై నుంచి బస్సు దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కొంతసేపటికి ఆమె మరణించడంతో భర్త, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -బెంగళూరు ఇదీ చదవండి: తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు! -
భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!
భార్య వివాహేతర ప్రియుడిని గొంతు కోసి చంపిన భర్తకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ధర్మపురి జిల్లాలోని కరిమంగళంకు చెందిన పార్థిబన్, శారదాను గతంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత పార్థిబన్, అతని భార్య కృష్ణగిరి జిల్లాలోని హోసూర్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ నగర్లో నివసిస్తూ, సిబ్ కాట్ లోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ స్థితిలో హోసూర్ పార్వతీ నగర్ కి చెందిన అమావాసై, శారదాకి మధ్య పరిచయం ఏర్పడి, అది చివరికి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పార్థిబన్, ఆ సంబంధాన్ని వదులుకోమని తన భార్యను చాలాసార్లు మందలించాడు. అయినప్పటికీ, వారు తమ సంబంధాన్ని వదులుకోలేదు. ఈ స్థితిలో, 14.3.2017న, పార్థిబన్ తన భార్యతో తాను పనికి వెళ్తున్నానని చెప్పి, పనికి వెళ్లకుండా ఇంటి దగ్గర దాక్కున్నాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన అమావాసై, శారద సరదాగా గడుపుతున్నారు. ఇది చూసిన పార్థిబన్, తీవ్రమైన కోపంతో అమావాసై గొంతు కోసి చంపేశాడు. ఇది చూసి అతని భార్య శారద పారిపోయింది. ఈ విషయమై సిబ్కకట్ పోలీసులు కేసు నమోదు చేసి పార్థిబన్ ను అరెస్టు చేశారు. హోసూర్ అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరుగుతున్న ఈ కేసులో జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు. అందులో, అమావసై గొంతు కోసి హత్య చేసినందుకు పార్థిబన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. -
హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా
బెంగళూరు: హెల్మెట్ ధరించకపోతే ద్విచక్ర వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే కారు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని రూ.500 జరిమానా విధించిన సంఘటన బెళగావి జిల్లా అథణి పట్టణంలో వెలుగు చూసింది. అథణి పట్టణ నివాసి సుభాష్ అనే వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు నోటీసులు పంపించడంతో ఆశ్చర్యపోయాడు. తరువాత హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తూ వీడియో తీసి తనకు వచ్చిన నోటీసును సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఏఐ కెమెరా పనితీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
కర్ణాటక: పక్షవాతంతో మంచాన పడిన భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య ఉదంతమిది. ఈ ఘటన బెంగళూరు అవలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ముబారక్, షహీనాబాను దంపతులకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. ముబారక్‌కు పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. వీరి కుమార్తెకూ ఆరోగ్యం బాగాలేదు. బాలికకు చికిత్స అందించే సాకుతో నహీముద్దీన్ ఖురేషి అనే వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొద్దిరోజులకు షహీనాతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో ఉండడంతో తమ సంతోషానికి అడ్డు అని, పైగా రోగిష్టి అని షహీనా భావించింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రచించింది. తల్లి హసీనా జాన్‌తో కలిసి భర్త మర్మాంగాన్ని కాలితో తన్ని తలపై దిండు పెట్టి చంపేసింది. కిత్తగనూరులోని యల్లప్ప గార్డెన్లో సెపె్టంబర్ 9న రాత్రి ముబారక్ (45) చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని విలపిస్తూ షహీనా అందరినీ నమ్మించే యత్నం చేసింది. అయితే షహీనా వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ముబారక్ బంధువులు పోలీసులకు విషయం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముబారక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ముబారక్ది సాధారణ మరణం కాదని, హత్యని తేలడంతో షహీనాబానును, ఆమె తల్లి హసీనా జాన్‌ను, షహీనా ప్రియుడు నహీముద్దీన్ ఖురేషిని అరెస్టు చేశారు. -
ఆయకట్టుకు నీటి కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు వదలాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. శనివారం సింధనూరు తాలూకా బూదివాళ క్యాంప్ వద్ద చేపట్టిన ఆందోళనలో రైతులు మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువలో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్ సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. 54వ ఉప కాలువ కింది భాగంలోని పొలాలకు నీరు అందక పోవడంపై విరుచుకు పడ్డారు. 69 వేల ఎకరాలకు నీరందించాలంటే 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. కాలువపై ఉన్న అక్రమంగా వేసుకున్న పైపులను తొలగించాలని ఒత్తిడి చేస్తూ గంటల తరబడి రాస్తారోకో చేశారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్ తంగడిగి రాజీనామా చేయాలని, పైభాగంలో నీటిని కింది భాగానికి వదలకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. సాగునీటి కోసం రాజకీయం చేయడం తగదని, రైతులు, నేతల మధ్య శీతల సమరం సాగింది. బూదివాళ క్యాంప్ వద్ద రాస్తారోకో చేస్తుండగా రాజకీయ ప్రసంగాలు చేస్తూ పరిస్థితి ఘర్షణలకు దారి తీస్తుండగా సకాలంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింప చేశారు. -
పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి
రాయచూరు రూరల్: సమాజం అభివృద్ధికి పిల్లలకు మానవత్వం, నైతిక విలువలతో కూడిన సంస్కారం నేర్పాలని ఉరిలింగ పెద్ది పీఠాధిపతి జ్ఞాన ప్రకాష్ స్వామీజీ, బీదర్ బుద్ధవిహార్ ధర్మదీప భంతేజ పిలుపునిచ్చారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో నైతిక విలువలు, సంస్కారం అనే అంశంపై ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లలకు బోధన చేయడంతో పాటు అన్ని విధాలుగా సంస్కారాలను అలవర్చుకోవాలన్నారు. మహదేవ స్వామి, వసంత్, సంతోష్, నందిని, మల్లేష్, భీమణ్ణ, అంబరేష్, దత్తాత్రేయ, తిమ్మారెడ్డి, లక్ష్మణ్, అర్చన, కవిత, ఆరతిలున్నారు. కుస్తీ హాల్ నిర్మాణానికి భూమిపూజ హుబ్లీ: జిల్లా మైదానంలో కుస్తీ, జిమ్ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరవింద బెల్లద భూమిపూజ నెరవేర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా మైదానంలో మరొక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టడం హర్షణీయం అన్నారు. గతం మూడు, నాలుగేళ్ల గడువులో జిల్లాలో క్రీడా రంగానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. బాస్కెట్ బాల్ మైదానం ప్రారంభమైంది. వాలీబాల్ కోర్టు నిర్మాణ పనులు ప్రగతి పథంలో ఉన్నాయి. ప్రస్తుతం కుస్తీ హాల్, జిమ్ హాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈత కొలను నిర్మించాం. దీంతో జిల్లా క్రీడా రంగానికి, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం లభించిందన్నారు. హుబ్లీలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఉద్దేశ క్రీడా కాంప్లెక్స్‌ను నిర్మించామన్నారు. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 21 క్రీడా సదుపాయాలు కల్పించారన్నారు. ఈ అవకాశాలను యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుస్తీ కోచ్ శివప్ప పాటిల్, ప్రముఖులు సదానంద, జిన్నప్ప, మంజునాథ, సురేష్, తదితరులు పాల్గొన్నారు. ప్రజా సేవతో ప్రజల కలలు సాకారంరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేర్చడం ద్వారా ప్రజల వద్దకు పాలనతో ప్రజల కలలు సాకారం అవుతాయని తహసీల్దార్ సురేష్‌వర్మ పేర్కొన్నారు. ఆయన శనివారం రాయచూరు తాలూకా బిజనగేర హైస్కూలు మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవ పథకం కింద దరఖాస్తులను అందుకుని మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి మంజునాథ్, ఆరోగ్య అధికారి యోగేష్లున్నారు. అస్పృశ్యతను నివారిద్దాంరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అస్పృశ్యతను నివారిద్దామని లింగసూగూరు తహసీల్దార్ సత్యమ్మ పేర్కొన్నారు. శనివారం తాలూకాలోని ఆనెహొసూరు, ఈచనాళల్లో ఇటీవల దళితుడికి హోటల్లో నీటిని చేతిలో పోసి తాగించిన వీడియో వైరల్ కావడంతో గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ఎంతగా మారినా అగ్ర వర్ణాల వారు ఇంకా దళితులను దేవాలయాల్లోకి ప్రవేశ నిరాకరణ చేయడం, నీటిని ఎత్తిపోయడం వంటివి కొనసాగుతుండటం శోచనీయమన్నారు. ఇలాంటివి పునరావృతం అయితే భారీ జరిమానా విధిస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో సీఐ హొసకెరప్ప, బసవరాజ్, మోహన్, ఆరోగ్య అధికారి రాజేశ్వరి, పుష్పలత, రామకృష్ణ, ధరంసింగ్లున్నారు. జాతీయ రహదారి పనుల భూస్వాధీనానికి అనుమతిరాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాల్లో జాతీయ రహదారి పనుల భూస్వాధీనానికి అనుమతి లభించిందని రాయచూర్ లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ పేర్కొన్నారు. శనివారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఆయన వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. యాదగిరి జిల్లాలో జాతీయ రహదారి పనులను పరిశీలించినట్లు తెలిపారు. భారత్ మాల పథకంలో రాయచూరు–శహాపూర్ మధ్య పనులను నాణ్యతతో పాటు రాయచూరు– బెళగావి మధ్య పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు భూస్వాధీనానికి మంత్రి ఆదేశించారన్నారు. ప్రధాన రహదారి నిర్మాణంలో లోపాలను సవరించకుండా అశాసీ్త్రయంగా పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు. -
ప్రజా సేవతో ప్రజల ముంగిటకే పాలన
సాక్షి,బళ్లారి: ప్రజా సేవ కార్యక్రమంతో ప్రజల ముంగిటకే పాలన అందుతోందని, ప్రతి సమస్యను 21 రోజుల్లో పరిష్కరించేలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన శనివారం బళ్లారి తాలూకా రూపనగుడి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొని స్థానికుల సమస్యలను ఆలకించి, అర్జీలను స్వీకరించారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వినూత్నంగా ప్రవేశ పెట్టిన ప్రజాసేవ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఇకపై ప్రజలు అధికారులు, ఎమ్మెల్యేల చుట్టు తిరగాల్సిన పని లేదన్నారు. పాలకులు, అధికారులే ప్రజలు వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. ఏ అధికారి సరిగా పని చేయకపోయినా తమ దృష్టికి తేవాలన్నారు. కొవ్వు కరిగించుకునేందుకే బీజేపీ పాదయాత్ర బీజేపీ నాయకులు తిన్నది అరక్క, కొవ్వు కరిగించుకునేందుకు తనను లక్ష్యంగా చేసుకుని పాదయాత్ర చేశారని ఎద్దేవా చేశారు. అయితే పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తాను వ్యక్తిగతంగా మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల తరహాలో ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం బీజేపీ పాదయాత్రకు అన్ని విధాలుగా సహకరించిందన్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి బళ్లారి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. తనపై సామాన్య అభ్యర్థిని నిలిపి గెలిపించుకుంటామని అంటున్న బీజేపీ నాయకులు ఎవరిని నిలిపినా గెలవడం మాత్రం వారి చేతకాదన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో తానే గెలుపొందుతానన్నారు. త్వరలో జిల్లా అభివృద్ధి కోసం నగరంలో బృహత్ సమావేశం నిర్వహిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, పార్టీ నాయకులు వెంకట ప్రసాద్, ప్రభురెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో మాదే గెలుపు జిల్లాభివృద్ధి కోసం త్వరలో బృహత్ సమావేశం ఏర్పాటు చేస్తాం మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర -
విద్యార్థుల పాత్ర అమోఘం
రాయచూరు రూరల్ : సమాజం అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అమోఘమని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అభిప్రాయ పడ్డారు. శనివారం రాయచూరు తాలూకా యరమరస్ క్యాంప్‌లో తాలూకా స్థాయి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాల్య వివాహాల నియంత్రణకు సహకరించాలన్నారు. ఆరోగ్యం, పరిసరాల శుభ్రత, సంరక్షణ అంశాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జంగ్లప్ప, బసవరాజ్, సంగమేష్, మంజు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక రాయచూరు రూరల్: నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో శుక్రవారం జరిగిన తాలూకా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో లాంగ్ జంప్ పోటీల్లో ప్రతీక్షా మేటి అనే విద్యార్థిని రాణించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు హనుమేష్, వీణ, విశ్వనాథ్, రాధిక విద్యార్థినిని అభినందించి సత్కరించారు. -
విద్యతోనే మహిళల్లో ఆత్మవిశ్వాసం
రాయచూరు రూరల్: మహిళల్లో ఆత్మవిశ్వాసం, జ్ఞానం, స్వాభిమానం వృద్ధికి విద్య ప్రధానమని జిల్లా జైలర్ అనితా హిరేమని పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 10 రోజుల యోగా శిబిరాన్నుద్దేశించి ఆమె మాట్లాడారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పుస్తకాలను చవివి ప్రతిభను కనబరచాలన్నారు. యోగాను కేవలం శిబిరాలకే పరిమితం చేయకుండా దానిని నిత్య జీవితంలో అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో సువర్ణ, మల్లికార్జున, ప్రసన్న కుమార్, వీరనగౌడ, సరస్వతి, చెన్నబసవ, ఉమాదేవి, స్వరూపరాణి, సుమిత్ర, రంగనాథ్, సంతోష్లున్నారు. -
శాంతియుతంగా గణేష్ పండుగ జరుపుకోండి
హొసపేటె: గౌరీ గణేష్ ఉత్సవాన్ని శాంతి సామరస్యంతో ఉత్సాహంగా జరుపుకోవాలని విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి సూచించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని జిల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన గౌరీ గణేష్ ఉత్సవ శాంతి సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. ఉత్సవ సమయంలో ఏదైనా విపత్తు సంభవిస్తే సంబంధిత ఉత్సవ కమిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.రూపేష్, హుడా అధ్యక్షుడు ఇమామ్ నియాజీ, మున్సిపల్ కమిషనర్ శివకుమార్, పీ.వెంకటేష్, దాదా ఖలందర్, గుజ్జల గణేష్, జగదీష్ కమతగి తదితరులు పాల్గొన్నారు. చాకులతో వీరంగం.. ఇద్దరిపై కేసు హుబ్లీ: హుబ్లీ రైల్వే స్టేషన్ మూడో గేట్ వద్ద ఒక చాకు, మరో చేతిలో వేళ్లకు వేసుకొనే పిడి ఉన్న చాకులను పట్టుకొని తిరుగుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మంటూరు రోడ్డుకు చెందిన శానవాజ్ బేపారి, అస్లాం బేపారిలను హ్యాట్స్టబ్బింగ్ స్య్వాడ్ తనిఖీ చేసి ఆయుధాలు ఉన్నట్లు కనుగొంది. ఘటనపై హుబ్లీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మార్కెట్లో లంబోదరుని విగ్రహాలు సిద్ధంహొసపేటె: వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చవితి వేడుకకు ఒక రోజే సమయం ఉండటంతో మార్కెట్లకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. గతంతో పోల్చితే పూజా సామగ్రి ధరలు మరింత పెరిగాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గణేశుని మట్టి విగ్రహాలు సైజును బట్టి రూ.200 నుంచి రూ.2000 మధ్య ధరల్లో అమ్ముతున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కొనుగోళ్లు పెరగడంతో వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి, పండ్లు, పూల వ్యాపారుల్లో సంతోషం నిండింది. కోట్లలో లాభాలంటూ లక్షల్లో వంచనహుబ్లీ: ఫేస్బుక్ ట్రేడింగ్ వాణిజ్య ప్రకటన చూసి పెట్టుబడి పెట్టిన నగర వ్యక్తిని ఏకంగా రూ.33.75 లక్షల మేర వంచించారు. పునీత్ మోసపోయిన వ్యక్తి. గుర్తు తెలియని వ్యక్తులు కే03 మార్కెట్ ట్రెండ్స్ కమ్యూనిటీ అనే వాట్సప్ గ్రూప్‌లో చేర్పించారు. ఆ తర్వాత షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. వారి మాటలను నమ్మిన పునీత్ ముందుగా రూ.10 వేలను పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో ఎక్సీవెస్ట్ యాప్‌లో రూ.2.57 కోట్ల లాభం చూపించారు. దీన్ని విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా డబ్బులు అసలు జమ కాలేదని తేలింది. దీంతో మెసేజ్ చేసి విచారించగా ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టాలని నమ్మబలికారు. ఆ మేరకు రూ.33.75 లక్షలను విడతల వారీగా తన ఖాతా నుంచి ఆన్లైన్ వంచకులు బదలాయించుకొని మోసగించినట్లు పునీత్ హుబ్లీ ధార్వాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోనల్ క్రీడా పోటీల్లో సత్తా హొసపేటె: జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కేజీఎస్ క్లస్టర్ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి యోగా, 100, 600 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో, కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి షీల్డ్, ప్రశంసా పత్రాలను సాధించారు. హెచ్ఎం లలితమ్మ, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, హేమలత, నిర్మల, రవి, ఈరప్ప మంజుల, శారద తదితరులు పాల్గొన్నారు. ధార్వాడ విద్యాకాశీ ఘనత సిద్దప్పదేహుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర జిల్లా కాంగ్రెస్ సమితి ఆధ్వర్యంలో విద్యానిపుణులు సర్ సిద్దప్ప కంబళ్లి 145వ జయంతిని ఘనంగా జరిపారు. సమితికి నూతన అధ్యక్షుడు సదానంద డంగనవర మాట్లాడుతూ ధార్వాడ కర్ణాటక విశ్వవిద్యాలయం స్థాపనకు సిద్దప్ప మూలప్రేరణ ఇచ్చారన్నారు. డాక్టర్ అంబేడ్కర్ అన్ని విధాలుగా ఆయనకు సహకారం అందించారన్నారు. సర్ సిద్దప్ప ముంబై సర్కారులో విద్య కోసం కర్ణాటక వాటాను కచ్చితంగా ఇవ్వాలని గళమెత్తారని ఎమ్మెల్సీ జక్కప్పనవర తెలిపారు. ప్రముఖులు అల్తాఫ్ హుస్సేన్, రాజశేఖర్, గంగాధర, రఫీక్, కిషోర్, గణేష్ పాల్గొన్నారు. -
వీరాపుర గణపతి.. అంతర్రాష్ట్ర ఖ్యాతి
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో బళ్లారి తాలూకాలో నీటిపారుదల సౌకర్యం లేని కుగ్రామం అది. కేవలం వర్షాధారిత పంటలు మాత్రమే పండించే కరువు నేలలో వ్యవసాయ కూలీలతో పాటు రైతులకు కూడా జీవనాధారం కష్టంగా ఉన్న ఆ గ్రామంలో గణేష్ విగ్రహాలను తయారు చేస్తూ గ్రామస్తులు ఉపాధి పొందుతున్నారు. బళ్లారి తాలూకా కే.వీరాపుర గ్రామం వినాయక విగ్రహాల తయారీకి మారుపేరుగా నిలిచింది. ఈ గ్రామంలో బోరుబావుల సదుపాయం కూడా చాలా తక్కువే. వ్యవసాయ కూలీలకే కాదు రైతులకు కూడా ఏడాది పాటు తమ పొలాల్లో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అయితే గ్రామంలో కొన్నేళ్లుగా వినాయకుల తయారీపై దృష్టి పెట్టారు. దానినే ఉపాధిగా మలచుకుని, అటు దైవభక్తి, ఇటు ఉపాధి కూడా దొరకడంతో విగ్రహాలను తయారు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. కరువు ప్రాంతంలో గ్రామస్తులకు ఉపాధి కే.వీరాపురలో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలను ఒక్క బళ్లారి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల వారు మాత్రమే కొనుగోలు చేస్తారనుకుంటే పొరపాటు. ఇక్కడ తయారు చేసిన వినాయక విగ్రహాల కొనుగోలుకు కర్ణాటకతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తుండటం విశేషం. గ్రామంలో వందలాది మంది వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో ప్రధానంగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న రామచంద్ర సాక్షితో మాట్లాడుతూ తమ గ్రామంలో మట్టితో తయారు చేసిన ఎత్తైన వినాయక విగ్రహాల నుంచి చిన్న వినాయక విగ్రహాల వరకు తయారు చేస్తున్నామన్నారు. తాము 40 మంది గ్రూపుగా ఏర్పడి దాదాపు 800లకు పైగా వినాయక విగ్రహాలను తయారు చేశామన్నారు. అన్నింటిని కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు వచ్చాయన్నారు. ఏటా 8 నెలల పాటు చేతినిండా పని కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలకు తాము వినాయక విగ్రహాలు విక్రయిస్తున్నామన్నారు. తమతో పాటు గ్రామంలో ఎంతో మంది గ్రూపులుగా ఏర్పడి వినాయక విగ్రహాలు తయారు చేసి, అమ్ముతున్నారన్నారు. ఏడాదిలో 8 నెలల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో షెడ్లలో రకరకాల ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నామన్నారు. చూడచక్కగా వినాయక విగ్రహాలు తయారు చేయడం వల్ల ఏటేటా తమ గ్రామం వినాయక విగ్రహాల తయారీకి మారుపేరుగా నిలిచిందన్నారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వీరాపుర అనే విధంగా మారిందని, అదంతా ఆ వినాయకుని కృపేనని అన్నారు. వర్షాలు లేక పంటలు పండక ఇబ్బందులు పడుతున్న రైతులకు, వ్యవసాయ కూలీలకు వినాయక విగ్రహాల తయారీతో ఉపాధి లభిస్తోందన్నారు. విగ్రహాలు తయారు చేసే కూలీలకు రోజుకు కనీసం రూ.500లకు తక్కువ కాకుండా కూలి దొరుకుతోందన్నారు. ఇక వినాయక చవితి సమీపించటంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మిత్రమండళ్ల సభ్యులు వచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసుకెళుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రంగా కే.వీరాపుర పలు రాష్ట్రాల నుంచి గణేష్ ప్రతిమల కొనుగోలుకు భారీగా ఆర్డర్లు -
చాలని అదనపు బస్సులు
● పండుగకు ప్రజలు ఊళ్లకు వెళ్లేందుకు కేఎస్ ఆర్టీసీ 2,400 అదనపు బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. శుక్రవారం రాత్రి బెంగళూరులోని తుమకూరు రోడ్డు, మైసూరు రోడ్డు, హోసూరు రోడ్లలో ప్రయాణికులు గుమిగూడారు. ● మెజెస్టిక్ బస్టాండు, రైల్వే స్టేషన్, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. మెజెస్టిక్‌లో ఎటు చూసినా బ్యాగులతో ప్రయాణికులే నిండిపోయారు. బస్సుల కోసం పోటీ ఏర్పడింది. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు బస్సుల కోసం జనం వేచిచూశారు. ● మైసూరు రోడ్డు బస్టాండ్, శాంతినగర, నవరంగ, యశవంతపుర బస్టాండ్లలోనూ ఇదే దృశ్యం కనిపించింది. ● ప్రయాణికులు తరలిరావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని బుక్ చేసుకున్న బస్సులను అందుకోలేకపోయినట్లు కొందరు ప్రయాణికులు వాపోయారు. పండుగ కోసం కొందరు 15 రోజుల ముందే టికెట్లు బుకింగ్‌లు చేసుకున్నారు. ● ప్రయాణికుల రద్దీని ఆర్టీసీ అదనపు బస్సులు కూడా తట్టుకోలేకపోయాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి. ● ఏ బస్సు చూసినా కిటకిటలాడింది. మహిళలకు ఉచితం కావడంతో మరింత రద్దీ ఏర్పడింది. -
మట్టి గణనాథులతో పర్యావరణానికి మేలు
రాయచూరు రూరల్: నేటి విద్యార్థులు మట్టి గణనాథులపై ప్రచారం చేపట్టి పరిసరాల సంరక్షణకు కృషి చేయాలని హెచ్‌కేఈ సంస్థ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర కొండా పేర్కొన్నారు. శనివారం వీరమ్మ గంగమ్మ సిరి కళాశాలలో మట్టితో విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పోటీకి తగ్గట్లు మనస్సు పెట్టి విద్య నభ్యసించే విధంగా వారికి విద్యా బోధన చేయాలన్నారు. పాఠాలకు తోడు పాఠ్యేతర అంశాలపై విద్యార్థులు శ్రద్ధ కనబరిచి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలన్నారు. సమావేశంలో ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ మహేష్, అనిల్ కుమార్, బసమ్మ, సుష్మాలున్నారు. బీజేపీకి రాజీనామా శివాజీనగర: రాజాజీనగర, మహాలక్ష్మినగర బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎన్.ఎల్. నరేంద్రబాబు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి విశ్వాసంగా పనిచేసే తన సేవలను గుర్తించలేదని వాపోయారు. కాగా ఈనెల 13వ తేదీన సీఎం డీ.కే.శివకుమార్ సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. -
విద్యార్థులకు అవగాహన అవసరం
రాయచూరు రూరల్: నేటి పోటీతత్వ యుగంలో విద్యార్థులకు జెన్‌జీ, సోషల్ మీడియాపై అవగాహన అవసరమని రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయ్ జాగటకల్ పేర్కొన్నారు. శనివారం రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ 25 వసంతాలు పూర్తి చేస్తున్న సమయంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన జెన్‌జీ, సోషల్ మీడియాపై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పోటీల్లో ప్రథమ స్థానం పొందడం ప్రధానం కాదని, పోటీలతో జెన్‌జీ, సోషల్ మీడియాలపై పట్టు సాధించడానికి వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో వెంకటేష్, రాజ్ గురు, బోయర్, శివమూర్తి, సిద్దయ్య స్వామి, రఘనాథ్, ఖాన్‌సాబ్, వీరనగౌడ, సురేష్, మల్లనగౌడ, బసవరాజ్‌లున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తల వినూత్న నిరసన
బళ్లారిఅర్బన్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై ప్రసంగించిన వేదిక స్థలాన్ని గోమూత్రం, గంగాజలంతో శుభ్రం చేయడాన్ని ఖండిస్తూ, ఈ విషయంపై ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో శనివారం వినూత్న రీతిలో మౌన నిరసన చేపట్టారు. నగరంలోని పాత జిల్లాధికారి కార్యాలయం ఎదుట మహాత్మాగాంధీ ప్రతిమ వద్ద కాంగ్రెస్ నాయకులు ముఖాలకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు. డీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు ఈరనగౌడ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు డిమాండ్ చేశారు. ఆనంద్‌కుమార్, ఎల్.మారన్న, గాదిలింగన్న, అరుణ్ జ్యోతి, హొన్నూరు స్వామి, పర్వీన్‌బాను, సూరి, లింగరాజు, హేమరెడ్డి, రాజు, గోవర్ధన్, శంకర్, నరసింహరాజు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. విజయనగరలో.. హొసపేటె: ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానానికి నిరసనగా విజయనగర జిల్లా హొసపేటెలో శనివారం పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. పార్టీ ప్రచార కమిటీ జిల్లా ఇన్చార్జి జీఎస్.కుమారగౌడ మాట్లాడుతూ ఆ ఘటన ద్వారా మల్లికార్జున ఖర్గేను అవమానించారని, నిరసన తెలిపిన రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఈ విషయాలను ఖండిస్తూ నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వరకు మౌన యాత్ర నిర్వహించామన్నారు. విజ్ఞాన, సాంకేతిక రంగాలలో పురోగతి సాధించినా ఇంకా కుల, వర్ణ వివక్ష కొనసాగుతుండటం శోచనీయమన్నారు. పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు వినయ్‌కుమార్ సొరకే, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ఇమాం నియాజీ, నాయకులు లాల్యా నాయక్, దాదాఖలందర్, తారిహళ్లి చంద్రయ్య, తేజా నాయక్ పాల్గొన్నారు. -
క్యాంటీన్, శానిటరీ స్టోర్ దగ్ధం
మండ్య: మంటలు అంటుకుని వరుసగా హోటల్, షాపులు కాలిపోయిన ఘటన మండ్య అశోకనగరలో శనివారం తెల్లవారుజామున జరిగింది. తిమ్మేగౌడ అనే వ్యక్తికి చెందిన కాఫీ క్యాంటీన్లో మొదట అగ్నిప్రమాదం సంభవించింది. పక్కన ఉన్న రిషబ్ టైల్స్ శానిటరీ స్టోర్‌కు మంటలు వ్యాపించి భారీగా తగలబడింది. క్యాంటీన్లో యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. తరువాత వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం అధికమైంది. స్టోర్‌లోని 3 ఫ్రీజర్లు, 2 డబుల్ డోర్ ఫ్రీజర్లు, టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు ఇతర వంట సామగ్రి కాలిబూడిదయ్యాయి. శానిటరీ షాప్‌లో కూడా భారీగా ఆస్తినష్టం జరిగింది. ఫైర్ అధికారి రాఘవేంద్ర నేతృత్వంలో సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేసేటప్పటికీ బూడిద మిగిలింది. ఎమ్మెల్యే పీ.రవికుమార్ పరిశీలించి హోటల్ యజమాని తిమ్మేగౌడను పరామర్శించారు. రూ.20 లక్షల మేర పెట్టుబడి పెట్టామని, అంతా పోయిందని విలపించాడు. పెట్రోల్ ట్యాంకర్ పల్టీయశవంతపుర: బెంగళూరు నుంచి మంగళూరుకు వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్ లారీ పల్టీ పడిన ఘటనలో వేలాది లీటర్ల పెట్రోల్ నేలపాలైంది. శనివారం హాసన్ దగ్గర కెంచటహళ్లి వంతెనపై ఈ ఘటన జరిగింది. వీకెండ్ కావడంతో వాహనాల రద్దీ ఉన్న సమయంలో లారీ బోల్తా పడి పెట్రోలు ప్రవహించింది. శనివారం మధ్యాహ్నం ఎండలు కూడా విపరీతంగా ఉన్న కారణంగా ఏం విపత్తు జరుగుతుందో అని అందరూ కలవరపడ్డారు. పోలీసులు వంతెనను అటు ఇటు బంద్ చేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. ట్యాంకర్‌ను క్రేన్లతో అతి కష్టంపై పక్కకు తొలగించారు. గణపతుల వితరణశివాజీనగర: పర్యావరణ హితం, ఆరోగ్యంపై దృష్టి సారించాలని సినీ నటి రాగిని ద్వివేది తెలిపింది. బెంగళూరు భారతీ నగర కాక్స్‌టౌన్ గంగమ్మ ఆలయం వద్ద పౌర కార్మికుల పిల్లలకు మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీలో ఆమె పాల్గొంది. 14వ తేదీన విఘ్నాలను తొలగించే గణపతి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపింది. ప్రేమజంట ఆత్మార్పణం దొడ్డబళ్లాపురం: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే ఆవేదనతో మహిళ, యువకుడు ఒకే చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా సుంకనూరు గ్రామంలో జరిగింది. చిత్తాపుర పట్టణానికి చెందిన శరణమ్మ (32), యాదగిరి జిల్లా బాచవార గ్రామం నివాసి బసవరాజు (21) వయసులో చాలా తేడా ఉన్నా ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగుతోంది, వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో కలిసి జీవించలేమని విరక్తి చెంది ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. చిత్తాపుర పోలీసులు కేసు నమోదు చేశారు. 14న సిటీలో మాంసం బంద్ శివాజీనగర: బెంగళూరు నగరంలో ఈ నెల 14న సోమవారం మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. గణేష్ చతుర్థి పండుగ అయినందున ఎవరూ మాంసం అమ్మరాదని జీబీఏ అధికారులు ప్రకటించారు. ఆరోజు కబేళాలలో జంతు వధకు అనుమతి లేదు. మాంసం దుకాణాలు తెరవరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. -
పండుగకు.. చలో సొంతూరుకు
శివాజీనగర: సిలికాన్ సిటీ అనగానే రోడ్లపై విపరీతమైన జన రద్దీ, కార్లు, బైక్‌లతో కిక్కిరిసిన రహదారులు మాత్రమే గుర్తుంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే నగరంలో సందడి తగ్గింది. శనివారం మరింతగా పడిపోయి నిశ్శబ్ధం తాండవించింది. వినాయక చవితితో కూడిన సుదీర్ఘ వారాంతం రావడమే కారణం. మూడురోజుల పాటు సెలవులు లభించాయి. దీంతో చాలామంది పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి వెళ్లగా, మరికొందరు విహార యాత్రలకు తరలిపోయారు. కొందరు బంధువుల ఊళ్లకు ప్రయాణమయ్యారు. సోషల్ మీడియాలో పోస్టింగులు జన ప్రయాణంతో సందడిగా ఉండే బెంగళూరు రోడ్లు ఆకస్మాత్తుగా నిర్మానుష్యంగా మారాయి. నగరం మొత్తం నిశ్శబ్దంగా కనిపిస్తోంది. జనాలు లేని ఖాళీ రోడ్లను చూచి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఖాళీ రోడ్లను, పార్కులను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాగే ఊళ్లకు వెళ్లేవారి వీడియోలనూ షేర్ చేశారు. తుమకూరు హైవే కిటకిట సిటీ నుంచి సుమారు 20 జిల్లాలకు వెళ్లే తుమకూరు హైవే రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా ఉంది. నవరంగ, యశ్వంతపుర, గొరగుంటపాళ్య, 8వ మైలు, దాసరహళ్ళి, నెలమంగళ టోల్ మరియు కుణిగల్ బైపాస్ వద్ద వాహనాలు బారులు తీరి కనిపించాయి. పని, చదువుల నిమిత్తం బెంగళూరులో ఉంటున్న విదార్థులు, వలస కూలీలు కూడా సొంత ఊళ్లకు తిరిగి వెళ్తుండటంతో రైళ్లు కిటకిటలాడాయి. బెంగళూరులో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో విపరీతమైన రద్దీ వరుస సెలవులతో ఊళ్లకు ప్రయాణం సిటీలో తగ్గిన జనసందడి -
గణపయ్యా.. నీ కోసం కొంటామయ్యా
● బెంగళూరులో మార్కెట్లు కిటకిట ● గణపయ్యలకు పూజలు చేసి ఇళ్లకు తరలింపు ● పూలు, పండ్లకు గిరాకీ శివాజీనగర, బనశంకరి: రాజధాని నగరంతో పాటు రాష్ట్రమంతటా గౌరీ–గణేష చతుర్థి పండుగ సందడి మిన్నంటుతోంది. ప్రజలు పండుగ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. కొన్ని నెలలుగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వేడి తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, సామాన్యులు, మధ్య తరగతి ప్రజల ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. పూజలు, పిండివంటలతో పండుగ సంప్రదాయాన్ని ఘనంగా చేసుకోవడానికి మార్కెట్లకు వెల్లువెత్తారు. ఉద్యాననగరిలో యశ్వంతపుర మార్కెట్, కే.ఆర్.మార్కెట్, మల్లేశ్వరం, విజయనగర, గాంధీ బజార్, బసవనగుడి, జయనగర వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు, పూలు పండ్లు, మిఠాయిల షాపింగ్ శనివారమంతా జోరుగా జరిగింది. ముఖ్యంగా మహిళలతో విపణులు కిక్కిరిసిపోయాయి. ఏకదంత మూర్తులను పూజలు చేసి బైక్‌లు, కార్లలో తీసుకెళ్లారు. మొదటిరోజు గౌరీదేవి వ్రతాన్ని ఆచరించి, మరుసటి దినం గణేశ చవితిని ఆచరించడం ఆనవాయితీ. గతంకంటే ధరల మోత తక్కువే ● గత వరలక్ష్మీ పండుగ సమయంలో మార్కెట్లో పూల ధరలు ఆకాశన్నంటాయి. ఈసారి, గణేశ పండుగకు అంత లేదు. చిల్లర వ్యాపారులు మాత్రమే ధరలను స్వల్పంగా పెంచారు. ● కనకాంబరాలు కేజీ రూ.1500 వరకు అమ్ముడవుతుండగా, మల్లెలు కిలో రూ.500కు లభిస్తున్నాయి. గులాబీలు, చామంతులు, డాలియా పుష్పాలు కిలో రూ.200– 300 మధ్య విక్రయిస్తున్నారు. ● ఏకదంతునికి ప్రీతికరమైన అరటిపండ్లు, దానిమ్మలు, ద్రాక్షలకు గిరాకీ ఎక్కువగా ఉంది. యాలక్కి అరటిపండ్లు మినహా, ఇతర పండ్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. ● యాపిల్స్, దానిమ్మలు కిలో రూ.200 నుంచి రూ.250 మధ్య ఉన్నాయి. ● అధిక డిమాండ్ ఉన్న యాలక్కి అరటి కేజీ రూ.100 నుంచి రూ.120 వరకు ఉంది. ● మూసంబిలు కేజీ రూ.120, సపోటా రూ.120 నుంచి రూ.150 పలికాయి. నిత్యావసరాలు భగ్గు వంట నూనెలు, పప్పులు, వివిధ బ్రాండ్ల బియ్యం, చక్కెర, బెల్లం, మైదా ధరలు గత పండుగల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు వాపోయారు. ఖర్చు రెట్టింపు అయినప్పటికీ పండుగకు సంకోచం లేకుండా కొనుగోలు చేయడంతో మార్కెట్లు కళకళలాడాయి. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి...
