కంటైనర్ లారీ, బస్సు ఢీ
వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత
తిరుపతి క్రైమ్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల, తిరుపతితోపాటు జిల్లాలోని అన్ని ఆలయాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
● తిరుమలలో సుమారు 2వేల మంది, తిరుపతిలో సుమారు 1,500 మంది పోలీసులతో బందోబస్తు పెట్టాం.
● వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజులపాటు కొనసాగుతుంది. ఈ నెల30, 31 మరియు జనవరి 1 తేదీలలో టోకెన్ ఉన్నవారికి మాత్రమే దర్శనముంటుంది.
● టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల పరిక్షణకు పోలీసులు విధులు నిర్వర్తిస్తారు.
● భక్తులు సైతం పోలీసులకు సహకరించాలి. తమతో వచ్చిన పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
ముక్కంటి సేవకు పోటెత్తిన భక్తులు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దాదాపు 30 వే ల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజులోనే అన్ని 5,158 వరకు రాహుకేతు పూజలు నిర్వహించబడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా రూ.500, రూ.750 రాహుకేతు పూజలకు భక్తులు అధికంగా తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు గంటల తరబడి క్యూల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది.
అనుమానాస్పద ిస్థితిలో వ్యక్తి మృతి
చౌడేపల్లె : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె వద్ద వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు ... బుటకపల్లెకు చెందిన అంజప్ప(56) గ్రామాని కి సమీపంలోని ఆంజనేయస్వామి గుట్ట వద్ద ఓ చెట్టుకు వేలాడుతుండగా గుర్తించిన పశువుల కాపరులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి ధర్యాప్తుచేస్తున్నారు.
కంటైనర్ లారీ, బస్సు ఢీ
కంటైనర్ లారీ, బస్సు ఢీ


