కూటమిలో కులచిచ్చు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమిలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరింది. టీడీపీ, జనసేనలో ఒకే సామాజిక వర్గం వారికే గుర్తింపు, పదవులు ఇస్తున్నారని, మి గిలిన బడుగు, బలహీన వర్గ నేతలను కరివేపాకులా వాడుకుంటున్నారంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వా రు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో రెడ్డి సామాజిక వర్గం నేతలంటేనే చాలా చులకనగా చూస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ సామాజిక వర్గం నేతలు ముఖ్యులు.. అదే సామాజిక వర్గంలోని వారికి పదవులు రాకుండా.. అడ్డుకుంటు న్నారంటూ మండిపడుతున్నారు. ఆ రెండు పార్టీల్లో తాము తప్ప మరొకరు ఎదగడానికి వీల్లేకుండా కుట్ర లు చేస్తున్నారని ఆ పార్టీ అధిష్టానానికి లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు తాజా పరిణామాలే నిదర్శనం. టీడీపీ అధిష్టానం తిరుపతి, చి త్తూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించిన వి షయం తెలిసిందే. ఈ పదవులు కట్టబెట్టడంలోనూ కొంత మంది ప్రమేయంతో అధినాయకులు తమకు ఇవ్వకుండా..తమ సామాజిక వర్గం నేతలే అడ్డుకున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు కమ్మసామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సీఆర్ రా జన్ బీసీ కావడంతో అతన్ని కొనసాగించలేదని విశ్వసనీయ సమాచారం. పార్టీలో ఎంతటి వారినైనా సీ ఆర్ రాజన్ గట్టిగా మాట్లాడడం, ప్రశ్నించడం వంటి చేస్తున్నారనే కారణంతోనే అతన్ని కొనసాగించలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అ ుుతే సీఆర్ రాజన్‌ని తొలగించి వేరొకరికి ఇస్తే ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, షణ్ముగరెడ్డి అయితే నోరెత్తడనే ఉద్దేశంతోనే అతనికి అధ్యక్ష పదవిని ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ రాజు కుటుంబానికి మొండిచేయి
ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన సమయంలో తిరు పతి నుంచి జెండా పట్టిన నాయకుడిగా ఎన్టీఆర్ రాజుకు పేరుంది. నాటి నుంచి నేటి వరకు నందమూరి, నారావారి కుటుంబాన్నే నమ్ముకుని టీడీపీ జెండా మోస్తూనే ఉన్నారు. ఈసారైనా ఆ కుటుంబంలోని శ్రీధర్‌వర్మకు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని ఆశించారు. అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని టీడీపీలోని బలమైన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
జనసేనలో మాకు స్థానం లేదా?
జనసేనలో పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా తమకు గుర్తింపు ఇవ్వకుండా.. పదవులకు దూరంగా ఉంచుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో ఒకే సామాజిక వర్గం వారు మాత్రమే పెత్తనం చెలాయించాలని, వేరొకరు పార్టీలో కీలకంగా మారడానికి వీల్లేకుండా పథకం ప్రకారం దూరం పెడుతున్నారనే ప్రచా రం జరుగుతోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఎంఆర్‌పల్లి పరిధిలో ఓ నాయకుడి నివాసంలో జరిగిన పుట్టిన రోజు విందు వేడుకల్లో జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జనసేనలో తమకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి) పదవులు లేవు, గుర్తింపు లేకుండా చేస్తున్నారని మండిపడినట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. జనసేనలో ప్రధాన సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గం నేతల మధ్య రచ్చ జరగడంతో ఇద్దరు నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పి పంపివేసినట్లు చెప్పారు. టీడీపీ, జనసేనలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరడంతో కొందరు ఈ సమాచారాన్ని అమరావతికి చేరివేసినట్లు బోగట్టా.


