గొడవలో ముగ్గురికి కత్తిపోట్లు
● దుకాణంలో జరిగిన వాగ్వివాదమే కారణమా? ● పరారీలో దాడిచేసిన వ్యక్తి
పలమనేరు : వస్త్ర దుకాణంలో జరిగిన వాగ్వాదం కారణంగా ముగ్గురు స్నేహితు లు ఓ వ్యక్తిని వెంబడించగా ఎదురుతిరిగిన అపరిచిత యువకుడు ముగ్గురిని కత్తి తో పొడిచి పరారైన సంఘ టన పలమనేరు పట్టణంలో ని గంటావూరు వద్ద శనివా రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. ఓ యువకుడు స్థానిక వస్త్ర దుకాణంలో కొనుగోలు చేస్తూ అక్కడి యజమానితో గొడవకు దిగినట్లు సమాచారం. అనంతరం ఆ యువకుడు బైక్‌ను ర్యాస్‌గా నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహించిన ఆ యజమాని తన స్నేహితులను పిలిపించి ఆ యువకుడి బైక్‌ను వెంబడించుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. గంటావూరు వద్ద వీరందరూ ఆ యువకుడిపై వాగ్వాదానికి దిగగా అక్కడ జరిగిన గొడవలో ఆ గుర్తు తెలియని యువకుడు తనవద్ద నున్న పదునైన కత్తితో ముగ్గురిపై దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో పట్టణానికి చెందిన లక్ష్మీపతి కుమారుడు భవంత్(27) వీపుపై తీవ్ర గాయమైంది. మధుశేఖర్ కుమారుడు సన్ని(25)కి కడుపు, వీపుపై కత్తిపోట్లు పడ్టాయి. సునీల్(26)కు వీపుపై గాయమైంది. వీరిని స్థానికులు ఇక్కడి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన భవంత్, సన్నిలను మెరుగైన చికిత్స కోసం సీఎంసీకి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
తుమ్మిందలో నేత్రావధానం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తుమ్మింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో నేత్రావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఎటువంటి సంభాషణలు లేకుండా కనుసైగలు, కనుబొమ్మల సంజ్ఞలతో మాట్లాడుకున్నారు. పృచ్ఛకులు ఇచ్చిన పదాలను, వాక్యాలను, సంఖ్యలను ఎనిమిదో తరగతి చదువుతున్న జ్ఞానప్రియ కనుబొమ్మలతో ఇచ్చిన సంజ్ఞలను అర్థం చేసుకొని ఏడో తరగతి చదువుతున్న పి.చాముండి వాటిని చకచక చెప్పేసింది. అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుజాత మాట్లాడుతూ ఇలాంటి అరుదైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తమ పాఠశాలలో నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో గణిత అవధాని హెచ్.అరుణ శివప్రసాద్ పృచ్ఛకులు వసంత లక్ష్మి సంజీవి, లలిత, కాళప్ప, ఈశ్వరి, అమర్నాథ్, జ్ఞాన దీపం, జయమణి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కత్తిపోట్లకు గురైన భవంత్,సన్ని
గొడవలో ముగ్గురికి కత్తిపోట్లు
గొడవలో ముగ్గురికి కత్తిపోట్లు