సాక్షి, చెన్నై: పరిచయం పెంచుకుని యువతిని మాయ మాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని తీయని కబుర్లుచెప్పి గదికి తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తు మందు కలిపి లైంగికదాడికి తెగబడ్డాడు. వీడియో చిత్రీకరించి పిలిచినప్పుడల్లా రావాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన 25 ఏళ్ల యువతి తిరుప్పూర్ జిల్లా మొదలిపాలయంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుట్టుపని చేస్తోంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వికాష్ కుమార్ యాదవ్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపాడు. ఈ పరిస్థితులలో పని ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన కోసం వచ్చిన యువతిని వికాష్ కుమార్ తన గదికి తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ కోల్పోవడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో వీడియోగా చిత్రీకరించి, ఫోటోలూ తీశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి ఆందోళన చెంది తనను పెళ్లి చేసుకోవాలని వేడుకోవడంతో తనకు అప్పటికే పెళ్లయినట్టు చెప్పాడు. తను తీసిన చిత్రాలను ఆమెకు చూపి ఇక, తాను పిలిచినప్పుడల్లా రావాలని హెచ్చరించి పంపాడు. ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. అంతే కాకుండా ఆ వీడియోను తన బంధువు ఒకరికి అతడు పంపించి పైశాచికానందం పొందాడు. దీంతో ఆ యువతి తిరుప్పూర్ పోలీసులను శనివారం ఆశ్రయించింది. కాంగేయం ఆల్ ఉమెన్ పోలీసులు తక్షణం రంగంలోకి దిగి వికాష్కుమార్యాదవ్ను అరెస్టు చేశారు. అతడి ఫోన్‌ను పరిశీలించగా అందులో ఆయువతితో గడిపిన వీడియోలతో పాటుగా మరికొన్ని అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. నిందితుడు మరెవరినైనా ఈ తరహాలో వేధించాడా? అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నారు. -
జైలులో తనిఖీలు.. ఫోన్‌తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ప్రజ్వల్ రేవణ్ణ ఉన్నారు. ఆగస్టు 11న క్రైమ్ బ్రాంచ్ అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో రేవణ్ణ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే.. ప్రజ్వల్ ఉంటున్న హై సెక్యూరిటీ బ్యారెక్ నుంచి ఛార్జర్, పెన్ డ్రైవ్, నోట్‌బుక్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్, పెన్ డ్రైవ్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా.. ఫోన్లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు, పెన్ డ్రైవ్‌లో వెబ్ సిరీస్‌లు ఉన్నట్లు తేలింది.ఫోన్లో వాట్సాప్, వీడియో కాల్స్ జరిగినట్లు కాల్ రికార్డుల పోలీసుల పరిశీలనలో తేలింది. పలువురు మహిళలతో సంప్రదింపులు జరిగినట్లు కూడా గుర్తించారు. బెంగళూరు సెంట్రల్ జైలులో 'వీఐపి' ఖైదీలకు అందుతున్న ప్రత్యేక సౌకర్యాల అంశంపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి.. ఆ లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను సర్క్యులేట్ చేసిన కేసులో రేవణ్ణ గత ఏడాది దోషిగా తేలాడు.హాసన్ జిల్లా హోళేనరసీపురలోని రేవన్న కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో డొమెస్టిక్ హెల్ప్‌గా పనిచేస్తున్న ఆ బాధితురాలు.. 2021 నుంచి ప్రజ్వల్ రేవణ్ణ తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసిన రేవణ్ణ.. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను విడుదల చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. రేవణ్ణ సెల్ నుంచి ఫోన్ లభ్యం కావడంతో అధికారులు ఓ జైలు అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. జైళ్లలో వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. కేవలం గట్టి నిఘా ఉన్న ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్లైన్లు, పబ్లిక్ కాల్ ఆఫీసులు, నిర్దేశిత వీడియో-కాలింగ్ సిస్టమ్‌ల ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ అనుమతిస్తారు.ఇదీ చదవండి: భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే! -
బెంగళూరుపై పెరుగుతున్న విమర్శలు.. డీకే సంచలన నిర్ణయం!
ఇటీవలి కాలంలో బెంగళూరు పేరు చెబితే ఐటీతో పాటు ట్రాఫిక్ కూడా గుర్తొస్తోంది. దేశ ఐటీ రాజధానిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం.. ఇప్పుడు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, ఖరీదైన ఇళ్లు, మౌలిక వసతులపై ఒత్తిడితో సతమతమవుతోంది. బెంగళూరు ఎంత వేగంగా ఎదిగిందో.. దాని సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇక నగరంపై మరింత భారం మోపితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉండటంతో.. కర్ణాటక ప్రభుత్వం కొత్త దారిని ఎంచుకుంటోంది. బెంగళూరును మాత్రమే విస్తరించడం కాకుండా.. రాష్ట్రంలోని మరో ఆరు నగరాలను కూడా ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలకు కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం డీకే శివకుమార్ సర్కార్ భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది.కర్ణాటక అభివృద్ధి అంటే బెంగళూరు.. బెంగళూరు అంటే ఐటీ, స్టార్టప్‌లు, గ్లోబల్ కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలు. దశాబ్దాలుగా ఈ సమీకరణమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలిచింది. కానీ అదే విజయంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది. సుమారు 1.25 కోట్ల జనాభా, 1.15 కోట్లకు పైగా వాహనాలు నగరం ఎదుర్కొంటున్న భారాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఉద్యోగాలు బెంగళూరులోనే కేంద్రీకృతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వలసలు పెరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్, నివాస వ్యయం, ప్రజా రవాణా, మౌలిక వసతులపై ఒత్తిడి మరింత తీవ్రమవుతోంది.ఈ సమస్యకు డీకేఎస్ ప్రభుత్వం చూపిస్తున్న పరిష్కారం.. బెంగళూరును తగ్గించడం కాదు.. బెంగళూరు వెలుపల అవకాశాలను పెంచడం. ఇటీవల 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా డీకే శివకుమార్ ఇదే దిశలో తన ఆలోచనను స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కథ కేవలం రాజధాని చుట్టూనే తిరగకూడదని పేర్కొంటూ.. ‘బియాండ్ బెంగళూరు’ వ్యూహానికి మరింత ఊపు ఇచ్చారు. ఈ ప్రణాళికలో మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి-ధార్వాడ్-బెలగావి, తుమకూరు, కలబురగి, శివమొగ్గ కీలకంగా మారనున్నాయి. ఒక్కో ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను బట్టి ఐటీ, తయారీ, ఏఐ, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, డిజిటల్ ఎకానమీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి.. అక్కడే ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.మైసూరుపై భారీ ఆశలుబెంగళూరుకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరును కర్ణాటకలో రెండో ప్రధాన ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విద్య, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో ఉన్న బలాన్ని ఉపయోగించుకుని మరిన్ని కంపెనీలను ఆకర్షించాలన్నది ప్రణాళిక. 2030 నాటికి మైసూరు నుంచి 10 బిలియన్ డాలర్ల డిజిటల్ ఆదాయం, కనీసం 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.మంగళూరుకు మరో గుర్తింపుతీర ప్రాంతానికి కీలక నగరమైన మంగళూరుకు పోర్టు, విద్య, వైద్యం, బ్యాంకింగ్, మత్స్య పరిశ్రమ, పర్యాటకం వంటి రంగాల్లో ఇప్పటికే బలమైన పునాది ఉంది. దీనికి టెక్నాలజీ, డేటా సెంటర్లు, డిజిటల్ ఎకానమీని జోడించి కొత్త పెట్టుబడులను తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. అంటే తీర ప్రాంత యువత ఉద్యోగాల కోసం తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించాలన్నమాట.ఉత్తర కర్ణాటకకు టెక్నాలజీ బూస్ట్హుబ్బళ్లి-ధార్వాడ్-బెలగావి ప్రాంతాన్ని ఇంజినీరింగ్, తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ సంబంధిత రంగాలు, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న స్టార్టప్ వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి ఉత్తర కర్ణాటకలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించాలన్నది లక్ష్యం. తూమకూరు, దొడ్డబళ్లాపురంను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చూస్తుండగా.. చారిత్రకంగా వెనుకబడిన కల్యాణ కర్ణాటక ప్రాంతంలో టెక్నాలజీ, పరిశ్రమల పెట్టుబడులను పెంచడంపై దృష్టి పెట్టారు. కలబురగి, బెలగావి, హుబ్బళ్లి-ధార్వాడ్, మంగళూరు, మైసూరులో ఐదు గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ల ప్రతిపాదన కూడా ఉంది.అయితే ఇక్కడే అసలు సవాల్ ఉంది. ప్రాజెక్టులకు ఆమోదం లభించడం ఒక ఎత్తయితే.. అవి వాస్తవంగా ఏర్పాటై ఉద్యోగాలు కల్పించడం మరో ఎత్తు. గత ‘బియాండ్ బెంగళూరు’ కార్యక్రమంలో 2021-22 నుంచి 2024-25 మధ్య మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి–ధార్వాడ్ క్లస్టర్లలో దాదాపు 5,600 ఉద్యోగాలే వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లక్ష్యాలు దీనితో పోలిస్తే చాలా పెద్దవి. బెంగళూరు కర్ణాటకకు కిరీటం అయితే.. ఆ కిరీటం భారాన్ని మోయడానికి మరిన్ని నగరాలను సిద్ధం చేయాలన్నదే డీకేఎస్ సర్కార్ కొత్త వ్యూహం.ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మాజీ సీఎం రాజీనామా -
ప్రియుడు ఫోన్ ఎత్తట్లేదని ఇద్దరు పిల్లల తల్లి..
బెంగళూరు: ప్రియుడు ఫోన్ చేయడం లేదు, ఆమె కాల్ చేసినా స్పందించడం లేదు.. దీంతో బాధకు లోనై ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలకోటలోని బాంబే కాలనీలో జరిగింది. మొబైల్ సంబంధాల మాయలో తరిగిపోతున్న కుటుంబ బాంధవ్యాలకు ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది. వివరాలు.. మెహబూబ్ బీ (27) మృతురాలు. ఈమె స్థానికంగా ఉంటున్న ఒక యువకునితో సంబంధం కలిగి ఉంది.కొన్నిరోజులుగా అతడు ఈమెకు కాల్ చేయకపోగా, ఈమె ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. దీంతో మెహబూబ్ బీ సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతనికి పంపింది. నాతో మాట్లాడకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ మెసేజ్ కూడా పంపింది. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. విరక్తి చెందిన మెహబూబ్ బీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కోర్టుకు దర్శన్ అవసరమా?
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్ కోర్టుకు హాజరు కావడానికి అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద విచారించారు. సాక్షుల విచారణ సమయంలో నిందితుడు దర్శన్ కోర్టులో స్వయంగా హాజరు కావాలని ఆయన న్యాయవాది వాదించారు. జడ్జి స్పందిస్తూ దర్శన్‌ను కోర్టుకు తీసుకొస్తే పోలీసు భద్రత ఇవ్వాల్సి ఉంటుంది, జనం రద్దీని అడ్డుకోవడం కష్టమని అన్నారు. వీలైతే పరప్పన అగ్రహార జైలులోనే విచారణ జరపవచ్చు. వ్యక్తిగత హాజరు కంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చాలా సులువుగా ఉంటుందని తెలిపారు. ఇరువర్గాలూ మాట్లాడుకుని ఒక తీర్మానానికి రావాలని, వాయిదాలకు ప్రతిసారీ నిందితులు రావాల్సిన అవసరం లేదని జడ్జి చెప్పడం గమనార్హం. వన్యప్రాణుల కేసు? మైసూరు జిల్లా టి నరసీపుర రోడ్డులో ఉన్న దర్శన్ ఫౌంహౌస్‌లో గతంలో అరుదైన పక్షులు, వన్యజీవులు ఉన్నట్లు వీడియోలు వచ్చాయి. అటవీశాఖ నిబంధనలకు విరుద్ధం కావడంతో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. -
ఈడీ దాడి రాజకీయ ప్రేరేపితమే
● ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి బనశంకరి: తమ సంస్థల వార్షిక ఆర్థిక లావాదేవీలు రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుంది, ప్రస్తుతం చిక్కింది రూ.2 కోట్లు మాత్రమే, అది మాకు పెద్ద మొత్తం కాదని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి తెలిపారు. శుక్రవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలపై ఈడీ దాడి, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, దాడి వెనుక రాజకీయ ఉద్దేశాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.2 కోట్ల సొమ్ము మాదే. దానిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేశాం. ఐటీ శాఖకు ఇప్పటికే అన్ని ఆధారాలు అందించాం. ఈడీ అడిగినా అవసరమైన ఆధారాలు అందిస్తాం. నేను ఎక్కడా కులం విషయం తెచ్చి సమర్థించుకోలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. దీనిని పూర్తిగా చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. గత పదేళ్ల నుంచి కేవలం విపక్ష నేతలను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తున్నారని కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై ఇలాంటి దాడులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం, నోటీస్ ఇచ్చినా చట్టబద్ధంగా సమాధానమిస్తాం అని తెలిపారు. -
కేపీఎస్సీ కుంభకోణంపై ఈడీ విచారణ
బనశంకరి: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ) పశువైద్యాధికారుల నియామకాల్లో అక్రమాల కేసుకు సంబంధించి ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన ఈడీ అధికారులు మధ్యవర్తి బసవరాజ్ కన్నాళె, ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ గంగ్వార్‌లను తీవ్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. కోర్టు అనుమతి తీసుకుని శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు పరప్పన అగ్రహార జైలులో వారిని ఈడీ అధికారులు విచారణ చేశారు. అవసరమైతే ఆర్థిక అక్రమాలపై దర్యాప్తునకు వారిద్దరిని బాడీ వారెంట్ ఆధారంగా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై సీఐడీ విచారణ కేపీఎస్సీ నియామక అక్రమాల కేసుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్న సీఐడీ అధికారులకు కీలక సమాచారం లభ్యమైంది. ఈ కేసులో కేపీఎస్సీ పరీక్షల విభాగం మాజీ కంట్రోలర్ జ్ఞానేంద్రకుమార్ గంగ్వార్ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపడుతోంది. సీఐడీ దర్యాప్తు ప్రకారం బెంగళూరు డికెన్సన్ రోడ్డులోని జ్యువెలరీ దుకాణం నుంచి జ్ఞానేంద్రకుమార్ తన ప్రియురాలికి రూ.26 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి కానుకగా ఇచ్చినట్లు సమాచారం అందింది. అయోధ్యకు చెందిన ప్రియురాలిని జ్యువెలరీ దుకాణానికి తీసుకెళ్లి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం గురించి సీఐడీకి ఛాయాచిత్రాలతో సహా ఆధారాలు లభించాయి. ఆభరణాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులను సైతం విచారణాధికారులు స్వాధీనం చేసుకున్నారు. బీదర్ లక్ష్మీ సౌహార్ద కో–ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆభరణాల కొనుగోలుకు డబ్బు చెల్లించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. బసవరాజ్ అనే పేరిట అకౌంట్ నుంచి బంగారు కొనుగోలు బిల్లుల గురించి దర్యాప్తు చేపడుతున్నారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన జ్ఞానేంద్రకుమార్ గంగ్వార్ ప్రియురాలిని విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. జ్ఞానేంద్రకుమార్ సోదరుడు కమలాపతి పేరుతో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విలాసవంతమైన విల్లా కొనుగోలు గురించి సీఐడీ దర్యాప్తు చేపడుతోంది. ఈ ఆస్తి అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేశారా? అనే అనుమానం సీఐడీలో ఏర్పడింది. 2024 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి వరకు జ్ఞానేంద్రకుమార్ కేపీఎస్సీ పరీక్షల విభాగం కంట్రోలర్‌గా పని చేశారు. ఎంపికై న అభ్యర్థులకూ అరెస్ట్ భయం... కేపీఎస్సీ అక్రమ నియామకాల కేసు దర్యాప్తులో భాగంగా పరీక్షలో ఎంపికై న కొందరు అభ్యర్థులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ విచారణ 52వ సీసీహెచ్ కోర్టు చేపట్టనుంది. మమిత, అమరేగౌడ అనే అభ్యర్థులు బెంగళూరు 52వ సీసీహెచ్ కోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటీషన్ వేశారు. కేపీఎస్సీ పరీక్షల్లో ఎంపిక కావాలనే ఉద్దేశంతో డబ్బు ఇచ్చిన ఆరోపణలు మమితపై ఉన్నాయి. గతంలో సీఐడీ అధికారులు మమిత ఇంటిపై కలబుర్గిలో దాడి చేసి మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. పశువైద్యాధికారి పోస్టుల భర్తీలో ఎంపికై న మరో అభ్యర్థి అమరేగౌడ కూడా ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశారు. ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్, మధ్యవర్తి బసవరాజ్‌లను విచారించిన ఈడీ అధికారులుకేఏఎస్ పరీక్షలోనూ అక్రమాలు? కేపీఎస్సీ పశువైద్యాధికారుల పోస్టుల నియామకాల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కేఏఎస్ పరీక్షల్లో కూడా అక్రమాలు జరిగినట్లు అనుమానం వ్యక్తమౌతోంది. ఈ కేసుకు సంబంధించి కేఏఎస్ అభ్యర్థి మమిత కలబుర్గి నివాసంపై సీఐడీ అధికారులు దాడి చేసి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో కేఏఎస్ అక్రమాలకు సంబంధించి కీలక ఆధారాలు, ల్యాప్‌టాప్‌ను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని ల్యాప్‌టాప్‌లో ఉన్న డిజిటల్ డేటాను రిట్రీవ్ చేయడానికి సిద్ధమయ్యారు. 2023–24 బ్యాచ్‌లో కేఏఎస్ పరీక్ష రాసి ఇంటర్వ్యూ పూర్తి చేసి ఫైనల్ ఫలితాల కోసం వేచిచూస్తున్న మమిత కేపీఎస్సీ సభ్యురాలు శాంతా హొసమని ద్వారా అక్రమంగా పోస్టును సాధించడానికి ప్రయత్నించారనే ఆరోపణ ఉంది. 2023లో గ్రామీణ తాగునీటి శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీలో కూడా కోట్లాది రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఒక ఏఈఈ పోస్టుకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల డీల్ జరిగిందని ఆరోపణ. పరీక్ష ఓఎంఆర్ షీట్లు దిద్దడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. దీని గురించి ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ధృవీకరించారు. మొత్తం 24 మంది అభ్యర్థులకు గాను కనీసం 10 మంది అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. -
ఆస్పత్రిని ప్రారంభించొద్దు
హొసపేటె: నగరంలో నూతనంగా నిర్మించిన 250 పడకల జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు, అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చిన తర్వాతే ప్రారంభించాలి. తొందర పాటుతో ప్రారంభించి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని కర్ణాటక రక్షణ వేదిక (స్వాభిమాని సేన) కోరింది. కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరికి వినతిపత్రం అందజేసింది. సంస్థ జిల్లా అధ్యక్షుడు తారిహళ్లి హనుంతప్ప మాట్లాడుతూ.. కొత్త జిల్లా ఆస్పత్రిని నిర్మించి చాలా సంవత్సరాలు గడిచినా, అది పూర్తిస్థాయిలో పని చేయడం లేదన్నారు. అవసరమైన వైద్య పరికరాలు కొన్ని మాత్రమే వచ్చాయని.. స్క్యానింగ్, ఎంఆర్ఐ తదిత ముఖ్యమైన సౌకర్యాల కొరత ఉందని తెలిపారు. అవసరమైన పరికరాలు, వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించుండా ఆస్పత్రిని ప్రారంభించడం సరికాదన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు చికిత్స అందకుండా వేరే చోట్లకు పంపించే పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించాక ముఖ్యమంత్రి ఆస్పత్రిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్.హెచ్ శ్రీనివాస్, ఈడిగ రమేష్, ఎస్.ఎం.జాఫర్ రుద్రప్ప, ప్రశాంత నాయక్, సలీం అమీర్, విరుపాక్షి, ముస్తఫా, అస్లాం, భీమన్న, శామ, సీమ, సుంకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సద్దిమూటలతో పాదయాత్ర
శ్రావణ మాసం ముగింపు సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా ‘సద్ది మూటలు’ కట్టుకుని పాదయాత్ర చేపట్టారు. గురువారం సాయంత్రం షహాబాద్ నుంచి కలబుర్గిలో వెలసిన శరణ బసప్ప దేవాలయం వరకు సుమారు 40 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. భక్తి గీతాలు ఆలపిస్తూ శరణ బసప్ప స్వామిని దర్శించుకునేందుకు ముందుకు సాగారు. దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సామూహిక భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు. రాయచూరు రూరల్: -
యథేచ్ఛగా జలచౌర్యం
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ గట్టు కాలువలో కొందరు అనధికారికంగా పైపులు మోటార్లు ఏర్పాటు చేసి నీటిని దారి మళ్లిస్తూ జలచౌర్యానికి పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం కాలువకు నీరు విడుదల చేయగా.. గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయుకట్టు భూములకు నీరందించేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదు. ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. సిరవార, మటమారి, మస్కి, కవితాళ, రాయచూరు ప్రాంతాల్లో కంది, వరి, పత్తి, మిరప సాగు చేశారు. చివరి ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. 4,100 క్యూసెక్కుల నీరు పైభాగంలో వాడేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. -
వినాయక విగ్రహ తరలింపులో విషాదం
రాయచూరు రూరల్: వినాయకుడి విగ్రహ తరలింపులో విషాదం చోటుచేసుకుంది. విగ్రహం మీద పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాయచూరు జిల్లా సిరవార తాలూకా అత్తనూర్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రాయచూరుకు చెందిన యువకులు హైదరాబాద్‌లో 25 టన్నుల భారీ వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు. లారీలో వినాయకుడి విగ్రహాన్ని పెట్ట్టుకుని హైదరాబాద్ నుంచి రాయచూరుకు బయలుదేరారు. సిరవార తాలూకా అత్తనూర్ వద్దకు చేరుకోగానే.. వినాయకుడి విగ్రహానికి విద్యుత్ తీగలు తగిలాయి. పక్కనే నిలబడిన ప్రేమ్ కుమార్ (27)పై వినాయకుడి విగ్రహం పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. సిరవార పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెరకుకు మద్దతు ధర కల్పించాలిహొసపేటె: హొసపేటె, కమలాపూర్ ప్రాంతాల్లో రైతులు పండించే చెరకుకు టన్నుకు రూ.6000 నుంచి రూ.6,500 వరకు మద్దతు ధర కల్పించాలని హోస్పేట్ రైతు సంఘం కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరికి వినతిపత్రం అందజేశారు. రసాయన ఎరువులు, వ్యవసాయ కూలీల వేతనాలతో సహా వ్యవసాయ ఉత్పాదకాల ఖర్చు గణనీయంగా పెరిగిందని తెలిపారు. వచ్చే ఆదాయం కంటే ఉత్పత్తి వ్యయమే ఎక్కువగా ఉండే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని న్యాయమైన ధరను నిర్ణయించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చక పోతే పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. చెరకు ధరల నిర్ధారణకు సంబంధించి జిల్లాలోని చక్కెర కర్మాగారాల యజమానులందరినీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి ధరను ఖరారు చేయాలన్నారు. కార్యక్రమంలో జంబయ్య నాయక్, నాగరాజ పరసప్ప మట్టి, మైలారీ కనివేహళ్లి, వెంకోబన్న, కమలాపుర జోగయ్య, బానాడ రాఘవేంద్ర, అంజినప్ప, జాకీర్ హుస్సేన్, గాదిలింగప్ప తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఉద్యోగుల ఆందోళనరాయచూరు రూరల్: ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చి అన్ని శనివారాలు, ఆదివారాలను బ్యాంక్ సెలవు దినాలుగా ప్రకటించాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపుమేరకు రాయచూరులో ఆందోళన చేపట్టారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సంచాలకుడు సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిపాదిత పీఎల్ఐ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. అందరికీ న్యాయమైన ప్రోత్సాహకాలు వర్తింపజేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కన్నడ భాషపై అవగాహన తప్పనిసరిరాయచూరు రూరల్: విద్యార్థులు కన్నడ భాషపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు గురునాథ్ సూచించారు. రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలవడం ముఖ్యం కాదన్నారు. కన్నడ భాషపై పట్టు సాధించాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో మంజునాథ్ సాలి, దత్తు, రిపోర్టర్ గిల్డ్ అధ్యక్షుడు విజయ్ జాగటకల్, మల్లన గౌడ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సమకాలీన అంశాలు చేర్చాలని వినతి హుబ్లీ: బీకాం పాఠ్యాంశాల్లో సమకాలీన అంశాలు చేర్చాలని అంచటగేరి కర్ణాటక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌కు మాజీ మేయర్, కార్పొరేటర్ వీరేష్ ప్రతిపాదన పత్రం సమర్పించారు. వేగంగా మారుతున్న ఆర్థిక వాణిజ్యం, అలాగే వృత్తిపర రంగాల్లో విద్యార్థులు కేవలం సైదాంతిక జ్ఞానానికి పరిమితం కాకుండా ప్రయోగాత్మకంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యంత అవసరం అన్నారు. విద్యార్థుల బంగారు భవిత అలాగే జాతి నిర్మాణం కోసం పాఠాలను నవీకరించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరకులు, సేవ పన్నులు చట్టం, సంబంధిత అర్థశాస్త్రము, బ్యాకింగ్, కార్పొరేట్ అడిటింగ్ తదితర అంశాలను పొందుపరచాలని సూచించారు. -
మంత్రి క్షమాపణ చెప్పాల్సిందే..
రాయచూరు రూరల్: బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ వెంటనే పౌర కార్మికులకు క్షమాపణలు చెప్పాలని ఏఐసీసీటీయూఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనంలో కార్మికులతో కలసి ఆందోళన చేపట్టారు. సంచాలకుడు అజీజ్ జాగిర్దార్ మాట్లాడుతూ.. ఒప్పంద పౌర కార్మికులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని (పర్మనెంట్) మంత్రిని కోరడం జరిగిందన్నారు. పౌర కార్మికులలో 30 శాతం మంది విధులకు హాజరు కావడం లేదని.. పనులు సరిగ్గా చేయకుండా పర్మనెంట్ చేయాలని మంత్రి అసహనం వ్యక్తం చేశారని మండిపడ్డారు. ‘ముందు పని చేయడం నేర్చుకోండి’ అంటూ కార్మికులను అవమానపరిచారని తెలిపారు. కనీస గౌరవం, మానవత్వం లేకుండా మంత్రి మాట్లాడారని పేర్కొన్నారు. కార్మికులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. -
అరణ్య సంపదకు రక్షకులు మీరే
శివాజీనగర: దేశ అటవీ సంపదను కాపాడేది మీరే. వన్యప్రాణులతో ఘర్షణల కారణంగా చాలా మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. శాఖ సిబ్బంది భత్యాలపై మంత్రి అభ్యర్థనను పరిశీలిస్తాం. ఆర్థిక శాఖతో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం అని సీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. మల్లేశ్వరంలోని ఫారెస్ట్ హాల్లో శుక్రవారం జరిగిన జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాకు అడవితో చాలా సన్నిహిత సంబంధం ఉంది. మా గ్రామం, ఇల్లు, పొలం పనులు అన్నీ అడవితో ముడిపడి ఉన్నాయన్నారు. అభివృద్ధి పనులకు అడ్డుపడకూడదు సామాన్య ప్రజలు పోలీసులను అంగీకరిస్తారు. వారు అటవీ శాఖ సిబ్బందిని అంగీకరించరు. అటవీ శివార్లలోని ప్రజలతో స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించండి. అటవీ ఆక్రమణలను చట్ట ప్రకారం పరిష్కరిద్దాం. ప్రజలను ఒత్తిడి చేయవద్దు. అటవీ శాఖ అధికారులు అభివృద్ధి పనులకు అడ్డు రాకూడదు. కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఆయన అన్నారు. అక్రమ ఆయుధాలను అప్పగించండి లైసెన్స్ లేకుండా అక్రమంగా కలిగి ఉన్న ఆయుధాలను నవంబర్ 1వ తేదీలోగా ప్రభుత్వానికి అప్పగించాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. అటవీ అధికారులు టేకు సిరి ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేయాలన్నారు. కస్తూరి రంగన్ నివేదిక అమలులో తమకొక న్యాయం, కేరళకు ఒక న్యాయం కల్పించిన ఈ విషయంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. జీతభత్యాల పెంపుపై ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయిస్తాం అటవీ అమరవీరుల దినోత్సవంలో సీఎం డీ.కే.శివకుమార్ -
ఏనుగు దాడిలో రైతు మృతి
కెలమంగలం: అంచెట్టి సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లిన రైతుపై ఒంటి ఏనుగు దాడి చేసి చంపేసింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకొంది. అంచెట్టి తాలూకా ఖోటైయ్యూరు పంచాయతీ పరిధిలోని ఒండూరు గ్రామానికి చెందిన మాదప్ప (60). అంచెట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. పొదల్లో దాగి ఉన్న ఏనుగు మాదప్పపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
గజపడె శిక్షణ కత్తి మీద సామే
గజరాజులకు శిక్షణ సమయంలో గుమిగూడిన ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు రీల్స్, ఫోటోలు, వీడియోలు తీయడానికి వెర్రిగా ప్రయత్నిస్తున్నారు. గజరాజులు వెళ్లే రోడ్లపై గుమిగూడిన జనసమూహాన్ని నియంత్రించడం ఇప్పుడు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రజల అరుపులు, ఈలలు, కేకలతో ఏనుగులు ఆగ్రహానికి గురైతే పెనుప్రమాదం తప్పదు. మైసూరు: ఈసారి జంబూసవారీలో పాల్గొనే గజరాజులకు శిక్షణ ఇవ్వడం అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు ఎప్పుడూ ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఏనుగులను చూసేందుకు ప్రతిరోజూ వేలాది మంది గుమిగూడి రీల్స్, ఫోటోలు, వీడియోలు తీయడమే దీనికి కారణం. ప్రజల ఈ ప్రవర్తనతో గజపడె ఇప్పుడు నిరంతరం చికాకుకు గురవుతోంది. అంబావిలాస్ ప్యాలెస్ నుంచి బన్ని మంటప వరకు 9 ఏనుగులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నడక శిక్షణ పొందుతున్నాయి. మహేంద్ర, ధనంజయలకు ఇప్పటికే ఒక్కొక్కదానికి 700 కిలోల బరువు మోసేలా శిక్షణ ఇచ్చారు. మిగిలిన మగ ఏనుగులకు కూడా 1,000 కిలోల బరువు మోసేలా కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈసారి జంబు సవారీ మార్గంలో మునుపెన్నడూ లేనంతగా జనం పోటెత్తుతున్నారు. ఏనుగుల గుంపుకు ఇస్తున్న శిక్షణను వీడియో తీస్తూ, ఫోటోలు తీసుకుంటూ, వాటి ముందు, వెనుక, పక్కన నిలబడి రీల్స్ తీసేవారి సంఖ్య పెరుగుతోంది. ఏనుగులను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. గుంపును దగ్గరగా చూసి, ఈలలు వేస్తూ, అరుస్తూ, గట్టిగా కేకలు వేస్తూ పెద్ద శబ్దం చేస్తున్నారు. ఏనుగుల వెనుక, ముందు, పక్కన వాటి మావటీలు, కావడీలు, అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు తిరుగుతున్నారు. కానీ ప్రజలను ఏనుగుల దగ్గరకు రాకుండా నిరోధించడం, వాటి అతిక్రమణలను నియంత్రించడం ఇప్పుడు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. గజపడె శిక్షణ సమయంలో దూరంగా నిలబడండి, సంయమనంతో ప్రవర్తించండి, ఏనుగులను ఇబ్బంది పెట్టవద్దు అని అటవీ శాఖ మంత్రి రామలింగారెడ్డి, అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో దసరా గజపడెకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేసి గందరగోళం సృష్టించి నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. -
వేడుకగా ఫ్రెషర్స్ డే
బళ్లారి అర్బన్: హొసపేటలోని శ్రీమాత డిగ్రీ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. వీఎస్కేయుబీ విశ్వవిద్యాలయ స్థాయిలో ర్యాంకులు సాధించిన దిశా యక్కుండి, కీర్తన జీకే, గగనను సన్మానించి రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సాగర్ కోదండపాణి, కేపీసీసీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ఉపాధ్యక్షుడు కేబీ.శ్రీనివాసరెడ్డి, హొసపేటె అర్బన్ డెవలప్మెంట్ అధ్యక్షుడు ఇమామ్ నియాజీ, కళాశాల అధ్యక్షుడు సతీష్ కందా, ప్రిన్సిపాల్ జాఫర్, వైస్ ప్రిన్సిపల్ ఫయాజ్, డైరెక్టర్ సాగర్ కోదండపాణి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మతసామరస్యం చాటేలా వినాయక ఉత్సవాలు హుబ్లీ: నగర నడిబోడ్డున ఉన్న రాణిచెన్నమ్మ మైదానం గణేషోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయక వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ మండలి అధ్యక్షుడు సంజయ్ తెలిపారు. ఈ వేడుకలను కేవలం ధార్మిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహరాలు సామాజిక సామరస్యాన్ని చాటేలా ఉత్సవాలు జరుపుతామన్నారు. గౌతమ్ భాగన ఆధ్వర్యంలో నగర కార్పొరేషన్ నుంచి ఇప్పటికే అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి మహదేవ, నందకుమార్, ప్రవాసాంధ్ర పారిశ్రామిక వేత ఏసీ ప్రసాద్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల్లోపు డీజే బంద్ హుబ్లీ: వినాయక వేడుకల్లో డీజే సౌండ్ వినియోగానికి నియంత్రణ విధించిన పోలీసులు.. రాత్రి 10 గంటల్లోపు డీజే బంద్ చేయాలని నగర పోలీస్ కమిషనర్ భూషన్ బుర్సే ఆదేశించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మితిమీరిన శబ్దాలతో డీజే వినియోగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. హుబ్లీ ధార్వాడ సౌండ్ సిస్టమ్ అండ్ లైట్ అసోసియేషన్ పదాధికారులు, సభ్యులకు సూచనలు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా డీజే కర్కశ శబ్దాలకు సంభవించిన ప్రమాదాలు, ముప్పు గురించి అందరూ అవగాహన పెంచుకుని మితిమీరిన చేష్టలకు పాల్పడొద్దన్నారు. వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నకిలీ మందుల మాఫియాపై ఉక్కుపాదం
దొడ్డబళ్లాపురం/బనశంకరి: బెంగళూరు దక్షిణ జిల్లా పరిధిలోని రామనగర తాలూకా దొడ్డేరి ఫాంహౌస్‌లో వెలుగు చూసిన నకిలీ మందుల తయారీ మాఫియా కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆరు రాష్ట్రాల్లో 10 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, హరియాణ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణల్లో ఈ దాడులు చేపట్టారు. సుమారు 100 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఒక్కో ప్రదేశం నుంచి ఒక్కో రకమైన మందులు దిగుమతి చేసుకుని, వివిధ చోట్ల పలు రకాల మందులను నిల్వ చేస్తున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మాఫియాకు కింగ్‌పిన్‌గా ఉన్న ప్రశాంత్ పలువురు డీలర్ల నుంచి నకిలీ మందులు తెప్పించుకుని పేరొందిన ఆస్పత్రులకు మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించేవారని దర్యాప్తులో తేలింది. నకిలీముఠాలో నిందితునిగా ఉన్న ప్రశాంత్, అతడి గ్యాంగ్‌తో సంబంధాలు కలిగిన వీరేశ్‌కుమార్ ఇళ్లు, కార్యాలయం, మినర్వా సర్కిల్ వద్ద కృపా హెల్త్ కేర్‌పై సిట్ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఏడాది నుంచి వీరేశ్, ప్రశాంత్ ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. ఆస్పత్రులకు, మందుల షాపులకు మందులు సరఫరా చేసే రెప్రజెంటేటివ్లకు అధిక కమీషన్ల ఆశ చూపి ఈ నకిలీ మందులు విక్రయించేవారని వెల్లడైంది. సుమారు 15 మంది రెప్రజెంటేటివ్‌లు ఈ దందాలో ఉన్నట్టు గుర్తించారు. బెంగళూరు మినర్వా సర్కిల్లో ఉన్న గోడౌన్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు కూడా ఈ నకిలీ మందులు సరఫరా చేసేవారు. థైరాయిడ్ మందులు, విటమిన్ టాబ్లెట్లు, వివిధ రకాల ఇంజెక్షన్లు కూడా నకిలీవి తయారు చేసి నిజమైన మందులుగా ప్రముఖ కంపెనీల లేబుల్స్ అతికించి విక్రయించేవారని సమాచారం. వీరేశ్‌కుమార్ ఇళ్లు, కృపా హెల్త్‌కేర్ సంస్థ నుంచి నకిలీ ఔషధాల బిల్లులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 6 రాష్ట్రాల్లో ఏకకాలంలో సిట్ అధికారుల దాడులు -
అర్హులకు పథకాలు అందించాలి
రాయచూరు రూరల్: జిల్లాలోని ఆది జాంబవ అభివృద్ధి మండలిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దళిత సేన సమితి డిమాండ్ చేసింది. గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆది జాంబవ మండలి రాష్ట్ర అధ్యక్షుడు మంజునాథను ఆ సంఘం నాయకుడు భరత్ కుమార్ కలిశారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న పథకాలు మధ్యవర్తుల సహకారంతో నిజమైన లబ్ధిదారులకు అందడం లేదని ఆరోపించారు. రాయచూరు కార్యాలయంలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు మధ్యవర్తులతో చేతులు కలిపి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరగోళలో దొంగల బెడద హుబ్లీ: స్థానిక అమరగోళ ఆశ్రేయ కాలనీలో వరస చోరీలు జరుగుతుండటంతో 820 కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి. కాలనీలో దొంగ బెడద పెరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆ కాలనీ వాసులు వాపోయారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు పోగొట్టుకున్నామన్నారు. రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని నూతన పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. బాలికపై లైంగిక దాడిహుబ్లీ: మైనర్ బాలికపై ఇద్దరు లైంగిక దౌర్జన్యానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ ఘటనపై ధార్వాడ మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హుబ్లీ తాలూకా మావనూరు గ్రామానికి చెందిన ఫకృసాబ్, బసవరాజ నిందితులు. వీరు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశారు. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చడంతో తల్లి ధార్వాడ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ముగిసిన వీరభద్రస్వామి జాతర
బళ్లారి అర్బన్: సిరుగుప్ప తాలూకా దరూర్ గ్రామంలోని వీరభద్రస్వామి జాతర ముగిసింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు వేలాది మంది భక్తుల సమక్షంలో జాతర వైభవంగా జరిగింది. శ్రావణ మాసం మొదటి సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు.. శుక్రవారం రథపూజ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి వీరేశయ్య స్వామి ఆధ్వర్యంలో ఆలయ పన్ను వసూలుదారులు, మేటీలు, తళ్వార్లు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం రథంలోని విగ్రహాన్ని కిందకు దించి, పూలమాలలు, అరటి దిండ్లను తొలగించారు. రథాన్ని శుభ్రంగా కడిగి, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథాన్ని యథాస్థానానికి తరలించారు. కార్యక్రమంలో మేటీలు పంపనగౌడ, వినోద గౌడ, మారబసప్ప నాయక, కెంపన్నవర వీరేష్ నాయక, తల్వార్ చంద్రనాయక, బంకాడ మానే వీరేష్, ముదియప్ప నాయక, కెంపన్నవర రుద్ర నాయక, డాక్టర్ పురుషోత్తం గౌడ తదితరులు పాల్గొన్నారు. -
నంది జలధార తగ్గుముఖం
