breaking news
Chittoor
-
రూ.63 లక్షల విలువైన ఫోన్ల అప్పగింత
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసులు దాదాపు రూ.63 లక్షల విలువ చేసే 315 సెల్ఫోన్లను బాధితులకు అప్పగించారు. మంగళవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుషార్ డూడి వివరాలను వెల్లడించారు. ఫోన్లను పోగొట్టుకున్న వాళ్లు, చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితులు వాటి వివరాలను పోలీసు శాఖకు వాట్సాప్‌లో ఫోన్–9440900004 అనే నంబర్‌కు హాయ్ అని పెట్టడం, సీఈఐఆర్ అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ఫోన్లను కనిపెట్టి.. అప్పగించడానికి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. జిల్లాలో వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తుచేసి బాధితుల వద్ద ఉన్న వివరాల ఆధారంగా ఫోన్లను దేశంలోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాల నుంచి తెప్పించినట్టు వెల్లడించారు. ఇందుకోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఐటీ విభాగం పనిచేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 13 విడతల్లో 4,106 సెల్ఫోన్లను బాధితులకు అప్పగించినట్టు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.8.55 కోట్లు ఉంటుందన్నారు. సెల్ఫోన్లను రికవరీ చేసిన సీసీఎస్ సీఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది బాపూజీ, రఘురామ్, శ్రీనివాస్ సర్టిఫికెట్లను అందచేసిన వారిని అభినందించారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సీఐ మహేశ్వర తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రజలకు కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని పోషకాహార, అనుబంధ ఆరోగ్య సేవల ఉప కమిషనర్ డాక్టర్ జోయాఅలీరిజ్వీ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన బృందం కలెక్టర్‌ను కలిసి సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్య సేవలు అందించే లక్ష్యంతో కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా టాటా డిజిటల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న వైద్య ఆరోగ్యశాఖ సేవలను కమిటీకి వివరించారు. ప్రతి కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఉండాలి జిల్లాలోని ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 411 గిరిజన కుటుంబాలకు నూతన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీపం 2 పథకంలో ఎల్పీజీ కనెక్షన్లు పొందేందుకు అర్హత, ఆసక్తి ఉన్న గిరిజన కుటుంబాలను ఎంపిక చేయాలన్నారు. జిల్లాలో ఎవ్వరూ గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉండకూడదని తెలిపారు. రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని ప్రతి ఎస్టీ కాలనీలను సందర్శించాలన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉందా...లేదా అని రీ వెరిఫికేషన్ చేయాలన్నారు. -
మిగిలిన పీజీ సీట్ల భర్తీకి కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో యాజమాన్య కోటాలో పీజీ సీట్లు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కన్వీనర్ కోటాలో మిగిలిన పీజీ సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తున్నామన్నారు. పీజీలో మిగిలిన రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, ఆంగ్లం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు 9182320973, 9849313989 నెంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపల్ కోరారు. నేడు విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి బుధవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గాంధీరోడ్డులో ఉన్న అర్బన్ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10న వాహనాల వేలం పుంగనూరు: మద్యం అక్రమ రవాణాలో సీజ్ చేసిన వాహనాలను పట్టణంలోని తమ కార్యాలయంలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ సీఐ సురేష్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల వారు నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. ‘ఎస్డీహెచ్ఆర్’లో 310 మందికి ఉద్యోగాలు తిరుపతి సిటీ : స్థానిక ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ, పీజీ విద్యా సంస్థలో మంగళవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో 310మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారని కళాశాల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఎమ్ఎన్సీ కంపెనీ ప్రతినిధులు చేపట్టిన ఇంటర్వ్యూల్లో రూ.6.2లక్షల ప్యాకేజీతో తమ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. కళాశాలలో అకడమిక్ విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్పై నిపుణులతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మహిళా చట్టాలపై అవగాహన అవసరం చౌడేపల్లె: మహిళల రక్షణ కోసం అమలయ్యే చట్టాలపై గ్రామీణ మహిళలకు అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మెంబరు డాక్టర్ రుఖియాభేగం సూచించారు. మంగళవారం ఆమె తొలుత బోయకొండ గంగమ్మను దర్శించుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో ఇటీవల నమోదైన మైనర్ బాలికల అదృశ్యంపై అందిన ఫిర్యాదులపై ఆరా తీశారు. నూనెముద్దనపల్లె గ్రామానికి చెందిన పోక్సో కేసు బాధితురాలితో మాట్లాడారు. న్యాయపరమైన సహాయం అందిస్తామని ఆమె భరోసా కల్పించారు. బూరగపల్లె, దుర్గసముద్రంలో మైనర్ బాలికల మిస్సింగ్ కేసుల విషయమై ఆరా తీశారు. రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ఆమినిగుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయడం లేదని, కుల్లిపోయిన కోడి గుడ్లు ఇస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సేవలు అందించడంలో ఐసీడీఎస్ సిబ్బంది విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూరగపల్లె అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అలాగే ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో బ్యాడ్‌టచ్, గుడ్‌టచ్ తోపాటు సమస్యలు వచ్చినప్పుడు మనోధైర్యం తో ముందుకెళ్లాలని సూచించారు. ఆమె వెంట ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, విశ్రాంత ఎస్పీ పీసీ స్వామి, సీఐ రాంభూపాల్, తహసీల్దార్ పార్వతి, సీడీపీఓ రాజేశ్వరి, ఎంపీడీఓ లీలామాధవి, ఎస్ఐలు నాగేశ్వరరావు, మణికంఠేశ్వరరెడ్డి, సూపర్వైజర్లు రాధ, సులోచన పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
గుడిపాల: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సెంట్రల్ అనేమియా ముక్తభరత్ డెప్యూటీ కమిషనర్ జోయా ఆలీ రిజ్వి తెలిపారు. మంగళవారం గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎటువంటి వైద్యసేవలందిస్తున్నారు, గర్భిణులను గుర్తించి ఆన్లైన్ నమోదు చేస్తున్నారా, ఎటువంటి పరీక్షలు చేస్తున్నారు.. తదితరాలపై ఆరాతీశారు. టీబీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు..? వారికి చికిత్సలు ఎక్కడ చేస్తున్నారు అని టీబీ అధికారిని అడగ్గా ఉచితంగా చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో చికిత్సలు చేయిస్తున్నట్టు తెలిపారు. ఆశావర్కర్లు తమకు ప్రభుత్వం గత ఐదేళ్ల క్రితం సెల్ఫోన్లు అందజేసిందని, ప్రస్తుతం ఏ ఒక్కటీ పనిచేయడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వసంతాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఆమె తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సెంట్రల్ టీం సభ్యులు అర్పిత, హరిక్రిష్ణన్, స్టేట్ ఇమ్యూనిజేషన్ ఆఫీసర్ దేవి, హెచ్డబ్ల్యూసీ ప్రోగ్రాం ఆఫీసర్ సుబ్రమణ్యం, ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సతీష్, స్టేట్ ఫ్యామిలీ ప్లానింగ్ అధికారి నిర్మలాగ్లోరితో పాటు గుడిపాల వైద్యాధికారులు సంధ్య, చంద్రమహేష్ పాల్గొన్నారు. వసంతాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో కేంద్ర వైద్య బృందం గుడిపాల: ఆశావర్కర్లతో మాట్లాడుతున్న జోయా ఆలీ రిజ్వి -
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన ముఖ్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పని మంగళవారం కేంద్ర బృందం సందర్శించింది. పది మంది కేంద్ర బృంద అధికారులు ఆస్పత్రిలో పరిశీలన చేశారు. రెండు బృందాలుగా విడిపోయి...ప్రసూతి విభాగంలోని ఆరోగ్యశ్రీ, గర్భవతుల సేవలు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. తర్వాత గర్భవతులతో మాట్లాడారు. వారికి అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల పనితీరుపై విచారించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉన్నారో..లేదో పరీక్షించారు. అనంతరం ఓ గర్భిణి చేతిలో ఉన్న పొరకపుల్లలు, వేపాకు ఏమిటని ప్రశ్నించారు. అనంతరం డీఐసీని సందర్శించారు. పిల్లలతో మాట్లాడారు. అక్కడి సేవలను అడిగి తెలుసుకున్నారు. వీరి రాకతో ముందస్తు ప్రణాళికలు ఫలించాయి. ఇన్నాళ్లు కనిపించని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అవగాహన బోర్డులు తళుక్కుమన్నాయి. అయితే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై చాలా మందికి అవగాహన లేదని కేంద్రబృంద అధికారులు గుర్తించారు. కచ్చితంగా వారికి ఆరోగ్య కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు హరికృష్ణన్, పార్థవిథాంపీ, సీవీఎస్ రాయుడు, రామచంద్రరావు, ఎల్బీఎస్హెచ్ దేవి, సతీష్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, ఎస్ఓ జార్జ్, డీపీఎంఓ ప్రవీణ ఉన్నారు. -
నీవా నదిలో పడి యువకుడి మృతి
గంగాధరనెల్లూరు: నీవా నదిలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గంగాధరనెల్లూరు మండల సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మంగళవారం కోట్రకోన పంచాయతీ, ముకుందరాయనపేట వద్ద ఓ గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గత నాలుగు రోజుల క్రితం కోట్రకోన పంచాయతీ, గ్యారంపల్లికి చెందిన ఓ వ్యక్తి కనబడడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించారు. మృతుడు గ్యారంపల్లికి చెందిన చిన్నబ్బ కుమారుడు సాయికుమార్‌గా కుటుంబీకులు ధ్రువీకరించారు. సాయికుమార్ (24) ట్రాక్టర్లకు ఇసుకపోసే కూలీగా జీవనం సాగించేవాడు. అతను కొద్ది రోజుల క్రితం ఉదయం బహిర్భూమికి వెళ్లి.. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. భారీ వర్షాలకు ఎన్టీఆర్ జలాశయం గేట్లు తెరవడంతో నీవా నదిలో నీటి ప్రవాహం అధికమై యువకుడు కొట్టుకుపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
గుట్టలో పంచాయతీ కార్యాలయం వద్దు
గుడిపాల: గుడిపాల మండలంలోని గట్రాళ్లమిట్ట పంచాయతీకి నూతనంగా రూ.32 లక్షలతో ప్రభుత్వం పంచాయతీ భవనం మంజూరు చేసింది. గ్రామస్తులు గ్రామం మధ్యలోని గ్రామకంఠం భూమిలో పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించాలని అధికారులకు సూచించారు. కానీ కొంతమంది కూటమి నాయకులు ఆ భూమిని కబ్జాచేయాలనే ఉద్దేశంతో గ్రామానికి దూరంగా ఉన్న గుట్టలో పంచాయతీ భవనాన్ని నిర్మిచాలని అధికారులపై ఒత్తిడి చేశారు. అధికారులు చేసేది లేక గుట్టలోని స్థలాన్ని చదును చేశారు. ఇక్కడ భవనం కట్టినట్లయితే గ్రామానికి దూరంగా ఉండడంతో పాటు తరచూ పాములబెడద ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై గ్రామస్తులందరూ కలిసి జిల్లా కలెక్టర్‌కు కూడా పీజీఆర్ఎస్లో అర్జీని సమర్పించారు. -
లారీకి బ్రేక్ ఫెయిల్!
● టీ స్టాల్లోకి దూసుకెళ్లిన వైనం ● డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు బంగారుపాళెం: లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి టీ దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన మండలంలోని మొగిలి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయి కావడంతో డ్రైవర్ వేగ నియంత్రణ చేయలేక ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టాడు. ఆపై రహదారి పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్, క్లీనర్‌ను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సీతమ్స్‌లో ఏం జరుగుతోంది?
అసలేం జరిగిందంటే..! చిత్తూరు కలెక్టరేట్ : అసలు సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏం జరుగుతోంది. అక్కడే ఎందుకు వరుసగా విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడు తున్నారు.. కళాశాల నిర్వాహకులు ఏం చేస్తున్న ట్టు..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఈనెల 31న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి యత్నించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన మరువక ముందే మంగళవారం మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. వారంలోపే రెండో ఘటన సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అక్టోబర్ 31న తృతీయ సంవత్సరం చదివే నందిని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన చోటు చేసుకుని వారం తిరగక ముందే తాజాగా రుద్రమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల నిర్వాహకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ వరుస ఘటన లు చోటు చేసుకుంటున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం కళాశాలకు సెలవు ప్రకటించారు. ఇదేంది పోలీసన్నో? చెట్టంత బిడ్డను కోల్పోయిన బాధలో రుద్రమూర్తి తల్లి తులసి, కుటుంబీకులు కళాశాల వద్దకు వెళ్లి నిర్వాహకులు, ప్రిన్సిపల్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పటికే తాలూకా సీఐ నిత్యబాబు అక్కడ విధుల్లో ఉన్నారు. లోనికి వెళ్లిన విద్యార్థి కుటుంబీకులు తమ గోడును చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థి కుటుంబంలోని ఓ మహిళను సీఐ నిత్యబాబు బలవంతంగా ఐదు మెట్లు కిందకు తోసివేశారు. మహిళ కాసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెకు నీళ్లు తాగించి ప్రథమ చికిత్స చేయడంతో తేరుకుంది. సమగ్ర విచారణ చేపట్టాలి సీతమ్స్ కళాశాలలో జరుగుతున్న వరుస ఆత్మహత్య ఘటనలపై సమగ్ర విచారణ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటన పై పలువురు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీకి ఫిర్యాదు చేశారు. కాగా సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ సీతమ్స్ కళాశాలలో వరుస ఆత్మహత్య ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారం రోజుల్లో రెండు ఆత్మహత్యాయత్నాలు జరిగాయంటే నిర్వాహకులు ఉన్నట్టా.. లేనట్టా అని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి, కూటమి ప్రభుత్వం ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకుని కళాశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలంటూ పోలీసులతో మాట్లాడుతున్న విద్యార్థి కుటుంబీకులు మహిళను పట్టుకుని నెట్టేస్తున్న తాలూకా సీఐ నిత్యబాబు -
శభాష్ రఘురామన్!
చిత్తూరు అర్బన్ : జాతీయ స్థాయి అవార్డు పొందిన పోలీస్ రఘురామన్‌ను ఎస్పీ తుషార్‌డూడి శభాష్ అంటూ అభినందించారు. మంగళవారం పోలీసు అతిథి గృహంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో నేషనల్ పోలీస్ గ్రూప్ ఆధ్వర్యంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌పై కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చిత్తూరు క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్ రఘురామన్ పాల్గొని క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తన దైన శైలిలో ప్రత్యేక ప్రతిభ చూపారు. ఇందుకు గాను ఆయనకు ఢిల్లీ డీఐజీ ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. ఉత్తమ అవార్డు పొందిన రఘురామన్‌ను ఎస్పీ అభినందించారు. నాటుతుపాకీ కలిగిన వ్యక్తి అరెస్టు బంగారుపాళెం: మండలంలోని బండ్లదొడ్డి గ్రామంలో అక్రమంగా నాటుతుపాకీ కలిగిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గ్రామానికి చెందిన లోకరాజు కుమారుడు రెడ్డెప్ప అడవి జంతువులను వేటాడేందుకు తుపాకీ వినియోగిస్తుండడంతో బసివిరెడ్డి మామిడి తోటవద్ద అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచినట్లు పేర్కొన్నారు. ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతంగా ముసలమడుగు
పలమనేరు: ముసలమడుగు కుంకీ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ఆ మేరకు మండలంలోని కుంకీ ప్రాజెక్టును మంగళవారం ఆయన సందర్శించారు. ఈ నెల 7, 8 తేదీలలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కుంకీ ఏనుగుల ప్రాజెక్టును పరిశీలించేందుకు విచ్చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడున్న కుంకీ ఏనుగులను ఆయన చూసి వాటి ద్వారా ఏనుగుల కట్టడిపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...కార్తీక మాసం కావడంతో ఇక్కడికి జనం ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని, ఇక్కడే వనమహోత్సవ కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్నారు. అయితే ఇక్కడున్న ఏనుగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. డీఎఫ్‌వో సుబ్బరాజు, సబ్ డీఎఫ్‌వో వేణుగోపాల్ పాల్గొన్నారు. -
టెట్‌తో వేధించొద్దు!
పూతలపట్టు: టెట్ పరీక్ష నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించాలని ఎస్టీ యూ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు బోధనలో అనుభవం కలిగి ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం వేధించడం తగదన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేసిన జీవో నం.36 వల్ల సుమారు లక్ష పదివేల మంది ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర నాయకులు పురుషోత్తం మాట్లాడుతూ మధ్యంతర భృతి 30 శాతానికి గ్గకుండా ఇవ్వాలన్నారు. ఆ సంఘ రాష్ట్ర కమిటీ కన్వీనర్ దేవరాజులురెడ్డి, నాయకులు చంద్రన్, సుబ్రమణ్యపిళ్లై, జగదీశ్వర పిళ్లై పాల్గొన్నారు. -
● అన్నా.. ఆకలి..!
‘మేము లక్ష్మీనగర్ కాలనీలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నాం. కంటి సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1 గంట అవుతోంది. ఆకలిగా ఉంది. ఎలా ఉండాలి ? వీళ్లు తీసుకోపోయి..వదలనంటున్నారు’ అంటూ విద్యార్థులు ఆకలి కేకలు పెట్టారు. చిత్తూరులోని జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రానికి మంగళవారం కేంద్ర బృందం పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆ కేంద్రం అధికారులు ముందస్తు ప్రణాళికలను సమర్థవంతంగా నిర్వర్తించారు. చికిత్స పేరుతో లక్ష్మీనగర్ కాలనీలోని పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. అక్కడికి కేంద్రబృందం వచ్చేంత వరకు వాళ్ల కడుపు మాడ్చారు. ఉదయం 9 గంటలకు వస్తే.. మధ్యాహ్నం 1.30 గంటకు కూడా గడప దాటనివ్వలేదు. దీంతో వారికి ఆకలి కేకలు మొదలయ్యాయి. నీరసించిపోయిన పిల్లలను సాక్షి పలకరించింది. ఎందుకని ప్రశ్నించగా.. విషయాన్ని చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 1 గంట అవుతున్నా తీసుకోపోయి వదలంటున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఆకలిగా ఉంది అన్న.. అంటూ ఆవేదనకు లోనయ్యారు. – చిత్తూరు రూరల్ (కాణిపాకం) -
నిర్వాహకులు సమాధానం చెప్పాల్సిందే
సీతమ్స్ కళాశాల నిర్వాహకులు తనకు సమాధానం చెప్పి తీరాలని విద్యార్థి రుద్రమూర్తి తల్లి తులసి డిమాండ్ చేశారు. కళాశాల వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. హెచ్‌వోడీ యువరాజులు తమకు సమాధానం చెప్పాలన్నారు. తన బిడ్డ ప్రాణం పోయినా కళాశాల నుంచి ఒక్కరు కూడా తనకు సమాచారం ఇవ్వలేదనప్నారు. వారం రోజులు ముందు ఆ హెచ్‌వోడీతో మాట్లాడి వెళ్లినట్లు చెప్పారు. తన బిడ్డ మూడో అంతస్తు పై నుంచి దూకేంత మూర్ఖుడేం కాదన్నారు. కచ్చితంగా కళాశాలలో ఏదో జరిగిందన్నారు. లోపలికి వెళ్లి అడిగినందుకు పోలీసు కిందకి తోసేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. చదవకపోతే మంచి మాటలతో చెప్పాలే కానీ హింసించడం ఏమిటని ప్రశ్నించారు. -
హాస్టల్ విద్యార్థులపై వాచ్మెన్ వికృత చేష్టలు
తిరుపతి: తిరుపతిలో దారుణం జరిగింది, చెన్నారెడ్డి కాలనీలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వాచ్మెన్ హరిగోపాల్ విద్యార్థులపై పైశాచిక దాడి చేశాడు. హాస్టల్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి విద్యార్థులను గదికి పిలిపించుకుని బ్లూఫిల్మ్స్ చూపించి వికృత చేష్టలు చేస్తూ అసాంఘిక శృంగారంకు పాల్పడ్డాడు.విద్యార్థులు భయంతో విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో సదరు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక దాంతో వాచ్మెన్ చేసిన అసాంఘిక శృంగారంపై హాస్టల్ వార్డెన్ ముని శంకర్ దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు.వెంటనే ఈ విషయంపై అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీలో ఏడువేల మందికి ఉద్యోగోన్నతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆర్టీసీలో ఏడువేల మందికి పదోన్నతులు కల్పించనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమ వారం చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండులో ఉద్యోగుల వైద్యశాల ప్రారంభోత్సవం చేశారు. మంత్రి ఈ వైద్యశాలను ప్రారంభించి మొక్కలు నాటారు. రూ.54.51 లక్షలతో ఈ భవన నిర్మాణం చేపట్టామన్నారు. ఇది విశ్రాంతి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగకరమన్నారు. త్వరలో అన్ని డిపోలలో ఎలక్ట్రికల్ బస్సులు నడపడానికి చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 16 నెలల కాలంలో సుమారు 1,450 బస్సులు కొనుగోలు చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె.నారాయణరావు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, ఆర్టీసీ జోనల్ మేనేజర్ జోన్–4 పూల నాగరాజు, జిల్లా ప్రజారవాణా అధికారి పి.రాము హాజరయ్యారు. -
అసభ్య ప్రవర్తనపై ఆగ్రహం
తిరుపతి సిటీ: ప్రొఫెసర్, సీనియర్లు విద్యార్థులు జూనియర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉన్నతాధికారులు చేసిన రాజీ ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఎట్టకేలకు సీనియర్ల సస్పెన్షన్, ప్రొఫెసర్‌పై విచారణ కమిటీ ఏర్పాటుకు హామీతో శాంతించాయి. ఎస్వీయూలో అధ్యాపకుల తీరు మారలేదు. కూటమి ప్రభుత్వ ఏర్పడిన నాటి నుంచి విద్యార్థినులపై లైగింక వేధింపులు శ్రుతి మించాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్వీ యూ జరిగిన ఘటన విద్యార్థి లోకాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సైతం వర్సిటీలో ఏమి జరుగుతోందో అర్థం కాక హుటహుటిన వర్సిటీకి చేరుకున్నారు. ఏడాదిగా వర్సిటీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తక్షణం చర్యలు తీసుకోవాలి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారని, సీనియర్ విద్యార్థులతో ర్యాగింగ్ చేయిస్తున్నారని నలుగురు విద్యార్థినులు సోమవారం రిజిస్ట్రార్ భూపతి నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గుట్టుచప్పు డు కాకుండా పరిష్కరించేందుకు లేడీస్ హాస్ట ల్ వార్డెన్లను పిలిపించి రాజీ చేయాలన్న ప్రయత్నం జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన ప్రారంభించాయి. రాజీకి పావులు కదిపిన అధికారులు ఈ నేపథ్యంలో రెక్టర్ అప్పారావు బాధిత విద్యార్థినులను తన చాంబర్లోకి పిలిపించి ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డితో రాజీ చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు రెక్టార్ చాంబర్ తలుపులు పగులగొట్టి లోపలికి దూసుకెళ్లారు. తరువాత రిజిస్ట్రార్, రెక్టార్ విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకున్నారు. వీసీ ఢిల్లీలో ఉన్నందున రిజిస్ట్రార్ ఆయనతో ఫోన్లో మాట్లాడి, ప్రొఫెసర్‌పై విచారణ కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తాం ఢిల్లీ నుంచి బుధవారం వీసీ వచ్చిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనను విరమించాయి. ఈ ఆందోళన సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థి నాయకులు గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఎన్ఎల్ఎస్ఏ, జీఎన్ఎస్, జేబీఎస్ఎఫ్ నాయకులు రవి, అక్బర్, అశోక్, వినోద్, చలపతి, జెన్నె మల్లికార్జున, సుందర్ రాజు,ప్రేమ్ కుమార్, శివశంకర్ నాయక్, షేక్స, తిరుమలేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బార్‌కు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు అర్బన్: పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణిలో మద్యం బార్ నిర్వహణకు గౌండ్ల సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొబేషన్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ సోమ వారం తెలిపారు. రూ.2 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు చెల్లించి ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే లక్కీ డిప్లో బార్ లైసెన్స్ కేటాయిస్తామన్నా రు. లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. వివరాలను సమీపంలోని ఎకై ్స జ్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఆయన కోరారు. డ్రోన్ సహాయంతో ఏనుగుల గుర్తింపు పులిచెర్ల(కల్లూరు): మండలంలో రోజూ ఎక్కడో ఒక చోట పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తూనే ఉన్నాయి. ఇవి అడవుల్లో ఏ ప్రాంతంలో ఉంటున్నాయో గుర్తించడానికి అటవీశా ఖ అధికారులు డ్రోన్ సహాయాన్ని ఉపయోగిస్తున్నారు. సోమవారం డ్రోన్లను ప్రయోగించగా చింతల వంక ప్రాంతంలో ఒక ఏనుగు ఉన్నట్లు గుర్తించారు. పొదలు దట్టగా ఉండడంతో వీటిని గుర్తించ లేక పోతున్నారు. మరి కొన్ని రోజుల్లో వీటి కదలికలు, స్థావరాలను గుర్తిస్తామని పనబాకం రేంజ్ ఎఫ్ఎస్ఓ భారతి, ఎఫ్బీఓ జమున తెలిపారు. తేనెటీగల దాడిలో మహిళకు తీవ్రగాయాలు చౌడేపల్లె: తేనెటీగల దాడిలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని కాటిపేరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. కాటిపేరికి చెందిన చౌడమ్మ(56) ఇంటి ముందు గల కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఉంది. ఆ సమయంలో చెట్టుపై నుంచి కొబ్బరి మట్ట పడడం, కొమ్మకు తేనెటీగల తుట్టె ఉండడంతో ఈగలు చౌడమ్మను చుట్టుముట్టాయి. గాయపడిన ఆమెను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు. -
‘స్వచ్ఛ’ బడి
కుప్పం: పాఠశాలల్లో త్వరలో స్వచ్ఛ బడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే.పట్టాభిరామ్ తెలిపారు. ఆయన సోమవారం కుప్పంలో పర్యటించారు. అనంతరం కడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీలో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. 130 ఈ–ఆటోల ద్వారా చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టువివరించారు. కడా పీడీ వికాస్ మర్మత్ పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్‌కు 47 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 47 ఫిర్యాదులు అందాయి. అర్జీలను ఎస్పీ తుషార్ డూడీ స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. -
ఎమ్మెల్యే ఫొటో లేదు.. చించేయండి!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆర్టీసీలో ఫ్లెక్సీ చిచ్చురేపింది. ఎమ్మెల్యే వర్గానికి కోపం తెప్పించింది. దీంతో ఆ ఫ్లెక్సీ చిత్తయ్యింది. ప్రొటోకాల్ పాటించలేదని..ఆ వర్గం చిర్రెత్తిపోయింది. వేదికపై ఉన్న ఫ్లెక్సీని పీకేసింది. అధికారుల తీరుపై మండిపడింది. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండులో సోమవారం ఆర్టీసీ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ తరుణంలో అక్కడ పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి ఫొటో మాత్రమే పెద్దదిగా వేశారు. అసలు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఫొటో వేయలేదు. దీంతో చిర్రెత్తి పోయిన ఎమ్మెల్యే అనుచరులు ఆక్రోశంతో ఊగిపోయారు. నూతన భవన ప్రారంభోత్సవానికి ముందు ఆ ఫ్లెక్సీని చించి పడేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రొటో కాల్పాటించడం తెలియదంటూ... ఆగ్రహానికి గురయ్యారు. ఆర్టీసీ అధికారులు ప్రొటోకాల్ పాటించడంలో ఏకపక్షంగా వ్యహరించారని పలువురు భగ్గుమన్నారు. ఆర్టీసీ యూని యన్లు సైతం ఇది సరికాదని మండిపడ్డాయి. -
పరిష్కారం కాని రోడ్డు సమస్య
తమ పూర్వీకుల కాలం నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు సమస్య పరిష్కారం కావడం లేదని గంగాధరనెల్లూరు మండలం, అంబోధరంపల్లి దళితవాడ వాసులు రవి, విభూషణం, దేవేంద్రన్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద తమ సమస్యను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. వారు మాట్లాడు తూ తమ గ్రామంలో 300 దళిత కుటుంబాలున్నాయన్నారు. దళితవాడ నుంచి వెళ్లాలంటే దాదాపు 150 మీటర్లు పొడవు వరకు చెరువు నీళ్లు రోడ్డు పై ప్రవహిస్తున్నట్లు తెలిపారు. మనిషి మునిగిపోయే లోతులో నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్య ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్నట్లు తెలిపారు. పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు ముగ్గురు ఎంపిక
గంగాధర నెల్లూరు : రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలకు ముగ్గురు ఎంపికై నట్టు ఎంఈఓ ఆంజనేయులుశెట్టి తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నియోజకవర్గ స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించగా.. అందులో ఆరుగు విజేతలుగా నిలిచారన్నారు. మరళా వారికి క్విజ్ పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి పోటీలకు ముగ్గురిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇందులో కార్వేటినగరం కత్తెరపల్లి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పీ.శశిర ప్రథమ స్థానం, డీఎం పురం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి గోవర్దన్ ద్వితీయ స్థానం, గంగాధర నెల్లూరు మండలం, కాల్లేపల్లి హైస్కూల్ విద్యార్థి టీ.లిఖిత్ తృతీయస్థానంలో నిలిచారని చెప్పారు. ఈ విద్యార్థులు ఈనెల 24, 25 తేదీలలో అమరావతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలకు వెళ్లనున్నట్టు తెలిపారు. జీడి నెల్లూరు హెచ్ఎం సుబ్బరామయ్య పాల్గొన్నారు. -
సొమ్ము భద్రమేనా?
