రేసు కుక్కల దాడి
గుడిపాల : రేసు కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందింది. గుడిపాల మండలం వెప్పాలమానుచేను గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి తమ వ్యవసాయ పొలాల వద్ద దూడను కట్టి ఉంచాడు. ఆ పొలాలకు ఆనుకునే అటవీ ప్రాంతం ఉంది. మంగళవారం రాత్రి రేసు కుక్కలు వచ్చి దూడపై దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు చిరుతపులి దాడి చేసిందని భయాందోళన చెందారు. అటవీశాఖ పారెస్ట్ బీట్ ఆఫీసర్ కుసుమకుమారి సంఘటనా స్ధలాన్ని పరిశీలించి చిరుతపులి దాడి చేయలేదని చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవి రేసుకుక్కలు దాడిచేసినట్లు నిర్ధారించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ సాయిసుధ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి దూడకు పంచనామా చేశారు. రాత్రి వేళల్లో అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద పాడి పశువులను ఉంచొద్దని గ్రామస్తులకు సూచించారు.