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కాడుమల్లేశ్వర ఆలయ సమీపంలోని ప్రసిద్ధ నందితీర్థం ఆలయంలో ఉన్న నంది విగ్రహం నోటి నుంచి జాలువారే జలధార శివలింగంపై పడి నిత్యం జలాభిషేకం జరగడం అందరికీ తెలిసిందే. దీన్ని భక్తులు ప్రకృతి వింతగా భావిస్తారు. అయితే ప్రస్తుతం నంది విగ్రహం నోటి నుంచి వచ్చే జలధార తగ్గిపోవడం భక్తులను కలవరపెడుతోంది. ఈ జలధార రోజురోజుకూ తగ్గిపోతోందని పూజారి ప్రసన్న భట్ చెప్పారు. దేవాలయంలోనే కాదు, సమీపంలోని శాంకీ చెరువులో కూడా నీటి నిల్వ తగ్గిపోతోంది. వర్షాభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. శివలింగానికి ప్రస్తుతం నిత్యం జలాభిషేకం జరుగుతున్నా రాబోయే రోజుల్లో నంది విగ్రహం నోటి నుంచి వచ్చే జలధార ఆగిపోవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. బైక్‌ను కారు ఢీకొని ముగ్గురు మృతి మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ఆర్.ఎస్.దొడ్డి సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద గురువారం రాత్రి బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. మృతులను హనూరు తాలూకా కొప్ప గ్రామానికి చెందిన సురేష్ (24), మహేంద్ర (35), మునియప్ప (35)గా గుర్తించారు. గౌరీ గణేష్ పండుగకు సిద్ధమవుతున్న ఈ ముగ్గురూ కొళ్లెగాలకు వెళ్తుండగా, మలె మహదేశ్వర కొండ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు వారి బైక్‌ను ఢీకొంది. ప్రమాద తీవ్రతకు ఇద్దరి మృతదేహాలు ఛిద్రమయ్యాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న హనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు, బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్కూలు విద్యార్థుల షూ కుంభకోణం ● సుమోటోగా కేసు నమోదు ● విచారణకు ఉప లోకాయుక్త ఆదేశం శివాజీనగర: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాసిరకం బూట్లు పంపిణీ చేసిన తీవ్రమైన కేసుకు సంబంధించి ఉప లోకాయుక్త జస్టిస్ కే.ఎన్.ఫణీంద్ర సుమోటోగా ఫిర్యాదు నమోదు చేసి, కఠిన దర్యాప్తునకు ఆదేశించారు. బాలల సంక్షేమ పథకంలోని అవినీతిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లు వారం రోజుల్లోనే చిరిగిపోయాయని, వేసుకున్న కొంతసేపటికే కుట్లు ఊడాయని మీడియాలో వార్తలొచ్చాయి. గతంతో పోల్చితే ఈసారి కొనుగోలు ప్రక్రియ, పర్యవేక్షణలో వ్యవస్థీకృత అవినీతి ఉన్నట్లు స్పష్టమైంది. విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిరంతరంగా నిర్లక్ష్యం వహించడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెకర్లు(డీడీపీఐ), బ్లాక్ విద్యాధికారు(బీఈఓ)లపై అధికారికంగా కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి, రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సంబంధిత జిల్లాల లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ల (ఎస్పీల)కు కఠిన ఆదేశాలు జారీ చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ అభ్యంతరంశివాజీనగర: 2028 ఎన్నికలలో తాను పోటీ చేయబోనని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలతో పార్టీకి ఎదురుదెబ్బ తగలవచ్చని ఆయన హెచ్చరించారు. మండ్య జిల్లాలోని కే.ఆర్.పేటెలో జరిగిన కే.ఆర్.పేటె కృష్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అధినేత, కేంద్ర ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సిద్దరామయ్యకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు సమాచారం. మీ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించవచ్చు. పార్టీకి మీలాంటి సీనియర్ నాయకులు చాలా అవసరం. అందువల్ల అలాంటి ప్రకటనలు చేయవద్దని రాహుల్ చెప్పినట్లు తెలిసింది. కాగా రాహుల్ గాంధీకి తాను చేసిన ప్రకటనపై సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. తాను ఎన్నికల రాజకీయాల నుంచి విరమిస్తున్నానని చెప్పాను కాని రాజకీయాల నుంచి కాదని ఆయన స్పష్టం చేశారు. -
పరామర్శ
సాక్షి, బళ్లారి: రెండు రోజుల క్రితం బళ్లారి చలో పాదయాత్రలో గుండెపోటుతో మృతి చెందిన ఎస్.బి.తిమ్మప్ప కుటుంబ సభ్యులను గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, ఆయన సతీమణి గాలి లక్ష్మీ అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా తదితరులు పరామర్శించారు. శుక్రవారం నగరంలోని మృతుడికి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఓబుళేసు, మహేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. పాతకక్షలతో యువకుడు దారుణహత్యరాయచూరు రూరల్: పాతకక్షలతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాయచూరు జిల్లా మాన్వి నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. మాన్వి నగరంలోని 2వ వార్డుకు చెందిన హనుమేష్ నాయక్ (23) ఇంటికెళ్లి అదే కాలనీకి చెందిన శంకర్ మారణాయుధాలతో దాడి చేసి హతమర్చాడు. అనంతరం నేరుగా మాన్వి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సింధనూర్ డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ పోలీసులతో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తామన్నారు. ఈ మేరకు మాన్వి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలిరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మణ గౌడ డిమాండ్ చేశారు. శుక్రవారం రైతులతో కలసి రాయచూరు జెస్కాం కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. లోఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని ఇంజనీర్లకు వినతిపత్రం అందజేశారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి సతీష్ జార్కిహోళి, ఆయన కుమార్తె చిక్కోడి లోక్‌సభ ఎంపీ ప్రియాంక జార్కిహోళి నివాసాలు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడి చేయడం హేయం అని వాల్మీకి నాయక్ సంఘం నాయకులు మండిపడ్డారు. శుక్రవారం రాయచూరులో మహర్షి వాల్మీకి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఆ సంఘం అధ్యక్షుడు రఘువీర్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి సతీష్ జార్కిహోళిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హంపీలో కట్టడాల సందర్శనహొసపేటె: మైసూరు–కొడుగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్, మాజీ ఎంపీ ప్రతాప్ సింహా గురువారం హంపీని సందర్శించారు. ఈ సందర్భంగా హంపీలోని ప్రసిద్ధ విరూపాక్షేశ్వర స్వామి, కోదండ రామలక్ష్మణ దేవాలయం, యంత్రోద్ధారక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. చారిత్రక, మతపరమైన ప్రాధాన్యత కలిగిన హంపీలోని పలు ఆలయాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, స్థానికులు వారికి ఘన స్వాగతం పలికారు. చారిత్రక కట్టడాల చరిత్ర, విశిష్టత గురించి సమాచారం తెలుసుకున్నారు. -
అపార్టుమెంట్ల బిల్లుపై గవర్నర్ సందేహాలు
శివాజీనగర: సీఎం డీకే శివకుమార్ తీసుకువచ్చిన కర్ణాటక అపార్టుమెంటు యాజమాన్య మరియు నిర్వహణ చట్టం బిల్లు– 2026 కు లోక్‌భవన్‌లో బ్రేక్ పడింది. బిల్లులో కొన్ని నిబంధనలపై స్పష్టత కోరుతూ గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ పెండింగ్‌లో పెట్టారు. ఆగస్టు 24న శాసనసభా ఈ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలోని అపార్ట్మెంట్ నివాసితుల హక్కులు, నిర్వహణలో అనేక మార్పులు తీసుకొచ్చింది. వాటిలోని లిప్టులు, కారిడార్లు, లాబీలు, మెట్లు, టెర్రస్ల వంటి ఉమ్మడి సౌకర్యాలు ఒక నిర్దిష్ట సంఘం నియంత్రణలో కాకుండా సమిష్టిగా ఉండాలని ప్రతిపాదిస్తుంది. నివాసితుల భద్రత దృష్ట్యా 30 ఏళ్లు పూర్తయిన భవనాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్మాణ స్థిరత్వ ధృవీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి చేశారు. 75 శాతం అపార్ట్మెంట్ యజమానులు కూడా ఈ బిల్లుపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ చట్టం ఎనిమిది యూనిట్లకు మించిన అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులకు వర్తిస్తుంది. అపార్టుమెంట్ల ఇబ్బందులకు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్యర్యంలో ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగాన్ని రూపొందించారు. చెలరేగిన దొంగలు, రూ.42 లక్షల సొత్తు చోరీమైసూరు: మైసూరు తాలూకాలోని రెండు గ్రామాల్లో దొంగలు స్వైర విహారం చేశారు. పలు ఇళ్లలో తాళాలు పగులగొట్టి రూ.42 లక్షల విలువ చేసే 384 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.45 లక్షల నగదును దోచుకున్నారు. మొదటి ఘటనలో రమాబాయినగర ఆర్కే బడావణె నివాసి దీపక్ భార్య సువర్ణాదేవి ఇంటికి తాళం వేసుకుని మైసూరుకు వెళ్లారు. దొంగలు చొరబడి ఇంట్లో వార్డ్‌రోబ్‌లో దాచిన రూ.41.13 లక్షల విలువైన 340 గ్రాముల బంగారు నగలు, రూ.1.35 లక్షల నగదు, 88 గ్రాముల వెండి వస్తువులను దోచుకుని పరారయ్యారు. సువర్ణాదేవి ఇంటికి వచ్చి చూడగా దొంగతనం తెలిసింది. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిద్రిస్తుండగా గొలుసు కట్ మరో ఘటనలో యడకోళలో ఇంటి గడియను తెరిచిన దుండగులు నిద్రిస్తున్న దేవమ్మ మెడలోని 34 గ్రాముల బంగారు గొలుసును కత్తిరించుకుని వెళ్లారు. ఉదయం నిద్ర లేచి చూసుకుంటే గొలుసు లేదు. వరుణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రియుని మౌనం.. వివాహిత ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: ప్రియుడు ఫోన్ చేయడం లేదు, ఆమె కాల్ చేసినా స్పందించడం లేదు.. దీంతో బాధకు లోనై ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలకోటలోని బాంబే కాలనీలో జరిగింది. మొబైల్ సంబంధాల మాయలో తరిగిపోతున్న కుటుంబ బాంధవ్యాలకు ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది. వివరాలు.. మెహబూబ్ బీ (27) మృతురాలు. ఈమె స్థానికంగా ఉంటున్న ఒక యువకునితో సంబంధం కలిగి ఉంది. కొన్నిరోజులుగా అతడు ఈమెకు కాల్ చేయకపోగా, ఈమె ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. దీంతో మెహబూబ్ బీ సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతనికి పంపింది. నాతో మాట్లాడకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ మెసేజ్ కూడా పంపింది. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. విరక్తి చెందిన మెహబూబ్ బీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
విద్యతోనే ప్రభుత్వ పథకాల లబ్ధి
హొసపేటె: న్యాయ పరిజ్ఞానాన్ని పొందడానికి, ప్రభుత్వ పథకాల లబ్ధికి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని న్యాయవాది శ్వేతాంబరి అన్నారు. జేపీ భవన్లో మురికివాడల ప్రజల కోసం న్యాయ అవగాహన, ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన సమాచార శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. నేటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మురికివాడల ప్రజల సమస్యలను తీర్చడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. మహిళలు, పిల్లల కోసం ఉన్న ప్రత్యేక చట్టాలను వినియోగించుకోవడంలో మురికివాడల ప్రజలు విఫలమవుతున్నారన్నారు. సమానత్వ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర, మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కృష్ణమూర్తి, స్లం జనాందోళన కర్ణాటక ఆర్గనైజింగ్ కో–ఆర్డినేటర్ జనార్ధన్, సాంఘిక సంక్షేమ శాఖ కొట్రేష్, స్లం బోర్డు ఏఈఈ తిమ్మన్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ విద్య, పొగాకు నియంత్రణ సెల్ బోజరాజు, షెడ్యూల్డ్ కులాల శాఖ రామన్న, మైనార్టీ శాఖ మల్లికార్జున, కార్మిక శాఖ రవి, హెచ్.వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
మా పోరాటం ఇంతటితో ఆగదు
సాక్షి,బళ్లారి: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించి రైతులు, పేద ప్రజల పక్షాన పని చేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, ఇది ప్రారంభం మాత్రమేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర తదితరులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బళ్లారి చలో పాదయాత్ర ముగింపు సమావేశంలో వారు కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయేంద్ర మాట్లాడుతూ తమ అసలైన పోరాటం ఈరోజు నుంచే ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేంత వరకు తగ్గేదే లేదన్నారు. సీఎం 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదన్నారు. వందేమాతర గీతాన్ని రెండు చరణాలకు కుదించే నిర్ణయాన్ని తీసుకున్నారని మండిపడ్డారు. మైనార్టీల మెప్పు కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నాం తాము 10 రోజుల పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్నామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని గుర్తు చేశారు. రైతులకు ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రులు, యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపేంత వరకు విశ్రమించేది లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు కష్టకాలం మొదలైందన్నారు. తమ పోరాటంతో ఇప్పటికే ఒక వికెట్ పడిందని గుర్తు చేశారు. కేపీఎస్సీ అవినీతి అక్రమాల్లో చిన్న ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం సీఎం కూడా పదవి కోల్పోవడం ఖాయం అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మండిపాటు గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి బళ్లారి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో పాటు కళ్యాణ కర్ణాటకలో 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. మాజీ సీఎం సదానంద గౌడ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి గోవింద కారజోళ తదితరులు మాట్లాడారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు నగరంలోని ఎస్పీ సర్కిల్లో వాల్మీకి విగ్రహానికి నేతలు ప్రత్యేక పూజలు చేసి వేదిక వద్దకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి రాధా మనోహర్ అగర్వాల్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు, పలువులు ఎమ్మెల్యేలు, మాజీ లోక్‌సభ సభ్యులు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా, గాలి జనార్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ, మాజీ లోక్‌సభ సభ్యుడు సన్న పక్కీరప్ప తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం బళ్లారిలో బీజేపీ పాదయాత్ర ముగింపు సభ -
అభివృద్ధి కోసమే ఆరాటం
శివాజీనగర: కొత్త కార్యక్రమాలతో పాటు పాత పథకాలను, పంచ గ్యారంటీలను కొనసాగించాలి. 100 రోజులు అనేది వేడుక కాదు, మనం సరైన మార్గంలో ఉన్నామని ప్రజలకు చూపిస్తున్నాము అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నూరు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం విధానసౌధలో ఆర్భాటంగా దృఢ కర్ణాటక సంకల్పం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యమని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇల్లులేనివారికి ఉచితంగా స్థలం, సైనిక్ సమ్మాన్ పథకం, వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సేవ, పాఠశాలల కోసం సీఎస్ఆర్ వెబ్సైట్, విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు, వన్ కర్ణాటక మొబిలిటీ యాప్‌ను సీఎం డీకే, సిద్దరామయ్యలు ఆవిష్కరించారు. వందరోజుల్లో తమ సర్కారు ఏమేం చేసిందో వివరిస్తూ బ్రోచరును విడుదల చేశారు. గ్యారంటీలను కొనసాగించాలి: సిద్దు సిద్దరామయ్య ప్రసంగిస్తూ సెప్టెంబర్ 14కు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 3 సంవత్సరాల 4 నెలలు పూర్తవుతుందన్నారు. మనవద్ద కొత్త ఆలోచనలు, కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వం సరైన పనే చేస్తోంది. పంచ గ్యారెంటీలను కొనసాగించండి.. అని సిద్దరామయ్య సూచించారు. బీజేపీ నేత పాదయాత్రను ప్రస్తావిస్తూ ఆ పార్టీ జిమ్మిక్కులు చేస్తోందన్నారు. వర్షాలు పడే అవకాశాలు తక్కువని, కరువు కోరల్లో చిక్కిన రైతాంగాన్ని సత్వరమే ఆదుకోవాలని సీఎంకు సూచించారు. సీఎం డీకే శివకుమార్ సరైన దారిలో సర్కారు: సిద్దు విధానసౌధలో ఆర్భాటంగా సీఎం డీకే 100 రోజుల సంబరం -
మావటీల పిల్లలకు అక్షర గంధం
మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలకు అడవుల నుంచి ఏనుగుల వెంట వచ్చిన మావటీలు, కాపలాదారుల కుటుంబాలు నగర జీవితానికి అలవాటు పడ్డారు. ఇక వారి పిల్లల కోసం విద్యాశాఖ అధికారులు ప్యాలెస్ ఆవరణలో తాత్కాలిక పాఠశాలను తెరిచారు. పలక, బలపం, పుస్తకాలను, అలాగే మిఠాయిలను అందజేశారు. దసరా తర్వాత ఏనుగులు తిరిగి వెళ్లే వరకు ప్రతిరోజూ పాఠశాల ఉంటుంది. మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు అందిస్తారు. అధికారులు, టీచర్లు పాల్గొన్నారు. అలాగే ఏనుగులకు ఇసుక బస్తాలు కట్టి సాధన చేయించారు. సీఎం డీకే శివకుమార్ పదవి చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా గురువారం రాత్రి ప్యాలెస్‌ను విద్యుద్దీపాలతో సింగారించారు. 14వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు దీపకాంతుల్లో వెలుగులీనుతుంది.ఆశలు నింపే ఆపద్బాంధవులు శివాజీనగర: కన్నడనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా పురోగమిస్తుంటే, కుటుంబాల్లో సంక్షోభాలు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ తీరని విషాదాన్ని మిగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలను నివారించడానికి, వారికి నిరంతరం కౌన్సెలింగ్ ద్వారా అండగా నిలిచేందుకు అర్బన్ సెల్ప్–హార్మ్ స్టడీ ప్రాజెక్టును రాష్ట్రంలోని 37 ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరిస్తున్నారు. నిమ్హాన్స్, రాష్ట్ర ప్రభుత్వం, పలు కార్పొరేట్ కంపెనీల సహకారంతో కొనసాగిస్తారు. ప్రస్తుతం 10 జిల్లాల్లోని 16 ఆసుపత్రులలో మాత్రమే ఈ ఉషస్ పథకం అమలవుతోంది. ఏడాదిలోగా దానిని మొత్తం 31 జిల్లా ఆసుపత్రులకు, బెంగళూరులోని 6 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినవారు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యే వరకు, అలాగే మరికొంతకాలం నిపుణులు మానసిక స్థైర్యం కల్పిస్తూ కౌన్సెలింగ్ ఇస్తారు. అత్యధిక బలవన్మరణాలు: మంత్రి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ జాతీయ నేర గణాంక రికార్డుల బ్యూరో ప్రకారం 2024లో భారతదేశంలో 1,70,746 ఆత్మహత్యల మరణాలు నమోదైనట్లు తెలిపారు. వీటిలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలలో కర్ణాటక ఒకటని చెప్పారు. ఆత్మహత్యాయత్యం చేసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందిస్తారని, వారి మానసిక స్థితిని అంచనా వేసి, వారికి కౌన్సెలింగ్, భవిష్యత్తుకు అవసరమైన నైతిక మద్దతు అందిస్తామని తెలిపారు. ప్యాలెస్ ఆవరణలో పాఠశాల గజరాజుల సాధన ఆత్మహత్యాయత్నం బాధితులకు ఉషస్ కౌన్సెలింగ్ అన్ని జిల్లాలకు విస్తరణ నిమ్హాన్స్, సర్కారు చొరవ ధైర్యం నింపుతారు 2022 నుంచి ఇప్పటి వరకు 35,436 ఆత్మహత్యాయత్నం చేసినవారికి ఉషస్ కింద సహాయం అందించారు. 26,385 మందికి కౌన్సెలింగ్, నిరంతరం వివరాలను కనుక్కుంటూ కుటుంబాలను అప్రమత్తం చేశారు. కౌన్సెలింగ్ పొందిన వారిలో కేవలం 1.3 శాతం మంది మాత్రమే తిరిగి ఆత్మహత్యలకు ప్రయత్నించగా, 0.3 శాతం మంది మరణించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే రెండోదఫా ఆత్మహత్యాయత్నాలు బాగా తగ్గాయని వైద్య నిపుణులు తెలిపారు. అవమానం, భయం, ఒంటరితనంతో బాధపడేవారికి ఉషస్ చికిత్సతో ధైర్యం నింపడమే లక్ష్యమని నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ వై.సీ.జనార్ధనరెడ్డి తెలిపారు. నెలల తరబడి రోగితో సంప్రదింపులు జరిపేందుకు శిక్షణ పొందిన నిపుణులు ఉంటారని, రెండోసారి ఆత్మహత్యాయత్నం చేయకుండా నివారిస్తారని చెప్పారు. -
మూగప్రాణులకు చిత్రహింసలు
● ప్రైవేటు వెటర్నరీ ఆస్పత్రిలో ఘోరం దొడ్డబళ్లాపురం: పశువైద్య విద్య సాధన కోసం మత్తు మందు ఇవ్వకుండా కుక్క కాలు కత్తిరించడం, అక్రమంగా ప్రాణుల మీద ప్రయోగాలు చేస్తున్న ప్రైవేటు వెటర్నరీ ఆస్పత్రి దారుణాలు బెంగళూరులో వెలుగు చూశాయి. దొడ్డకన్నెలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఓ వెటర్నరీ ఆస్పత్రి నడుస్తోంది. దానిపై ఫిర్యాదులు రావడంతో జీబీఏ అధికారులు తనిఖీలు చేశారు. ప్రాక్టీస్ కోసం ఓ కుక్క కాలు కత్తిరించి వైద్యం చేయడం, మత్తు లేకుండానే శస్త్రచికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. పలు రకాల ప్రాణులను ఇక్కడ అక్రమంగా బంధించినట్టు తెలిసింది. ఆస్పత్రిని సీజ్ చేసి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ప్రాణులను హింసించినందుకు ప్రత్యేక కేసులు నమోదు చేశారు. రెండోరోజూ ఈడీ సోదాలు ● మంత్రి జార్కిహొళి, భార్య, పిల్లల విచారణ బనశంకరి: విదేశాల్లో అక్రమంగా నగదు పెట్టుబడి పెట్టారని మనీ లాండరింగ్, ఫెమా కేసుల కింద ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి, కుమార్తె, ఎంపీ ప్రియాంక, బావమరిది, అబ్కారీ డీసీ మంజునాథ్, ఆప్తుల నివాసాలు, ఆఫీసుల్లో గురువారం కూడా ఈడీ అధికారులు తనిఖీలు జరిగాయి. 18 చోట్ల సోదాలు చేస్తూ భారీమొత్తంలో రికార్డులు, ఫైళ్లు పరిశీలించారు. గోకాక్‌లో మంత్రి ఇల్లు, బెళగావిలో మంజునాథ్ ఇల్లు, మంజునాద్ పీఏ ప్రీతి కాకత్కర్ ఇల్లు, మంత్రి ఆప్తులైన విఠల పరసన్నవర, రాజు దరగశెట్టి, మలగౌడ పాటిల్ ఇళ్లలో సోదాలు పూర్తి చేశారు. ఏమేం లభించాయనేది ఈడీ అధికారులు త్వరలో ప్రకటిస్తారు. గోకాక్‌లో మంత్రి భార్య శకుంతల, కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్‌లను సైతం ప్రశ్నించారు. అంతటా కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. మంత్రికి నిద్ర లేకుండా.. బెంగళూరు నివాసంలో బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మంత్రి సతీశ్‌ని ప్రశ్నించారు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రపోవడానికి అవకాశమిచ్చారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మళ్లీ సోదాలు సాగించారు. అనేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈడీ దాడులను ఖండిస్తూ బెళగావి సహా పలు నగరాలలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ధర్నాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మునిరత్న, ముగ్గురు సీఐలపై కేసు యశవంతపుర: ఓ మహిళ మీద అబద్ధపు ఎఫ్ఐఆర్ వేయించి ఆమెను అరెస్ట్ చేయించారనే ఆరోపణలతో నగరంలోని రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న, పోలీసు అధికారులతో పాటు 8 మందిపై ఆర్ఆర్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. మునిరత్న, కిరణ్ నాయుడు, లోహిత్గౌడ, మంజునాథ్, లక్ష్మీ జయరామ్, పోలీసు సీఐలు ఐయణ్ణరెడ్డి, లోహిత్ బిఎన్, ఎస్ఐ చంద్రశేఖర్‌లపై కేసు నమోదైంది. తన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని, ఎలాగైనా జైలుకు పంపాలని వీరందరూ కుట్ర చేశారని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్‌ఆర్‌నగర పోలీసులు కేసు నమోదు చేయగా, సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. వృద్ధురాలి సమయస్ఫూర్తిమైసూరు: చైన్‌స్నాచర్లు దాడి చేస్తే యువతులు, మహిళలే హడలిపోతుంటే ఒక వృద్ధురాలు సమయస్ఫూర్తితో బంగారాన్ని కాపాడుకుంది. ఈ ఘటన మైసూరు మేటగళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో మధురా నగర లేఔట్లో జరిగింది. పాలు తీసుకొచ్చేందుకు కమలాక్షమ్మ (85) అనే వృద్ధురాలు బయలుదేరింది. ఆటోలో వచ్చిన దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె రెండు చేతులతో గొలుసును గట్టిగా పట్టుకోవడంతో పాటు కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వాళ్లు పరుగెత్తుకుని వచ్చారు. దీంతో భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఆమె ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. -
రైల్వే సమస్యలు పరిష్కరించండి
రాయచూరు రూరల్ : రాయచూరు రైల్వేస్టేషన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే బోర్డు సలహా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణను కలిసి విన్నవించారు. సభ్యులు చంద్రశేఖర్, మారెప్ప, నవీన్ కుమార్ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రాయచూరు రైల్వే స్టేషన్లో కార్గో టర్మినల్ ఏర్పాటు చేయాలని, రాయచూరు–గిణిగేర రైలు మార్గంలో మాన్వి–రాయచూరు మధ్య అసంపూర్తిగా మిగిలిన రైలు మార్గ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని, మమదాపురను గ్రేటర్ రైల్వేస్టేషన్‌గా మార్చి గూడ్స్‌షెడ్‌ను స్థాపించాలని, కుర్డిని రైల్వే క్రాసింగ్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ఒత్తిడి చేశారు. రాయచూరు రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఏర్పాటు పనులను నాసిరకంగా చేపడుతున్నారని ఆరోపించారు. మొదటి ప్లాట్‌ఫాంలో టికెట్ కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ఇంజనీరింగ్, కమర్షియల్, ఎలెక్ట్రికల్, సివిల్, ఆపరేటింగ్ విభాగంలో లోపాలను సవరించాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. కాకినాడ, విశాఖలకు రైళ్లు నడపాలి కళ్యాణ కర్ణాటక జిల్లాల ప్రజలకు అనుకూలంగా రాయచూరు మీదుగా కాకినాడ, విశాఖపట్నంలకు రైళ్లు నడపాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు రైల్వేస్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ– మైసూరు రైలును ప్రతి రోజూ నడపాలని, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ మధ్య సంచరిస్తున్న రైలును రాయచూరు మీదుగా మంత్రాలయం రోడ్డు స్టేషన్ వరకు పొడిగించాలని ప్రవాసాంధ్ర ప్రముఖుడు సూర్యదేవర నాగేశ్వరరావు కోరారు. రమేష్ బోస్, ప్రసాద్, కొండయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల అభివృద్ధే డీసీసీ బ్యాంక్ లక్ష్యం
కోలారు: అవిభజిత కోలారు జిల్లాలో డీసీసీ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌ను గురువారం తాలూకాలోని అరహళ్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధే డీసీసీ బ్యాంక్ లక్ష్యం అని తెలిపారు. అరహళ్లి సొసైటీ అధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి, పదాధికారులు పాల్గొన్నారు.నియామకం కోలారు: కాంగ్రెస్ పార్టీ కోలారు జిల్లా నూతన అధ్యక్షుడిగా మేకల నారాయణస్వామిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసపురం తాలూకాకు చెందిన మేకల నారాయణ స్వామి ఇంతవరకు కాంగ్రెస్ జిల్లా కార్యాధ్యక్షుడిగా పని చేశారు. విధానసభ మాజీ సభాపతి కె.ఆర్.రమేష్ కుమార్‌కు అత్యంత ఆప్తుడు. మూడు సంవత్సరాలుగా మాలూరు తాలూకాకు చెందిన లక్ష్మీనారాయణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన స్థానంలో కాంగ్రెస్ హై కమాండ్ మేకల నారాయణస్వామిని జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. నూతన అధ్యక్షుడికి పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. -
రోడ్డు పనుల్లో అన్యాయం తగదు
రాయచూరు రూరల్: జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో అధికారులు రైతుల భూములను లాక్కొని వారికే అన్యాయం చేస్తున్నారని భూ యజమానుల ఆందోళన సమితి సంచాలకుడు శరణప్ప ఉద్బాళ ఆరోపించారు. జిల్లాలోని జాతీయ రహదారి– 748ఏ పనులపై భూములకు సరైన పరిహారం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. సంతెకల్లూరు, అమీనగడ, మట్టూరు, వటగల్, సర్జాపూర్ మీదుగా చేపడుతున్న బెళగావి– రాయచూరు జాతీయ రహదారి విషయంలో రైతులకు పొలాలకు వెళ్లడానికి రహదారులు నిర్మించాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామన్నారు. రెండు గంటలపాటు లింగసూగూరు– బెళగావి రహదారిలో రాకపోకలను స్తంభింపజేశారు. అనంతరం లింగసూగూరు ఏసీ నాగేంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. అంజన్న సన్నిధిలో యదువీర్ సాక్షి,బళ్లారి: మైసూరు–కొడగు లోక్‌సభ సభ్యుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ గురువారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని సాక్షాత్తు శ్రీఆంజనేయస్వామి జన్మస్థలంగా పేరొందిన అంజనాద్రిని దర్శించుకున్నారు. ఆయన అంజనాద్రిలోని 575 మెట్లను ఎక్కి కొండపైకి చేరుకుని శ్రీఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రముఖులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ గొప్పదనాన్ని తెలుసుకుని మాట్లాడుతూ రాష్ట్రం, దేశం అభివృద్ధితో పాటు ప్రతి ఒక్క ప్రజానీకానికి మంచి జరగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. డిమాండ్లను నెరవేర్చరూ హొసపేటె: మురికివాడల ప్రజల సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతూ మురికివాడల సంఘం ఆధ్వర్యంలో అదనపు జిల్లాధికారి లోకేష్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ విషయమై సంఘం నేత వెంకటేష్ మాట్లాడుతూ మురికివాడల ప్రజల సమస్యలపై సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని, మురికివాడల సరిహద్దులను గుర్తించే పనిని త్వరగా పూర్తి చేయాలని, ఆస్తిని నమోదు చేసి, రిజిస్ట్రేషన్ చేసే పనిని వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. బోర్డు కార్యాలయంలో అవుట్ ఆఫ్ ఆఫీస్ ప్రాతిపదికన పని చేసే సిబ్బందిని కొనసాగించాలని, చట్ట ప్రకారం అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. స్లం పీపుల్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు శేషు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, భరత్‌కుమార్ పాల్గొన్నారు. తపాలా జీవిత బీమా బాండ్ పంపిణీ హొసపేటె: దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణ, గ్రామీణ ప్రజలకు తపాలా జీవిత బీమా పాలసీ పథకం హర్షణీయం అని తపాలా శాఖ అధికారి కొట్రేష్ తెలిపారు. పట్టణంలోని విశ్రాంత పోస్ట్‌మాస్టర్ శంక్రమ్మకు ఈ సౌకర్యం కింద మొదటి బీమా హామీ పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో అనేక కంపెనీలు బీమా సౌకర్యాలు కల్పించడంలో పోటీ పడుతున్నా కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ అత్యధిక ప్రాధాన్యతనిచ్చి దేశంలోని అన్ని గ్రామాలు, నగరాల పౌరులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. గ్రామీణ పౌరుల్లో నిరక్షరాస్యులు, 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న వారైన, 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులైన పౌరులందరూ ఈ పథకం లబ్ధి పొందవచ్చన్నారు. సబ్–డివిజన్ తపాలా శాఖ అభివృద్ధి అధికారి కే.వెంకటేష్, విరుపాక్షప్ప, కోరి చిక్కప్ప, పరసప్ప మౌనేష్, శివరాజ్, ఐశ్వర్య, చంద్రశేఖర్, నాగరాజ్ పాల్గొన్నారు. పశువుల ఆస్పత్రిని ప్రారంభించాలి కోలారు: తాలూకాలోని తావరెకెరె గ్రామంలో పశువుల ఆస్పత్రిని ప్రారంభించాలని ముళబాగిలు ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్‌ను కోరుతామని కోముల్ పశ్చిమ నియోజకవర్గ డైరెక్టర్ బి.వి.సామేగౌడ తెలిపారు. ముళబాగిలు తాలూకాలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సభాంగణంలో నిర్వహించిన సామాన్య సర్వసభ్య సభను ప్రారంభించి మాట్లాడారు. కోముల్ సహకారంతో ఎకరా భూమిలో మేత పండించడానికి 5 కిలోల మొక్కజొన్న, రూ.5 వేల ప్రోత్సాహక ధనం అందిస్తారన్నారు. పాడి రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డా. కె.కిరణ్, వెంకట రత్నయ్య, ఎం.నారాయణప్ప పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కోలారు: నగరంలోని విశ్వేశ్వరయ్య జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన వక్కలేరి ఫిర్కా స్థాయి ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయి అండర్–14 విభాగం బాలుర వాలీబాల్ పోటీల్లో తాలూకాలోని అరాభికొత్తనూరు పాఠశాల విద్యార్థులు విజయం సాధించారు. ప్రతిభ కనబరిచి తాలూకా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అధికారి రాధమ్మ, తాలూకా వ్యాయామ విద్యాధికారిణి కె.లీల, దైహిక శిక్షకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ చౌడప్ప తదితరులు విద్యార్థులను అభినందించారు. -
డీసీసీ అధ్యక్షుల నియామకం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా శాంతప్పను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. గత అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి స్థానంలో నూతనంగా శాంతప్పను నియమించారు. 30 ఏళ్ల పాటు శాంతప్ప పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్ష పదవిని అప్పగించారు. యాదగిరి జిల్లా కాంగ్రెస్‌కు రెండోసారి బసరెడ్డిని, బీదర్ జిల్లా కాంగ్రెస్‌కు అబ్దుల్ మనాన్ను అధ్యక్షుడిగా నియమించారు. విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలిరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని ఒత్తిడి చేస్తూ రాయచూరు తాలూకా గిల్లేసూగూరులో జెస్కాం ఉప కార్యాలయం వద్ద గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారులను ముట్టడించి మాట్లాడుతూ 12 గంటల పాటు విద్యుత్ సక్రమ సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంజనీర్లు నటరాజ్, హులిరాజ్లకు వినతిపత్రం సమర్పించారు. హత్య కేసుల్లో సీఐడీ దర్యాప్తు చేయించాలిరాయచూరు రూరల్: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసులను సీఐడీ దర్యాప్తు చేయించాలని సీపీఐ సంచాలకుడు వీరేష్ డిమాండ్ చేశారు. గురువారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. పాత కక్షలతో దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హద్దినాళలో భూమానంద, కరడకల్లులో రేణుక, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్వినిలను చంపిన ఘటనల్లో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని, ఈ కేసులను సీఐడీ దర్యాప్తునకు అప్పగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. శరణ బసవ, పద్మ, వరలక్ష్మి, కరియప్ప, గోకారమ్మ, నరసప్ప, రంగప్ప, జిలాని పాషాలున్నారు. డిసెంబర్లో వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనంరాయచూరు రూరల్: 2026 డిసెంబర్ నెలలో రాయచూరులో 41వ వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గురునాథ్ పేర్కొన్నారు. గురువారం రాయచూరు జిల్లాధికారి కార్యాలయంలో జిల్లాధికారిణి పూవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పాత్రికేయులు ఐకమత్యంతో సమ్మేళనం విజయవంతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చే ప్రతినిధులకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం రాయచూరు రూరల్: జిల్లాలో మృతి చెందిన దళితుల కుటుంబాలకు పరిహారం అందించడంతో పాటు సర్కార్ నుంచి ఉద్యోగాలు కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఆది జాంబవ సంఘం అధ్యక్షుడు మంజునాథ్ఽ పేర్కొన్నారు. గురువారం దేవదుర్గ తాలూకా హద్దినాళలో భూమానంద, కరడకల్లులో రేణుక, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మాట్లాడారు. సర్కార్ నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాధికార, పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పటికే మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. -
ఆలయాల సందర్శన
సాక్షి,బళ్లారి: బళ్లారి చలో పాదయాత్ర గురువారం ముగియడంతో ఉదయం 10 గంటల నుంచి నగరంలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయం, శ్రీకోట మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రైస్తవ మత గురువులను కలుసుకుని ఆశీర్వచనం పొందారు. మోతీ సర్కిల్ వద్ద విశ్వగురు బసవేశ్వర ప్రతిమ, కుమార స్వామి ఆలయం వద్ద భక్త కనకదాసు ప్రతిమ, బాబూ జగ్జీవన్ రాం, అంబేడ్కర్ ప్రతిమలకు పూలమాలలు వేశారు. విజయేంద్రతో పాటు బీజేపీ నేతలు చలవాది నారాయణ స్వామి, మాజీ మంత్రి శ్రీరాములు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, గాలి లక్ష్మీ అరుణ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులు నగరంలో కలియతిరిగారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కోలారు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రవికుమార్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ ప్రాధికార సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. తాగునీరు, పశువులకు మేత అందించేందుకు నిధులు ఉన్నా టాస్క్ఫోర్సు ఆమోదం నెపంతో నెలల తరబడి పనులను ఆలస్యం చేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు 49 శాతం వర్షం కొరత ఉందన్నారు. 39 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 45 వేల మేత కిట్లకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన 25 కోట్ల నిధులలో జిల్లాకు 12,600 కిట్లు మంజూరైనట్లు వెల్లడించారు. తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, దావణగెరె, ఆంధ్రప్రదేశ్ నుంచి టన్నుకు రూ.300 నుంచి రూ.400 ధరతో ఎండుగడ్డిని ఖరీదు చేసి తెప్పించుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని తాలూకాలలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ ప్రవీణ్ పి బాగేవాడి, డిప్యూటీ కలెక్టర్ మంగళ, అన్ని తాలూకాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కరుణించు గణేశా
