పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
బంగారుపాళెం: పది పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. మంగళవారం బంగారుపాళెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులకు దిశానిర్ధేశం చేశారు. పదో తరగతి విద్యార్థులు సోషయల్ మీడియా, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. పాఠశాల ఆవరణలోని వంటగది, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయల గురించి హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై 10వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికపై చర్చించారు. భోదనాంశాలపై ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. ఎంఈఓలు నాగేశ్వర్‌రావు, రమేష్‌బాబు పాల్గొన్నారు.
అప్పలాయగుంటలో
పీవీ సింధు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామిని మంగళవారం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారి వేణుగోపాల్ దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రోగులకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : రోగులకు నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యమని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీఎంసీ చిత్తూరు క్యాంపస్‌తో పీపీపీ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. సీఎంసీ చిత్తూరు క్యాంపస్ నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిల్లా కేంద్రంలోని మిట్టూరు ప్రభుత్వ పాత ప్రసూతి ఆసుపత్రిలో సీఎంసీ వైద్యులను నియమించి వైద్య చికిత్సలు అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మొబైల్ మెడికల్ యూనిట్లతో వైద్యసేవలందించనున్నట్లు తెలిపారు. సీఎంసీ డైరెక్టర్ డా.విక్రమ్ మ్యాథ్యూస్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వైద్యసేవలందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం పీపీపీ విధానంలో ఒప్పందపత్రాలను మార్చుకున్నారు. డీఎంహెచ్‌ఓ డా.సుధారాణి, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్, చిత్తూరు సీఎంసీ క్యాంపస్ అసోసియేట్ డైరెక్టర్ డా.ఉదయ్‌జకారియా పాల్గొన్నారు.
సోలార్ ఈ–సైకిల్
పుత్తూరు పట్టణ పరిధిలోని రాచపాళెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెంకటేష్ సోలార్ ఈ–సైకిల్‌ను రూపొందించాడు. కష్టపడే స్వభావం, సృజనాత్మక ఆలోచనలతోనే ఇలాంటివి సాధ్యమని పలువురు అభినందనలు తెలిపారు. వెంకటేష్ మరెన్నో విజయాలు సాధించాలని హెచ్‌ఎం మంగపతి ఆకాంక్షించారు. – పుత్తూరు
పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి


