వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

Jan 3 2026 7:20 AM | Updated on Jan 3 2026 7:20 AM

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

సోమల(పుంగనూరు) : సోమల మండల కేంద్రంలో నివాసం ఉన్న చెన్నరాయుడు భార్య రెడ్డెమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాకెళ్లిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు రెడ్డెమ్మ సాయిబాబా గుడి ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్‌పై వచ్చి మెడలోని బంగారు గొలుసు లాకెళ్లారు. ఈ సంఘటనతో బాధితురాలు కేకలు వేయడంతో దొంగలు ఇద్దరు డిగ్రీ కళాశాల వైపు వెళ్లినట్లు గమనించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 గ్రాముల బరువు గల బంగారు గొలుసు విలువ సుమారు రూ.3 లక్షలు అని బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు సోమల పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు.

12న వాలీబాల్‌ పోటీలు

చిత్తూరు కలెక్టరేట్‌ : స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈనెల 12న జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు మైభారత్‌ జిల్లా యువజన అధికారి ప్రదీప్‌ తెలిపారు. ఆరోజు స్థానిక మెసానికల్‌ గ్రౌండ్స్‌ నందు పోటీలు ఉంటాయన్నారు. యువజన, మహిళలు, స్వచ్ఛంద సంస్థలకు కిట్లను ఇవ్వనున్నామన్నారు. ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గంగమ్మకు రాహుకాల పూజలు

చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. రాహుకాల సమయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు , అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, రంగు రంగు పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

సారా స్వాధీనం

రొంపిచెర్ల : అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మధుసూధన్‌ తెలిపారు. శుక్రవారం మోటుమల్లెల గ్రామ పంచాయతీ ఆదినవారిపలె బస్టాప్‌ వద్ద యువకుడు సంచిలో క్యాన్‌ పెట్టుకుని ఉండగా అనుమానం వచ్చి తనిఖీ చేయగా సారాగా తేలిందన్నారు. రూ. 1500 విలువ చేసే సారాను స్వాధీనం చేసుకుని నిందితుడు సోమశేఖర్‌ (33)ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పీలేరు కో ర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మండలంలో ఎక్కడైన సారా తయారు చేసిన ,విక్రయించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లును రహస్యంగా ఉంచుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement