పరిశ్రమల స్థాపనకు పారదర్శకంగా అనుమతులు
చిత్తూరు కలెక్టరేట్ : పరిశ్రమల స్థాపన నిమిత్తం పారిశ్రామికవేత్తలకు అనుమతులను పారదర్శకంగా మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమా ర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఈజీపీ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని, ప్రతి మండలానికి ఐదు యూనిట్ల లక్ష్యాన్ని డీఆర్డీఏకు కేటాయించాలన్నారు. భాగస్వామ్య ఒప్పంద యూనిట్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించి లైసెన్సులు మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల క్లస్టర్లను సందర్శించి విద్యుత్ సేవల అంతరాయంపై పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. ఇండస్ట్రీయల్ ఏరియా ఎస్టేట్ లోకల్ అథారిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవా లని పేర్కొన్నారు. డీఐసీ జీఎం సూరిబాబు, ఏపీఐఐసీ జెడ్‌ఎం సుబ్బారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
తొట్టంబేడు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన తొట్టంబేడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రాయచోటికి చెందిన చందు(21) శుక్రవారం తొట్టంబేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చందు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపు తప్పి విద్యార్థి మృతి
తవణంపల్లె : అరగొండ– చిత్తూరు ప్రధాన రహదారిలో వినాయక స్కూల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొనడంతో బీటెక్ చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడని తవణంపల్లె ఎస్‌ఐ డాక్టర్ నాయక్ తెలిపారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా.. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం యల్లవపాల్లెకు చెందిన వంకరాజు సుధాకర్ కుమారుడు వంకరాజు సురేష్‌కుమార్(21) చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో సురేష్‌కుమార్ ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పరిశ్రమల స్థాపనకు పారదర్శకంగా అనుమతులు
పరిశ్రమల స్థాపనకు పారదర్శకంగా అనుమతులు