చిత్తూరు అర్బన్: బ్రిటీష్ కాలంలో చిత్తూరులోని పోలీసుశాఖలో సొసైటీ ఏర్పాటుకు బీజం పడింది. 1927లో ప్రారంభమైన ఈ సొసైటీ దాదాపు 98 ఏళ్లు పూర్తిచేసుకుంది. పోలీసు ఉద్యోగం చేసే కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకు వారికి వచ్చే వేతనాల్లో కొద్ది మొత్తాన్ని ప్రతినెలా సొసైటీలో సేవింగ్స్ చేసుకుని సభ్యులుగా చేరుతారు. ఇలా వందలాది మంది నుంచి సేకరించిన నిధులను పోలీసుల కుటుంబ, వ్యక్తిగత అవసరాలకు రుణంగా ఇస్తారు. రుణం తీసుకున్న వ్యక్తి, స్వల్ప వడ్డీతో కలిపి ప్రతినెలా కంతుల రూపంలో (ఈఎంఐ) చెల్లిస్తారు. దాచుకున్న సేవింగ్స్‌కు సొసైటీ వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఈ మొత్తం లావాదేవీలు బ్యాంకులోనే జరుగుతాయి. ప్రస్తుతం చిత్తూరు పోలీసుశాఖ సహకార సొసైటీలో 1,652 మంది సభ్యత్వం కలిగి ఉండగా, కార్యదర్శితో కలిపి పది మంది వరకు సభ్యులుగా ఉన్నారు. ఏడుగురు డైరెక్టర్లు రిటైర్ అవడంతో నామమాత్రపు కార్యవర్గంతో సొసైటీ నడుస్తోంది. ముందుచూపు అవసరం ప్రస్తుతం సొసైటీలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఎవరూ చెప్పలేకపోయినా.. రూ.కోట్లలో సేవింగ్స్ ఉండడం వల్ల ముందుచూపు అవసరమనే వాదన వినిపిస్తోంది. సొసైటీ లెక్కలు చూసే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగి కాకపోవడంతో జవాబుదారీతనం ఎలా వస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లెక్కలన్నీ ఆన్లైన్ చేయాలని, ప్రతీ ఏటా డీసీవో (జిల్లా సహకార శాఖ) అధికారులచేత ఆడిట్ చేయించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులను పర్యవేక్షించడానికి సొసైటీకు ప్రభుత్వ ఉద్యోగిని నియమించాల్సిన అవసరం ఉందని పలువురు ఖాకీలు అభిప్రాయపడుతున్నారు. పైగా గత నాలుగు నెలలుగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న పోలీసులకు అధికారుల ఆదేశాల కోసం నిరీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కనిపించేలా లేదు. చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయం రూ.కోట్లలో పొదుపు జిల్లా పోలీసులు దాచి ఉంచిన సేవింగ్స్ ఇపుడు సుమారుగా రూ.27 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు రూ.24 కోట్ల వరకు పోలీసులు రుణాలు తీసుకోవడం, మిగిలిన రూ.3 కోట్ల వరకు బ్యాంకు ఖాతాలో ఉంది. తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లోని పోలీసు సొసైటీల్లో నిధుల దుర్వినియోగం అంశం తెరపైకి వచ్చింది. దీంతో చిత్తూరులో లావాదేవీలు, నిధులు సక్రమంగా ఉన్నాయా..? అంటూ ప్రతీ ఒక్క ఖాకీ ఆసక్తిచూపిస్తున్నారు. గత ఎస్పీ దీనిపై త్రిమెన్ కమిటీని నియమించారు. ఆర్ముడు రిజర్వు డీఎస్పీ, పోలీసు కార్యాలయ సహాయ పరిపాలన అధికారి, చిత్తూరు తాలూక ఇన్స్పెక్టర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. రికార్డులు పరిశీలించిన త్రిమెన్ కమిటీ రుణాల కోసం ఎవరు తొలుత దరఖాస్తు చేసుకున్నారు..? దరఖాస్తు చేసుకున్నవారిలో ఎవరికి ముందు రుణం ఇవ్వాలి..? అనే పారదర్శకత లేదని తేల్చారు. దీనికితోడు ఇక్కడ పనిచేసే ఓ వ్యక్తి జీతభత్యాలు ఏకధాటిగా పెరగడం, అతని కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉద్యోగం చేయడం పొరపాట్లేనని నివేదించినట్లు సమాచారం. పైగా ఇక్కడ పనిచేసేవాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోవడంతో రూ.కోట్ల సొమ్ముపై జవాబుదారీతనం ఎక్కడ ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
పీఎస్ తనిఖీ
పలమనేరు: రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యురాలు రుకియాభేగం పలమనేరు పోలీస్ స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేశారు. ఇక్కడి సీఐ మురళీమోహన్‌తో ఆమె మాట్లాడుతూ పీఎస్ లో మొత్తం ఎన్ని పోక్సో కేసులు నమోదయ్యాయి, మిస్సింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాల నియంత్రణ ఎలా ఉంది, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఎలా ఇస్తున్నారు..? అని అడిగి తెలుసుకున్నారు. తాము ఐసీడీఎస్ సిబ్బంది ద్వారా ఇలాంటి ఘటనలు జరిగిన వెంనటే స్పందించి బాల్య వివాహాలను ఆపి పేరెంట్స్‌కు అవగాహన కల్పిస్తున్నట్టు సిబ్బంది వివరించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,442 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,692 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.51 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
ప్రమాదకర రసాయనాలు
జిల్లాలో 47 పాలడెయిరీలు, మొరం, లింగాపురం, గండ్రాజుపల్లి సెజ్, రెడ్డిగుంట, చిత్తూరు లో హ్యాచరీలున్నాయి. వీటికి సంబంధించి శుద్ధి కోసం హెచ్‌సీఎల్, హెచ్2వోటు, ఫార్మాలిన్, బ్లీచింగ్లను వాడుతారు. ప్రస్తుతం వీటికన్నా శక్తివంతమైన ద్రావణాలు అందుబాటులో ఉన్నా యి. వీటితో పరిశ్రమలోని పరికరాలు, స్లాబు తదితరాలను శుభ్రం చేసి వృథా నీటిని నిల్వ ఉంచుతారు. అదే పాలడెయిరీలో అయితే యంత్రాలను శుద్ధి చేసేందుకు నైట్రిక్, క్యాస్టిక్లను వినియోగిస్తారు. దీంతోపాటు పాలకు ఫెరాకై ్సడ్‌లను వినియోగిస్తారు. ఓ పాలడెయిరీలో రోజుకు సుమారు లక్ష నుంచి మూడు లక్షల లీటర్ల దాకా వృథానీరు వెళుతుంది. ఈ నీటిని ఈటీపీ ద్వారా శుద్ధి చేసి వదిలిపెట్టాలి. కానీ పరిశ్రమల యాజ మాన్యాలు పక్కనే ఉన్న వాగులు లేదా వెరువుల్లోకి వదిలేయడంతోనే నీరు కలుషితమవుతోంది. -
సీతమ్స్ యాజమాన్యంపై ఆగ్రహం
చిత్తూరు కలెక్టరేట్ : ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న నందినీరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రుకియాభేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆమె ఆకస్మికంగా సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలను తనిఖీ చేశారు. సంజయ్‌గాంధీ నగర్లో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్ గురుకుల పాఠశాలను కూడా తనిఖీ చేశారు. సీతమ్స్ కళాశాల నిర్వాహకులతో ఆమె మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. విద్యార్థుల శ్రేయస్సు ఎంతో ముఖ్యమని తెలిపారు. ల్యాబ్ పరీక్ష రికార్డులు అందజేయలేదనే కారణంతో విద్యార్థినిని ల్యాబ్ పరీక్షకు అనుమతించకపోవడమేమిటని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల అధ్యాపకులు స్నేహపూర్వకంగా మెలగాలే కానీ కక్షసాధింపులకు పాల్పడడమేమిటని మండిపడ్డారు. విద్యార్థిని నందిని ఆరోగ్యం మెరుగుపడేంత వరకు కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల వెల్లువ
దివ్యాంగుల కడుపు కొట్టారు కూటమి ప్రభుత్వం పింఛన్లను తొలగించి దివ్యాంగుల కడుపు కొట్టిందని వికలాంగుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ ఆరోపించారు. గుడిపాల మండలంలో తొలగించిన పింఛన్‌దారులతో కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. పింఛన్ పొందుతున్న దివ్యాంగులపై ప్రతాపం చూపడమేంటని ప్రశ్నించారు. గుడిపాల మండలంలో అధిక సంఖ్యలో పింఛన్లను తొలగించారన్నారు. జిల్లాలో 498 మంది పింఛన్లను తొలగించారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళి, దివ్యాంగులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
బంగారుపాళెం: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(విలేజ్ హెల్త్ క్లినిక్) ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ఆరోగ్య బృందం సభ్యులు డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ నాగరాజ్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండలంలోని మొగిలి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సభ్యులు సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగులకు సరిపడా ముందులు అందుతున్నాయా ? లేదా ? అని అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు అందించాల్సిన వైద్యసేవలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా ఎన్సీడీసీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మురళి, మండల వైద్యాధికారి డాక్టర్ లోహిత్చెంగల్రాయన్ పాల్గొన్నారు. -
‘పాల’కూట విషం
పలమనేరు: నియోజకవర్గంలోని గంగవరం నాలుగురోడ్లు సెజ్‌లోని ఓ ప్రైవేటు పాలడెయిరీ వ్యర్థాలు పక్కనే ఉన్న తూముకుంట, వనము కుంట చెరువు ల్లో చేరి ఆ నీరు విషతుల్యమవుతోంది. ఇటీవల వర్షాలకు ఆ చెరువునీరు మరిన్ని చెరువులకు చేరింది. దీంతో పలు చెరువుల్లోని చేపలు, పాము లు చనిపోయి నీటతేలాయి. రంగుమారిని నీటిలో పశువులు సైతం దాహం తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నీటితో పంటలు సైతం పండని పరిస్థితి. భూగర్భ జలాలూ కలుషుతమయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి కారణంగా ఈ ప్రాంతంలోని పలు పాలడెయిరీల్లో వెలువడే విషతుల్యాలను శుభ్రం చేసే ఈటీపీ( ఎఫ్లుంట్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు లేకపోవడమే కారణమవుతోంది. గతంలోనూ ఎన్నో ఘటనలు 2108లో పలమనేరు సమీపంలోని వీహెచ్‌పీఎల్ (వెంకటేశ్వర హ్యాచరీ ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీ) నిర్లక్ష్యం కారణంగా ఏడుగురు బలయ్యారు. ఈటీపీ యూనిట్ లేకుండా అప్పట్లో విషమయమైన బావిలోకి దిగిన ఆ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అంతకు ముందు ఇదే మండలంలోని సముద్రపల్లి సమీపంలోని పాలడెయిరీలో ఈటీపీ లేక పక్కనే ఉన్న కౌండిన్య నదిలోకి విషపూరితమైన నీరు చేరి వైఎస్సార్ జలాశయం విషపూరితంగా మారి చేపలు మృతి చెందాయి. తాజాగా గంగవరం మండలంలోని నాలుగురోడ్ల వద్ద ఫామ్‌గేట్ అనే పాలడెయిరీ రోజుకు మూడు లక్షల పాలను ప్రొసె స్ చేస్తుంది. దీని కారణంగా విషమయమైన వ్యర్థా లు మూడు చెరువుల్లోకి చేరుతోంది. ఈ చెరువులు విషతుల్యమై అందులోని చేపలు, పాములు చనిపోయి నీట తేలాయి. చాలాచోట్ల ఈటీపీ యూనిట్లు లేవు సుమారు 150 మందికిపైగా పనిచేసే హ్యాచరీలో నిత్యం వేలాదిలీటర్ల హెచ్‌సీఎల్ కెమికల్స్ వృథానీరు వెళుతుంది. అదే పాలడెయిరీలో అయితే కెపాసిటీని బట్టు నిత్యం లక్షల లీటర్ల నీరు వృథాగా పోతుంది. ఈ మొత్తం వృథా నీటిని ఎప్పటికప్పడు శుభ్రం చెసేందుకే నిబంధనల మేరకు ఈటీపీ (ఎఫ్లుంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) వ్యర్థాల శుద్ధి యూనిట్ ఉండాల్సిందే. కానీ చాలా చోట్ల ఇవి లేవు. పొల్యుషన్ అధికారుల తీరు అంతంతే కంపెనీ చట్టాలమేరకు రిజిస్ట్రర్ చేసిన ఫ్యాక్టరీల్లో సురక్షిత నిబంధనలు, కార్మికుల క్షేమంపై పరిశ్రమల శాఖ, పొల్యుషన్ బోర్డు, కార్మికశాఖల పర్యవేక్షణ తప్పకుండా ఉండాలి. కానీ ఈ అధికారులు పట్టించుకోకపోవడంతోనే యాజమాన్యాలు ఆడిందే ఆటగా తయారవుతోందన్న విమర్శలున్నాయి. సంబంధిత శాఖలు పాలడెయిరీల్లో ఈటీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. చెరువులో మృతి చెందిన చేపలు పాల వ్యర్థాలను చెరువుల్లోకి వదిలి విషతుల్యం చేస్తున్న పాలడెయిరీ ఇదే -
కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ హత్యలే!
చిత్తూరు అర్బన్ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమేనని.. దీనికి ప్రభు త్వ హత్యలుగానే భావిస్తున్నామంటూ చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంసి.విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం, ఒక్కో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలడి డిమాండ్ చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆదివారం రాత్రి చిత్తూరు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త ఎంసి.విజయానందరెడ్డి మాట్లాడుతూ.. ఏకాదశి పురస్కరించుకుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తా రని ఆలయ ధర్మకర్త పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు మీడియాకు తెలిపారని.. అయినా నిఘా కొరవడటంతో అమాయకులైన భక్తులు మృతి చెందారన్నారు. తిరుపతి, సింహాచలం హిందూ ఆలయాల వద్ద జరిగిన తొక్కిసలాట.. భక్తుల మృతి మరువక మునుపే మరో ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి అమాయకులైన భక్తులు ప్రాణాలు విడుస్తున్నారన్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భక్తులకు తమ పార్టీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కాపాడుతుంటే.. ఈ ఘటన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి నకిలీమద్యం కేసులో సంబంధంలేకున్నా జోగి రమేష్‌ను అరెస్టు చేశారన్నారు. నకిలీ మద్యం కేసు సీబీఐకు అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన వెంటనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి.గాయత్రీదేవి, పార్టీ ఉద్యోగ–పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయసింహారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో హిందూ ఆలయాల వద్ద తొక్కిసలాటలు జరుగుతూ భక్తుల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జ్ఞానజగదీష్, సరళామేరి, అంజలిరెడ్డి, హరిణిరెడ్డి, హనీషారెడ్డి, ముత్తు, చందు, నారాయణ, బిందు తదితరులు పాల్గొన్నారు. -
చిత్రసీమపై ‘భానుమతి’ చెరగని ముద్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : భారతీయ చలనచిత్రసీమ కీర్తికి ‘పద్మభూషణ్’ డా భానుమతిని ఆకృతిగా నిలిచించిందని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షులు సి.నారాయణస్వామి, ఎం.వి.కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి సంయుక్తంగా వెల్లడించారు. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని ఓ అకాడమీలో ప్రముఖ సాహి తీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో విశ్వనటి భానుమతి శత జయంతి వేడుకల్లో భాగంగా గీతాలాపన, కవితార్చన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 62 సంవత్సరాల సినీప్రస్థానంలో మహోన్నత నటిగా భానుమ తి ఎనలేని కీర్తిని పొందారన్నారు. రచయితలు నందిపాటిచక్రపాణి, తోట గోవిందన్, కొఠారి వెంకటరత్నం మాట్లాడుతూ.. నాటి భారత రాష్ట్రపతి డా సర్వేపల్లి రాధా కృష్ణ్ణన్, మద్రాసు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.వి. రాజమన్నార్, కేంద్రమంత్రి డా బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి ఎందరో భాను మతి నటి విలక్షణతను, పాండిత్యాన్ని ప్రశంసించారన్నారు. ఆమె అభినయ కౌశల్యాన్ని, గాన మాధుర్యాన్ని ఈ యుగాంతం వరకూ తెలుగు ప్రేక్షకు లు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారన్నారు. రచయిత్రులు కె.సి. లావణ్య, జి. శాంతకుమారి మాట్లాడుతూ.. నాయికగా, గాయనిగా, రచయిత్రిగా, నిర్మాత గా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో అధినేత్రిగా పద్మశ్రీ భానుమతి కోట్లాది ప్రేక్షకుల మనస్సులపై ముద్రవేసి చిరస్మరణీయులయ్యారని పేర్కొన్నారు. ఆ అనంతరం ‘భానుమతి జాతీయ పురస్కారాలు–2025’ను పలువురికి సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రచయితలు ఎం. శ్రీరాజు, ఎస్. మునీంద్ర, ఎం. కన్నయ్యనాయుడు, పాడి రమేష్ బాబు, గాయనీ గాయకులు, సంఘసేవకులు పలువురు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పెద్దపంజాణి : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని నేలపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మారప్ప కథనం మేరకు వివరాలు.. మండలంలోని నేలపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు హరిబాబు(36) వ్యవసాయ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు ఆన్ చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బాధితుడికి భార్య హరిత, పిల్లలు ఉన్నారు. మద్యం షాపు వద్ద ఘర్షణ విజయపురం : మండలంలోని మద్య షాపు వద్ద తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు మద్యం తాగడానికి ఆదివారం గాండ్లకండ్రిగకు వచ్చా రు. యువకులు పీకలదాకా మద్యం తాగి బీర్ బాటిళ్లతో ఘర్షణకు పాల్పపడ్డారు. ఇందులో ఒక యువకుడు గాయపడినట్లు స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ మహేష్‌బాబు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుంటలో జారి పడి మహిళ మృతి చౌడేపల్లె : మండలంలోని పెద్దకొండామర్రి సమీపంలోని గొడుగుకుంటలో ప్రమాదవశాత్తు మహిళ జారిపడి మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దకొండామర్రి గ్రామానికి చెందిన ఒంటరి మహిళ లక్ష్మమ్మ(50) శనివారం సాయంత్రం గొడుగుకుంట కట్టపైకి వెళ్లిందన్నారు. చిన్నబావికుంట, గొడుగు గుంట మధ్య గల బండిబాట వద్ద నీటిలో నడిచి వెళ్తూ ప్రమాదవశాత్తు జారి దారి పక్కనే గల గుంతలోపడి మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అటువైపుగా వెళ్లిన గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఒంటరి మహిళ కావడంతో సర్పంచ్ జయసుధమ్మ, వైఎస్సార్సీపీ పార్టీ మండల కన్వీనర్ నాగభూషణరెడ్డి ఆధ్వర్యంలో మహిళకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకొన్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి మృత్యువాత యాదమరి : కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఓ అన్నదాతను చెరువు రూపంలో మృత్యువు కబళించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.స్థానికుల కథనం మేరకు..మండల పరిధి ఎగువ పాతపాల్యం గ్రామానికి చెందిన మురుగేశ్ కుమారుడు సి.ఏకాంబరం(54) పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఉన్న తన పొలం వద్దకు ఆదివారం వెళ్లాడు. కానీ బహిర్భూమికి వెళ్లిన అతడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలో ఉన్న గూటాల వంక చెరువు వద్దకు వెళ్లాడు. అయితే కాలకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మునిగిపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు పొలం వద్ద వెళ్లి చూడగా లేకపోవడంతో అనుమానంతో చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ నీటిలో శవమై తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువు గట్టుకు తీసుకొచ్చారు.మృతుడి భార్య పెద్ద లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వైభవం..కై శిక ద్వాదశి ఆస్థానం
తిరుమల: కై శిక ద్వాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆదివారం వైభవంగా ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామున 4.30 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం దేవదేవేరులను బంగారువాకిలి వద్దకు వేంచేపు చేసి శాస్త్రోక్తంగా పురాణ పఠనంతో కై శిక ద్వాదశి ఆస్థానం జరిపించారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదికోసారి కై శిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు లభించాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల చినజీయర్‌స్వామి, డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి మృతి
చౌడేపల్లె : చేపల వేట కోసం వెళ్లిన వ్యక్తి చెరువు నీటిలో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని 29 ఏ చింతమాకులపల్లెలో చోటుచేసుకుంది. స్థానికు ల కథనం మేరకు వివరా లు ఇలా.. గ్రామానికి చెందిన మున స్వామి(55) సమీపంలోని చెరువులోకి శని వారం రాత్రి చేపలు పట్టేందుకు గాలం తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదే చెరువు నీటిలో పడి మృతి చెంది తేలియాడుతుండగా కట్టపైకి వెళ్లిన యువకులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. రాత్రి చేపల కోసం వెళ్లి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు విలపించారు. బైక్‌లు ఢీ : వృద్ధుడి మృతి పుంగనూరు : ఎదురెదురుగా బైకులు ఢీకొన్న ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివారం పుంగనూరు పట్టణంలోని మేలుపట్ల వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె మండలం కాటిపేరికి చెందిన గంగప్ప(60) తన పనులు ముగించుకొ ని పుంగనూరు నుంచి బైక్‌లో కాటిపేరికి బయలు దేరగా మార్గమధ్యలో మేలిపట్ల వద్ద చౌడేపల్లె మండలం లద్ది గం గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు బైక్ లో పుంగనూరు వెళ్తూ గంగప్ప బైక్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బాలికలిద్ద రూ స్వల్ప గాయాలు కాగా గంగప్పకు తీవ్ర గా యాలు కావడంతో అతడిని స్థానికులు ఏరియా ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మదనపల్లెకు తరలించగా చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. కేసునమోదు చేసి బైక్‌లను సీజ్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడిపై పీడీ యాక్టు పలమనేరు : జిల్లా లోని పలు నేరాలకు పాల్పడి, శాంతిభద్రతలకు ముప్పుగా మారిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడు నియో జకవర్గంలోని పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందినన చంద్రబాబు(33)పై పీడీ యాక్ట్‌ను ఎస్పీ తుషార్ దూడి నమోదు చేసినట్లు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం తెలిపారు. ఇతడిపై పెద్దపంజాణి, పలమనేరు, పుంగనూరు, గంగవరం, పీలేరు, తిరుపతి, బెంగళూరులో ఆన్లైన్ బెట్టింగ్‌లకు సంబంధించిన పలు మోసం కేసులు నమోదైనట్లు తెలిపారు. యువతను బెట్టింగ్‌లోకి దింపి కోట్లాది రూపాయలను కొల్లగట్టినట్టు పేర్కొన్నా రు. అతడి మోసాలకు గురైన పలువురు అప్పులుపాలై ఆత్మహత్యలు సైతం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజాశాంతికి సాధారణ చట్టాలు ఇతడికి సరిపోనందున జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్‌కుమార్ సిఫారుస్సులతో పీడీ యాక్టును ఎస్పీ పెట్టారని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు దిగి మోసపోరాదని సూచించారు. -
ప్రైవేటు ఫీజులుం
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చట్టం అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. రెండు జిల్లాల్లో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు విద్యాహక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారు. ఈ చట్టం కింద ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో 3978 సీట్లను కేటాయించి ఉచిత ప్రవేశాలు కల్పించారు. ఈ విధానంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎటువంటి ఫీజులు పాఠశాలకు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్టీఈ విధానంలో ప్రవేశాలు పొందినా ఫీజులు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఫీజలు చెల్లించని విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా మండు టెండలో నిలబెట్టి తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇక్కడ మేం చెప్పిందే వేదం..అంటూ చట్టం గిట్టం జాన్తానై అంటున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల తీరుపై ప్రత్యేక కథనం. చిత్తూరు కలెక్టరేట్ : ఆర్టీఈ చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకు ఉచితంగా విద్యనభ్యసించే వెసులుబాటు ఉంటుంది. అయితే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రైవేటు/ కార్పొరేటు పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.లక్ష లాగేస్తున్నారు. వాస్తవంగా లెక్కలు వేస్తే పాక్షిక ఉచితమనే విషయం బోధపడుతుంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్ ఫండ్, స్పెషల్ ఫీజు, ఐఐటీ, నీట్ ఇలా రకరకాల బాదుడు మామూలే. ఈ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కఠిన చర్యలు తీసుకొనే అవకాశం విద్యాశాఖ అధికారులకు ఉన్నా ఆ అధికారాన్ని కాగితంపై పెట్టకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు ఆర్టీఈ అడ్మిషన్లను పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు ఒకరిపై మరొకరు వేసుకుంటున్నారు. విద్యాశాఖ, జిల్లా సమగ్రశిక్ష శాఖలు తమకు సంబంధం లేదంటూ ఒకరిపై మరొకరు చెప్పుకుంటున్నారు. నిత్యం వందల మంది తల్లిదండ్రులు ఫీజుల విషయం పై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన ఉండటం లేదు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు ఆర్టీఈ అడ్మిషన్లు పొందినప్పటికీ నష్టపోతున్నారు. పకడ్బందీగా పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులే తమకేం సంబంధం లేదన్నట్లు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. చులకన భావం.. వెనుక బెంచీలో కూర్చోపెట్టి.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆర్టీఈ అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పట్ల పలు యాజమాన్యాలు చిన్నచూపు చూస్తున్నాయి. అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వల్ల ఎలాంటి ఫీజులు రావనే ఉద్దేశంతో కొన్ని యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ ఆ విద్యార్థులను వెనుకబెంచీలలో కూర్చొబెట్టడం చేస్తున్నారు. మరికొన్ని బడుల్లో తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా ఫీజులు దోచేస్తున్నారు. విద్యార్థుల పట్ల తారతమ్యాలు సృష్టించి చులకన భావంతో చూడటంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆర్టీఈ అడ్మిషన్లను పకడ్బందీగా అమలు చేశారు. ప్రస్తుత కూటమి సర్కారు ఆర్టీఈ ప్రవేశాలు పొందిన విద్యార్థుల పట్ల ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్ల పాటు పకడ్బందీగా ఆర్టీఈ అడ్మిషన్లను అమలు చేసి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. ఇందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించేవారు. గతంలో ఎన్నడూ అమలు కాని విద్యాహక్కు చట్టాన్ని వైఎస్సార్సీపీ పాలనలోనే అమలు చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని నీరుగారుస్తోంది. ఫీజుల పేరుతో ముప్పుతిప్పలు ఆర్టీఈ అడ్మిషన్ల విషయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు మేం ఎవ్వరి మాట వినేది లేదన్నట్లు గా వ్యవహరిస్తున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని.. సుప్రీం కోర్టు నిర్దేశాలను పలు ప్రైవేటు/కార్పొరేటు పాఠశాలలు లెక్కచేయడం లేదు. విద్యార్థులను, తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెట్టి ఫీజుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. చట్టాన్ని కొన్ని పాఠశాలలు అమలు చేయకపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థుల నుంచి ఏదో ఒక రూపేణా ఫీజులు లాగేస్తున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. -
సాంకేతిక సమస్యలకు టీచర్లను బాధ్యులు చేయడం తగదు
చిత్తూరు కలెక్టరేట్ : ముఖ ఆధారిత హాజరు నమోదులో సాంకేతిక సమస్యలు ఏర్పడితే టీచర్లు బాధ్యులు ఎలా అవుతారని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ పర్యవేక్షణలో ఉండే ముఖ ఆధారిత హాజరు టెక్నాలజీలో సాంకేతిక లోపాలు ఎదురైతే టీచర్లను బాధ్యులు చేయడం తగదని విమర్శించారు. టీచర్లకు నోటీసులు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం 9.30 గంటలకు హాజరు వేయాల్సి ఉంటుందని అయితే ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం, సర్వర్ బిజీ కారణాలతో కొంత మంది లీప్ యాప్‌లో హాజరు వేసేందుకు ఆలస్యం అవుతోందన్నారు. ఒకే యాప్‌లో అనేక రకాల మాడ్యూల్స్ పొందు పరచడం వల్ల సాంకేతిక సమస్యలు తరచూ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి పలు మార్లు తీసుకెళ్లినా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా, సర్వర్లను అప్‌గ్రేడ్ చేయకుండా టీచర్లను భయాందోళనకు గురిచేసేలా నోటీసులు జారీచేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. సమయపాలనలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ఎటువంటి తప్పులేదని, అలాకాకుండా ఉద్దేశ పూర్వకంగా కక్ష్య సాధింపులకు పాల్పడటం తప్పన్నారు. ఉపాధ్యాయులకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
రైల్వే టికెట్ బుకింగ్‌లో మార్పులు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే టికెట్ బుకింగ్‌లో సంబంధిత శాఖ పలు మార్పులు తీసుకువచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన మార్పులు ప్రధానంగా సీనియర్ సిటిజన్లకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దింది. అలాగే ముందస్తు రిజర్వేషన్ గడువు విషయంలోనూ కీలక మార్పులు చేసింది. రైలు ప్రయాణ సమయంలో లోయర్ బెర్తులు కేటాయించాలని సీనియర్ సిటిజన్లు, మహిళలు కోరుతున్నారు. అలాగే ఆన్లైన్ బుకింగ్ సమయంలో అప్పర్, మిడిల్ బెర్తుల కావాలని పలువురు అడుగుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వేశాఖ మెరుగుపరచింది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనుంది. అయితే ఇది సీటు లభ్యతపై ఆధారపడి ఉంటుంది. బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోయినా, తర్వాత రైలులో సీటు ఖాళీగా ఉంటే టీసీ వారికి దిగువ బెర్తును కేటాయించవచ్చు. వినూత్నంగా నూతన ఆప్షన్ లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుక్ చేసుకోండి అనే ఆప్షన్ ఎంచుకుంటే రైలులో లోయర్ బెర్తులు అందుబాటులో ఉంటేనే టిక్కెట్లు బుక్ అవుతాయి. లేకుంటే బుకింగ్ ప్రాసెస్ అవ్వదు. లోయర్ బెర్త్ లేకుండా ప్రయాణించకూడదనుకునే వారికి వినూత్నమైన ఈ కొత్త ఆప్షన్ ఉపయోగపడుతుంది. అలాగే రైలు ప్రయాణికులు నిద్రించే, కూర్చునే సమయాలకు సంబంధించి స్పష్టమైన నియమాలను తీసుకువచ్చింది. నిద్ర సమయాలను ఇప్పుడు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలుగా నిర్ణయించింది. ఈ సమయంలో ప్రయాణీకులు తమకు కేటాయించిన బెర్తులపై విశ్రాంతి తీసుకోవచ్చు. పగటిపూట అసౌకర్యాన్ని నివారించడానికి అందరు ప్రయాణీకులు తమ సీట్లపై కేవలం కూర్చోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆర్ఏసీ టిక్కెట్లు కలిగిన వారికి.. పగటిపూట, సైడ్ లోయర్ బెర్తు ప్రయాణికులు, సైడ్ అప్పర్ బెర్తు బుక్ చేసుకున్న ప్రయాణికులు పంచుకుంటారు. కానీ రాత్రిపూట మాత్రం లోయర్ బెర్తున్న ప్రయాణీకుడు మాత్రమే కూర్చొనే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ గడువు తగ్గింపు ముందస్తు రిజర్వేషన్ గడువును రైల్వేశాఖ తగ్గించింది. గతంలో రైల్వే టిక్కెట్లను ప్రయాణ తేదీకి 120 రోజుల ముందుగానే బుక్ చేసుకునేందుకు అనుమతి ఉండేది. కానీ, ఇప్పుడు ఈ కాల వ్యవధిని కేవలం 60 రోజులకు తగ్గించారు. ఈ నిర్ణయం టికెట్టు రద్దు సమస్యలను తగ్గించడంతో పాటు బుకింగ్ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరిస్తుందని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. -
విడిదిపల్లిలో బాలుడి ఆత్మహత్య
పెనుమూరు(కార్వేటినగరం): మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన పెనుమూరు మండలం విడిదిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. విడిదిపల్లికి చెందిన రమేష్ కుమారుడు అరవింద్(17) అక్టోబర్ 24వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు కట్టిన పోలీసులు అతను తోటి విద్యార్థినితో కలసి వెళ్లి పోయాడని, ఇద్దరూ విజయవాడలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. ఇద్దరినీ పోలీసులు పెనుమూరుకు తీసుకొచ్చారు. ఇద్దరినీ వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో డిప్రెషన్‌కు గురైన అరవింద్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బాలిక బలవన్మరణం పెద్దపంజాణి : బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లావారిపల్లి గ్రామంలో ఆది వారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. చల్లావారిపల్లి గ్రామానికి చెందిన చంగలరాయ కుమార్తె లావణ్య(17) పలమనేరులోని ఓ ప్రవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శనివారం గ్రామానికి వచ్చిన కళాశాల బస్సు ఎక్కి తిరిగీ సాయంత్రం అదే బస్సులో ఇంటికి చేరింది. అయితే లావణ్య కళాశాలకు వెళ్లలేదనే సమాచారం తల్లిదండ్రులకు తెలియడంతో ఎందుకు కళాశాలకు వెళ్లలేదని మందలించారు. దీంతో ఆదివారం ఉదయం మనస్తాపం చెందిన బాలిక గ్రామ సమీపంలోని కొండపై చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇలా ఉండగా కుమార్తె మృతిపై అనుమానం ఉందని విచారించి న్యాయం చేయాలని బాలిక తండ్రి చంగలరాయ పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
గంగమ్మా.. దీవించమ్మా..
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. కోరిన కోర్కెలు తీర్చే గంగమ్మ ..అమ్మాతల్లీ.....బోయకొండ గంగమ్మ ఆశీర్వదించమ్మా అంటూ పూజలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆదివారం సెలవు కావడంతో అమ్మవారి దర్శనం కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అఽధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయంలో రద్దీతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనె దీపాలు, దీవెలతో మేళ తాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ప్రసాదాలను పంపిణీ చేశారు. -
రేపు అథ్లెటిక్స్, చెస్ ఎంపికలు
చిత్తూరు కలెక్టరేట్ : అథ్లెటిక్స్, చెస్ ఎంపిక పోటీలు ఈనెల 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ బాబు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అథ్లెటిక్స్, చెస్ ఎంపిక పోటీలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈనెల 4న ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా మదనపల్లి జెడ్పీ హైస్కూల్లో అథ్లెటిక్స్ అండర్–14, 17 బాల, బాలికల ఎంపికలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా చెస్ అండర్– 14, 17 బాల, బాలికల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అథ్లెటిక్స్ డివిజన్ స్థాయిలో మొదటి స్థానంలో ఎంపికై న వారు జిల్లా స్థాయి పోటీలకు అర్హులన్నారు. ఒక సెట్ అర్హత ఫాం లను తీసుకురావాలని ఆయన తెలిపారు. కిక్కిరిసిన కాణిపాకం కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు కావడంతో భభక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు పోటెత్తారు. క్యూలో జనం కిక్కిరిసిపోయారు. బారులు తీరిన భక్తజనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈవో పెంచల కిషోర్ జనం రద్దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇబ్బందులు లేకుండా చూశారు. నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం 3న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజర య్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థుల ఆధార్ అప్డేట్కు గడువు పొడిగింపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్డేట్కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల ఆధార్ అప్డేట్ను ఈ నెల 6 వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ను పూర్తి చేయించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు నామినల్ రోల్ యూడైస్‌లో తీసుకుంటారన్నారు. అపార్ ఐడీ, బయోమెట్రిక్ విద్యార్థులకు తప్పనిసరి అని తెలిపారు. ఈ ముఖ్యమైన విషయం ప్రతి హెచ్ఎం తప్పనిసరిగా ప్రత్యేక ప్రాధాన్యంగా భావించి అమలు చేయాలని డీఈవో ఆదేశించారు. -
● సాహోరే ‘బాహుబలి’
చిత్తూరు జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉండే ఓ ప్రైవేట్ పాఠశాలలో అరవింద్ అనే విద్యార్థి 2025–26 విద్యాసంవత్సరానికి ఒకటవ తరగతిలో ఆర్టీఈ విధానంలో అడ్మిషన్ పొందాడు. ఆ విద్యార్థి అడ్మిషన్ పొందుతున్నట్లు విద్యాశాఖ అధికారులు కేటాయింపు పత్రం సైతం ఇచ్చారు. అయితే ఆ పాఠశాల నిర్వాహకులు నిత్యం ఆ విద్యార్థిని ఫీజు చెల్లించలేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలుసార్లు ఇంటికి పంపించిన ఘటనలు సైతం ఉన్నాయి. తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం ఆర్టీఈ విధానంలో 15 మంది విద్యార్థులను కేటాయించారు. ఆ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం నుంచి ఫీజుల పేరుతో ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు. అయితే నిబంధనలను అతి క్రమించి ఆ పాఠశాల యాజమాన్యం పరీక్షలు నిర్వహించినప్పుడల్లా ఆ విద్యార్థులను ఫీజు చెల్లించలేదని తరగతి బయట నిలబెడుతున్నారు. ఈ విషయంపై ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించినా ఏ మాత్రం పట్టించుకోకుండా ఫీజు చెల్లించాలని ఇబ్బందులు పెడుతునే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల సమాచారం -
‘నాడి’తప్పిన పల్లె వైద్యం
విలేజ్ హెల్త్ క్లినిక్లూ అదేదారిలోనే.. జిల్లాలో పల్లె వైద్యం గాడి తప్పింది. వైద్యసేవలపై నిర్లక్ష్యం అలుముకుంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్య బృందం పల్లెల్లో కరువుతోంది. పలు ఆరోగ్య కేంద్రాలు ప్రజాసేవకు దూరంగా నిలిచాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై పర్యవేక్షణ కొరవడుతోంది. ప్రోగ్రాం ఆఫీసర్లు కుర్చీలకు పరిమితమవుతున్నారు. తద్వారా కార్యక్రమ నిర్వహణ పక్కదారి పడుతోంది. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలయ్యే పథకాల పనితీరుపై పరిశీలన చేపట్టేందుకు నేడు జిల్లాకు కేంద్ర బృందం రానుంది. కాణిపాకం : జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 462 విలేజ్ హెల్త్ క్లినిక్‌లున్నాయి. పీహెచ్‌సీల్లో ఇద్దరు డాక్టర్లతో పాటు 12 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉండాల్సి ఉంది. అయితే వీరిలో చాలా మంది బాధ్యతలను విస్మరిస్తున్నారు. ప్రజాసేవను తేలికగా తీసుకుంటున్నారు. ఈ కారణంగా పల్లెల్లో వైద్య సేవలు మొక్కుబడిగా మారాయని పల్లె జనం మండిపడుతోంది. పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం ప్రధానంగా పీహెచ్‌సీల్లో మందుల కొరత వేధిస్తోంది. ఆరోగ్య కేంద్రాలు తెరుచుకోవడం లేదు. ఉదయం 9 గంటలకు తెరవాల్సిన పీహెచ్‌సీలు 10 గంటలకు పైగా తెరుచుకుంటున్నాయి. డాక్టర్లు 10 గంటలకుపైగా వచ్చి వెళ్లిపోతున్నారు. కొందరు డాక్టర్లు గంటకే డుమ్మా కొడితే..మరికొందరు మధ్యాహ్నానికి జంప్ అవుతున్నారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు సైతం మధ్యాహ్నానికి గదికి తాళం పెడుతున్నారు. పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేయాల్సి ఉండగా...సాయంత్రానికి తలుపులు మూసుకుంటున్నాయి. రాత్రి సిబ్బంది అసలు ఉండడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సుఖ ప్రసవాల లక్ష్యం పూర్తిగా నీరుగారుతోంది. నీరుగారుతున్న ఆరోగ్య కార్యక్రమాలు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రధానంగా పల్లె వైద్యం, గర్భిణులు, చిన్న పిల్లలు, తల్లులు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు తదితర వాటికి కట్టడికి రూ. కోట్లల్లో వ్యయం చేస్తోంది. అంటు వ్యాధులు, క్యాన్సర్, ఇతర భయానకమైన వ్యాధులపై అవగాహన కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అయితే అవన్నీ వృథా అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు మూలనపడ్డాయి. అవగాహన కార్యక్రమాలను కేంద్రానికే పరిమితం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. అసలు దీనిపై జిల్లా అధికారులకు సైతం అవగాహన లేకపోవడం గమనార్హం. ఇక పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. అధికారులు కార్యాలయాలకు పరిమితమవుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి రావడానికే సగం సమయాన్ని వెచ్చిస్తున్నారు. తద్వారా ఆరోగ్య కేంద్రాలపై పర్యవేక్షణ ప్రక్రియ పక్కదారి పట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పర్యటనలకు దూరం ప్రోగ్రాం ఆఫీసర్లను క్షేత్రస్థాయిలో పర్యటించకుండా...కార్యాలయంలోనే కూర్చోబెడుతున్నారని, ఇప్పటికై నా వారికి పర్యటన ఫవర్ ఇప్పించేలా చూడాలని శాఖలోని అధికార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్యాలయంలో ఏక్ నిరంజన్ పాలనపై కొందరు అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఏన్హెచ్ఎం నిధుల జమ, వ్యయం, దారి మళ్లింపు, తప్పుడు బిల్లుల సమర్పణపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత అయినా పల్లె వైద్యంలో మార్పు వస్తుందో లేదో చూడాల్సి ఉంది. మొక్కుబడిగా విధులు క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలదే కీలక బాధ్యత. వీరు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ...ప్రజారోగ్య సమస్యలను తెలుసుకోవాలి. సీజనల్ వ్యాధుల కట్టడి, గర్భస్థ వైద్య సేవల పనితీరు, పిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ఓ కంట పెడుతూ...సేవలను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఏఎన్ఎంలపై ఉంది. అయితే చాలా మంది ఏఎన్ఎంలు విధులను పూర్తిగా విస్మరిస్తున్నారు. జనాల్లోకి అలా..వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. స్థానికంగా ఉండడం లేదు. లేదంటే మీటింగ్‌ల పేరుతో విధులకు డుమ్మా కొట్టేస్తున్నారు. సర్వేలు, ఇతర సేవలు, కార్యక్రమాలను ఆశా వర్కర్లకు అప్పజెప్పుతున్నారు. ఆశాలపై వారిపని చూసుకుంటూ...ఏఎన్ఎంల పనిభారాన్ని సైతం మోస్తున్నారు. దీనిపై ఆశాల యూనియన్లు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అదనపు భారానికి బ్రేకులు వేయలేకపోతున్నారు. పీహెచ్‌సీల మాదిరిగానే విలేజ్ హెల్త్ క్లినిక్‌లు కూడా తయారయ్యాయి. ఉదయం 9గంటలకు తెరుచుకోవాల్సిన క్లినిక్‌లు 10 గంటలు దాటుతున్నా తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది సిబ్బంది భోజన విరామం తర్వాత కనిపించకుండా మాయమవుతున్నా రు. ఆపై ఆశా వర్కర్లను చూసుకోమని చెప్పి వెళ్లిపోతున్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను, సర్వేలను ఇంటి నుంచే చేస్తున్నారు. కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. -
కూటమి నేతల వేధింపులు భరించలేక చచ్చిపోతున్నా
బైరెడ్డిపల్లె: ‘నేను తెలుగుదేశం పార్టీకి ఓటేశా.. వైఎస్సార్సీపీ నాయకుల జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ఇస్తే తిన్నా... అదేమన్నా తప్పా..? ఇంతమాత్రానికే నాపై అధికార కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడతారా? అయ్యా... ఇక నేను భరించలేను. చచ్చిపోతున్నా...’ అంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని పాతపేటకు చెందిన శ్రీనివాసులు(42) సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరిస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల కథనం మేరకు... పాతపేట గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు, అతని సోదరుడికి మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరిగింది. అయితే శ్రీనివాసులును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ నేతల జన్మదిన వేడుకల్లో పాల్గొనడం వల్లే కూటమి నేతలు కక్ష కట్టి పోలీస్‌స్టేషన్‌కు పిలిపిస్తున్నారని గ్రామస్తులు శ్రీనివాసులుకు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను తెలియజేస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొందరు కూటమి నేతల వల్లే తాను చనిపోతున్నానని వెల్లడించాడు. ఆ వీడియోను గ్రామస్తులకు షేర్ చేయడంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులును తొలుత బైరెడ్డిపల్లె పీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నందినీకి ఏమైనా జరిగితే..!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు రగిలిపోయాయి. అధ్యాపకుల కక్ష సాధింపు వల్ల తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ మేరకు కళాశాల ఎదుట శనివారం ధర్నాకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కళాశాలలో తృతీయ సంవత్సర విద్యార్థిని నందిని గత నెల 31న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. అధ్యాపకులు తీవ్రంగా అవమానించడంతో మానసికంగా కుంగిపోయి చావుకు తెగించిందన్నారు. విద్యారి్థనికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు మిన్నకుండిపోయిందని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ సెలవు ఇవ్వని యాజమాన్యం శనివారం సెలవు ప్రకటించిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని, వేలూరులోని ఓ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య చికిత్సకు తల్లిదండ్రుల వద్ద చిల్లిగవ్వ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యారి్థనికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.నా బిడ్డను బతికించండి ‘కాయకష్టం చేసి బిడ్డను చదివించుకున్నాం. మరో ఏడాది గడిస్తే బిడ్డ ప్రయోజకురాలు అవుతుందని ఆశపడ్డాం. ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం. అధ్యాపకులు కక్ష గట్టి మా బిడ్డను పొట్టనబెట్టుకోవాలని చూశారు. ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉంది..’ అంటూ విద్యార్థిని తల్లి దీప్తి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కుమార్తె నందినిని అధ్యాపకులు బయట తరిమేసి కొట్టడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. వారం రోజులుగా అధ్యాపకులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తోటి విద్యార్థులే చెబుతున్నారని ఆరోపించారు.పోలీసులు, ట్రైనీ కలెక్టర్ చర్చలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు నిత్యబాబు, నెట్టికంఠయ్య, శ్రీనివాసులు« ధర్నా వద్దకు చేరుకుని తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. అదే విధంగా ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్ కళాశాల వద్దకు విచ్చేసి విద్యారి్థని తల్లితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఘటన జరిగిన తర్వాత యాజమాన్యం అంతా తామే చూసుకుంటామని చెప్పి ప్రస్తుతం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని తెలిసిందన్నారు. ప్రిన్సిపల్‌కి కాల్ చేసి హెచ్చరించినట్టు పేర్కొన్నారు. విద్యారి్థని కుటుంబీకులకు న్యాయం చేయకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, చిత్తూరు జిల్లా స్టూడెంట్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ సద్దాం, బాధితులకు మద్దతుగా హరీషారెడ్డి, మనోజ్‌రెడ్డి, దినే‹Ù, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంజయ్, ఆసిఫ్, జగన్, ఎస్ఎఫ్ఐ నాయకులు మన్సూర్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
నందినీకి ఏమైనా జరిగితే..!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు రగిలిపోయాయి. అధ్యాపకుల కక్ష సాధింపు వల్ల తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ మేరకు కళాశాల ఎదుట శనివారం ధర్నాకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కళాశాలలో తృతీయ సంవత్సర విద్యార్థిని నందిని గత నెల 31న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. అధ్యాపకులు తీవ్రంగా అవమానించడంతో మానసికంగా కుంగిపోయి చావుకు తెగించిందన్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు మిన్నకుండిపోయిందని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ సెలవు ఇవ్వని యాజమాన్యం శనివారం సెలవు ప్రకటించిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని, వేలూరులోని ఓ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య చికిత్సకు తల్లిదండ్రుల వద్ద చిల్లిగవ్వ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థినికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.పోలీసులు, ట్రైనీ కలెక్టర్ చర్చలు నా బిడ్డను బతికించండి ‘కాయకష్టం చేసి బిడ్డను చదివించుకున్నాం. మరో ఏడాది గడిస్తే బిడ్డ ప్రయోజకురాలు అవుతుందని ఆశపడ్డాం. ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం. అధ్యాపకులు కక్ష గట్టి మా బిడ్డను పొట్టనబెట్టుకోవాలని చూశారు. ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉంది..’ అంటూ విద్యార్థిని తల్లి దీప్తి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కుమార్తె నందినిని అధ్యాపకులు బయట తరిమేసి కొట్టడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. వారం రోజులుగా అధ్యాపకులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తోటి విద్యార్థులే చెబుతున్నారని ఆరోపించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్లు నిత్యబాబు, నెట్టికంఠయ్య, శ్రీనివాసులుఽ ధర్నా వద్దకు చేరుకుని తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. అదే విధంగా ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్ కళాశాల వద్దకు విచ్చేసి విద్యార్థిని తల్లితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఘటన జరిగిన తర్వాత యాజమాన్యం అంతా తామే చూసుకుంటామని చెప్పి ప్రస్తుతం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని తెలిసిందన్నారు. ప్రిన్సిపల్‌కి కాల్ చేసి హెచ్చరించినట్టు పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబీకులకు న్యాయం చేయకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, చిత్తూరు జిల్లా స్టూడెంట్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ సద్దాం, బాధితులకు మద్దతుగా హరీషారెడ్డి, మనోజ్‌రెడ్డి, దినేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంజయ్, ఆసిఫ్, జగన్, ఎస్ఎఫ్ఐ నాయకులు మన్సూర్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆరోగ్య కేంద్రాల సందర్శన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీలోని అర్బన్‌హెల్త్ సెంటర్‌ను శనివారం రాష్ట ఆరోగ్య మందిర్ పోగ్రాం ఆఫీసర్ సుబ్రమణ్యం సందర్శించారు. కేంద్ర బృందం రాకతో ముందస్తుగా అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పాడ్డ అధికారులు వారికి కేటాయించిన రూట్లల్లో పర్యటించారు. ఈ క్రమంలో సుబ్రమణ్యం బృందం చిత్తూరు నగరం, గుడిపాల, యాదమరి, కాణిపాకం తదితర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లను తనిఖీ చేసింది. అక్కడ లోటు పాట్లను గుర్తించి సరిదిద్దుకునేలా సూచనలు ఇచ్చారు. వ్యాక్సిన్ నిర్వహణ, రికార్డుల పనితీరు, ల్యాబ్ పరీక్ష, వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరుపై వైద్య అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, ఎస్ఓ జార్జ్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి గుడిపాల: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని స్టేట్ హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ సుబ్రమణ్యం తెలిపారు. శనివారం వసంతాపురంలోని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ను ఆయన సందర్శించారు. ఆయనతో పాటు స్టేట్ డబ్లుహెచ్‌ఓ అధికారి నితీష్రామ్, డెప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటప్రసాద్, స్టాటిస్టికల్ అధికారి జార్జ్, డాక్టర్ సంధ్య పాల్గొన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి ఐరాల: పదో తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఇందిర సూచించారు. శనివారం మండలంలోని స్థానిక ఉన్నత పాఠశాల, ఎం.పైపల్లె, కాణిపాకం ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది కంటే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాలు మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రుషేంద్రబాబు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పింఛన్ కోసం పడిగాపులు
పుత్తూరు: పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు పడరానిపాట్లు పడుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత, పాలకుల అలసత్వం వెరసి సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితే పుత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ కాలనీ, దాసరిగుంట, అంబేడ్కర్ సర్కిల్ సచివాలయాలు ఉన్నాయి. ఈ మూడు సచివాలయాలకు సంబంధించి పలువురు వృద్ధులు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు పడిగాపులు కాశారు. వీరిని పలకరిస్తే పింఛన్ తీసుకుంటేనే రోజూ పూట గడుస్తుందని కొందరు.. ఈ నెల మందులు కొనాలి అందుకు డబ్బులు కావాలంటూ మరికొందరు తమ బాధలు చెప్పుకొచ్చారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇస్తారు కదా? అని ప్రశ్నిస్తే.. అదీ ఏడాది క్రితం మాట నాయనా.. ఇప్పుడు సచివాలయం వద్దకు వస్తేనే పింఛన్ ఇస్తారని చెపుతుంటే ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఇక్కడ ఇచ్చారా అంటే?.. ఎందుకు వచ్చావంటున్నారు? రేపురా అంటున్నారు. ఏమి చేయాలో తెలియడం లేదు.. అంటూ ఓ దివ్యాంగుడు కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలచివేసింది. సమాచార లోపం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీన ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ అందజేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ నెల ఎవరు? ఎక్కడ పింఛన్ ఇస్తారన్న విషయంపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఒకనెల ఇంటి వద్ద ఇస్తే, మరోనెల సచివాలయానికి రండంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు నగదు ఎవరు..? ఎక్కడ ఇస్తారన్న దానిపై స్పష్టత లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో గత అక్టోబర్1న సచివాలయ సిబ్బంది సమ్మెలో ఉండడంతో కార్యాలయం వద్దకు వచ్చి పింఛన్ తీసుకెళ్లాలని చెప్పారు. అలా గత నెల సచివాలయాల వద్దకు వచ్చిన వృద్ధులు ఈనెల సైతం సచివాలయాల వద్దకు వచ్చేశారు. ఇక్కడి వచ్చాక ఎందుకు వచ్చారంటూ వారిని సిబ్బంది ప్రశ్నించడం కొసమెరుపు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం!
చౌడేపల్లె: ‘గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూటమి ప్రభుత్వ కుట్రలకు భయపడొద్దని.. ఎవరికి ఏ కష్టమొచ్చినా మేముంటాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసానిచ్చారు. శనివారం మదనపల్లె పట్టణంలోని దేవతా నగర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటికిషోర్బాబును చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, ఎన్.శ్రీనాథరెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ఇటీవల బైక్ ప్రమాదంలో కిషోర్‌బాబు కాలు విరిగింది. చికిత్సల అనంతరం ఆయన ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి ఆయన్ను పరామర్శించారు. అనంతరం చౌడేపల్లె, పుంగనూరు మండలాల నుంచి అక్కడికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను దీటుగా ఎదుర్కొని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ఆరా తీశారు. వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ నాగభూషణరెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, కో–ఆప్షన్ మెంబరు సాధిక్‌బాషా, డీసీసీబీ మాజీ డైరక్టర్ రమేష్‌బాబు, నాయకులు జి.శ్రీనివాసులరెడ్డి, రంగనాథ్, గిరిబాబు, చిన్నప్ప, మోహన్‌యాదవ్, శ్రీనివాసులు, కృష్ణప్ప, నారాయణరెడ్డి, విజయ్ పాల్గొన్నారు. -
నీచ సంస్కృతి
సైన్స్, విద్య, క్రీడలు, వ్యాపారం, రాజకీయ రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తున్నారు. మగవారిని మైమరపిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు అతివల విజయపరంపర ప్రపంచాన్ని శాసిస్తుంటే .. మరోవైపు ఆడ పిల్లల పుట్టుకపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. పుట్టబోయేది ఆడ పిల్ల అని తెలిస్తే చాలు గర్భంలోనే చిదిమేస్తున్నారు. కొందరు ప్రయివేటు వైద్యులు ఇష్టారాజ్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ అడ్డదారుల్లో భ్రూణ హత్యలకు కారకులవుతున్నారు. ఇలాంటి స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. భ్రూణ హత్యలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. కాణిపాకం: ప్రస్తుత సమాజంలో ఆడ పిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే చంపేసే దుష్ట సంస్కృతి నేటికీ కొనసాగుతోంది. ఓ వైపు అన్ని ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నియంత్రించినా.. అదనపు డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యులు అడ్డదారుల్లో కేంద్రాలు నడుపుతూ శిశువుల ఊపిరి తీస్తున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన జిల్లా అధికార యంత్రాంగం, వైద్యారోగ్య శాఖలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. చిత్తూరు నగరంలో పదుల సంఖ్యలో ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నగరి, పలమనేరు, కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాల్లో పుట్టగొడుగులా ప్రయివేటు స్కానింగ్ కేంద్రాలు వెలుస్తున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మధ్యవర్తులతో దందా.. బాలికల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా... అవగాహనా రాహిత్యంతో ప్రస్తుత సమాజంలో అమ్మాయిలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మరో వైపు బాలికల సంరక్షణ కోసం చట్టాలున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా భ్రూణ హత్యలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. అయితే స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులిచ్చేటప్పుడు కమిటీ సభ్యుల్లోని కొందరు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి పరిశీలించడం తప్ప పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు ఆర్ఎంపీ, పీఎంపీలు ఈ విషయంలో పలు ప్రైవేటు ఆస్పత్రులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ మహిళల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీనేజీలు సైతం చిట్టితల్లులై అబార్షన్లకు వస్తున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. అబార్షన్లకు జిల్లా వాసులే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాళ్లపై నిఘా ఎక్కడ? జిల్లాలో మాతాశిశు సంరక్షణ కోసం కృషి చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ, ఇతర అనుబంధ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. మొదటిసారి కుమార్తెను ప్రసవించి, రెండోసారి గర్భం దాల్చిన వారిపై ఎక్కువ నిఘా పెట్టాలి. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌న్‌ఎంలు, అంగనన్‌వాడీ కార్యకర్తలు సూపర్ వైజర్ల ద్వారా వివరాలు సేకరించి ఆన్న్లైనలో పొందుపరచాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని తెలుస్తోంది. జిల్లా సమాచారం అన్ని ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తూ 1994లోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాయి. అయినప్పటికీ జిల్లాలో ఈ పరీక్షలు అడ్డదారుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఇంకా తొలగిపోని కారణంగా గర్భిణులు పలువురు అర్హతలేని స్థానిక వైద్యులు, ఆస్పత్రుల సహకారంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని గర్భ విచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న వైద్యులు, పలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టానుసారంగా లింగ నిర్ధారణ పరీక్షలకు మొగ్గు చూపుతున్నారు. గుట్టుగా ఎవరికీ తెలియకుండానే శిశువులను అమ్మ గర్భంలోనే చిదిమేస్తున్నారు. జిల్లాలో అడ్డగోలుగా అబార్షన్లు చట్ట ప్రకారం అమలు చేయాలి పీసీపీఎన్డీటీ చట్ట ప్రకారం స్కానింగ్ సెంటర్లను నిర్వర్తించాలి. వైద్యర్హాత లేకుండా స్కానింగ్ చేసేవాళ్లపై కేసులు పెట్టాలి. నకిలీ డాక్టర్లు దొంగ చాటుగా అబార్షన్లు చేసేస్తున్నారు. అధికారులు వాళ్లను పట్టుకుంటే కొందరు నాయకులు అడ్డుపడుతున్నారు. అధికారులకు సహకరించి.. అబార్షన్ల కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేకుండా మహిళల సంఖ్య దారుణంగా పడిపోయే అవకాశాలున్నాయి. – డాక్టర్ రవిరాజు, ఏపీ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షుడుఇన్ఫెక్షన్ రేటు పెరుగుతోంది ఇష్టానుసారంగా అబార్షన్లు చేయించుకోవడం మంచిది కాదు. ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతోంది. క్యాన్సర్‌కు కారణమవుతుంది. గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా గర్భస్థ సమస్యలుంటే గుర్తింపు ఉన్న డాక్టర్లను సంప్రదించాలి. వారి అనుమతితో అబార్షన్లు చేసుకోవచ్చు. లేని పక్షంలో మాత్రలు, నాటు మందులతో అబార్షన్లు చేయిస్తారంటే వారి వద్దకు వెళ్లకండి. అబార్షన్ల పేరుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. –ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు -
ఉలిక్కిపడిన మారేడుపల్లి!
పాఠశాల స్థలం కబ్జా! కార్వేటినగరం మండలంలోని విజయమాంబాపురం గ్రామంలో పాఠశాల స్థలాన్ని కూటమి నేత కబ్జా చేశాడు. పలమనేరు: గంగవరం మండలంలోని మారేడుపల్లి ఉలిక్కిపడింది. చిత్తూరులో 2015లో జరిగిన కఠారి దంపతుల హత్య కేసులో చింటూతోపాటు మరో నలుగిరికి జిల్లా కేంద్రంలోని తొమ్మిదో అదనపు షెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. వీరిలో మంజునాథ్ ఒకరు. ఇదినిది పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలంలోని మారేడుపల్లి గ్రామం. అతనికి ఉరిశిక్ష పడిందనే విషయం తెలియగానే గ్రామస్తులు బిత్తరపోయారు. తమ గ్రామానికి సమీపంలోనే నివాసముంటున్న ముని చౌడప్ప కుమారుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడా..? అంటూ చర్చించుకోవడం కనిపించింది. తాపీ పనులు చేసుకునే మంజునాథ్ చిత్తూరులో చింటూ ఇంటివద్ద గోడ నిర్మాణానికి వెళ్లి అక్కడ అతనితో స్నేహంగా మెలిగేవాడు. ఆపై అతని మనిషిగా మారాడు. కఠారి దంపతుల హత్యలో చింటూతో కలిసి పాల్గొన్నాడు. అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు. చెడు సావాలు ఓ మనిషిని చంపేదాకా తీసుకెళ్తాయనేదానికి నిదర్శనమని పట్టణంలో చర్చించుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,539 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,144 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. -
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
సదుం: తీవ్ర అస్వస్థతకు లోనైన విద్యా ర్థిని మృతి చెందిన ఘటన సదుం మండలంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కథనం.. సదుం వీఆర్ఆర్ కాలనీకి చెందిన గిరి కుమార్తె కార్తీక(10) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. అక్టోబర్ 22న బాలికకు వాంతులు కావడంతో కుటుంబీకులు స్థానిక సీహెచ్‌సీకి.. అక్కడి నుంచి పీలేరుకు తీసుకువెళ్లారు. తర్వాత తిరుపతి రుయాకు తరలించారు. అక్కడి వైద్యులు చిన్నారికి డయాబెటిస్ అధికంగా ఉందని చెప్పి చికిత్స ప్రారంభించారు. అది నియంత్రణలోకి వచ్చినా కిడ్నీలు స్పందించడం లేదని డయాలసిస్ ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఆస్పత్రిలోని ఓ వైద్యుడు సక్రమంగా చికిత్స అందించకపోవడంతోనే తన బిడ్డ మృతి చెందిందని బాలిక తండ్రి ఆరోపించారు. దీనిపై డయల్ 100కు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా చిన్నారి మృతదేహానికి పాఠశాల సిబ్బంది నివాళి అలర్పించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. టమాట లారీ బోల్తా బంగారుపాళెం: మండలంలోని కాటప్పగారిపల్లె క్రాస్ చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి లారీ బోల్తాపడింది. కోలార్ నుంచి చైన్నెకి టమాట లోడుతో వెళ్తున్న లారీ టైరు పేలి అదుపుతప్పి జాతీయ రహదారిపై బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. పాఠశాల స్థలం కబ్జా! కార్వేటినగరం: మండలంలోని విజయమాంబాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కూటమికి చెందిన ఓ నాయకుడు కబ్జా చేశారు. విద్యార్థుల కోసం రూ.60 వేలు వెచ్చించి నిర్మించిన మరుగుదొడ్లను కూల్చివేసి కబ్జా చేయడం స్థానికంగా కలకలం రేపింది. గత ప్రభుత్వం నాడు–నేడులో పాఠశాలను మరో చోట నిర్మాణం చేపట్టారు. ఇదే అదునుగా పాత పాఠశాల భవనం వద్ద ఉన్న స్థలాన్ని కూటమి నేతలు కబ్జా చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. వివాహిత ఆత్మహత్య బంగారుపాళెం: మండలంలోని తగ్గువారిపల్లెలో శుక్రవారం రాత్రి కుటుంబకలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ శ్రీనివాసులు కథనం.. మండలంలోని తగ్గువారిపల్లెకు చెందిన ఆనంద్‌కుమార్ ఐదేళ్ల క్రితం జయంతి ఎస్టీ కాలనీకి చెందిన సుమతితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తలు గొడవపడేవారు. ఈ నేపథ్యంలో మరోసారి సుమతి, ఆనంద్‌కుమార్ గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన సుమతి(30) ఇంట్లోని బెడ్ రూమ్‌లోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు సుమతిని చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలి తల్లిదండ్రులు శాంతకుమారి, సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
గంజాయి మత్తులో హల్చల్
పాలసముద్రం : గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. మండలంలోని శ్రీకావేరిరాజుపురం పంచాయతీ, ఏట్టుకూరిపల్లెకి చెందిన శేకర్‌ను చితకబాదారు. పోలీసుల కథనం.. ఏట్టుకూరిపల్లె గ్రామానికి చెందిన ఇద్దరి యువకులతో తమిళనాడు రాష్ట్రం, రాణిపేట జిల్లా, వేలం గ్రామానికి చెందిన అజయ్, పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన యోహన్ అలియాస్ అప్పు స్నేహంగా ఉండేవారు. శనివారం ఉదయం అజయ్, అప్పు గ్రామానికొచ్చి పూటుగా గంజాయి సేవించారు. ఆపై అక్కడే ఉన్న అదే గ్రామానికి చెందిన శేఖర్‌ను చితకబాదారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. త్వరలో వారిని పట్టుకుంటామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. 4న తిరుపతిలో జాబ్ మేళా తిరుపతి అర్బన్: నగరంలోని ఎస్వీసీసీ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్‌మేళాకు రానున్నారని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అదనపు సమాచారం కోసం 8143576866, 9988853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎస్వీయూ రెక్టార్‌గా అప్పారావు తిరుపతి సిటీ: ఎస్వీయూ నూతన రెక్టార్‌గా గతంలో ఇన్చార్జి వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ అప్పారావు నియమితులయ్యారు. శనివారం వీసీ నర్సింగరావు నియామక పత్రం అందజేశారు. అప్పారావు సేవలు విశ్వవిద్యాలయానికి అవసరమని గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు వీసీ పేర్కొన్నారు. -
హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్
ఐరాల: ఓ వ్యక్తిని హత్య చేసేందకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కల్లూరు సీఐ జయరామయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని నాగంవాండ్లపల్లెకు చెందిన అక్కిపల్లె శివప్రసాద్‌యాదవ్ తన సొంత భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. తన భూమి పక్కన సర్వే నం.537/544లో 4.9 సెంట్ల గ్రామకంఠం భూమి ఉంది. ఈ భూమి తమ పూర్వీకులకు సంబంధించిందని, ఇందులో ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టడానికి యత్నించారు. గ్రామకంఠంలో గతంలో పాఠశాల భవనం ఉండేది. అది కూల్చివేసి ఖాళీ స్థలంగా ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శివప్రసాద్‌యాదవ్ గ్రామకంఠంలో ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టుతుండగా, గ్రామస్తులు నిలదీశారు. దీంతో అతని సమీప బంధువులైన సూరిమాని సంతోష్, సూరిమాని శివతో కలిసి అదే గ్రామానికి చెందిన పృథ్విరాజ్‌పై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. అలాగే గ్రామానికి చెందిన కొంత మందిపై డాడికి యత్నించారు. దీంతో గ్రామంలో రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొనకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. గ్రామానికి చెందిన చలపతి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి హత్యాయత్నానికి పాల్పడిన అక్కిపల్లె శివప్రసాద్‌యాదవ్, సూరిమాని సంతోష్, సూరిమాని శివను అరెస్ట్ చేసి రోజులు రిమాండుకు తరలించినట్లు సీఐ వివరించారు. -
ఘనంగా బాలోత్సవం పిల్లల పండుగ ప్రారంభం
తిరుపతి కల్చరల్: రోటరీ క్లబ్ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న బాలోత్సవం పిల్లల పండుగ ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 35 అంశాల్లో 6 వేదికలపై పిల్లలకు వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. సుమారు పదివేల మంది విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పాల్గొని, వేడుకలను ప్రారంభించారు. పిల్లలు చదువుల ఒత్తిడికి గురి కాకుండా వారిలో దాగిన సృజనాత్మకమైన కళలను వెలికి తీసే తిరుపతి బాలోత్సవం వారు పిల్లల పండుగ చేపట్టడం అభినందనీయమన్నారు. పిల్లలను చూస్తుంటే వారిలో ఒకరిగా కలిసిపోయి తన చిన్నతనంలో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయన్నారు. తెలుగు భాషా ఔన్నత్వం కోసం పిల్లల ఆలోచనలకు పదును పెడుతున్న బాలోత్సవం కమిటీకి జిల్లా యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని విస్తృతంగా నిర్వహించి పిల్లలను ప్రతిభావంతులు కావడానికి దోహదపడాలని తెలిపారు. డీఈఓ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల పిల్లలను ఈ బాలోత్సవంలో భాగస్వాములను చేశామన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందిస్తామని తెలిపారు. అతిథులుగా విచ్చేసిన జగన్నాథం, రమేష్ నాథ్ లింగుట్ల, పీసీ.రాయులు, విక్రమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఆటాపాటలతో పిల్లల ప్రతిభకు తార్కాణంగా ఈ బాలోత్సవం నిర్వహించడం తిరుపతికే గర్వకారణమని కొనియాడారు. -
కాలికి తగిలిన బంగారు కుండ.. పోలీసుల ఎంట్రీతో కొత్త ట్విస్ట్!
చిత్తూరు జిల్లా: మండలంలోని పెద్దకొండామర్రి పంచాయతీ కోటూరు అటవీ ప్రాంతంలో మూలికల కోసం వెళ్లిన ఇద్దరికి బంగారు లభ్యమైందని పుకార్లు షికారు చేశాయి. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఎస్ఐ నాగేశ్వరరావు వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. కోటూరుకు చెందిన గొర్రెల కాపరులైన ఉగిని చానుల్లా, అగ్రహారం మునస్వామి రెండు రోజుల క్రితం జీవాలకు మూలికల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ వారికి కాలికి తగిలిన చిన్నపాటి కుండను గుర్తించి వెలికితీశారు. అందులో మెరిసే అర్ద చంద్రాకారంలో ఉన్న రేకు దొరికింది. మునస్వామి వాటా అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం పెద్ద మనుషులకు తెలిసింది. ఆనోటా ఈనోటా పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో ఎస్ఐ నాగేశ్వరరావు శుక్రవారం చానుల్లా, మునస్వామి ని స్టేçషన్‌కు పిలిచి విచారించారు. అక్కడ లభించిన రేకును పరిశీలించి చిత్ర పటాలకు వాడే రేకుగా నిర్ధారించారు. -
కార్తీక దీపం.. ఇంటినే కాల్చేసింది!
చిత్తూరు జిల్లా: ఇంటి వద్ద కార్తీక శుక్రవారం సందర్భంగా వెలిగించిన దీపం వారి ఇంటినే కాల్చేసింది. ఈ ఘటన మండలంలోని కాగతి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటర్ కాలిపోగా.. సుమారు రూ.4 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామస్తుల కథనం.. పుంగనూరు–బోయకొండ ప్రధాన రహదారిలో కాగతి ఉంది. రోడ్డు పక్కన ఎల్.ఉదయ్‌కుమార్, తల్లి శారదమ్మ కలిసి చిల్లర అంగడి నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పెట్రోల్, గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో కార్తీక శుక్రవారం కావడంతో షాపు, ఇంటి గడపలో దీపం వెలిగించి పెట్టారు. పెట్రోల్ బాటిళ్లు, క్యాన్‌తోపాటు బైక్ వరండాలో ఉంచారు. దీపం నుంచి పెట్రోల్‌కు మంటలు చెలరేగి బైక్‌కు వ్యాపించాయి. మంటలు ఎగసి పడడంతోపాటు పొగ కమ్మేసింది. మంటలను అదపుచేసేందుకు స్థానికులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్న భయంతో పరుగులు తీశారు. తీరా ఉదయ్‌కుమార్ ఇంట్లోనే ఉండిపోవడంతో గ్రామస్తులు, యువకులు సాహసం చేసి ఇంటి కిటికీలు ధ్వసం చేసి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అతనికి స్వల్పగాయాలు కాగా.. ప్రాథమిక చికిత్స అందించారు. ఇంట్లోని సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, కొయ్య సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల నివాసమున్నవారు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. పుంగనూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
రాష్ట్ర చరిత్రలో ఐదుగురికి ఉరిశిక్ష ఇదే తొలిసారి?
దాదాపు పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. చిత్తూరులో సంచలనం కలిగించిన కఠారి దంపతుల హత్య కేసులో అంతిమ తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం దోషులకు మరణ దండన విధించింది. శ్రీరామ్ చంద్రశేఖర్(చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్రెడి, మంజునాథ్, వెంకటేష్ చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయమూర్తి డా.ఎన్.శ్రీనివాసరావు తీర్పునివ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిత్తూరు అర్బన్: చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో శుక్రవారం ఉదయం 10.35 గంటలకు 110/2016 అంటూ పిలిచారు. అప్పటికే జనంతో నిండిపోయిన కోర్టు హాలులో దోషులను ప్రవేశపెట్టగానే మొత్తం నిశ్శబ్దంగా అలముకుంది. న్యాయమూర్తి ఏం తీర్పు చెబుతారోనంటూ అందరిలోనూ ఉత్కంఠ. ఒక్కసారిగా దోషులు ఐదుగురికికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన వద్ద ఉన్న ఐదు పేజీల్లోని తీర్పును చదివి వినిపించారు. దోషులకు ఉరిశిక్ష అని చెప్పగానే అక్కడే ఉన్న కఠారి దంపతుల కుమార్తె కఠారి లావణ్య భావోద్వేగంతో కన్నీళ్లు తుడుచుకుంటూనే పూర్తి తీర్పును విన్నారు. ఆపై కఠారి కోడలు హేమలత, లావణ్య మీడియాతో మాట్లాడారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత దోషులకు మరణశిక్ష పడటం న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచిందన్నారు. కఠారి సమాధుల వద్ద నివాళులరి్పంచి, కార్పొరేషన్ కార్యాలయంలోని వాళ్ల విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీఎస్.శైలజా మాట్లాడుతూ దోషులు చేసిన నేరానికి తగిన శిక్ష పడిందన్నారు. తీర్పుపై హైకోర్టుకు వెళతామని, కఠారి కేసులో మరణశిక్ష విధించే గ్రావిటీ లేదని.. హైకోర్టు కేసును కొట్టేస్తుందనే విశ్వాసం తమకు ఉందని డిఫెన్స్ న్యాయవాది విజయచందర్‌రెడ్డి అన్నారు. తీర్పు ఇలా.. న్యాయమూర్తి తన ఐదు పేజీల తీర్పులో 13 అంశాలను ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా ఐపీసీ 302, రెడ్‌విత్ 120–బి కింద కఠారి అనురాధను హత్య చేసినందుకు ఐదుగురు దోషుల గొంతుకు ఉరి బిగించి మరణించేంత వరకు ఉరి తీయాలి. బాధిత కుటుంబాలకు ప్రధాన నిందితుడు రూ.70 లక్షల జరిమానా చెల్లించాలి. లేకుంటే ఆర్నెళ్ల జైలుశిక్ష, ఏ2 నుంచి ఏ5 దోషులకు వెయ్యి జరిమానా, చెల్లించని పక్షంలో ఆర్నెళ్ల జైలుశిక్ష. ఐపీసీ 302, రెడ్‌విత్ 120–బి కింద కఠారి మోహన్‌ను హత్య చేసినందుకు ఐదుగురు దోషుల గొంతుకు ఉరి బిగించి మరణించేంత వరకు ఉరి తీయాలి. ఒక్కొక్కరూ రూ.వెయ్యి జరిమానా, లేకుంటే ఆర్నెళ్ల జైలుశిక్ష. కఠారి అనుచరుడు వేలూరు సతీష్‌కుమార్ నాయుడపై హత్యాయత్నం చేయడానికి ప్రయతి్నంచినందుకు మంజునాథ్‌తో సహా ఐదుగురికి ఐపీసీ 307 ప్రకారం జీవిత ఖైదు. ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా. సెక్షన్ 428 (1) సీఆర్సీపీ ప్రకారం.. దోషులు ఐదుగురు జైల్లో గడిపిన కాలాన్ని శిక్ష నుంచి మినహాయించారు. దోషులకు ఉరిశిక్ష విధించినప్పటికీ హైకోర్టు తీర్పును నిర్ధారించేంత వరకు ఉరిని అమలు చేయకూడదు. దోషులు ఉరిశిక్షపై అమరావతిలోని రాష్ట్ర హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. తప్పుడు సాక్ష్యంపై.. ఇక ఈ కేసులో 14 మంది ప్రభుత్వ ఉద్యోగుల తీరును కోర్టు తప్పుబట్టింది. న్యాయమూర్తి ఇచ్చిన బైదు పేజీల తీర్పులో సాక్షులుగా ఉన్న సురేష్ కుమార్, మల్లికార్జున, బాలకృష్ణ, పద్మనాభశెట్టి, ఆదాము, ఆనందనాయుడు, మునిరత్నం, ముద్దకృష్ణ యాదవ్, దొరైరాజ్, త్యాగరాజన్, కిరణ్‌కుమార్, వాసుబాబు, గోపీనాథ్, ధనంజయ అనే వ్యక్తులు ఈ సులో సాకు‡్ష్యలుగా ఉంటూ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నించారని తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 193 ఐపీసీ (నేరం రుజువైతే ఏడేళ్ల గరిష్ట జైలుశిక్ష) ప్రకారం ఎందుకు వీళ్లను ప్రాసిక్యూట్ చేయకూడదో షోకాజు నోటీసులు పంపాలని ఏపీపీ ద్వారా వివరణ ఇవ్వాలని, వీళ్ల చిరునామాలు పది రోజుల్లో సేకరించాలని వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. దోషుల నేపథ్యం ఈ కేసులో ప్రధాన దోషి చింటూ మెరైన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమోచేసి, బాంబేలోని ఐఎన్ఏ (ఇండియన్ నావెల్ షిప్)లో పనిచేస్తూ.. తన మామ కఠారి మోహన్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబును ఎదిరించి ఆయనపై హత్యాయత్నం చేసి రెండేళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఈ కేసులో చిత్తూరు కోర్టు చింటూకు జీవితఖైదు విధించినప్పటికీ, హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. కఠారి మోహన్ కోసం సీకేను ఎదిరించిన చింటూ, ఆపై సొంత మామనే మట్టుబెట్టి తొమ్మిదిన్నరేళ్ల వరకు జైల్లో ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రం ముల్బాగిల్కు చెందిన వెంకటాచలపతి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ మోహన్‌కు పరిచయమై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆపై చింటూకు దగ్గరయ్యాడు. తండ్రి ఆటో నడిపితేగానీ ఇల్లు గడవని జయప్రకాష్‌రెడ్డి కూడా చిత్తూరులోని గంగనపల్లె ఉంటూ మోహన్, చింటూ వద్ద తిరుగుతూ 23 ఏళ్ల వయస్సులో జంట హత్యల కేసులో చిక్కుకుని దాదాపు పదేళ్ల పాటు జైల్లో ఉంటూ ఇపుడు దోషిగా తేలాడుడు. గంగవరం మండలం మారేడుపల్లెకు చెందిన మంజునాథ్ తాపీ కూలి పనిచేస్తూ చింటూ ఇంటి వద్ద గోడ కట్టడానికి వచ్చి అతని వద్దే ఉండిపోయాడు. ఇతను కూడా జంట హత్యలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు. గంగనపల్లెకు చెందిన మరో దోషి వెంకటే‹Ù. మోహన్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ ఆపై చింటూ వద్ద సైతం డ్రైవర్‌గా పనిచేసి జంట హత్యల్లో దోషిగా తేలాడు.పదేళ్ల పరిణామాలు ఇలా.. 2015, నవంబర్ 17 – మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నాటి మేయర్ అనురాధను తుపాకీతో కాల్చి చంపారు. ఆమె భర్త కఠారి మోహన్‌ను కత్తులతో వెంటాడి నరికేశారు. అదే రోజు రాత్రి వేలూరులోని ఓ ఆస్పత్రిలో మోహన్ మృతిచెందాడు. అడ్డొచ్చిన వేలూ రు సతీ‹Ùకుమార్ నాయుడుపై హత్యాయత్నం చేశారు. 2016 ఫిబ్రవరి 19 – ఈ కుట్రలో 23 మందికి సంబంధం ఉన్నట్లు న్యాయ స్థానంలో నేరాభియో గపత్రం దాఖలు చేసిన పోలీసులు 2016 ఏప్రిల్ – కఠారి దంపతుల హత్య కేసు విచారణ ప్రారంభం 2025 ఫిబ్రవరి 7 – షరతులతో కూడిన బెయిల్‌పై చింటూ విడుదల 2025 అక్టోబర్ 16 – విచారణ పూర్తి, తీర్పు వెలువరించే తేదీపై ప్రకటన 2025 అక్టోబర్ 24 – చంద్రశేఖర్ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ అనే ఐదుగురిపై నేరం రుజువైనట్లు కోర్టు తీర్పు. మిగిలిన 16 మందిపై నేరం రుజువుకాకపోవడంతో వాళ్లపై కేసు కొట్టేసిన న్యాయస్థానం. శిక్ష ఖారుపై తీర్పు వాయిదా. 2025 అక్టోబర్ 27 – దోషుల మానసిక పరిస్థితి, జైల్లో ప్రవర్తనపై నివేదిక కోరిన న్యాయస్థానం. 2024 అక్టోబర్ 30 – నివేదిక తీసుకున్న అనంతరం ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వాదనలు పూర్తి. మరుసటి రోజుకు తీర్పు రిజర్వు. 2024 అక్టోబర్ 31 – ఐదుగురు దోషులకు మరణ శిక్ష. కడప జైలుకు తరలింపు -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ
పూతలపట్టు(యాదమరి): పీలేరు–చిత్తూరు జాతీ య రహదారి, తలపులపల్లి బస్టాప్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొన్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కర్నూలు నుంచి చిత్తూరు వైపు గా వెళ్తున్న ఓ లారీ టైర్ పంక్చర్ అయ్యింది. దీన్ని గమనించిన డ్రైవరు లారీని పక్కకు ఉంచి టైర్ మార్చడానికి యత్నిస్తున్నాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరొక లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం నామక్కల్‌కు చెందిన లారీ చోదకుడుకి తీవ్రగాయాలయ్యాయి. పూతలపట్టు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చికిత్స నిమిత్తం క్షతగత్రుడిని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ లారీ డ్రైవర్‌ను తరలిస్తున్న సిబ్బంది నుజ్జునుజ్జయిన లారీ ముందు భాగం -
అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలిగా లలిత
చిత్తూరు కలెక్టరేట్ : అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా లలిత, షకీలాను ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో అంగన్వాడీ యూనియన్ మహాసభలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే పలు తీర్మానాలు చేసినట్లు సీఐటీయూ నాయకులు వాడ గంగరాజు, గిరిధర్ గుప్తా వెల్లడించారు. ఏపీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కోశాధికారిగా విజయ, ఉపాధ్యక్షురాలుగా ప్రమీల, లీలావతి, మమత, సుజని, కార్యదర్శులుగా పద్మ, ధన కోటి, అనితతో పాటు 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వాడ గంగరాజు మాట్లాడుతూ అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుతీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు గొల్లపల్లి విద్యార్థులు
పుత్తూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పుత్తూరు మండలం, గొల్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వాయల్పాడులో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో 10వ తరగతి చదువుతున్న ఎం.అమృత అండర్–17 హ్యాండ్ బాల్‌కు, టి.లోకేష్, ఎస్.యశ్విత నెట్‌బాల్‌కు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 8న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు విద్యార్థులను పాఠశాల హెచ్ఎం శ్రీహరి, పీడీ సుబ్రమణ్యం, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు అభినందించారు. తమిళ పాఠశాల విద్యార్థులు పుత్తూరు పట్టణంలోని తమిళ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సంతోష్, దీపిక రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం స్వరూప తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పీడీ గోపీకృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు. -
సర్వే చేయకుండానే మామిడి మొక్కలు తొలగించారు
చౌడేపల్లె: రెవెన్యూ అధికారులు తమ పొలాల్లో సర్వే చేయకుండానే మామిడి మొక్కలు తొలగించారని వెంగళపల్లె పంచాయతీ దాసరయ్యగారిపల్లెకు చెందిన రైతులు వాపోయారు. బాధితుల కథనం మేరకు.. వెంగళపల్లె పంచాయతీ దాసరయ్యగారిపల్లె సమీపంలో రామకృష్ణ పేరిట 1234/2బి, 1235/3బి 1.21 ఎకరాలు, చిన్నవెంకటస్వామి పేరిట 1234/2ఏ, 1235/3ఏ సర్వే నంబర్లలో 1.21 ఎకరాల భూమికి అధికారులు పట్టాలిచ్చారు. వారు అందులో పంటలు సాగుచేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం అధికారులు సర్వే నంబరు 65లో 1.30 ఎకరాల భూమి వంకపొరంబోకు భూమిగా పేర్కొని హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. అంతటితో ఆగక రెండేళ్ల క్రితం నాటిన మామిడి మొక్కలు తొలగించారు. దీనిపై బాధిత రైతు గంగాధర్ శుక్రవారం విలేకరులతో తన గోడు వెల్లబోసుకున్నాడు. తమ పొలం పక్కన సర్వే నంబరు 65 ఎలా వస్తుందని ప్రశ్నించాడు. సర్వే చేయకుండానే వంక పొరంబోకు భూమి వుందని పేర్కొని ఏకపక్షంగా మామిడి మొక్కలు తొలగించారని వాపోయాడు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నాడు. వెంగళపల్లె నుంచి లక్ష్మీ నరసింహస్వామి కొండ వరకు వంక పొరంబోకు భూమి ఆక్రమణకు గురైందని, అధికారులు పారదర్శకంగా సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశాడు. -
అవినీతిని అరికట్టాలి
తిరుపతి క్రైమ్ : లంచం ఇవ్వడం.. తీసుకోవడం నేరమని పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేయాలని ఏసీబీ రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ రావు పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం దేశ సమైక్యతకు పాటుపడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పురస్కరించుకొని అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా 150 మంది విద్యార్థులతో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి లక్ష్మీపురం సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ.. దేశంలో లంచగొండితనాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ఏసీబీ అదనపు ఎస్పీ విమల కుమారి, తిరుపతి ఏఎస్పీ రవి మనోహరా చారి, డీఎస్పీలు, సీఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
యువతకు ఆదర్శం వల్లభాయ్ పటేల్
– సమైక్యత పరుగు ప్రారంభించిన ఎస్పీ తుషార్ డూడి చిత్తూరు అర్బన్ : స్వాతంత్య్రం అనంతరం దేశానికి మొట్టమొదటి హోం మంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నగరంలో సమైక్యత పరుగును ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రతకు ఎంతో కృషి చేశారన్నారు. విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన పటేల్ జీవితం ఆదర్శకరమన్నారు. బ్రిటీషర్లు భారత్‌ను విడిచి వెళ్లాక దేశ రక్షణ, సమగ్రతకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అందుకే ఆయనకు ఉక్కుమనిషి అనే గుర్తింపునిచ్చినట్లు గుర్తుచేశారు. అనంతరం సమైఖ్యతా పరుగు పందెంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అడిషనల్ ఎస్పీలు రాజశేఖర్, శివానందకిషోర్, డీఎస్పీ సాయినాథ్ పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యం
బంగారుపాళెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని తుంబకుప్పం పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో వివిధ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సిబ్బంది అందిస్తున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మందులు సరఫరా అవుతున్నాయా.. లేదా అనే విషయంపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లోహిత్చెంగల్రాయన్ను ఆడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రజారోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలుసూచనలు, సలహాలు అందించారు. ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌ఓలు క్షేత్ర స్థాయిలో పేద ప్రజలకు వైద్యసేవలందించాలని ఆదేశించారు. పీహెచ్సీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. పీహెచ్‌సీకి అవసరమైన ఫ్రిజ్, చిన్నపిల్లల ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైన వామర్ మిషన్, టేబుల్స్, ముందులు పెట్టుకునేందుకు అవసరమైన ర్యాక్‌లు కలెక్టర్ నిధుల ద్వారా అందిస్తామన్నారు. డాక్టర్ సెల్వరాజ్, పాల్గొన్నారు. -
కఠారీ దంపతుల కేసులో సంచలన తీర్పు
సాక్షి, చిత్తూరు: మాజీ మేయర్ కఠారీ అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఐదుగురిని దోషులుగా ఇదివరకే నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం మరణ శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్యోదంతాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో ప్రవేశించిన దుండగులు.. మేయర్ కఠారి అనురాధపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆపై పక్క గదిలో ఉన్న కఠారి మోహన్‌ను కత్తులతో నరికారు. తీవ్ర గాయాలతో మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈ ఘటన. ఈ కేసులో.. తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్(ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు దోషులుగా తేలారు. దీంతో ఈ ఐదుగురికి ఇవాళ మరణశిక్ష విధించారు 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు. కఠారి మోహన్‌కు శ్రీరామ్ చంద్రశేఖర్(చింటూ) మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాల నేపథ్యంతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 122 మంది సాక్షులను విచారించారు. A 1 నిందితుడు చంద్ర శేఖర్ @చింటూ, A 2 నిందితుడు వెంకట చలపతి@ ములబాగల్ వెంకటేశ్, A 3 నిందితుడు జయ ప్రకాష్ రెడ్డి, A 4 నిందితుడు మంజునాథ్, A 5 నిందితుడు వెంకటేశ్@ గంగన్న పల్లి వెంకటేశ్. వీళ్లలో ఏ3, ఏ4గా ఉన్న జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్.. అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. తీర్పు నేపథ్యంలో చిత్తూరు పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టు లపై,వాట్సప్ మెసేజ్ పై ప్రత్యేక నిఘా ఉంచారు. హైకోర్టుకు వెళ్తాం: చింటూ తరపు లాయర్సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లోనే మరణశిక్ష అత్యంత అరుదుగా ఉందంటూ నిందితుల తరఫు లాయర్ విజయ్ చంద్రారెడ్డి అంటున్నారు. చిత్తూరు కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని మీడియాకు తెలిపారు. ‘‘కఠారి అనురాధ మోహన్ దంపతుల కేసులో 57 మందిని విచారించారు. ఐదుగురికి మరణశిక్ష విధించారు. నిందితులను చిత్తూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జిమెంట్ లో చాలా అరుదుగా మాత్రమే మరణశిక్ష విధించారు. వాళ్ల జీవితాలను బాగు చేయాలని మాత్రమే వ్యాఖ్యానించింది. 90 రోజుల్లోపు హైకోర్టును వెళ్తాం. హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారాయన. -
లేఖ రాసుకో..బహుమతి అందుకో!
చిత్తూరు కలెక్టరేట్ : స్టాంపుల సేకరణపై ఆసక్తిని పెంపొందించేందుకు దేశ వ్యాప్తంగా భారతీయ తపాలాశాఖ పోటీలను నిర్వహిస్తోంది. 2025–26 సంవత్సరానికి గాను దాయి అఖర్ ఉత్తరాల పోటీలను జాతీయ స్థాయిలో చేపడున్నారు. లెటర్ టు మై రోల్ మోడల్ అనే అంశం పై ఇంగ్లిష్, హిందీ, అన్ని ప్రాంతీయ భాషల్లో ఉత్తరాలు రాసేలా అవకాశం కల్పించారు. జిల్లాలో 18 ఏళ్ల లోపు, 18 ఏళ్లు దాటిన వారిని రెండు విభాగాలుగా విభజించి ఈ పోటీలను నిర్వహించనున్నారు. చేతితో రాసిన లేఖలకే అనుమతి ఇన్న్ల్యాండ్ లెటర్లపై చేతితో ఎన్వలప్ కేటగిరీలో 1000 పదాలకంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ (ఐఎల్సీ) లో 500 పదాలకంటే ఎక్కువ ఉండకూడదు. చేతితో రాసిన లేఖలకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 8 తర్వాత పోస్ట్ చేసిన ఉత్తరాలు పోటీలో పాల్గొనేందుకు అంగీకరించరు. 18 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాల పైబడిన వారు ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ కేటగిరీ, ఎన్వలప్ కేటగిరీల్లో పాల్గొనవచ్చు. ఇలా రాసిన ఉత్తరాలను ప్రధాన కార్యాలయమైన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ చిత్తూరు–517001 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. రాసే ఉత్తరాల్లో సంతకంతో పాటు వయసును రాయాలి. చిరునామాపైన ఎంట్రీ ఫర్ దాయి అఖర్ 2025–26 అని రాసి పోస్టు చేయాలి. ఈ పోటీలకు డిసెంబరు 8 వరకు గడువుంది. బహుమతులు ఇలా.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిస్తే రూ.50 వేలు, ద్వితీయంలో నిలిస్తే రూ.25 వేలు, తృతీయ స్థానంలో నిలిస్తే రూ.10 వేలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, ద్వితీయంలో నిలిస్తే రూ.10 వేలు, తృతీయంలో నిలిస్తే రూ.5 వేలు ఇస్తారు. మంచి అవకాశం లేఖలు రాసే ప్రతి ఒక్కరికీ ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకుని పోటీల్లో పాల్గొనాలి. ఉత్తరాలను స్పీడ్ పోస్టులో మాత్రమే పంపాలి. ఎన్వలప్ పై ఫిలాట్లీ స్టాంపులను వినియోగించవచ్చు. ప్రతి కేటగిరీలో మొదటి మూడు ఉత్తరాలు సర్కిల్ స్థాయిలో షార్ట్‌లిస్ట్ చేస్తాం. సర్కిల్ స్థాయిలో ఆ లేఖలకు బహుమతులను అందజేస్తాం. – బి.లక్ష్మన్న, పోస్టల్ సూపరింటెండెంట్, చిత్తూరు పోస్టల్ డివిజన్ -
పెళ్లి పేరిట బాలికపై లైంగికదాడి
– 20 ఏళ్ల జైలుశిక్ష చిత్తూరు లీగల్ / చిత్తూరు అర్బన్: ప్రేమించాను, నిన్నే పెళ్లిచేసుకుంటానని చెప్పి.. మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ పూల నరేంద్రరెడ్డి (31) అనే ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన నరేంద్రరెడ్డి ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నాని ఆమెను నమ్మించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని, ఆమెతో పలుమార్లు శారీరకంగా కలిశాడు. విషయం తెలుసుకున్న బాలి క తండ్రి నవంబరు 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలికపై లైంగికదాడి చేసినందుకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టుకు తరలించగా నేరం రుజువయ్యింది. దీంతో ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పునిచ్చారు. బాధితు రాలి కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. -
ఆశలపై మోంథా పడగ
పుంగనూరు: మోంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మండలంలో 60 ఎకరాల్లో టమాటా నేలమట్టమైంది. ముఖ్యంగా మాగాండ్లపల్లి, రాగానిపల్లి, మంగళం, చదళ్ల, బండ్లపల్లె, అరవపల్లి ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా 25 ఎకరాల్లో చామంతి, బంతిపూల తోటలు నాశనమయ్యాయి. 11 ఎకరాల్లో కాలీ ఫ్లవర్ నేలమట్టమైంది. సోమల, సదుం మండలాల్లో వరి 11 ఎకరాలలో దెబ్బతినింది. టమాటా సాగు చేయడానికి ఎకరాకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశామని, భారీ వర్షా లకు పంట దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయి నట్టు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ వరప్రసాద్ మాట్లాడుతూ పరిశీలించి నివేదికలు పంపుతామని తెలిపారు. -
చంద్రబాబుకు ఏ వర్గంపై కూడా ఆపేక్ష లేదు
సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్లల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కానీ ప్రచార్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. ఆయనకు ఏ వర్గంపైన కూడా ఆపేక్ష లేదు. వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబే స్వ యంగా చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల్ని గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సీఎం చంద్రబాబు మనల్ని మర్చిపోయినా వైఎస్ జగన్ మాత్రం మనల్ని గుర్తుపెట్టుకుని మా పక్షాన పోరాడుతున్నాడని మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎంతో కష్టపడి మన హయాంలో కుప్పం నియోజకవర్గానికి నీళ్లిస్తే ఆరోజున కాలువలో కూర్చుని చంద్రబాబు ధర్నా చేశాడు. రైతులు నీళ్లొద్దు అనుకుంటున్న సమయంలో చంద్రబాబు నీళ్లు తీసుకుపోయి నేనే నీళ్లిచ్చా, చెరువులు నింపానని ప్రచారం చేసుకుంటున్నాడు’’అని అన్నారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు గడువు పొడిగింపు తిరుపతి సిటీ: 2026–27 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూళ్లలో 6, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల సమర్పణ గడువును నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించారని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత డాక్టర్ యన్.విశ్వనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష జనవరి 18వ తేదీన జరుగుతుందని తెలిపారు. అర్హత లు, పరీక్షా విధానం గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు వరదరాజనగర్‌లోని విశ్వం కోచింగ్ సెంటర్లోగానీ, 86888 88802, 93999 76999 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 29,186 మంది పరీక్ష ఫీజు చెల్లింపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యాసంవత్సరంలోఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల్లో ఈ నెల 30వ తేదీ వరకు 29,186 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించేందుకు ఈ నెల 31 వరకు రాష్ట్ర ఇంటర్మీడియెట్ అధికారులు అవకాశం కల్పించారు. కాగా జిల్లా లోని అన్ని యాజమాన్యాల ఇంటర్మీడియెట్ కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం 15,098, ద్వితీయ సంవత్సరం 15,354 మొత్తం 30,452 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఈనెల 30 వరకు మొదటి సంవత్సరం 14,710, ద్వితీయ సంవత్సరం 13,760 పరీక్ష ఫీజు చెల్లించగా మిగిలిన 1,266 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. కాగా ప్రస్తుత విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ట్లు రాష్ట్ర ఇంటర్మీడియెట్ అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. వరసిద్ధుని సేవలో కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని గురువారం కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ నటరాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం పండితుల ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీనాయుడు, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
చేపల వలలో భారీ కొండచిలువ
పూతలపట్టు(యాదమరి): చేపల కోసం వేసిన వలకు ఓ భారీ కొండ చిలువ చిక్కిన ఘటన మండలంలోని నీవా నదిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమ వారం నీవానదిలో కొందరు చేపల వేట కోసం వల వేశారు. అనూహ్యంగా అందులో చేపలకు బదు లు భారీ కొండచిలువ పడింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచార అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను బయటకు తీసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
ఆరోగ్య కేంద్రాలు అలర్ట్
– 3న జిల్లాకు కేంద్ర బృందం రాక చిత్తూరు రూరల్ (కాణిపాకం): కేంద్ర బృంద పర్యటన ఖరారుతో ఆరోగ్య కేంద్రాలు అలర్ట్ అయ్యాయి. మగ్గిన, గడువు తీరిన మందులను మాయం చేస్తున్నాయి. జిల్లాలో పీహెచ్‌సీలు 50, విలేజ్ హెల్త్ క్లినిక్ 464, అర్బన్ హెల్త్ సెంటర్ 15 దాకా ఉన్నాయి. వీటిలో వైద్య, ఆరోగ్య సేవలు అంతంత మాత్రమే. క్షేత్ర స్థాయిలో పనిచేసే పలువురు ఏఎన్ఎంలు ప్రజారోగ్యంపై చిన్నచూపు చూస్తున్నారు. సర్వేలు, ఇతరాత్ర పనులకు పరిమితమవుతున్నారు. ప్రభుత్వం అందించే మందులు, మాత్రలను ఇవ్వకుండా....ప్రైవేటు ఆస్పత్రులు, ఆర్ఎంపీలకు రెఫర్ చేస్తున్నారు. ఈ కారణంగా విలువైన మందులు, మాత్రలు క్షేత్ర స్థాయిలో పేరుకుపోయి చివరకు రోడ్డుపాలవుతున్నాయి. నవంబర్ 3న కేంద్ర బృందం రాక నవంబర్ 3వ తేదీన జిల్లాకు కామన్ రివ్యూ మిషన్ (కేంద్ర బృందం) రానుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమ అమలుతీరుపై పరిశీలించనుంది. పది మందితో కూడిన బృందం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది. మొత్తం 32 అంశాలపై లోతుగా ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య అప్రమత్తవుతోంది. తప్పులు సరిదిద్దుకునే పనిలో... కేంద్ర బృందం రాకను పసిగట్టిన విలేజ్ హెల్త్ క్లినిక్, ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాంతాలోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే పలువురు ఏఎన్ఎంలు తప్పులు సరిదిద్దుకునే పనిలో పడ్డారు. వారి పరిధిలోని రికార్డులను సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. పేరుకుపోయిన మందులు, మాత్రలను తీసి బయట పడేస్తున్నారు. గడువు తీరిందని సాకు చూపించి చెత్తకుప్పల్లో వేస్తున్నారు. అధికారులు సైతం జిల్లాకు చెడ్డపేరు రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. -
అదే ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ జంట హత్యల కేసు చివరి అంకానికి చేరింది. దోషులు ఐదుగురుకి విధించే శిక్షపై శుక్రవారం తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. కోర్టు ఇవ్వనున్న తీర్పుపై అటు బాధిత కుటుంబాల్లో.. ఇటు దోషుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా దోషులైన చంద్రశేఖర్ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ, వెంకటేష్‌ను గురువారం మధ్యాహ్నం చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇన్చార్జ్ న్యాయమూర్తి డా.ఎన్.శ్రీనివాసరావు ఎదుట హాజరుపరిచారు. తీర్పుపై ఆసక్తి జంట హత్యల కేసులో 21 మంది నిందితుల్లో 16 మందిపై కేసు కొట్టేయడం, ఐదుగురిపై నేరం రుజువైనట్లు ఇప్పటికే కోర్టు ప్రకటించింది. తీర్పు నేపథ్యంలో న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమ నిబంధనలు పాటిస్తూ, దోషుల నుంచి పలు ప్రశ్నావళికి సమాధానాలు రాబట్టడం, వాళ్ల మానసిక పరిస్థితి తెలుసుకోవడం, చివరగా డిఫెన్స్, ప్రాసిక్యూషన్ వాదనలకు న్యాయస్థానం అవకాశం ఇచ్చింది. తుదిగా తీర్పు తేదీని ప్రకటించడంతో ఎలాంటి శిక్ష ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘంగా వాదనలు దోషుల సామాజిక ప్రవర్తన, మానసిక పరిస్థితి, జైల్లో పరివర్తనలపై ఆయా శాఖల అధికారులు న్యాయస్థానానికి సీల్డు కవరులో నివేదిక అందచేశారు. అనంతరం దోషుల తరఫున డిఫెన్స్ వాదన ప్రారంభించారు. మరణశిక్షలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన పలు తీర్పులను న్యాయమూర్తి ఎదటు ఉదహరించారు. ఈ కేసులో దోషులకు మరణశిక్ష విధించే తీవ్రత లేదని, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను న్యాయస్థానానికి అందచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన డిఫెన్స్ వాదనలు.. అర్ధగంట మినహా సాయంత్రం 6.40 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ప్రాసిక్యూషన్ సైతం తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాక తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపై శుక్రవారం తీర్పును వెలువరిస్తామని న్యాయస్థానం చెప్పడంతో దోషులను చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. -
కన్నీటితో సాగు!
పరిహారం కోసం ఎదురుచూపు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో సుమారుగా 1.80 లక్షల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా మామిడి, వరి, వేరుశనగ, పండ్ల తోటలు, టమాటా, కూరగాయలు సాగు చేస్తున్నారు. వీరి బతుకులపై ప్రకృతి పగబట్టింది. ఓ పక్క ఎండలు, మరో వైపు వర్షాలు, ఇంకో వైపు తెగుళ్లు దాడి చేయడంతో అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోవాల్సి వచ్చింది. వేధిస్తున్న అప్పులు ఎకరా విస్తీర్ణంలో పంట వేయాలంటే రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వ్యయమవుతోంది. చేతిలో చిల్లిగవ్వలేక.. పెట్టుబడి పెట్టలేక అప్పులు చేయాల్సి వస్తోంది. పట్టా పుస్తకాలు ఎత్తుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. భార్య మెడలోని పుస్తెలు తాకట్టుపెట్టి పెట్టుబడి పెట్టినా పంట చేతికొస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. ప్రకృతి ప్రకోపం పచ్చని పంటలపై ప్రకృతి విలాయతాండవం చేస్తోంది. రైతులు పండించిన పంటలను ఎందుకూ పనికిరాకుండా చేస్తోంది. 2024లో అదునుకు తగ్గ వర్షాలు లేక వేరుశనగ పంట తీవ్రంగా నష్టపోయింది. 9 వేల హెక్టార్లల్లో నష్టం జరిగినట్లు అంచనా వేసి అప్పట్లో వ్యవసాయశాఖ అధికారులు నివేదికలు ఇచ్చారు. కేంద్ర బృందం కూడా కరువు మండలాలను సందర్శించింది. కానీ ఇంతవరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఈ సారి వేరుశనగ సాగు ఘణనీయంగా తగ్గింది. అలాగే మామిడి పంట అతలకుతలం చేసింది. వరి కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడించింది. ఈ మధ్య కాలంలో వేరుశనగ, వరి, టమాటా, కూరగాయలు, పూలతోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట నష్టం సుమారుగా రూ.25 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు వరి 430 ఎకరాలు, బొప్పాయి 7 ఎకరాలు, పూలు 5 ఎకరాలు, టమాట 13 ఎకరాలు, కాలీఫ్లవర్ 5 ఎకరాలు, పొట్లకాయ 2 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. దీని విలువ ప్రాథమిక అంచనా ప్రకారం రూ.77 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు అధికారులు నివేదికలు ఇచ్చినా ఇంతవరకు పరిహారం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. దెబ్బతిన్న పంటల పరిశీలన గుడిపాల: తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను గురువారం జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సందర్శించారు. మండలంలోని పేయనపల్లెలో వరి, తుమ్మలవారిపల్లెలో దెబ్బతిన్న వేరుశనగ పంటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు నివేదికలు పంపుతామని, పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి వారికి లబ్ధి చేకూరేలా చూస్తామన్నారు. వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమ, వ్యవసాయాధికారి సంగీత పాల్గొన్నారు. -
పురుషోత్తమునికి పుష్పాంజలి
శ్రీవారికి పుష్పయాగం నిర్వహిస్తున్న వేదపండితులుతిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. అంతకు ముందు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. – తిరుమల -
టెట్‌కు ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : టెట్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చిత్తూరు కుట్టి డీఎస్సీ శిక్షణ కేంద్రం డైరెక్టర్ పవనకుమారి తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. సబ్జెక్టు నిపుణులచేత 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తరగతులు నవంబర్ 2 నుంచి పలమనేరు కుట్టి కోచింగ్ సెంటర్లో ప్రారంభమవుతాయన్నారు. శిక్షణలో అతి సులభంగా టెట్ క్వాలిఫై అవ్వడం ఎలా? ఏయే పుస్తకాలు చదవాలి? ప్రిపరేషన్ విధానం ఎలా? అనే అంశాలపై నిపుణులు విశ్లేషిస్తారన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాలకు 9491844963 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంటి గోడ కూలి.. రొంపిచెర్ల: ఇంటి గోడ కూలింది. భార్యాభర్తల కు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన రొంపిచెర్ల మండలం, బుసిరెడ్డిగారిపల్లెలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొండ్ల నారాయణ, పద్మావతి దంపతులు ఇంట్లో నిద్రిస్తున్నారు. ఒక్క సారిగా పెద్దశబ్దంతో గోడ కూలిపోయింది. భార్యాభర్తలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ తడిసి మొత్తబడి కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆలయ హుండీ చోరీ శ్రీరంగరాజపురం : మండలంలోని పల్లేరుకాయకోనలో వెలసిన శ్రీ ఆత్మలింగేశ్వరస్వామి ఆలయ హుండీని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆలయ ధర్మ కర్త మోహన్‌నాయుడు కథనం.. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ హుండీని పగులగొట్టి అందులోని నగదును దొంగలించారు. ఆలయానికి వెళ్లే మార్గంలో ఓ వైన్‌షాప్ ఉంది. ఇక్కడ మందు బాబుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తాగిన మైకంలోనే కొందరు ఆలయ హుండీని చోరీ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుమన్ తెలిపారు. పాఠశాలలకు క్రీడా కిట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసి న ప్రభుత్వ పాఠశాలలకు క్రీడాసామగ్రి కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సమగ్రశిక్షాశాఖ ఆధ్వర్యంలో కిట్లను సరఫరా చేస్తున్నా రు. 67 రకాల క్రీడాసామగ్రి బ్రాండ్లతో కూడిన కిట్లను పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్లస్టర్ పాయింట్లకు వాటిని అందించనున్నారు. ఆ తర్వాత సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. రూ.1,97 కోట్లకు పైగా ఆదాయం కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని పలు పనులకు గురువారం టెండర్లు నిర్వహించారు. 13 పనులకు టెండర్లు పిలు వగా ఆరు టెండర్లు పూర్తయ్యాయి. పాలు విక్రయానికి సంబంధించిన టెండర్ ద్వారా రూ.9.31 లక్షలు, కొబ్బరి చిప్పల పోగుకు రూ.69,00,309, నేతి దీపాల విక్రయానికి రూ.68,00,999, 2026 సంవత్సర క్యాలెండర్లు ముద్రణ, విక్రయానికి రూ.38లక్షలు, విఘ్నేశ్వర కల్యాణ మండపం వద్ద బంకు న్విహణకు రూ.4.23లక్షలు, శివాల యం ముందర బంకు నిర్వహణకు రూ. 9.10 లక్షల చొప్పున టెండర్లు పాడారు. తద్వారా రూ.1.97,65,308ల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ టెండర్ నగదును శుక్రవారం సా యంత్రానికి వేలంపాట దారులు ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేసేలా ఆదేశాలిచ్చామని ఆయ న పేర్కొన్నారు. ఏఈఓలు ప్రసాద్, రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ బాలరంగస్వామి పాల్గొన్నారు. -
మేత భూమిని మేసేశారు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తప్పుడు రికార్డులు సృష్టించి మేత భూమిని...టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారని పెద్దిశెట్టిపల్లికి చెందిన లక్ష్మణుడు ఆరోపించారు. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు మండలం, పెద్దిశెట్టిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత పురుషోత్తం 1.68 ఎకరాల భూమిని ఆక్రమించుకుని.. మామిడి చెట్లు పెట్టుకున్నాడని తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే... రెవెన్యూ అధికారులు మామిడి చెట్లు తొలగించి..మేత భూమిగా బోర్డు పెట్టాలని ఆదేశించారన్నారు. తర్వాత తమిళనాడుకు చెందిన మహేశ్వరి కూడా రెవెన్యూ అధికారుల సహకారంతో 2.30 ఎకరాల మేత భూమిని తప్పుడు రికార్డులతో ఆక్రమించాడని తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని లక్ష్మణుడు పేర్కొన్నాడు. -
పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే
గంగాధరనెల్లూరు: పిల్లల బాధ్యత తల్లిదండ్రులదేనని చిత్తూరు సీనియర్ సివిల్ జడ్జీ ఎం.భారతి అన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన న్యాయవి/్ఞాన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పిల్లలు పాఠశాలకు, కాలేజీలకు సరైన పద్ధతిలో వెళ్తున్నారా.. లేదా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు సామాజికి స్ఫృహ తప్పితే ఆడ్డదారులు తొక్కే అవకాశం ఉందన్నారు. అలాంటి వాటికి పిల్లలు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల తగాదాలు, భూ వివాదాలు జరిగినప్పుడు వీలైనంత వరకు పోలీస్ స్టేషన్, కోర్టులకు పోకుండా గ్రామాల్లోనే పరిష్కరించుకోవాలని చెప్పారు. కొన్ని తప్పుడు యాప్‌ల ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని దోచుకునేందుకు పన్నాగం పన్నుతున్నారని, అలాంటి వాటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవన్నారు. నవంబర్ 13న చిత్తూరులో లోక్ అదాలత్ జరుగుతుందని, దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, ఎంపీడీఓ మనోహర్‌గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ మహేష్‌కుమార్, ఏఎస్ఐ మురళీప్రసాద్, ఎంఈఓ ఆంజనేయులుశెట్టి, ఏపీఎం ఫరీద్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నూతన విధానం, కేడర్ స్ట్రెంత్, పొజిషన్ ఐడీల ఖరారు నిమిత్తం రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశా రు. ఆ ఉత్తర్వులు గురువారం డీఈవో కార్యాలయానికి చేరాయి. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న ఏడీ, సూపరింటెండెంట్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసి స్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్, ప్రతి మండలం నుంచి ఎంఈవో–1, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌నకు సంబంధిత నివేదికలతో హాజరుకావాలన్నా రు. చిత్తూరు జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు నవంబర్ 18న రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ ఉంటుందన్నారు. ఆ లోపు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
రీ సర్వేలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న రీ సర్వేలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో సర్వే, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండవ, మూడవ విడత రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మూడవ విడత సర్వేలో సుమోటో కరెక్షన్లను నవంబర్ 10 లోపు పూర్తిచేయాలని చెప్పారు. భూ రికార్డులలో సవరణలు, పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్ దరఖాస్తులతో సహా భూ సమస్యలు సకాలంలో పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వీఆర్వో, విలేజ్ సెక్రటరీలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకే పరిష్కారం చూపించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో రీ సర్వే ఇలా.. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఫైలెట్ ప్రాజెక్ట్ లో 31 గ్రామాల్లో 30,774 ఎకరాల భూమిని సర్వే చేశారని కలెక్టర్ వెల్లడించారు. రెండవ విడతలో నగరి, చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లో 38 గ్రామాల్లో 40,359 ఎకరాల భూమి సర్వే చేసినట్లు తెలిపారు. మూడవ విడతలో 12 గ్రామాల్లో 3,859 ఎకరాల భూమిని రీ సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం 2026 మార్చి 31కి పూర్తవుతుందన్నారు. డీఆర్వో మోహన్‌కుమార్, సర్వే శాఖ జేడీ జయరాజ్ పాల్గొన్నారు. -
క్రీడాకారులకు ఉజ్వల భవిత
శ్రీరంగరాజపురం : మండలంలోని ఆరిమాకులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సెపక్‌తక్ర క్రీడా పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. హెచ్ఎం కళావతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమన్నారు. క్రీడల్లో మానసికోల్లాసంతోపాటు మెద డు చురుగ్గా పనిచేస్తుందని చెప్పారు. జిల్లా స్థాయి లో ఎంపికై న విద్యార్థులకు అనంతపురం జిల్లా, ఉరవకొండలో నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. క్రీడాపోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి న విద్యార్థులను ఉపాధ్యాయులు లోకనాథం, శర త్, సురేష్, దేవానందం, లోకేశ్వరి, హరి, మోహన్, గంగాధరం, బాలజీ, చంద్రశేఖర్, బాబు, పద్మశ్రీ, సరోజమ్మ, జానకి, సత్య, అరుణకుమారి, ప్రసన్నకుమారి, మహేష్ తదితరులు అభినందించారు. -
ఇసుక ధరలకు రెక్కలు
పలమనేరు : అదును చూసి పదును పెట్టడమంటే ఇదేనేమో..! ఇటీవల వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోనూ నీరు చేరింది. దీంతో జిల్లాలో ఇసుక తవ్వకాలు దాదాపుగా ఆగిపోయాయి. ఇలా డిమాండ్ వస్తుందని ముందుగానే భావించిన ఇసుక స్మగ్లర్లు వేలాది లోడ్ల ఇసుకను డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టిప్పర్ ఇసుక ధరను అమాంతం పెంచి చిత్తూరు ప్రాంతం నుంచి పలమనేరు , కుప్పం, ఇటు కర్ణాటకలోని హోస్‌కోటకు ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. బుధవారం గంగవరం పోలీసులు రికార్డుల్లేని ఓ ఇసుక టిప్పర్‌ను సీజ్ చేసి మైనింగ్, ఆర్టీవో అధికారులకు అప్పగించడంతో ఈ ఇసుక అక్రమ రవాణా బాగోతం వెలుగు చూసింది. ముందస్తుగా ఇసుక నిల్వ చేసుకొని.. నదుల్లోంచి ఫిల్టర్ ఇసుక తప్ప ఎక్కడా ఇసుకను తోడేందుకు కష్టంగా మారింది. దీంతో ముందస్తుగా ఇసుకను డంప్ చేసుకున్న వారు మాత్రం ఇప్పుడు భారీ ధరలతో ఇసుక టిప్పర్ల ద్వారా కావాల్సిన చోటుకు తరలిస్తున్నారు. గంగాధర నెల్లూరు, చిత్తూరు, బంగారుపాళెం, గంగవరంలలో ఇసుక డంపులున్నట్లు తెలుస్తోంది. వీటిని బహిరంగంగానే వేసినా ప్రభుత్వ పనుల అవసరాల కోసమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ వీటి నుంచే ఇసుక కర్ణాటకకు తరలుతోందనే విషయం అధికారులకు తెలియందేమీకాదు. ధరలు అమాంతం పెంచి.. వర్షాలతో ఇసుకకు నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో ఇసుక స్మగర్లు మొన్నటి దాకా టిప్పర్ ధర చిత్తూరు నుంచి పలమనేరుకు 20 వేలు, వీకోటకు రూ.23 వేలు, కుప్పానికి రూ.25 వేలు, కర్ణాటకకు రూ.90 వేలుగా ఉండేది. ఇప్పుడు పలమనేరుకు రూ.27 వేలు, వీకోటకు రూ.30 వేలు, కుప్పానికి రూ.35 వేలు, హొసకోటకు రూ.1.30 లక్షలకు పెంచేశారు. దీనికి తోడు డ్రైవర్ బత్తా రూ.500 అదనంగా ఇవ్వాల్సిందే.కూటమి అండతో దర్జాగా ... యథేచ్ఛగా అక్రమ రవాణా బంగారుపాళెం నుంచి వీకోట వైపుగా వెళుతున్న ఇసుక టిప్పర్‌ను గంగవరం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇరువురు కానిస్టేబుళ్లు దీన్ని తూకం వేసి ఆపై సంబంధిత శాఖలకు అప్పగించారు. ఇది వీకోటకు చెందిన ఓ వ్యక్తికి తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడు. అయితే ఇసుక ప్రభుత్వ పనుల కోసమని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగించారు. కానీ వాటికి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేకపోవడంతోనే పోలీసులు సీజ్ చేసినట్లు తెలిసింది. పోలీసుల పట్టుకుంది ఓ టిప్పరైతే నిత్యం పదుల సంఖ్యలో ఇదే హైవేపై ఇసుక టిప్పర్లు యథేచ్ఛగా వెళుతుండడం గమనార్హం. ప్రస్తుతం సాగుతున్న ఇసుక అక్రమ రవాణాలో చిత్తూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు, బంగారుపాళ్యానికి చెందిన ఓ టీడీపీ నేత, వీకోటకు చెందిన మరో వ్యక్తి ద్వారా ఇక్కడికి ఇసుక రవాణా అవుతున్నట్లు ఇక్కడి ఇసుక ఏజెంట్లే చెబుతున్నారు. ఇప్పుడు బంగారుపాళెం డంప్ నుంచి వీకోట దాకా ఇసుక సరఫరా అవుతోంది. ఈ ప్రాంతంతో పాటు పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో ఇసుక ఏజెంట్లున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -
సైబర్ నేరాలపై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : ఉన్నతవిద్య చదివే విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన ముఖ్యమని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి విద్యార్థి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే ఆ సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. మొబైల్స్ రూపంలోనే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నట్లు చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. మత్తు జీవితాన్ని నాశనం చేస్తుందన్న విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలన్నారు. సైబర్ నేరాలు నిత్యం పెరుగుతుండడంతో విద్యార్థులు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాలను వినియోగించాలన్నారు. సంబంధం లేని లింక్‌లను క్లిక్ చేయకూడదన్నారు. మహిళల భద్రతకు అమలు చేస్తున్న శక్తి యాప్‌ను విద్యార్థినులు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పీవీకేఎన్ ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. చిత్తూరు సర్కిల్ ఏసీబీ, విజిలెన్స్ సీఐ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు వెల్లడించకూడదన్నారు. క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఫోన్లలో ఓటీపీలు, లింక్‌లు వస్తే వాటిని ఆమోదించకూడదన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ మహేశ్వర, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుంచి 9గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ నిర్వహించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.నేడు పుష్పయాగం శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈనేపథ్యంలో తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. -
సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు
ఐరాల : మండలంలోని కాణిపాకంలో పండారం వీధికి చెందిన చిన్నపాపమ్మ ఇంట్లో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. చిన్నపాపమ్మ, భూలోకయ్య దంపతులు పండారం వీధిలో సొంత భవనంలో నివసిస్తున్నారు. ఉదయం చిన్నపాపమ్మ టీ పెట్టడానికి గ్యాస్ పొయ్యిని వెలిగించింది. ఆ సమయంలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కాగా గ్యాస్ లీక్ అయిన విషయాన్ని గమనించని చిన్నపాపమ్మ స్టౌవ్ వెలిగించేందుకు లైటర్ ఆన్ చేయగా ఒక్కసారిగా స్టౌవ్ నుంచి పెద్ద శబ్ధం రావడంతో భయంతో బయటకు పరుగులు తీసింది. అప్పటికే ఆమె చీరకు నిప్పు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. మహిళ ఇంటి బయటకు వచ్చిన తరువాత సిలిండర్ పేలడంతో ఇళ్లు ధ్వంసమైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి రాణిపేట సీఎంసీకి తరలించారు. -
డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపు
చిత్తూరు కార్పొరేషన్ : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడించేందుకు సిద్ధం కావాలని ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. ఆ సంఘ నాయకులు బుధవారం జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు చట్టం 1996ను పటిష్టంగా అమలుచేస్తూ వెల్ఫేర్ బోర్డు ద్వారా పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించారన్నారు. హామీల పరిష్కారానికి త్వరలో డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ ముట్టడికి కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాములు, నాయకులు గోపీనాథ్, దాసరి చంద్ర, మణి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సేవలే చిరస్మరణీయం
చిత్తూరు కలెక్టరేట్ : ఒక ఐఏఎస్ అధికారి తలచుకుంటే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు...ఎంతో మంది పేద ప్రజలకు విశేష సేవలందించవచ్చు....అలాంటి సేవలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన కలెక్టర్లలో దివంగత ఎం.నాగార్జున ఒకరు. ఆయన 1990–91 వ సంవత్సరంలో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆయన పనిచేసే సమయంలో జిల్లాలో విద్యాభివృద్ధికి అవసరమైన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రస్తుతం కలెక్టరేట్లో అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్‌కు ఎం.నాగార్జున పేరును పెట్టారు. ఆ కాన్ఫరెన్స్ హాల్‌ను బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నూతన హాల్‌కు దివంగత ఐఏఎస్ అధికారి నాగార్జున పేరును పెట్టడం సంతృప్తినిచ్చిందన్నారు. ప్రారంభ కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఆర్డీవో శ్రీనివాసులు, చిత్తూరు తహసీల్దార్ కులశేఖర్, కలెక్టరేట్లోని పలు విభాగాల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డెల్ఫీ టీవీఎస్‌తో ఎంఓయూ
పుత్తూరు: చైన్నెకి చెందిన ప్రముఖ డెల్ఫీ టీవీఎస్ కంపెనీతో పుత్తూరులోని పిళ్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ) కుదుర్చుకుంది. బుధవారం డెల్ఫీ టీవీఎస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగరాజన్ బృందం పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించింది. ఈసందర్భంగా ఇరు వర్గాల మద్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఎంఓయూపై సంతకాలు చేశారు. ప్రిన్సిపల్ ఎస్వీకుమార్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ అవకా శాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ వేలాయుధాచ్చారి, విభాగాధిపతు లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రూ.2 కోట్లతో సహాయక చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాన్ వల్ల జరిగిన నష్టం వివరాలను బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ విలేకరులకు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తుపాన్ సహాయక చర్యలకు ప్రభుత్వం రూ.2 కోట్లు బడ్జెట్ మంజూరు చేసిందన్నారు. ఆ బడ్జెట్‌తో జిల్లాలో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో చెరువులు, రోడ్లు అధికంగా మరమ్మతులకు లోనయినట్లు తెలిపారు. 10 గృహాలు దెబ్బతిన్నాయ్ జిల్లాలోని నగరి, జీడీ నెల్లూరు, పులిచెర్ల మండలాల్లో 10 గృహాలు అధిక వర్షాలకు దెబ్బతిన్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. దెబ్బతిన్న ఒక్కొక్క గృహానికి రూ.50 వేలు సాయం అందజేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. 55 చెరువులకు మరమ్మతులు జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాన్‌కు 55 చెరువులు దెబ్బతిన్నాయని కలెక్టర్ తెలిపారు. దెబ్బతిన్న చెరువులను మరమ్మతులు చేసేందుకు రూ.75 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఈ చెరువుల మరమ్మతు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. పెరిగిన భూగర్భ జలాలు జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా మోంథా తుపాను వల్ల కురుస్తున్న వర్షాలకు 32 మండలాల్లో భూగర్భ జలాలు పెరిగాయని కలెక్టర్ వెల్లడించారు. ఇటీవల చిత్తూరు రూరల్ మండలంలో పిడుగు పాటుకు మృతి చెందిన ఓ బీటెక్ విద్యార్థి కుటుంబానికి త్వరలో ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. మోంథా తుపాన్ సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు, పోలీసులు, సిబ్బంది బాగా పనిచేశారని కలెక్టర్ ప్రశంసించారు. నవంబర్ 5వతేదీ లోపు నష ్టపరిహారం నివేదికలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు నవంబర్ 5 వ తేదీలోపు మోంథా తుపాన్ నష్టపరిహారం నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నష్టపరిహారం నివేదికలు కచ్చితత్వంగా ఉండాలన్నారు. ఎలాంటి అలసత్వం వహించకుండా నిర్ధేశించిన తేదీలోపు నివేదికలను సిద్ధం చేయాలన్నారు. నష్టపరిహారం నివేదికలు సిద్ధం చేసిన అనంతరం వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. నివేదికల తయారీలో తప్పులు దొర్లితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కచ్ఛితమైన నివేదికలు ఇవ్వాలన్నారు. -
నేడు కటారి దంపతుల హత్య కేసు తీర్పుపై విచారణ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్య కేసులో దోషులకు విధించే శిక్షపై గురువారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ కేసులో మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ అనే అయిదుగురిని ఇప్పటికే న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కటారి దంపతుల హత్యలో అయిదుగురిపై నేరం రుజువైనట్లు ప్రకటించింది. కాగా దోషుల మానసిక పరిస్థితి, సామాజిక స్థితి, జైల్లో ప్రవర్తనపై ఆయా విభాగాల అధికారులు నివేదికలు ఇవ్వాలని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదికలను న్యాయస్థానం ముందు ఉంచాలని, దోషులను శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే దోషులకు అన్ని పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. సీల్డు కవరులో నివేదికను న్యాయస్థానం ముందు ఉంచనున్నారు. నివేదిక చూసిన తరువాత న్యాయమూర్తి శిక్షపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చిత్తూరు కోర్టు కాంప్లెక్సు వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. -
సేవలే చిరస్మరణీయం
సేవలే చిరస్మరణీయంగా నిలుస్తాయని బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు.వరి గింజలు మొలకెత్తి.. ప్రస్తుతం కింద పడిన వరిని కోతకోయాలంటే వరికోత మిషన్‌లో సాధ్యం కాదు. భూమి ఆరే వరకు ఉంటే గింజలు మొలకెత్తే ప్రమాదం ఉంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అటు వర్షంతో ఇటు అధిక ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయి కొలుకోలేని దెబ్బ తగిలిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. కొంత మంది రైతులు కాసింత తెరపివ్వడంతో అన్నదాతలు సహాయక చర్యలకు ఉపక్రమించారు. పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించుకుని పాలాలను ఆరబెట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో కాసింత ఇబ్బందులు లేకపోయినా దిగువ ప్రాంతాల్లో మాత్రం వర్షపు నీరంతా పంట పొలాల్లో నిలిచి ఉంటడంతో పంట కుళ్లి పనికిరాకుండా పోయామని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రైవేటు బస్సుల అక్రమాలకు బ్రేకులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రైవేటు బస్సు అక్రమాలకు బ్రేకులు వేసేందుకు జిల్లా రవాణా శాఖ అధికారులు పట్టుపట్టారు. కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై ఈనెల 25న సాక్షి దినపత్రికలో ‘అమ్మో బస్సు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లాలోని రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు విస్తృతం చేసి నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా మీదుగా నిత్యం 240కు పైగా ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటాయి. బెంగుళూరు, తమిళనాడులోని రామేశ్వరం, మధురై, కోయంబత్తూరు, చైన్నె, వేలూరు, తిరుపతి, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు నిత్యం ట్రావెల్స్ బస్సులు చిత్తూరు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాలో వేల మంది నిత్యం ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. కర్నూలు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన, సాక్షిలో వచ్చిన కథనంపై స్పందించిన రవాణా అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు విస్తృతం చేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన తనిఖీలో 12 బస్సులను సీజ్ చేశారు. అలాగే 62 కేసులు నమోదు చేశారు. బుధవారం కూడా తనిఖీలు కొనసాగాయి. నిబంధనలు లేని బస్సులు సీజ్ ప్రధానంగా చిత్తూరు నగరంలోని ఇరువారం బ్రిడ్జి వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ మార్పు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు ఉన్నాయా, లేదా అని పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ బస్సులకు ఒరిజినల్ రికార్డులు అందుబాటులో లేకపోవడం, పరిమితికి మించి లగేజీ రవాణా, డ్రైవర్ల లైసెన్స్ గడువు ముగియడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. రికార్డుల్లో బస్సు సీటు రకం..కానీ రోడ్డుపై స్లీపర్ బస్సుగా నడపడం గుర్తించి సీజ్ చేశారు. -
దివ్యాంగుల పింఛన్లపై వేధింపులు తగదు
ఐరాల : అర్హులైన దివ్యాంగుల పింఛన్లపై రాజకీయ వేధింపులు తగదని ఏపీ వికలాంగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అర్హులైన దివ్యాంగుల పింఛన్ పొందుతున్న వారిపై వేధింపులు నిరసిస్తూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుమతి, లీలాపతినాయుడు తదితరులు బాధిత దివ్యాంగులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, మురళీ మాట్లాడుతూ.. ఐరాల పంచాయతీ, గోవిందరెడ్డిపల్లెకు చెందిన వరదరాజులురెడ్డి, గోవిందమ్మ, చిన్నరాజులరెడ్డి, నాగరత్నమ్మ, తులసమ్మ, చిట్టిబాబుల దివ్యాంగుల పింఛన్లపై అదే గ్రామానికి చెందిన కూటమి నేత తన రాజకీయ ఆదిపత్యం కోసం తన అనుచరులతో కలిసి అధికారులకు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసి అనేక పర్యాయాలు విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని, బాధిత వికలాంగులు జేఏసీ నేతలకు తెలిపారన్నారు. వీరందరూ ఇదివరకే సదరం రీ వెరిఫికేషన్ చేయించుకుని నూతన సదరం సర్టిఫికెట్లు పొందారన్నారు. కాగా వీరి పింఛన్లు తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుని తప్పుడు ఫిర్యాదులతో, కుట్రపూరిత ఆలోచనలతో వేధింపులకు గురిచేయడం సమంజసం కాదని హితువు పలికారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కూటమి నేతతో పాటు అతని అనుచరులపై పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జేఏసీ నేతలు తెలిపారు. విచారణ పేరుతో వేధిస్తున్న అధికారులపై ఏపీ లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు ఏకాంబరం, ప్రసాద్, కవిత, భాగ్యలక్ష్మి, గోవిందగౌడ్, నారాయణరెడ్డి, భూపతి, బాధిత వికలాంగులు పాల్గొన్నారు. -
పంట నష్టం అంచనా కొంతే..
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో నీటి వసతి ఉన్న చాలా మంది రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం ఆ వరిపంట కొన్ని చోట్ల ఎన్నుదశలో ఉండగా మరికొన్నిచోట్ల కోత దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో కోతలు ప్రారంభించాలనుకున్న తరుణంలో వర్షం అన్నదాతలు నిలువునా ముంచేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రైతుల కష్టమంతా వర్షార్పణమయింది.. చేతికొచ్చే పంట నేలపాలు కాగా.. సాగు ఖర్చు. నీళ్లపాలైంది. జిల్లాలో చాలా చోట్ల వర్షం ధాటికి వరి పంట నీట మునగగా..పలుచోట్ల మట్టిపాలైంది. వరి 430 ఎకరాల దాకా నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు టమాట, కూరగాయల పంటలు పూల సాగు దెబ్బతిన్నాయి. తుపాను హడావుడి.. కానరాని అధికారులు రెండు రోజుల పాటు జిల్లాకు తుపాను ముసురును తెచ్చిపెట్టింది. ఈ ముసురు దెబ్బకే వందల ఎకరాల పంటలు నీటమునగడం, నేలమట్టం అయ్యాయి. అయితే కొంత మంది జిల్లా అధికారులు మినహా.. మిగిలిన అధికారులు హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. పలువురు మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది మాత్రం తుపాను ఆదేశాలకు వర్షపు నీటిలో వదిలేశారు. ప్రతి ఒక్కరు విధుల్లో ఉండాలని, సెలవులు లేవని స్పష్టంగా జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన విధులకు డుమ్మా కొట్టారు. సోమ, మంగళ వారాల్లో పలు మండల, సచివాలయాల్లో సిబ్బంది లేక బోసిపోయాయి. సచివాలయాలకు ఒకరిద్దరు చొపున మాత్రమే కనిపించారు. విపత్తు సమయంలో కూడా అధికారుల తీరు ఇలా ఉంటే.. ఆపై గొప్పలు చెప్పడం విమర్శలకు దారి తీస్తోంది. చిత్తూరు మండలంలోని పలువురు సచివాలయ సిబ్బందికి ఆ రెండు రోజులపాటు విధుల్లో లేరని షోకాజు నోటీసులు ఇచ్చారు. మిగిలిన మండలాల్లో ఆ ఊసే లేదు. వారిని పట్టించుకునే నాథులు కరువయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలను మండల స్థాయి అధికారులు తుంగలో తొక్కారు.జిల్లాలో అధిక విస్తీర్ణంలో వరి పంటకు నష్టం వాటిల్లింది. వరి 430 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. పెనుమూరు మండలంలో 140 ఎకరాలు, గుడిపాలలో 135 ఎకరాలు, వెదురుకుప్పంలో 37 ఎకరాలు, పూతలపట్టులో 33 ఎకరాలు, నగరి, పాలసముద్రం, జీడీనెల్లూరు, ఎస్ఆర్పురం, సోమల, సదుం, చౌడేపల్లి మండలాల్లో కూడా ఎకరాల కొద్ది పంట నష్టం జరిగినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇక ఉద్యాన శాఖలోని బొప్పాయి 7 ఎకరాలు, పూలు 5 ఎకరాలు, టమాట 13 ఎకరాలు, కాలీఫ్లవర్ 5 ఎకరాలు, పొట్లకాయ 2 ఎకరాలు మాత్రమే జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు గణంకాలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలోని ఉద్యానశాఖ అధికారులు మామిడి పునఃపరిశీలన పేరుతో తుపాను నష్టంపై నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణులున్నాయి. సదుం, చౌడేపల్లి, సోమల మండలాల నుంచి మాత్రమే నష్టం వివరాలు వచ్చాయని, మిగిలిన చోట్ల ఉద్యాన పంటలపై చూసీ చూడనట్లు వదిలేశారని రైతులు వాపోతున్నారు. ఉద్యాన పంటలు మొత్తం కలిపి 250 ఎకరాలకు పైగా నష్టం జరిగి ఉండవచ్చుని, అధికారులు పంట నష్టంపై పక్కాగా పరిశీలన చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆస్తి ,ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డాం
చిత్తూరు కలెక్టరేట్ : మోంథా తుపాను కరుణించడంతో జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తలేదని జిల్లా స్పెషల్ ఆఫీసర్ పీఎస్.గిరీషా అన్నారు. మోంథా తుపాను స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లాకు విచ్చేసిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. మోంథా తుపాను వల్ల ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తప్పించుకున్నామన్నారు. మోంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని భావించి ప్రభుత్వం తనను జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించిందన్నారు. రెండు రోజులుగా జిల్లాలో అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడం జరిగిందన్నారు. జిల్లాలోని గంగాధరనెల్లూరు, నగరి మండలం, నగరి మున్సిపాలిటీ తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించినట్లు తెలిపారు. నష్టాలపై ప్రాథమిక అంచనాలను కలెక్టర్ త్వరలో ప్రభుత్వానికి త్వరలో పంపిస్తారని తెలిపారు. నగరి వద్ద ఓ ప్రాంతంలో ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగిస్తే కింది భాగంలోని చెరువుల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని ప్రజలు కోరారు. వాటిపై తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు స్పెషల్ ఆఫీసర్ వెల్లడించారు. -
రైల్వేస్టేషన్లో ముందస్తు చర్యలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: మోంథా తుపాన్ నేపథ్యంలో రైల్వేశాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టిందని తిరుపతి రైల్వేస్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు తిరుపతి, విజయవాడతోపాటు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తెనాలి, విశాఖ పట్టణం వంటి ముఖ్యస్టేషన్లకు సంబంధించిన రైళ్ల రద్దు, సర్వీసుల కలిగిన రైళ్ల రాకపోకల వివరాల కోసం 24 గంటలు సేవలు అందించేలా రెల్వేస్టేషన్ ప్రధాన ద్వారంలోని టికెట్టు బుకింగ్ కౌంటర్ భవనంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. రైళ్ల రాకపోకలు, రైలు పట్టాలు, వంతెనల పరిస్థితులు, కాలువల నీటి ప్రవాహాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ బృందాలతో పాటు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. రద్దయిన రైళ్ల ప్రాంతాలకు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్టు మొత్తం తిరిగి చెల్లించేందుకుగాను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కాగా మంగళవారం తిరుపతి నుంచి వెళ్లే పూరి ఎక్స్‌ప్రెస్, కడప నుంచి తిరుపతి మీదుగా విశాఖ పట్టణం వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్, అలాగే విశాఖపట్టణం వెళ్లే ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. బుధవారం కాకినాడ నుంచి బయలుదేరే శేషాద్రి ఎక్స్‌ప్రెస్, నర్సాపురం నుంచి బయలుదేరే ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌తో పాటు తిరుపతి నుంచి విశాఖపట్టణం వెళ్లే డబుల్ డెక్కర్ రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
సక్రమంగా బిల్లులు పెడితేనే పనిచేయండి
గుడుపల్లె: ఉపాధి పథకంలో చేస్తున్న పనులకు సక్రమంగా మస్టర్లు, బిల్లులు పెడితేనే పనిచేయాలని పీడీ రవికుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 19వ ఉపాధి పథకం సామాజిక తనిఖీ బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకంలో కూలీలకు సక్రమంగా ఇచ్చే బిల్లులకు సంబంధించి మస్టర్లలో సంతకాలు సేకరించి రికార్డులు సంక్రమంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు మండలంలోని 18 గ్రామ పంచారయతీల్లో జరిగిన ఉపాధి పనులపై బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ పంచాయతీల్లో బిల్లులు పెట్టినా కూడా మస్టర్లలో సంతకాలు లేకుండా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పథకంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఉపాధి హామీకి సంబంధించి రూ.44 వేలు రికవరీ చేశామన్నారు. మిగిలిన నగదును వారంలోపు చెల్లించాలని తెలిపారు. ఏపీఓ అనీల్‌కుమార్, ధనయ్య, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెట్లు తదితరులు పాల్గొన్నారు. -
వెట్టి నుంచి కుటుంబానికి విముక్తి
గంగాధర నెల్లూరు : ఇటుక బట్టీలో వెట్టి చాకిరి చేయిస్తూ కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులు పెడుతున్న యజమాని నుంచి ఓ కుటుంబాన్ని జీవన జ్వాల సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వాధికారులు విముక్తి కలిగించారు. గంగాధర నెల్లూరు మండలంలోని బుక్కపట్నం గ్రామం గుట్ట వద్ద పుష్పరాజ్ అనే ఇటుకల వ్యాపారి తమిళనాడు రాష్ట్రం నుంచి ఓ కుటుంబాన్ని 37 వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి ఇటుకల బట్టిలో పనిచేయడానికి రప్పించుకున్నారు. సంవత్సరాల గడుస్తున్నా ఇంటికి పంపించకుండా కూలి డబ్బు ఇవ్వకుండా నిర్బంధించి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, జీవన జ్వాల సంస్థ ప్రతినిధులకు ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించగా స్పందించిన ఆర్డీఓ స్థానిక తహసీల్దార్‌కు తక్షణమే వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది బుక్కాపట్నం గుట్ట వద్దకు చేరుకుని వెట్టి చాకిరి నుంచి కుటుంబాన్ని విముక్తి చేశారు. చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మంగళవారం చెరువు కట్ట వైపు వెళుతున్న వారు.. నీటిలో తేలుతున్న ఓ మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేశారు. శవం బాగా కుళ్లి ఉండటంతో ఇది వారం కిందట జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు దాదాపు 35 ఏళ్లు ఉంటుందని, ఇతడి కుడిచేతిపై ఆంగ్లంలో అను పేరిట పచ్చబొట్టు ఉందని వన్‌టౌన్ సీఐ మహేశ్వర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతుడి వివరాలు తెలిస్తే 9440796707 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్‌ఎస్‌యూలో అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాలు తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత సమాజ నిర్మాణమే ఈ విజిలెన్‌న్స్ అవేర్నెస్ వీక్ ముఖ్యోద్దేశం అని, ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి సమాజహితం కోసం పనిచేయాలని, విశ్వవిద్యాలయాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో కృషషి చేయాలని పిలుపునిచ్చారు. -
ఆగని ఆక్రమణలు
పెద్ద చెరువు.. పలమనేరు : పట్టణంలోని పెద్ద చెరువు గోస ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. ఇప్పటికే చెరువు మొరవల వద్ద భారీగా ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. కట్టను సైతం చదును చేసి లేఅవుట్లకు దారులు వేశారు. తూర్పు, పడమట మొరవల వద్ద కట్టపై భారీ భవంతులు నిర్మించారు. తాజాగా మంగళవారం కొందరు కట్ట కింద తమ భూమి ఉందంటూ నడికట్టపై గంగమ్మ గుడి వద్ద జేసీబీతో చదును చేస్తుండగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరి స్వార్థం కోసం పెద్ద చెరువు కట్ట కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా పెద్దచెరువు మొరవ పారుతోంది. ఇలాంటి సమయంలో కట్టను ఎవరైనా ముట్టుకుంటారా? ఏ మాత్రం కట్ట దెబ్బతిన్నా కట్ట తెగడం ఖాయం. ఇలాంటి తరుణంలో కొందరు ఆయకట్టులో భూములున్న వారు కట్టపై గంగమ్మ గుడివద్ద పూజల పేరిట జేసీబీతో కట్టను చదును చేశారు. వీరి దెబ్బకు కట్ట తెగడం ఖాయమని భయపడిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ ఇంజినీరింగ్, ఇరిగేషన్ అధికారులకు సమాచారమిచ్చారు. వారెవరూ పట్టించుకోకపోగా ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ మాత్రం వెంటనే స్పందించి అక్కడున్న జేసీబీని పనులు చేయకుండా అడ్డుకున్నారు. కట్ట ఏౖమైనా తమకు సంబంధం లేదు.. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. పెద్ద చెరువు కట్ట ఆక్రమణలు తమ పరిధిలోకి రావని ఇరిగేషన్ అధికారులు చూసుకుంటారని జారుకున్నారు. కట్టపై పారిశుద్ధ్య పనులు, మొక్కలు నాటే మున్సిపల్ అధికారులకు వాటిపై హక్కు ఉంటుంది. కానీ కట్టను తెంచినా పట్టించుకోరట. గతంలోనూ మున్సిపల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖల సమన్వయ లోపంతోనే భారీగా అక్రమ కట్టడాలు కట్టపై వెలిశాయనే ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా ఇరిగేషన్ అధికారుల చర్యలు గతంలో కట్టపై రియల్ ఎస్టేట్‌కు దారి కోసం కట్టను తవ్వినా ఇరిగేషన్ అధికారులు పెద్దగా స్పందించలేదు. దాన్ని ఆర్అండ్బీ వారు చూసుకుంటారని పట్టించుకోలేదు. కట్టకు ఇరువైపులా పెద్ద భవన నిర్మాణాలు చేపడుతున్నా అది వారి పట్టా భూమిలేనని వదిలేశారు. ఇప్పుడు ఏకంగా నడికట్టపై జేసీబీతో తవ్వుతున్నా అడిగేవాళ్లే లేకుండా పోయారు. అధికారుల తీరుపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టపై జేసీబీతో తవ్వినా పట్టించుకోరా? ఇప్పటికే పెద్ద చెరువు కట్ట ఆక్రమణలకు గురైంది. ఇప్పుడు చెరువు నిండి మొరవపోతోంది. నిండు కుండలా ఉన్న చెరువు నడి కట్టపై జేసీబీతో తవ్వుతుంటే కడుపు మండి కమిషనర్, ఏఈ, ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఇరిగేషన్ ఏఈ వచ్చి జేసీబీని వెనక్కు పంపారే గాని ఆక్రమణకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదు. – కావడి నాగరాజు, కౌన్సిలర్, పలమనేరు పెద్ద చెరువును కాపాడుకోవాలి నేను ఇక్కడే పుట్టి పెరిగా, పట్టణానికి పెద్ద చెరువుకు విడదీయరాని సంబంధం ఉంది. అలాంటి పెద్ద చెరువు కట్ట, చెరువును కాపాడుకోవాల్సిన అవసరం పట్టణవాసులుగా అందరిపై ఉంది. ఈ సమస్యపై పీపీఎస్లాంటి వారు ముందుకు రావాలి. అక్రమార్కుల దెబ్బకు చెరువు నాశనం అవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం బాధగా ఉంది. – పుష్పరాజ్, రిటైర్డ్ టీచర్, పలమనేరు -
బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
చిత్తూరు లీగల్ / చిత్తూరు అర్బన్ : బాలికను ప్రేమ, పెళ్లి పేరిట మాయమాటలు చెప్పి, లైంగిక దాడికి పాల్పడ్డ పూజారి కణ్యాణ్ (29) అనే ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరు లోని పోక్సో కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. పుంగనూరుకు చెందిన పూజారి కళ్యాణ్ టైల్స్ వేసే మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి 14 ఏళ్ల వయస్సున్న ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 ఏప్రిల్‌లో 18న ఆ బాలికను ప్రేమిస్తున్నాంటూ, పెళ్లి చేసుకుంటా నని చెప్పి, పలుమార్లు ఆమెతో శారీరకంగా కలి సాడు. ఆపై అదే నెలలో కర్ణాటకలోని హోస్కోట కు బాలికను తీసుకెళ్లి ఓ లాడ్జిలో తాము భార్య, భర్త అని చెప్పి గదిని అద్దెకు తీసుకుని అయిదు రోజులు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో కూడా నిందితుడు బాలికతో పలుమార్లు కలిసాడు. తమ కుమార్తె కనిపించడంలేదని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, పుంగనూరు అర్బన్ పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసి.. ఆపై బాలి కను గుర్తించారు. విచారణలో జరిగిన విష యం తెలియడంతో కళ్యాణ్‌పై బాలలపై లైంగిక దాడుల నివారణ చట్టం (పోక్సో) కింద కేసు నమో దు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టుకు తరలించగా నేరం రుజువయ్యింది. దీంతో ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పు ఇచ్చారు బాధితురాలి కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు. -
భానుప్రకాష్ రెడ్డికి భావోద్వేగం ఎందుకో?