ఎమ్మెల్సీ రవికి అపెక్స్ బ్యాంకు పగ్గాలు శివాజీనగర: కర్ణాటక రాష్ట్ర అపెక్స్ బ్యాంక్ అధ్యక్షునిగా సీఎం డీ.కే.శివకుమార్ సమీప బంధువైన ఎమ్మెల్సీ రవిని, ఉపాధ్యక్షునిగా శరణగౌడ బయ్యాపురని ఎంపిక చేశారు. రెండున్నర సంవత్సరాలు వీరు పదవిలో ఉంటారు. సీఎం బుధవారం రాత్రి అపెక్స్ బ్యాంక్ 13 మంది డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. చివరకు, ఈ ఇద్దరిని పదవులకు ఎంపిక చేశారు. సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది మాట్లాడుతూ అందరి సమ్మతితో వారి ఎంపిక జరిగిందని అన్నారు. ఈ పోస్టులను ఆశించిన కేఎన్ రాజణ్ణ, శివానంద పాటిల్ తదితరులు నిరాశకు లోనయ్యారు. ప్రజ్వల్ కస్సుబుస్సు యశవంతపుర: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెల్లో మొబైల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దొరికిన కేసులో రెండవరోజు విచారణ జరిగింది. ఫోన్లో ఎవరితో మాట్లాడారని పోలీసులు ప్రశ్నించారు. తనను అనవసరంగా ఇరికించారు, మాజీ ఎంపీని అని ప్రజ్వల్ కస్సుమన్నట్లు తెలిసింది. తన బెయిల్‌ను రద్దు చేయడానికి తప్పుడు కేసులు పెట్టారని, ఏమీ చెప్పను, ఏం కావాలో అది చేసుకోండి అని స్పష్టం చేసినట్లు సమాచారం. నన్ను సతాయిస్తే కోర్టులో అర్జీ వస్తానంటూ చెప్పాడు.పోలీసుశాఖకు ఆధునిక వాహనాలు: హోంమంత్రి బనశంకరి: పనితీరు మెరుగుపరచడం, ప్రజలకు పకడ్బందీగా సేవలు అందించే ఉద్దేశంతో పోలీస్‌శాఖలోని వాహన వ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. నగరంలో పోలీసు అధికారులు, వాహన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పోలీస్‌శాఖకు ఆధునిక వాహనాలకు బాడుగ పద్ధతిలో ఇచ్చే విధానంపై చర్చించారు. భారీసంఖ్యలో వాహనాలను కొనాలంటే ఎక్కువ పెట్టుబడి కావాలి, అందుకే లీజు పద్ధతి మేలని చర్చించారు. ప్రజలు డబ్బును వివేచనతో ఉపయోగించి పోలీస్‌శాఖ సమర్థతను పెంచడమే తమ ప్రాధాన్యత అన్నారు. శాంతిభద్రతల రక్షణ, గస్తీకి ఆధునిక వాహనాలు అవసరమన్నారు. కేవలం మానవ వనరులు చాలవని, టెక్నాలజీ, సౌకర్యాలు ముఖ్యమన్నారు. మారుతున్న సామాజిక, శాంతిభద్రతలకు సవాళ్లకు పోలీస్‌శాఖ సిద్ధమయ్యేలా ఆధునీకరిస్తామని తెలిపారు. -
ఘోర ప్రమాదం
మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళలో బుధవారం మధ్యాహ్నం బెంగళూరు–మంగళూరు హైవేలో ఘోర ప్రమాదం జరిగింది. దేవిహళ్లి గేట్ దగ్గర ముందు ఇనుప పైపులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనింది. దీంతో పైపులు బస్సులోకి చొచ్చుకెళ్లాయి. అవి తగిలి బస్సు డ్రైవరు, హోళెనరసిపురవాసి శేఖర్ (47) మరణించగా, ట్రాక్టర్ డ్రైవర్ అప్పాజి తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని మరో ఏడుమంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు బెంగళూరు నుంచి హాసన్‌కు వెళ్తోంది. బెల్లూరు పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులోకి దూసుకెళ్లిన పైపులు డ్రైవరు మృతి, 8 మందికి గాయాలు -
సఫారీలకు జీపీఎస్, కెమెరా
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె బండీపుర పులి అభయారణ్యంలో మేలుకామనహళ్లి సఫారీ కేంద్రం వాహనాలకు జీపీఎస్, డ్యాష్‌బోర్డు కెమెరాలను అమర్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సఫారీ వాహనాల సంచారంపై నిఘా వహించడంతో పాటు వన్యప్రాణుల కదలికలను కనిపెట్టడానికి ఈ వ్యవస్థ సహాయకారి అవుతుందన్నారు. వాహనాలు , వన్యప్రాణుల సమాచారాన్ని జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తారు. డ్యాష్‌బోర్డు కెమెరా ఏర్పాటుతో సఫారీ వేళలో జరిగే కార్యకలాపాల వీడియో రికార్డవుతుందని తెలిపారు. వన్యప్రాణుల సురక్షత, పర్యాటకుల భద్రతకు ఉపయుక్తమని జీఎస్ బెట్ట వలయాధికారి సతీష్ తెలిపారు. రూ.68 లక్షల బీమా పంపిణీశివాజీనగర: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కారు భారీ బీమా వసతి కల్పించింది. చిత్రదుర్గం జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కాంతరాజు కుటుంబానికి, ఆరోగ్య శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్ బుధవారం రూ.68 లక్షల బీమా డీడీని అందజేశారు. ఇందులో రూ.60 లక్షలు ఉద్యోగి బీమా, రూ.8 లక్షలు వారి పిల్లల చదువులకు ఉద్దేశించినవని తెలిపారు. ఇంటి ముందు కొండచిలువ మండ్య: మండ్య జిల్లాలోని హలగూరులో జాతీయ రహదారిపై హడ్లీ సర్కిల్ వద్ద మహాదేవస్వామి ఇంటి ముందు ఒక చెట్టు కింద కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు లోనయ్యారు. స్నేక్ జగదీశ్‌ను పిలిపించగా దానిని పట్టుకుని బసవన బెట్ట అడవిలో విడిచిపెట్టారు. ఇటీవల హలగూరు హోబ్లీలో కొండచిలువల సంచారం పెరిగిందని తెలిపారు. ఖాకీల కుట్ర.. రిక్షావాలకు శిక్ష● క్వారీ కేసులో నిందితునిగా పేరు దొడ్డబళ్లాపురం: పోలీసులను నమ్మి పేపరుపై సంతకం చేసిన పాపానికి ఒక రిక్షావాలా క్రిమినల్ కేసులో ఏడాదిన్నర పాటు కష్టాలు పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా ఆలూరువాసి శీన పూజారి రిక్షా తొక్కుతాడు, భార్య ఎండోసల్ఫాన్ మందు ప్రభావంతో జబ్బుతో బాధపడుతోంది. ఇద్దరు పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. 2025 ఆగస్టు 24న ఉదయశెట్టి అనే వ్యక్తిని తన రిక్షాలో గంగొళ్లి పోలీస్‌స్టేషన్‌కి తీసికెళ్లాడు. బయట నిలబడి ఉన్న శీన పూజారిని లోపలకు పిలిచిన పోలీసులు ఒక డాక్యుమెంట్లో సంతకం తీసుకున్నారు. ఊరికే చిన్న పని అని చెప్పారు. కొన్నిరోజులకు ఇంటికి కోర్టు నుంచి నోటీసు రావడంతో శీన పూజారి కంగారుపడ్డాడు. ప్రభుత్వ భూమిలో క్వారీ తవ్వి ఎర్రరాతిని చోరీ చేసిన కేసులో ఉదయశెట్టితో పాటు శీన పూజారిని కూడా నిందితుడని తెలిపారు. ఈ కేసుతో శీన పూజారి కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది. మానవహక్కుల రక్షణా సమితిని ఆశ్రయించి వారి సహాయంతో హైకోర్టులో న్యాయ పోరాటం చేశాడు. ఎట్టకేలకు శీన పూజారిని నిర్దోషిగా గుర్తిస్తూ ఎఫ్ఐఆర్ నుంచి అతడి పేరు తొలగించాలని ఆదేశించింది. శుభ్రత శూన్యం.. హోటల్‌కు తాళం శివాజీనగర: బెంగళూరులో రేస్‌కోర్స్ రోడ్డులో ప్రసిద్ధ సౌత్ రుచిస్ హోటల్లో ఆహార భద్రతా శాఖ అధికారులు సోదాలు జరిపారు. వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు వెల్లడైందని అధికారులు తెలిపారు. అనేక నిబంధనల అతిక్రమణలు కనిపించడంతో హోటల్‌ను తక్షణమే మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు లభించాయని చెప్పారు. నగరంలో హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు తదితరాలపై కొన్నివారాలుగా దాడులు జరుగుతుండడం తెలిసిందే. -
నగరవాసులకు సహాయ 3.0
బనశంకరి: జీబీఏ పరిధిలో ప్రజలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత జనస్నేహి, పారదర్శకంగా చేయడానికి 3.0 సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. బుధవారం జీబీఏ కేంద్ర కార్యాలయంలో అధికారులతో సమావేశం జరిపారు. ఇప్పుడున్న సహాయ 2.0 విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చామని, అందరి సూచనలతో సహాయ 3.0ని త్వరలో అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. నగరవాసులు సమస్యలపై సులభంగా ఫిర్యాదు చేయడం, ఫోటో, లొకేషన్, వాయిస్‌నోట్ అప్లోడ్ చేసే సౌలభ్యం ఉండాలన్నారు. అన్ని శాఖలతో కూడిన వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు. ప్రజ్వల్ విచారణ దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైల్లో మొబైల్‌ఫోన్ దొరికిన కేసులో ఖైదీ, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు బుధవారంనాడు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రజ్వల్‌తో పాటు అతనికి మొబైల్, సిమ్, పెన్‌డ్రైవ్ అందజేసిన 5 మందిని విచారించారు. గత నెలల జైల్లో పోలీసుల సోదాల్లో ప్రజ్వల్ వద్ద మొబైల్, సిమ్, పెన్‌డ్రైవ్, నోట్‌బుక్ లభించాయి. అవి తనవి కాదని ప్రజ్వల్ చెబుతున్నాడు. రెండురోజుల పాటు విచారణ సాగుతుంది. రూ.24 కోట్ల డ్రగ్స్ సీజ్ ● 7 మంది మత్తు విక్రేతల అరెస్టు యశవంతపుర: బెంగళూరు నగరంలో డ్రగ్స్ అమ్ముతున్న ఒక విదేశీ పౌరుడు, ఐదుమంది ఇతర రాష్ట్రాలవారిని, ఓ స్థానికున్ని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 24.22 కోట్ల విలువగల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 11 కేజీల ఎండిఎంఎ, 2.3 కేజీల హైడ్రో గంజాయి, 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. గిరినగర, ఇందిరానగర, చిక్కజాల, గోవిందపుర పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. గజదొంగల అరెస్టు, ● రూ.77 లక్షల చోరీ సొత్తు స్వాధీనం ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను బాణసవాడి పోలీసులు అరెస్ట్ చేశారు. దొడ్డబళ్లాపురకు చెందిన గంగాధర్(40), తుమకూరు కొరటగెరెకి చెందిన బసవరాజు (35) దొరికారు. వారి నుంచి రూ.77.50 లక్షల విలువగల 470 గ్రాముల బంగారం, 886 గ్రాముల వెండి, రూ.3 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. గంగాధర్‌పై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 60 చోరీ కేసులున్నాయి. బసవరాజుపై 33 కేసులున్నాయి. ఇద్దరు కలిసి కారులో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లలో దోపిడీలు చేశారు. వీరి అరెస్టుతో బాణసవాడి, హెణ్ణూరు, మైకో లేఔట్, మాదనాయకనహళ్లి, కొళ్లేగాలలోని పలు దొంగతనాలు పరిష్కారమయ్యాయి. మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే.. తిట్ల పురాణం శివాజీనగర: ఓ మంత్రి, ఎమ్మెల్యే బూతులతో విమర్శలకు దిగారు. వివరాలు ఇలా... భద్రా నదీ జలాలు ఇవ్వాలని దావణగెరె జిల్లా మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున్‌కు ఫిర్యాదు చేయడానికి ఒక రైతు వచ్చాడు. హరిహర బీజేపీ ఎమ్మెల్యే బీ.పీ.హరీషన్నకు అడిగితే, మిమ్మల్ని అడగమని చెప్పారు.. అని అనగానే మంత్రిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎవడు అన్న.. అతన్ని హరీషన్న అని పిలవొద్దు, అతనొక..., అతనిని చెప్పులతో కొట్టండి అని మంత్రి దూషించినట్లు వీడియో వైరలైంది. కొట్టు చూద్దాం: ఎమ్మెల్యే దీనిపై ఎమ్మెల్యే బీ.పీ.హరీశ్ మండిపడ్డారు, నన్ను ఓ రైతు అన్న అని పిలిచాడు, ఇది మంత్రికి నచ్చలేదు, మంత్రికి సంస్కారమే లేదు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, నన్ను బూట్‌తో కొడుతానని అన్నారు, తండ్రికే పుట్టి ఉంటే ఆ పని చేయాలి అని దుయ్యబట్టారు. -
అక్రమ మద్యం అరికట్టండి
రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోకి అక్రమ మద్యం సరఫరా కాకుండా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం అధ్యక్షుడు అబ్రహం డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతుంటే మాన్వి, సిరవార తాలూకాల్లో కిరాణా దుకాణాల్లో విచ్చలవిడిగా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు మౌనం దాల్చారన్నారు. అక్రమ మద్యం అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. డబ్బు చెల్లించని వైద్యునిపై కేసుహుబ్లీ: ఆయుర్వేద ఔషధ వితరణ ఏజెన్సీల ద్వారా ఔషధాలను కొనుగోలు చేసి సదరు బాపతు డబ్బులు చెల్లించకుండా చంపుతామని బెదిరించిన ఆరోపణలపై బాధ్యుడైన వైద్యుడు ఇంద్రేశ్పై హుబ్లీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీనాక్షి మెడికల్ ఏజెన్సీ పేరున 2024లో రూ.3.98 లక్షలు విలువ చేసే ఔషధాలను కొనుగోలు చేసి కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించి మిగతా బకాయి సొమ్మును చెల్లించమంటే చంపుతామని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్పత్రులు ధనార్జన కేంద్రాలు కారాదు ఽహుబ్లీ: ధార్వాడ మాలమడ్డిలో చిరాయు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని సత్యాత్మ తీర్థ స్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యుల సేవలు పేదలకు అనుకూలంగా ఉండాలన్నారు. అయితే ప్రస్తుతం ఆస్పత్రులన్నీ ధనార్జన కేంద్రాలయ్యాయి. ఇలా జరగరాదు. రోగులకు నమ్మకం కలిగేలా వ్యవస్థను డాక్టర్లు నిర్మించాలన్నారు. డాక్టర్ విశ్వనాథ్ పాటిల్, అరుణ్ బళ్లారి, కాత్యాయిని, అరవింద కులకర్ణి పాల్గొన్నారు. -
అక్టోబరు 11న ప్రతిభా పురస్కారాలు
బళ్లారి రూరల్ : కర్ణాటక భోవి(వడ్డెర) సంఘం, జిల్లా భోవి వడ్డెర సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబరు 11న జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం జరుగనున్నట్లు కర్ణాటక భోవి వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ చౌడయ్య తెలిపారు. బుధవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఎస్ఎల్్సీ, పీయూసీలో 85 శాతం కంటే అధికంగా మార్కులు సాధించిన భోవి వడ్డెర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శివరాజ్ తంగడిగి హాజరు కానున్నారు. సాహితీవేత్త డాక్టర్ చౌడయ్య రచించిన శ్రీసిద్దరామేశ్వర మహాత్మె, విద్యార్థుల చేతి పుస్తకాలను భోవి వడ్డెర సంఘం రాష్ట్రాధ్యక్షుడు ఎం.రామప్ప ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. భోవి వడ్డెర సమాజ ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరు రావాలని కోరారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.టీ.మల్లేశ్, జిల్లాధ్యక్షుడు వీ.రామాంజినేయులు, ప్రముఖులు మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంకులో పడి వాల్వ్‌మ్యాన్ మృతి
సాక్షి,బళ్లారి: నగర పాలికె పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో మంచినీరు సరఫరా పని చేసే వాటర్ వాల్వ్‌మ్యాన్ ప్రమాదవశాత్తు ఓవర్‌హెడ్ ట్యాంకులో పడి మృతి చెందాడు. మంగళవారం రాత్రి నగరంలోని కాకర్లతోట ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంకును నింపబోయిన ఎర్రిస్వామి(36) ట్యాంకు నిండిందా, లేదా? అని పరిశీలనకు ట్యాంకు వద్దకు వెళ్లగా ప్రమాదశాత్తు కాలు జారి ఓవర్ హెడ్ ట్యాంకులో పడిపోవడంతో మృతి చెందాడు. ఎర్రిస్వామి రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బుధవారం ఉదయం ఎర్రిస్వామి మృతదేహం ట్యాంకులో తేలగా పాలికె సిబ్బంది భయాందోళన చెందారు. వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పాలికె సిబ్బంది డిమాండ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ధర్నా
రాయచూరు రూరల్: యాదగిరి, గురుమఠకల్ను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు బ్యాంక్ రుణాలను రద్దు చేయాలని గురుమఠకల్ శాసన సభ్యుడు శరణేగౌడ డిమాండ్ చేశారు. బుధవారం యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. జిల్లాధికార యంత్రాగం కరువు తాలూకాలుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా జేడీఎస్ ఎమ్మెల్యేననే భావనతో కరువు ప్రాంతాలుగా ప్రకటించకుండా జాబితా నుంచి తొలగించారన్నారు. రైతులు పొలాల్లో వేసిన పంటలు వర్షాలు లేక వాడుముఖం పట్టాయన్నారు. వాణిజ్య బ్యాంక్‌లో రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
బళ్లారి చేరిన బీజేపీ పాదయాత్ర
● నేడు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో భారీ బహిరంగ సభ ● నగరంలో గట్టి పోలీసు బందోబస్తు కల్పించిన ఎస్పీ సుమన్ సాక్షి,బళ్లారి: రాష్ట్ర బీజేపీ నేతలు రాయచూరు జిల్లా లింగసూగూరు నుంచి చేపట్టిన బళ్లారి చలో పాదయాత్ర బళ్లారికి చేరుకుంది. బుధవారం ఉదయం సండూరు తాలూకా కుడితిని నుంచి ప్రారంభమైన పాదయాత్రకు భారీగా జనం మద్దతు పలికారు. బీ.వై విజయేంద్రతో పాటు బీజేపీ నేతలు నళినీ కుమార్ కటీల్, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొని జనంలో ఉత్సాహం నింపారు. కుడితిని వద్ద మూడేళ్లుగా రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగిరావడం లేదని, భూములు కోల్పోయిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆదుకోవాలని విజయేంద్రకు విన్నవించారు. ముస్తాబైన మున్సిపల్ హైస్కూల్ మైదానం చలో బళ్లారి బీజేపీ పాదయాత్ర ముగింపు సమావేశం గురువారం నగర నడిబొడ్డున మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ హైస్కూల్ మైదానాన్ని ముస్తాబు చేశారు. భారీ బహిరంగ సమావేశానికి వేదిక సిద్దం చేయడంతో పాటు వేలాది మంది జనం పాల్గొననున్న తరణంలో పెద్ద సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేశారు. బ్యానర్ల తొలగింపుపై బీజేపీ ఆందోళన బీజేపీ పాదయాత్రకు నగరంతో పాటు శివార్లలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా వాటిని తొలగించడంతో బీజేపీ నేతలు కన్నెర్ర చేశారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి నేతృత్వంలో నగర శివార్లలోని జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో జనం చేరి రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను నిలిపివేశారు. కే.ఎస్ దివాకర్, కార్పొరేటర్లు మెత్కూరు శ్రీనివాసరెడ్డి, గోవిందరాజులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిగిరి రేసులో నేను లేను
హొసపేటె: బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బి.నాగేంద్ర రాజీనామా నేపథ్యంలో ఉమ్మడి బళ్లారి జిల్లాలో మంత్రి పదవిని ఎవరికి ఇస్తారనే వార్తలపై స్పందిస్తూ తాను మంత్రి పదవిని ఆశించడం లేదు, తన నియోజకవర్గ అభివృద్ధే తన కల అని విజయనగర జిల్లా కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్ అన్నారు. తాలూకాలోని అమలాపుర గ్రామంలో శ్రీశరణ బసవేశ్వర కమ్యూనిటీ హాల్లో శ్రీక్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ ట్రస్ట్ నిర్వహించిన సామూహిక శ్రీవర మహాలక్ష్మి పూజ, ఒడి నింపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అదృష్టం కొద్దీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. రాజకీయాలు చేయడం మనం అనుకున్నంత సులభం కాదని ఆయన అన్నారు. నియోజకవర్గానికి రూ.వందలాది కోట్లను తేవడం ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నానన్నారు. శ్రీయోగి రాజేంద్ర శివాచార్య మహాస్వామి, శ్రీభుజంగమఠం మహాస్వామి, జీపీ మాజీ అధ్యక్షుడు నవీన్ ఎన్టీ, జెడ్పీ మాజీ సభ్యుడు ఎం.శివన్న, సతీష్ శెట్టి, ఏ.చెన్నబసప్ప తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే నా కల ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్ -
కావేరి జలాలపై నేడు సుప్రీంలో పిటిషన్
దొడ్డబళ్లాపురం: తమిళనాడుకు మూడోసారి కావేరి జలాల విడుదలకు సీడబ్ల్యూఆర్సీ, సీడబ్ల్యూఎంఏ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి చెలువరాయస్వామి తెలిపారు. బుధవారంనాడు విధానసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం డీకే శివకుమార్‌తో, న్యాయ నిపుణులతో చర్చించామన్నారు. గురువారంనాడు సుప్రీంలో అప్పీలు దాఖలు చేస్తామన్నారు. సీడబ్ల్యూఆర్సీ, సీడబ్ల్యూఎంఏకి కూడా రివ్యూ పిటిషన్ ఇచ్చామన్నారు. కావేరి జలాల విడుదలకు మన వద్ద నీటి నిల్వ కావాల్సినంత మేరకు లేదన్నారు. వినాయకనచవితి లోపు వర్షాలు కురిస్తేకానీ నీటి సమస్య తీరదన్నారు. జలాల కోసం తమిళనాడు ప్రభుత్వం నిరంతరం ఒత్తిడి తెస్తోందన్నారు. మంత్రి సతీష్ జార్కిహొళి, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు రాజకీయ ప్రేరితమని, బీజేపీ కుట్ర అని ఆరోపించారు. వారికి నీళ్లు, మాకు విషమివ్వండి ● సర్కారుపై రైతు సంఘాల ధ్వజం మండ్య: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వెంటనే ఆపాలి, సీడబ్ల్యూఆర్సీ, సీబ్ల్యూఎంఏ ఆదేశాలను పాటించరాదని జిల్లా రైతు హితరక్షణా సమితి, జైకర్ణాటక సంఘంతో పాటు వివిధ సంఘాల కార్యకర్తలు తలపై రాళ్లను మోసుకుని ధర్నా చేశారు. నగరంలోని జేసీ సర్కిల్లో బెంగళూరు–మైసూరు రహదారిలో నిరసనకు దిగారు. కావేరి ప్రాధికార, రాష్ట్ర ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, జల వనరుల శాఖ మంత్రి తమిళనాడుకు నీరు వదిలే బదులు రాష్ట్ర రైతులకు ఇంత విషమివ్వాలని దుయ్యబట్టారు. ఆందోళనలో రైతు సంఘాల నాయకులు శివకుమార్, బోరయ్య, సునంద జయరాం, బోరలింగేగౌడ, చంద్రశేఖర్ శివళ్లి, చంద్రశేఖర్, అంబుజమ్మ తదితరులు పాల్గొన్నారు. మనది ప్రేక్షక పాత్రేనా? సర్కారుపై బొమ్మై మండిపాటు శివాజీనగర: కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ప్రజలు భావిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. తాజాగా 7.5 టీఎంసీల నీరు వెళ్లిపోతుందని, వాస్తవ పరిస్థితిని కావేరీ జల అథారిటీల ముందు సమర్థంగా వినిపించలేదన్నారు. కబిని డ్యాంలో సగం నీరు తగ్గిపోయింది, కేఆర్ఎస్ నుంచి కూడా రోజూ ఐదారు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నందున, ప్రతిరోజూ దాదాపు అర టీఎంసీ నీరు తగ్గిపోతోంది, రాబోయే రోజుల్లో వర్షం పడే సూచనలు లేవు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కావేరీ సమస్యను తీవ్రంగా పరిగణించాలని బొమ్మై డిమాండ్ చేశారు. తమిళనాడుకు సమాధానం చెప్పే బదులు, కర్ణాటకే పిటిషనర్‌గా మారాలని సూచించారు. ముఖ్యమంత్రి తక్షణమే కావేరీ సమస్యపై దృష్టి సారించాలన్నారు. న్యాయ, సాంకేతిక నిపుణులతో ఢిల్లీకి వెళ్లి చర్చించాలన్నారు. విడుదల చేయడానికి నీళ్లు లేవు జలవనరుల మంత్రి చెలువరాయ -
ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు
హొసపేటె: ఉపాధ్యాయులు పిల్లలకు విద్యా పరిజ్ఞానాన్ని అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉత్తమ సమాజ నిర్మాతలు అని విజయనగర జిల్లా కూడ్లిగి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ రెహమాన్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ బాలుర ఉన్నత ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రేపటి పౌరులైన నేటి పిల్లలు మంచి విద్యను అభ్యసించి, ఉన్నత పదవులను పొంది, దేశ నాయకులుగా ఎదిగి, దేశ ప్రగతిలో ముందుండి నడిపించాలని అన్నారు. అప్పుడే ఉపాధ్యాయులు బోధించే విద్యకు అర్థం చేకూరుతుందని ఆయన అన్నారు. విద్యతో పాటు ఉపాధ్యాయులు క్రమశిక్షణ, సంయమనం, సంస్కృతిని కూడా నేర్పిస్తారని, వారి పాత్ర గొప్పదని అన్నారు. ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శివానంద, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భీమప్ప, తోటి ఉపాధ్యాయులు శివానంద, శోభ రత్నమ్మ, సుమ, శైలజ, రాజమ్మ, విజయ, జ్యోతి, అశ్విని, మానస తదితరులు పాల్గొన్నారు. -
మట్టి గణపతులే మేలు
బళ్లారిటౌన్: గణపతి పండుగకు పర్యావరణ హిత మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా పిలుపునిచ్చారు. బుధవారం బెళగల్ క్రాస్ వద్ద అటవీ శాఖ నర్సరీ ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన కల్పించే సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. పీఓపీ గణపతి విగ్రహాలను వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. అంతేగాక వాటి తయారీకి ఉపయోగించిన రసాయనాలు, రంగులతో కూడిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల కాలువలో నీరు కూడా కలుషితం అవుతాయన్నారు. ఇళ్లల్లో కూడా మట్టి గణపతులను పూజించాలన్నారు. వాటిని ఇళ్లలోనే నీటిలో నిమజ్జనం చేసి ఆ మట్టితో చెట్లు, మొక్కలను పెంచవచ్చన్నారు. ఈ సందర్భంగా మొక్కలను పెంచేందుకు విత్తనాలను కూడా పంపిణి చేశారు. ఉప అటవీ సంరక్షణ అధికారి డాక్టర్ బసవరాజు, అటవీ సంరక్షణ సహాయ అధికారి వినయ్, రాజు గోవిందకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన 20 వివిధ పాఠశాలకు చెందిన 2,700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
మంత్రి జార్కిహొళిపై ఈడీ దాడులు
బనశంకరి: సీఎం డీకే శివకుమార్ ప్రభుత్వం గురువారం విధానసౌధలో తమ ప్రభుత్వ శతదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఉత్సాహంతో ఉండగా ఈడీ తలదూర్చింది. సీనియర్ నేత, ప్రజాపనులశాఖమంత్రి సతీశ్ జార్కిహొళిపై బుధవారం తెల్లవారుజాము నుంచి మెరుపు దాడులకు నాంది పలికింది. మంత్రి, బంధువులు, సన్నిహితులు ఇలా.. 18 స్థలాల్లో సోదాలు ప్రారంభించింది. మంత్రిపై ఫెమా, మనీ లాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేసి సోదాలకు దిగారు. కుమార్తె, ఎంపీ ప్రియాంక నివాసంలో.. ● బెంగళూరు నగరంలోని డాలర్స్కాలనీలోని మంత్రి ఇల్లు, ప్రభుత్వ బంగ్లాలో.. ● బెళగావిలోని నివాసాల్లో సోదాలు జరిపి కంప్యూటర్లు, ఫైళ్లు, రికార్డుల తనిఖీలు చేపట్టారు. దాడి సమయంలో మంత్రి ప్రభుత్వ నివాసంలో ఉన్నారు. ● జార్కిహొళి కుమార్తె, బెళగావి జిల్లా చిక్కోడి ఎంపీ ఎంపీ ప్రియాంక జార్కిహొళి ఇంట్లో కూడా తనిఖీలు జరిగాయి. ● ఈ సందర్భంగా భారీసంఖ్యలో పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించాయి. ● మంత్రి బావమరిది మంజునాథ్‌కు చెందిన గోవాలో ఆస్తులలోనూ తనిఖీలు జరిగాయి. ● ఈ పరిణామాలతో మంత్రుల్లో అలజడి నెలకొంది. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశముంది.ఈడీ దాడులను ఖండిస్తూ మైసూరులో పార్టీ కార్యకర్తల ధర్నా బెంగళూరులో మంత్రి జార్కిహొళి ప్రభుత్వ నివాసం మంత్రి, కుమార్తె, బావమరిది, ఆప్తుల ఇళ్లలో ముమ్మర సోదాలు ఫెమా, మనీ లాండరింగ్ కింద కేసులు! కాంగ్రెస్ సర్కారులో కలవరం -
అక్షరాస్యతతో అభివృద్ధి
హొసపేటె: అక్షరాస్యతతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, ఉద్యోగం, అభివృద్ధి సాధ్యమని అక్షరాభ్యాస జిల్లా కో–ఆర్డినేటర్ మధుసూధన్ తెలిపారు. టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యక్తులు, సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చదవడం, రాయడం, సమర్థవంతంగా మాట్లాడటం, వినగల సామర్థ్యంలో మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం, ఉపయోగించడం ప్రధానం అన్నారు. దీన్నే డిజిటల్ అక్షరాస్యతగా పేర్కొంటారన్నారు. ఎస్డీఎంసీ అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షుడు, టీచర్ శ్రీనివాస్‌రెడ్డి, ఈరప్ప తదితరులు పాల్గొన్నారు. -
విజయనగర జెడ్పీ సీఈఓగా నియామకం
హొసపేటె: హుబ్బళ్లి చేనేత అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న 2018వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి గరీమా పన్వర్ను విజయనగర జిల్లా పంచాయతీ కొత్త ముఖ్య కార్యనిర్వహణాధికారిణిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విజయనగర జెడ్పీ సీఈఓగా ఉన్న నోంగ్జాయ్ మహమ్మద్ అక్రమ్ షాను మంగళూరులోని మెస్కాం మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా త్వరలో గరీమా అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. పీఓపీ గణేశ్ విగ్రహాలు వద్దు హొసపేటె: పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గణేష్ చతుర్థి పండుగకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన గణేశ్ విగ్రహాల తయారీ, సేకరణ, అమ్మకం, వినియోగం, విసర్జనను జిల్లా వ్యాప్తంగా నిషేధించారు. ఈ ఏడాది పర్యావరణహిత గణేష్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. సహజమైన, జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాలు, ముఖ్యంగా సహజ మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రోత్సహించేందుకు, పీఓపీతో చేసిన, ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ థర్మాకోల్‌తో పూత పూసిన విగ్రహాలను పూర్తిగా నిషేధించినట్లు జిల్లాధికారిణి కవిత మన్నికేరి తెలిపారు. ఫుట్‌పాత్‌ల తొలగింపుతో ఆందోళన రాయచూరు రూరల్: నగరంలో పలు ప్రాంతాల్లో ఆక్రమించిన ఫుట్‌పాత్‌ల తొలగింపునకు నగరసభ, జిల్లా, పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. బుధవారం మహావీర్ సర్కిల్, క్లాత్ బజార్ తదితర చోట్ల ఆక్రమిత ఫుట్‌పాత్‌లను తొలగించారు. ఆ సమయంలో వ్యాపారస్తులు ఆందోళనకు దిగడంతో పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పి శాంతింప చేశారు. గణేష్ మండపాల పరిశీలన రాయచూరు రూరల్: జిల్లాలో 2,570 చోట్ల గణేష్ విగ్రహ ప్రతిష్టాపనకు తోడు ప్రశాంతంగా వాటిని నిమజ్జనం చేసే ప్రాంతాలను జిల్లాధికారిణి పూవిత మంగళవారం ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, పోలీస్ అధికారులు శాంతవీర, దాదావలి, ఉమేష్, మంజునాథ్, నగరసభ అధికారులతో కలిసి పరిశీలించారు. మావినకెరె చెరువుతో పాటు సమీపంలోని కాస్బావిలో నిమజ్జనానికి చర్యలు చేపట్టాలన్నారు. గణేష్ విగ్రహాలను ఊరేగింపు జరిపే ప్రాంతాలను, వీధులను తనిఖీ చేసి అక్రమంగా ఫుట్‌పాత్‌లను తొలగించాలని అధికారులకు సూచించారు. మెడికోలకు బ్లాక్ మెయిల్.. ముగ్గురు అరెస్ట్ రాయచూరు రూరల్: వైద్య విద్యార్ధులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన నగరంలో బుధవారం చోటు చేసుకుంది. సురేష్, కౌశిక్, మరొకరిని గ్రామీణ పోలీసులు అరె్స్ట్ చేశారు. వీరు సాయంత్రం వేళ భోజనం కోసం ధాబాలకు వెళ్లిన వైద్య విద్యార్ధుల ఫొటోలు, వీడియోలను తీసి డబ్బులివ్వకుంటే తల్లిదండ్రులకు చూపుతామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఎస్ఐ తిమ్మణ్ణ నాయక్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. యువత వ్యసనాలకు బలి కారాదు హుబ్లీ: ఆరోగ్యవంతమైన యువశక్తి దేశానికి నిజమైన భవిత, వారి వల్లే దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు కలుగుతుందని, అందువల్ల యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా నైతిక జ్ఞానాన్ని కలిగి ఉండాలని డిమాండ్స్ మనో వైద్య సమాజ కార్యకర్త ప్రశాంత్ పాటిల్ తెలిపారు. కర్ణాటక విద్యావర్థక సంఘం విఠల్ కళాశాలలో ఏర్పాటు చేసిన మత్తు పదార్థాల దుర్వినియోగం అరికట్టడంలో యువత పాత్ర గురించి ఆయన మాట్లాడారు. నేటి విద్యార్థులు కేవలం జల్సాలు, మత్తు పదార్థాలకు బానిస కావడం శోచనీయం అన్నారు. చిన్న వయస్సు నుంచే దురలవాట్లకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖా, ప్రముఖులు డాక్టర్ శరణప్ప, డ్యానియల్, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఉత్తమ బోధన అవసరం
రాయచూరు రూరల్: పాఠశాలల్లో ప్రాథమిక విద్య స్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన చేయాలని మంగళవారపేట మఠాదిపతి వీర సంగమేశ్వర శివాచార్య స్వామీజీ పేర్కోన్నారు. బుధవారం నగరంలోని మంజునాథ్ విద్యా సంస్థ ట్రస్ట్ ఎంఎం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు జ్ఞానాన్ని పెంచడానికి ఆధునిక ఉపకరణాలతో బోధించడం మేలన్నారు. విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను గురించి వివరించాలన్నారు. ఆదనగౌడ, నరసింహ నాయక్, సిద్దప్ప, మంజునాథ్, లక్ష్మి దళపతి, సునీల్, శరణ బసవ పాటిల్, వీరేష్ నాయక్‌లున్నారు. -
అనుమాన పిశాచికి బలి
కృష్ణరాజపురం: సోషల్ మీడియా భూతం భార్యభర్తల అంతు చూసింది. బెంగళూరులోని మహాదేవుపుర పరిధిలోని హెచ్ఏఎల్ విభూతిపురంలో భర్త భార్యను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆటోడ్రైవర్ రాఘవేంద్ర (39), భార్య శృతి (31), వీరు 15 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. శృతి ఇళ్లలో పనులు చేసేది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను దావణగెరెలోని వారి అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. భార్య సోషల్ మీడియాలో రీల్స్ చేసేది. ఆమెకు అనైతిక సంబంధముందని భర్త అనుమానించి గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి కూడా ఇద్దరూ పోట్లాట పడ్డారు. మద్యం మత్తులో ఉన్న రాఘవేంద్ర బీర్ బాటిల్‌తో భార్య తలపై కొట్టి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు చూడగా ఘోరం బయటపడింది. పోలీసులు విచారణ చేపట్టారు. భార్యను చంపి, భర్త ఆత్మహత్య బెంగళూరులో విషాదం -
రైతులకు కరువు పరిహారం అందించండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఉత్తర, కళ్యాణ కర్ణాటక జిల్లాల రైతులకు కరువు పరిహారం అందించాలని రైతు సంఘం అధ్యక్షుడు నరసింహ నాయక్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతుంటే ప్రజా ప్రతినిధులు మౌనం వహించడం తగదన్నారు. వాల్మీకి మండలి అక్రమాలపై పాదయాత్రలు చేసే నేతలు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. ముఖ్యమంత్రి శివ కుమార్, మంత్రులు, శాసన సభ్యులు అక్రమాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు. గేజ్ నిర్వహణలో లోపాలను సవరించాలన్నారు. కరువు పరిహారం కింద ఎకరాకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. మల్లనగౌడ, మంజుల, ధర్మారెడ్డి, నరసింహారెడ్డి, శివశరణ, జంగ్లీ పీర్లున్నారు. -
డ్యాంకు తగ్గిన వరద.. తగ్గుతున్న నీటినిల్వ
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల ప్రజలు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి వచ్చే వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. డ్యాంకు ఎగువన ఉన్న శివమొగ్గ, ఆగుంబె, తీర్థహళ్లి, మొరాళ్లు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డ్యాం వస్తున్న ఇన్‌ఫ్లో రోజురోజుకు తగ్గింది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో గణనీయంగా పడిపోవడంతో జలాశయంలో నీటి నిల్వ క్రమంగా తగ్గుతోంది. డ్యాంలోకి బుధవారం కేవలం 675 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తుండగా, తాగునీటి అవసరాల కోసం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంకు వస్తున్న వరద కంటే బయటకు వెళ్తున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం వర్షాలు కురిసి మళ్లీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1629.32 అడుగులు, నీటినిల్వ 91.534 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 675 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 9,802 క్యూసెక్కులుగా ఉందని మండలి అధికార వర్గాలు తెలిపాయి. -
దున్నేవాడికే భూమి కేటాయించాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులైన దున్నేవాడికే భూమిని కేటాయించాలని సీపీఐఎంఎల్ (రెడ్‌స్టార్) అధ్యక్షుడు మానసయ్య డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 19 వరకు 13వ జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాలకు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, కెన్యా, కిర్గిజ్‌స్థాన్‌తో పాటు 14 దేశాల నుంచి నేతలు వస్తారన్నారు. ఓటరు జాబితా సవరణపై జాగృతి జాతా రాయచూరు రూరల్: ఓటరు జాబితాలో సవరణకు ప్రజలు సహకరించాలని జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఆరోగ్యాధికారిణి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాగృతి జాతాను ప్రారంభించి ఆమె మాట్లాడారు. ఓటరు జాబితాల్లో జిల్లాలో 2.50 లక్షల మంది పేర్లు ఉండగా సర్వేలో పేర్లు నమోదు కాని వారు, పెండింగ్‌లో ఉన్నవారు, ముద్రితమైన ఓటరు జాబితాలో ఉన్న లోపాలను ఇంటి యజమానులు సవరించి ఇవ్వాలన్నారు. -
'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
నకిలీ ఓట్లను, చొరబాటుదారులను ఏరివేసి పేరుతో భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR - ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర వివాదాలకు దారితీసింది. ఒక్కో రోజు ఒక్కో వింత సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారత రత్న గ్రహీత ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు Chintamani Nagesa Ramachandra Rao (92)కు కర్ణాటక SIR నుంచి నోటీసు అందింది. ఓటర్ల జాబితాలో ఆయన పేరు వద్ద నమోదైన అక్షర దోషం (Spelling Discrepancy) కారణంగా ఈ నోటీసు జారీ కావడంపలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. "Self-name mismatch" (పేరు వ్యత్యాసం) కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో (2002) వివరాలకు, ప్రస్తుత ఓటర్ల జాబితా వివరాలకు వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ నోటీసు జారీ చేస్తారు. పాత ఓటర్ల జాబితాలో ఆయన పేరు "Prof CNR Rao" అని ఉండగా, ప్రస్తుత ఓటర్ల జాబితాలో "Prof" స్థానంలో అదనంగా ఒక 'f' చేరి "Proff CNR Rao"గా నమోదైంది. తన గురింపును నిరూపించుకోవడానికి బెంగళూరులోని మల్లేశ్వరం వద్ద జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు.ఇదీ చదవండి: రీల్స్‌తో పరువు తీస్తోందని కన్నతండ్రే కొడుకుతో కలిసి!ఎవరి ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు భారత అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' పొందిన మూడో శాస్త్రవేత్త. అంతేకాదు ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాలు కూడా అందుకున్నారు. సాలిడ్-స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీలో సీఎన్ఆర్ రావు విశేష పరిశోధనలు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) అధిపతిగా, జవాహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే రాజీవ్ గాంధీ, హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్, మన్మోహన్ సింగ్ లాంటి మాజీ ప్రధాన మంత్రుల హయాంలో సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షుడిగా, సభ్యుడిగా దేశ సైన్స్ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్ -
1993లో పిటిషన్.. 1988లోనే మరణం! హైకోర్టులో వింత కేసు
కర్ణాటక హైకోర్టులో 33 ఏళ్ల క్రితం నమోదైన భూ వివాద కేసులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి అప్పటికే ఐదేళ్ల క్రితమే మృతి చెందినట్లు కోర్టు గుర్తించింది. 1993లో సి.మరియప్ప పేరుతో రిట్ పిటిషన్ దాఖలు కాగా.. 1988 ఆగస్టులోనే మరణించినట్లు విచారణలో వెల్లడైంది. వివరాలు ఇలా.. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా బెళవాడి గ్రామంలోని 4 ఎకరాల 21 గుంటల భూమికి సంబంధించిన వివాదం ఇది. 1981లో ల్యాండ్ ట్రిబ్యునల్ సి.నింగమ్మకు భూమిపై హక్కులు కల్పించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 1993లో మరియప్ప పేరుతో కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మరియప్పకు పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి ద్వారా పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టు రికార్డుల్లో ఉంది. 2001లో హైకోర్టు ఆ పిటిషన్‌ను అంగీకరించి, విషయాన్ని పునఃపరిశీలించేందుకు ల్యాండ్ ట్రిబ్యునల్‌కు తిరిగి పంపింది. అనంతరం ల్యాండ్ ట్రిబ్యునల్ 2023లో ఇచ్చిన ఆదేశాలను మరియప్ప చట్టబద్ధ వారసుడు హైకోర్టులో సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాది కీలక విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 1993లో పిటిషన్ దాఖలు చేసే సమయానికే మరియప్ప మరణించి ఉన్నారని తెలిపారు. దీనిపై పరిశీలన జరిపిన హైకోర్టు.. ఆ వాదనలో వాస్తవం ఉందని గుర్తించింది. మరియప్ప కుమార్తె సుమలమ్మ గతంలో ల్యాండ్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్లో కూడా తన తండ్రి చాలా ఏళ్ల క్రితమే మరణించినట్లు పేర్కొన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. అయితే ఆయన మరణించిన ఖచ్చితమైన తేదీని అఫిడవిట్లో వెల్లడించలేదని పేర్కొంది. మరణించిన వ్యక్తి పేరుతో 1993లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఎలా సాధ్యమైందన్న దానిపై పిటిషనర్ తరఫు న్యాయవాది నుంచి సమర్థవంతమైన వివరణ రాలేదని న్యాయమూర్తి ఈ.ఎస్.ఇందరేశ్ అభిప్రాయపడ్డారు. మరణించిన వ్యక్తి పేరుతో అనంతరం పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: మాట వినకపోతే కాల్చి పారేస్తా -
భర్తను వదలి మరో వ్యక్తితో సహజీవనం!
అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్‌ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు.-బెంగళూరు చదవండి: నాకేం తెలియదు.. అంతా నా భర్తే చూసుకుంటాడు -
మాట వినకపోతే కాల్చి పారేస్తా
బెంగళూరు: మొన్నటికి మొన్న ఇస్లాం మతాన్ని పొగుడుతూ హజ్ యాత్రకు వెళ్లాలని ఆశగా ఉందని వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి బసవరాజ రాయరెడ్డి ఈసారి మాట వినని అధికారులను కాల్చి పారేస్తానంటూ హెచ్చరించారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా గున్నాళ గ్రామంలో జరిగిన జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఏ అధికారి మాట వినడో నాకు చెప్పండి, ఆ అధికారిని కాల్చి పారేస్తానంటూ ఆగ్రహించారు. యలబుర్గ తహసీల్దార్ ప్రకాష్‌ను వేదికపైకి పిలిచి తాను మంత్రి బాధ్యతల్లో పూర్తిగా బిజీగా ఉంటా, నువ్వే నా పీఆర్ఓగా పని చేయాలంటూ సూచించారు. తమ ప్రభుత్వంలోని గ్యారెంటీ పథకాలు ఎప్పటిలా కొనసాగుతాయన్నారు. చదవండి: కంగనా సీరియస్.. కేంద్రాన్ని అడుక్కోవాలా అంటూ.. -
చిన్నారి కిట్టయ్యలు
మైసూరు: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మైసూరు సరస్వతీపురంలోని శ్రీకృష్ణధామలో చిన్నారులు ఆకట్టుకున్నారు. సుమారు 120 మంది పిల్లలు కృష్ణ, రాధా, గోపికల వేషధారణలో మురిపించారు. విజేతలకు కాణియూరుమఠం శ్రీవిద్యావల్లభతీర్థ స్వామీజీ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత ఆత్మహత్యమండ్య: రాష్ట్రంలో తీవ్ర కరువు కారణంగా అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని బలేత్తిగుప్పె గ్రామంలో అప్పుల భారం భరించలేక ఒక రైతు ప్రాణాలు తీసుకున్నాడు. వివరాలు.. సోమయ్య కుమారుడు బి.ఎస్.చంద్రశేఖర్ (39), 1.23 ఎకరాల భూమిలో టమాటా, ఇతర పంటలు పండించేవాడు. ఇందుకోసం రూ. 25 లక్షల వరకూ అప్పులు చేశాడు. తీర్చమని అతనిపై ఒత్తిడి తేవడం, కరువు కారణంగా కలత చెంది పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పాండవపుర పోలీసులు కేసు నమోదు చేశారు. సహజీవనంలో విషాదం.. మహిళ అనుమానాస్పద మృతిచిక్కబళ్లాపురం: అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్‌ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు. 5వేల టెంకాయల నీళ్లతో అభిషేకంబొమ్మనహళ్లి: దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నగరంలోని శరవు మహా గణపతి ఆలయంలో స్వామివారికి మంగళవారం వేలాది కొబ్బరి నీళ్లతో అభిషేకించారు. భాద్రపద శుక్ల పక్ష చతుర్థికి ముందు వచ్చే ఏకాదశినాడు గణపతి స్వామికి ఇలా అభిషేకిస్తారు. మొదట పంచామృత అభిషేకం, ఆ తర్వాత కొబ్బరినీటితో అభిషేకం, పూజలు చేశారు. ఏడాదికోసారి జరిగే ఈ వేడుకను చూడడానికి అశేష భక్తులు తరలివచ్చారు. సోమవారం మధ్యాహ్నం నుంచే భక్తులు టెంకాయలను తీసుకొచ్చి ఆలయంలో అందజేశారు. 5 వేలకు పైగా కొబ్బరికాయలు సమకూరాయి. రాఘవేంద్ర శాస్త్రి, సరావు సుదేశ్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. -
తమిళనాడుకు మళ్లీ కావేరి జలాలు
బనశంకరి: కావేరి జలాల విషయంలో కన్నడనాడుకు ఎదురుగాలి వీస్తూనే ఉంది. తమిళనాడుకు కావేరి నదీ జలాలను ప్రతిరోజు 6 వేల క్యూసెక్కులను 15 రోజలు పాటు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ కర్ణాటకకు సిఫార్సు చేసింది. అంటే మొత్తం 7.8 టీఎంసీలను వదలాలి. తీవ్రమైన కరువు ఏర్పడిన సమయంలో మరోసారి నీటి విడుదల ఆదేశాలు అటు సర్కారుతో పాటు రైతాంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కబిని, కేఆర్ఎస్ సహా నాలుగు డ్యాముల్లో ఇన్‌ఫ్లో గణనీయంగా క్షీణించింది. ఇది 3వ దఫా నీటి విడుదల ఆదేశం. రాష్ట్ర ప్రజలకు ద్రోహం మైసూరు: రాష్ట్రంలో కరువు సంభవించి ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య ఉన్నందున తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వెంటనే ఆపాలని రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు బడగలపుర నాగేంద్ర డిమాండ్ చేశారు. ఆయన జిల్లా పత్రికాభవనంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో గతంలో ఎన్నడూ చూడనంతగా కరువుతో మంచినీటికి కూడా ప్రజలు తిప్పలు పడుతున్న సందర్భంలోనూ తమిళనాడుకు నీటిని వదలడం సరికాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 7.8 టీఎంసీలు ఇవ్వాలని సీడబ్ల్యూఆర్సీ ఆదేశం -
అదుపు తప్పిన బైక్.. ఇద్దరు దుర్మరణం
మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలో దేవలాపుర బస్టాండ్ వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. కేటీఎం బైక్‌లో వేగంగా వెళ్తున్న ఇద్దరు.. ఓ స్కూటర్‌ను ఢీకొని, ఆ తర్వాత రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో కిందపడిపోయారు. తీవ్రగాయాలైన అక్కడే మరణించారు. మృతులు బెంగళూరుకు చెందిన అభిషేక్, ప్రేమ్ కుమార్ అని తెలిసింది. స్కూటరిస్టు కాలికి గాయమైంది. నాగమంగళ రూరల్ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. దేవలాపుర పట్టణంలో రహదారి పనులు అసంపూర్తిగా ఉండటంతో, ఆ రహదారి ఏకమార్గంగా మారి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. ఇతర ప్రాంతాలవారు ఇక్కడి రోడ్లు తెలియక వేగంగా వెళ్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరారు. ప్రదోష్ అప్రూవర్‌కు బ్రేక్ బనశంకరి: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నిందితుడు దర్శన్‌కు ఓరకంగా ఊరట లభించింది. సహ నిందితుడు ప్రదోష్ ఎస్.రావ్ అప్రూవర్‌గా మారతానని ప్రకటించడం తెలిసిందే. ఇందుకు కింది కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో దర్శన్ శిబిరంలో తీవ్ర ఆదుర్దా నెలకొంది. ప్రదోష్ అప్రూవర్ని దర్శన్ వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించి.. నగర 59వ సీసీహెచ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చారు. వారంలోగా ఆ ప్రక్రియను పునఃపరిశీలించి కొత్తగా ఆదేశాలు ఇవ్వాలని కింది కోర్టుకు ఆదేశించారు. బంగ్లా కోసం ఒత్తిడి చేయలేదు: మంత్రి బనశంకరి: బెంగళూరు క్రిసెంట్ రోడ్డులోని మాజీ మంత్రి హెచ్‌సీ.మహదేవప్ప ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మంత్రి బైరతి సురేశ్ ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. మంత్రి అక్కడ మరమ్మతు పనులు కూడా ప్రారంభించారు. దీనిపై మంత్రి బైరతి సురేశ్ మాట్లాడుతూ మహదేవప్పతో ఎలాంటి గందరగోళం లేదని, అక్కడ ప్రజాపనుల శాఖ అధికారులు పనులు చేస్తున్నారని, వాటితో తనకు సంబంధం లేదని చెప్పారు. ఖాళీ చేయాలని నేను మహదేవప్పను ఒత్తిడి చేయలేదన్నారు. సీఎం అనుమతి ఇస్తే మహదేవప్ప అదే ఇంట్లో ఉండవచ్చునని, నాకు ఇబ్బంది లేదని అన్నారు. మంగళూరు జైల్లో భారీగా మొబైళ్లు యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు జైల్లోకి మొబైల్ఫోన్లు సరఫరా అవుతున్నట్లు తెలియడంతో స్థానిక బర్కే ఠాణా పోలీసులు సోదాలు చేశారు. 10 స్మార్ట్ ఫోన్లు దొరికాయి. మంగళవారం ఉదయం ఎ–బ్లాక్‌లో భారీగా సోదాలు నిర్వహించారు. మొబైళ్లు లభించిన నిందితులందరూ వివిధ క్రిమినల్ కేసుల్లో ఉన్నవారని విచారణలో బయట పడింది. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాట వినకపోతే కాల్చి పారేస్తా● అధికారులకు మంత్రి హెచ్చరిక హుబ్లీ: మొన్నటికి మొన్న ఇస్లాం మతాన్ని పొగుడుతూ హజ్ యాత్రకు వెళ్లాలని ఆశగా ఉందని వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి బసవరాజ రాయరెడ్డి ఈసారి మాట వినని అధికారులను కాల్చి పారేస్తానంటూ హెచ్చరించారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా గున్నాళ గ్రామంలో జరిగిన జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఏ అధికారి మాట వినడో నాకు చెప్పండి, ఆ అధికారిని కాల్చి పారేస్తానంటూ ఆగ్రహించారు. యలబుర్గ తహసీల్దార్ ప్రకాష్‌ను వేదికపైకి పిలిచి తాను మంత్రి బాధ్యతల్లో పూర్తిగా బిజీగా ఉంటా, నువ్వే నా పీఆర్ఓగా పని చేయాలంటూ సూచించారు. తమ ప్రభుత్వంలోని గ్యారెంటీ పథకాలు ఎప్పటిలా కొనసాగుతాయన్నారు. -
మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి తనిఖీ
రైతులతో కలిసి ఇడ్లీలు ఆరగిస్తున్న సీఎం డీకే కూరగాయల రైతులతో సీఎం డీకే యశవంతపుర: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం ఉదయం బెంగళూరులోని యశవంతపుర ఏపీఎంసీ మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించారు. రైతులు, వ్యాపారస్తులు, కూలీ కార్మికులతో మాటామంతీ జరిపారు. సీఎం రాకతో అధికారులు, రైతులు సంభ్రమానికి లోనయ్యారు. ఏపీఎంసీలో సమస్యలు, తూకంలో మోసాలు, వేలంలో వంచనల గురించి రైతులు సీఎంకు వివరించారు. రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిగడ్డలు, ఉర్లగడ్డలు, టెంకాయలు తదితరాలను పరిశీలించి వారితో మాట్లాడారు. మహిళా చిరు వ్యాపారులతో కలిసి సీఎం కాఫీ తాగారు. మార్కెట్లోకి వచ్చే వాహనాల నుంచి పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారా, వ్యాపారులు కమీషన్ తీసుకుంటున్నారా అని రైతులను ప్రశ్నించారు. యశవంతపురలో లేదని, కలబుర్గి, బీదర్, విజయపుర మార్కెట్లో కమీషన్ వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారు. మండీ వ్యాపారులు సక్రమంగా పన్నులు కడుతున్నారా? అని విచారించారు. రైతులకు అన్యాయం చేయకుండా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. కార్యదర్శి సస్పెండ్ జీవర్గి తాలూకా హిట్టనహళ్లి నుంచి వచ్చిన రైతులు అక్కడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. బాల కార్మికులు ఉండరాదు యశవంతపుర మార్కెట్లో బాలలతో పని చేయించరాదని సీఎం స్పష్టంచేశారు. బాలలతో పనిచేయించేవారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీఎం ఇడ్లీ ఆరగించారు. 10న 100 రోజుల వేడుక బనశంకరి: సీఎం డీకే పదవిని చేపట్టిన 10వ తేదీకి వంద రోజులు అవుతుంది. ఆ రోజున ప్రత్యేక సమావేశం జరపనున్నారు. ఇందులో పాల్గొనాలని మాజీ సీఎం సిద్దరామయ్య నివాసానికి వెళ్లి సీఎం డీకే ఆహ్వానపత్రిక అందించారు. గంటపాటు చర్చలు జరిపారు. యశవంతపుర ఏపీఎంసీలో డీకే శివ రైతులు, వ్యాపారులతో సమస్యలపై ఆరా -
వచనకారుల కృషి అపారం
బళ్లారిఅర్బన్: వచనకారులు సమాజంలో మానవత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను పెంపొందించేందుకు తమ వచనాల ద్వారా చేసిన కృషి అపారం అని కసాప నేత నిష్టి రుద్రప్ప అన్నారు. నేతాజీ నగర్ గణేష్ దేవస్థానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 12వ శతాబ్దం వచనకారుల యుగం తెలిపారు. కులం, మతం, వర్ణం, లింగ, సామాజిక తారతమ్య భేదం లేకుండా చక్కటి సందేశాలను అందించారన్నారు. కాంగ్రెస్ ప్రముఖులు ఎల్.మారెప్ప, గాయకులు కే.తిమ్మప్ప, రాఘవేంద్ర గుడదూరు, విజయేంద్ర క్షత్రియ, గణేష్ అభయ్ కసాప, దొడ్డ బసవ గవాయి చక్కగా వచన గీతాలను పాడారు. వీరికి తబలాపై విరుపాక్షప్ప, కీప్యాడ్‌పై తిప్పేస్వామి సహకరించారు. దాతలు అక్కి మల్లికార్జున అందరిని సన్మానించారు. టీ.తిమ్మప్ప, నాగరెడ్డి, బీ.శ్రీధర్, శరణ బసవ పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్‌లో మూడో స్థానం రాయచూరు రూరల్: బళ్లారిలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో వివేకానంద మూడో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించాడు. టేబుల్ టెన్నిస్ అకాడమీ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, నందాపూర్ శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, శిక్షకుడు వీరణ్ణ వివేకానందను అభినందించారు. పర్యాటక రంగంలో పురస్కారాలు అందజేస్తాం బనశంకరి: పర్యాటక రంగంలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యక్తులను గుర్తించి కర్ణాటక టూరిజం అవార్డులు ప్రదానం చేస్తామని ఇంధన, టూరిజం శాఖ మంత్రి కేజే.జార్జ్ తెలిపారు. రాష్ట్రంలో వన్స్టేట్ మెనీవరల్డ్స్ బ్య్రాండ్ పేరుతో పురస్కారాలను అందజేస్తామన్నారు. కర్ణాటక టూరిజం సొసైటీ అధ్యక్షుడు కే.శ్యామరాజు మాట్లాడుతూ పర్యాటక ఆతిథ్య రంగంలో ఉత్తమసేవలు అందిస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడంతోపాటు సేవా నాణ్యతను పెంచడం కోసం ఐదు విభాగాల్లో 35 పురస్కారాలు అందిస్తారని అన్నారు. -
అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకారం
రాయచూరు రూరల్: లింగసూగూరు అసిస్టెంట్ కమిషనర్‌గా నాగేంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. మంగళవారం ఏసీ కార్యాలయంలో అధికార బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, రైతుల సహకారంతో లింగసూగూరు డివిజన్లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ దాఖలాలు, ఖాతాల మార్పిడి తదితర పనులను సత్వరం పూర్తి చేస్తామన్నారు. నేత్రపర్వంగా రథోత్సవంరాయచూరు రూరల్: బాగల్కోటె జిల్లా హునగుంద తాలూకా ఇలకల్‌లో విజయ మహంతేష్ స్వామీజీ రథోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. రథోత్సవంలో రాయచూరు, కొప్పళ, విజయపుర, గదగ్, బళ్లారి, హుబ్లీ ధార్వాడల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలిద్దాం రాయచూరు రూరల్: జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేద్దామని జెడ్పీ ప్రణాళికాధికారి రోణ అన్నారు. మంగళవారం జెడ్పీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని పిలుపునిచ్చారు. భూమిలో పడిన విత్తనం, మనిషిని చేరిన అక్షరం ఎక్కడికీ వెళ్లదన్నారు. హత్తి, ఈరణ్ణ, శివమ్మ, దండెప్ప, సదానంద పూజారి, గిరియప్పలున్నారు. -
తుది అంకానికి బీజేపీ పాదయాత్ర
సాక్షి,బళ్లారి: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బీజేపీ చేపట్టిన బళ్లారి చలో బీజేపీ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు సమావేశానికి భారీ ఎత్తున జన సమీకరణ చేసి ముగించాలని బీజేపీ భావించిన నేపథ్యంలో బహిరంగ సభకు తొలుత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ పాదయాత్ర ముగింపు సమావేఽశానికి సెప్టెంబర్ 10న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సమావేశాన్ని నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తామని అనుమతించాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా ఈ నెల 7న అధికారులకు దరఖాస్తు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహణకు మైదానంలో అనుమతి ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతల విన్నపానికి ఎట్టకేలకు జిల్లాధికారి ఓకే చెబుతూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం బీజేపీ పాదయాత్ర ముగింపు సమావేశం నిర్వహించే మున్సిపల్ హైస్కూల్ మైదానాన్ని గాలి జనార్దనరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు తదితరులు పరిశీలించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, జగదీష్ శెట్టర్ తదితరులు పాల్గొంటారు. కుడితినికి చేరిన పాదయాత్ర సండూరు తాలూకాలోని దరోజీ నుంచి తిమ్మలాపుర మీదుగా కుడితిని వరకు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ మంత్రి బీ.శ్రీరాములు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తదితరులు జనంతో మమేకం అవుతూ ముందుకు సాగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా అడుగంటిందని, అవినీతి తారస్థాయికి చేరుకుందనేందుకు ఉదాహరణ వాల్మీకి అభివృద్ధి మండలిలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలే సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. పాదయాత్రలో పాల్గొన్న శ్రీరాములు, విజయేంద్ర తదితరులు మున్సిపల్ మైదానాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి రేపటితో విపక్ష పోరాటానికి ముగింపు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సభ -
విద్యార్థిని మృతిపై దర్యాప్తునకు డిమాండ్
హొసపేటె: దావణగెరెలోని పీయూ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని రంజిత తన హాస్టల్ గదిలో ఇటీవల అనుమానాస్పదంగా మరణించిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజయనగర జిల్లా గంగామతస్తుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారిణి కార్యాలయం ముందు నిరసన తెలిపిన గంగామత సమాజ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. రంజిత చాలా ప్రతిభావంతురాలైన విద్యార్థిని అని, ఆమెకు ఎలాంటి శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఉరి వేసుకుని మరణించడం అనేక అనుమానాలకు దారి తీసిందని, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఒత్తిడి చేశారు. యమనూరప్ప, శ్రీధర్, వై.రాజేష్, జంబయ్య, రామప్ప కబ్బేర్, వీరేష్, ఉమాపతి, ఎం.దానప్ప, ఎన్.అనిల్, ఎం.మారియప్ప, కే.నింగప్ప, సూర్యనారాయణ, శివకుమార్, బెండిగేరి లింగరాజు, మంజప్ప భోవి, హాలప్ప భోవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్‌స్టాలో తల్వార్‌తో పోజు.. నిందితుడు అరెస్ట్
హుబ్లీ: ఇన్‌స్టా ఖాతాలో తల్వార్ పట్టుకొన్న వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన పాత హుబ్లీ ఈశ్వర్ నగర్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తల్వార్‌ను జప్తు చేశారు. గంగాధర్ మడివాళ నిందితుడు. ప్రజల్లో భయాందోళనలు కలిగేలా తల్వార్ పట్టుకున్న ఫోటోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కసబాపేటె పోలీసులు ఆయుధాల చట్టం ద్వారా కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ ఎస్జీ వడ్డర్ నేతృత్వంలో కార్యాచరణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్హుబ్లీ: ధార్వాడ జనతా నగర్ స్లం బోర్డులోని పేకాట అడ్డాపై దాడి చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతానికి చెందిన జకీర్, యాసిన్, అల్తాఫ్, సాదిక్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.12,030ల నగదుతో పాటు ఇతర వస్తువులను జప్తు చేశారు. విద్యాగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అభివృద్ధి పనులకు భూమిపూజబళ్లారిఅర్బన్: నగరంలోని పలు వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. 21వ వార్డులో హెచ్.లక్ష్మీకాంత్ ఇంటి వద్ద నుంచి 4వ క్రాస్ రోడ్డు వరకు రూ.90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 24వ వార్డు కప్పగల్ రోడ్డులో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టే 7వ క్రాస్ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో హనుమాన్ నగర్‌లోని రమ్య లేఅవుట్ సమీపంలో 17, 18వ వార్డులను కలిపే పలు రోడ్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. చానాళ్ శేఖర్, వాసురెడ్డి, బండ్రాళ మృత్యుంజయ స్వామి తదితరులు పాల్గొన్నారు. టీచర్ల కొరతతో విద్యా రంగం కుదేలు రాయచూరు రూరల్: సర్కార్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యా రంగం కుదేలైందని రాష్ట్ర విద్యా సమితి అధ్యక్షుడు నిరంజనారాధ్య పేర్కొన్నారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం, ప్రభుత్వ పాఠశాల వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శూన్య ఉపాధ్యాయ పాఠశాలల్లో నియామకాలు లేకపోవడంతో విద్యా రంగం కుంటుపడిందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో దశాబ్ద కాలం నుంచి లక్షకు పైగా పాఠశాలను మూసి వేశారన్నారు. ఎస్డీఎంసీ అధ్యక్షుడు జయణ్ణ, రతన్ చౌహాన్, సిద్దప్ప, అలీనా జోసెఫ్, విరుపాక్షి, సిద్దరామయ్య, హఫీజుల్లా, విద్యాపాటిల్లున్నారు. కనీస వేతనాలు అందించండి రాయచూరు రూరల్: రాష్ట్రంలోని వివిధ శాఖలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలకు తోడు సవరించిన వేతనాలను అందించాలని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం ప్రధాన తపాలా అధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అయ్యాళప్ప మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించే విధంగా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సక్రమంగా సౌకర్యాలు అందించాలని కోరుతూ రాష్ట్రపతికి తపాలా శాఖ కార్డుల మీద సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. -
క–క విమోచన వేడుకపై సమీక్ష
హొసపేటె: కళ్యాణ కర్ణాటక(క–క) ప్రాంతానికి స్వేచ్ఛా స్వాతంత్య్రం లభించిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అత్యంత అర్థవంతంగా జరుపుకోవాలని అదనపు జిల్లాధికారి పీఎన్.లోకేష్ అన్నారు. తన కార్యాలయ సభామందిరంలో నిర్వహించిన ప్రాథమిక సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ఆరోజు ఉదయం 8 గంటలకు నియమావళి ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జెండాను ఎగురవేస్తారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది జిల్లా స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి. జిల్లా శాఖలకు అప్పగించిన బాధ్యతలన్నింటినీ శ్రద్ధగా నిర్వర్తించాలని ఆయన అన్నారు. ఉదయం 9 గంటలకు జిల్లా ఇంచార్జి మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. అనంతరం పోలీస్ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తుందన్నారు. ప్రముఖులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తారన్నారు. ఉదయం 10 గంటలకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. సబ్ డివిజనల్ అధికారి వివేకానంద, కన్నడ సంస్కృతి శాఖ సహాయ సంచాలకులు సిద్దలింగేష్ రంగన్నవరతో సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. -
కొత్త ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
హొసపేటె: జంబునాథహళ్లిలో నిర్మిస్తున్న కొత్త 300 పడకల జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రికి సంబంధించిన పనులు, వైద్య పరికరాల సరఫరా పురోగతిలో ఉన్నాయని, అక్టోబరు నెలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ఆస్పత్రిని ప్రారంభిస్తామని అన్నారు. ఆస్పత్రి పనులు దాదాపుగా పూర్తయ్యాయని, 50 శాతానికి పైగా వైద్య పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన పరికరాలు, సామగ్రి వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రారంభోత్సవానికి ముందే ఆస్పత్రిని శుభ్రపరచాలని, వైద్య పరికరాలను అమర్చాలని, పరీక్షల ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. కేకేఆర్డీబీ గ్రాంటుతో కొత్త జిల్లా ఆస్పత్రికి అవసరమైన స్కానింగ్‌తో సహా వైద్య పరికరాలు, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కొత్త జిల్లా ఆస్పత్రికి అవసరమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ టీ.లింగరాజు తెలిపారు. జిల్లా సర్జన్ డాక్టర్ ఎల్ఆర్.శంకర్ నాయక్, జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్యతో పాటు వైద్య అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మాతా శిశు ఆస్పత్రిలో ఆరావైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల ఒక నవజాత శిశువు మరణించిన ఘటనపై నగరంలోని 60 పడకల మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రిపై ప్రజలు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే గవియప్ప ఆకస్మికంగా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సమస్యలను పరిశీలించారు. ఆయన రోగులు, వారి బంధువులను కలిసి ఆస్పత్రిలో సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో నెలకొన్న గందరగోళంపై రోగులు ఎమ్మెల్యే ముందు తమ గోడును వెలిబుచ్చారు. హాజరైన ఆస్పత్రి వైద్యులకు రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెట్టిన పంటలు దెబ్బతినగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ లేక, చేసిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగిన ఓ రైతు మంగళవారం చికిత్స ఫలించక మృతి చెందారు. తాలూకాలోని మోకా గ్రామానికి చెందిన శరభయ్య అనే రైతు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి దాదాపు రూ. 20 లక్షల అప్పు చేశారు. పంటలు పండక, అప్పు తీర్చే మార్గం కానరాక గత నెల 28న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. తక్షణం కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడిన శరభయ్య మరణించారు. మృతుడికి భాఽర్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలు తప్పకుండా పాటించాలిహుబ్లీ: ఈసారి గణేష్ చవితి ఉత్సవాల్లో నియమాలను తూచ తప్పకుండా పాటించాలని నిర్వాహకులకు నగర కొత్త పోలీస్ కమిషనర్ భూషణ్ బుర్సే సూచించారు. వినాయక చవితి నేపథ్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండళ్ల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల అనుకూలం కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే నియమాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంలో ప్రతి పోలీస్‌ను కఠినంగా హెచ్చరిస్తున్నానన్నారు. ముఖ్యంగా నిమజ్జనోత్సవాల్లో జరిగే పూజలు, పునస్కారాలు, ఇతర కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోను సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించరాదని సూచించారు. నిర్వాహకులకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. మా సొమ్ము తిరిగి ఇప్పించండిరాయచూరు రూరల్: నగరంలోని దర్వేశి కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బు తిరిగి చెల్లించాలని పెట్టుబడిదార్లు డిమాండ్ చేశారు. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షులు అంబాజీ మైదునకర్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం రూ.800 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపి ప్రజలకు టోపీ వేసిన కంపెనీ నుంచి నిధులు వాపస్ ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి డిపాజిట్లుగా తీసుకున్న డబ్బులను కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పించాలని కోరుతూ అసిస్టెంట్ కమిషనర్ హంపన్నకు వినతిపత్రం సమర్పించారు. చేతివృత్తిదారులకు శిక్షణ మండ్య: సంప్రదాయక చేతివృత్తిదారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అమలు చేస్తున్నట్లు జిల్లాధికారి డాక్టర్ కుమార్ తెలిపారు. మంగళవారం నగరంలోని జిల్లా కమిషనర్ కార్యాలయంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద 18 సాంప్రదాయ చేతివృత్తిదారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు సర్టిఫికెట్లతో సహా వివిధ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక కేంద్రం అధికారి దినేష్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ కరాటే పోటీల్లో సత్తారాయచూరు రూరల్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన 13వ జాతీయ కరాటే పోటీల ఫైనల్స్‌లో రాయచూరుకు చెందిన వైష్ణవి పాటిల్ మూడో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది. కరాటే అకాడమీ అధ్యక్షుడు రామచంద్ర, శిక్షకులు అనిరుధ్, పవన్ సుఖాణి, ఆశా, రాజాశంకర్ ఆమెను అభినందించారు. గణేష్ పండుగ ప్రశాంతంగా జరుపుకోండి రాయచూరు రూరల్: జిల్లాలో ప్రశాంతంగా గణేష్ పండుగను జరుపుకోవాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. నగరసభ కార్యాలయంలో జరిగిన శాంతి సమావేశంలో ఆమె మాట్లాడారు. 14వ తేదీన వినాయకులను ప్రతిష్టించాలని, 22వ తేదీన నిమజ్జనం చేయాలన్నారు. డీజేల అమరికను పూర్తిగా నిషేధించామన్నారు. రాత్రి 10 గంటల తరువాత లౌడ్ స్పీకర్లను వినియోగిస్తే చర్యలు తప్పవన్నారు. గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, పోలీస్ అధికారులు శాంత వీర, దాదావలి, ఉమేష్, మంజునాథ్‌లున్నారు. -
భ్రూణలింగ నిర్ధారణ నేరం
హొసపేటె: భ్రూణలింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అని జిల్లా మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ విద్యా పేర్కొన్నారు. ఆమె విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఆరోగ్య అధికారి కార్యాలయ హాలులో పీసీపీఎన్డీటీ చట్టం–1994పై ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణా సదస్సులో మాట్లాడారు. పీసీపీఎన్డీటీ చట్టం ఉద్దేశ్యం, భ్రూణహత్యల నివారణలో ప్రాముఖ్యత, ఆడపిల్లలను రక్షించాల్సిన అవశ్యకత, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం గురించి వివరించారు. హరపనహళ్లి బాలల అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి రామన గౌడ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బాలికల సంఖ్య తగ్గిపోకుండా నివారించడానికి సమాజంలో అవగాహన కల్పించడం, బాలికలపై సామాజిక వైఖరిలో మార్పు తేవడం గురించి విశ్లేషించారు. జిల్లా కుటుంబ సంక్షేమ అధికారి వినయ్, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ధర్మనగౌడ, జిల్లా ఆరోగ్య విద్యా అధికారి దొడ్డమని, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ అరవింద్, సీనియర్ సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పవిత్రగౌడ బ్యారక్ మార్పు!
