రాతపై పట్టు.. మార్కులు రాబట్టు
కార్వేటినగరం : పరీక్ష రాసే విద్యార్థుల చేతి రాత బాగుంటే మూల్యాంకనం చేసే వారికి సులువుగా అర్థమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతి రాత బాగా లేకపోతే మూల్యాంకనం చేసే వారికి సమాధానం అర్థం కాకుంటే ఒక మార్కు లేదా అర మార్కు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మార్కులపై ప్రభావం చూపి ర్యాంకు తగ్గే అవకాశం లేకపోలేదు. విద్యార్థులు చేతి రాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పరీక్షలకు రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు ప్రతి రోజూ అర గంట చేతిరాతపై సాధన చేయాలని. నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో చేతి రాత ఎలా ఉండాలో నిపుణుల మాటల్లోనే...
● విద్యార్థుల ఆన్సర్ షీట్ (బుక్‌లెట్)లో సమాధానాలను స్పష్టంగా రాయాలి.
● నాలుగు వైపులా మార్జిన్లు (బార్డర్లు) చేసుకుంటే అందంగా ఉంటుంది.
● బుక్ లెట్ ఎడమవైపు రెండున్నర సెంటీమీటరు, కుడివైపు, పైనా, కింద, ఒకటిన్నర సెంటీ మీటరు బార్డర్ వేసుకోవాలి.
● ఒకలైన్ , మరో లైనుకు ఒకటిన్నర సెంటీ మీటరు గ్యాప్ ఇవ్వాలి.
● పదానికి, పదానికి అర సెంటీ మీటరు స్పేస్ ఇవ్వాలి.
● బుక్‌లెట్‌లో వాక్యాలు పైకి కిందకు లేకుండా వరుస క్రమంలో ఉండాలి.
● బొటన వేలు, మూడవ వేలికి చూపుడు వేలు సహాయంతో పెన్నును చక్కగా పట్టుకోవాలి, ఇలా చేయడం వల్ల రాసే సమయంలో స్పీడుగా రాయవచ్చు.
● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాత పై కూడా పడుతుంది.
● మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది. సమాధాన పత్రంలో అక్షరాలు బాగుంటే ప్రతి సెబ్జెక్టులో కనీసం నాలుగు నుంచి ఐదు మార్కులు పెరిగే అవకాశం ఉంది.
● అక్షరాలు బాగా లేకపోతే చాలా మార్కులు కోల్పోవాల్సి వస్తుంది.
సాధనతో సాధ్యం
చక్కటి చేతిరాత సాధనతోనే సాధ్యం అవుతుంది. పరీక్షలకు ఇంకా సమ యం ఉన్నందున విద్యార్థులు అక్షరాలను గుండ్రంగా రాసేందుకు సమ యం కేటాయించి సాధన చేయాలి. చాలా మంది తొలి ప్రశ్నకు గుండ్రటి అక్షరాలతో సమాధానం రాస్తారు. ఆ తరువాత సమయం అయిపోతుందనే ఆందోళనతో వేగంగా రాయడం ప్రారంభిస్తారు. గుండ్రటి అక్షరాలు కుదరవు. ఈ ప్రభావం మా ర్కులపై పడుతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానా లు గుండ్రంగా రాయాలంటే సాధన తప్పనిసరి.
– జగదీశన్, చేతిరాత నిపుణుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కార్వేటినగరం
రాతపై పట్టు.. మార్కులు రాబట్టు