తిరుపతి కల్చరల్: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి భావోద్వేగంతో తాను ఉంటానో, పోతానో తెలియదని మీడియా సమావేశంలో మాట్లాడడంపై పలు అనుమానాలున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కందారపు మురళి అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరకామణి వ్యవహారంపై ఏపీ హైకోర్టు స్పందించిన తీరును తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి భావోద్వేగంతో తాను ఉంటానో, పోతానో తెలియదని.. తనపై తీవ్ర ఒత్తిడి ఉందని మీడియా సమావేశంలో మాట్లాడారని గుర్తుచేశారు. దీనిపై భక్తుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గత పాలక మండలిలో బీజేపీ నేతలు ఉన్న నాడు ప్రశ్నించక మిన్నకుండిపోవడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నది తన సొంత పార్టీ నేతలా? బయటివారా? ఎవరన్న విషయాన్ని వెల్లడించకుండా భావోద్వేగానికి గురైతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. నిందితుడి భార్య డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని జర్నలిస్టు శ్రీనివాసులు చేస్తున్న ఆరోపణపై భానుప్రకాష్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరకామణిలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర నివేదికను తీసుకురావాలని, పరకామణిలో చిన్న జియ్యంగార్ మఠం పాత్రపై లోతైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 35 ఏళ్లుగా ఒకే వ్యక్తి పరకామణిలో పర్యవేక్షణకు ఎలా వెళతారని క్లర్క్ స్థాయి కూడా లేని రవికుమార్‌కు రూ.వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో భక్తులకు వెల్లడించాలని, ఈ కోణంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు టి.సుబ్రమణ్యం, ఎస్.జయచంద్ర, పి.సాయిలక్ష్మి, మాధవ్, లక్ష్మి, జయంతి, వేణుగోపాల్, ముజీ పాల్గొన్నారు. -
నేడు యథావిధిగా పాఠశాలలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు మోంథా తుపాను కారణంగా కొద్ది రోజులుగా వరుసగా సెలవులు ప్రకటించారు. ఈనెల 29న బుధవారం తుపాను ప్రభావం ఉండదని భావించిన అధికారులు పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు నిర్వహించాలని డీఈవో వరలక్ష్మి ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవు ప్రకటించారని వెల్లడించారు. హెచ్ఎంలకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు పూల్–2 శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు దీక్ష ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌లో కోర్సులు అందుబాటులో తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన ఆయా పాఠశాలల హెచ్ఎంలు శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. జిల్లాకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని పంచాయతీలకు కేంద్రం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. జిల్లాకు రూ.35 కోట్లు వరకు విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జిల్లాకు కేవలం రూ.1.43 కోట్లు నిధులు మంజూరు చేశారు. మిగిలిన నిధులను త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 5న సత్యనారాయణవ్రతం కాణిపాకం: పౌర్ణమిని పురస్కరించుకుని నవంబర్ 5న కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి అనుబంధ ఆలయమైనా శ్రీవరదరాజులస్వామి ఆలయంలో సత్యనారాయణ వత్రం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య వ్రతం జరుగుతుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. 8న సంకటహర గణపతి వ్రతం కాణిపాకం : నవంబర్ 8వ తేదీన కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో సంకటహర గణపతి వ్రతం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ఉంటుందన్నారు. వ్రతంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు ముందస్తుగా టిక్కెట్లు తీసుకోవాలని పేర్కొన్నారు. నిత్యం చెరువుల పర్యవేక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నిత్యం చెరువులను పర్యవేక్షిస్తున్నామని ఇరిగేషన్ శాఖ జిల్లా ఎస్ఈ వెంకటేశ్వరరాజు వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గత వారం, ఇటీవల కురిసిన వర్షాలకు 51 చెరువులు దెబ్బ తిన్నాయన్నారు. జిల్లా మొత్తం 4122 చెరువులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పూర్తిగా 1434 చెరువులు నిండినట్లు తెలిపారు. 75 శాతం 717 చెరువులు, 50 శాతం 1032 చెరువులు, 25 శాతం 549 చెరువులు నిండిన ట్లు చెప్పారు. జిల్లాలోని బంగారుపాళ్యం, వెదురుకుప్పం, గుడిపాల, ఐరాల, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి, సదుం, పుంగనూరు, తవణంపల్లి, యాదమరి, పలమనేరు, పులిచెర్ల, గంగాధరనెల్లూరు మండలాల్లో పెద్ద సంఖ్యలో జలకళ సంతరించుకున్నట్లు ఇరిగేషన్ శాఖ జిల్లా ఎస్ఈ వెంకటేశ్వరరాజు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 70,842 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,125 మంది భక్తులు తలనీలాలు అర్పించున్నారు. స్వామివారి హుండీకి కానుకల రూపంలో రూ.4.47 కోట్లు సమర్పించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని టిటిడి స్పష్టంచేసింది. -
తడిసి ముద్దయింది...
వెట్టి నుంచి కుటుంబానికి విముక్తి ఇటుక బట్టీలో వెట్టిచాకిరీ చేస్తున్న ఓ కుటుంబాన్ని అధికారులు గుర్తించి, వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి ముసురు పట్టుకుంది. తేలిక పాటి వర్షంతో జిల్లాను తడిపి ముద్ద చేసింది. పలుచోట్ల రోడ్లను జలమయం చేసింది. దీని దాటికి రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక చెరువులు, వాగులు, వంకలు జలకళలను సంతరించుకున్నాయి. కొన్ని రోజలుగా కురిసిన వర్షాలకు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇకపై కురిసే వర్షాలకు చెరువులు, వంకలు, వాగుల ఉదృతి పెరగనుంది. తద్వారా రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే పలు మార్గాల్లో నీటి ప్రవాహం పుంజుకుంటోంది. ఆయా మార్గాల్లో ప్రజలు అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలతో రాకపోకలు చేయాలని సూచిస్తున్నారు. పంటలు నేలకొరిగాయి. వరి పంట వర్షార్పణమవుతోందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. టమాట రైతులు చతికిలపడుతున్నారు. కూరగాయలు పండించిన రైతులు కంటతడిపెడుతున్నారు. దినసరి కూలీలు ముసురుకు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గడపదాటి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇలాంటి తరుణంలో కరెంటు కోతలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూగజీవాలు ముసురుకు గజగజ వణికిపోతున్నాయి. మేతకు కష్టతరమవుతోంది. -
మామిడి రైతు బకాయిలు చెల్లించండి
రైతు ఖాతాల్లో జమ చేయాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గుజ్జు ఫ్యాక్టరీలు, ర్యాంపుల నిర్వాహకులు, కిలోకు రూ.8 చొప్పున చెల్లించాల్సిన బకాయిలు సత్వరం చెల్లించాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్ర తరం చేయాలని మామిడి రైతు సంఘం కార్యవర్గం తీర్మానించింది. మంగళవారం చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో టి.జనార్దన్ అధ్యక్షతన సంఘం సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వం తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు గిట్టుబాటు ధర రూ.12 ఇచ్చేలా సంఘం పోరాడాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మ డి చిత్తూరు జిల్లాలో 40 వేల మంది రైతులకు ఇంకనూ రూ.300 కోట్లు పైగా ఫ్యాక్టరీలు, ర్యాంపుల నుంచి చెల్లింపులు జరగాలని, వీటికి ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకుని విడుదల చేసేలా కృషి చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే మామి డి సరఫరా చేసి ఐదు నెలలు కావస్తున్న నేపథ్యంలో రైతులు అప్పుల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. తొలుత రైతులతో జరిగిన సమావేశంలో రూ.12 కు సమ్మతించి తర్వాత రూ.4 సబ్సిడీ అందిన నేపథ్యంలో 8 రూపాయలు చెల్లించడానికి సిండికేట్ ససేమిరా అనడం వీరిపై ప్రభుత్వం నియంత్రణ లేనట్టుగా భావించాల్సి వస్తుందని కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం 40 వేల మంది రైతుల క్షేమం కోసం కఠినంగా వ్యవహరించి వారి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేసేటట్టు చూడాలని కోరింది. లేకపోతే నవంబర్ చివరి వారంలో ఉద్యమం తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. సమావేశంలో ప్రధాన కార్యదర్శి మునీశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్.కె. సురేంద్రన్, ఉపాధ్యక్షులు, పి. హేమలత, కె. మునిరత్నంనాయుడు, బి. మురళి, ఎ. ఉమాపతి నాయుడు, కార్యదర్శు లు, శ్రీనివాస్, త్యాగరాజులరెడ్డి, ఎల్ మోహన్ రెడ్డి,, కోశాధికారి, ఎల్ సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. -
జాయింట్ కమిషనర్ తీరు సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్టీ) జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్‌రెడ్డి తీరు సరికాదని ఆ శాఖ ఉద్యోగులతో పాటు, పలు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కట్టమంచి వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని 9 సర్కిల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ సర్వీస్ అసోషియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు టి.పూర్ణం మాట్లాడుతూ.. జాయింట్ కమిషనర్ తన వద్ద అటెండర్లగా పనిచేస్తున్న భరత్, లవకుమార్‌ను అంటరానితనంతో చూడటం సరికాదని మండిపడ్డారు. ఆ ఇద్దరి అటెండర్లలో ఒకరిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించి నిత్యం ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తున్నారని చెప్పారు. ఉద్యోగిని కొట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ కమిషనర్ వ్యవహార శైలిపై రాష్ట్ర చీఫ్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కులం పేరుతో ధూషించడం నేరం ఏపీ నాల్గవ తరగతి ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇద్దరు అటెండర్లను కులం పేరుతో ధూషించడంతో పాటు అంటరాని వ్యక్తులుగా చూస్తున్న జాయింట్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. చెప్పులు వేసుకుని రాకూడదని అటెండర్ల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు.అసభ్యపదజాలాలతోధూషిస్తూ ఉద్యో గులను మానసికంగా వేధిస్తున్నాడన్నారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం మాట్లాడుతూ.. జాయింట్ కమిషనర్ తీరు పై ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ.. జేసీ స్థాయి అధికారి అటెండర్ లను కులం పేరుతో ధూషించడం సరికాదన్నారు. కారులో కూర్చొని అటెండర్లను గంటల కొద్ది ఎండలో నిలబెట్టి వేధించడం ఏమిటని ప్రశ్నించారు. జేసీ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ చైర్మన్, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు మాట్లాడుతూ.. ఉద్యోగులను ఇబ్బందికి గురిచేస్తున్న జాయింట్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నా కార్య క్రమంలో సీటీఎన్జీవో ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఎన్జీవో సంఘం ఉపాధ్యక్షులు మురళి, ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, సీటీఎన్జీవో సంఘం ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్‌రెడ్డి, గోవర్ధన్, వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులు, జేఏసీ నాయకులు , జాయింట్ కమిషనర్ వేధిస్తున్నారంటూ వెల్లడిస్తున్న అటెండర్లు భరత్, లవకుమార్ -
దెబ్బతిన్న పంటలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాకు మోంథా తుపాను... ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తేల్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇదీ మరింత బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చింది. వాయుగుండం మరో రెండు రోజుల పాటు జిల్లాపై పంజా విసరనుందని అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముప్పు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తుపానుతో లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అధికారులు అప్రమత్తం మోంథా తుపానుతో కంట్రోల్ రూమ్ అలర్ట్ అవుతోంది. జిల్లాలో ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితులను తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ తుపాను పరిస్థితులను అంచనా వేసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేలా జిల్లా యంత్రాంగం సూచనలిస్తోంది. మండల అధికారులు వారి పరిధిలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పడు చేరవేసేలా ఆదేశాలిచ్చింది. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, మాత్రలు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని హెచ్చరించింది. జిల్లాపై తుపాను దెబ్బ పడుతోంది. చిత్తూరు నగరంలో పలుచోట్ల చెట్లు పడి కొమ్మలు వాలిపోయాయి. పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఆయా ప్రాంతాల వాసులు రోడ్డు దాటని పరిస్థితి ఏర్పడింది. తవణంపల్లిలో మండలంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. పండ్ల తోటలు, సాగు భూములు చెరువులను తలపిస్తున్నాయి. నగరిలోని కుశస్థలి నది ప్రవాహం పుంజుకుంది. జిల్లా ప్రత్యేక అధికారి గిరీషా నదిని పరిశీలించారు. నిండ్ర మండలంలో వర్షం కారణంగా బస్సుకు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు పెద్ద ముప్పు తప్పింది. పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య నది పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం కారణంగా వరి పంట నేలమట్టం అయింది. టమాట పంట నాశనమవుతోంది. బంగాళదుంప భూమి లోపలే కుళ్లిపోతోంది. కూరగాయల పంటలు రైతు చేతికి నష్టాన్ని మిగుల్చుతోంది. భారీ వర్షం పడితే ఈ పంటలు పూర్తిగా నీటమునిగే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జీడీ నెల్లూరు మండలంలోని బంగారెడ్డిపల్లి వద్ద చెరువు నుంచి నీరు రోడ్డుపై జోరుగా ప్రవహిస్తోంది. అలాగే బలిజపల్లి, వెంకటాపురం గ్రామం వద్ద కూడా చెరువులు మొరవపారుతున్నాయి. దీని కారణంగా ఆ చుట్ట్టు పక్కల గ్రామస్తులు రానూపోను అవస్థలు పడుతున్నారు. అక్కన్నగారిపల్లెలో రెండు పూరి గుడిసెలు కూలిపోయాయి. పాలసముద్రం మండలం వీర్లగుడిలో పూరిగుడిసె పడిపోయింది. వెంగమాంబపురం, తిరుమలరాజుపురం, వనదుర్గాపురంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎస్ఆర్పురం మండలం డీకే మర్రిపల్లి గ్రామంలోని ఓ గుడిసెలోకి వరదనీళ్లు చేరాయి. కార్వేటినగరం మండల కేంద్రంలో సుద్దగుంట, పెద్దహరిజనవాడ, చిన్న హరిజనవాడ పక్కాగృహాలు ఉరుస్తున్నాయి. ముసురు వానలకు జిల్లా వ్యాప్తంగా జన జీవనం స్తంభించింది. -
సామాజిక బాధ్యతలో పోలీసులు ముందుండాలి
చిత్తూరు అర్బన్ : ప్రతి నాలుగు నెలల కోసారి రక్తదానం చేసి, సామాజిక బాధ్య తను చాటడంలో పోలీసులు ముందుండాలని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం చిత్తూరు నగరంలోని పీజీఆర్ లైన్‌లోని పోలీసు ఆసుపత్రిలో.. పోలీసు కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసు ఉద్యోగం కష్టంతో కూడుకున్నదని.. విధులతో పాటు పోలీ సులు వ్యక్తిగత ఆరోగ్యంపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నెల లో ఓసారి పోలీసు కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, నిత్యం విధుల్లో తలమునకలై ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు తప్పనిసరన్నారు. సరైన ఆరోగ్యం, వ్యాయామం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం పోలీసుల రక్తదాన శిబిరాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, ఏఆర్ ఏఎస్పీలు రాజశేఖర్ రాజు, శివానంద కిషోర్, డీఎస్పీలు సాయినాథ్, మహబూబ్‌బాషా, కృష్ణ, పలువురు సీఐలు, ఎస్ఐలు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భయం'కరి'
గజరాజు ఘీంకరిస్తున్నాడు.. శేషాచలం నుంచి బయటకు వచ్చి కర్షకుడిపై కన్నెర్ర చేస్తున్నాడు.. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలను సాంతం ఆరగిస్తున్నాడు.. ఆనక ఇష్టారీతిన ధ్వంసం చేస్తున్నాడు..కంచె, చెట్టు, తోట, పంట, ఇలా వేటినీ వదలడం లేదు.. చివరకు అడ్డొచ్చిన అన్నదాతనూ మట్టుబెడుతున్నాడు..వరుసదాడులతో హాలికుని కంట కన్నీరు పెట్టిస్తున్నాడు. ఫలితంగా అటు నష్టం.. ఇటు కష్టంతో పుడమిపుత్రుడి పరిస్థితి దయనీయంగా మారింది. గజరాజుల నుంచి కాపాడండిమహాప్రభో అని మట్టి మనుషులు వేడుకుంటున్నా.. అటవీ అధికారులు మాత్రం పర్యటనలు, పరిశీలనకేపరిమితమవుతుంటేచేష్టలుడిగి చూడడమే రైతన్న వంతైంది.చంద్రగిరి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ సమీప గ్రామాల్లోని ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కష్టపడి పండించిన పంటలు చేతికి అందేలోపు గజదాడుల్లో ధ్వంసం అవుతున్నాయి. ఏడాది పొడవునా ఏనుగుల దాడులతో రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గజరాజులు ఏకంగా గ్రామాల్లోకి చొరబడడంతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నెల రోజులుగా మదపుటేనుగులు గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నా అటవీ అధికారు లు చోద్యం చూస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రాణం బలికాకముందే ఏనుగుల సంచారాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు. చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పరిసర గ్రామాల్లో ఏనుగుల దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ప్రతిరోజూ రాత్రి వేళల్లో ఏనుగులు గ్రామ సమీపంలోని పంటలపై దాడులు చేయడం పరిపాటిగా మారుతోంది. మండలంలోని చిన్నరామాపురం, భీమవరం, కొండ్రెడ్డికండ్రిగ, బూడిదగట్టువారిపల్లి, యల్లంపల్లి గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అటవీ అధికారులు అటువచ్చి, ఇటు వెళుతున్నారే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జనవరిలో ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ మరణించారు. ఈ క్రమంలో మరో ప్రాణం బలికాక ముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామాల్లో స్వైరవిహారం ఆదివారం తెల్లవారుజామున సుమారు 8 ఏనుగుల మంద చిన్నరామాపురంలోకి రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం పశువుల వద్దకు వెళ్లిన, పాడి రైతులు పరుగున ఇళ్లలోకి వచ్చి, తలుపులు వేసుకున్నారు. ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగుల గుంపు చిన్నరామాపురంలోకి చేరుకుని పెద్ద ఎత్తున ఘీంకరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అనంతరం గ్రామం వెనుక ఉన్న పొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేశాయని వాపోయారు. సోమవారం మరోసారి వరి, మామిడి పంటల ధ్వంసం బూడిదగట్టువారిపల్లిలోని పొలాల్లో పంటలను ఏనుగులు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేసినట్లు గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు, గ్రామస్తులు సంయుక్తంగా ఏనుగులను తరిమేందుకు యత్నించారు. డప్పులు వాయిస్తూ, బాణసంచా పేల్చుతూ వాటిని బెదరగొట్టారు. ఈ లోపే ఓ కౌలు రైతుకు చెందిన వరి పంటను పూర్తిగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి యల్లంపల్లిలోని మరో ఇద్దరి రైతుల పొలాల్లోకి వెళ్లాయి. మామిడితోట ప్రహరీ గేట్లు, టేకు చెట్లతోపాటు ఫెన్సింగ్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి. గతంలో ఎప్పుడూ లేదు 10 ఏళ్ల కాలంలో ఎప్పు డూ ఏనుగులు ఇంత పెద్ద స్థాయిలో పొలాలపై దాడు లు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రెండు నెలలుగా ఏనుగులు పెద్ద ఎత్తున పంటలపై దాడులకు చేస్తూనే ఉన్నాయి. అధికారులు వచ్చి ఎన్ని చర్యలు తీసుకున్నా, ఏనుగుల దాడులు మాత్రం ఆగడం లేదు. ఏనుగుల దాడులను నివా రించేందుకు శాశ్వత పరిష్కారం చూపితే రైతులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలను చేపట్టాలి. – రాగిణి, సర్పంచ్, చిన్నరామాపురం నా నోట్లో మట్టి కొట్టాయి నేను కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా ను. 20 రోజుల్లో చేతికి వ చ్చే వరి పంటను ఆదివా రం రాత్రి ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. సు మారు రూ.లక్ష పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట నాశనం అయ్యింది. ఇప్పుడు భూమి యజమానికి నేను ఎలా నగదు చెల్లించాలి. అటవీ అధికారులే మో పచ్చి వడ్లను కోసుకోమని సలహాలు ఇస్తున్నా రు. ఇలా ఎవరైనా చేస్తారా..? – చిన్నబ్బ, కౌలు రైతు, బూడిదగట్టువారిపల్లి 100 మీటర్లు వెళ్లి ఉంటే ప్రాణాలు పోయేవి వేరుశనగ పంటను రక్షించుకునేందుకు ఆదివారం రా త్రి నేను బైక్‌లో పొలం దగ్గరకు వెళ్లాను. మార్గం మధ్య లో పెద్ద ఎత్తున ఏనుగులు ఘీంకారాలు చేస్తూ, రోడ్డును దాటుతున్నాయి. వెంటనే అప్రమత్తమై బైక్ లైట్లు ఆఫ్ చేసి వెనుదిరిగి వచ్చేసి, ప్రాణాలను కాపాడుకున్నాను. అనంతరం ఏనుగుల దాడులపై గ్రామస్తులకు సమాచారం చే రవేశాను. అజాగ్రత్తగా ఉంటే నా ప్రాణాలు పోయేవి. – కృష్ణమోహన్, రైతు, కొండ్రెడ్డికండ్రిగమామిడి తోటలో వీరంగం చేశాయి నాకు, మా అక్కకు చెంది న మామిడి తోటల్లో ఏనుగులు వీరంగం చేశాయి. ఏనుగుల మంద దారి మళ్లి మా పొలాలపై పడ్డా యి. తోటకు రక్షణగా ఏర్పాటు చేసిన గేటును పూర్తిగా ధ్వంసం చేసి, విసిరి పడేశాయి. అక్కడ నుంచి మరో తోటలోకి వెళ్లి ఫెన్సింగ్‌ను తొక్కుకుంటూ అటవీలోకి వెళ్లిపోయాయి. ఈ ఏనుగుల మంద కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యవసాయాన్నే నమ్ముకున్న మాకు వేరే బతుకు మార్గం తెలియదు. మాపై ప్రభుత్వం కరుణ చూపి ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలి. లేకుండా అప్పుల పాలై కుటుంబం రోడ్డున పడడం తప్పదు. – నాగేశ్వరమ్మ, మహిళా రైతు, యల్లంపల్లి ప్రాణభయంతో పరుగులు తీశాం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమ యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. ఈ క్రమంలో మా పెంపుడు కుక్క పెద్ద ఎత్తున అరిచింది. వెనక్కి తిరిగి చూస్తే సుమారు 8 ఏనుగుల మంద గ్రామంలోకి వచ్చేసింది. వెంటనే నేను, నా కోడలు ఇంట్లోకి పరుగులు తీసి, తలుపు గడియ పెట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. ఏనుగులు మమల్ని చూసి ఉంటే దాడికి పాల్పడేవి. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఏనుగుల మంద గ్రామంలోకి వచ్చిన సందర్భాలు లేవు. అధికారులు ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలి. – చేకూరి సిద్ధమ్మ, చిన్నరామాపురం -
నేరం చేసినందుకు పశ్చాతాపం పడుతున్నారా..?
చిత్తూరు అర్బన్: పబ్లిక్ కోర్టు నిండా ఇసుకేస్తే రాలనంత జనం. న్యాయమూర్తి తీర్పు ఏం చెబుతారని సర్వ త్రా ఉత్కంఠ. ఆపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటన. చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో శిక్ష ఖరారు వాయిదా పడింది. దోషులను ఈ నెల 30న న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టాలని.. అప్పటి వరకు వీళ్లను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల ని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. 2015 నవంబర్ 17న జరిగిన కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ జంట హత్య కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజు నాథ, వెంకటేష్‌పై నేరం రజువైనట్లు, తీర్పును 27న వెల్లడిస్తామని గత శుక్రవారం చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ఐదుగురు దోషులను చిత్తూరులోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఐయామ్ నాట్ కమిటెడ్ శిక్ష ఖరారు చేసే ముందు దోషులను కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉందని న్యాయమూర్తి డా. ఎన్.శ్రీనివాసరావు అన్నారు. ఆపై వరుసగా కొన్ని ప్రశ్నలు అడి గారు. నేరం ఎందుకు చేశారు..? బాధితులకు క్షమాపణ చెప్పదలచారా..? మీ కుటుంబ పరిస్థితి ఏంటి..? శిక్ష విధిస్తే మీ కుటుంబంలో ఎవరిపై ప్రభావం చూపిస్తుంది..? నేరం చేసినందుకు పశ్చాతాపం పడుతున్నారా..? అనే పలు ప్రశ్నలు అడిగారు. వీటికి చింటూ చాలా వరకు ఇంగ్లిషులోనే సమాధానాలిచ్చారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, అయితే తాను ఎలాంటి నేరం చేయలేదని (ఐయామ్ నాట్ కమిటెడ్), మెరై న్ డిప్లొమో చేసిన తాను బాంబేలోని ఇండియన్ నా వెల్ షిప్ (ఐఎన్ఏ)లో పనిచేశానని, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా నేరం తనపై మోపారని చింటూ పేర్కొన్నాడు. సీకే బాబుపై జరిగిన హత్యాయత్నాల్లో కూడా ప్రధాన నిందితుడు కఠారి మోహన్ అని, అతని మేనల్లుడు అయినందుకు తనపై కేసు పెట్టారని, చిత్తూరు కోర్టులో గతంలో జరిగిన బాంబు పేలుడు కేసులో మీడియా తనను దోషిగా చూపించే ప్రయత్నం చేసిందని, తీరా ఇది ఉగ్రవాదు లు చేసినట్లు ఎన్ఐఏ తేలి్చందన్నారు. తనకు మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లి ఉందని, జైల్లో ఉన్న న్ని రోజులు స్రత్పవర్తనతో నడుచుకున్నట్లు చింటూ చెప్పాడు. కఠారి దంపతుల హత్య జరిగిన విష యం తనకు తెలిసినవెంటనే చట్టంపై ఉన్న గౌరవంతో కోర్టు లో వచ్చి లొంగిపోయానన్నాడు. మారడానికి అవకాశం ఇస్తే తన ఉద్యోగం, వ్యాపారం చేసుకుని బతుకుతానని చింటూ చెప్పాడు. చింటూతో పాటు మిగిలిన నలు గురి వాంగ్మూలాన్ని సైతం న్యాయమూర్తి పేపర్‌పై రాసుకుని, దోషుల సంతకాలు తీసుకున్నా రు. శిక్ష ఖరారుకు ముందు తమ వాదన వినిపించడానికి అనుమతివ్వాలని డిఫెన్స్ న్యాయవాదులు కోరారు. నివేదిక కోసం ఆదేశం కాగా దోషులు ఐదుగురు మానసిక ప్రవర్తనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ ఆధ్వర్యంలో మానసిక వైద్యనిపుణులు పరిశీలించాలన్నారు. అలాగే వీళ్ల సామాజిక పరిస్థితి, జైల్లో ఉన్నన్ని రోజులు సత్ప్రవర్తనపై జిల్లా ప్రొబేషన్ అధికారి, జిల్లా జైళ్ల అధికారి నివేదిక ఇవ్వాలన్నారు. తరుపది ఈనెల 30వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని.. అప్పటి వరకు వీళ్లను జ్యుడీíÙయల్ కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం దోషులను భారీ బందోబస్తు నడుమ పోలీసులు చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. -
వామ్మోంథా!
