అధికారంలోకి రాగానే పెట్రో ధరలు తగ్గిస్తామన్న పెద్ద బాబు
పలమనేరు: ‘పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో పెట్రో ల్, డీజిల్ ధరలు తక్కువ. ఇక్కడ జగన్‌మోహన్‌రెడ్డి పెట్రోల్ ధర లు పెంచేశారు. సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ హామీలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంకుల వద్దకెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ హంగా మా సృష్టించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోయారు. పె ట్రోల్, డీజిల్ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. దీనికారణంగా జిల్లా లో రోజుకు వాహనదారుల పై రూ.5.4 కోట్లకుపైనే అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.167.4కోట్లు, ఏడాదికి రూ.2,008.8 కోట్లుదా కా ప్రజలు అదనంగా చెల్లించా ల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.4,017.6 కోట్లు దాకా ప్రజలపై భారం పడింది. పెట్రో ధర తగ్గిస్తామని బాబు కర్రుకాల్చి వాత పెట్టారని పలువురు వాపోతున్నారు.
ఆంధ్రలో వెలవెల..కర్ణాటకలో కళకళ
చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి ఆనుకొని గండ్రాజుపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. మండల కేంద్రమైన వీకోట టౌన్‌కు ఆనుకొనే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కొనసాగుతోంది. అలాగే తిరుపతి జిల్లాలో ఇటు నగరి, పిచ్చాటూరు, సత్యవేడు నుంచి తమిళనాడు సరిహద్దు వెళ్తుంది. అటు నాయుడుపేట నుంచి తమినాడు బోర్డర్ ఉంది. ఆయా సరిహద్దుల్లోని ఆంధ్ర పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. అదే కర్ణాటక, తమినాడు పెట్రోల్ బంకులు కళకళలాడుతున్నాయి. కారణం.. ధరల్లో వ్యత్యాసాలు ఉండడమే. ఒక్క పలమనేరు నియోజకవర్గంలోనే దాదాపు 20 పెట్రోల్ బంకుల దాకా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అధికారంలోకి రాగానే పెట్రో ధరలు తగ్గిస్తామన్న పెద్ద బాబు


