పోలీసు శిక్షణను పరిశీలించిన ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని జిల్లా పోలీ సు శిక్షణా కేంద్రం(డీటీసీ)లో కానిస్టేబుళ్లకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ పరిశీలించా రు. కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారికి ఇటీవల శిక్షణ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం డీటీసీలో జరుగుతున్న తరగతులను పరిశీలించి, అభ్యర్థులతో మాట్లాడారు. ఇక్కడ అందుతున్న వసతులు, సదుపాయాలపై ఆరా తీ శారు. అలాగే బోధనా పద్ధతులు, ఉపయోగిస్తున్న పరికరాలు, సిలబస్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఇన్‌స్పెక్టర్ అమరనాథరెడ్డి ఉన్నారు.
ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వర ఆలయంలో హుండీల ద్వారా రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. దేవస్థానం ఈఓ బాపిరెడ్డి, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. 19 రోజుల వ్యవధిలో రూ.1.31 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే భక్తులు 25.300 గ్రాముల బంగారం, 352.17 కిలోల వెండి కానుకలుగా సమర్పించారన్నారు. విదేశీ కరెన్సీ అమెరికా 31 డాలర్లు, మలేషియా 13, సింగపూర్ 3, యూఏఈ 2, దిర్హమ్‌లు. ఇంగ్లాండ్ 2, కెనడా 2 డాలర్లు వచ్చినట్లు తెలిపారు.