కర్ణాటక: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్ర గౌడ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో బ్యారక్‌ను మార్చేందుకు 59వ సివిల్, సెషన్స్‌కోర్టు ఆమోదించింది. ఇప్పుడున్న బ్యారక్‌లో 30 మందికి పైగా ఉంటున్నారు, ఒక్కటే మరుగుదొడ్డి ఉండడంతో ఇబ్బందిగా ఉందని పవిత్ర కోర్టులో అర్జీ వేసింది. దీంతో మరో బ్యారక్‌లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు. మళ్లీ హైకోర్టుకు దర్శన్ తనను వీడియో కాన్ఫరెన్స్‌లో కాకుండా నేరుగా కోర్టు వాయిదాలకు హాజరయ్యేలా అనుమతించాలని రెండవ నిందితుడు, నటుడు దర్శన్ మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన పిటిషన్‌ని భద్రతా కారణాల పేరుతో 59వ సీసీహెచ్ కోర్టు తిరస్కరించింది.చదవండి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్ -
ఇస్రో ప్రైవేటీకరణ జరగదు
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రభుత్వ సంస్థగానే కొనసాగనుందని ఆ సంస్థ ఛైర్మన్ వి.నారాయణన్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ఆందోళనలను కొట్టివేశారు. భారత అంతరిక్ష ప్రయోగ వ్యవస్థను విస్తరించే లక్ష్యంతో ఇస్రో ప్రస్తుతం 450 స్టార్టప్, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తోందని స్పష్టం చేశారు. తయారీ, నిర్వహణ కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ప్రతిపాదనపై ఇస్రో అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరుతూ తొమ్మిది ఉద్యోగ సంఘాలు సెపె్టంబరు నాలుగున ఛైర్మన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. బెంగళూరులో సోమవారం మొదలైన తొమ్మిదవ బెంగళూరు స్పేస్ ఎక్స్పో కార్యక్రమంలో ఛైర్మన్ నారాయణన్ విలేకరులతో మాట్లాడారు. భారత అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాలు మొదలై దాదాపు 65 సంవత్సరాలవుతోందని, దేశంలోని సామాన్య పౌరుల సేవలో 56 వ్యవస్థలు అంతరిక్షంలో పనిచేస్తున్నాయని... కాకపోతే మరెన్నో వ్యవస్థల అవసరం ఉందని చెప్పారు. ఆరేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో సంస్కరణల అమలు మొదలైనప్పుడు ఇస్రో ప్రైవేట్ రంగాన్ని, స్టార్టప్ కంపెనీలకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఏర్పడిందని గుర్తు చేశారు. -
కరువుపై నేతల మధ్య లేఖల సమరం
హుబ్లీ: కరువు ప్రాంతాల ప్రకటన విషయంలో విజయపుర జిల్లా ఇన్చార్జి మంత్రి ఎంబీ పాటిల్, ముద్దేబిహాళ ఎమ్మెల్యే సీఎస్ నాడగౌడల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుంది. ముద్దేబిహాళ, తాళికోటె పేర్లను కరువు పీడిత తాలూకాల జాబితాలో ప్రకటించక పోవడానికి కారణం ఎంబీ పాటిలే అంటూ ఎమ్మెల్యే నాడగౌడ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వపక్ష ఎమ్మెల్యే వ్యాఖ్యల మేరకు మంత్రి ఎంబీ పాటిల్ ప్రకటన చేశారని, అన్ని తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. తాను ఆయా నియోజకవర్గాలకు కరువు అధ్యయనానికి వెళ్లినప్పుడు నేను బెంగళూరు, ఢిల్లీలో ఉన్నానని సాకు చెప్పారు. తమకు అన్యాయం జరిగితే రెవెన్యూ మంత్రిని, సీఎంను కలిసి చర్చించాలి. అయితే నియోజకవర్గ ప్రజలను వంచించడానికి నాటకం అడుతున్నారని ఎంబీ పాటిల్ తన లేఖలో నాడగౌడపై మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యే ఇటీవల ప్రభుత్వంపై, హైకమాండ్‌పై, తనపై నిరంతరంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను సహనంతో నడుచుకోవాలని హైకమాండ్ సూచించిందన్నారు. తన సహనాన్ని బలహీనతగా కొందరు భావిస్తున్నారు. ముద్దేబిహాళ్ ఎమ్మెల్యే వయోసహజ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు సరైన చికిత్స అవసరం. ఇకపై దిగజారుడు వ్యాఖ్యలు కొనసాగిస్తే ఆయన మనోవ్యాధికి చికిత్సే సరైన పరిష్కారం అని ఎంబీ పాటిల్ కాసింత ఆగ్రహంగా ఎమ్మెల్యే నాడగౌడపై చిందులు తొక్కారు. -
వరుణదేవుని కోసం పెళ్లితంతు
మండ్య: ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నా వానలు రావడం లేదు. నదులు, చెరువుల్లో నీటి ప్రవాహం కరువై దుర్భిక్షం తాండవిస్తోంది. పొలాలు, పశుపక్ష్యాదులు వర్షం కోసం పరితపిస్తున్నాయి. ఇప్పటికై నా వరుణదేవుడు కరుణించాలని ప్రజలు పలు రకాలుగా పూజలు చేస్తున్నారు. మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దేవలాపురంలో వర్ష దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు బాలునికి, బాలికకు వివాహ మహోత్సవ తంతు నిర్వహించారు. ఈ జంటను చూసైనా దేవుని మనసు కరిగి మంచి వర్షాలు కురవాలని ప్రార్థించారు. ఈ వేడుకకు చుట్టుపక్కల పల్లెల నుంచి జనం తరలివచ్చారు. వృద్ధ మహిళలు వర్షం కోసం జానపద గీతాలు ఆలపించారు. ప్రసాదం ఆరగించి వధూవరులు, అతిథులు ఎవరికి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. -
అందని నీరు.. రైతన్న బేజారు
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగు చేసిన లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. సామర్థ్యాన్ని బట్టి గేజ్ నిర్వహణ చేసి ఆయకట్టు చివరి భూములకు నీరందేలా నీటిని సరఫరా చేయడంలో అధికారులు తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. గతంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించినందువల్లే నేడు ఆయకట్టు చివరి భూములకు నీరందక వాణిజ్య పంటలు వాడుముఖం పట్టాయన్న వాదన వినిపిస్తోంది. సింధనూరు, మస్కి, కవితాళ, మాన్వి తాలూకాల్లో రెండు లక్షల హెక్టార్లలో వరిని, రాయచూరు, సిరవార తాలూకాల్లో లక్ష హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో మిరప పంటలను పండిస్తున్నారు. నీరందించకుంటే పంట నష్టమే చివరి భూములకు నీటిని అందిస్తే పంటలు చేతికందే అవకాశం ఉంది. లేకుంటే పంట నష్టం తప్పదు. కాలువకు నీటి సామర్థ్యం పెంచడం, గేజ్ నిర్వహణ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల పంటలు ఏపుగా పెరిగే సమయంలో నీటిలభ్యత కరువైంది. దీంతో దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. సింధనూరు తాలూకా ముక్కుంద గ్రామానికి చెందిన అయ్యప్ప అనే యువ రైతు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నీరు విడుదల చేస్తామని హామీలిచ్చిన నేతలు నేడు కనుమరుగయ్యారని ఆరోపించారు. తాము 20 ఎకరాలు స్వంతంగా, 4 ఎకరాలు లీజుకు తీసుకొని పంటలు సాగు చేశామని, నీరు లేక పంటలు మొత్తం వాడుముఖం పట్టాయని వాపోయారు. ఎడమ కాలువ చివరి భాగానికి చేరని నీరు ఆయకట్టులో ఎండుతున్న వాణిజ్య పంటలు -
రహదార్లు.. మృత్యుబాటలు
కోలారు: రాష్ట్రంలో పలుచోట్ల రోడ్లు రక్తసిక్తమయ్యాయి. విహారయాత్రలకు, కూలిపనులకు వెళ్లిన వారు అకాల మృత్యువు పాలయ్యారు. వారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. తిరుమలలో వైకుంఠవాసున్ని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడింది. తల్లీ, కొడుకు, ఆయన కుమారుడు, సమీప బంధువు చనిపోయారు. కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని దొడ్డకారి గ్రామం వద్ద చైన్నె – బెంగళూరు ఎక్ప్‌ప్రెస్ హైవేలో సోమవారం ఉదయం ఈ ఘోరం జరిగింది. బెంగళూరు నగరం విద్యారణ్య పురకు చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో తిరుమలయాత్రకు వెళ్లింది. దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఘటనాస్థలిలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొని బోల్తా పడింది. శారద (70), ఆమె కుమారుడు దేవేంద్రకుమార్ (41), ఈయన కొడుకు జిష్ణు (13), బంధువు దీక్షిత (25) ప్రాణాలు కోల్పోయారు. డ్రైవరు వికాస్, మరో ముగ్గురు గాయపడ్డారు. అందరినీ కోలారు ఆస్పత్రికి తరలించారు. తరువాత గాయపడిన వారు అంబులెన్సులో బెంగళూరుకు వెళ్లిపోయారు. బేతమంగల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీఎఫ్ ఆస్పత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి మార్మోగింది. ఆకస్మాత్తుగా కుక్క అడ్డం రావడం వల్ల తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టి పల్టీలు కొట్టిందని డ్రైవరు వికాస్ తెలిపాడు. విహారయాత్రకు వచ్చి తల్లీకూతురు.. యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా యల్లాపుర తాలూకా అరబైలు ఘాట్‌లో రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమార్తె మరణించారు. వివరాలు.. పూణెకి చెందిన శర్మిలా రాజన్ కుల్లె (59), ఆమె కూతురు మృణ్మయి (32), హొసకోటకు చెందిన బాడుగ కారు డ్రైవర్ అలంబాషాతో కలిసి బాగల్‌కోట జిల్లాలో బాదామి విహారయాత్రకు వచ్చారు. సొంతూరికి తిరిగి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు కారు యల్లాపుర తాలూకా అరబైలు ఘాట్‌లో లారీ ఢీకొంది. లారీ కొంతదూరం కారును ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె చనిపోగా, డ్రైవరుకు గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని కారులో నుంచి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. వెనుక కారు బీభత్సం ● మండ్య వద్ద బెంగళూరు మహిళ మృతి మండ్య: జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని తావరకెరె గేట్ వద్ద కారును వెనుక నుంచి మరో కారు వేగంగా దూసుకువచ్చి ఢీకొనింది. ముందు కారులోని బెంగళూరువాసి సుధా జైన్ (58) దుర్మరణం చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. హాసన్ జిల్లాలోని శ్రావణ బెళగోళ టూర్‌కు వెళ్లిన సుధా జైన్ కుటుంబం, జాతీయ రహదారిపై స్విఫ్ట్ కారులో బెంగళూరుకు తిరిగి వస్తోంది. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు వారి కారును ఢీకొంటూ ముందుకెళ్లింది. ఈ రభసకు ముందున్న కారు తీవ్రంగా ధ్వంసమైంది. సుధా జైన్ అక్కడికక్కడే మరణించగా, కారులోని ముగ్గురు గాయపడ్డారు, రోడ్డు పక్కన నిలబడిన పెట్రోల్ బంక్ యజమాని కాలు విరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులకు బయటకు తీసి బీజీ నగరలోని ఆదిచుంచనగిరి ఆసుపత్రిలో చేర్పించారు. వెనుక వస్తున్న ఓ వాహనంలోని డ్యాష్‌బోర్డు కెమెరాలో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది.కేజీఎఫ్ వద్ద ప్రమాదంలో నుజ్జయిన కారు రాష్ట్రంలో పలుచోట్ల యాక్సిడెంట్లు కోలారులో నలుగురు మృత్యువాత తిరుమల నుంచి బెంగళూరుకు వస్తుండగా కారు పల్టీలు -
కరువు సేద్యం.. ట్యాంకరు నీరే శరణ్యం
హొసపేటె: ఈసారి రుతుపవన వర్షాలు సరిగా కురవక పోవడంతో విజయనగర జిల్లా హడగలి తాలూకా కెంచమ్మనహళ్లి గ్రామానికి చెందిన రైతు బసవలింగప్ప తన ఉల్లి పంటను కాపాడుకోవడానికి ట్యాంకరు నీటిని ఆశ్రయించారు. జెస్కాం అధికారులు సరైన విద్యుత్‌ను అందించకపోవడంతో గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయి. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల నీటిని వాడుతున్నారు. రైతు బసవలింగప్ప మాట్లాడుతూ ఉల్లికి ప్రస్తుతం మంచి ధర ఉండగా, వర్షాలు చేయి ఇవ్వడంతో చేతికి వచ్చిన పంట ఎండిపోయి నష్టం వచ్చిందన్నారు. తాను రూ.2 లక్షలు అప్పు తీసుకుని 4 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. కానీ నారు మొక్కలు రాగానే బోరుబావిలోని నీరు నిలిచి పోయి ఎండిపోతోందన్నారు. రోజూ 15 ట్యాంకర్ల నీరందిస్తున్నాం నా ఆస్తులన్ని తాకట్టు పెట్టి, పంటను కాపాడటానికి ప్రతి రోజూ పంటకు 15 ట్యాంకర్ల నీటిని అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్క ట్యాంకర్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నామని అన్నారు. రైతుల కష్టాలను చూడటానికి ఏ ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ పొలాలకు రావడం లేదు. బదులుగా వారు కార్యాలయాల్లో కూర్చుని నివేదికలు తయారు చేస్తున్నారు. పంట సర్వే నిర్వహించి, పంట నష్టపోయిన వారికి కనీసం ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని జిల్లాధికారిని డిమాండ్ చేశారు. కాగా ఉల్లి రైతుల సంఘం రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సిద్దేశ్ ఉత్తంగి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు రైతులకు అండగా నిలిచి ఆదుకోవాలని డిమాండ్ వేశారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా ఉల్లి పంటకు నీరందిస్తున్న రైతు ట్యాంకర్‌కు రూ.వెయ్యి ఖర్చుతో పంటను కాపాడుతున్న వైనం -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
రాయచూరు రూరల్: నగరంలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరసభ, కార్పొరేషన్లు, ఈ–ఖాతా, తాగునీరు, మురుగు కాలువల శుభ్రత, అమృత నగర్– 2 పథకం పనులు మందకొడిగా సాగడంపై మంత్రి అధికారులపై చిందులు తొక్కారు. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబరులోగా ‘స్థానిక’ ఎన్నికలు నగర స్వచ్ఛతను కాపాడడానికి అధికారులు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య పేర్కొన్నారు. సోమవారం నగరంలోని యక్లాసపుర వద్ద చెత్త సేకరణ డంప్ యార్డులను పరిశీలించి మాట్లాడారు. ముఖ్యమంత్రి డీకే.శివ కుమార్ పేర్కొన్నట్లు డిసెంబర్‌లోగా జెడ్పీ, టీపీ, జీపీ, నగరసభ, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఐదేళ్లుగా జెడ్పీ, టీపీ, జీపీలకు, ఎనిమిదేళ్లుగా నగరసభలకు ఎన్నికలు నిర్వహించలేదన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియలు జరుగుతాయన్నారు. మహాత్మాగాంధీ వికాస్ పథకంలో నగరానికి రూ.185 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. స్వచ్ఛ భారత్ పథకం కింద రాయచూరు సిటీ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకొని శుభ్రత, ముడి వస్తువుల సేకరణ, ఇతర పనుల నిర్వహణలో తర్ఫీదు పొందే అవకాశముందన్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఏనుగు ప్రతిమలను చూసి అధికారులను అభినందించారు. రెవెన్యూ అదాలత్‌ను ప్రారంభించి, అమృత్ తాగునీటి పథకాన్ని పర్యవేక్షించారు. మావినకెరె చెరువును పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు బోసురాజు, వసంత్ కుమార్, ఎమ్మెల్యే బసన గౌడ, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లాధికారిణి పూవిత, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, మల్లికార్జునలున్నారు. -
ఎట్టకేలకు యావజ్జీవం
మైసూరు: పాత కక్షల కారణంగా ఒక ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని హత్య చేసిన దోషికి ఎట్టకేలకు హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మైసూరులోని ఉదయగిరికి చెందిన అబ్దుల్ షరీఫ్ దోషి. వివరాలు.. ఉదయగిరికి చెందిన అబ్దుల్ షరీఫ్, మహమ్మద్ అమీర్ జాన్ కుటుంబాల మధ్య డబ్బుల గురించి వివాదం ఉండేది. అదే పగతో, షరీఫ్ 2013 ఏప్రిల్ 12న అర్ధరాత్రి మహమ్మద్ అమీర్ జాన్ ఇంటిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో గ్యాస్ సిలిండర్ విస్ఫోటం చెందింది. ఈ ఘటనలో మహమ్మద్ అమీర్ జాన్, అతని తల్లి అఫ్రోజ్ బేగం, రేష్మా, అంజు.ఎ, రిజ్వాన్, రిగ్నానా తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రిలో మరణించారు. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. ఈ కేసును విచారించిన మైసూరు రెండవ అదనపు సెషన్స్ కోర్టు, 2018 ఏప్రిల్ 28న నిందితున్ని నిర్దోషిగా ప్రకటించింది. కింది కోర్టు తీర్పుపై అభ్యంతరం ప్రభుత్వ న్యాయవాదులు ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. జడ్జిలు జస్టిస్ హెచ్. పి.సందేశ్ ధర్మాసనం విచారించింది. అన్ని ఆధారాలు పరిశీలించి దోషిగా నిర్ధారించి జీవితఖైదును విధించింది. ఘటన సమయంలో నిందితుని వయస్సు 50 కాగా, ఇప్పుడు వయస్సు 63 ఏళ్లు. ఫోరెన్సిక్ సాక్ష్యాలు, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కింది కోర్టు సరైన నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. పేలుడు వెంటనే జరిగిందా, తరువాత జరిగిందా అనే దానిపైనే ఎక్కువగా చర్చించారని, అది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆ తీర్పు లోపభూయిష్టమని, దోషి వెంటనే పోలీసులు ముందు లొంగిపోవాలని జడ్జి స్పష్టం చేశారు. మైసూరులో ఇంటిపై పెట్రోలు పోసి ఆరుగురి హత్య కేసు.. 13 ఏళ్ల తరువాత దోషికి హైకోర్టులో శిక్ష -
సమయం మీరినా తెరిచిన పబ్‌పై దాడి
హుబ్లీ: సమయం గడిచినా పబ్ నిర్వహిస్తున్న గోకుల్ రోడ్డు ఐస్ క్యూబ్ హోటల్‌పై హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనరేట్ శాంతిభద్రతల విభాగం డీసీపీ శృతి నేతృత్వంలో రాత్రి దాడి చేశారు. నిర్ధిష్ట సమయంలో హోటల్ వ్యాపారాలను ముగించడం లేదని ప్రజలు చేసిన ఫిర్యాదులతో ఉన్న ఫలంగా ఈ దాడి చేసి అక్కడ ఉన్న యువతీ యువకులను బయటకు పంపించి పబ్‌ను బంద్ చేశారు. గోకుల్ రోడ్డు పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తులో ఉంది. నగరంలోని అన్ని హోటళ్లు, పబ్‌లు, వైన్ షాపులను పరిశీలించాలని కొత్త కమిషనర్ భూషన్ బుర్సే సూచన మేరకు ఈ దాడి జరిగింది. ఇకపై ఎవరూ కూడా గడువుకు మించి హోటళ్లు, పబ్‌లను తెరిచి ఉంచరాదని కొత్త కమిషనర్ గట్టి హెచ్చరిక చేశారు. గురువు స్థానం మహోన్నతం● ఎమ్మెల్యే నేమిరాజ నాయక్ హొసపేటె: అందరి కంటే గురువు స్థానం మహోన్నతమైనదని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ నాయక్ పేర్కొన్నారు. సోమవారం హగరిబొమ్మనహళ్లి పట్టణంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా పట్టణంలోని వాల్మీకి భవన్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గురువు స్థానం అమూల్యమైనదని ఆయన అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ ప్రపంచానికి ఆదర్శం అన్నారు. విద్య లేకుండా ఏదీ సాధించడం అసాధ్యం. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవితాన్ని నిర్మించుకునే శక్తిని గురువు నుంచి పొందవచ్చన్నారు. ఇంతటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుల బాధ్యత చాలా ముఖ్యమైనది. రూ.50 లక్షల వ్యయంతో గురుభవన్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు మరిన్ని నిధులు అవసరమైతే, ఈ ఏడాదే ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. నందీపుర డాక్టర్ మహేశ్వర స్వామీజీ, హాల సిద్దేశ్వర స్వామీజీ, బీఈఓ జగదీశ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ బోధనలు అనుసరణీయంరాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య అన్నారు. సోమవారం శ్రీకృష్ణ యాదవ భవనంలో యాదవ సమాజం ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు పెద్దపీట వేశారన్నారు. ఎమ్మెల్సీలు వసంత్ కుమార్, బోసురాజు, శంకరప్ప, నగరసభ మాజీ అధ్యక్షుడు మారెప్ప, తిమ్మప్ప నాడగౌడ, రవీంద్ర, భీమన్న, హనుమంతప్ప, చెన్నారెడ్డిలున్నారు. -
ఎడమ కాలువకు ‘గాలి’ వాయనం
హొసపేటె: గంగావతి తాలూకాలోని దాసనాళ సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర ఎడమ కాలువకు ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీఅరుణ సోమవారం రైతులు, బీజేపీ కార్యకర్తల సమక్షంలో వాయనం సమర్పించారు. శ్రావణమాసం సందర్భంగా మల్లాపుర సమీపంలోని వాన వీరభద్రేశ్వర ఆలయ మూడో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం వీరభద్రేశ్వర విగ్రహానికి రుద్రాభిషేకంతో పాటు వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడి దయతో మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని తాను ప్రార్థించానన్నారు. కల్మఠ కొట్టూరేశ్వర స్వామీజీ, జోగద నారాయణప్ప, శరబయ్య హిరేమట, మహంతేష్ శాస్త్రి హిరేమట, శ్రీకాంత్ హిరేమట, అనిల్, తుంగభద్ర సేవా సమితి సభ్యులు లింగరాజ్గౌడ, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
గజరాజులకు బరువు మోత
450 కేజీల ఇసుక మూటలతో నడక మైసూరు: దసరా గజరాజులకు అప్పుడే బరువు మోసే తర్ఫీదును ప్రారంభించారు. దసరా జంబూసవారీ ఊరేగింపు కోసం గజరాజులను సిద్ధం చేస్తున్నారు. గజదళంలోని మగ ఏనుగులకు వీపుపై బరువులు మోయించారు. ఒక్కో ఏనుగుపై 450 కేజీల బరువున్న ఇసుక మూటలను ఉంచి నడిపించారు. క్రమంగా దానిని 1000 కేజీలకు పెంచుతారు. పూజారి ప్రసాద్ రావు అంబావిలాస్ ప్యాలెస్‌లోని సోమేశ్వర ఆలయం సమీపంలో ఏనుగులకు పూజలు చేసి బరువు మోతకు సాగనంపారు. ముఖ్య ఏనుగు మహేంద్రపై మంచం కట్టి ఇనుప ఊయలను బిగించారు. తరువాత ఒక్కొక్కటి 50 కేజీల బరువున్న 9 ఇసుక బస్తాలను ఉంచారు. అటవీ సిబ్బంది, మావటీలు జాగ్రత్తగా బిగించారు. ప్యాలెస్ నుంచి బన్నిమంటపం పరేడ్ మైదానం వరకు బరువు మోస్తూ నడిచింది. డీసీఎఫ్ ప్రభుగౌడ మాట్లాడుతూ మహేంద్ర, ప్రశాంత్, ఏకలవ్య, ధనంజయతో బరువులు మోయించే సాధన చేయిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫలితాలను బట్టి బంగారు అంబారీని మోసే గజరాజును ఎంపిక చేస్తామన్నారు. -
పాదయాత్రతో ప్రభుత్వానికి వణుకు
సాక్షి బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి, అక్రమాలు పెరిగిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ తాము చేపట్టిన పాదయాత్రతో ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, సీఎం డీకే.శివకుమార్‌కు నిద్ర లేకుండా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. సోమవారం బీజేపీ పాదయాత్ర ఏడో రోజుకు చేరుకుంది. కంప్లి తాలూకాలో బీజేపీ పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. బీవై. విజయేంద్రతో పాటు మాజీ మంత్రి శ్రీరాములు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ తేజస్ సూర్య, బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, మాజీ ఎమ్మెల్యే టీహెచ్ సురేష్‌బాబు తదితరులు పాదయాత్రలో పాల్గొనడంతో ఆయా గ్రామాల్లో రైతులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. భారీ జనసందోహంతో కంప్లి తాలూకా దేవలాపురకు పాదయాత్ర చేరుకుంది. పెచ్చుమీరిన అవినీతి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినా రూ.52 వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని, మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అభివృద్ధి నిధులను కాజేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిందని ధ్వజమెత్తారు. యువశక్తి భారత దేశానికి భవిష్యత్తు అని, అయితే సరైనా దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేపీఎస్సీ నియామక ప్రక్రియలో నోటిఫికేషన్, పరీక్ష ఫలితాలు, ఇంటర్వ్యూల తర్వాత నెలల తరబడి కాలయాపన జరుగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేపీఎస్సీలో సంస్కరణలు తేవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకతను పాటిస్తామన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి మాట్లాడుతూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పది రోజులు నిర్వహించాలని సూచించారు. మంత్రి పదవికి నాగేంద్ర రాజీనామా చేసినా పాదయాత్రకు విశేష మద్దతు లభిస్తోందన్నారు. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రజాసేవ అంటూ జనంలోకి వెళ్తుండటం సిగ్గుచేటన్నారు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్థన్‌రెడ్డి, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎంకు నిద్ర దూరం చేస్తున్న పోరాటం కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేక ప్రాధాన్యత బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర -
దేవదేవుని కళ్యాణం
కోలారు: ముళబాగిలు నగరంలోని జ్యోతినగర పాళ్యలో ఉన్న పురాణ ప్రసిద్ధ తుళసిరామ దేవాలయంలో శ్రీనివాస సమేత పద్మావతి దేవర కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయంలో గత వంద సంవత్సరాలకు పైగా ఏటా కళ్యాణోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. వేదపండితులు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులకు కనులపండువగా సాగింది. పవిత్రగౌడ బ్యారక్ మార్పు! యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్ర గౌడ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో బ్యారక్‌ను మార్చేందుకు 59వ సివిల్, సెషన్స్‌కోర్టు ఆమోదించింది. ఇప్పుడున్న బ్యారక్‌లో 30 మందికి పైగా ఉంటున్నారు, ఒక్కటే మరుగుదొడ్డి ఉండడంతో ఇబ్బందిగా ఉందని పవిత్ర కోర్టులో అర్జీ వేసింది. దీంతో మరో బ్యారక్‌లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు. మళ్లీ హైకోర్టుకు దర్శన్ తనను వీడియో కాన్ఫరెన్స్‌లో కాకుండా నేరుగా కోర్టు వాయిదాలకు హాజరయ్యేలా అనుమతించాలని రెండవ నిందితుడు, నటుడు దర్శన్ మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన పిటిషన్‌ని భద్రతా కారణాల పేరుతో 59వ సీసీహెచ్ కోర్టు తిరస్కరించింది. త్వరలో మరిన్ని కరువు తాలూకాలు: సీఎం దొడ్డబళ్లాపురం: కరువుపీడిత తాలూకాలుగా ప్రకటించలేదని ఏ ఎమ్మెల్యే కూడా ఆందోళన చెందవద్దని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో చాలా తాలూకాలలో కరువు తాండవిస్తోందని, అన్ని విధాలుగా పరిశీలించి కరువు పీడిత తాలూకాలను ఎంపిక చేస్తున్నామన్నారు. మొదటి విడత మాత్రమే ప్రకటించామని రెండవ, మూడవ విడతల్లో మరిన్ని తాలూకాలను ప్రకటిస్తామని తెలిపారు. రైతుల సమస్యల గురించి చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుపుతామన్నారు. నైస్ పథకంపై చట్ట వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. వీధి వ్యాపారుల పొట్ట కొట్టొద్దుతుమకూరు: నగరంలో ఫుట్‌పాత్ దుకాణాలను కోర్టు ఆదేశాలంటూ కార్పొరేషన్ అధికారులు తొలగించి పొట్టకొడుతున్నారని వ్యాపారులు, కన్నడ, దళిత సంఘాల నాయకులు బృహత్ నిరసన నిర్వహించారు. ఇష్టానుసారం దుకాణాలను తొలగించడంతో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. వారికి జిల్లా యంత్రాంగం సహాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పార్కులు, రాజకాలువలను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించిన ధనికులను పట్టించుకోరా, పేదలే కనిపిస్తారా? అని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేసి, తరువాత కలెక్టరేట్‌కు వెళ్లి నిరసన తెలిపారు. ఒంటరిని చేసిన నేపాల్ దొడ్డబళ్లాపురం: నేపాల్ విహారయాత్రకు వెళ్లిన బెంగళూరు దంపతులు అక్కడ వరదల్లో గల్లంతయ్యారు. ఇప్పటివరకూ వారి ఆచూకీ లభించకపోవడంతో వారి కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కన్నవారు లేని అనాథగా జీవించాలా? అని ఆవేదన చెందుతోంది. అన్నందేవర వెంకటరావ్, అనఘ దంపతులు 67 మందితో కలిసి కై లాస పర్వత యాత్రకు వెళ్లారు. అయితే నేపాల్ విపత్తులో చిక్కుకుని అదృశ్యమయ్యారు. ఆగస్టు 30 తరువాత తల్లిదండ్రులతో మాట్లాడలేకపోయానని కుమార్తె తాన్వి కన్నీటిపర్యంతమవుతోంది. తాన్వి డీఎన్ఏతో ఏ మృతదేహం డీఎన్ఏ కూడా జత కాకపోవడంతో కన్నవారు బతికే ఉండవచ్చని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. -
తిమ్మరాయ.. తిరుమలరాయ
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్ పట్టణంలోని తిమ్మరాయస్వామి ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన కోనేరును అటవీ శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కనులపండువగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనేక సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు ఉండేది. కానీ పట్టణీకరణలో అది కనుమరుగైంది. భక్తులు, ఆలయ నిర్వాహకులు కలిసి పుష్కరిణిని పునరుద్ధరించారు. తిమ్మరాయస్వామికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. జీర్ణోద్ధరణ చేసిన పుష్కరిణిలో తెప్పోత్సవం -
సర్కారు బడుల్ని కాపాడుకుందాం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించడం మనందరి బాధ్యత అని ఎస్డీఎంసీ అధ్యక్షుడు జయణ్ణ పేర్కొన్నారు. సోమవారం విజ్ఞాన కేంద్రంలో స్వామి వివేకానంద, ప్రభుత్వ పాఠశాల వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి, ఎల్ఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాయచూరు జిల్లాను ఆస్ప్రియేషన్ జిల్లాగా ప్రకటించడంతో ఎస్డీఎంసీల సహకారంతో విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇంటిలో విద్య కేవలం సంస్కారం, సంప్రదాయాలు, ఆచార విచారాలతో పాటు పాఠశాలల్లో లభించే విద్య జీవన ప్రమాణాలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. మన పాఠశాల, మన హక్కు లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో నిరంజనారాధ్య, విరుపమ్మ, సురేష్ స్వామి, దేవరాజ్, హఫీజుల్లా, కృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, సువర్ణలున్నారు. ఆర్టికల్ అమలు చేయాలని ధర్నా రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్– 371(జే)ను అమలు చేయాలని కళ్యాణ కర్ణాటక పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ కేంద్రం ఆర్టికల్‌ను జారీ చేసి దశాబ్దాలు గడిచినా దానిని సక్రమంగా అమలు చేయడంలో అధికారులు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలో చామరస మాలి పాటిల్, కరియప్ప, చంద్రశేఖర్, అమరేష్, విద్యా పాటిల్ తదితరులున్నారు. ఖైదీలకు సంగీత శ్రవణం అవసరం రాయచూరు రూరల్: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మానసికంగా ప్రవర్ధమానులై సమాజంలో శాంతియుతంగా కుటుంబ జీవితం గడపడానికి సంగీత రస మంజరి అవసరమని సినీ నటి పూజా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లా జైలులో కలా సంకుల సంస్థ ఏర్పాటు చేసిన సంగీతోత్సవ కార్యక్రమంలో ఖైదీలనుద్దేశించి మాట్లాడారు. శిక్షలు అనుభివించే ఖైదీలు భవిష్యత్తులో జీవితాలను మార్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోడానికి సంగీత శ్రవణం సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలర్ అనితా హిరేమని, జైల్ అధికారులు, శ్యాం ఖానాపూర్లున్నారు. బాధిత కుటుంబానికి పరామర్శరాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కర్ణాటక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం అశ్విని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి మాట్లాడారు. జిల్లాలో భూమానంద, రేణుక, రమేష్ మృతి చెంది నెల రోజులు కావస్తున్నా రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు దళితుల ఇళ్లలో చావులపై కనికరం లేకపోయిందని వాపోయారు. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే కలబుర్గికి మంత్రా లేక రాష్ట్రాినికి మంత్రా, ఏసీ గదుల్లో కూర్చొని కాలయాపన చేయడం తగదన్నారు. హత్యలకు కారకులపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. రౌడీషీటర్‌పై కేసుహుబ్లీ: రోడ్డుపై తెల్లరంగు పౌడర్ పెట్టి దానిపై ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఏదో లిక్విడ్ వేసి నిప్పంటించి పేల్చేసి వీడియో వైరల్ చేసిన రౌడీషీటర్‌పై కేసు నమోదైంది. హుబ్లీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ మహమ్మద్ ఉజైఫ్ హుబ్లీ కులకర్ణి అక్కలద రోడ్డులో పేలుడు వస్తువును రవాణా చేస్తూ రోడ్డుపై పేల్చిన ఆరోపణలపై కేసు నమోదు చేశారు. -
నకిలీ వైద్యులపై కొరడా
సాక్షి, బెంగళూరు: నకిలీ ఔషధాల కేంద్రాలపై దాడులు చేసిన ఆరోగ్య శాఖ తాజాగా నకిలీ వైద్యులపై నిఘా పెట్టింది. రాష్ట్రంలో గత రెండేళ్లలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్ తదితర సరైన వైద్య డిగ్రీ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేసే 583 మంది నకిలీ వైద్యులను గుర్తించింది. రాష్ట్రంలో ఈ సంఖ్య వేలల్లో ఉండవచ్చని అంచనాలున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా ఇటువంటి క్లినిక్‌లు దర్శనమిస్తాయి. ఏదో వైద్యం చేసేది డబ్బులు పిండుకోవడం వీరి నైజంగా మారింది. సహాయకులుగా పనిచేసి డాక్టర్‌గా అవతారం ఈ నకిలీ వైద్యుల్లో చాలామంది గతంలో క్లినిక్‌లలో సహాయకులు, ల్యాబ్ అసిస్టెంట్లు, కాంపౌండర్లు, నర్సులుగా పనిచేశారు. తరువాత సొంతంగా క్లినిక్‌లు ప్రారంభించి ఎడాపెడా వైద్యం చేస్తున్నారు. పల్లెలు, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నకిలీ వైద్యుల తాకిడి ఎక్కువగా ఉంది. బళ్లారి, విజయనగర, కలబురిగి, రాయచూరు, ధార్వాడ తదితర జిల్లాల్లో మరీ అధికమని తేలింది. సరిహద్దు జిల్లాలు, బెంగళూరులో మొబైల్ క్లినిక్‌లు నడిపిస్తున్నారు. ప్రతిరోజూ స్థలం, మొబైల్ నంబర్ మార్చుకుంటూ ప్రజలకు చికిత్సలు అందిస్తూ రావడం ప్రత్యేక తనిఖీ బృందాల దృష్టికి వచ్చాయి. వచ్చీరాని వైద్యంతో పరిస్థితి విషమించడం, ప్రాణాలే పోవడం జరుగుతోంది. జరిమానాలు, శిక్షలు అర్హతలు లేకుండా వైద్యమందిస్తూ పట్టుబడేవారికి తొలిసారి రూ. 25 వేల జరిమానా విధిస్తున్నారు. రెండో సారి కూడా పట్టుబడితే రూ. 2.5 లక్షల వరకు జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష, ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్షకు చట్టంలో అవకాశం ఉంది. దాడులకు జిల్లాస్థాయిలో ఆరోగ్య శాఖ బృందాలను ఏర్పాటు చేసింది. రోగులు అర్హత కలిగిన వైద్యుల వద్దకే వెళ్లాలని తెలిపింది. రెండేళ్లలో 583 మంది గుర్తింపు మళ్లీ దాడులకు ఆరోగ్యశాఖ కార్యాచరణ -
కరువు ప్రాంతంగా ప్రకటించాలి
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని యాదగిరి జిల్లా గురుమటకల్ను కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించి, వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని గురుమటకల్ శాసన సభ్యుడు శరణేగౌడ కందకూరు డిమాండ్ చేశారు. సోమవారం బెంగళూరు విధానసౌధ ముందు మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఆయన ఆందోళన చేపట్టి మాట్లాడారు. జిల్లా అధికార యంత్రాగం కరువు తాలూకాగా ప్రకటించాలని రాష్ట్ర సర్కారుకు ప్రతిపాదనలు పంపినా జేడీఎస్ శాసన సభ్యుడిననే భావనతో కరువు ప్రాంతంగా ప్రకటించకుండా జాబితా నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విధాన పరిషత్ ప్రతిపక్ష నేత నారాయణస్వామి ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. కనీస వేతనాలు అందించరూరాయచూరు రూరల్: రాష్ట్రంలోని వివిధ శాఖలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలకు తోడు సవరించిన వేతనాలను అందించాలని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించేలా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సక్రమంగా సౌకర్యాలు అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. -
ఉపాధికి వెళ్తుంటే ఊపిరే పోయింది
చింతామణి: పూలు కోయడానికి ఓమ్ని కారులో 13 మందిని మహిళా కూలీలతో వెళ్తుండగా మృత్యు శకటంలా టెంపో లారీ ఢీకొట్టింది. ముగ్గురు మహిళలు మరణించారు. శిడ్లఘట్ట తాలూకాలోని హొసహళ్లి గేట్ దగ్గర సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. చింతామణి తాలూకా మల్లిఖార్జునపుర గ్రామానికి చెందిన మహిళా కూలీలు శిడ్లఘట్ట తాలూకాలోని తోటలో కూలి పనికి ఓమ్నీలో బయల్దేరారు. ఘటనాస్థలిలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఓమ్నీ పల్టీలు కొట్టింది. రత్నమ్మ, (40), మునిచెన్నమ్మ (50), రూప (35) ప్రాణాలు కోల్పోయారు. మునిరత్నమ్మ, లక్ష్మీనరసమ్మ, నరసమ్మ, అనిత తీవ్రంగా గాయపడ్డారు. మంగమ్మ, నాగవేణి, లక్షమ్మ, రుక్మిణి, శిల్ప, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు తక్షణమే బాధితులను శిడ్లఘట్ట ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ పద్మిని సాహో ప్రమాదస్థలిని పరిశీలించారు. ఓమ్నీని ఢీకొన్న మినీ లారీ.. ముగ్గురు మహిళా కూలీల మృతి -
జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్
కర్ణాటక: ఖైదీలకు సెంట్రల్ జైలులో రాచ మర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కలబుర్గి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ అనితను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీపీ అలోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జైలులో ఖైదీలు మొబైళ్లు వాడటం, సిగరెట్లు, మద్యం తాగడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఇందుకు అనితను బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్ చేశారు. చదవండి: జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా.. -
మిమ్మల్ని క్షమించేది లేదు
బెంగళూరు: అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన అసభ్య కామెంట్ల కేసులో తగ్గేదే లేదని చెప్పారు. గతంలో దర్శన్ అభిమానులపై పెట్టిన అశ్లీల సందేశాల కేసును వాపస్ తీసుకోబోనని రమ్య తెలిపారు. బెంగళూరులో కోర్టు ఆవరణలో నిందితుల కుటుంబసభ్యులు రమ్యను కలిసి క్షమించి, కేసు వాపస్ తీసుకోవాలని వేడుకున్నారు. కానీ రమ్య ససేమిరా అన్నారు. ఈ కేసు అందరికీ గుణపాఠం కావాలని రమ్య చెప్పినట్లు తెలిసింది. మొబైల్‌ఫోన్ ఉందని ఓ మహిళను ఎలా కావాలంటే అలా కామెంట్ చేయవచ్చా? అని రమ్య వారిని ప్రశ్నించారు. కామెంట్ చేయడానికి ముందు వెయ్యి సార్లు యోచన చేయాలని, కేసు నడవాలి, తానే గెలపాలని, ఎన్నిసార్లు కోర్టు వాయిదాకు పిలిచినా వస్తానని ఆమె చెప్పారు. నిందితులను క్షమిస్తారా? అని జడ్జి కూడా ఆమెను విచారణలో అడిగినట్లు తెలిసింది. చదవండి: త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్ -
బైక్‌లకు దుండగుల నిప్పు
దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు నిలిపిన ఐదు బైక్‌లకు దుండగులు నిప్పంటించిన సంఘటన బెంగళూరు పరప్పన అగ్రహార ఠాణా పరిధిలో జరిగింది. దొడ్డనాగమంగల దగ్గర కేంబ్రిడ్జ్ పాఠశాల వద్ద ఉన్న ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న ఐదు ఖరీదైన బైక్‌లకు శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో అవన్నీ పూర్తిగా దహనం కావడంతో పాటు ఆ ఇంటి కిటికీలు, తలుపులు కూడా కాలిపోయాయి. ఆధారాలను బట్టి కావాలనే నిప్పంటించారని పోలీసులు అనుమానిస్తున్నారు.కలబుర్గిలో దొంగనోట్ల ముఠా దొడ్డబళ్లాపురం: హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత జిల్లా కలబుర్గిలో దొంగనోట్ల ముఠా గుట్టు రట్టయింది. వివరాలు.. కలబుర్గిలోని రాజరాజేశ్వరి నగరలో ఓ ఇంట్లో దొంగనోట్లు ముద్రిస్తున్నారని సమాచారం అందడంతో యూనివర్సిటీ ఠాణా పోలీసులు దాడులు చేశారు. అశ్విన్ అనే నిందితుడు పరారవగా దశరథ్ రాథోడ్, సిద్దరామ అనే ఇద్దరు పట్టుబడ్డారు. నిందితులు అద్దె ఇల్లు తీసుకుని నోట్ల ముద్రణను ప్రారంభించారు. అక్కడ కలర్ ప్రింటర్‌తో పాటు రూ.14వేల విలువగల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పులు ఎక్కువవడంతో తీర్చడానికి ఈ దందాకు దిగినట్టు నిందితులు తెలిపారు. అయితే నోట్లు సరిగా ప్రింటింగ్ కాకపోవడంతో వాటిని చలామణి చేయలేకపోయారు. చాలా నోట్లను కాల్చివేసినట్టు తెలిసింది. మిమ్మల్ని క్షమించేది లేదు ● నిందితులపై రమ్య కాఠిన్యం యశవంతపుర: అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన అసభ్య కామెంట్ల కేసులో తగ్గేదే లేదని చెప్పారు. గతంలో దర్శన్ అభిమానులపై పెట్టిన అశ్లీల సందేశాల కేసును వాపస్ తీసుకోబోనని రమ్య తెలిపారు. బెంగళూరులో కోర్టు ఆవరణలో నిందితుల కుటుంబసభ్యులు రమ్యను కలిసి క్షమించి, కేసు వాపస్ తీసుకోవాలని వేడుకున్నారు. కానీ రమ్య ససేమిరా అన్నారు. ఈ కేసు అందరికీ గుణపాఠం కావాలని రమ్య చెప్పినట్లు తెలిసింది. మొబైల్‌ఫోన్ ఉందని ఓ మహిళను ఎలా కావాలంటే అలా కామెంట్ చేయవచ్చా? అని రమ్య వారిని ప్రశ్నించారు. కామెంట్ చేయడానికి ముందు వెయ్యి సార్లు యోచన చేయాలని, కేసు నడవాలి, తానే గెలపాలని, ఎన్నిసార్లు కోర్టు వాయిదాకు పిలిచినా వస్తానని ఆమె చెప్పారు. నిందితులను క్షమిస్తారా? అని జడ్జి కూడా ఆమెను విచారణలో అడిగినట్లు తెలిసింది. గణేశ మండపాలకు నిబంధనలు ● బెంగళూరు పోలీసు కమిషనర్ బనశంకరి: బెంగళూరులో వినాయక చవితి మండపాల ఏర్పాటులో నిబంధనలను పాటించాలని పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ తెలిపారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గణేశోత్సవానికి ఇతర శాఖల అనుమతి తప్పనిసరి అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి ఆదేశాలను ఉల్లంఘించరాదని తెలిపారు. సూచించిన మార్గంలోనే ఊరేగింపు నిర్వహించాలి, స్వయంసేవకుల జాబితా పోలీసులకు అందించాలన్నారు. మండపాలను, ఊరేగింపు మార్గాలను డీసీపీలు పరిశీలిస్తారు. నిబంధనల ఉల్లంఘన కనబడితే కఠినచర్యలు తీసుకుంటారని తెలిపారు. నగరంలో పీఓపీ విగ్రహాల తయారీ, విక్రయాలను, నిమజ్జనాన్ని నిషేధించామన్నారు. అధిక విగ్రహాలకు లోహమిశ్రమంతో కూడిన రసాయనిక రంగులు వాడకూడదన్నారు. చెరువులు, బావులతో పాటు ఎలాంటి జలమూలాల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదన్నారు. -
పులి వీడియో వైరల్
హుబ్లీ: పనికి వెళ్లకుండా తప్పించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) పరిజ్ఞానంతో ఓ యువకుడు సృష్టించిన నకిలీ పులి వీడియో వైరల్‌గా మారింది. వివరాలు ఇలా.. కొప్పళ తాలూకా కవళి గ్రామం ఈరణ్ణ అనే యువకుడు తోటలోకి పనికి వెళ్లకుండా ప్లాన్ వేశాడు. పని నుంచి తప్పించుకునేందుకు తోటలోకి పులి వచ్చినట్లుగా ఏఐతో వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. వీడియోను పరిశీలన చేయగా ఇది ఏఐ పని అని తెలుసుకున్నారు. అసత్యాన్ని సత్యంగా వైరల్ చేసి భయాందోళనకు గురి చేసినందుకు ఆ యువకుడిని అధికారులు మందలించారు. 50 బస్కిలు చేయమని శిక్ష విధించి హెచ్చరించి పంపించేశారు. -
శాంత హొసమనికి లుకౌట్
రికార్డు నాట్యంబనశంకరి: కేపీఎస్సీ పశువైద్యాధికారులు పోస్టుల అక్రమాలలో పరారీలో ఉన్న ఆ సంస్థ సభ్యురాలు శాంత హొసమనిపై సీఐడీ లుకౌట్ నోటీస్ జారీచేసింది. గత నెలలో ఈడీ అధికారులు ఆమె ఇంటిపై దాడి చేసినప్పటి నుంచి ఆమె జాడ లేరు. మొబైల్ స్విచ్చాఫ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు కూడా నోరుమెదపడం లేదు. అరెస్ట్ భయంతో పరారైనట్లు తెలుస్తోంది. మూడోసారి నోటీస్ జారీ చేయనున్నారు. ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌ను సీఐడీ మరోసారి విచారించింది. అక్రమాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తన కుమార్తె కుల, ఆదాయ సర్టిఫికెట్లో సాంకేతిక లోపాటు తలెత్తి ఉండవచ్చు, అంతేతప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. పరీక్షల ప్రక్రియ కంట్రోలర్ ఆధీనంలో ఉంటుందని, ఇందులో తన పాత్రలేదని చెప్పినట్లు తెలిసింది. పరీక్షల కంట్రోలర్, ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్, బ్రోకరు బసవరాజ కన్నాళేను కస్టడీలో విచారిస్తున్నారు. ఆందోళనబాటలో విద్యార్థులు పశు వైద్యాధికారుల పరీక్షలు రాసిన నిరుద్యోగ యువత ఈ స్కాం నేపథ్యంలో ఢిల్లీ జెన్ జీ తరహాలో ఆందోళన చేయాలని నిర్ణయించారు. బెంగళూరు స్వతంత్రపార్కులో ఈనెల రెండోవారం నుంచి చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేపీఎస్సీ స్కాంలో సీఐడీ చర్యలు -
ఇస్కాన్‌లో ప్రత్యేక పూజలు
హుబ్లీ: ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆవిర్భావ దినం (పుట్టిన రోజు) సందర్భంగా స్థానిక రాయపుర్‌లోని ఇస్కాన్ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుపాదుల ఉత్సవ విగ్రహానికి అభిషేకం, తదితర పూజలు చేశారు. మహా నైవేద్యం కోసం భక్తులు తయారు చేసిన 3000 భక్షాలను ప్రభుపాదులకు సమర్పించారు. ఆ ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు. సన్మానం.. వివాదాస్పదంహుబ్లీ: హుబ్లీ–ధార్వాడ నగర పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన భూషణ బుర్సేను గంజాయి, హత్య కేసుల్లో నిందితులు సన్మానించడం వివాదాస్పదంగా మారింది. మత్తు మందుల రవాణా, హత్య కేసులో నిందితుడు అయిన కేత్సింగ్ రాజపురోహిత, గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడు అమిత్ బద్ది కమిషనర్‌ను సన్మానించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశమైంది. -
గజ సాధన.. జన రంజకం
ఆదివారం ప్యాలెస్ ఆవరణలో గజరాజులు నడక సాధనకు బయల్దేరిన గజం మైసూరు: నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొనేందుకు అడవుల్లోని శిబిరాల నుంచి రాచ నగరానికి చేరుకున్న దసరా గజరాజులకు మంచి ఆతిథ్యం లభిస్తోంది. సిటీ లైఫ్‌ని ఏనుగులు చవి చూస్తున్నాయి. రోజూ ప్రభుత్వ లాంఛనాలతో కూడిన ఆహారం అందిస్తూ ఉత్సవాల కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 9 ఏనుగులు మైసూరు ప్యాలెస్ ఆవరణలో మకాం వేశాయి. పొద్దున్నే మావటీలు వాటికి స్నానాలు చేయించి ఆహారం అందిస్తున్నారు. అటవీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాజభవనం నుంచి ఆయుర్వేద కళాశాల సర్కిల్ వరకు నడక సాధన చేస్తున్నాయి. మొదట కూరగాయల మెను అటవీ అధికారి ఎస్.ఎస్.రవిశంకర్ మాట్లాడుతూ, ఏనుగులకు ఏమేం ఆహారం ఇస్తున్నదీ వివరించారు. మర్రిచెట్లు కొమ్మలు, గడ్డి, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి పీచుపదార్థం అధికంగా ఉండే కూరగాయలను తినిపిస్తున్నట్లు చెప్పారు. పశువైద్య అధికారుల సూచనల ప్రకారం ఏనుగుల జీర్ణక్రియకు ఆటంకం కలగకుండా, మితమైన మోతాదులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. త్వరలో ధాన్యాల తిండి మొదటి దశ శిక్షణ పూర్తయిన తర్వాత, ఏనుగులకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇస్తారు. శనగపిండి, మినపపప్పు, గోధుమలు, కుసుబల బియ్యం, ఉప్పు కలిపిన ఉల్లిపాయలు తినిపిస్తారు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, దోసకాయ వంటి కూరగాయల సలాడ్ కూడా అందిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఇదే మెను ఇస్తారు, ఏనుగులు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటాయి. త్వరలో అభిమన్యు రాక దసరా ఏనుగుల రెండవ విడత బృందం మైసూరుకు చేరుకోనుంది. ఇందులో ప్రముఖ ఏనుగు కెప్టెన్ అభిమన్యు కూడా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఆ ఏనుగు వల్ల మిగతా ఏనుగులకు కాస్త ధీమా ఏర్పడుతుంది. మైసూరులో నిత్యం ఏనుగుల సందడి నడక సాధనకు విశేష స్పందన అతిథులకు ఆరోగ్యకర మెనూమిన్నంటిన సందడి ఇక ఏనుగులను చూడటానికి వచ్చే ప్రజలు, టూరిస్టులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఏనుగుల ప్రశాంతతకు భంగం కలిగించరాదని వారిని అధికారులు కోరుతున్నారు. ప్రజలు గజరాజుల పట్ల ప్రేమగా ప్రవర్తించాలని, ఆటంకం కలిగించరాదని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, పెద్దసంఖ్యలో అటవీ, పోలీసు సిబ్బంది ఏనుగుల వద్ద ఉంటున్నారు. ఆదివారం భారీ జన కోలాహలం మధ్య నడక సాధన చేశాయి. -
సమానత్వం కోసం పోరాడుతూనే ఉండాలి
● బీసీ కులాలకు సిద్దరామయ్య పిలుపు శివాజీనగర: ఈ దేశంలో ఒకనాటికి సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. మనం కుల వ్యవస్థ ఉన్నంత కాలం పోరాటం కొనసాగాలి అని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. కుల సర్వే నివేదికలోని సిఫార్సులను అమలు చేయాలని డీ.కే.శివకుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రాష్ట్ర బీసీ కులసంఘాలు నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2013లో తాను ఎంతో తపించి కుల సర్వే చేయించానని, తరువాత సీఎం అయిన హెచ్డీ కుమారస్వామి ఆ నివేదికను అంగీకరించలేదని ఆయన చెప్పారు. అందరికీ సామాజిక న్యాయం కావాలంటే, కనీసం 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థను సంస్కరించాలి నేను రాజకీయాల్లో కొనసాగుతా, కేవలం ఎన్నికల నుంచే విరమిస్తాను, మన ఎన్నికల వ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారింది, దీనిని సంస్కరించాలి అని సిద్దరామయ్య అన్నారు. ఎన్నికల వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉన్నందున నేను పోటీ చేయనని తెలిపారు. మీతో ఉండి పోరాటంలో పాల్గొంటానని చెప్పారు. ఈ సభలో డీసీఎం పరమేశ్వర్, మంత్రులు సంతోష్ లాడ్, పుట్టరంగశెట్టి, భైరతి సురేష్, మధు బంగారప్ప, అజయ్ సింగ్, ఎమ్మెల్యేలు బసవరాజ శివణ్ణనవర్, భీమసేన చిమ్మనకట్టి, ఉమేశ్ మేటి, పలువురు ఎమ్మెల్సీలు, బోర్డుల అధ్యక్షులు పాల్గొన్నారు. సొసైటీలో భారీ స్కాం.. సీఈఓ అదృశ్యంశివమొగ్గ: జిల్లాలోని హొసనగర తాలూకా, రిప్పన్‌పేట సమీపంలో హెడ్డరిపుర గ్రామ పంచాయతీ పరిధిలోని జంబళ్లి వద్ద దట్టమైన అడవిలో స్విఫ్ట్ కారు నిలిపి ఉంది. ప్రజలు పరిశీలన చేయగా, ఆ కారు కుడుమల్లిగే సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మదన్దని తెలిసింది. కారులోనే తాళాలు, ఆయన మొబైల్ ఫోన్, సొసైటీ ఖాతా పుస్తకాలు లభ్యం కావడం ఘటన తీవ్రతను మరింత పెంచింది. ఈ సొసైటీలో భారీఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మలూరు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మదన్ అదృశ్యమయ్యారు. ఆయన శుక్రవారం తీర్థహళ్లిలోని ఇంటి నుంచి బయలుదేరాడని సంబంధీకులు తెలిపారు. కారును నిలిపి ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా ఉంది. కారు లభ్యమైన జంబళ్లి అటవీ ప్రాంతంలో మదన్ కుటుంబసభ్యులు, స్థానిక ప్రజలు గాలిస్తున్నారు. పోలీసులు కూడా వెతుకులాట ప్రారంభించారు. టెక్కీకి చావుదెబ్బలు ● బెంగళూరులో దురాగతం కృష్ణరాజపురం: బెంగళూరులో చిన్న విషయానికే ఐటీ ఇంజనీరును బార్బర్‌షాపు యజమాని చావుదెబ్బలు కొట్టాడు. వివరాలు.. కృష్ణరాజపురంలో టెక్కీ టెరెన్స్ సందీప్‌ను నిందితుడు మునిరాజు కిరాతకంగా చావబాదాడు. శీగేహళ్లిలో పక్క భవనంలో కటింగ్ షాప్ నడుపుతున్న మునిరాజు, టెక్కీ నివసించే ఇంటి గోడకు నిత్యం మూత్రవిసర్జన చేసేవాడు. ఇది సభ్యత కాదని టెక్కీ అతనికి సూచించాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మునిరాజు వాగ్వాదానికి దిగి టెక్కీ ముఖంపై ముష్టిఘాతమిచ్చాడు. అతడు పడిపోగా తీవ్రంగా కొడుతూ రోడ్డు మీదకు లాక్కొచ్చాడు. అక్కడ కూడా కాళ్లు చేతులతో కొడుతూ రాక్షసంగా ప్రవర్తించాడు. టెక్కీకి ఓ కన్ను దెబ్బతినడంతో పాటు ముఖంపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇది సెప్టెంబర్ 5వ తేదీన, సాయంత్రం సుమారు 6:55 గంటలకు జరిగింది. అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయింది. కేఆర్ పుర పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. -
హెలికాప్టర్లలో తిరిగితే సమస్యలు తెలుస్తాయా?
అభివాదం చేస్తున్న బీజేపీ నాయకులు పాదయాత్రకు పూర్ణకుంభాలతో స్వాగతం పలుకుతున్న మహిళలుసాక్షి, బళ్లారి: తమ పాదయాత్ర ప్రభావంతోనే సీఎం డీకే శివకుమార్ ఉత్తర కర్ణాటక వైపు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఆరవ రోజు పాదయాత్ర ఉల్లాసంగా కొనసాగింది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మీదుగా కంప్లి వరకు కొనసాగిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీ అరుణ, జేడీఎస్ పార్టీ నేత బసవరాజ్ హొరట్టి, మాజీ మంత్రి శ్రీరాములు, స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో జనం పాల్గొనడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పాలాలు మధ్య రైతులను పలకరిస్తూ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పొలాలు మధ్య గొర్రెలు కాపరులు, యజమానులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విజయేంద్ర విలేకరులతో మాట్లాడారు. బీజేపీ పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి సర్కార్‌కు వణుకు పుడుతోందని తెలిపారు. ప్రజా సేవకుడు అని చెప్పుకునే సీఎం డీకేశీ మాటలు చూస్తుంటే నవ్వు వస్తుందని ఎద్దేవా చేశారు. సూటు, బూటు వేసుకుని హెలికాప్టర్లలో తిరిగితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజా సేవకుడు ఎలా అవుతారని మండపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం డీకేశీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ధ్వజం ఉత్సాహంగా కొనసాగుతున్న పాదయాత్ర -
ఉద్యోగ ప్రాప్తిరస్తు
ఉచిత భోజన వసతి హొసపేటె: హొసపేటె నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు కొందరు ఉచితంగా భోజన అందించి మానవత్వం చాటుకున్నారు. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా తమవంతు సాయంగా భోజనం పెట్టామని నిర్వాహకులు తెలిపారు. లక్ష్మి, షర్వి, శ్రీకాంత్, బసవరాజ్, కిరణ్ కుమార్, మంజు నాయక్, రేణుక నాయక్ పాల్గొన్నారు. బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని పలు పరీక్ష కేంద్రాల్లో సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు ఆదివారం ప్రశాంతంగా పరీక్ష నిర్వహించారు. మున్సిపల్ కళాశాల, మేధా కళాశాల, సన్జోన్స్ స్కూల్, గర్ల్స్, సరళా దేవి కళాశాల తదితర కేంద్రాలకు ఉదయమే అభ్యర్థులు చేరుకున్నారు. జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షకు 10 వేలకు పైగా అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రం వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులుహాల్టికెట్ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు హొసపేటె: కర్ణాటక సాయుధ పోలీస్ కానిస్టేబుల్ (సీఏఆర్/డీఏఆర్) నియామక రాత పరీక్ష ఆదివారం విజయవంతంగా జరిగింది. విజయనగర జిల్లాకు సంబంధించి హోస్పేట్లో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బారులు తీరారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం కర్ణాటక పరీక్షల అథారిటీ రాత పరీక్ష నిర్వహిస్తోందన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్ష పారదర్శకంగా జరిగిందన్నారు. ఉదయం సెషన్లో 4,406 మంది, మధ్యాహ్నం సెషన్లో 4,500 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లతో సహా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రశ్నపత్రాలు ఉంచే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుని రాకుండా తనిఖీలు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు. ప్రశాంతంగా కేఎస్పీ సాయుధ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష -
సాగునీరు విడుదల చేయాలని ఆందోళన
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు సాగునీరు విడుదల చేయాలని మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ డిమాండ్ చేశారు. ఆదివారం సింధనూర్ తాలుకా జవుళి గేట్ (జవుళీదిన్ని క్రాస్) వద్ద రైతులు మూడు గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ మాట్లాడుతూ.. నీటి లభ్యతను సరిగ్గా అంచనా వేయడానికి నిరంతరం గేజ్ నిర్వహణ చేపట్టాలని తెలిపారు. 54వ ఉప కాలువ కింది భాగంలో ఉన్న రైతులకు నీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 69 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు వదలాలంటే కాలువలోకి 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువ పైభాగంలో కొందరు అక్రమంగా అమర్చిన పైపుల ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారని.. వాటిని తక్షణమే తొలగించాలన్నారు. కొప్పళ ఇన్చార్జ్ మంత్రి శివరాజ్ తంగడిగి వెంటనే రాజీనామా చేయాలన్నారు. రహదారులకు మరమ్మతులు చేయరా? రాయచూరు రూరల్: యదగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని కరవే డిమాండ్ చేసింది. ఆదివారం వడిగెర క్రాస్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కరవే జిల్లా అధ్యక్షుడు భీమా పూజారి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు వచ్చినప్పటికీ రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు, శాసన సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా, తాలూకా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేయాలని కోరారు. లోకాయుక్తకు ఫిర్యాదు హుబ్లీ: నియమాలను ఉల్లంఘించి ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజాధనాన్ని వ్యర్థం చేశారని నవళగుంద ఎమ్మెల్యే ఎన్.హెచ్.కోనరెడ్డిపై లోకాయుక్తతో పాటు మానవ హక్కుల కమిషన్‌కు సామాజిక కార్యకర్త మాబుసాబ్ యరగుప్పి ఫిర్యాదు చేశారు. గత నెల 6న మంత్రి సంతోష్లాడ్తో ఎమ్మెల్యే కోనరెడ్డి నవళగుంద తాలూకాలో కరువు పరిస్థితులను పరిశీలించారు. ఆ సమయంలో కోనరెడ్డి ఎస్కార్ట్ వాహనం వాడుకున్నారని సామాజిక కార్యకర్త మాబుసాబ్ యరగుప్పి వీడియోలతో పాటు హోం శాఖకు ఫిర్యాదు చేశారు. అయితే హోం శాఖ ఆయన ఎస్కార్ట్ వాహనాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే వాడిన ఎస్కార్ట్ వాహన డీజల్ బిల్లు, సిబ్బంది వేతనాలతో పాటు వాహన మరమ్మతులను ప్రభుత్వమే వసూలు చేయాలి. ఇది ప్రజాధనం ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం అని మాబుసాబ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యపానంతో అనర్థాలు బళ్లారి అర్బన్: మద్యపానంతో పాటు అన్ని రకాల దుర అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, వ్యసన రహిత జీవనం సాగించాలని కళ్యాణ మహాస్వామి సూచించారు. ఆదివారం నగరంలోని బండిహట్టి కార్యక్షేత్రం కళ్యాణ స్వామి మఠంలో శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామాభివృద్ధి యోజన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసనాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన కుటుంబం ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. మద్యపానం వ్యక్తి ఆరోగ్యంపైనే కాకుండా కుటుంబం ప్రశాంతత, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మద్యానికి బానిస కావడం వల్ల కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయన్నారు. సంతోషకరమైన జీవనం సాగించాలని సూచించారు. కార్యక్రమంలో కళ్యాణ మఠం కన్నేరి మఠం సవితానంద మహాస్వామి తదితరులు పాల్గొన్నారు. సంతానం లేదని కార్మికుడు ఆత్మహత్య హోసూరు: సంతానం కలగపోవడంతో విరక్తి చెందిన కార్మికుడు ప్రాణాలు తీసుకున్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల మేరకు తిరుపత్తూరు జిల్లా పెరంపట్టు గ్రామానికి చెందిన శంకర్ (37), ఇతని భార్య సత్య (25), ఈ దంపతులకు గత ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. హోసూరు తాలూకా జీ.మంగలం సమీపంలోని ఓ కోళ్లఫాంలో పనిచేస్తున్నారు. పిల్లలు పుట్టలేదని బాధపడేవారు. విరక్తి చెందిన శంకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కరువు పరిహారంపై నోరు విప్పరా?
రాయచూరు రూరల్: బీజేపీ నాయకులు చేస్తున్న పాదయాత్రతో ఒరిగింది ఏమీ లేదు. వర్షాభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. రైతులకు అందించాల్సిన పరిహారం నోరు విప్పాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య సూచించారు. ఆదివారం ఆయన రాయచూరులో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో చర్చించి కరువు పరిహారంపై అందించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, కస్తూరి రంగన్ నివేదికలపై చర్చింకుండా విధాన సభలో సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. పంటలు వేసి నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.39 వేల కోట్లను సుప్రీం కోర్టు చివాట్లు పెడితే మంజూరు చేశారన్నారు. ఈ ఏడాది కూడా అలాగే చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు బోసురాజ్, నాగవేణి పాటిల్, శాలం తదితరులు పాల్గొన్నారు. -
వర్షాల కోసం ఎదురుచూపులు
● ముఖం చాటేసిన వరుణుడు ● వర్షాభావంతో ఎండుముఖం పడుతున్న పంటలు బళ్లారి అర్బన్: ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొంది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. వరుణుడు ముఖం చాటేడయంతో చెరువు, కుంటలు, వాగులు ఎండిపోయాయి. భూగర్భ జలవనరులు గణనీయంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులపై ఆధారపడిన రైతులకు సాగు నీటి కష్టాలు మరింత పెరిగాయి. గతంతో నీటితో కళకళలాడిన చెరువు, గుంటలు ప్రస్తుతం వటిపోయాయి. వర్షాలు కురవక పోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. విత్తనాలు ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఇప్పటికే పెద్ద మొత్తం ఖర్చు చేసిన రైతులు పంట చేతికందుతోందో లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో పంటల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సాగు నీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తుంగభద్ర జలాశయం కింద ఉన్న హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కాలువలకు నీరు వదలడంతో ఆయకట్టు రైతులతో కొంత ఉపశమనం లభించింది. అయితే వర్షంపై ఆధారపడిన రైతులు మాత్రం దిగులుతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
రాయచూరు రూరల్: ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు ప్రజా సేవా అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ పేర్కొన్నారు. ఆదివారం రాయచూరు తాలూకా యాపల దిన్ని ప్రభుత్వ హైస్కూలు మైదానంలో ప్రజా సేవా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకే పాలన అందిస్తామని తెలిపారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీపీఈఓ చంద్రశేఖర్ పవార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మంజునాథ్, ఆరోగ్య అధికారి యోగేష్ తదితరులు పాల్గొన్నారు. -
మౌనేషా చారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
రాయచూరు రూరల్: రాయచూరులోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. లింగసూగురు తాలుకా జనతా పూరి సర్కారీ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు మౌనేషా చారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును జిల్లా ఇన్చార్జ్ మంత్రి అజయ్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. విజయనగరం జిల్లా హర్పన హళ్లి తాలుకా బెన్నహళ్లికి చెందిన మౌనేషా చారి విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. ఈయన సేవలను గుర్తించిన అధికారులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. దుండగులను శిక్షించాలిరాయచూరు రూరల్: సిరవార తాలూకా హోక్రాని గ్రామంలో మలవిసర్జనకు వెళ్లిన అశ్విని అనే యువతిపై అత్యాచారం చేసి చంపేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సేన డిమాండ్ చేసింది. ఆదివారం టిప్పు సుల్తాన్ ఉద్యాన వనంలో ఆ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సినీ తారలు పూజా రమేష్, సంగీత దర్శకుడు మనోహర్ మద్దతు ఇచ్చారు. పోలీసులు ఈ కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. అశ్విని మృతదేహాన్ని బావిలో పడేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జిల్లాలో దళిత యువతులు, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. భూమానంద, రేణుక, రమే్‌ష్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పల్లకీలో ఊరేగిన శ్రీకృష్ణుడురాయచూరు రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో శ్రీకృష్ణుడి పల్లకీ ఉత్సవాలు వేడుకగా జరిగాయి. మహిళ సమాజ్ భక్తులు శ్రీకృష్ణుడి ప్రతిమ పల్లకీలో కొలువుదీర్చీ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. దారి పొడవునా భక్తులకు త్రైత సిద్దాంత భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో ఆదికర్త ఆచార్య ప్రభోదాంనద యోగీశ్వరులు, ఆయుర్వేద పతంజలి సంచాలకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రవచనాలతో మానసిక ప్రశాంతతరాయచూరు రూరల్: సమాజంలో మానవుడు సంస్కారంతో జీవించే విధంగా తన జీవన విధానం మార్చుకోవాలని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అభిప్రాయపడ్డారు. ఆదివారం కిల్లే బ్రహన్మఠంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన పఠన కార్యక్రమంలో భాగంగా జంగమ వటువులకు అయ్యాచార దీక్షలు బోధించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలకు పాండిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, పఠించడం వల్ల మానవుడు ప్రశాంత జీవనం గడపడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సీఎం డీకేశీకి సన్మానంహొసపేటె: ‘మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు హెచ్‌జీ రాములు నాకు తండ్రిలాంటి వారు. నేను స్టూడెంట్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి నేను ఆయన ఆశీస్సులు, మార్గదర్శకత్వం పొందుతూనే ఉన్నాను’. అని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ అన్నారు. శనివారం సాయంత్రం గంగావతి సమీపంలోని భూదేశ్వర ఆలయంలో మాజీ ఎంపీ హెచ్‌జీ రాములు ఆయన కుటుంబ సభ్యులు సీఎం డీకే శివకుమార్‌ను సన్మానించారు. -
కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం
బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లాలోని గాణిగ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కళ్యాణ కర్ణాటక గాణిగ జన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు బసవరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డులోని మున్సిపల్ కళాశాల మైదనంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజాసేవ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ తదితరులు హాజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. గాణిగ సమాజ అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో గాణిగ కులస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. బళ్లారి జిల్లాలో మాత్రం అవసరమైన పత్రాలను దరఖాస్తు చేసుకున్న వాటిని తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థులు స్కాలర్‌షిప్స్‌కు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు పొందలేక పోతున్నారన్నారు. మధ్యవర్తుల ద్వారా డబ్బు చెల్లిస్తే సర్టిఫికెట్లు అందుతున్నాయని పేర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి గాణిగ కులస్తులకు పథకాలు అందేలా చూడాలని కోరారు. -
నడిరోడ్డుపై భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్?
బనశంకరి: బెంగళూరులో నడిరోడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి -
నల్లనయ్య దర్శనం.. ఉడుపి జనసంద్రం
● రమణీయంగా జన్మాష్ణమి సంబరాలు యశవంతపుర: ఉడుపిలోని సుప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నయన మనోహరంగా జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి పర్యాయ మఠాధిపతి శిరూరు వేదవర్ధన తీర్థ, కృష్ణాపుర విద్యాసాగర తీర్థస్వామి గర్భగుడిలో కృష్ణుని విగ్రహానికి విశేష పూజలు చేశారు. తరువాత వేల సంఖ్యలో భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. శనివారం జన్మాష్టమిలో భాగంగా శ్రీకృష్ణ లీలోత్సవం, విట్లపిండి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఉట్టి వేడుకల్లో యువకులు పోటీలు పడ్డారు. అలాగే హుబ్లీలోనూ బాలలకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు, యువకుల ఉట్టి కొట్టే వేడుకలు ఆకట్టుకున్నాయి. -
వైభవంగా శ్రీకృష్ణ వసంతోత్సవం
రాయచూరురూరల్: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వసంతోత్సవం నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి మఠంలో రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు ఊంజల్ సేవలు నెరవేర్చారు. భక్తుల సందడి మధ్య శ్రీకృష్ణుడి వెన్నకుండ ఉట్టిని సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ కొట్టారు. పీడీఓపై సస్పెన్షన్ వేటు హుబ్లీ: విధి నిర్వహణలో లోపంతో పాటు నియమాల ఉల్లంఘన ఆరోపణలపై ధార్వాడ తాలూకా అళిగేరి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి పుష్పవతి మేదారపై సస్పెన్షన్ వేటు పరడింది. అక్రమ బిల్లుల సృష్టితో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా నకిలీ బిల్లులను సృష్టించిన ఆరోపణలపై పీడీఓపై ఈ చర్యలు తీసుకున్నారు. గ్రామస్తులే జిల్లా ఇంచార్జి మంత్రి సంతోష్‌లాడ్ దృష్టికి తెచ్చారు. ఆరోపణల నేపథ్యంలో మంత్రి సూచన మేరకు జెడ్పీ సీఈఓ భువనేశ్ పాటిల్ ఈ ఆదేశాలను వెల్లడించారు. స్కూటీని ఢీకొన్న కారు.. మహిళ మృతి రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సంతోష్ నగర్ జేకే స్కూల్ ఎదుట కారు స్కూటీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో స్కూటీపై వెనుక కూర్చున్న విజయనగర నివాసి రూపా సోలంకి (60) తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలింతం దక్కలేదు. స్కూటీ నడుపుతున్న గోపనకొప్ప లిఖిత చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌పై హుబ్లీ తూర్పు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయం రాయచూరు రూరల్: రపభుత్వ హాస్టల్ పైకప్పు పెచ్చులూడి విద్యార్థినిఽకి గాయమైన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం దేవదుర్గ తాలూకా గబ్బూరులో ప్రభుత్వ బాలికల హాస్టల్లో పైకప్పు పెచ్చు ఊడి పడడంతో పదవ తరగతి చదువుతున్న శృతి అనే విద్యార్థినికి తీవ్ర గాయమైంది. దీంతో బాలికను రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాంక్రీట్‌తో కూడిన పెళ్లలు మీద పడడంతో విద్యార్థులు అరుపులు, కేకలు వేస్తూ బయటికి పరుగు తీశారు. గది పైపెచ్చు ఊడుతోందని వార్డెన్ రాధికకు తెలిపినా ఫలితం లేక పోయిందని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఆమె నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని వారు ఆరోపించారు. నిరంతర అధ్యయనంతో కొత్త ఒరవడిరాయచూరు రూరల్: నిరంతరం అధ్యయనంతో ఆరోగ్య, వైద్య రంగాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ బీ.సీ.భగవాన్ పేర్కొన్నారు. నవోదయ వైద్య కళాశాలలో జరిగిన రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వ విద్యాలయం 218వ సిండికేట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు త్వరితగతిన ఫలితాలు పొందాలనే ఆశకు తగినట్లుగా విద్యనభ్యసించ లేకపోతు న్నారన్నారు. నవోదయ వైద్య కళాశాల చేస్తున్న సేవలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవలు చేయడం అభినందనీయమన్నారు. నవోదయ వైద్య కళాశాల రిజిస్ట్రార్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ దొడ్డయ్య, రామ్ మోహన్ గుప్త, ప్రకాష్, మహ్మద్ సలా ఉద్దీన్, సురేష్ బాబు, శివరాజ్ గౌడ, అపర్ణ, లక్ష్మి, మంజునాథ్‌లున్నారు. ప్రజల కోసం సేవా అభియాన్ కోలారు: ప్రజల ఇంటి ముందుకు పాలన వ్యవస్థను అందించడం ప్రజా సేవా అభియాన్ ముఖ్య ఉద్దేశమని తహసీల్దార్ వి.గీతా తెలిపారు. శనివారం ముళబాగిలు తాలూకా ఆవణి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రజా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వివిధ శాఖలకు చెందిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కే ఎన్ ఉమాశంకర్, తాలూకా పంచాయతీ ఈఓ ఎన్ వీ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
పంచ గ్యారంటీలకు సర్కారు మంగళం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కరువు ఛాయలు తీవ్రంగా నెలకొన్నాయనే నెపంతో కాంగ్రెస్ సర్కార్ పేదలకు, మహిళలకు జారీ చేసిన పంచ గ్యారెంటీ పథకాలకు మంగళం పాడిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు. శనివారం ఐదో రోజు బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారికి చేస్తున్న పాదయాత్రలో భాగంగా కారటగి మీదుగా గంగావతికి పాదయాత్రగా వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అమలు పరిచిన గ్యారంటీలకు తాజాగా పేర్ల నమోదు సాకుతో పేదల కడుపు కొట్టడాన్ని తప్పుబట్టారు. గృహజ్యోతి, గృహలక్ష్మి పథకంలో మరో మారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో వైపు పెన్షన్ల విషయంలో ఆన్లైన్లో సర్వర్ సమస్యలంటూ వేధించడం సరికాదన్నారు. నెల సరి ఆదాయాన్ని రూ.32 వేలుగా నిర్ణయించడం తగదన్నారు. ఎస్పీటీఎస్పీ నిధుల వినియోగంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. పాదయాత్రలో మాజీ మంత్రులు శ్రీరాములు, రాజుగౌడ, శాసన సభ్యుడు మానప్ప వజ్జల్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్, శరణమ్మ కామరెడ్డి తదితరులున్నారు. పాదయాత్రలో విజయేంద్ర ఆరోపణ -
విపక్షం పాదయాత్ర హాస్యాస్పదం
●మంత్రి అజయ్‌సింగ్ రాయచూరు రూరల్: జిల్లాలో బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారి వరకు చేస్తున్న పాదయాత్ర హాస్యాస్పదమని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరం వద్ద విలేకరులతో మాట్లాడారు. సర్కార్‌లో మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసినా పాదయాత్ర చేయడం హాస్యాస్పదమన్నారు. రెండు వారాల పాటు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కరువు, రైతులు, కస్తూరి రంగన్ నివేదికలపై చర్చ జరగకుండా అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగిలి కాలహరణం చేశారని ఆరోపించారు. -
ప్రాణం తీసిన అక్రమ సంబంధం
కోలారు: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడిని భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మాలూరు తాలూకా చిక్కతిరుపతి గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని సొణ్ణేనహళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (36) హతుడు. సురేష్ భార్యతో వెంకటేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మానసికంగా కుంగిపోయిన సురేష్.. ఎలాగైనా వెంకటేష్‌ను హతమార్చాలని పక్కా ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో సురేష్ తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి వెంకటేష్‌కు పూటుగా మద్యం తాగించారు. అనంతరం వెంకటేష్‌ను గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని నీటి సంపులో పడేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకుపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మవారికి గాజుల సింగారం
బనశంకరి: నగరంలో బనశంకరీదేవి ఆలయంలో అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రావణ శనివారం సందర్భంగా వేకువజామున సుప్రభాత సేవ తరువాత అర్చకులు అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అర్చనలు గావించి గాజులతో సుందరంగా సింగారించారు. మహిళా భక్తులు నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు. ఠాణాలో మహిళ ఆత్మహత్యాయత్నంబనశంకరి: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ న్యాయం జరగలేదని అక్కడే పురుగుల మందు తాగింది. ఈ ఘటన హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత జిల్లా కలబుర్గిలోని జేవర్గి తాలూకా నెలోగి పోలీస్‌స్టేషన్ లో శనివారం జరిగింది. యాతనూరు గ్రామానికి చెందిన రేవుబాయి భీమరాయ తళవార (40).. ఇంట్లో గొడవలపై నెలోగి ఠాణాలో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదన చెందిన రేవుబాయి అక్కడే పురుగుల మందు తాగి పడిపోయింది. ఆమెను కలబుర్గి జిల్లాసుపత్రికి తరలించారు. వెంటనే గ్రామస్తులు, బంధువులు చేరుకుని పోలీసుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి ఇబ్బంది ఏమిటని రేవుబాయి కుమారుడు నాగరాజ్ విలపించాడు. పొలంలో దారుణ హత్యమండ్య: పొలంలో యువకున్ని దుండగులు కొడవళ్లతో చంపి మృతదేహాన్ని చిక్కదేవరాయ కాలువలోకి పారేసి పరారైన ఘటన జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకా కట్టేరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన విశ్వేశ్వరయ్య కుమారుడు నవీన్‌కుమార్ (28) హతుడు. చెలువరాజు, కాంతరాజు అనే ఇద్దరు పొలంలో ఉండగా, నవీన్ కుమార్ అప్పుడే వెళ్లాడు. దీంతో ఆ ఇద్దరు కొడవళ్లతో నవీన్‌కుమార్ తల, చెవి, చేతులపై దాడి చేసి చంపి శవాన్ని కాలువలో పారేసి పరారయ్యారు. నవీన్‌కుమార్ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భయపడిన అతని తండ్రి పొలానికి వెళ్లి గాలించగా స్కూటర్ మాత్రమే ఉంది. దీంతో బంధువులు, గ్రామస్తులకు చెప్పగా అందరూ కలిసి వెతికినా జాడలేదు. కేఆర్ఎస్ పోలీస్ స్టేషన్ సీఐ వివేకానంద, ఎస్ఐ జగదీష్ సిబ్బందితో కలిసి కాలువలో గాలించగా మృతదేహం దొరికింది. దుండగులను అరెస్టు చేసినట్లు తెలిసింది. -
ధై ర్యంగా నడిపి.. గమ్యానికి చేర్చి..
