ఎరువుల దుకాణాలపై దాడులు
పలమనేరు/కాణిపాకం: జిల్లాలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో యూరియా.. లేదయ! అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. ఇది నిజమని తేలడంతో ప్రత్యేక అధికారుల ద్వారా తనిఖీలు చేపట్టారు. ఆ మేరకు పలమనేరు ప్రాంతంలో ప్రత్యేక అధికారి సాలురెడ్డి, ఏవో సునీల్‌కుమార్‌రెడ్డి మంగళవారం తనిఖీలు చేశారు. పట్టణంలోని నాగలింగయ్యశెట్టి అండ్ సన్స్, కౌండిన్య ఏఓపీవోలలో ఫామ్–2 లేకుండా ఉన్న రూ.4.87 లక్షల విలువైన 12.5 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. పలు ఎరువుల దుకాణాల్లో ఎరువుల నిల్వ, అమ్మకం రికార్డులను పరిశీలించారు. కాగా సోమవారం బైరెడ్డిపల్లి, వీకోట మండలాల్లో రూ.15 లక్షల విలువజేసే 60 టన్నుల కాంప్లెక్స్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పుంగనూరు, తవణంపల్లె మండలాల్లోనూ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
పలమనేరులో రికార్డులను పరిశీలిస్తున్న
అఽధికారులు
ఎరువుల దుకాణాలపై దాడులు చేస్తున్న
ప్రత్యేక అధికారులు
ఎరువుల దుకాణాలపై దాడులు
ఎరువుల దుకాణాలపై దాడులు