సమన్వయంతో పనిచేయాలి ఆయుధాల పనితీరును వివరిస్తున్న పోలీసులు ఏరొస్తే చెప్పనలివిగాని బాధలు కౌండిన్య నది ప్రవహిస్తే మా ఊరోళ్లకు కష్టాలే. గ్రామం నుంచి పిలకాయిలు కోటూరు హైస్కూల్‌కు వెళ్లాలంటే నీళ్లలో పోనుకాదు. దొమ్మిరపాపమ్మ గుడికాడ నుంచి కాలువపల్లికి పోయి మళ్లా మండిపేటకోటూరుకు పోవాల. ఏటికవతల ఉండే రైతులు ఆవులకు మేత పెట్టాలంటే సైకిల్‌పై చుట్టుకొని పోతా ఉండారు. ఊసరపెంటనుంచి కోటూరుకు తారు రోడ్డుతోపాటు బ్రిడ్జి నిర్మాణం చేస్తే సౌకర్యంగా ఉంటుంది. – స్వతంత్రనాయుడు, ఊసరపెంట, పలమనేరు మండలం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా కౌండిన్య నది ప్రవహించే మండలాల్లో కంటే పలమనేరు మండలంలోనే నాలుగైదు చోట్ల వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం ఇప్పటిదాకా తెలీదు. ఈ గ్రామాలకు మా వీఆర్వోల ద్వారా నేడే వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తాం. ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా వీటి నిర్మాణం జరిగొచ్చు. – ఇన్బునాథన్, తహసీల్దార్, పలమనేరు కష్టంగా ఉంది సామీ మేముండేది బొమ్మిదొడ్డి లో మా పొలాలుండేది ఏటికవతల. అక్కడే పొలం పాడి ఆవులున్నా యి. పొద్దున.. సాయంత్రం నదిని ట్యూబులపై దాటి పశువులకు మేత పెట్టి పాలు పితికి పాలసెంటర్కు తీసుకొస్తున్నా. ఇక్కడి జగనన్న కాలనీలో 2వేల ఇండ్లున్నాయి. వారు కురపల్లి మీదుగా వస్తున్నారు. టౌన్లో నుంచి ఇక్కడ బ్రిడ్జి కడితే దూరం తగ్గుతుంది. సౌకర్యంగా ఉంటుంది. – సుజాత, పాడిరైతు, బొమ్మిదొడ్డి, పలమనేరు మున్సిపాలిటీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మోంథా ఫీవర్ పట్టుకుంది. సోమవారం ఉదయం నుంచి ము సురు పట్టేసింది. మధ్యాహ్నం నుంచి చిరు జల్లులు మొదలయ్యాయి. తరుముకొస్తున్న తుపాన్‌తో జిల్లాకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్టు మూడు రోజుల కిత్రమే వాతావరణ శాఖ సూచించింది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తాజాగా వరద ముప్పు ఉంటుందని ప్రకటించింది. దీని దృష్ట్యా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులను అప్రమత్తం చేసింది. కంట్రోల్ రూమ్‌లు సైతం ఏర్పాటు చేశారు. కనిపించరే! మోంథా ప్రభావంతో జిల్లా ప్రత్యేక అధికారి గిరీషాతో పాటు కలెక్టర్, ఇతర శాఖల అధికారులు పరుగులు పెడుతున్నారు. కానీ మండల, క్షేత్రస్థాయి అధికారు లు, సిబ్బంది మాత్రం దీన్ని తేలికగా తీసుకుంటున్నా రు. విధులకు డుమ్మాకొడుతున్నారు. సచివాలయాలు ఒకరిద్దరితో దర్శనమిస్తున్నాయి. మిగిలిన వాళ్లు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. వీటిపై దృష్టిపెట్టాలి మరి! కాణిపాకం బ్రిడ్జి వద్ద, పుణ్యసముద్రం, తవణంపల్లి మండలం గాజులపల్లి, అరగొండ, మత్యం బోయపల్లిలోని కల్వర్టులు కూలే స్థాయికి చేరాయి. అలాగే పలమనేరులోని కౌండిన్య నది వంతెన, వైఎస్సార్‌సర్కిల్, చిన్నపేట, కుర్రపల్లి, కూర్మాయి, సముద్రపల్లి మార్గంలో వంతెనలు ప్రమాదకరంగా మారాయి. చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట వంక వద్ద ప్రమాకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. విజయపురం, నిండ్ర మండలాల్లో వరి పొలాలు వర్షపు నీటితో చెరువును తలపిస్తున్నాయి. మరింత వర్షం కురిస్తే వరి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది. యాదమరి మండలంలోని చెరువులు మొరవెత్తాయి. దీంతో చిత్తూరు నగరానికి ప్రమాదం పొంచి ఉంది. నీవానది పరివాహక ప్రాంతాలకు వరదొచ్చే అవకాశాలున్నాయి. అర్బన్ అధికారులు చిత్తూరుపై కాకుండా యాదమరి మండలంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరస్థితిలపై ఆరా తీస్తున్నారు. రోజంతా ముసురే... మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ముసురు ప ట్టుకుంది. రోజంతా చిరుజల్లులు కొనసాగాయి. మంగళవారం జిల్లాకు భారీ వర్ష సూచనలున్నాయని అధి కారులు ప్రకటించారు. దీంతో వరదలొచ్చే అవకాశా లు మెండుగా ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల వాసు లుఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. జిల్లాకు రెడ్ అలర్ట్ చిత్తూరు కలెక్టరేట్ : మోంథా తుపాన్ ప్రభావంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో పాఠశాలలకు ముందస్తు సెలవు ప్రకటించారు. స్పెషల్ ఆఫీసర్ గిరీషా సోమవారం జిల్లాకు విచ్చేశారు. అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడీ సైతం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందస్తు చర్యలు రాబోయే 24 గంటల్లో మోంథా తుపాన్ తీరం దాటే అవకాశం ఉండడంతో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆర్డీవో, మున్సిపల్, తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ ఇతర కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూం కేంద్రాలు తుపాన్ వల్ల జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మోంథా తుపాన్ పట్ల చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, ఎస్పీ తుషార్ డూడీలు స్పెషల్ ఆఫీసర్‌కు వివరించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ తుపాన్‌ను ఎదుర్కోవడంలో ఎటువంటి అలసత్వం చూపించకూడదన్నారు. ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రికి తరలించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు విధులు నిర్వహించే స్థానాల్లోనే ఉండాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భవనాలను అవసరమైతే పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలన్నారు. జిల్లా మొత్తం 4,122 చెరువులు ఉండగా వాటిలో 1,305 చెరువులు నిండినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జలాశయంలో ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో మోహన్‌కుమార్, చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, ఆర్డీవోలు శ్రీనివాసులు, అనుపమ పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలి
పాలసముద్రం : రాష్ట్రం ఏరులై పారుతున్న మద్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కర్నూలు రోడ్డు ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని మాజీ డిప్యూటి సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 20 మంది ప్రయాణికులను అన్యాయంగా పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏరులైపారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. జాతీయ రహదారి సమీపంలో బెల్ట్‌షాపులో మద్యం అమ్మడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏటీఎం వలే ఎనీటైం మద్యం అమ్మకాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తోందని దుయ్యబట్టారు. ఏ అనుమతులూ లేకుండా జాతీయ రహదారిపై బస్సు తిరగడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనమన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిత
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు క్రీడలతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి తెలిపారు. సోమవారం ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ పురుషుల సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై న జట్లను అభినందించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. సాఫ్ట్‌బాల్ సంఘం జిల్లా ట్రెజరర్ దేవా మాట్లాడుతూ జిల్లా జట్లుకు లోకేష్, మునిరాజులు, విఘ్నేష్, కార్తికేయన్, భాస్కర్, రోహిత్, విజయ్, శివ, రవితేజ, చంద్రశేఖర్, విజయ్, తరుణ్, సాయి భార్గవ్, పునీత్‌సాయి, తరుణ్, భాను ఎంపికై నట్లు వెల్లడించారు. ఎంపికై న జట్లు నవంబర్ 8, 9 తేదీల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీడీలు లోకేష్, శరత్ పాల్గొన్నారు. -
కుప్పం సాక్షిగా.. హైవే పక్కనే కిక్కు
కుప్పం: నిబంధనలకు విరుద్ధంగా కుప్పంలో మద్యం షాపులు ఏర్పాటు చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి వెళ్లే జాతీయ రహాదారి పక్కనే బార్ అండ్ రెస్టోరెంట్‌కు అనుమతినిచ్చారు. బైపాస్ రోడ్డు అనుకుని అధికార పార్టీ కార్యాలయానికి సమీపంలోనే బార్ అండ్ రెస్టోరెంట్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ బార్ వల్ల మద్యం ప్రియులు మితిమీరిన కిక్కుతో వాహనాలు నడుపుతున్నారు. బైపాస్ రోడ్డుపై అతివేగంగా వచ్చే వాహనాలను ఢీకొట్టి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. మరోవైపు బైపాస్ రోడ్డు పక్కనే తంబిగానిపల్లి సబ్ స్టేషన్ పక్కనే వైన్ షాపు ఉంది. ఓ వైపు తమిళనాడు వెళ్లే బైపాస్.. మరోవైపు రోడ్డు అటు వైపు కల్యాణ మండలం జనసంచారం అధికంగా ఉండే ప్రాతంలో బ్రాందీ షాపులను ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఆంధ్ర నుంచి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు, ఈ రోడ్డు ప్రాంతాలకు కంటైనర్లు, పెద్దపెద్ద లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి మార్గం పక్కనే వైన్ షాపులు ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. బైపాస్ రోడ్డుకు అనుకుని ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్ట్టారెంట్ తంబిగానిపల్లి వద్ద రోడ్డు ఆనుకుని ఏర్పాటు చేసి మద్యం షాపు -
19 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నారాయణవనం వద్ద 19 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్, ఆర్ఐ సాయి గిరిధర్, ఏఆర్ఎస్ఐ ఎన్.ఈశ్వర్‌రెడ్డి బృందం ఆదివారం కై లాసకోన నుంచి కూంబింగ్ చేపట్టింది. నారాయణవనం సమీపంలోని సింగారకోన రోడ్డు కన్నికలమ్మ ఆలయం సమీపంలో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. పరిసర ప్రాంతాల పరిశీలించగా 19 ఎరచ్రందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, పట్టుబడిన వ్యక్తులను స్థానికులుగా గుర్తించి తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, ఎసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్ఐ రఫీ సోమవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మొరవ కాలువ పటిష్టతకు చర్యలు
గంగాధర నెల్లూరు : మొరవ కాలువను పటిష్ట పరచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. సోమవారం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా జీడీ నెల్లూరు మండలంలో సుమారు 26 చెరువులు పూర్తిగా నిండాయి. మోంథా తుపాను ప్రభావ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక అధికారి గిరీషా, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడీ తదితరులు ఆత్మకూరు చెరువు మొరవను పరిశీలించారు. మొరవను పటిష్టపరచ డానికి ఎన్ని నిధులు అవసరమవుతాయని ఆరాతీశారు. సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అవసరమవుతాయని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ చెరువు ద్వారా సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, ఎల్లాపల్లి చెరువు, వంక, నీవా కాలువ ఈ చెరువు సమీపన ఉన్నాయని సంబంధిత అధికారులు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు ఆనందరెడ్డి, సుగుణాకర్ రావు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్‌గౌడ్ పాల్గొన్నారు. -
వరి కుప్పలు మొలకెత్తకుండా ఉప్పు నీళ్లు చల్లండి
గుడిపాల: జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పంటల పరిస్థితిని సోమవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన తిరుపతి శాస్త్రవేత్తలు, జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ రామకృష్ణారావు, డాక్టర్లు సరళ, వజంతా, నాగమణి, హారతి పరిశీలించారు. మండలంలోని చీలాపల్లె, నారగల్లు, బొమ్మసముద్రం, పేయనపల్లె, ఏఎల్‌పురం గ్రామాల్లో వారు సందర్శించారు. గుడిపాల మండలంలో ఐదు పంచాయతీలకు సంబంధించి 55 ఎకరాలలో వరి పైరు ఇటీవల కురిసిన వర్షాలకు పడిపోయినట్లు గుర్తించామన్నారు. పంటను కోసి పూర్తిగా ఆరని పంటకు 25 కిలోల ఉప్పును చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం ద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చాన్నారు. కోతకోసిన పొలంలో ఉన్న పంట మొలకెత్తకుండా ఉండడానికి 5శాతం ఉప్పు ద్రావణాన్ని పంటపై పడే విధంగా పిచికారీ చేయాలన్నారు. వ్యవసాయాధికారిన సంగీత పాల్గొన్నారు. తవణంపల్లెలో.. ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో–ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణరావు నేతృత్వంలో తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తవణంపల్లె వ్యవసాయాధికారి జి.ప్రవీన్ ఆధ్వర్యంలో మండలంలోని ఎగువమత్యం, నలిశెట్టిపల్లె, పుణ్యసముద్రం, ఉత్తరబ్రాహ్మణపల్లె గ్రామాల్లో వరి పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సూచనలు, సలహాలిచ్చారు. నూర్పిడి చేసిన వరి గింజలు రంగు మారకుండా ఉండడానికి లీటరు నీటిలో ఒక గ్రాము కార్బెండెజం లేదా ఒక మిల్లీ లీటరు ప్రొఫికొనజెల్ మందును పిచికారీ చేయాలన్నారు. -
కారుపై కూలిన చెట్టు
వి.కోట : రోడ్డుపై వెళ్తున్న కారుపై చెట్టు కూలి ముగ్గురుకి స్వల్ప గాయాలైన ఘటన మండలంలో ని కస్తూరి నగరం రోడ్డు వద్ద సోమవారం చోటుచెసుకుంది. స్థానికుల కథనం.. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి నుంచి విరుపాక్షిపురానికి ముగ్గురు వ్యక్తులు వైద్యం నిమిత్తం వి.కోట –పలమనేరు జాతీయ రహదారిపై బోలెరో వాహనంలో ప్రయణిస్తున్నారు. మండలంలోని కస్తూరినగరం వద్ద జాతీయ రహదారిలోని భారి నీలగిరిచెట్టు ప్రమాదవశాత్తు ఆ కారుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాల తో బయటపడగ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనతో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో చెట్టును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రోడ్డు పనులకు రూ.30 కోట్లు చిత్తూరు కార్పొరేషన్ : కుప్పం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కుప్పం పట్టణ కేంద్రం వరకు ఉన్న రోడ్డు పనులకు రూ.30 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. కుప్పం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కుప్పం పట్టణ కేంద్రం వరకు రెండు కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులకు పరిపాలన అనుమతులు జారీచేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. -
గ్రానైట్ లారీ సీజ్
బంగారుపాళెం: అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని సోమవారం అధికారులు సీజ్ చేశారు. మండలంలోని జంబువారిపల్లె వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా అక్రమంగా గ్రానైట్ క్వారీ కొనసాగిస్తున్నాడు. గతంలో ఈ క్వారీకి సంబంధించి సాయిరెడ్డి అనే వ్యక్తి అనుమతులను పొంది ఉన్నాడు. అయితే సదరు క్వారీకి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమంగా నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీపై సాయిరెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు గ్రానైట్ లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మామిడి రైతుల నిరీక్షణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం మామిడి రైతులతో కిటకిటలాడుతోంది. ప్రభుత్వం అందించిన రూ.4 ప్రోత్సాహక నిధి కొన్ని వేలమందికి జమ కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో బిల్లుల్లో జాప్యం, చెల్లింపులో గందరగోళం నెలకొంది. మామిడి రైతులు బిల్లులు చేతబట్టుకుని జిల్లా కార్యాలయానికి క్యూకడుతున్నారు. నగదు రాలేదని నివేదించుకుంటున్నారు. సోమవారం కూడా జిల్లా కార్యాలయం ఎదుట నిరీక్షించారు. అత్యుత్తమ క్రీడాకారులకు నగదు బహుమతి చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన జిల్లాలోని అత్యుత్తమ క్రీడాకారులకు నగదు బహుమతి అందజేయనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించిన క్రీడాకారులు శాప్ క్రీడా యాప్‌లో సహాయక పత్రాలతో నవంబర్ 4లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
● పొంగుతున్న పాతాళ గంగ
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట గ్రామ సమీపంలోని బోర్లలో పాతాళ గంగ పొంగుతోంది. మండలంలో వెయ్యి అడుల లోతు బోర్లు వేసినా నీటి చుక్క పడని సంఘటనలున్నాయి. ఇలాంటి సమయంలో సింగిరిగుంటకు చెందిన జయచంద్రనాయుడు, పరంధామనాయుడు విజయ్‌కుమార్‌కు చెందిన బోర్లలో పాతాళళ గంగ ఉప్పొంగుతోంది. ఆ బోర్ల వద్ద ప్రజలు పూజలు చేస్తున్నారు. వీటిని ప్రజలు సెల్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అవుతున్నాయి. – చౌడేపల్లె సింగిరిగుంట వద్ద జయచంద్రనాయుడి బోరు నుంచి పాతాళ గంగ పైకి సింగిరుగుంట వద్ద పరంధామనాయుడికి చెందిన బోరు నుంచి పైకి వస్తున్న నీళ్లు -
పూల తోట ధ్వంసం
కుప్పం: మండలంలోని ములకలపల్లిలో రీ సర్వేలో అధికారులు చేసిన తప్పులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఇతరులు తన భూమిలోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నారని బాధితుడు మునిరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మునిరత్నం 40 ఏళ్ల క్రితం ములకలపల్లి గ్రామ రెవెన్యూ లెక్క దాఖలోని సర్వే నంబర్ 9/3బీ1లో 0.50 సెంట్ల భూమిని కోనుగోలు చేశాడు. రెవెన్యూ రికార్డుల్లో సైతం మునిరత్నం పేరు ఉంది. అధికారులు రీ సర్వే చేసిన సందర్భంలో మునిరత్నంతో పాటు చిన్నక్కకు జాయింట్ ఎల్పీ నంబరు ఇచ్చారు. దీంతో వివాదం నెలకొంది. ఆ భూమిపై హక్కులేని చిన్నక్క కుటుంబ సభ్యులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు. 6 నెలలుగా సాగుచేసిన కనకాంబరం పంటను నాశనం చేసి తీవ్రంగా నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై విచారణ చేయడంతోపాటు భూమిని సర్వే చేసి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. -
మైనింగ్ మాఫియాపై విజిలెన్స్.?
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో మైనింగ్ మాఫియాపై శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో వరుస కథనాలు వెలువడ్డాయి. అక్రమ క్వారీలతో పాటు లీజుకు ఉన్న క్వారీల నుంచి అక్రమ తరలింపుపై కథనాలొచ్చాయి. దీనిపై స్పందించిన విజిలెన్స్ అధికారులు మూడు రోజులకు క్రితం లోతుగా విచారణ చేపట్టారని తెలిసింది. అక్రమ క్వారీలను తనిఖీ చేయడంతో పాటు జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలోని ఓ అధికారిని పూర్తి స్థాయిలో విచారించినట్టు సమాచారం. శాఖ డీడీ చాంబర్‌కు పిలిచి ఆ అధికారిని గంటపాటు అక్రమ మైనింగ్‌పై ఆరాతీసినట్టు విశ్వసనీయమైన సమాచారం. అక్రమ కార్వీల నిర్వహణ ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటిపై ఏరకమైన చర్యలు తీసుకున్నారు?.. దొంగబిల్లులు, అక్రమ తరలింపులు, అనుమతి పేరుతో అక్రమ క్వారీల నుంచి ఖనిజం తరలింపులు ఎలా జరిగాయి.? ఇదంతా ఎవరి సహకారంతో నడుస్తుంది?.. శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నారా..? రాయల్టీ వసూళ్లు ఏరకంగా జరుగుతున్నాయి..? ఎంత వసూలు చేస్తున్నారు?.. ఒకే బిల్లుతో గోల్మాల్ ఏమైనా జరిగాయా..? తదితర కోణాల్లో విచారించినట్టు తెలిసింది. ఈ మైనింగ్ మాయజాలంపై రాష్ట్ర అధికారుల కన్ను పడిందని, త్వరలో కొంత మందిపై వేటు పడే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
తీర్పుపై ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్ : జిల్లా న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క చిత్తూరు వాసులే కాదు.. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోని కూటమి నాయకుల వరకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందోనని గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో దోషులకు సోమవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 2015.. నవంబరు 17వ తేదీ.. స్థలం – చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమయం – మధ్యాహ్నం 11.57 గంటలు ఏం జరిగింది – మేయర్ సీటులో కూర్చుని ఉన్న కటారి అనురాధను పాయింట్ బ్లాక్‌లో తుపాకీతో కాల్చి చంపేసారు. పక్కనే కూర్చుని ఉన్న ఆమె భర్త కటారి మోహన్‌ను కత్తులతో వెంటాడి నరికేశారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడతున్న మోహన్‌ను చిత్తూరుకు ఆపై వేలూరుకు తరలించగా అక్కడి ఆసుపత్రిలో చనిపోయాడు. చేసిందెవరంటే – ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అనే చింటూతో పాటు 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైంది వీరిపై .. చింటూ, చంద్రశేఖర్ అలియాస్ చింటూ (54), వెంకటాచలపతి (59), జయప్రకా‹Ùరెడ్డి (32), మంజునాథ్ (36), వెంకటేష్ (48)పై నేరం రుజువైనట్లు చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ ఇన్చార్జ్ న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. మిగిలినవారిపై కేసు కొట్టేసింది. నిరూపించబడ్డ సెక్షన్లు 120 (బి) ఐపీసీ (హత్యకు కుట్ర) – అయిదుగురు అనురాధను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్‌విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి మోహన్‌ను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్‌విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి వేలూరు సతీష్ కుమార్ నాయుడుపై హత్యాయత్నం చేసినందుకు సెక్షన్ 307 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ వేలూరు సతీష్‌కుమార్ నాయుడును నిందితులు ఒకే ఉద్దేశ్యంతో హత్యాయత్నం చేయడం సెక్షన్ 307 రెడ్‌విత్ సెక్షన్ 34 ఐపీసీ – చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, వెంకటేష్. సతీష్‌కుమార్ నాయుడును చంపాలనే ఉద్దేశ్యంతో గాయపరచడం సెక్షన్ 302 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ . పోలీసుల భారీ భద్రత దోషులు అయిదుగురిని చిత్తూరు జిల్లా జైలు నుంచి ఉదయం 10 గంటలకు చిత్తూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్ఐలు, 80 మంది వరకు పోలీసులను కోర్టు ఆవరణలో భద్రత కోసం ఏర్పాటు చేశారు. కటారి కుటుంబ సభ్యులకు, సీకే బాబు ఇంటి వద్ద, ప్రధాన సాక్షుల ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కలి్పంచారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
కుప్పంరూరల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రమేష్ కథనం మేరకు వివరాలిలా. సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి న మహిళ ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రైలు ఢీకొని మృతి చెందింది. తెల్ల చీర కట్టుకుని ఉన్న మహిళ తప్పిపోయి ఉంటే కుప్పం రైల్వే అధికారులను సంప్రదించాలని కోరారు. గుర్తు తెలిస్తే రైల్వే పోలీసులు 9000716436, 8074088806 నంబర్లను సంప్రదించాలని కోరారు. అంత్యక్రియలకు వెళ్లి.. అనంత లోకాలకు ఐరాల: బంధువుల అంత్యక్రియలకు వెళ్లి ద్విచక్రవాహనంలో వస్తూ డివైడర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. కాణిపాకం ఎస్ఐ నరసింహులు కథనం మేరకు.. తవణంపల్లె మండలం ఎగువ తవణంపల్లెకు చెందిన పి.నాగరాజ(45) ఉదయం పూతలపట్టు మండలం బూచేపల్లెలో బంధువు అంత్యక్రియలకు ద్విక్రవాహనంలో వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో చిగరపల్లె హైవే బ్రిడ్జి వద్ద అతివేగంతో డివైడర్‌ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య విజయనిర్మల, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ముగిసిన ఎస్జీఎఫ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
గోపాలపట్నం: స్థానిక ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికల జట్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విభాగాల వారీగా విజేతలు వీరే.. అండర్–14 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో అనంతపురం జిల్లా ప్రథమ స్థానాన్ని, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. అండర్–17 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానాన్ని, అనంతపురం, కృష్ణా జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. అండర్–19 విభాగం: బాలుర విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానాన్ని, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు అధికారులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు అభినందించారు. వారికి జ్ఞాపికలు, శాలువాలు అందజేశారు. -
విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
తిరుపతి రూరల్ : మోంథా తుపాను నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఈ క్రమంలోనే సెలవులను రద్దు చేశామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ స్పష్టం చేశారు. ఆదివారం సదరన్ డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల ఇంజినీరింగ్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్తు సబ్ స్టేషన్లలో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుకే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సెలవులు రద్దు చేసినట్టు వెల్లడించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు సీజీఎం స్థాయి అధికారులు ఒక్కో జిల్లాను మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని ఆదేశించారు. ‘పాపవినాశనం’లో గంగ పూజ తిరుమల : తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పాపవినాశనం డ్యామ్ వద్ద టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు హారతి సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండిపోవడం శుభ పరిణామమన్నారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుందని, తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్‌ల నుంచి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. తిరుమలలో 250 రోజుల అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అలాగే టీటీడీ చరిత్రలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. -
పోలీసు ఆయుధాలు.. పరికరాల ప్రదర్శన
చిత్తూరు అర్బన్ : పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు.. పరికరాలను సందర్శకుల కోసం ఉంచా రు. ఎస్పీ తుషార్ డూడీ ఓపెన్ హౌస్‌ను ప్రారంభించా రు. ఇందులో పోలీసులు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్ కెమెరాలు, కెమెరాలతో భద్రత పర్యవేక్షించే వాహనాలు, పోలీసు జాగిలాలను విద్యార్థులు, ప్రజలకు చూపించారు. ఆయుధాలను ఎలా ఉపయోగిస్తారు..? వాటి రేంజ్ ఏంటి..? ఒక్కసారి కాలిస్తే ఎన్ని బుల్లెట్లు వెళతాయి..? తదితర వివరాలను విద్యార్థులకు ఎస్పీ స్వయంగా వివరించారు. -
మోంథా ముప్పు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అల్పపీడన ప్రభావంతో ఇది వరకే వర్షాలు దడ పుట్టించాయి. అన్నదాతలను నిలువునా ముంచాయి. రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాయి. గురువారానికి తెర వీడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తీరా మళ్లీ మరో తుపాను ముంచుకొస్తోంది. బంగాళఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం మోంథా తుపానుగా రూపం దాల్చుకుంది. దీనివల్ల జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మోంథా తుపాను జిల్లాలో అన్నదాతలను ఆందోళనలోకి నెట్టేసింది. ఇది వరకు 178 హెక్టార్లకు వరి నష్టం కాగా..టమాట, కూరగాయల పంటలు, పండ్ల తోటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. ఈ తుపానుతో మళ్లీ పంటలకు నష్టం వాటిళ్లనుంది. దీనికి తోడు చెరువు కట్టలు పలుచోట్ల మరమ్మతులకు గురై తెగే ప్రమాదం ఉంది. వర్ష ప్రభావంతో జీడీ నెల్లూరు, ఎస్ఆర్పురం, సోమల తదితర మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. పలమనేరులో భారీ వర్షం జిల్లాలో శనివారం రాత్రి పలుచోట్ల వర్షం దంచికొట్టింది. పలమనేరులో అత్యధికంగా 69.0 మి.మీ వర్షం పడింది. సదుంలో 44.8, పెనుమూరులో 55.0, పూతలపట్టులో 50.0, సోమలలో 35.4, చౌడేపల్లిలో 41.4, గంగరంలో 37.6, తవణంపల్లిలో 27.4, గంగాధర నెల్లూరులో 39.2, చిత్తూరు అర్బన్‌లో 40.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. -
ఖనిజం..లూటీ
ఆ అధికారి అండదండలు సాక్షి టాస్క్‌ఫోర్స్ : పూతలపట్టు నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీలకు పెట్టింది పేరు. ఇక్కడ లభిస్తున్న బ్లాక్ గ్రానైట్ ఖనిజం అత్యంత విలువైంది.దీంతో ఆర్థిక, సామాజిక, అర్థ బలం ఉన్న రాజకీయ నేతలతో పాటూ.. వ్యాపారవేత్తలు సైతం తీవ్రంగా పోటీ పడుతుంటారు. దీనికోసం పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేస్తుంటారు. అనుమతి రాని వారు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి వాటిని చేజిక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ తరహాలోనే కొందరు కూటమి నేతలు అక్రమ క్వారీ పనులు చేస్తున్నారని పలు ఆరోపణలు చెలరేగుతున్నాయి. రూ.కోట్లలో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ.. పూతలపట్టు నియోజకవర్గంలోని 3 మండలాల్లో క్వారీ పనులు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు అనుమతుల పేరిట...ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో భాగంగానే యాదమరి మండలంలో దాదాపు 12 గ్రానైట్ నిక్షేపాలు ఉండగా వాటిలో 10 క్వారీల్లో పనులు సాగుతున్నాయి. వీటి నుంచి రోజుకు 30 లారీల్లో గ్రానైట్ బండలను పాలిషింగ్ కర్మాగారాలకు రవాణా చేస్తున్నారు. గ్రానైట్ తరలింపునకు సంబంధిత శాఖల నుంచి అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి ఇచ్చిన మేరకు కాకుండా అక్రమంగా రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. ఒక్కో లారీలో పెద్దవి అయితే రెండు, చిన్నవి అయితే 4 వరకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రోజుకు ఒక్క యాదమరి మండలం నుంచే రూ.20–30 లక్షల విలువ చేసే ఖనిజ సంపద తరలిపోతోంది. కాగా ఇక్కడ జరుగుతున్న క్వారీలు దాదాపుగా కూటమి నేతల కనుసన్నల్లో నడుస్తున్నాయి. దాసరపల్లి వద్ద జరుగుతున్న అక్రమ క్వారీలో ఐదు నెలలుగా సుమారు రూ.25 కోట్లు విలువ చేసే ఖనిజం సరిహద్దులు దాటిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఓ అధికారి సహకారం ఉండడంతో ఈ తంతు జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇక పూతలపట్టులో అయితే 10 క్వారీలు గాను 3 చోట్ల అక్రమంగా తవ్వుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ టీడీపీ నేత ఈ దందాలో చేతులు తిరిగినట్లు ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక లీజుకు ఉన్న క్వారీ దారులు సైతం రాయల్టీలు కట్టకుండా ఖనిజానికి కన్నం వేస్తున్నారు. బంగారుపాళ్యంలో కూడా ఇదే తంతు నడుస్తోంది. విజిలెన్స్ అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు దాసరపల్లిలో జరుగుతున్న అక్రమ క్వారీ విషయం సాక్షి కథనంతో గుట్టు రట్టు కావడంతో విజిలెన్స్ అధికారులు ఆ క్వారీని తనిఖీ చేసినట్లు తెలిసింది. ఆ అక్రమ క్వారీ నిర్వాహకుడు ఎవరు..? ఎన్ని నెలలుగా చేస్తున్నాడు..? ఇందుకు సహకరిస్తున్న ఆ అధికారి ఎవరు..? మాముళ్లు ఏమైనా ఇస్తున్నారా..? గొల్లపల్లి క్వారీ పేరుతో ఎలా అక్రమ క్వారీలోని దిమ్మెలకు తరలింపులు చేస్తారు..? దీని వెనుక ఎవరెవరి హస్తం ఉంది? గ్రామస్తులు ప్రశ్నిస్తే..బెంగుళూరులోని ఓ టీడీపీ నేత బెదిరింపులు ఏంటీ అనే విషయంపై పూర్తిగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక యాదమరి మండల ప్రాంతంలోని ఓ క్వారీ అనుమతితో అటవీశాఖ భూముల్లో తవ్వకాలు చేస్తున్నట్లు వారు గుర్తించినట్లు సమాచారం. ఈ అక్రమాలకు సహకరిస్తూ..ప్రోత్సహిస్తున్న ఆ అధికారిపై త్వరలో వేటు పడే అవకాశాలున్నాయని శాఖలోని పలువురు చెబుతున్నారు. అక్రమ గ్రానైట్ దందాను నిలువరించాల్సిన సంబంధిత శాఖాధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలకు తావిస్తోంది.మైనింగ్ శాఖలోని ఓ అధికారికి క్వారీ యాజమానుల నుంచి భారీ మొత్తంలో నెలవారీ ముడుపులు అందుతున్నాయని ఆ శాఖలోని కొందరు సిబ్బంది చెబుతున్న రహస్యం. ఎవరా అధికారి ? అతడి అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరుతున్న జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ అక్రమాలను నియంత్రించాల్సిన నిఘా వ్యవస్థ ఏమైనట్టు? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో అక్రమ గ్రానైట్ తరలింపుతో రూ. కోట్లలో ప్రభుత్వానికి నష్టం చేకూరింది. అయితే ఈ అక్రమ క్వారీయింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి కొందరు అధికారులు సాహసిస్తున్నా కొందరు ప్రభుత్వ పెద్దల నుంచి ఆ అధికారులను నిలువరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
జాతీయ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉర్దూ టీచర్లు ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ టీచర్ అవార్డులను ఈ నెల 26న డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథుల నుంచి స్వీకరించారు. వారు ఉర్దూ పాఠశాలల్లో ఉత్తమ విద్యాబోధన అందించినందుకు గాను జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. జిల్లాలోని పుంగనూరులోని ఉర్దూ జెడ్పీ హైస్కూల్లో గణిత టీచర్‌గా పనిచేస్తున్న రబ్బాని, పలమనేరు న్యూపేట్ హైస్కూల్లో జీవశాస్త్రం టీచర్‌గా పనిచేస్తున్న సుస్రత్ అలియా బేగమ్, చిత్తూరు నగరంలోని జైహింద్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ముక్తార్ అహ్మద్, చిత్తూరు నగరంలోని ఉర్దూ ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మహబూబ్‌బాషా జాతీయ అవార్డులు స్వీకరించారు. -
టమాటకు రెక్కలు
పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో సాగు వివరాలు పలమనేరు : జిల్లాలో టమోట ధరలకు రెక్కలొచ్చాయి. పలమనేరు మార్కెట్లో ఆదివారం 14 కిలోల బాక్సు ధర రూ.500 దాటింది. గత నెలగా బాక్సు రూ.200 కూడా దాటలేదు. అయితే కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా టమాట తోటలు దెబ్బతిన్నాయి. తోటల్లోనే మొక్కలు కుళ్లిపోవడం, కాయలు దెబ్బతినడంతో భారీగా సరుకు తగ్గింది. దీంతో డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేక ధర అమాంతం పెరిగేందుకు కారణమైందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కాగా ఈనెలాఖరు దాకా టమోటా ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి అంచనా వేస్తున్నారు. భారీగా తగ్గిన సరుకు గత కొన్నాళ్లుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమాట తోటలు దెబ్బతిన్నాయి. నీటినిల్వ ఎక్కువగా ఉన్న తోటలు కుళ్లిపోయాయి. కాయలు సైతం కుళ్లి రాలిపోయాయి. దీంతోపాటు తెగుళ్ల కారణంగా కాయలపై మచ్చలు పడి నాణ్యత తగ్గింది. డివిజన్ పరిధిలో తోటలు సగానికిపైగా దెబ్బతినడంతో మార్కెట్‌కు సరుకు భారీగా తగ్గింది. టమాట ఈ సీజన్లో సాధారణ సాగు 5 వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 1500 హెక్టార్లు కోతదశలో ఉన్న తోటలు 600 హెక్టార్లు ఈ సీజన్లో మండీలకు రావాల్సిన సరుకు 100 లారీ లోడ్లు ప్రస్తుతం మార్కెట్లకు చేరుతున్న సరుకు (పొరుగు జిల్లాల నుంచి కలిపి) 60 లోడ్లు -
భక్తులతో బోయకొండ కిటకిట
ప్రత్యేక అలంకరణలోఅమ్మవారుచౌడేపల్లె బోయకొండ ఆలయంలో భక్తుల రద్దీ చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనె దీపాలు పెట్టి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఏకపక్షం.. అధ్యక్షా!