హుబ్లీ: వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(ఎన్ఈకేఆర్టీసీ) బస్సు హెడ్‌లైట్ పని చేయక పోవడంతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ బస్సును ధై ర్యంగా నడిపిన ఘటన చోటు చేసుకుంది. హుబ్లీ నుంచి అణ్ణిగేరికి వెళుతున్న రాత్రి డ్యూటీ బస్సు హెడ్‌లైట్‌లో సాంకేతిక దోషం కనిపించింది. దీంతో ప్రయాణికులతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ ఆ బస్సును నడిపి సురక్షితంగా గమ్యం చేర్చిన ఘటన శుక్రవారం సంశి– గుడగేరి మార్గంలో జరిగింది. హుబ్లీ నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరి గుడగేరికి రాత్రి 9.20 గంటలకు చేరుకోవాలని బస్సు సంశి బస్టాండ్ సమీపంలోకి రాగానే ప్రధాన హెడ్‌లైట్ పని చేయక మొరాయించడంతో బస్సులోని ప్రయాణికులు కంగారు పడ్డారు. సంశి నుంచి గుడగేరికి ప్రయాణం సుమారు 20 నిమిషాలు పడుతుంది. దీంతో ప్రయాణికులు తమ మొబైల్ టార్చ్‌లను ఆన్ చేసి డ్రైవర్‌కు సహకరించడంతో బతుకు జీవుడా అంటు నిదానంగా బస్సును నడిపి క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు. కొందరు ప్రయాణికుల మండిపాటు కాగా ఈ వైనంపై కొందరు ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి వేళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే అత్యవసరమైన బస్సు సర్వీసులు డిపో నుంచి బయలుదేరే ముందు అవి సక్రమంగా, సాంకేతికంగా సిద్ధంగా ఉన్నాయా, లేదా? అని పరిశశీలించాలి. ఏ దోషాలు లేని బస్సులను మాత్రమే గ్రామీణ ప్రాంతాలకు నడపాలి. లేకుంటే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తథ్యం అని ప్రయాణికులు వాపోయారు. ఈ 12 కిలో మీటర్ల ప్రయాణానికి సుమారు ఓ గంట సేపు సమయం పట్టింది. ఈ ఘటనపై సంబంధిత డిపో కంట్రోలర్ రామనగౌడ మాట్లాడుతూ ఎండీ ఎం.ప్రియాంగ సూచన మేరకు ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇలాంటి ఘటనే గత జూలైలో కూడా కేకేఆర్టీసీ పరిధిలో చోటు చేసుకుంది. కలబుర్గి నుంచి చించోళికి వెళుతున్న బస్సు హెడ్లైట్లు మొరాయించడంతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ బస్సును నడిపాడు. ఆ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు డ్రైవర్‌తో పాటు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. హెడ్లైట్లు వెలగని బస్సును మొబైల్ టార్చ్ వెలుగులో నడిపిన డ్రైవర్ ఎన్ఈకేఆర్టీసీ బస్సుల అధ్వాన నిర్వహణకు నిదర్శనం ఈ ఘటన -
నిష్పక్షపాత దర్యాప్తునకు వినతి
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. ఆదివారం రాత్రి జిల్లాధికారి కార్యాలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మునియప్పతో సంచాలకుడు మారెప్ప, రవీంద్రనాథ్ మాట్లాడారు. అశ్వినితో పాటు భూమానంద, రేణుక, రమే్ష్ల మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. నరసింహులు, శివ కుమార్, బేరి, హేమరాజ్‌లున్నారు. ఉపాధ్యాయులు నిష్టగా పని చేయాలి రాయచూరు రూరల్: సమాజంలో ఉపాధ్యాయులు నిష్ట, నిజాయితీతో పని చేయాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, విద్యా శాఖ, నగరసభ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ఉపాధ్యాయులు నిష్ట, ప్రామాణికత, దక్షతతో విధులు నిర్వహించి ఉన్నత విద్యను బోధించాలన్నారు. 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులిచ్చి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బోసురాజు, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, జయన్న, జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున, సుఖదేవ్, విద్యాశాఖాధికారులు ఈరణ్ణ, చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం పదాధికారులు చంద్రశేఖర్ రెడ్డి, యంకప్ప, మొయిన్ ఉల్ హక్, యంకప్ప మూర్తిలున్నారు. -
సర్కారు బడి విద్యార్థులకు రిజర్వేషన్లు
సాక్షి,బళ్లారి: ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ రంగాల్లో 7 శాతం అదనపు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపట్టామని, అందుకు తగిన మార్గదర్శకాలు, దిశానిర్దేశాలను త్వరలోనే జారీ చేస్తామని సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఉమ్మడి బళ్లారి జిల్లా కూడ్లిగిలోని గుడేకోట రోడ్డులో ఇంటి ముంగిటకే ప్రభుత్వ పాలన అనే విధంగా ఏర్పాటు చేసిన ప్రజా సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన విద్యనందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు సమాజంలో అదే గౌరవం లభిస్తుందన్నారు. రాధాకృష్ణన్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత రాష్ట్రపతి పదవి దాకా ఎదిగారన్నారు. ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ల తరహాలో టీచర్లను కూడా టీఆర్ అని సంబోధించేలా దిశానిర్దేశం చేస్తామన్నారు. డాక్టర్లకు ముందు డీఆర్ అని ఎలా రాస్తారో టీచర్లకు కూడా టీఆర్ అని రాసి గౌరవం కల్పిస్తామన్నారు. ప్రజలే పాలకులు, అధికారం ఇచ్చిన ప్రజలు దేవుళ్లతో సమానం అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రజా సేవకుడిని– సీఎం హొసపేటె: రాజుల యుగం ముగిసింది. ప్రజాస్వామ్యం వచ్చింది. నేను ప్రజాసేవకుడిని అని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఉద్ఘాటించారు. శనివారం విజయనగర జిల్లా కూడ్లిగిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త ప్రజాసేవ శాఖను ప్రారంభించి ఆయన మాట్లాడారు. పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరిగే రోజులు పోయాయి. ప్రభుత్వ పరిపాలన నేరుగా ప్రజల గడపకే చేరాలనే పవిత్ర ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అని ఆయన వివరించారు. విధాన సౌధ, కలెక్టరేట్ లేదా తహసీల్దార్ కార్యాలయాల నుంచి పరిపాలన సాగిస్తూ అధికారులు ప్రజలకు దూరంగా ఉండటం సరికాదు. ప్రజాసేవా విభాగం ప్రజల సమస్యలను ఆలకించి, అక్కడికక్కడే ప్రత్యక్ష పరిష్కారాలను అందించడానికి కృషి చేస్తుందని అన్నారు. ప్రజల ముంగిటకే అధికారులు సామాన్యుడు ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా తాలూకా అధికారుల కోసం వెతుక్కుంటూ రాకుండా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను విని పరిష్కరించాలి. ఈ ఉద్దేశ్యంతోనే ప్రజా సేవా విభాగాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవస్థను రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లి పని చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో ఓ మహిళ నుంచి అర్జీని స్వీకరిస్తున్న సీఎం డీకే.శివకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం డీకే.శివకుమార్, చిత్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించడమే లక్ష్యం టీచర్లను ఇకపై డాక్టర్ల తరహాలో టీఆర్ అని సంబోధిస్తాం కూడ్లిగి ప్రజా సేవ కార్యక్రమంలో సీఎం డీకే శివకుమార్ -
జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
హుబ్లీ: జైలులోని అవ్యవస్థను ఖండిస్తూ ఖైదీలు ఆందోళన చేపట్టారు. ఆందోళనపై జైలు అధికారులు స్పందించక పోవడంతో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ధార్వాడ జిల్లా కేంద్ర కారాగృహంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని మీరజ్కు చెందిన మహేష్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అస్వస్థతతో ఉన్న ఆయనను జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జైలులో కనీస సౌకర్యాలు లేక ఖైదీలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ అవ్యవస్థను సరి చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజుల నుంచి ఆందోళన చేపట్టారు. ఖైదీల ఈ ఆందోళనను జైలు అధికారులు పట్టించుకోలేదు. హత్య కేసులో నిందితుడిగా గత ఏడాదిన్నరగా జైలులో ఉన్న మహేష్ ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ధార్వాడ ఉప నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మహిళ ఆత్మహత్యాయత్నం కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకా పోలీసు స్టేషన్లో ఖాకీల బాధ్యతారాహిత్యానికి అమాయక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. యాతనూరు గ్రామ నివాసి రేవుబాయి అనే మహిళపై పాతకక్షల నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన కొందరు అమానుషంగా దాడి చేశారు. అతనికి జరిగిన అన్యాయానికి న్యాయం కల్పించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కన్నీరు పెడుతూ ఈ మహిళ నెలోగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా ఆమెను రక్షించడానికి బదులుగా వేధించారు. దాడికి గురై తీవ్రంగా గాయపడినా కూడా ఎఫ్ఐఆర్ దాఖలుకు పోలీసులు కాలయాపన చేశారని ఆమె ఆరోపించింది. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఆ స్టేషన్ పరిధిలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె కలబుర్గిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై రేవుబాయి కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. -
నమో వేంకటేశా.. నమో తిరుమలేశా
మండ్య: చివరి శ్రావణ శనివారం సందర్భంగా అంతటా వైష్ణవ దేవాలయాల్లో విశేష పూజలు జరిగాయి. ఆలయాలకు నెలవైన మండ్య తాలూకాలోని కొమ్మేరహళ్లి నరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి నుంచే పచ్చని తోరణాలు, రకరకాల పూలతో అలంకరించారు. ● ఏకశిలా స్తంభపు నరసింహస్వామికి మహారాజుగా అలంకరించారు. ● హనియంబాడి రోడ్డులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 10 గంటల నుంచే భక్తాదులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. ● మండ్య నగరంలోని ప్రముఖ ఆలయాలైన లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం, శ్రీనివాస ఆలయం, హొసహళ్లి బడావణె శ్రీనివాస ఆలయం, బోవి కాలనీ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, నగరంలోని మైసూరు–బెంగళూరు రహదారిలో కల్లహళ్లి ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో శ్రావణశోభ ఉట్టిపడింది. దేవీదేవతలను దర్శించుకుని భక్తజనం పునీతులయ్యారు. ● మద్దూరు, మళవళ్లి, కేఆర్ పేటె, నాగమంగల, శ్రీరంగపట్టణ, పాండవపుర తాలూకాల్లోని విష్ణు ఆలయాల్లో పూజలు జరిగాయి. ● మేలుకోటె, శ్రీరంగపట్టణ, కేఆర్‌పేటె భూవరహనాథ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు సమర్పించారు. అగరలో బొమ్మనహళ్లి: నగరంలోని బొమ్మనహళ్ళిలోని అగరలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయుంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అలంకారం తరువాత భక్తులకు దర్శనం కల్పించారు. భక్తిశ్రద్ధలతో చివరి శ్రావణ శనివార పూజలు వైష్ణవ ఆలయాల్లో భక్తకోటి -
ప్రజల ముందుకే ప్రభుత్వం
యశవంతపుర: ‘ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీసే రోజులు అంతం కానున్నాయి. ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుంది’ అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ప్రజా సేవా శాఖ ద్వారా శనివారం తొలిసారిగా విజయనగర జిల్లా కూడ్లిగిలో అభియాన నిర్వహించారు. సీఎం డీకే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు. ప్రజలు అందజేసిన సమస్యలపై అధికారులు పరిష్కార చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది సీఎంకు తమ కష్టనష్టాలను ఏకరువు పెట్టారు. పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హాసన్‌లో రైతు ఆత్మహత్యాయత్నం పక్క భూమి యజమాని పెడుతున్న వేధింపులు తట్టుకోలేక రైతు ఒకరు మంత్రికి అర్జీ ఇచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన హాసన్‌లో కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. శనివారం ఉదయం ప్రజా సేవా అభియానలో భాగంగా ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చారు. హాసన్ తాలూకా హొసహళ్లికి చెందిన కరీగౌడ (35) మంత్రి కెఎం శివలింగేగౌడకు భూ వివాదంపై మంత్రికి అర్జీ సమర్పించారు. పక్క పొలంవారు తనను వేధిస్తున్నట్లు చెబుతూ అక్కడే పురుగుల మందును తాగాడు. ఇతర రైతులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. హాసన్ తాలూకా శాంతిగ్రాంలోని అంబేడ్కర్ వసతి పాఠశాల దయనీయ స్థితిలో ఉన్నట్లు పత్రికలలో వార్తలు రావటంతో మంత్రి శివలింగేగౌడ అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను మరో హాస్టల్‌కు తరలించి దానికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. 172 మంది విద్యార్థులను ఒక షెడ్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. సీఎం డీకే శివకుమార్ కూడ్లిగిలో ఘనంగా ప్రజాసేవా అభియాన్ ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకారం -
ప్రజా సేవతో సమస్యలకు చెక్
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో సీఎం డీకే శివకుమార్ దిశానిర్దేశంతో నూతనంగా ప్రారంభించిన ప్రజా సేవ ఉద్యమం ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే వేదిక కానుందని ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వారు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసిన ప్రజాసేవ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభించి మాట్లాడారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాల్లో పేరుకుపోయిన, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటి ముంగిటికే వచ్చి సమస్యలను నేరుగా ఆలకించి అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసేందుకు, జనం కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా నేరుగా జనం వద్దకే పాలన అన్న విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఏ పనికై నా సత్వర పరిష్కారం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ముగింపు పలకాలని, ఏ పనినైనా సాధ్యమైంత త్వరలో పరిష్కరిస్తారన్నారు. చట్ట పరిధిలో ఉన్న పనులన్నింటికీ సాధ్యమైంత వరకు పరిష్కారం చూపిస్తారన్నారు. ఇది సీఎం కలల ప్రాజెక్టు అని గుర్తు చేశారు. అధికారులు కూడా బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో అర్హుల పేర్లు కచ్చితంగా ఉండాలన్నారు. నగరంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాసేవ కార్యక్రమంలో జనం ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించి, అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు పాల్గొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలవనుంది ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి -
సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజల దరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు.శ శనివారం మాన్వి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవ పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలో ఇచ్చిన హామీల ప్రకారం లబ్ధిదారులకు పథకాలను అందించారన్నారు. ముఖ్యమంత్రి డీ.కే.శివ కుమార్ ఆదేశాల మేరకు ప్రజల వద్దకు పాలనను అందించాలనే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. కల్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తారన్నారు. జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి శరణమ్మ, జిల్లా ఆరోగ్య అధికారిణి నందితలున్నారు. దేవదుర్గలో శాసన సభ్యురాలు కరెమ్మ, గ్రామీణలో శాసన సభ్యుడు బసనగౌడ, సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, మస్కి శాసన సభ్యుడు బసన గౌడ తుర్విహాళ్ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజా సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. కలబుర్గిలో మంత్రి ప్రియాంక్ ఖర్గే, యాదగిరిలో మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, విజయపురలో ఎంబీ పాటిల్, బాగల్కోటెలో విజయానంద కాశప్పనవర్, బీదర్‌లో ఈశ్వర్ ఖండ్రే ప్రజా సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా ఇంచార్జి మంత్రి అజయ్‌సింగ్ ప్రజా సేవ కార్యక్రమానికి శ్రీకారం -
హనుమకు శ్రావణ పూజలు
మైసూరు: శ్రావణ మాసంలోని నాలుగవ శనివారం సందర్భంగా, నగరంలోని ఇర్విన్ రోడ్డులో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామికి అభ్యంజన తైలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పాభిషేకాలు గావించారు. హోమం నిర్వర్తించారు. వందలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. మోదీ రూ.15 లక్షలు ఇచ్చారా?: సిద్దుశివాజీనగర: ‘సీఎం పదవికి రాజీనామా చేయవద్దు సార్ అని నాకు చాలా మంది నాకు చెప్పారు. కానీ మాట ఇచ్చానని’ సిద్దరామయ్య తెలిపారు. శనివారం చిక్కమగళూరు జిల్లా కడూరులో మాట్లాడుతూ, తాను ఏదైన గుడికి వెళ్లినప్పుడు మోదీ.. మోదీ..అని అంటుండేవారు. మోదీ స్వాతంత్య్రం కోసం పోరాడారా? 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? అచ్చేదిన్ ఎక్కడ, రైతుల ఆదాయం రెండింతలు చేస్తానన్నారు చేశారా? 12 సంవత్సరాలు అయింది ప్రధాని పదవి చేపట్టి, నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్నారు వేశారా? పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఓటు వేయాలి? అని విమర్శల వర్షం కురిపించారు. మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారని విమర్శించారు. ఇక్కడి బీజేపీ నేత సీటీ రవి కాదు లూటీ రవి అని ఎద్దేవా చేశారు. తనది మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని అన్నారు. నగరంలో గ్యాంగ్ రేప్?● భర్త ఎదుట అఘాయిత్యం బనశంకరి: బెంగళూరులో నడిబొడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమైపె అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళూరుకు వందేభారత్ ట్రయల్ రన్ యశవంతపుర: బెంగళూరులోని యశవంతపుర– తీర నగరం మంగళూరు సెంట్రల్ల మధ్య వందేభారత్ రైలును ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. 16 బోగీలతో కూడిన వందేభారత్ రైలు ట్రయల్ శనివారం విజయవంతమైంది. యశవంతపుర రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన రైలును వివిధ ష్టేషన్ల గుండా ప్రయాణించి చూశారు. రైల్వే ఉన్నతాధికారులు ఈ రైలులో ప్రయాణించారు. సమస్యలు ఉంటే పరిష్కరించి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభించే అవకాశముంది. -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
ముగిసిన పడివడిక తాత ఉత్సవాలు
రాయచూరు రూరల్: మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో వెలసిన సద్గురు రాజయోగిని పడివడికి తాత ఉత్సవాలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య స్వామీజీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా వందలాది మంది భక్తుల సమక్షంలో మహా రథోత్సవం నిర్వహించారు. ఉచిత ఆరోగ్య శిబిరంబళ్లారి రూరల్: లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా వారోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. బళ్లారి ఎల్ఐసీ బ్రాంచ్–2లో శుక్రవారం ఎల్ఐసీ అధికారులు, సిబ్బందికి, ఏజెంట్లకు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో వైద్యులు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, కొలెస్ట్రాల్, కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ హర్షవర్దన్, పారా మెడికల్ సిబ్బంది మృత్యుంజయ గౌడ, వినీలా రెడ్డి, వన్నప్ప, ఎల్ఐసీ సిబ్బంది, ఏజెంట్లు పాల్గొన్నారు. ఘనంగా పుట్టి జాతర రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో శుక్రవారం మూన్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో పుట్టి జాతర వైభవంగా జరిగింది. లక్ష్మీ దేవి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పుట్టి జాతరను మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నారు. దేశం సుభిక్షంగా ఉండి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఏటా ఈ పుట్టి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. కాలువ నిర్మాణం పూర్తి చేయాలి రాయచూరు రూరల్: జిల్లాలోని నారాయణపుర 9ఏ కాలువ నిర్మాణం పూర్తి చేయాలని అఖిల భారత కిసాన్ సంఘటన నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కవితాళ అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం సంచాలకుడు బసవ లింగప్ప మాట్లాడుతూ.. నారాయణపుర కాలువల నిర్మాణాలు పూర్తి చేసి రైతుల భూములకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. కవితాళ, సిరవార, మాన్వి తాలుకాలను కరువు ప్రాంతాలుగ ప్రకటించాలని కోరారు. అనంతరం వివిధ సమస్యలపై నాడ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పౌర కార్మికులకు నియామక పత్రాలు హొసపేటె: నగర సభకు చెందిన 65 మంది పౌర కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే హెచ్.ఆర్.గవియప్ప శుక్రవారం పార్టీ కార్యాలయంలో నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పౌర కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పట్టణాభివృద్ధి నిధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, నగర సభ కమిషనర్ శివకుమార్ జిల్లా గ్యారెంటీ పథకం అమలు కమిటీ ఉపాధ్యక్షురాలు కే.బడవాలి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి కుమార్, మాజీ నగర పరిషత్ అధ్యక్షుడు గుజ్జల నింగప్ప, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువుల ఆరోపణ హొసపేటె: నగరంలోని 60 పడకల ప్రభుత్వ తల్లి, శిశు ఆస్పత్రిలో ఓ చిన్నారి మృతి చెందింది. అయితే వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాలు.. నగరానికి చెందిన వినయ్ భార్య మేఘనకు పురిటి నొప్పులు రావడంతో బుధవారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవ సమయంలో బిడ్డ తల మాత్రమే బయటకు వచ్చింది. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో పని మనుషులు ప్రసవం చేశారు. బిడ్డకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. తదుపరి చికిత్స కోసం బిడ్డను కొప్పళకు తీసుకెళ్లమని వైద్యులు వారిని పంపించారు. కొప్పళ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. మరణించిన శిశువును పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చిన బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుడిని తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్.లింగరాజు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అంగీకరించని కుటుంబ సభ్యులు చిన్నారి మరణానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. -
త్వరలోనే బస్సు చార్జీల పెంపు
సాక్షి బెంగళూరు: త్వరలో ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచనున్నట్లు రవాణా శాఖ మంత్రి బైరతీ సురేశ్ వెల్లడించారు. బెంగళూరులో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముడిచమురు ఉత్పత్తుల ధరలను పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ చార్జీలను పెంచాల్సి వస్తోందని తెలిపారు. గత 8 నెలల నుంచి క్రమంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా బస్సు ప్రయాణ చార్జీలను పెంచలేదని, దానివల్ల నాలుగు ఆర్టీసీ సంస్థలకు రూ.వేలాది కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని గుర్తు చేశారు. విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి అతుల్ తివారి నేతృత్వంలోని కమిటీ చార్జీల పెంపునకు సంబంధించి అధ్యయనం చేపట్టి ఇటీవలే నివేదిక సమర్పించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత కరువు పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలపై అధిక భారం మోపకుండా స్వల్ప ప్రమాణంలో బస్సు చార్జీలను పెంచుతామని తెలిపారు. మళ్లీ టోయింగ్ ప్రారంభం సాక్షి బెంగళూరు: నగరంలో ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్‌కు వ్యతిరేకంగా టోయింగ్ వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. వాహనాలను ఇష్టానుసారం నిలిపే వారిపై జరిమానాలతో విరుచుకుపడుతున్నారు. వారం రోజులుగా శాంతినగర చుట్టుపక్కల ప్రాంతాల్లో టోయింగ్‌ను ఎక్కువగా నిర్వహించారు. సెయింట్ జోసెఫ్ కాలేజీ, దివ్యశ్రీ చాంబర్స్ వద్ద నో పార్కింగ్ ఫలకాలను అమర్చారు. అక్కడ నిలిపిన వాహనాలను టోయింగ్ చేస్తున్నారు. బైక్‌లకు రూ. 1,150, నాలుగు చక్రాల వాహనాలకు రూ. 1,500 మేర జరిమానా విధిస్తున్నారు. కోలారు జిల్లాలో ఈడీ దాడులుకోలారు: కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరు తాలూకా జోడి కృష్ణాపుర గ్రామంలో మృత్యుంజయ అనే వ్యక్తి ఇంటిపై ఈడీ అధికారులు దాడి జరిపి సోదాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నగదు అక్రమ బదిలీకి సంబంధించి అతనిపై గతంలో బెంగుళూరు తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో కోలారు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు బెంగళూరు రూరల్ జిల్లా హొసకోటెలో ఇతనికి చెందిన ఇళ్లపై ఈడీ అధికారులు గురువారం రాత్రి వరకు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. కంతులు చెల్లించలేదని ఇంటికి తాళం యశవంతపుర: కరువుతో రైతులు ఇబ్బంది పడుతున్నా బ్యాంకర్లు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. రుణం కంతు చెల్లించలేదని ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది ఓ ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన హాసన తాలూకాలో జరిగింది. ఉగనె కొప్పలు గ్రామానికి చెందిన రైతు మహిళ సుమా 2023లో తన ఇంటిని క్వెటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.12 లక్షల రుణం తీసుకుంది. రెండేళ్లపాటు కంతులు చెల్లించి మూడు లక్షలు తీర్చారు. మొదట 9 శాతం వడ్డీ వేయగా అనంతరం దుబారు వడ్డీ వేశారు. దీంతో కంతులు చెల్లించడంలో జాప్యం జరిగింది. మరో వైపు తాకట్టు పెట్టిన ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలతో కూలిపోయింది. ఈక్రమంలో ఆ బ్యాంక్ సిబ్బంది ఆ మహిళా రైతుపై కోర్టులో కేసు వేశారు. ఇంటిని సీజ్ చేయాలని కోర్టు అదేశించింది. 12 రోజుల క్రితం బ్యాంక్ సిబ్బంది ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. ఆ గ్రామానికి చెందిన మరో మహిళ రత్నమ్మ, గురువయ్య దంపతులు ఇదే బ్యాంక్‌లో భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. మూడేళ్లపాటు నెలకు రూ.18 వేలు కట్టారు. వర్షాలతో వీరి ఇల్లు కూడా కూలిపోయింది. ఫైనాన్స్ సంస్థ వారిపై కూడా కేసులు వేసి భూమిని లాక్కోవటానికి యత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జైలు వార్డెన్‌పై ఖైదీల హత్యాయత్నం బనశంకరి: జైలు వార్డెన్‌పై రిమాండ్ ఖైదీలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఘటన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో జరిగింది. మంగళూరుకు చెందిన భజరంగదళ్ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య కేసు నిందితులు ఈ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈనెల 2న ఉదయం జైలు వార్డెన్ మంజునాథ్ హవేలి ఖైదీ నుంచి సమాచారం కోసం అనెక్స్–1 బ్యారక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో మహమ్మద్ ముజాయిద్ అనే ఖైదీ మంజునాథ్ హావేలిని దూషించి ముఖంపై రక్తం వచ్చేలా గాయపరిచాడు. అనంతరం అతడి వెంట ఉన్న అబ్దుల్ చౌహాన్, మహ్మద్ రిజ్వాన్, నయాజ్, కలందర్ షఫీలు కలిసి వార్డెన్‌ను గదిలోకి తీసుకెళ్లి దాడి చేసి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జైలు సిబ్బంది అతడిని కాపాడారు. దాడికి పాల్పడిన ఐదుగురు ఖైదీలపై కేసు దర్యాప్తులో ఉంది. -
ఇంటి స్థలాలకు భూమి కేటాయిస్తాం
కోలారు : పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవసరమైన భూమిని మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. పాత్రికేయుల భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సహకార సంఘ సభ్యుల ప్రథమ వార్షిక మహాసభను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాత్రికేయుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని మంజూరు చేయడం ద్వారా పాత్రికేయులకు న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుత పాత్రికేయుల భవనాన్ని నవీకరిస్తామన్నారు. కలెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర అమోఘమన్నారు. ఎమ్మెల్సీ అనిల్‌కుమార్, సమాజ సేవకుడు సిఎంర్ శ్రీనాథ్, పాత్రికేయుల గృహనిర్మాణ సహకారం సంఘం అధ్యక్షుడు మునిరాజు, పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ అధ్యక్షులు గోపినాథ్, రాష్ట్ర సంఘం కార్యదర్శి వాసుదవహొళ్ల పాల్గొన్నారు. -
సిరుగుప్పలో కదంతొక్కిన రైతులు
సాక్షి, బళ్లారి: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం ఆధ్వర్యంలో సిరుగుప్ప పట్టణంలో ఆందోళన చేపట్టారు. సిరుగుప్ప ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. బస్సులు, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది తీవ్ర వర్షభావ పరిస్థితులే నెలకొన్నప్పటికి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు కష్టాల్లో కురుకుపోయినప్పటికి సిరుగుప్ప తాలూకాను కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. వేదావతి, తుంగభద్ర నదిలో చుక్క నీరు లేక బీటలు వారాయన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. తక్షణం తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేయాలన్నారు. డ్యాంలో 95 టీఎంసీల నీరు ఉన్నా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆదేశాల మేరకు పరిహారం ఇవ్వాల్సిందే..
బళ్లారి రూరల్: ‘ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి తనకు పరిహారం చెల్లించాలి. లేకపోతే పోరాటం చేస్తా’ అని ఆర్.హెచ్.చెన్నబసవ స్వామి తెలిపారు. శుక్రవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గుగ్గిరహట్టి పంచాచార్య ఉన్నత పాఠశాలలో 1987 మే 30వ తేదీన ఉపాధ్యాయుడిగా చేరినట్లు తెలిపారు. పాఠశాల పాలక మండలి నియామక ఉత్తర్వులు కూడా అందజేసిందన్నారు. రెండు సంవత్సరాల తరువాత ఉజ్జయిని పాఠశాలకు బదిలీ చేశారని తెలిపారు. అయితే ఉజ్జయిని పాఠశాలలో పోస్ట్ లేదంటూ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగం పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. 37 ఏళ్ల పాటు జీతం లేకుండా జీవించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని ఉజ్జయిని పాఠశాల, డీడీపీఐకి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అయితే 8 నెలలు గడిచినా తనకు పరిహారం అందలేదన్నారు. సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయుడు సి.ఎం.గంగాధరయ్య,విశ్రాంత ప్రిన్స్‌పాల్ ఎ.ఎస్.ప్రభయ్య పాల్గొన్నారు. -
కరువుపై సీఎం వైమానిక సర్వే
యశవంతపుర/శివాజీనగర/హొసపేటె: కరువు పరిస్థితులపై సీఎం డీకే శివకుమార్ శుక్రవారం బాగలకోటె, విజయనగర, బళ్లారి జిల్లాల్లో వైమానిక సర్వే నిర్వహించారు. హెలికాప్టర్లో వివిధ ప్రదేశాలలో సంచరించిన సీఎం.. బాగలకోటె జిల్లా హునగుంద తాలూకా ధన్నూరు గ్రామంలో సూర్యకాంతి, ఉల్లి పంట నష్టాన్ని సమీక్షించారు. వానల కొరతతో ఎండిన వ్యవసాయ భూములను, హానికి గురై, కరువుతో ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని పరిశీలించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాంకాళ వైద్య, ఎంపీ డాక్టర్ జేసీ చంద్రశేఖర్ సీఎం వెంట పాల్గొన్నారు. కూడలసంగమలో పూజలు సీఎం డీకే శివకుమార్ బాగలకోటె జిల్లా కూడలసంగమలోని సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా నదికి వాయనం సమర్పించారు. రుణమాఫీ చేయాలి రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై విపక్షాలతో కలిసి కేంద్రంతో భేటీ కావాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. సదాశివనగరలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హుబ్లీ: జిల్లాలో మరో అన్నదాత అప్పులకు బలి అయ్యాడు. వివరాలు.. సాగు చేసిన పంట చేతికందక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా వరకేరి వీధికి చెందిన రైతు శంకరప్ప గూళప్ప (80) పొలంలోనే విషం తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని అణ్ణిగేరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గదగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక గురువారం మృతి చెందాడు. ఈ మేరకు అణ్ణిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సౌరశక్తి పథకాలపై అవగాహన రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాలు, దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన సాధించాలని కమిషనర్ శరణప్ప సూచించారు. శుక్రవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో సేల్కో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధాన సౌరశక్తి పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఎం సూర్యఘర్, రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రాంలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్, దివ్యాంగుల శాఖ అధికారిణి సరస్వతి, నరసింహ మూర్తి, సురేష్, హృతిక్ భండారి తదితరులు పాల్గొన్నారు. బైక్‌లపై పిచ్చి.. దొంగగా మారి హుబ్లీ: బైక్ నడపాలన్న ఆశ.. అలాగే జల్సాలకు అలవాటు పడిన బైక్ దొంగగా మారిన ఓ 20 ఏళ్ల యువకుడిని కొప్పళ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బళ్లారికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఇతడి నుంచి 16 బైక్‌లను జప్తు చేశారు. బైక్ మెకానిక్‌గా పని చేసే ఇర్ఫాన్ వాహనాలు లాక్ తీయడానికి ప్రత్యేకంగా మాస్టర్ కీ సిద్ధం చేసుకున్నాడు. కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలో ఇతడు వివిధ వాహనాలను చోరీ చేశాడు. పోలీసుల బైక్ కూడా ఇతడు చోరీ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. గత నెలలో కొప్పళ జిల్లా ఆస్పత్రిలో ఆవరణలో జరిగిన బైక్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. కార్యచరణ జరిపి నిందితుడు మహమ్మద్ ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు చోరీ చేసిన బైక్‌లను విడి భాగాలుగా విడదీసి కేవలం రూ.100, రూ.500లకు అమ్మే వాడు. కొన్ని సార్లు మొబైల్ ఫోన్లను తీసుకుని చోరీ చేసిన బైక్‌లను విక్రయించే వాడు. చిన్నప్పటి నుంచే చోరీ చేసే స్వభావాన్ని నేర్చుకున్న ఇతడిపై 8 పైగా కేసులు ఉన్నట్లు కొప్పళ ఎస్పీ సాహిల్బాగ్ర తెలిపారు. సమస్యలపై గళం విప్పాలి హొసపేటె: హొసపేటెలో నెలకొన్న సమస్యలపై శాసన సభలో గళం విప్పాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ నాయకులు ఎమ్మెల్యే గవియప్పను కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆర్.భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. 2015 నుంచి నిరంతర పోరాటం చేస్తున్నప్పటికీ పట్టణంలో ఇప్పటి వరకు భూమి లేని వారికి ఒక్క ప్లాట్ కూడా కేటాయించలేదన్నారు. నగరంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్‌పాస్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కొత్త జిల్లా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే అక్టోబర్‌లో నిరవధిక దర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎం.జంబయ్య నాయక్ కార్యదర్శి ఎన్.యల్లలింగ ఎం.గోపాల, జె.ఎం.చన్నబసయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజా సేవా అభియాన్ ● నేడు ప్రారంభించనున్న సీఎం డీకే శివకుమార్ హొసపేటె: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, పాలనను ప్రజల ముంగిటకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సేవా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలో శనివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, క్రీడల శాఖ మంత్రి డాక్టర్.జీ.పరమేశ్వర, ముజ్రాయ్, మత్స్య, ఓడరేవులు, అంతర్గత జల రవాణా శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కేఎస్.బసవంతప్ప హాజరుకానున్నారు. రాష్ట్ర గ్యారంటీ పథకాల అమలు అథారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీటీ పరమేశ్వర నాయక్ హాజరవుతారు. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్.ఎన్‌టి.శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. పైప్‌ల తొలగింపు రాయచూరు రూరల్: రాయచూరు, కొప్పళ జిల్లాల్లో తుంగభద్ర ఎడమ కాలువలో రైతులు అక్రమంగా వేసుకున్న పైప్‌లను తొలగించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల నుంచి గంగావతి పరిధిలోని సోమనాళ, మైలాపూర్, చిక్క డంకన్కల్, కారటిగిలో జేసీబీల సహాయంతో అక్రమంగా వేసుకున్న పైప్‌లను తొలగిస్తున్నారు. రైతులు అక్రమంగా పైప్‌లు పెట్టుకుంటే చివరి ఆయకట్టు భూములకు నీరు అందడం కష్టంగా మారిందన్నారు. జలచౌర్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
రాయచూరు రూరల్: జిల్లాలో మృతి చెందిన దళిత కుటుంబాలకు పరిహారం అందిస్తాం. సర్కార్ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదనలను పరిశీలించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మునియప్ప పేర్కొన్నారు. శుక్రవారం దేవదుర్గ తాలూకాలో పర్యటించారు. హద్దినాళలో భూమానంద, కరడకల్లలో రేణుక, సిరవార తాలుకా హోక్రాణిలో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్కార్ నుంచి బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందేలా చొరవ తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యార్థులు చదువుకునేందుకు హాస్టల్ సౌలభ్యం కల్పిండచం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శౌచాలయాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు బోసురాజ్, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, కరెమ్మ నాయక్. జిల్లా అధికారి పూవిత, ఏడీసీ శివానంద, అసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, సిరవార తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


