‘సూపర్’ మోసం బాబూ!
పులిచెర్ల (కల్లూరు): సూపర్–6 పేరుతో చంద్రబాబు ప్రజలను వంచించడం బాధాకరమని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాపోయారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సూపర్–6 పేరుతో పలు పథకాలను ప్రవేశపెట్టి తీరా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గిట్టు బాటు ధరలు లేక రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఎన్నికల తర్వాత మండలంలో పెద్దిడ్డి తొలిసారిగా పర్యటించడంతో కార్యకర్తలో జోష్ తెచ్చింది.