ఏ ఉద్యోగ సంఘానికై నా నియమ, నిబంధనలు ఉంటాయి. ఏ సంఘమైనా వాటిని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, వెసులుబాటును అనుభవించేందుకు ఏళ్ల తరబడి ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ బైలాస్ ప్రకారం నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికలను అందుకు విరుద్ధంగా నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కొందరు ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా వారందరిని బెదిరించి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల్లో వ్యతిరేకత చూపుతున్న అదే సంఘం సభ్యులు (ఫైల్) చిత్తూరు కలెక్టరేట్ : నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికలను పక్కదారి పట్టించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నట్లు ప్రభుత్వ లెక్చరర్లు పెదవి విరుస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలను రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహించడంతో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరిగి ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని వెల్లడిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఓ జూనియర్ లెక్చరర్ 2014 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా అతడే కొనసాగుతుండటం విమర్శలకు తావిస్తోంది. అధ్యక్ష పదవికి మరికొందరు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ అవకాశం కల్పించడం లేదని జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలు తనకు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడి ఏకపక్షంగా ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారని ఆ సంఘం సభ్యులే పెదవి విరుస్తున్నారు. ఆ అధ్యక్షుడి అక్రమ వ్యవహారాలపై ఆ సంఘం సభ్యులు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానంను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు జోక్యం చేసుకోవాలి అసంబద్ధంగా నిర్వహించిన ఎన్నికలపై రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విచారణ కమిటీని నియమించి అవకతవకలను విచారించాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలున్నాయంటూ రెచ్చిపోతున్న అధ్యక్షుడి వ్యవహార తీరుపై జిల్లాలోని లెక్చరర్లతో పాటు, పక్క జిల్లాల లెక్చరర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత స్వలాభం కోసం మాత్రమే రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలను నిర్వహించారని మండిపడుతున్నారు. చట్టబద్ధత లేని ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు . సమాజాల నమోదు చట్టం, సంఘం నియమావళి ప్రకారం తిరిగి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలు తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికలు
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఇటీవల రాజ్యాంగ నియమావళిని ఉల్లంఘిస్తూ నిర్వహించారని ఆ సంఘం సభ్యులే ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత, సమాన హక్కుల వంటి ప్రాథమిక సూత్రాలను గాలికొదిలేశారని సభ్యులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం నిష్పాక్షిక అధికారులను నియమించకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని వాపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే అధికారులుగా నియమించడం చట్టవిరుద్ధమని చెబుతున్నారు. అర్హులైన లెక్చరర్లందరికీ సభ్యత్వం కల్పించకుండా, అనుకూలంగా ఉన్న వారికి మాత్రం అవకాశం కల్పించి ఎన్నికలు నిర్వహించారని వెల్లడిస్తున్నారు. ఇలా చేయడం సమానత్వ హక్కు (భారత రాజ్యాంగంలోని 14 వ అధికరణం) సమాజాల నమోదు చట్టంలోని నియమావళికి విరుద్ధమని లెక్చరర్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల కమిటీల ఎన్నికలు పూర్తి చేసి రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది, అలా చేయకుండానే ఎన్నికలు పూర్తి చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఎన్నికలు జరగకపోగా, 3 జిల్లాల్లో బహిష్కరించారని వెల్లడిస్తున్నారు. రాష్ట్ర రాజధాని కేంద్రంలో నిర్వహించాల్సిన ఎన్నికలను తమకు అనుకూలంగా తిరుపతిలో నిర్వహించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
వడమాలపేట (పుత్తూరు) : వడమాలపేట మండలం పూడి రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే కానిస్టేబుల్ శివకుమార్ కథనం మేరకు పూడి రైలు మార్గంలోని 124బి/31 వద్ద సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు ఒంటిపై బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనదుర్గాపురంలో వైద్య పరీక్షలు పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం గ్రామంలో కొంతమంది ఆదివారం విరేచనాలు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పీహెచ్సీ వైద్యాధికారులు మోహన్‌క్రిష్ణ, జయకుమార్ వనదుర్గాపురం గ్రామానికి వెళ్లి విరేచనాలు, వాంతులు అయిన వారికి వెద్య పరీక్షలు చేశారు. డాక్టర్లు మాట్లాడుతూ.. వారు తీసుకున్న ఆహారం సరికాదని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ మార్పు వల్ల మనం తినే ఆహారం అప్పటి కప్పుడు చేసింది తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ కుమార్. మండల విస్తరణాధికారి సత్యనారాయణ, సీహెచ్ఓ సుబ్రమణ్యం, ఆరోగ్య సిబ్బందులు పాల్గొన్నారు. -
తీర్పుపై ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్ : జిల్లా న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క చిత్తూరు వాసులే కాదు.. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోని కూటమి నాయకుల వరకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందోనని గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో దోషులకు సోమవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 2015.. నవంబరు 17వ తేదీ.. స్థలం – చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమయం – మధ్యాహ్నం 11.57 గంటలు ఏం జరిగింది – మేయర్ సీటులో కూర్చుని ఉన్న కటారి అనురాధను పాయింట్ బ్లాక్‌లో తుపాకీతో కాల్చి చంపేసారు. పక్కనే కూర్చుని ఉన్న ఆమె భర్త కటారి మోహన్‌ను కత్తులతో వెంటాడి నరికేశారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడతున్న మోహన్‌ను చిత్తూరుకు ఆపై వేలూరుకు తరలించగా అక్కడి ఆసుపత్రిలో చనిపోయాడు. చేసిందెవరంటే – ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అనే చింటూతో పాటు 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైంది వీరిపై .. చింటూ, చంద్రశేఖర్ అలియాస్ చింటూ (54), వెంకటాచలపతి (59), జయప్రకాష్‌రెడ్డి (32), మంజునాథ్ (36), వెంకటేష్ (48)పై నేరం రుజువైనట్లు చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ ఇన్చార్జ్ న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. మిగిలినవారిపై కేసు కొట్టేసింది. నిరూపించబడ్డ సెక్షన్లు ● 120 (బి) ఐపీసీ (హత్యకు కుట్ర) – అయిదుగురు ● అనురాధను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్‌విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి ● మోహన్‌ను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్‌విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి ● వేలూరు సతీష్ కుమార్ నాయుడుపై హత్యాయత్నం చేసినందుకు సెక్షన్ 307 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ ● వేలూరు సతీష్‌కుమార్ నాయుడును నిందితులు ఒకే ఉద్దేశ్యంతో హత్యాయత్నం చేయడం సెక్షన్ 307 రెడ్‌విత్ సెక్షన్ 34 ఐపీసీ – చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, వెంకటేష్. సతీష్‌కుమార్ నాయుడును చంపాలనే ఉద్దేశ్యంతో గాయపరచడం సెక్షన్ 302 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ . పోలీసుల భారీ భద్రత దోషులు అయిదుగురిని చిత్తూరు జిల్లా జైలు నుంచి ఉదయం 10 గంటలకు చిత్తూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్ఐలు, 80 మంది వరకు పోలీసులను కోర్టు ఆవరణలో భద్రత కోసం ఏర్పాటు చేశారు. కటారి కుటుంబ సభ్యులకు, సీకే బాబు ఇంటి వద్ద, ప్రధాన సాక్షుల ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కల్పించారు. -
పంటలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగువమూర్తి వారిపల్లెలోని పంటలపై ఆదివారం తెల్లవారుజామున ఏనుగులు దాడి చేశాయి. రాగి పంటను తొక్కి నాశనం చేశాయి. చేతికి వచ్చిన సమయంలో పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం సహిత విద్య కో ఆర్డినేటర్ (ఐఈఆర్పీ)ల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. కో–ఆర్డినేటర్ల రెగ్యులర్ పే స్కేల్ నిమిత్తం ఈ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియను డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న సహిత విద్య కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. -
భవనం కూల్చుతుండగా కూలీ మృతి
బైరెడ్డిపల్లె : పాత భవనం కూల్చడానికి వెళ్లిన కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని ధర్మపురిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన భాస్కర్ పాత భవనం కూల్చడానికి ఐదుగురు కూలీలకు ఒప్పందం చేశాడు. అదే గ్రామానికి చెందిన ఐదుగురు కూలీలు భవనం కూల్చుతుండగా గంగాధర్ (29) అనే వ్యక్తిపై ప్రమాదవశాత్తు గోడ కుప్పకూలింది. దీంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన గంగాధర్‌ను స్థానికులు బైరెడ్డిపల్లె పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు గంగాధర్ మృతి చెందినట్లు నిర్ధారించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి బంగారుపాళెం: స్థానిక సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. అతనికి సుమారు 50 ఏళ్లు ఉంటాయని, అనారోగ్యంతో బంగారుపా ళెం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి మృతి చెందాడని తెలిపారు. మృత దేహాన్ని మార్చురీలో ఉంచామని, ఆచూకీ తెలిసిన వారు 9440796736 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఎక్కడినుంచి వచ్చిందో.. ఎందుకొచ్చిందో.. బ్యాగులో లక్ష క్యాష్
చిత్తూరు జిల్లా: ఆమె ఎందుకొచ్చిందో.. ఎక్కడికొచ్చిందో తెలియదు. ఊరుగాని ఊరు వచ్చి బస్ షల్టర్‌లో చిక్కుకుపోయారు. మూడు రోజులుగా వర్షాల కారణంగా అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎవరో భిక్షగత్తె అనుకుని స్థానికులు చేరదీసి ఆదరించారు. శనివారం ఉన్నట్టుండి అపస్మారక స్థితి చేరుకుని మృతిచెందారు. హెడ్ కానిస్టేబుళ్లు మస్తాన్, జయశంకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మహిళ భుజానికి ఉన్న బ్యాగ్‌ను పరిశీలించారు. ఆమె పేరు రామలక్ష్మి(60)గా నిర్ధారించారు. ఆమెది ధనపాల్చెట్టి స్ట్రీట్, ముత్తుపాళెం, సిద్ధిపేట, చెన్నైగా బ్యాగులోని ఆధార్, బ్యాంకు పుస్తకాలను బట్టి గుర్తించారు. బ్యాగులో ఉన్న రూ. 1.08 లక్షలను స్వా«దీనం చేసుకున్నారు. వీటితోపాటు చెన్నై కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు ఖాతా పుస్తకాలను పరిశీలించారు. బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.4 లక్షల మేర బ్యాలెన్స్ ఉన్నట్టు స్టేట్మెంట్ను బట్టి గుర్తించా రు. పర్సులో కొన్ని నగలు సైతం ఉండడంతో.. ఫోన్‌బుక్‌లో ఉన్న తన కుమార్తె పళణి ఎమ్మాల్కు సమాచారమిచ్చారు. రామలక్ష్మి చౌడేపల్లెకు ఎందుకొచ్చారు.. ఎలా వచ్చారో తెలియడం లేదు. పలమనేరుకు వెళ్లాల్సింది పోయి.. గత మూడు రోజుల క్రితం ఆమె చౌడేపల్లెలో పలమనే రుకు వేళ్లేందుకు ఆటోలో ఎక్కాల్సి ఉండగా పొరపాటున తిరుపతి వైపు వెళ్లే ఆటో ఎక్కినట్టు స్థానికులు చె బుతున్నారు. చౌడేపల్లెకు సుమారు 2కి.మీ దూరంలో ఆటో వెళ్తుండగా మహిళను డ్రైవర్ ప్రశ్నించాడు. పలమనేరుకు వెళ్లాలని సమాధానమివ్వగా ఆమినిగుంట బస్ షల్టర్ వద్ద ఆ మహిళను ఆటోలో నుంచి దింపేశా రు. ఆమెకు తెలుగు రాదు. మూడు రోజులుగా బస్ల్టర్లోనే తలదాచుకున్నారు. చలికి వణుకుతూ అపస్మారస్థితికి చేరుకుని మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రామలక్ష్మి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
పకడ్బందీగా రికార్డుల కంప్యూటరీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : వక్ప్ బోర్డ్ రికార్డుల కంప్యూటరీకరణ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సర్కార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదుల ముతవల్లీ ప్రెసిడెంట్లు, అన్ని పార్టీల ముస్లిం నాయకులకు వక్ఫ్‌భూముల ఆస్తుల వివరాలు ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను వివరించాలన్నారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు. తప్పిదాలు చోటు చేసుకుంటే సిబ్బందిపై చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం వక్ఫ్ రికార్డులు, ఆస్తులు, ఆదాయం నిర్వహణలో పాదర్శకతను పెంచి, మిగిలిన ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి ఎలా ఉపయోగించాలో వివరించారు. వక్ఫ్ ఆస్తుల సమాచారాన్ని అప్లోడ్ చేసే సమయంలో డీఆర్వో, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సహాయం తీసుకొవాలన్నారు. ఈ ఓరియెంటేషన్ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ హరినాథ్‌రెడ్డి, జిల్లా వక్ప్‌బోర్డ్ ఇన్స్పెక్టర్ రియాజ్ పాల్గొన్నారు. -
చిరుత సంచారం పుకార్లు
తవణంపల్లె: మండలంలోని అరగొండ– కామాలూరు రోడ్డులో చిరుత సంచారం చేసినట్టు వచ్చిన పుకార్లలో వాస్తవం లేదని ఫారెస్టు బీట్ ఆఫీసర్ రెడ్డెప్ప తెలిపారు. అరగొండ– కామాలూరు రోడ్డులో నాలుగు రోజుల క్రితం ఓ ప్రయివేటు జ్యూస్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న గుట్టలో మేకలు మేపుతున్న కాపరి చిరుత పులి వచ్చి ఒక మేక పిల్లను పట్టుకొని వెళ్లిందని పుకార్లు చేశారని పేర్కొన్నారు. దీనిపై ఫారెస్టు సిబ్బంది గుట్టలో చిరుత జాడ గురించి గాలిస్తే ఎలాంటి ఆనవాళ్లు కనపడలేదని వివరించారు. అరగొండ, చారాల, పైమాఘం పరిసరా గ్రామాల్లో చిరుత సంచారంపై అవగాహన కల్పించి అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. -
అసోసియేషన్ అంటే ప్రశ్నించే గొంతుక
చిత్తూరు కలెక్టరేట్ : అసోసియేషన్ అంటే ప్రశ్నించే గొంతుకగా ఉండాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ సంఘంలో ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు దాదాపు 31 వేల కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ లేకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం పై ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ఆ ఆశలను నిరాశపరచకూడదని చెప్పారు. ఇటీవల జారీచేసిన డీఏ ఉత్తర్వుల్లో తీవ్ర గందరగోళం సృష్టించారన్నారు. దాన్ని సరిచేయాలని తమ సంఘమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. అనంతరం సవరించిన జీవోను జారీచేశారన్నారు. చేసింది గోరంతే, చేయాల్సింది కొండత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చేసింది గోరంతేనని, చేయాల్సింది కొండత ఉందని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల హెల్త్‌కార్డులు పనిచేయడం లేదన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం 60 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు వర్తింపజేసి ఉద్యోగోన్నతులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల పోరాడేందుకు ఎన్జీవో సంఘం ఎప్పుడూ ముందుంటుందన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు జగదీశ్, శివప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రదీప్, మురళి, సురేశ్, పుమాల, లక్ష్మీపతి, మహేష్, భానుప్రకాష్, సుభాష్, హరి, గురునాథం, జ్యోతి, పురుషోత్తంరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
నైపుణ్యాలను పెంపొందించండి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం జనవిజ్ఞాన వేదిక ఉచితంగా ఎన్ఎంఎంఎస్ పుస్తకాలను రూపొందించింది. ఆ పుస్తకాలను శనివారం కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ్శివప్రసాద్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు జయంతి, పర్యావరణ విభాగం కన్వీనర్ సుధాకర్, జేవీవీ నాయకులు విజయ్, చిరంజీవి, గణిత ఫోరం జిల్లా అధ్యక్షులు చంద్రమనాయుడు పాల్గొన్నారు. -
గోడ కూలి మున్సిపల్ కూలీ మృతి
కుప్పం: గోడ కూలి మున్సిపల్ కూలీ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. శనివారం ఉదయం ఆర్టిసీ బస్టాండు ఎదురుగా ఉన్న మున్సిపల్ మురుగునీటి కాలువను శుభ్రం చేసేందుకు నలుగురు కూలీలు దిగారు. ఆ సమయంలో కాలువ ఓ వైపు ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న కూలీ ఆళ్లగడ్డకు చెందిన శీనయ్య(45) మృతిచెందారు. మరో ముగ్గురు కూలీలు హజరతయ్య, సురేష్, వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ గోడ కూలి మృతి చెందిన శివయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. గాయపడిన వారిని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమా? కుప్పం ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న మురుగు నీటి కాలువలువ పక్కనున్న గోడలు పాచిపట్టి, పెచ్చులూడి శిథిలావస్థకు చేరాయి. ఇరవై ఏళ్లుగా నీటి ప్రవాహంతో దెబ్బతిని కూలే స్థితికి చేరాయి. కానీ అధికారులు మురుగు నీటి కాలువను శుభ్రం చేయాలని పారిశుద్ధ్య కార్మికులపై ఒత్తిడి చేయడంతోనే కార్మికులు ఆ కాలువలోకి దిగి ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నారు. -
వేదాంతపురంలో విషాదఛాయలు
● స్వర్ణముఖి నదీ తీరంలో మిన్నంటిన రోదనలు ● కన్నీటి పర్యంతమైన స్థానికులు ● ఘటనా స్థలిని పరిశీలించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ● మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ● ప్రమాద కారణాలను అన్వేషించాలని డిమాండ్ ‘‘దేవుడా మేమేం పాపం చేశాం.. ఎందుకీ కడుపు కోత.. మా బిడ్డలను ఎందుకు దూరం చేశావు.. చిన్న వయసులోనే ఎందుకు తీసుకెళ్లిపోయావు.. ప్రాణ సమానంగా పెంచుకుంది ఇందుకేనా..? పిల్లల ఉసురు తీసి మాకు ఇంతటి శిక్షను విధిస్తావా..? మా ఆశలను నిలువునా ముంచేస్తావా..? ఇక మేం ఎవరిని చూసుకుని బతకాలి’’ అంటూ వేదాంతపురంలో స్వర్ణముఖి నదిలో మునిగి మృత్యువాత పడిన నలుగురు బాలుర తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదించారు. విగతజీవులుగా మారిన బిడ్డలను చూసి గుండెలవిసేలా ఆక్రందించారు. బాధితుల ఆర్తనాదాలు చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. తిరుపతి రూరల్ : మండలంలోని వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన ఏడుగురిలో నలుగురు బాలురు గల్లంతు కావడం విధితమే. శుక్రవారం రాత్రి 10గంటల వరకు చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక మృత దేహం (బాలు) మాత్రమే లభించింది. మిగిలిన వారి కోసం శనివారం ఉదయం 6గంటల నుంచే నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాల సాయంతో నదిని జల్లెడ పట్టారు. 7గంటలకు ప్రకాష్ అనే బాలుడి మృత దేహాన్ని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. మధ్యాహ్నం 12గంటల తేజ అనే బాలుడి మృత దేహం లభించింది. తర్వాత వర్షం మొదలవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. వాన తగ్గిన తర్వాత మళ్లీ గాలించగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మునిచంద్ర మృత దేహం చిక్కింది. వెంటనే మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఒక్కరు కూడా ప్రాణాలతో లేరనే విషయం తెలుసుకున్న కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను వెలికితీతీకు అవస్థలు స్వర్ణముఖి నదిలో వరదనీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడం, అప్పుడప్పుడూ వర్షం కురుస్తుండడంతో శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలకు పలు మార్లు అంతరాయం కలిగింది. ఎస్పీ సుబ్బరాయుడు శనివారం ఉదయం నుంచి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి నదిలోకి వెళ్లారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు, తిరుపతి రూల్, చంద్రగిరి, భాకరాపేట సీఐలు గాలింపు చర్యల్లో పాల్గొన్నా రు. మృత దేహాలను వెలికి తీసేందుకు కృషి చేశారు. ఎట్టకేలకు తమ బిడ్డల చివరి చూపు దక్కేలా చేసినందుకు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అదనపు పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనంగా 203 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు డీఆర్వో మోహన్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్‌ల పరిష్కారం పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2026 ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,776 పోలింగ్స్టేషన్లు ఉండగా అందులో 8 పోలింగ్స్టేషన్లు పాత భవనాలు, కూలిపోయిన భవనాల నుంచి కొత్త వాటికి మార్పు చేశామన్నారు. మరో 68 పోలింగ్ స్టేషన్ల పేర్లను మార్పు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1,500 మంది ఓటర్లకంటే ఎక్కువ ఉన్న పోలింగ్స్టేషన్ల పరిధిలో అదనంగా కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులతో చర్చించి జిల్లాలో 203 కొత్త పోలింగ్స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపి ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొత్త పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 1,979 పోలింగ్స్టేషన్లు ఉంటాయన్నారు. జిల్లాలో 15,74,277 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,74,244 మంది పురుషులు, 7,99,961 మంది మహిళలు, 72 మంది ఇతరులు ఉన్నారన్నారు. ఆర్డీవోలు శ్రీనివాసులు, అనుపమ, భవానీ, శ్రీనివాస్‌రాజు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్‌కుమార్, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాసులు, పరదేశి, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
మీ సంతకమే..మీ పిల్లల భవిష్యత్తు
నగరి : మీ సంతకం మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని, కోటి సంతకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపునిచ్చారు. శనివారం తన నివాస కార్యాలయం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిమిత్తం నగరి మున్సిపల్, రూరల్ మండలం, వడమాలపేట మండల నేతలతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందన్నారు. మెడికల్ కళాశాలలను రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేద పిల్లలు డాక్టర్లవుతారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఆ సేవలు నిలిచిపోయే విధంగా చేశారని దుయ్యబట్టారు. ఆయన నగరి ఎమ్మెల్యేనా, తిరుపతి ఎమ్మెల్యేనా? నగరిలో ఉన్నది నగరి ఎమ్మెల్యేనా, తిరుపతి ఎమ్మెల్యేలా..? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందని మాజీ మంత్రి ఆర్కే.రోజా ఎద్దేవా చేశారు. ఎవరి వద్ద ఎంత కమీషన్ తీసుకుందామా..? అని తిరుపతి నుంచి లెక్కలు వేసుకోవడం మినహా ఆయన ఏమీ చేయడం లేదన్నారు. ఆయన్ను ఎవరైనా కలవాలన్నా తిరుపతికి వెళ్లాల్సిందే అన్నారు. దోచుకున్నామా.. దాచుకున్నామా అన్నరీతిలో పాలన కొనసాగుతోందన్నారు. తాను ఏ అభివృద్ధి పనులు చేశానో ఎమ్మెల్యేగానీ ఆయన అనుచరుగానీ వస్తే కళ్లకు కట్టినట్టు చూపుతానన్నారు. వారు చేసిన అభివృద్ధి చూపగలరా అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఏదైనా కట్టించాడా అంటే అది ఆయన తండ్రి విగ్రహం మాత్రమే అన్నారు. పోటీపడి అభివృద్ధి చేసి ప్రజలకు మంచి చేయాలన్నారు. అది వదలిపెట్టి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడదామా, లోపలేద్దామా, లిటిగేషన్ పెడదామా అనే దిశగానే పాలన కొనసాగుతోందన్నారు. అనంతరం కోటిసంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. నియోజకవర్గ పరిశీలకులు రాహుల్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, ఎంపీపీ భార్గవి, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.సూపర్ మోసం సూపర్ సిక్స్ సూపర్ ఫట్ అయ్యిందని మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోందని పేర్కొన్నారు. కొండలు, గుట్టలను వదిలిపెట్టడం లేదని, ఎడాపెడా దోచేస్తున్నారన్నారని ఆరోపించారు. మద్యం, గ్రావెల్, ఇసుకపై వచ్చే ఆదాయంపైనే దృష్టి పెడుతున్నారే తప్ప.. ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో పాలకులు లేరన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమన్నారు. మెడికల్ కళాశాలల పీపీపీని వ్యతిరేకించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వ మెడలు వంచుదామన్నారు. -
తుపానుపై అప్రమత్తం
చిత్తూరు అర్బన్: అల్పపీడనం కారణంగా మరో మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే సమాచారంతో చిత్తూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని నీవానది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శనివారం రాత్రి నీవానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తమ సిబ్బందితో వెళ్లి.. స్థానికులతో మాట్లాడారు. రాత్రి వర్షం ఎక్కువైతే నీళ్లు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అనంతరం పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఫోన్– 112, 9491074517, 9440796706 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. -
ప్రైవేటు బాట
రవాణా సేవలు.. డబ్బుల వసూలు..? రవాణాశాఖ సేవలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరమవుతున్నాయి. ఎల్ఎల్ఆర్ మినహా మిగిలిన సేవలు అప్పన్నంగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లాయి. మిగిలిన అరకొర సేవలు కూడా ప్రైవేటుకు కట్టబెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతా ప్రైవేట్ పరం కావడంతో ఒకప్పుడు వాహనదారులతో కళకళలాడిన ఆర్టీఓ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి. పరివాహన్పై అవగాహన ఏదీ? జిల్లాలో వాహనాల వివరాలు.. ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్ ను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణా అధికారులకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డు లేకుండా పోతోంది. జిల్లా మొత్తానికి చిత్తూరు నగర సమీపంలోని బంగారుపాళ్యం వద్ద ఒకే ఒక్క ఏటీఎస్ ఏర్పాటు చేయగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న వారు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.దీంతో వారు అనేక వ్యయ ప్రయాసలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఒకప్పుడు రవాణాశాఖ కార్యాలయాలకు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పనులపై వచ్చేవారితో కార్యాలయం రద్దీగా ఉండేది. క్రమేణ సేవలన్నీ ఆన్‌లైన్‌తో పాటు ప్రైవేటు పరం చేయడంతో రద్దీ తగ్గిపోయింది. సేవలన్నీ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంతో రవాణశాఖ నిర్వీర్యం అయిపోతోంది. అప్పుడు.. ఇప్పుడు ఎలా ఉందంటే.. గతంలో ఎవరైనా వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఏ) కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేవారు. దీంతో కొనుగోలుదారులు అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మొదటి దశలో ప్రైవేటు రంగానికి అప్పగించారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చేశారు. స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వ హించాలి. రవాణా శాఖ విధుల్లో ఇది అత్యంత కీలకమైనది. కానీ ఈ అధికారాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల (ఎంవీఐ) నుంచి తప్పించి, ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణాధికారం కూడా రవాణా శాఖ అధికారులకు లేకుండా చేశారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, దీనిని కూడా డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించి, వారి ద్వారానే శిక్షణ కూడా ఇచ్చి లైసెన్సులు జారీ చేయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల పర్మిషన్లను కార్యాలయ పరిపాలనా అధికారి స్థాయిలో మాన్యువల్‌గా చేసి జారీ చేసే వారు. ఈ సేవలను ఆన్లైన్ చేసి, అవసరమైన సమయానికి రుసుం చెల్లిస్తే కార్యాలయానికి వెళ్లకుండానే వీటిని జారీ చేస్తున్నారు. వాహనాల్లో సామర్థ్యానికి మించి సరుకులు లోడ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పర్మిట్ల వంటి వాటిపై రవాణా అధికారులు గతంలో చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేసేవారు. ఇప్పుడు ఆ చెక్ పోస్టులు ఎత్తివేశారు. రవాణా శాఖ అధికారాలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయడం లేదా కుదించడంతో అధికారులు కేవలం రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీ చేసి, చలానాలు రాయడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా ఆ శాఖపై ఆసక్తి సన్నగిల్లుతోంది. -
భారీగా పట్టివేత
సరిగ్గా 4 నెలల కాలం గడవక ముందే అదే ప్రాంతంలో గతంలో పట్టుకున్న బియ్యం కన్నా ఎక్కువగా పట్టుకున్నారు. దీంతో పచ్చనేతల రేషన్ దందా వరుసగా బహిర్గతమవుతూ వస్తోంది. అయితే పోలీసులు పట్టుకున్న బియ్యం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది త్వరలో ప్రకటిస్తామని చెప్పడం, విషయం ఎక్కువగా ప్రచారం కాకూడదని వివరాలను కూడా రాత్రిపూట వెల్లడించడం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరికీ తెలిసిన విషయమే అయినా పార్టీకి నష్టం వాటిల్లే అంశం కావడంతో రాజకీయంగా పోలీసులపై ఒత్తిడి పెరిగిందని తెలుస్తోంది. -
వరి పంటపై అడవి పందుల దాడి
ఐరాల: మండలంలో వరిసాగు చేసిన రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వరి పంట సాగు చేసిన రైతులకు ఒక పక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మరోవైపు అడ వి పందుల బెడదతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంట పొట్ట దశకు చేరుకోవడంతో అడవి పందులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతానికి సరిహద్దు గ్రామమైన 35 యర్లంపల్లెకు చెందిన రైతు పురుషోత్తంరెడ్డి వరి పంట తొక్కి, తిని నాశనం చేశాయి. తనకు తీరని నష్టం వాటిల్లినట్లు బాధి త రైతు వాపోయాడు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. రైలు ఢీకొని మహిళ మృతి చిత్తూరు కార్పొరేషన్ : నగరానికి సమీపంలో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. గురువారం చిత్తూరు రైల్వే ఎస్ఐ ధర్మేంద్రరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో ఓ మహిళ చిత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా కాట్పాడి నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ వయస్సు దాదాపు 50 నుంచి 55 సంవత్సరాలు, బ్రౌన్ కలర్ జాకెట్, లేత ఎరుపు రంగు చీర ధరించి ఉన్నారన్నారు. మృతదేహం వివరాలు తెలిసిన వారు 8688546060 నంబర్‌ను సంప్రదించాల ని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ చౌడేపల్లె : మండలంలోని దుర్గసముద్రంలో గతంలోని ఓ ఎకై ్సజ్ కేసులో పరారీలో ఉన్న శివకుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. గతంలో ఓ ఎకై ్స జ్ కేసులో తప్పించుకొని తిరుగుతున్న నింది తుడిని ట్రైనీ ఎస్ఐ మణికంఠేశ్వరరెడ్డి ఆధ్వ ర్యంలో పట్టుకొని కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర కేజీబీవీ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజులు అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో కేజీబీవీ ఎస్వోలతో సమావేశం నిర్వహించారు. పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. కేజీబీవీల్లో అమలు చేస్తున్న విజయపథం, విద్యాసక్తి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం గత విద్యాసంవత్సరం మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేసిన ఎస్వోను సత్కరించారు. సమావేశంలో జిల్లా సమగ్రశిక్షాశాఖ ఏపీసీ వెంకటరమణ, కేజీబీవీ పాఠశాలల జీసీడీవో ఇంద్రాణి, పలువురు ఎస్వోలు పాల్గొన్నారు. పెద్ద శేష వాహన సేవ రేపు తిరుమల: తిరుమలలో శనివారం నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటలవరకు మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.


